ఇంటి అద్దె రూ.56 వేలు.. ఖర్చు రూ.1.3 లక్షలు | Bengaluru Couple’s Viral Video On Sky-High Living Costs Sparks Debate Online, Watch Video Inside | Sakshi
Sakshi News home page

ఇంటి అద్దె రూ.56 వేలు.. ఖర్చు రూ.1.3 లక్షలు

May 12 2026 9:20 AM | Updated on May 12 2026 9:42 AM

Bengaluru couple spending Rs 1.3 lakh a month

బనశంకరి: బెంగళూరు జీవన వ్యయం పెరిగింది. ఇక్కడ ఇంటి అద్దె, ఖర్చులు ఆకాశానికి అంటుతున్నాయి. ప్రతి నెలా ఇంటి అద్దె రూ.56 వేలు, రూ.1.3 లక్షలకు పైగా ఇతర ఖర్చులకు వ్యయం చేయాల్సి వస్తోందని ఇన్‌స్ట్రాగాంలో దంపతులు తమగోడు వెల్లబోసుకున్న వీడియో వైరల్‌గా మారింది. 

దంపతులు ఇద్దరికి మంచి ఉద్యోగం ఉంది. కానీ నెలవారీ ఖర్చులు గురించి ఆందోళన వ్యక్తం చేశారు. విలాసవంతంగా జీవించడం సాధ్యం కాదని.. సాధారణ ఖర్చులు బెంగళూరులో భారీగా పెరిగాయని చెబుతున్నారు. నిత్యావసరాలు, ఇంటి సామాగ్రి, ఇంటర్నెట్, విద్యుత్, షాపింగ్, బయట ఆహారం తినడం, ప్రయాణం, ఆన్‌లైన్‌ చందాలతో పాటు ఖర్చు ఇంకా పెరిగిందన్నారు. 

కంపెనీ పని ఒత్తిడితో ఇంట్లో పని మనుషులను పెట్టుకుంటే ఈ ఖర్చులన్నీ కలిపి నెలకు రూ.1.3 లక్షలు అవుతున్నాయని తెలిపారు. బెంగళూరులో కొన్ని ప్రాంతాల్లో ఇంటి అద్దెలు అధికంగా ఉండగా.. కొన్ని చోట్ల పరిమితంగా ఉన్నాయి. అయితే ఇటీవల సంవత్సరాల్లో బెంగళూరులో జీవించడం కష్టంగా ఉందని నెటిజన్‌ ఒకరు కామెంట్‌ పెట్టారు.   

 

Advertisement
 
Advertisement
Advertisement