ఇంధన నిల్వలున్నాయి, కానీ.. : పెట్రోలియం మంత్రి కీలక సంకేతాలు | Minister Hardeep Puri Signal Fuel Price Hike Not Saying Prices Will Not Go Up | Sakshi
Sakshi News home page

ఇంధన నిల్వలున్నాయి, కానీ.. : పెట్రోలియం మంత్రి కీలక సంకేతాలు

May 12 2026 3:47 PM | Updated on May 12 2026 4:00 PM

Minister Hardeep Puri Signal Fuel Price Hike Not Saying Prices Will Not Go Up

కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇంధన కొరత లేదంటూనే పెంపు సంకేతాలిచ్చారు. మే 12ననిర్వహించిన 'CII వార్షిక బిజినెస్ సమ్మిట్-2026'లో దేశంలోని ఇంధన నిల్వలు, ధరల పెరుగుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇంధన కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. అయితేనాలుగేళ్లుగా  ఇంధన పెంచలేదు, ధరలు పెరగబోవని చెప్పడం లేదంటూ మెలిక పెట్టడం చర్చకు దారి తీసింది.

అయిదు రాష్ట్రాల  ఎన్నికల తరువాత  వంట గ్యాస్‌, పెట్రోవాత తప్పదనే వివిధ అంచాలన మధ్య దేశంలో ఎక్కడా ఇంధన కొరత లేదని స్పష్టం చేస్తూ, ప్రభుత్వం LPG ఉత్పత్తిని గతంలో ఉన్న సుమారు 35,000 టన్నుల నుండి 54,000 టన్నులకు పెంచిందని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. పెరిగే అవకాశం  లేకపోలేదంటూ సంకేతాలు ఇచ్చారు. మరోవైపు ఇటీవలే ముగిసిన రాష్ట్ర ఎన్నికల కారణంగా ప్రభుత్వం ధరల సవరణను వాయిదా వేసిందన్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు.

నాలుగేళ్లుగా పెంచలేదు
పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు ,ప్రపంచ మార్కెట్ అస్థిరత ఉన్నప్పటికీ, గత నాలుగేళ్లుగా రిటైల్ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయని మంత్రి స్పష్టంగా పేర్కొన్నారు. ప్రపంచంలో అలా చేయని ఏకైక దేశం మనదే అని  కూడా ప్రకటించారు. ధరలు 50 నుండి 60 శాతం వరకు పెరిగిన అనేక దేశాల మాదిరిగా కాకుండా, భారతదేశం పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు.  అయినా  పెరగవని తాను చెప్పడంలేదంటూ బాంబు పేల్చారు. దీనికి తోడు ఇటీవల ప్రధాని మోదీ డీజిల్‌, పెట్రోల్‌ వాడకాన్ని తగ్గించుకోవాలని, పొదుపుగా వాడాలని సూచించడం  ప్రమాద హెచ్చరికగా అందరూ భావిస్తున్నారు.

రాష్ట్ర ఎన్నికల కారణంగానే ధరల పెంపును వాయిదా వేస్తున్నారనే వాదనను ఆయన తోసిపుచ్చారు. ధరల నిర్ణయానికి, ఎన్నికలకు సంబంధం లేదని స్పష్టం చేశారు.మన దగ్గర 60 రోజులకు సరిపడా ముడి చమురు, 60 రోజులకు సరిపడా LNG, 45 రోజులకు సరిపడా LPG నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందనే సంకేతాలిచ్చారు. ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) రోజుకు రూ. 1,000 కోట్ల నష్టాన్ని చవిచూస్తున్నాయని, వినియోగదారులపై భారం పడకుండా ఉండటానికి కంపెనీలు ఈ నష్టాన్ని భరిస్తున్నాయని తెలిపారు. గతేడాది ఆర్జించిన లాభాలన్నీ ప్రస్తుత పరిస్థితుల వల్ల తుడిచిపెట్టుకుపోతున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా?

సముద్ర మంథన్ స్కీమ్ ద్వారా దేశీయంగా చమురు ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని  మంత్రి వెల్లడించారు. చమురు అన్వేషణ మరియు ఉత్పత్తి కోసం నిధుల కేటాయింపుపై ఆర్థిక శాఖతో చర్చలు తుది దశలో ఉన్నాయన్నారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 90 రోజులకు సరిపడా నిల్వలను కలిగి ఉండాలని, ఆ దిశగా అదనపు స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంచుతున్నామని ఆయన చెప్పారు. 

ఇదీ చదవండి : అంబానీ చిన్నకోడలు, వెనిస్‌ బినాలే లుక్‌,స్పెషల్‌ ఏంటంటే?

కాగా అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మూడో నెలకు చేరుకుంది. శాంతి ప్రయత్నాల్లో భాగంగా ఇరాన్ ఇచ్చిన ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 10న తిరస్కరించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై పడనుందనే ఆందోళన నెలకొంది. 

ఇదీ చదవండి: ‘ప్రధాని విమానాన్ని అమ్మేయండి’

Advertisement
 
Advertisement
Advertisement