అవార్డుల వేడుకలో హాట్‌టాపిక్‌గా టీవీ స్టార్‌ 'బ్రెడ్‌ డ్రెస్‌'..! | TV stars unusual dress made from 500 loaves of bread at African awards | Sakshi
Sakshi News home page

అవార్డుల వేడుకలో హాట్‌టాపిక్‌గా టీవీ స్టార్‌ 'బ్రెడ్‌ డ్రెస్‌'..!

May 12 2026 4:21 PM | Updated on May 12 2026 5:10 PM

TV stars unusual dress made from 500 loaves of bread at African awards

"వెర్రి వేయి రకాలు - పిచ్చి పలు రకాలు" అంటే ఇదేనేమో అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తే. క్రియేటివిటీ ఉండోచ్చు మరి అధ్వాన్నమైన సృజనాత్మకతను తట్టుకోవడం చాలా కష్టం. ఇక్కడో ఓ టీవీ స్టార్‌ క్రియేటివిటీ కూడా అలానే ఉంది. వెరైటిగా కనపడాలని అనుకుందో లేక కొత్తగా ఆలోచించాలనుకుందో గానీ ఆమె ధరించిన డ్రెస్‌ మాత్రం ఒక్కసారిగా అందరికీ ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకునేలా చేసింది. 

అసలే పశ్చిమాసియా యుద్ధం కారణంగా పెట్రోలు సంక్షోభం, తోపాటు తర్వలో ఆహార సంక్షోభం వంటివి వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో ఆ స్టార్‌ డ్రెస్‌ అందరికి కోపం తెప్పించడమే కాదు..ఏమనుకుంటున్నావ్‌ అంటూ తింట్ల దండకం అందుకున్నారు. 

ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..ఆఫ్రికా మ్యాజిక్ వ్యూయర్స్ ఛాయిస్ అవార్డ్స్ (AMVCA) వేడుకలో, రియాలిటీ టీవీ స్టార్ క్వీన్ మెర్సీ అటాంగ్ సుమారు 500 బ్రెడ్‌లతో తయారు చేసిన గౌనులో దర్శనమిచ్చింది. ఆమె రెడ్‌కార్పెట్‌ పైకి రావడంతో ఒక్కసారిగా నెట్టింట హాట్‌టాపిక్‌గా మారి తీవ్ర చర్చనీయాంశమైంది. 

ఆ దుస్తులను డిజైన్‌ చేసింది టియానాస్ ఎంపైర్‌కు చెందిన డిజైనర్‌ టోయిన్ లవానీ.  ఆ టీవీ స్టార్‌ అటాంగ్ బేకరీ వ్యాపారాన్ని ప్రమోట్‌ చేసే నిమిత్తం వాళ్లు ఇలా రూపొందించారట. అంతేగాదు సదరు టీవీ స్టార్‌ అటాంగ్‌ సైతం తన వ్యాపారాన్ని ప్రమోట్‌ చేసుకునేందుకు ఇంతకన్న మంచి ప్రదేశం ఏముంటుంది అని ప్రశ్నించడం శేషం. 

బ్రెడ్‌ డ్రెస్‌పై వెల్లువెత్తిన వ్యతిరేకత..
ఆ లుక్‌ సృజనాత్మకతకు నిదర్శనంగా ఉన్నా..సోషల్‌ మీడియాలో మాత్రం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆహారాన్ని ఫ్యాషన్‌గా ఉపయోగిస్తారా..?, కనీసం నైతికత కూడా లేదా? అంటూ నిలదీస్తున్నారు నెటిజన్లు. అంతేగాదు ఇది చాలా అసభ్యకరం, అసలు ఆ దుస్తులు రూపొందించిన డిజైనర్లు నిజంగా ఫ్యాషన్‌ డిజైనర్లేనా? అని తిట్టిపోస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: Tara Sutaria: బ్లేజర్‌ జస్ట్‌ రూ. 65 వేలు..కానీ హ్యాండ్‌ బ్యాగ్‌ మాత్రం అన్ని లక్షలా..!)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement