వెనిస్ బినాలే (Venice Biennale) ప్రారంభోత్సవ వేడుకల్లో అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ స్టైలిష్ లుక్ విశేష ఆకర్షణగా నిలిస్తోంది. ఆడ్రీ హెప్బర్న్ - జాక్వెలిన్ కెన్నెడీల శైలిని అనుకరిస్తూ, గివెన్చీ రూపొందించిన టాగో చీర గౌనులో మెరిసారు రాధికా మర్చంట్
వెనిస్ బినాలే ప్రారంభోత్సవ గాలాలో రిలయన్స్ అధినేత అంబానీ కోడలు, రిలయన్స్ వారసుడు వ్యాపారవేత్త అనంత్ అంబానీ భార్య రాధికా మర్చంట్ పాత-హాలీవుడ్ గ్లామర్ మేళవింపుతో ప్రత్యేకమైన గివెన్చీ కౌచర్ దుస్తుల్లో స్పెషల్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఒపెరా గ్లోవ్స్, వజ్రాలు, సున్నితమైన రెట్రో బ్యూటీ స్టైలింగ్‌తో కూడిన ఈ లేత నీలి రంగు దుస్తులు, ఐకానిక్ ఆడ్రీ హెప్బర్న్ సిల్హౌట్‌లను గుర్తుచేస్తూ, అతిపెద్ద ఫ్యాషన్ హైలైట్‌లలో ఒకటిగా నిలిచాయి.

stify"> ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్‌ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను
రాధికా మర్చంట్ 'ఆడ్రీ హెప్బర్న్' ఇన్‌స్పైర్డ్ లుక్
ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ గివెంచి (Givenchy) రూపొందించిన ప్రత్యేకమైన గౌన్‌లో ఆమె మెరిశారు. ఇది పౌడర్ బ్లూ (Powder blue) రంగులో భారతీయ చీర కట్టును (Saree drape) పోలి ఉండేలా ఆధునిక హొయలతో రూపొందించారు. ఒకప్పుడు దిగ్గజ ఫ్యాషన్ డిజైనర్ హ్యూబర్ట్ డి గివెన్చీ, లెజెండరీ నటి ఆడ్రీ హెప్బర్న్ కోసం రూపొందించిన ఐకానిక్ చీర తరహా గౌన్ల నుండి స్పూర్తితో దీన్ని డిజైన్ చేశారు. ఈ గౌన్‌కు మ్యాచింగ్‌గా 'ఒపెరా గ్లోవ్స్' ధరించారు. ఇది పాతకాలపు హాలీవుడ్ గ్లామర్‌ను గుర్తుకు తెచ్చింది. ఇక ఆభరణాల విషయానికి వస్తే డైమండ్ రింగ్, మెరిసే ఆర్మ్ యాక్సెసరీతో తన లుక్‌ను మరింత రిచ్‌గా మార్చుకున్నారు.
ఇదీ చదవండి: బిగ్ బాస్ మనీషా రాణి డ్రీమ్ హౌస్ : ధర తెలిస్తే ఫిదానే
మేకప్ , హెయిర్ స్టైల్
వింగ్డ్ ఐలైనర్, గ్లోసీ న్యూడ్ లిప్స్,సున్నితమైన గ్లోయింగ్ స్కిన్‌తో 'సాఫ్ట్ గ్లామ్' మేకప్‌ను ఎంచుకున్నారు. రెట్రో స్టైల్‌లో ఉండే సాఫ్ట్ వేవ్స్ (Polished waves) ఆమె వింటేజ్ మూడ్‌కు సంపూర్ణంగా సరిపోయింది. పారిసియన్ ఎలిగెన్స్ మరియు భారతీయ సంప్రదాయ కట్టు కలబోతగా ఉన్న ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాతకాలపు హాలీవుడ్ స్టైల్‌ను ఆధునిక పద్ధతిలో ప్రదర్శించి రాధికా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
ఇదీ చదవండి: రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా?


