breaking news
Yadadri
-
భువనగిరి మున్సిపల్ డీఈగా సాయిలక్ష్మి
భువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపాలిటీ డిప్యూ టీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ (డీఈ)గా సాయిలక్ష్మి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కోదాడ మున్సి పల్ కార్యాలయంలో డీఈ గా పనిచేస్తున్న ఆమెను పబ్లిక్ హెల్త్ ఇంజినీర్ ఇన్ చీఫ్ డిప్యుటేషనన్పై ఇక్కడికి బదిలీ చేశారు. ఇప్పటివరకు ఇక్కడ డీఈగా పనిచేసిన కొండలరావు సాధారణ బదిలీల్లో భాగంగా వికారాబాద్ మున్సిపాలిటీకి వెళ్లారు. అవగాహనతో హెపటైటిస్ వ్యాధి నివారణభువనగిరి : అవగాహన కలిగి ఉండడం ద్వారా హెపటైటిస్ వ్యాధిని నివారించవచ్చని డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ అన్నారు. మంగళవారం భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హెపటైటిస్ వ్యాధి నిర్ధారణ, చికిత్స, మందులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం నర్సింగ్ అధికారులకు హెపటైటిస్ టీకాలను అందజేశారు. అంతకుముందు 100 మందికి హెపటైటిస్ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణ, ఆర్ఎంఓ చక్రధర్, రాజేందర్, విజయ్‌పటేల్, మధురిమ, ఉదయశ్రీ, రామకృష్ణ, వీణ, నర్సింగ్ కళాశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. భువనగిరిలో 42.8 మి.మీ వర్షం భువనగిరిటౌన్ : జిల్లా వ్యాప్తంగా మంగళవారం పలు మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలో అత్యధికంగా భువనగిరి మండలం హన్మాపూర్‌లో 42.8 మిల్లీమీటర్లు, భువనగిరి కలెక్టరేట్ వద్ద 40.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో..) భువనగిరి మండలంలో హన్మాపూర్ 42.8, కలెక్టరేట్ 40.0, మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. బొమ్మలరామారం 25.5, ఆత్మకూర్ (ఎం) 24.0, బీబీనగర్ మండలంలో 18.3, నారాయణపూర్ 15.5 మిల్లీమీటర్లు కురిసింది. మోటకొండూరు 14.8, మోత్కూర్ 13.3, గుండాల మండలంలో 8.8 మిల్లీమీటర్లు, భూదాన్ పోచంపల్లి 8.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఆలేరు మండలంలో 6.8, చౌటుప్పల్ 5.8, తుర్కపల్లి 5.3 మిల్లీమీటర్లు, యాదగిరిగుట్టలో 5.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వలిగొండ 3.5, రాజాపేట 3.3, రామన్నపేట మండలంలో 2.5, అడ్డగూడూర్ మండలంలో 1.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యబొమ్మలరామారం : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని డీఈఓ భిక్షపతి అన్నారు. బొమ్మలరామారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల రీడింగ్ స్కిల్స్‌ను పరిశీలించారు. గణితం, తెలుగు సబెక్ట్‌ల్లో పలువురు విద్యార్థులను ప్రశ్నలు అడిగారు. కార్యక్రమంలో ఎంఈఓ రోజారాణి, ఉపాధ్యాయులు పద్మ, నవనీత తదితరులు పాల్గొన్నారు. -
లీగల్ సెల్ మాడ్యూల్ సిద్ధం
● కోర్టు కేసు హియరింగ్ తేదీలు, కౌంటర్ దాఖలు చేయాల్సిన సమయం వంటి కీలక వివరాలు ఈ సాఫ్ట్వేర్ ద్వారా సంబంధిత అధికారులకు నేరుగా అలర్ట్ రూపంలో వెళ్తాయి. ● కేసుల ప్రస్తుత స్థితిగతులు ఏమిటనేది జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులందరికీ ఆన్లైన్లో ఎప్పటికప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి. దీని ఆధారంగా తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సాక్షి, యాదాద్రి : ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కోర్టు కేసుల పరిష్కారంలో జాప్యానికి చెక్ పెట్టేందుకు యాదాద్రి జిల్లా యంత్రాంగం అత్యాధునిక సాంకేతికతకు శ్రీకారం చుట్టింది. పోలీస్ శాఖ మినహా జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పెండింగ్ కోర్టు కేసులను మరింత వేగంగా, పారదర్శకంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ‘లీగల్ సెల్ మాడ్యూల్’ సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం వివిధ శాఖల పరిధిలో సుమారు 1,200కి పైగా కేసులు పెండింగ్‌లో ఉండగా.. వీటికి సంబంధించిన డేటా అప్లోడ్ ప్రక్రియ జిల్లా కలెక్టరేట్లో జోరుగా సాగుతోంది. ఒకే వేదికపైకి అన్ని శాఖల కేసులు కలెక్టర్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీలతో సహా అన్ని ప్రభుత్వ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు, రిట్ పిటిషన్లు, కంటెంప్ట్ వంటి పలు రకాల కేసుల వివరాలను ఈ నూతన సాఫ్ట్వేర్ ద్వారా ఒకే వేదికపైకి తీసుకువస్తున్నారు. ఆధునిక సాంకేతికతే ధ్యేయం లీగల్ సెల్ మాడ్యూల్ అభివృద్ధి కోసం జిల్లా యంత్రాంగం టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, ఓ ప్రైవేట్ సంస్థకు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే జిల్లాలో ఈ–ఫైలింగ్ విధానం విజయవంతంగా అమలవుతుండగా, త్వరలోనే ఉద్యోగులందరికీ ఫేస్ రికగ్నేషన్ హాజరు విధానం కూడా అందుబాటులోకి రానుంది. ఈ ఆధునిక సాంకేతికతతో పాలనలో మరింత పారదర్శకతను సాధించి, ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు యంత్రాంగం ముందడుగు వేస్తోంది. త్వరలోనే ఈ లీగల్ సెల్ మాడ్యూల్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని జిల్లా అధికారులు వెల్లడించారు.ఫ జిల్లాలో సుమారు 1200 ప్రభుత్వ శాఖల కేసులు ఫ కలెక్టరేట్లో కొనసాగుతున్న డాటా అప్లోడ్ ప్రక్రియ ఫ నూతన సాఫ్ట్‌వేర్‌తో అన్ని కేసులు పరిశీలించే అవకాశం ఫ కౌంటర్ దాఖలు సమయంలో అధికారులకు మెసేజ్ అలర్ట్ -
ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి
ఆలేరు రూరల్ : ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావు అన్నారు. మంగళవారం ఆలేరు ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను సంరక్షించుకోవాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి పొలంలోనూ పంట కుంట నిర్మించుకోవాలన్నారు. గ్రామాల్లో బోర్వెల్ రీచార్జ్ పిట్స్, కమ్యూనిటీ సోక్ పిట్స్ నిర్మించుకోవాలని సర్పంచ్‌లను కోరారు. ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున, రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో క్లస్టర్ స్పెషల్ ఆఫీసర్, డీపీఓ శ్రీనివాస్‌రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ వెంకటరమణారెడ్డి, సర్పంచ్‌లు జూకంటి అనిల్, పరిదె మమత సంతోష్, మొగులుగాని నర్సయ్య, బోరిలాల్, పసుల సతీష్‌రెడ్డి, వడ్ల శోభన్‌బాబు, కంతి మధు, కుమారస్వామి, ఎసీరెడ్డి మంజూలమహేందర్రెడ్డి, జనగాం సుధారాణి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఫ అడిషల్ కలెక్టర్ భాస్కర్‌రావు -
తుంగతుర్తి కాంగ్రెస్‌లో విభేదాలు
సాక్షి, యాదాద్రి : కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు భగ్గుమంటున్నాయి. మంత్రి, ఎమ్మెల్యేల మధ్యన ప్రొటోకాల్ రగడ కొనసాగుతోంది. విభేదాలు కొన్ని చోట్ల నివురుగప్పిన నిప్పులా ఉంటే.. మరికొన్ని చోట్ల బహిరంగంగా విమర్శల చేసుకునే స్థాయికి వెళ్లాయి.. ఈ వివాదాలకు పార్టీ అధిష్టానం చెక్ పెట్టాలని క్యాడర్ కోరుతోంది. ప్రొటోకాల్ వివాదంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో గ్రూపులుగా విడిపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యేతో పొసగని వారు ఇదే అదనుగా గ్రూపులు కడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో బహిరంగంగానే కొట్టుకున్నారు. ● గతంలో మదర్ డెయిరీ డైరెక్టర్ల ఎన్నిక విషయంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్.. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై పత్రికా ముఖంగా ఆరోపణలు చేశారు. తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ అభ్యర్థితో కాంగ్రెస్ పొత్తును ఆయన వ్యతిరేకించారు. తనకు తెలియకుండా మోత్కూరకు చెందిన బీఆర్ఎస్ వ్యక్తితో ఎలా పోటీకి దిగుతారని అప్పట్లో సామేల్ ప్రశ్నించారు. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ● ఇటీవల మోత్కురు–ఆలేరు మధ్య రోడ్డు పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి వచ్చి పరిశీలించారు. అనంతరం మంత్రి వెంకట్‌రెడ్డి మోత్కూరు మండలంలో కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు. అంతకు ముందు రోజు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సైతం అదే కుటుంబాన్ని పరామర్శించారు. ఈ రెండు సందర్భాల్లో తనకు సమచారం ఇవ్వలేదని తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్ తీవ్ర స్థాయిలో ఆరోపణలకు దిగారు. దీంతో పార్టీలో రెండు గ్రూపులుగా మారి పెద్ద ఎత్తున వివాదం రాజకుంది. మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్ష పదవుల నియామకంలో సామేల్ తన అనుచరులకే ఇచ్చాడని వివాదం రేగింది. ద్వితీయశ్రేణి నాయకుల్లో గ్రూపులు తుంగతుర్తి నియోజకవర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండు గ్రూపులుగా చీలిపోయింది. ఎమ్మెల్యే సామెల్ వర్గం, ఆయనకు వ్యతిరేక వర్గంగా మారి పరస్పర విమర్శలకు దిగుతున్నారు. మోత్కూరు మున్సిపాలిటీలో రెండు వర్గాలుగా విడిపోయారు. చైర్మన్ ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉండగా, కొందరు కాంగ్రెస్ కౌన్సిలర్లు పోటీ వర్గంలో చేరిపోయారు. దీంతో అక్కడక్కడా ఎమ్మెల్యే తీరునచ్చక తమ పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరికలు జారీచేసినట్లు సమచారం. అయితే, ఇటీవలనే గెలిచిన తాము రాజీనామా చేస్తే రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందన్న ఆందోళన సైతం వారిని వెంటాడుతోంది. ఫ బహిరంగ విమర్శలతో క్యాడర్లో గందరగోళం ఫ మోత్కూరు మున్సిపల్ కౌన్సిలర్ల రాజీనామా ప్రచారం -
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి
ఆలేరు రూరల్ : మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి రైతులకు సూచించారు. మంగళవారం ఆలేరు మండలం కొలనుపాక రైతు వేదికలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రత్యామ్నాయ పంటల సాగుతో నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు రైతులకు మెరుగైన ఆదాయం వచ్చేలా వ్యవసాయ శాఖ అధికారులు అవసరమైన సాంకేతిక సూచనలు, మార్కెట్ సమాచారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జొన్నలు, పెసలు, మినుములు, కంది, ఆముదం వంటి పంటలపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకట రమణారెడ్డి, తహసీల్దార్ ఆంజనేయులు, సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ, మండల అధికారులు, రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
సమగ్ర అభివృద్ధికి కృషి చేయండి
బొమ్మలరామారం : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని డీఆర్డీఓ నాగిరెడ్డి అన్నారు. మండల నోడల్ అధికారి భిక్షపతితో కలిసి బొమ్మలరామారం మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, నీటి వనరుల స్థిర వినియోగానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ అమలు, మ్యాజిక్ సోక్ పిట్లు, కమ్యూనిటీ సోక్ పిట్లు, ఫామ్ పాండ్లు, బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్లు, ఓపెన్ వెల్ రీచార్జ్ పనులు, మహిళా భవనాల నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. వన మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించి నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలన్నారు. వరి సాగు బదులుగా ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల వైపు మళ్లాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ శ్యామల, పీఏసీఎస్ చైర్మన్ మల్లేష్, ఎంపీఓ శ్రీమాలిని, సెర్ప్ ఏపీఎం చెంచెల యాదగిరి, ఏఓ దుర్గేశ్వరి, ఎంఈఓ రోజారాణి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.ఫ డీఆర్డీఓ నాగిరెడ్డి -
క్షేత్రపాలకుడికి ఆకుపూజ
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం విశేష పూజలు కొనసాగాయి. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి అర్చకులు ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. వేకువజామునే ప్రధానాలయాన్ని తెరిచిన అర్చకులు.. సంప్రదాయ పద్ధతిలో సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం బిందెతీర్థం, బాలభోగం, హారతి నివేదన వంటి పూజలను జరిపించారు. స్వయంభూ మూర్తులకు పంచామృతాలతో అభిషేకం, తులసీ దళాలతో అర్చన నిర్వహించారు. ఇక క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో విష్ణు పుష్కరిణి వద్ద ఉన్న హనుమాన్ ఆలయంలో తమలపాకులతో విశేష పూజలు చేశారు. సింధూరంతో అలంకరించిన శ్రీఆంజనేయస్వామికి తమలపాకులతో అర్చన జరిపించారు. అలాగే, స్వామి వారి ప్రధానాలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలను భక్తుల సమక్షంలో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. -
నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాలి
చౌటుప్పల్ : ఎల్‌నినో ప్రభావం వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడినందున గ్రామాల్లో నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓ శోభారాణి సూచించారు. వీబీజీ రామ్‌జీ జలసిరి ద్వారా చేపడుతున్న పనులు, గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలపై చౌటుప్పల్ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కార్యాచరణ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంకుడు గుంతలు, ఊట కుంటలు, ఫామ్పాండ్ల ద్వారా గ్రామాల్లోని బోర్లను రీచార్జ్ చేయాలని సూచించారు. మండల ప్రత్యేకాధికారి రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తహసీల్దార్ వీరాబాయి, ఎంపీడీఓ కే.శ్రీలత, మండల వ్యవసాయాధికారి ముత్యాల నాగరాజు, ఏపీఓ ఈశ్వరయ్య, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవాలి సంస్థాన్‌నారాయణపురం : ప్రతి ఇంట్లో ఒక ఇంకుడు గుంతను నిర్మించాలని జెడ్పీ సీఈఓ ఎన్.శోభారాణి సూచించారు. మంగళవారం సంస్థాన్‌నారాయణపురం ఎంపీడీఓ కార్యాలయంలో ఎల్‌నినో, జలసిరి వర్షాభావ పరిస్థితులపై మండల ప్రత్యేక అధికారి ప్రీమిల అధ్యక్షతన సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. అనంతరం కొత్తగూడెం గ్రామంలో ఓ రైతు భూమిలో ఫాంపాండ్ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ సాత్విక్, ఎంపీడీఓ ప్రమోద్‌కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఫ జెడ్పీ సీఈఓ శోభారాణి -
చికిత్స పొందుతూ మృతి
నిడమనూరు : అప్పుల బాధతో గడ్డి మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన కొంపెల్లి సైదులు(50) ఇటీవల అప్పు చేసి అర ఎకరం పొలం కొనుగోలు చేశాడు. అప్పు తీర్చే మార్గం లేక ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగాడు. సాయంత్రం పొలం నుంచి అతడి భార్య వచ్చి చూసి చుట్టుపక్కల వారి సహాయంతో 108 అంబులెన్స్‌లో నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి.. కేతేపల్లి : ఇరవై రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. కేతేపల్లి మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు ఊర యాదగిరి(53) ఈ నెల 7న కేతేపల్లిలోని ఎస్సీ కాలనీ సమీపంలో 65 నంబర్ జాతీయ రహదారి దాటుతుండగా కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయపడ్డాడు. చికిత్స నిమ్తితం కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
కరుణించు వరుణ దేవా
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంసాక్షి, యాదాద్రి : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పేర్కొన్నారు. అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణతో కలిసి భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఫంక్షన్ హాల్స్ యజమానులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయ న మాట్లాడారు. వసతి గృహాల విద్యార్థులను శుభకార్యాల్లో క్యాటరింగ్ పనులకు ఉపయోగిస్తే సంబంధిత ఫంక్షన్ హాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్లను ఎలాంటి పనుల్లోనూ నియమించకూడదని స్పష్టం చేశారు. నీటి వృథాను అరికట్టి, భూగర్భ జలాల పెంపునకు తప్పనిసరిగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాష్ రెడ్డి, అధికారులు, యజమానులు పాల్గొన్నారు. వరికి బదులు ఆరుతడి పంటలు మేలుభువనగిరి: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం వల్ల రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి పీవీ రమణారెడ్డి సూచించారు. మంగళవారం భువనగిరి మండలంలోని మాసుకుంట వద్ద రైతువేదికలో విత్తనమేళా నిర్వహించారు. ప్రస్తుతం వరి సాగును తగ్గించుకొని ఆరు తడి పంటల సాగుతోనే రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. విత్తన మేళా కార్యక్రమాల ద్వారా రైతు వేదికల్లో కందులు, పెసర, జొన్న విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మల్లేష్, వ్యవసాయ విస్తరణ అధికారులు వెంకట్రావు, అనిల్, ప్రియాంక, సంధ్య, ఉమా, కృష్ణకుమారి పాల్గొన్నారు. తేనెటీగల పెంపకంతో యువతకు ఉపాధిసంస్థాన్ నారాయణపురం: తేనెటీగల పెంపకంతో గ్రామీణ యువత, రైతులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. రాచకొండ అటవీ ప్రాంతంలో తేనెటీగల పెంపకం ద్వారా సేకరించిన స్వచ్ఛమైన తేనెతో రూపొందించిన రాచకొండ ఫారెస్ట్ హనీ బ్రాండ్‌ను సోమవారం మునుగోడులో ఆవిష్కరించి మాట్లాడారు. తేనెటీగల పెంపకం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న మిత్రా ఫౌండేషన్ వ్యవస్థాపకులు నిమ్మల రామచంద్రయ్య, నోముల మాధవరెడ్డి సేవలను ఎమ్మెల్యే అభినందించారు. మునుగోడు నియోజకవర్గంలోని 161 గ్రామాల్లో సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరించేందుకు రూపీనేని కాంతి సేవలు అందించాలని కోరారు. సుధాకర్ చేపడుతున్న పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రశంసించారు. కార్యక్రమంలో మన్నే నర్సిరెడ్డి, ప్రముఖ్‌రెడ్డి, సామల భాస్కర్, పురుషోత్తంరావు, అంజిరెడ్డి, లతా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మహా శివుడికి సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. మహా శివుడికి ఇష్టమైన రోజు కావడంతో విశేషంగా అభిషేకం, బిల్వార్చన పూజలను జరిపించారు. ముఖ మండపంలోని శ్రీస్పటిక రామలింగేశ్వరుడికి పూజారులు బిల్వ పత్రాలతో పూజలు చేశారు. భక్తులచే అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయంలో శ్రీరామలింగేశ్వర సమేత పార్వతీ దేవి సేవను ఊరేగించారు. యాదగిరీశుడి ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలను అర్చకులు సంప్రదాయంగా జరిపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
{糫§é° ¯]lÆó‡…{§ýl Ððl*©° VýS§ðlª ¨…ç³#™é…
యాదగిరిగుట్ట: విద్యార్థులు, యువత జీవితాలతో ఆడుకుంటున్న ప్రధాని నరేంద్రమోదీని భవిష్యత్తులో గద్దె దింపుతామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడికి నిరసనగా యాదగిరిగుట్ట పట్టణంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి చేపట్టిన కాగడాలర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా రాహుల్‌గాంధీతో కలిసి యువత, విద్యార్థులు శాంతి యుతంగా నిరసన చేపడితే నరేంద్రమోదీ ప్రభుత్వం లాఠీ చార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నరేంద్రమోదీ 12 సంవత్సరాల పాలనలో 150 సార్లు పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని మండిపడ్డారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించి చేతులు దులుపుకున్నారని, పేపర్ లీకేజీపై ప్రధానిమోదీ లోతైన విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా అందించాలన్నారు. 21 సంవత్సరాలు నిండిన యువతను చట్ట సభల్లోకి పంపిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని, ఇందుకు సంబంధించిన బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ, ఏఎంసీ చైర్పర్సన్ ఐనాల చైతన్యరెడ్డి, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి, వైస్ చైర్పర్సన్ బరిగె రమ్య, పీఏసీఎస్ చైర్మన్ చీర శ్రీశైలం, మండల, పట్టణ అధ్యక్షులు మంగ సత్యనారాయణ, ముక్కెర్ల మల్లేష్ పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
భర్త మృతిని తట్టుకోలేక..
● 24 గంటల వ్యవధిలోనే భార్య కూడా మృతి నార్కట్‌పల్లి : భర్త మృతిని తట్టుకోలేక 24 గంటల వ్యవధిలోనే భార్య మృతిచెందింది. ఈ ఘటన సోమవారం నార్కట్‌పల్లి మండలం తొండల్వాయి గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తొండల్వాయి గ్రామానికి చెందిన శనిగారపు బాలయ్య(80), చంద్రమ్మ(75) దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారులు అదే గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వృద్ధ దంపతులు కొడుకుల వద్ద ఉండకుండా వేరుగా ఒక గదిలో నివసిస్తున్నారు. కాగా.. బాలయ్య అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. అదే రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. బాలయ్య మృతిని తట్టుకోలేక అతడి భార్య చంద్రమ్మ తీవ్ర మనోవేదనకు గురైంది. సోమవారం ఉదయం చంద్రమ్మ ఎంతకూ నిద్ర లేవకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు దగ్గరకు వెళ్లి చూడగా.. ఆమె కూడా మృతిచెందింది. భార్యాభర్తలు ఒక్కరోజు వ్యవధిలో మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
లక్ష్యం 16.72లక్షలు.. నాటింది1.94లక్షలు
శాఖల వారీగా నాటాల్సిన మొక్కల లక్ష్యం, నాటినవి (లక్షల్లో..) శాఖ లక్ష్యం నాటినవి పరిశ్రమలశాఖ 0.20 0.14 ఉద్యావన 0.60 0.37 డీఆర్డీఏ 9.30 1.15 పంచాయతీరాజ్ 2.00 0.20 మున్సిపల్ 2.50 0.06 అటవీ 0.72 0.02 రోడ్లు భవనాలు 0.15 నిల్ పీఆర్ రోడ్స్ 0.15 నిల్ నీటి పారుదల 0.20 నిల్ వ్యవసాయ 0.30 నిల్ ఎకై ్సజ్ 0.50 నిల్ పోలీస్ 0.10 నిల్ మొత్తం 16.72 1.94భువనగిరి: వన మహోత్సవం కార్యక్రమంపై ఎల్‌నినో ప్రభావం పడింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా మొక్కలు నాటే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 16.72 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించగా.. వర్షాలు లేక ఇప్పటివరకు కేవలం 1.94 లక్షల మొక్కలు అంటే 11.60 శాతం మాత్రమే నాటారు. నర్సరీల్లో వివిధ రకాల మొక్కలతో పాటు, ఉపాధి హామీ కింద గుంతలు కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ.. వరుణుడు కరుణించకపోవడంతో మొక్కలు నాటే పరిస్థితి లేకుండా పోయింది. చాలా ప్రభుత్వ శాఖలు ఇప్పటివరకు ఒక్క మొక్క కూడా నాటకపోవడం గమనార్హం. 2015 నుంచి.. అడవుల శాతం తగ్గడంతో వాతావరణ సమతుల్యత దెబ్బతిని వర్షాలు సకాలంలో పడక కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాలు సమృద్ధిగా పడాలంటే పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని 2015లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించి హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏటా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వన మహోత్సవం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తోంది. గత నెల 18వ తేదీన వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభమైనప్పటికీ ఎల్‌నినో ప్రభావంతో ముందుకుసాగడం లేదు. గుంతలు సిద్ధంగా ఉన్నా.. జిల్లాలో 427 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో నర్సరీని ఏర్పాటు చేశారు. నర్సరీలలో నీడనిచ్చే మొక్కలతో పాటు జామ,నిమ్మ, దానిమ్మ, ఉసిరి, చింత, అల్లనేరేడు వంటి పండ్ల మొక్కలు, గులాబీ, గన్నేరు, మందార తదితర పూల మొక్కలు అందుబాటులోఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా అవెన్యూ ప్లాంటేషన్‌తో పాటు రోడ్లకు ఇరు వైపులా, ప్రభుత్వ స్థలాలు అటవీ ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో మొక్కలను నాటాలని నిర్ణయించారు. ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటేందుకు గుంతలు సైతం తీసి సిద్ధంగా ఉంచారు. వాస్తవానికి ఏటా జూలై నెలాఖరు వరకు గానీ ఆగస్టు మొదటి వారంలో గానీ మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలి. కానీ వర్షాలు పడని కారణంగా మొక్కలు నాటడం లేదు. ఫ వన మహోత్సవంపై ఎల్‌నినో ఎఫెక్ట్ ఫ వర్షాభావంతో ముందుకు సాగని మొక్కలు నాటే కార్యక్రమం ఫ నర్సరీలకే పరిమితమైన మొక్కలు -
సర్కారు వడ్లతో రియల్ దందా!
సాక్షి, యాదాద్రి: రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన కోట్లాది రూపాయల విలువైన ధాన్యం మాయమవుతోంది. సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) అప్పగించే వరకు మిల్లులపై పక్కా నిఘా ఉంచాల్సిన యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో మిల్లర్లు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఒక్క భువనగిరి మండలం అనంతారంలోని యాదాద్రి రైస్ మిల్లులోనే ఏకంగా రూ.24.31 కోట్లు విలువ చేసే వేలాది టన్నుల ధాన్యం స్వాహా కావడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అక్రమంగా విక్రయించిన సర్కారు వడ్ల డబ్బులతో మిల్లర్లు ఏకంగా స్థిరాస్తి వ్యాపారానికి తెరలేపినట్లు సమాచారం రూ. 24.31 కోట్ల ధాన్యం మాయం భువనగిరి మండలం అనంతారం యాదాద్రి రైస్ మిల్లులో అధికారుల లెక్కల ప్రకారం 6,776.251 మెట్రిక్ టన్నులు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం నిల్వ లేదు. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం ఆ ధాన్యం విలువ సుమారు రూ.24.31 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ భారీ కుంభకోణంపై కేసు నమోదు చేసిన పోలీసులు, మిల్లు యాజమాన్యానికి చెందిన ఐదుగురిలో ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేశారు. మిగతా నలుగురు పరారీలో ఉన్నారు. ప్రభుత్వ డబ్బుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్లు ఆ డబ్బును స్థిర, చరాస్తుల కొనుగోలు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. సుమారు రూ.24.31 కోట్ల విలువైన ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి, ఆ డబ్బుతో హైదరాబాద్‌లోని ఉప్పల్ బగాయత్‌లో కోట్ల విలువైన ప్లాట్‌ను మిల్లు పేరు మీద కొనుగోలు చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ మిల్లులో ఉన్న ఇద్దరు పార్ట్నర్లు గతంలో ఇతర మిల్లుల్లో కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం సకాలంలో తీసుకోకపోవడమే అదునుగా.. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం నిల్వలు రైస్ మిల్లుల్లో పెరిగిపోతున్నాయి. ఏ సీజన్లో ఇచ్చిన ధాన్యం సీఎంఆర్‌ను ఆ సీజన్లో తీసుకోకపోవడం, ఎఫ్‌సీఐ, పౌరసరఫరా శాఖ గోదాములలో స్థలాలు కేటాయించకపోవడం వల్ల ఎడతెగని జాప్యం కొనసాగుతోంది. ఇదే అదునుగా మిల్లర్లు బియ్యాన్ని అక్రమంగా బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. మరో సీజన్లో ఇచ్చే ధాన్యంతో పాత సీఎంఆర్ ఇవ్వొచ్చనే భావనతో కోట్లు విలువ చేసే ధాన్యాన్ని స్వాహా చేస్తూ సిరులు గడిస్తున్నారు. అధికారులవి మొక్కుబడి తనిఖీలేనా? మిల్లుల్లో ఉన్న ధాన్యాన్ని సివిల్‌సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐల ఆధ్వర్యంలో అధికారులు ప్రతి 15 రోజులకు ఒకసారి తనిఖీ చేసి లెక్కలు తేల్చాలి. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అధికారులు మొక్కుబడిగా మిల్లుకు వెళ్లడం, కాగితాలపై లెక్కలు చూసుకుని వస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు! జిల్లాలోని 41 మిల్లులకు 2023–24 యాసంగి సీజన్లో ఇచ్చిన ధాన్యానికి సంబంధించి సగానికి సగం మిల్లర్లు ఇంకా బియ్యం తిరిగి ఇవ్వలేదు. అధికారులు చర్యలు తీసుకోకపోగా వాయిదాల మీద వాయిదాలు ఇస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే పోచంపల్లి మండలం ముక్తాపూర్ మిల్లులో రూ.12 కోట్ల టెండర్ ధాన్యాన్ని మిల్లర్లు అమ్ముకున్నారు. గుండాల మండలం వెల్మజాల మిల్లులో రూ. 4 కోట్ల ధాన్యం అమ్ముకుంటే మిల్లు యజమానిపై ఆర్ఆర్ యాక్టు నమోదు చేసి ఆస్తులను ఫ్రీజ్ చేశారు. అధికారుల ఉదాసీనతనా, లేక అండదండలతోనే మిల్లర్లు రైతుల ధాన్యాన్ని యథేచ్ఛగా విక్రయిస్తున్నారన్న చర్చ ఊపందుకుంది.యాదాద్రి మిల్లులో రూ. 24.31 కోట్ల ధాన్యం మాయంఫ మిల్లుపేరున ప్లాట్లు కొన్నట్లు అధికారుల విచారణలో వెల్లడి ఫ ఐదుగురిపై కేసు.. ఒకరి అరెస్టు, నలుగురు పరారీ ఫ అధికారుల మొక్కుబడి తనిఖీలతో మిల్లర్ల మాయాజాలంయాదాద్రి మిల్కు సంబంధించిన ధాన్యం వివరాలు యాసంగి 2024–25 2022–23 మిల్లుకు కేటాయించిన ధాన్యం 10,318.588 8,921.440 ఇవ్వాల్సిన సీఎంఆర్ 6,969.790 6,030.382 ఇచ్చిన సీఎంఆర్ 2,468.251 4,246.382 టెండర్ ధాన్యం – 2,376.421 నిల్వ ఉండాల్సిన ధాన్యం 6,688.808 247.443 నిల్వ ఉన్న ధాన్యం 160 నిల్ -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
మిర్యాలగూడ : దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మిర్యాలగూడ నుంచి దామరచర్ల వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి మరొక ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో దామరచర్ల మండల కేంద్రానికి చెందిన పగిడి జీడయ్యయాదవ్ తలకు తీవ్ర గాయాలు కాగా.. వాచ్యాతండాకు చెందిన ధరావత్ మల్సూర్ కాలు విరిగింది. అటుగా వెళ్తున్న ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ ప్రమాదాన్ని గమనించి వెంటనే తన వాహనాన్ని ఆపి క్షతగాత్రులను తన వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఎమ్మెల్సీ కోరారు. -
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వాలు పాటుపడాలి
హుజూర్నగర్ : మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన డిమాండ్ చేశారు. సోమవారం హుజూర్‌నగర్‌లో సమాఖ్య నాలుగో జిల్లా మహాసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా సమాఖ్య జెండాను ఆమె ఆవిష్కరించారు. అనంతరం సృజన మాట్లాడుతూ ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలతో మహిళల అభ్యున్నతి సాధ్యం కాదని, వారి ఆర్థిక స్వావలంబనకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. మహిళలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. లైంగిక వేధింపులు, వివక్షత ఇంకా కొనసాగడం బాధాకరమన్నారు. ప్రభుత్వాలు మహిళల సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఉప్పతల కోటమ్మ, పట్టణ అధ్యక్షురాలు ఎల్లావుల ఉమా, అయిలాపురం లక్ష్మీ అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, సమాఖ్య జిల్లా కార్యదర్శి దేవరం మల్లేశ్వరి, సభ్యులు సింగినం పుల్లమ్మ, సుందరి పద్మ, కౌన్సిలర్ చెనగాని సైదులు, సీపీఐ నాయకులు గుండు వెంకటేశ్వర్లు, కొప్పోజు సూర్యనారాయణ, బద్ధం కృష్ణారెడ్డి, కేవీఎన్ మూర్తి, ధనుంజయ నాయుడు, తదితరులు పాల్గొన్నారు. జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన -
మున్సిపాలిటీల్లో ‘బిల్ వన్’
ఆన్లైన్లో చెల్లించే విధానం ఇలా.. ● తెలంగాణ పురపాలక శాఖ అధికారిక వెబ్‌సైట్‌లోని బీఎల్వన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ● మీ ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ లేదా అసెస్మెంట్కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. ● సెల్ ఫోన్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయగానే, సదరు ఆస్తి లేదా షాపునకు సంబంధించిన ఆస్తి పన్ను, నల్లా బిల్లు, ట్రేడ్ లైసెన్స్ ఫీజు బకాయిల సమగ్ర వివరాలు కనిపిస్తాయి. అక్కడి నుంచే నేరుగా డిజిటల్ విధానంలో చెల్లింపు పూర్తి చేయవచ్చు. భువనగిరిటౌన్ : మున్సిపాలిటీలోని ప్రజలకు పన్నుల చెల్లింపు సేవలు సులభతరం చేసేందుకు పురపాలక శాఖ నూతన సాంకేతిక పద్ధతిని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు వేర్వేరుగా చెల్లించే ఆస్తి పన్ను, నల్లా బిల్లు, ట్రేడ్ లైసెన్స్ రుసుమును ఒక్కటిగా కలిపి ఒకే వేదికపై చెల్లించేలా బిల్వన్ పేరుతో కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టును ఇటీవల హైదరాబాద్‌లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ టీకే.శ్రీదేవి లాంఛనంగా ప్రారంభించగా జిల్లాలోని భువనగిరి, ఆలేరు, భూదాన్ పోచంపల్లి, మోత్కూరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ ఆరు మున్సిపాలిటీల్లో బిల్ వన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఒకేసారి మూడు చెల్లించేలా.. గతంలో ఆస్తి పన్ను, నల్లా బిల్లు, ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటే వేర్వేరు క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చేది. కొత్తగా తెచ్చిన ‘బిల్ వన్’ ఏకీకృత విధానంతో మూడు రకాల బకాయిలు ఒక్క సమాచారంతోనే స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. ఏకకాలంలోనే చెల్లించే వెసులుబాటు కలగడంతో వినియోగదారులకు సమయం, శ్రమ ఆదా కానున్నాయి. వాయిదాల సదుపాయం.. శ్రమ తగ్గిన సిబ్బంది ఏకీకృత బిల్లు మొత్తం ఒకేసారి చెల్లించడం భారం అనుకునే వారికి ప్రభుత్వం విడతల వారీగా చెల్లించే సదుపాయాన్ని కూడా కల్పించింది. అయితే, నిర్దేశిత గడువులోగా చెల్లించకపోతే నిబంధనల ప్రకారం పన్నుపై వడ్డీ భారం పడనుంది. మరోవైపు ఈ విధానం వల్ల మున్సిపల్ సిబ్బందికి కూడా ఊరట లభించింది. గతంలో ఒక్కో బిల్లు వసూలు కోసం వేర్వేరుగా ఇంటింటికి లేదా దుకాణాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ఇకపై ఒకేసారి ప్రక్రియ పూర్తి కానుందని అంటున్నారు. దీంతో మిగిలిన సమయాన్ని పట్టణ పారిశుద్ధ్యం, ఇతర అభివృద్ధి పనులకు వినియోగించే అవకాశం లభించింది. ఫ ఒకేసారి ఇంటి పన్ను, నల్లా బిల్లు, ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లింపు ఫ పన్నుల చెల్లింపు సులభతరం చేసేలా కొత్త విధానం ఫ ఆరు మున్సిపాలిటీల్లో అందుబాటులోకి సేవలు -
ప్రజావాణి అర్జీలు పెండింగ్ పెట్టొద్దు
భువనగిరిటౌన్ : ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పెండింగ్ పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భాస్కర్ రావు, వెంకా రెడ్డిలతో కలిసి ప్రజల నుంచి మొత్తం 134 అర్జీలను స్వీకరించారు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలి వర్షాభావ పరిస్థితుల దష్ట్యా రైతులు వరికి బదులు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. ఈ నెల 28 నుంచి జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ జయమ్మ, డిప్యూటీ కలెక్టర్లు సాత్విక్, కృతిక తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణికి హాజరుకాని మున్సిపల్ కమిషనర్లు ప్రజావాణికి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు హాజరుకావడం లేదు. జిల్లా అధికారులంతా ప్రజావాణిలో పాల్గొంటుండగా, కమిషనర్లు మాత్రం ప్రతినిధులను పంపుతున్నారు. భువనగిరి మున్సిపాలిటీ తరఫున రెవెన్యూ అధికారి, యాదగిరిగుట్ట నుంచి మేనేజర్ మాత్రమే హాజరయ్యారు. ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
ప్లాస్టిక్ నియంత్రణతోనే సుస్థిరాభివృద్ధి
నల్లగొండ టూటౌన్ : ప్లాస్టిక్ నియంత్రణ ద్వారానే సుస్థిరాభివృద్ధి సాధ్యమని ఎంజీయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మారం వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పర్యావరణ మార్పును ఎదుర్కోవడంలో విద్యార్థులు క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను వివరిస్తూ.. పర్యావరణహితమైన జీవితం కార్యాచరణ విద్యార్థుల నుంచే ప్రారంభం కావాలన్నారు. అనంతరం ఆర్ట్స్, బిజినెస్ మేనేజ్మెంట్, సైన్స్, ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు, విద్యార్థులతో కలిసి ప్లాస్టిక్ రహిత క్యాంపస్ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.వసంత, నీలకంఠం శేఖర్, కిరణ్మయి, రమేష్ నాయక్, శ్రీనివాస్, శ్రీధర్ రావు, సత్తిరెడ్డి, మౌనిక తదితరులు పాల్గొన్నారు. -
ఫీజు బకాయిలు విడుదల చేయాలని ధర్నా
నార్కట్‌పల్లి : విద్యార్థుల ఫీజు బకాయిలు ప్రభుత్వం విడుదల చేయాలని కోరుతూ నార్కట్‌పల్లిలో సోమవారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ మాట్లాడుతూ.. విద్యార్థులకు వ్యతిరేకంగా తెచ్చిన జీఓ నంబర్ 9, ఆర్ఆర్ యాక్ట్ ను రద్దు చేయాలన్నారు. ఫీజులను ప్రభుత్వమే భరించాలి, విద్యాశాఖ మంత్రిని నియమించి వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. విద్యార్థులు ధర్నా చేస్తున్న సమయంలో పోలీసులు అక్కడకి చేరుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు విద్యార్థులపై దాడి చేయడంతో విద్యార్థులు బస్సులపైకి ఎక్కి నినాదాలు చేశారు. అనంతరం శాంతియుతంగా ధర్నా చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్, పల్లపు దుర్గయ్య, పాలకూరి రమేష్, డెక్కంటి గణేశ్, సిలువేరు నాగరాజు, పి సర్వయ్య గౌడ్, కారంపూడి సాయి తేజ, మహేష్, ఎడ్ల మహాలింగం, జినుకల కృష్ణ, సురేష్, మనీష్, అనిత, లింగస్వామి, వినయ్, వెంకట్, భాస్కర్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
అవగాహన కలుగుతుంది
రెండు మూడు నెలలకు ఒకసారైనా మండల సమావేశాలు ఏర్పాటు చేస్తే గ్రామాలు ఎలా అభివృద్ధి చేయాలనే అంశంలో అవగాహన కలుగుతుంది. అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు సర్పంచులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టే నూతన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అవగాహన కలుగుతుంది. దీంతో ప్రజలకు కూడా అవగాహన కలిగించవచ్చు. – కూతాటి సంధ్య, సర్పంచ్, బట్టుగూడెం సభలు ఏర్పాటు చేయాలిగతంలో మండల పరిషత్ పాలకవర్గాలు ఉన్న సమయంలో మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించిన మాదిరి మండల స్థాయి అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయాలి. దీంతో ఆయా శాఖల అధికారులకు, సర్పంచ్‌లకు మధ్య సమన్వయం ఏర్పడుతుంది. అధికారులతో పరిచ యం ఏర్పడి స్నేహపూర్వక వాతావరణంలో గ్రామాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. – మెండె ముత్యాలు, సర్పంచ్, తుంగతూర్తి -
చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు
భువనగిరి(బీబీనగర్) : వృద్ధ దంపతులకు మాయమాటలు చెప్పి బంగారు పుస్తెలతాడు అపహరించిన ఇద్దరు నిందితులను బీబీనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం బీబీనగర్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భువనగిరి డీఎస్పీ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 12న బీబీనగర్‌కు చెందిన కుక్కడపు అండాలు, ఆమె భర్త ఇంట్లో ఉండగా.. ఏపీలోని సత్యసాయి జిల్లాకు చెందిన గంగాధరప్ప, కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపూర్ జిల్లాకు చెందిన జంగాల శివరాజ్ బైక్‌పై వారి వద్దకు వచ్చారు. తాము ప్రభుత్వ ప్రతినిధులమని పరిచయం చేసుకుని.. ప్రభుత్వం అందించే ఉచిత బియ్యం పథకానికి సంబంధించి ఫొటో తీయాలని నమ్మించారు. ఫొటో తీయాలంటే మెడలో ఉన్న మంగళసూత్రం తీయాలని అండాలుకు సూచించారు. దీంతో ఆమె తన మెడలోని మంగళసూత్రాన్ని తీసి పక్కనే ఉన్న భర్తకు ఇచ్చింది. ఇద్దరు నిందితులు ఫొటో తీస్తున్నట్లు చేసి అండాలు భర్త చేతిలో ఉన్న మూడు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కోని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన బీబీనగర్ పోలీసులు ఆదివారం నిందితులను పట్టుకుని వారి నుంచి 30 గ్రాముల బంగారు పుస్తెలతాడు, బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. 30 గ్రాముల బంగారు పుస్తెలతాడు, బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం -
భువనగిరిలో ఉమ్మడి జిల్లా సెపక్ తక్రా పోటీలు
భువనగిరి : పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో సోమవారం ఉమ్మడి జిల్లా స్థాయి సెపక్ తక్రా లీగ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ రంగరాజన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అన్నారు. ఖేల్ ఇండియా కోచ్, ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆస్మిత క్రీడల పర్యవేక్షుడు జీవీ సుబ్బారావు మాట్లాడారు. యువత ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెపక్ తక్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి వికేష్‌కుమార్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల సమస్యలు ఎవరికి చెప్పాలి..!
మండల పరిషత్ పాలకవర్గాలు లేవు.. మండల సభలూ లేవుపెద్దవూర : గ్రామ సమస్యలను అధికారులకు, ప్రభుత్వానికి తెలియజేయడానికి సర్పంచులకు సరైన వేదిక దొరకడం లేదు. గతంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించేవారు. అందులో సర్పంచులు తమ గ్రామ సమస్యలను అధికారులకు వివరించేవారు. గత రెండేళ్లుగా మండల పరిషత్ పాలకవర్గానికి ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రస్తుతం మండల సభలు జరగడం లేదు. దీంతో గ్రామ సమస్యలు ఎవరికి చెప్పాలని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలకు ఒకసారి మండల సభలు గతంలో ఎంపీపీ అధ్యక్షతన ప్రతీ మూడు నెలలకు ఒకసారి మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించేవారు. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా సర్పంచులతో పాటు పంచాయతీ కార్యదర్శులు, జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సైతం హాజరయ్యేవారు. అలాగే మండలంలో ప్రతీ ప్రభుత్వ శాఖ నుంచి మండల స్థాయి అధికారులకు తమ శాఖలకు సంబంధించిన మూడు నెలల ప్రగతి నివేదికలతో వచ్చేవారు. శాఖల వారీగా అధికారులు తమ నివేదికలను చదివినప్పుడు ఆయా గ్రామాల సర్పంచులు తమ గ్రామాల సమస్యలపై ప్రశ్నలు అడిగేవారు. సమస్యలకు పరిష్కారాలను అధికారులు వివరించేవారు. గ్రామాల సమస్యలు ఎలా..? గడువు ముగిసిన వెంటనే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్థానిక సంస్థల పాలన అస్తవ్యస్తంగా మారింది. రెండేళ్ల అనంతరం గత డిసెంబర్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అప్పటికే గ్రామాలలో సమస్యలు పేరుకుపోయాయి. కానీ ఇప్పటికీ మండల పరిషత్ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో గ్రామాలలో నెలకొన్న సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో.. ఎలా చెప్పుకోవాలో తెలియక సర్పంచులు సతమతమవుతున్నారు. ఎంపీపీ, జెడ్పీటీసీలకు సైతం కొంత ప్రత్యేక నిధులు కేటాయించేవారు. వీటితో గ్రామాలలో కొన్ని సమస్యలు పరిష్కారమయ్యేవి. కనీసం మండల అధికారులకు, తమకు మధ్య పరిచయం కోసమైనా సభలు నిర్వహించాలని సర్పంచులు కోరుతున్నారు. గతంలో మూడు నెలలకు ఒకసారి మండల సభలు సమస్యల పరిష్కారానికి సరైన వేదిక లేదని సర్పంచుల ఆవేదన -
రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
మిర్యాలగూడ అర్బన్ : అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన అయిటిపాముల సోమలింగం కుమారుడు అభినవ్(32) ఓ షాపులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అభినవ్ సోమవారం మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ సత్యనారాయణ పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆత్మహత్య మర్రిగూడ(చింతపల్లి) : ఆర్థిక ఇబ్బందులతో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చింతపల్లి మండలం గొడకొండ్ల గ్రామ పరిధిలో సోమవారం జరిగింది. ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం గిరికొత్తపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ గరీబ్ ఖాజానవాబ్(45) చింతపల్లి మండలం గొడకొండ్ల గ్రామ పరిధిలోని వీటీ నగర్లో గల ది రెయిన్బో స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్(కరస్పాండెంట్)గా వ్యవహరిస్తున్నాడు. ఆయన గతంలో నారాయణపేట జిల్లా కోస్గిలో పాఠశాల నడిపి నష్టపోయాడు. దీంతో అప్పులు ఎక్కువ కావడం, ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మానసిక వేదనకు గురై సోమవారం ఉదయం పాఠశాలలోని గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రిన్సిపాల్ గమనించి ఖాజా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. మృతుడికి భార్య షబానా, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్టీసీ బస్సులో బంగారు ఆభరణాలు చోరీ కొండమల్లేపల్లి : ఆర్టీసీ బస్సు ఎక్కుతున్న ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఆరు తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఈ ఘటన సోమవారం కొండమల్లేపల్లి బస్టాండ్‌లో జరిగింది. వివరాలు.. మిర్యాలగూడ డిపోకు చెందిన బస్సు దేవరకొండకు వెళ్తూ.. మార్గమధ్యలో కొండమల్లేపల్లి బస్టాండ్‌కు చేరుకుంది. కొండమల్లేపల్లికి చెందిన జక్క పుష్పలత, నాంపల్లి మండలం దేవత్‌పల్లికి చెందిన కుందారపు అనసూయ బస్సు ఎక్కుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు మహిళల వద్ద హ్యాండ్‌బ్యాగ్‌లను తస్కరించారు. ఆ బ్యాగుల్లో ఆరు తులాల బంగారు ఆభరణాలు ఉన్నట్లు బాధిత మహిళలు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపారు. -
కార్గిల్ విజయ్ దివస్
భువనగిరి : పట్టణంలోని రైతు బజార్ చౌరస్తా వద్ద ఆదివారం బీజేవైఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా అమర జవాన్ల చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్, బీజేవైఎం మండల అధ్యక్షుడు కుమారస్వామి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా, పట్టణ కమిటీ అధ్యక్షుడు రత్నపురం బలరాం, నాయకులు డీఎల్‌ఎన్‌గౌడ్ పట్నం కపిల్, కృష్ణాచారి, గణేష్, సాయి, పరమేష్, వెంకట్‌రెడ్డి, మహేష్, సిద్దుగౌడ్ ఉన్నారు. -
వైభవంగా బోనాల పండుగ
భువనగిరి : పట్టణంలోని కుమ్మరివాడలో ఆదివారం బోనాల మహోత్సవాన్ని నిర్వహించారు. వేడుకలో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణిరవికుమార్, కౌన్సిలర్ బండారు స్వర్ణలత నాయకులు పాల్గొన్నారు. పోచమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించిన బోనాల వేడుకలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ పాల్గొని పూజలు చేశారు. ఆయన వెంట పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు రత్నపురం బలరాం తదితరులు పాల్గొన్నారు. -
చేపల వేటకు వెళ్లిన వ్యక్తి.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి
భువనగిరి: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన భువనగిరి మండలంలోని బస్వాపూర్ రిజర్వాయర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు చెందిన మహ్మద్ నయీం పాషా(39) తన ఇద్దరు స్నేహతులతో కలిసి ఆదివారం బస్వాపూర్ రిజర్వాయర్ వద్దకు చేరుకున్నాడు. రిజర్వాయర్‌లో చేపలు పట్టేందుకు వారు నీటిలోకి వెళ్లారు. కొద్ది దూరం వెళ్లాక నయాం కాలుకు తాడు చుట్టుకోవడంతో ఈత కొట్టలేకపోయాడు. ఈ క్రమంలో నీటిలో మునిగి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు అందజేసిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ బృందాల సాయంతో పాషా మృతదేహాన్ని గాలించి వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం భువనగిరిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ అనిల్‌కుమార్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
కల్తీ అల్లంపేస్ట్ పట్టివేత
రామన్నపేట: అనుమతులు లేకుండా తయారు చేస్తున్న అల్లం పేస్ట్ నిల్వలను స్వాధీనం చేసుకుని, తయారీ యూనిట్‌పై రామన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. రామన్నపేటలో ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న వ్యాన్‌ను ఆపి తనిఖీ చేశారు. ఆ వ్యాన్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా పెద్దమొత్తంలో 360 ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేసి ఉన్న అల్లం పేస్ట్ లభ్యమైంది. దీంతో వాహన డ్రైవర్ శ్యామల సాగర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ లభ్యమైన అల్లంపేస్ట్‌ను కీసర పోలీసు స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ప్రాంతంలోని యూనిట్లో తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి సంబంధిత తయారీ కేంద్రంలో దాడులు చేశారు. ఈ తనిఖీల్లో కల్తీ అల్లం పేస్ట్‌ను తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అల్లంపేస్ట్ తయారీకి ఉపయోగిస్తున్న ముడి పదార్థాలు, యంత్రాలతో పాటు పెద్ద మొత్తంలో మూడు డ్రమ్ముల్లో నిల్వ చేసిన ఉన్న అల్లంపేస్ట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ అల్లం తయారు చేస్తున్న యూనిట్ నిర్వాహకుడు దామోదర్‌రెడ్డి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రామన్నపేట సీఐ రవి, ఎస్ఐ సతీష్ తెలిపారు. -
శ్రమ శక్తి అవార్డు ఇవ్వడం అభినందనీయం
మోత్కూరు : శ్రామిక నిపుణులకే శ్రమ శక్తి అవార్డు ఇవ్వడం అభినందనీయమని ప్రముఖ రచయిత, గాయకుడు గిద్దె రామనర్సయ్య అన్నారు. మోత్కూరుకు చెందిన ప్రముఖ సినీగేయ రచయిత అభినయ శ్రీనివాస్ తన తండ్రి దొంతోజు బ్రహ్మచారి స్మారకార్థం ఏర్పాటు చేసిన శ్రమ శక్తి అవార్డును ఆదివారం సాయంత్రం మోత్కూరులో హైదరాబాద్ చిక్కడపల్లికి చెందిన యూనిక్ మారుతీ సర్వీసెస్ అధినేత ఎంతో పేరు గడించిన మెకానిక్ మహమ్మద్ అబ్దుల్ జబ్బార్‌కు అందజేసి మాట్లాడారు. బ్రహ్మచారి నామమాత్రంగా చదువుకున్నప్పటికీ మెకానిజంలో ఎన్నో మెళకువలతో అనేక మిల్లుల్లో మిషనరీస్ ఏర్పాటు చేసిన ప్రతిభాశాలి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నేవూరి ధర్మేంధర్‌రెడ్డి, రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ జి.లక్ష్మీనర్సింహారెడ్డి, సినీగేయ రచయిత అభినయ శ్రీనివాస్, ఆయన సోదరుడు రాజు, ప్రజా భారతి అధ్యక్షుడు బి.హన్మంతు, పూర్వ అధ్యక్ష, కార్యదర్శులు డి.అరవింద రాయుడు, టి.ఉప్పలయ్య, బీఆర్ఎస్ నాయకులు కె.ప్రభాకర్‌రెడ్డి, జంగ శ్రీనివాస్, మర్రి అనిల్‌కుమార్, ప్రజా భారతి ప్రతినిధులు పాల్గొన్నారు. -
యాదగిరి క్షేత్రంలో శ్రీసుదర్శన హోమం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు వేద మంత్రాలతో వైభవంగా నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం సంప్రదాయంగా చేపట్టారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలు జరిపించారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజ నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో భక్తులతో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలను భక్తుల మధ్యన జరిపారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాడ వీధిలో అలంకారమూర్తులైన శ్రీస్వామి అమ్మవార్ల జోడు సేవను అర్చకులు, ఆలయ సిబ్బంది ఊరేగించారు. ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమించాలి భువనగిరిటౌన్ : ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ అన్నారు. ఆదివారం భువనగిరి జిల్లా కార్యాలయంలో నిర్వహించిన భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, సీబీఎస్ఈ మూల్యాంకన వైఫల్యాలపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం అణచివేత ధోరణి ప్రదర్శించిందని విమర్శించారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా విద్యార్థులు, యువత ఐక్యంగా సాగించిన పోరాట విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటుతున్నా ఎన్నికల హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కనీసం 20 వేల పోస్టులతో పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. గ్రూప్–1, 2, 3, 4, జూనియర్, డిగ్రీ లెక్చరర్లు, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు వెంటనే టీఆర్టీ నోటిఫికేషన్లు ఇచ్చి జాబ్ క్యాలెండర్‌ను అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పల్లె మధుక్రిష్ణ, జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, ఉపాధ్యక్షులు కవిడే సురేష్, దయ్యాల మల్లేష్, ఎండీ. సలీంసర్కార్, బండారు శ్రావణ్, జిల్లా కమిటీ సభ్యులు సుందర్, నత్తి నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల బిడ్డలు.. అంతరిక్షంలో దిట్టలు!
‘విక్రమ్–1’ ప్రయోగంలో మనోళ్ల సత్తాఫ దేశ చరిత్రలో నిలిచిన ప్రయోగం.. ఉమ్మడి జిల్లాలో హర్షాతిరేకాలు ఫ రాకెట్ డిజైనింగ్‌లో వంశీ, లక్ష్మీనాథ్ అరుదైన మైలురాయి గ్రామీణ నేపథ్యం.. సామాన్య కుటుంబాలు.. కానీ వారి లక్ష్యాలు మాత్రం ఆకాశాన్ని దాటాయి. దేశ అంతరిక్ష రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన స్కైరూట్ ఏరోస్పేస్ ‘విక్రమ్–1’ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు కీలక పాత్ర పోషించారు. ఆర్టీసీ కార్మికుడి కుమారుడైన నార్కట్‌పల్లికి చెందిన ప్రజ్ఞాపురం వంశీ క్యాడ్ ఇంజనీర్‌గా వ్యవహరించగా.. సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుడి బిడ్డ, సూర్యాపేట జిల్లా చింతలపాలెంకు చెందిన గంధం లక్ష్మీనాథ్ ఎలక్ట్రికల్ కేబుల్ హర్నెస్ డిజైన్, ఇంటిగ్రేషన్ ఇంజనీర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న ఈ యువ శాస్త్రవేత్తల స్ఫూర్తిదాయక ప్రయాణంపై కథనం.నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన ప్రజ్ఞాపురం రవి వెంకట్‌పటేల్, సృజన దంపతుల కుమారుడు వంశీ అంతరిక్ష రంగంలో అరుదైన ఘనత సాధించారు. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన ‘విక్రమ్–1’ ప్రైవేట్ ఆర్బిటాయ్ రాకెట్ తయారీ బృందంలో వంశీ క్యాడ్ ఇంజనీర్‌గా తన వంతు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సుమారు నాలుగేళ్ల పాటు ఎంతో శ్రమించి, వివిధ హోదాల్లో పని చేసి సాధించిన ఈ చరిత్రాత్మక ఘటనలో నిపుణులైన బృందంతో పాటు వంశీ కూడా భాగస్వామి కావడం స్థానికంగా గర్వకారణంగా మారింది. వంశీ తండ్రి రవి వెంకట్‌పటేల్ ఆర్టీసీలో కండక్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించి, స్క్వాడ్ ఇన్చార్జ్గా ఉద్యోగ విరమణ పొందారు. వంశీ ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యతో పాటు ఇంటర్మీడియట్ విద్యను నల్లగొండలోనే ప్రైవేట్ కళాశాలలో పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ (2014) పూర్తి చేశారు. డీఆర్డీఓ నుంచి స్కైరూట్ వరకు.. బీటెక్ పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో)లో ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా దాదాపు 6 సంవత్సరాల పాటు ఆయన సేవలందించారు. ద్రవ చోదక వ్యవస్థ (లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్) విభాగంలో ఇంటిగ్రేషన్, డిజైన్ పనుల్లో సంపాదించిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని.. 2025 జనవరి 2న హైదరాబాద్‌కు చెందిన ‘స్కైరూట్ ఏరోస్పేస్’ ప్రైవేట్ సంస్థలో క్యాడ్ ఇంజనీర్‌గా చేరారు. ఆ అనుభవంతోనే ‘విక్రమ్–1’ రాకెట్ తయారీలో క్యాడ్ ఇంజనీర్‌గా పూర్తి బాధ్యతలు నిర్వర్తించి, రాకెట్ విజయవంతం కావడంలో తన వంతు పాత్ర పోషించారు. భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టుల్లోనూ సేవలందించే అవకాశం లభించిందని ఆయన తెలిపారు. క్యాడ్ ఇంజనీర్‌గా వంశీ -
శ్రీస్వామి దర్శనానికి బారులు
మల్లఖంబ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా మంజులచౌటుప్పల్ : మల్లఖంబ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా చౌటుప్పల్‌కు చెందిన ట్రినిటీ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ ఉజ్జిని మంజుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబా ద్లో జరిగిన సమావేశం రాష్ట్ర కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు ముఖేష్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ కేవీబీ.కృష్ణారావు చీఫ్ పాటర్న్గా నియమితులయ్యారు. వారు మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించి రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. -
ఇంటిగ్రేషన్ టెస్ట్ ఇంజనీర్‌గా లక్ష్మీనాథ్
మేళ్లచెరువు : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలకేంద్రానికి చెందిన గంధం శ్రీను, శ్రీవాణి దంపతుల కుమారుడు లక్ష్మీనాథ్ ‘విక్రమ్–1’ ప్రైవేట్ ఆర్బిటాయ్ రాకెట్ తయారీ బృందంలో కీలకంగా పని చేశారు. ఎలక్ట్రికల్ కేబుల్ హెర్నెస్ డిజైన్, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టు ఇంజనీర్‌గా పనిచేసి యువతకు ఆదర్శంగా నిలిచాడు. వ్యవసాయ నేపథ్య కుటుంబానికి చెందిన లక్ష్మీనాథ్.. తండ్రి స్థానిక ఓ సిమెంట్ పరిశ్రమలో మిల్లర్‌గా, తల్లి ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తూ లక్ష్మీనాథ్‌ను చదివించారు. టెన్త్ వరకు స్థానిక సీతా పబ్లిక్ స్కూల్లో చదివిన లక్ష్మీనాథ్.. ఇంటర్, బీటెక్ (2023)హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. బీటెక్ తర్వాత డీఆర్డీఓలో ఇంటిగ్రేషన్ టెస్ట్ ఇంజనీర్‌గా ఏడాదిపాటు పనిచేశాడు. స్కైరూట్ ఏరోస్పేస్లో సంవత్సర కాలంగా పనిచేస్తూ ఎలక్ట్రికల్ కేబుల్ హర్నెస్ డిజైన్, ఇంటిగ్రేషన్ అండ్ టెస్ట్ ఇంజనీర్‌గా పనిచేస్తూ విక్రమ్–1 (మిషన్ ఆగమన్)లో కీలకంగా బాధ్యతలు నిర్వర్తించి ప్రయోగం విజయవంతం కావడానికి కృషిచేశారు. భవిష్యత్‌లో భారత అంతరిక్ష రంగ అభివృద్ధికి మరింత సేవలందిస్తూ మారుమూల గ్రామీణ ప్రాంతాల యువతకు స్ఫూర్తిగా నిలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు లక్ష్మీనాథ్ పేర్కొన్నారు. -
చెర్వుగట్టు.. అగ్నిగుండం!
షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు.. 17 దుకాణాలు దగ్ధంనార్కట్పల్లి : నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు అగ్నిగుండంగా మారింది. ఆదివారం తెల్లవారు జామున పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ ఘాట్ రోడ్డుకు ఎదురుగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుకాణా సముదాయంలో ఓ షాపు ఎదుట ఉన్న రేకుల షెడ్డుకు కరెంటు స్తంభం నుంచి వచ్చే తీగల ద్వారా షార్ట్‌సర్క్యూట్ అయింది. దీంతో ఒక దుకాణం నుంచి మరో దుకాణానికి మంటలు అంటుకుని మొత్తం 17 దుకాణాలు దగ్ధమయ్యాయి. దాదాపు రూ.3కోట్ల ఆస్తి నష్టం కలిగింది. కళ్లెదుటే ప్లాస్టిక్ సామగ్రి బుగ్గిపాలవుతుండడంతో షాపుల నిర్వాహకులు ఏమీ చేయలేదని నిస్సహాయ స్థితిలో మిగిలారు. తెల్లవారుజామున ఓ వ్యక్తి గమనించడంతో..రంగా శ్రవణ్ అనే దుకాణాదారుడు ఆదివారం తెల్లవారు జామున మూత్రవిసర్జన కోసం లేచాడు. షాపు ఎదుట బొమ్మల సామగ్రికి మంటలు చెలరేగడం గమనించాడు. తక్షణమే ఇంటి వెనకాల ఉన్న వారికి ఫోన్ చేసి నిచ్చెన సాయంతో బయటికి వచ్చారు. ఆ దుకాణం పక్కనే ఉన్న రాజ్యలక్ష్మికి సమాచారం ఇవ్వడంతో వారు వెనుక నుంచి బయటకు వచ్చేశారు. వరాల సతీష్ అనే వ్యక్తి సర్పంచ్ నేతగాని కృష్ణ, పలువురి దుకాణదారులకు విషయం తెలపడంతో వారు అక్కడకు చేరుకున్నారు. పోలీసులకు, ఫైరింజన్ సిబ్బందికి సమాచారం అందించారు. నల్లగొండ, నార్కట్‌పల్లి సీఐలు ఆదిరెడ్డి, సుధాకర్, ఎస్ఐలు సంఘటనా స్థలానికి చేరుకుని దుకాణాదారులను అప్రమత్తం చేశారు. ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే దుకాణల్లో ఉన్న సామగ్రి పూర్తిగా కాలిబూడిదైంది. ఈ ఘటనలో దాదాపు రూ.3 కోట్ల వరకు ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్ వేముల వీరేశం, జేసీ ప్రేమ్‌కుమార్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితులందరికీ తక్షణ సాయంగా ఎమ్మెల్యే వేముల వీరేశం రూ.20వేల చొప్పున అందజేశారు. ప్రభుత్వం నుంచి సాయం అందేవిధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మొరాయించిన ఫైరింజన్చెర్వుగట్టులో ప్రమాద ఘటనకు సంబంధించిన సమాచారం ఇచ్చిన 45 నిమిషాలకు నల్లగొండ నుంచి వచ్చిన ఫైరింజన్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఈక్రమంలో ఫైరింజన్ మొరాయించింది. అప్పటికే మంటలు ఎక్కువై సమీపంలో ఉన్న అన్ని దుకాణాలకు మంటలు వ్యాపించాయి. తక్షణమే నకిరేకల్, రామన్నపేట నుంచి వచ్చిన ఫైరింజన్‌తో అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు కృషి చేశారు. 30 ఫీట్లు ముందుకు జరగడం వల్లే ప్రమాదం! గ్రామ పంచాయతీ నుంచి లీజుకు తీసుకున్న షటర్ నుంచి దుకాణాదారులు దాదాపు 30 ఫీట్లు ముందుకు రేకులు ఏర్పాటు చేసుకున్నారు. ఈక్రమంలో కరెంట్ స్తంభం నుంచి షాపులకు వచ్చిన కరెంట్ తీగలు షార్ట్ సర్క్యూట్ కావడంతో ప్రథమంగా రేకుల షెడ్డులో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ కవర్లకు అంటుకోవడంతో భారీగా మంటలు చెలరేగాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. రూ.3 కోట్ల ఆస్తి.. కట్టుబట్టలతో మిగిలిన బాధితులు కళ్లెదుటే బుగ్గిపాలవుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయత తెల్లవారకముందే.. కాలిపోయిన కలలుఅధికారుల నిర్లక్ష్యం వల్లే షాపులు దగ్ధం బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. సంఘటన జరిగిన వెంటనే ఫైరింజన్ సిబ్బంది, పోలీసులు సంఘటనా చేరుకుంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని అన్నారు. ఫైరింజన్ సకాలంలో రాకపోవడం, తీరా వచ్చాక ఫైరింజన్ మొరాయించడంతో ప్రమాదం నష్టం భారీగా జరిగిందని తెలిపారు. బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
టైరు పేలి కారు బోల్తా
కోదాడరూరల్ : కారు టైర్ పేలి బోల్తా కొట్టింది. అందులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన కోదాడ పట్టణ పరిధిలోని డీమార్ట్ సమీపంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. విజయవాడకు చెందిన ఐదుగురు వ్యక్తులు కారులో యాదగిరిగుట్ట దైవదర్శనానికి బయలుదేరారు. కోదాడకు చేరుకున్నాక కారు టైరు పేలడంతో అదుపుతప్పి పల్టీ కొట్టింది. కారులో ఉన్న వారు స్వల్పగాయాలతో బటయపడిన కొద్దిసేపటికి సీఎన్జీ గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే సమయానికి కారు పూర్తిగా దగ్ధమైంది. స్వల్పంగా గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని పట్టణ పోలీసులు తెలిపారు.● సీఎన్జీ లీకై చెలరేగిన మంటలు -
ప్రత్యామ్నాయ పంటలు శరణ్యం
గుర్రంపోడు, హుజూర్నగర్ : ఎల్‌నినో ప్రభావంతో ప్రస్తుత వానాకాలంలో రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వర్షాభావ పరిస్ధితులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలైన జొన్న, కంది, పెసర్లు, మినుములు, కంది, పొద్దు తిరుగుడు, ఆముదం పంటలు సాగు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి సూచిస్తున్నారు. కంది జూలై చివరి వారం వరకు కంది విత్తనాలు విత్తుకోవచ్చు. ఆలస్యంగా ఆగస్టు మొదటి వారం వరకు కూడా కొన్ని స్వల్పకాలిక రకాలను సాగు చేసుకోవచ్చు. జొన్న ఖరీఫ్‌లో జూన్ నుంచి జూలై చివరి వరకు జొన్న పంటను సాగు చేయొచ్చు. వర్షాధారంగా ఈ పంట సాగు ఎంతో అనుకూలం. తక్కువ నీటితో సాగవుతుంది. ఎండను తట్టుకునే పంట, పశువులకు మంచి పశుగ్రాసం కూడా లభిస్తుంది. వర్షాధాన ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా జొన్న మంచి ఎంపిక. ఆముదం నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఆముదం వరికి మంచి ప్రత్యామ్నాయం. జూలై నెలాఖరు వరకు తగిన వర్షం కురిసినప్పుడు విత్తుకోవచ్చు. ప్రారంభ దశలో తేమ అవసరం కాగా తర్వాత తక్కువ నీటితో పంట బాగా పెరుగుతుంది. అపరాలుప్రొటీన్ ఎక్కువగా ఉండే పప్పుధాన్యాల పంటలైన పెసర్లు, మినుములు సాగుకు అనుకూలం. జూలైలో కురిసే వర్షాలకు విత్తుకోవచ్చు. తక్కువ నీటితో సాగుతోపాటు నేలలో నత్రజని స్థిరీకరించి భూసారాన్ని పెంచుతాయి. నువ్వులునువ్వుల పంటను ఆగస్టు 15 నుంచి ఆగస్టు 31 వరకు విత్తుకోవచ్చు. ఇందులో శ్వేత, రాజేశ్వరి, జెసీఎస్ 1020 అనే రకాలు మంచి దిగుబడులనిస్తాయి. నువ్వులను విత్తుకునేటప్పుడు రైతులు సాలుకు సాలుకు మధ్య 30 సెంటీ మీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటీ మీటర్లు ఉండేలా విత్తుకోవాలి. మొక్కజొన్న మొక్కజొన్న సాగు చేయాలనుకునే రైతులు జూలై 31 వరకు సాగు చేసుకోవచ్చు. మార్కెట్లో లభించే మొక్కజొన్న రకాలలో స్వల్పకాలిక రకాన్ని ఎంచుకోవడం మంచిది. చిరుధాన్యాలైన సజ్జ, రాగి, కొరన్రు ఆగస్టు 15 వరకు విత్తుకోవచ్చు. ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి హుజూర్నగర్ : ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో వరి సాగు కష్టతరమవుతుందని, రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని హుజూర్‌నగర్‌లోని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు ఆపత్కాల పంటల సాగుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
నేటి నుంచి విత్తన మేళా
భువనగిరిటౌన్ : వానాకాలం సీజన్ ప్రారంభమైనా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక వరి నారుమడులు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు జిల్లా వ్యవసాయ శాఖ ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడినిచ్చే ఆరుతడి పంటల వైపు రైతాంగాన్ని మళ్లించేందుకు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో ఆరుతడి పంటల సాగుకు ముందుకొచ్చే రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో సోమవారం నుంచి ఈ నెల29 వరకు మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు వేదికల్లో ప్రత్యేక విత్తన మేళాను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. నాణ్యమైన విత్తనాలు వరి సాగుకు సమృద్ధిగా నీరు అవసరం కాగా, ప్రస్తుతం ఉన్న నీటి వనరులతో ఆరుతడి పంటలైన పెసర, మినుము, కందులు, జొన్న, సజ్జ, నువ్వుల పంటలు వేసుకోవడం శ్రేయస్కరమని అధికారులు సూచిస్తున్నారు. ఈ మేళా ద్వారా వ్యవసాయ శాఖ ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలను సబ్సిడీ లేదా నిబంధనల ప్రకారం రైతులకు అందిస్తారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలి. రైతు వేదికల్లో విత్తన మేళా నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేశారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – పీవీ.రమణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ఫ రైతు వేదికల్లో మూడు రోజుల పాటు నిర్వహణ ఫ ఆరుతడి పంటల సాగు వైపు రైతులను మళ్లించేలా వ్యవసాయ శాఖ కార్యాచరణ -
సాగర్ల సత్తయ్యకు ఉత్తమ కథా పురస్కారం
చిట్యాల: వికారాబాద్‌కు చెందిన అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఠాగూర్ శంకర్ సింగ్ రాష్ట్ర స్థాయి కథల పోటీల్లో చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన డాక్టర్ సాగర్ల సత్తయ్య రచించిన కథ ఉత్తమ పురస్కారానికి ఎంపికై ంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సేవా సదనంలో ఆదివారం నిర్వహించిన దాశరథి, సినారే జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సత్తయ్య పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నగదుతో పాటు ప్రశంసాపత్రం అందజేసి సత్తయ్యను సన్మానించారు. కార్యక్రమంలో అనంత సాహిత్య వేదిక వ్యవస్థాపకులు దోరవేటి, తుల్జారాం సింగ్ ఠాగూర్, బీపీ నర్సింహులు గుప్తా, గంటా మనోహర్‌రెడ్డి, తలారి ఆశీర్వాదం, కమేలేష్, మహమ్మద్ షరీఫ్, వడిచర్ల సత్తయం, కడియాల మధుసూదన్‌రావు, జానకి రామారావు, కోల్లా భాస్కర్‌రావు పాల్గొన్నారు. బీబీనగర్ మండల వాసికి కార్మికరత్న అవార్డుభువనగిరి(బీబీనగర్): బీబీనగర్ మండలానికి చెందిన కార్మిక నాయకుడు గాదె నరేందర్‌రెడ్డి జాతీయ కార్మికరత్న అవార్డు అందుకున్నారు. కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి ఆయన చేసిన కృషికిగాను ఆదివారం హైదరాబాద్‌లోని పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అవార్డు అందజేశారు. కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ పాల్గొన్నారు. తాజ్పూర్ గ్రామ వాసికి ఆదర్శ స్వర్ణనంది అవార్డుభువనగిరి: మండలంలోని తాజ్పూర్ గ్రామానికి చెందిన సామాజికవేత్త, ఆర్ఎస్కే ఫౌండేషన్ అధినేత ర్యాకల శ్రీనివాస్ ఆదర్శ స్వర్ణనంది అవార్డు అందుకున్నారు. ఆయన చేసిన సామాజిక సేవకుగాను హైదరాబాద్‌కు చెందిన ఆదర్శ కళానిలయం వారు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈసందర్భంగా ఆదివారం యాదరిగుట్టలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చేతులమీదుగా శ్రీనివాస్ అవార్డు అందుకున్నారు. రేషన్ బియ్యం పట్టివేతరాజాపేట : అక్రమంగా వాహనంలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. రాజాపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఫోర్ వీలర్ వాహనాన్ని తనిఖీ చేయగా 26 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడ్డాయని ఎస్ఐ లింగారెడ్డి తెలిపారు. ఈమేరకు రేణికుంట గ్రామానికి చెందిన జగదీష్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
ట్రాక్టర్‌ను ఓవర్టేక్ చేస్తుండగా అదుపుతప్పిన బైక్
కేతేపల్లి: కేతేపల్లి మండలంలోని తుంగతుర్తి గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చెర్కుపల్లి గ్రామానికి చెందిన పోకల నవనీత ఇద్దరు కుమార్తెలు శాన్వి, శ్రేష్ట కేతేపల్లిలోని ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. శనివారం పాఠశాలకు వచ్చిన శాన్వి అస్వస్థతకు గురైంది. ఈ విషయాన్ని పాఠశాల సిబ్బంది తల్లి నవనీతకు చెప్పడంతో ఆమె అదే గ్రామానికి చెందిన హర్షక్తో కలసి బైక్‌పై పాఠశాలకు వచ్చి, ఇద్దరు చిన్నారులను పాఠశాల నుంచి ఇంటికి తీసుకువెళ్తున్నారు. ఈక్రమంలో మార్గమధ్యంలో తుంగతుర్తి గ్రామ శివారులో ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్టేక్ చేస్తుండగా బైక్ అదుపుతప్పి కిందపడింది. రోడ్డుపై పడిపోయిన నవనీత కాళ్లమీదుగా ట్రాక్టర్ వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. బైక్ నడుపుతున్న హర్షక్తో పాటు ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. స్థానికులు అందించిన సమాచారం మేరకు 108 అంబులెన్స్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. నవనీత పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.ఫ నలుగురికి గాయాలు -
నేలతల్లికి జలాభిషేకం
ఒక్కో చుక్కను ఒడిసిపడదాం.. జలసిరితో జత కడదాం రామన్నపేట: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో నెలకొన్న లోటు వర్షపాతాన్ని అధిగమించి, పొంచి ఉన్న కరువు ముప్పును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం జలసిరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కురిసిన కొద్దిపాటి వర్షపు నీటినైనా వృథా చేయకుండా భూమిలోకి ఇంకించి, ఎండిపోతున్న బోరుబావులకు ప్రాణం పోయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రైతులు, ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా నూరు శాతం సబ్సిడీతో ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్స్లాంటి వాటిని నిర్మించి ఇవ్వనుంది. ఒక్కో చుక్కను ఒడిసి పడదాం.. జలసిరితో జత కడదాం అనే నినాదంతో రాబోయే మూడు నెలల్లో ఈ నిర్మాణాలను పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో.. జిల్లాలో 2026–27 ఆర్థిక సంవత్సరంలో జలసిరి కార్యక్రమంలో భాగంగా వీబీ జీ రామ్ జీ ( జాతీయ గ్రామీణ ఉపాధిహామీ )పథకం కింద ఆరు రకాల రిచార్జ్ నిర్మాణాలను నూరుశాతం సబ్సిడీపై అమలు చేయాలని ప్రతిపాదించారు . ఒక్కో గ్రామపంచాయతీ పరిధిలో కనీసం ఐదు పంటకుంటలు (ఫామ్ పాండ్స్), ఒక ఇంకుడు చెరువు(పర్కులేషన్ ట్యాంక్)ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవిగాక వ్యక్తిగత ఇంకుడు గుంతలు , సామూహిక ఇంకుడుగుంత, బోర్వెల్ రీచార్జ్ నిర్మాణాలు, ఓపెన్‌బావులు నిర్మించాలన్నది లక్ష్యం. చేపట్టే నిర్మాణాలు ఏమిటంటే..● వ్యక్తిగత ఇంకుడుగుంతలు(మ్యాజిక్ సోక్ పిట్).. వీటి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 6,600 చెల్లిస్తుంది. ఇళ్ల పైకప్పు, షెడ్ల నుంచి వచ్చే నీటిని రాళ్లు కంకర నింపిన గుంత ద్వారా భూమిలోకి పంపే చిన్నపాటి నిర్మాణం. ● బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్ ఎండిపోయే దశకు చేరిన బోరుబావుల చుట్టూ ప్రత్యేక ఫిల్టర్ బెడ్ నిర్మించి వర్షపునీటిని శుద్ధిచేసి నేరుగా బోరులోపలకి పంపిస్తారు. ఈ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 25వేలు ఖర్చు చేస్తుంది. ● ఫామ్ పాండ్స్ వ్యవసాయ పొలాల్లో నిర్మించే పెద్దనీటి కుంటలు. ఇవి వర్షపు నీటిని నిల్వ చేయడమే కాకుండా చేపల పెంపకానికి, పశువుల నీటి అవసరాలకు ఉపయోగ పడతాయి. దీని నిర్మాణ వ్యయం 4లక్షల రూపాయలు ఉంది. ● కామన్ సోక్ పిట్(ఉమ్మడి ఇంకుడుగుంత) ఒకే ప్రాంతంలోని పలువురు రైతులు, పొరుగు కుటుంబాలు ఉమ్మడిగా వాడుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసే ఇంకుడుగుంత. నిర్మాణ వ్యయం రూ. 7500. ● కమ్యూనిటీ సోక్ పిట్(సామూహిక ఇంకుడుగుంత) వీధుల నుంచి వచ్చే వర్షపునీటిని ఒకచోటచేర్చి భూగర్భజలాలను పెంచే పెద్ద నిర్మాణం. దీని నిర్మాణ వ్యయం రూ 13వేలు. ● ఓపెన్ వెల్ పెద్దబావులకు వర్షపునీటిని మళ్లించి శుద్ధిచేసి అందించే భారీ నిర్మాణం. ఒక్కో యూనిట్ నిమిత్తం ప్రభుత్వం రూ. 3.50లక్షలు ఖర్చు చేస్తుంది. ఫ ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు వాన నీటి సంరక్షణే మార్గం ఫ భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ప్రణాళిక ఫ నూరుశాతం సబ్సిడీతో ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్స్ నిర్మాణం -
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి
యాదగిరిగుట్ట రూరల్: రైతులు వరి పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని జిల్లా డాట్ కేంద్రం కోఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త శ్రీలత అన్నారు. శనివారం యాదగిరిగుట్ట మండలంలోని సాధువెల్లి గ్రామంలో వ్యవసాయంలో ప్రత్యామ్నాయ పంటలు, నీటి యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎల్‌నినో ప్రభావం వల్ల, పంటల మార్పిడి చేయాలని సూచించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా వరికి బదులుగా కందులు, పెసర్లు, జొన్నలు, కూరగాయలు, ఆయిల్ పామ్ వంటివి సాగు చేయాలన్నారు. వరి సాగులో నీటి వృథాను అరికట్టేందుకు మార్చి, మార్చి తడి అందించే పద్ధతి పాటించాలన్నారు. పంటల్లో నీటి సంరక్షణ పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను రైతులకు వివరించారు. అనంతరం తహసీల్దార్ గణేష్ నాయక్ భూ భారతి, భూ సర్వేపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సుంకె ప్రసాద్, స్వరూప, ఏఈఓ ప్రణయ్ పాల్గొన్నారు. -
కరెంటు సరిపోను లేక నాట్లు ఆలస్యం
నాకున్న 10 ఎకరాలతో పాటు మరో 30 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాను. ఈసారి వర్షాలు లేక నాట్లు ఆలస్యంగా మొదలుపెట్టాను. వారం రోజులుగా సాయంత్రం 4.15 గంటల నుంచి ఉదయం 5 నుంచి 6 గంటల వరకు త్రీఫేజ్ కరెంటు తీసేస్తున్నారు. రోజుకు 10 గంటలు కూడా సక్రమంగా కరెంటు రావడం లేదు. విద్యుత్ సరిపోను సరఫరా కాకపోవడంతో మడులు నానక నాట్లు ఆలస్యం అవుతున్నాయి. మరో 10 ఎకరాలు నాట్లు పెట్టాల్సి ఉండగా కరెంటు కోతల వల్ల నారుమడి నానక ఇబ్బంది పడుతున్నాం. – నోముల మాధవరెడ్డి, రైతు, ఇంద్రియాల, భూదాన్ పోచంపల్లి మండలం -
యాదగిరి క్షేత్రంలో మొక్కు వస్త్రాల వేలం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ మాఢ వీధిలో శనివారం స్వామి అమ్మవార్ల మొక్కు వస్త్రాలకు ఆలయ అధికారులు వేలం పాట నిర్వహించారు. దేవస్థానంలో మొక్కు వస్త్రాల టెండర్ ముగియడంతో స్వామి అమ్మవార్లకు వచ్చే వస్త్రాలు ఆలయంలోనే భద్రపరుస్తున్నారు. వీటిని భక్తులు వేలం పాటలో పాల్గొని దక్కించుకున్నారు. ఐకేపీ సెంటర్లో అవకతవకలుయాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలం దాతర్పల్లి గ్రామంలోని ఐకేపీ సెంటర్లో అవకతవకలు చోటుచేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఇటీవల ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన నిర్వాహకులు గోదాములకు, మిల్లర్లకు తరలించారు. సేకరించిన ధాన్యం బస్తాల్లో ఎక్కువ మొత్తంలో తరుగు పేరుతో ధాన్యం తీసేసారని ఓ రైతు నిర్వాహకులతో వాదించాడు. దీంతో సదరు రైతు ధాన్యం డబ్బులను కొంత మేరకు నిర్వాహాకులు చెల్లించారు. ఈ విషయంపై కొంతమందికి అనుమానం రావడంతో సెంటర్లో ధాన్యం బస్తాలపై ఆరా తీశారు. దాతర్పల్లి సెంటర్లో ఎంత ధాన్యాన్ని తీసుకున్నారు, ఎన్ని ట్రక్ షీట్లు అనే వివరాలపై నిర్వాహకులను నిలదీశారు. ఈ క్రమంలో సెంటర్ నుంచి 26000 వేలకు పైగా ధాన్యం బస్తాలు పంపగా, గోదాముల వద్దకు వెళ్లే సమయానికి అదనంగా 400 బస్తాలకు పైగా పెరిగినట్లు గ్రామస్తులకు తెలిసింది. సుమారు 40 మంది రైతులకు నష్టం జరిగిందని, గ్రామానికి చెందిన సెంటర్ నిర్వాహకుడితో రూ.1,50,000 వరకు రైతులకు ఇచ్చే విధంగా మాట్లాడినట్లు సమాచారం. బైక్ చెట్టును ఢీకొని ఇద్దరికి గాయాలుబచ్చన్నపేట : ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్ర సమీపంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన జైదపురం భిక్షపతి, ముక్క పోచయ్య బైక్‌పై బచ్చన్నపేటకు వస్తున్నారు. ఈక్రమంలో బచ్చన్నపేట సబ్‌స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని జనగామకు చికిత్స నిమిత్తం తరలించారు. -
బంగారు ఆభరణాలు చోరీ చేసిన దొంగ అరెస్ట్
మిర్యాలగూడ అర్బన్: మహిళ మెడలో బంగారు ఆభరణాలు చోరీ చేసిన నిందితుడిని మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను శనివారం పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో అడిషనల్ ఎస్పీ రమేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, నారాయణపూర్ గ్రామానికి చెందిన షేక్ నాగుల్‌మీరా (అలియాస్ బిల్లా) ఇంటర్మీడియట్ మధ్యలోనే ఆపేసి బెంగుళూరులో వెల్డింగ్ పనులు చేస్తుండేవాడు. జల్సాలకు అలవాటు పడిన అతడు నరసారావుపేటకు చెందిన చంటితో స్నేహం చేశాడు. అతని ద్వారా పరిచయమైన మరో వ్యక్తితో కలిసి విజయవాడలో చంటి తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టి చంపేశాడు. అంతేకాకుండా గతంలో నాగుల్‌మీరా దాచేపల్లిలో మరో మర్డర్ చేశాడు. ఆంధ్రా, కర్నాటక, తమిళనాడు ప్రాంతాల్లో ఎనిమిది చైన్‌స్నాచింగ్ కేసులు, రెండు రాబరీ కేసులు నమోదై పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. మొత్తం 12కేసుల్లో నిందితుడిగా ఉన్న నాగుల్‌మీరాపై దాచేపల్లిలో రౌడీషీట్ సైతం ఉంది. ఈ నెల 12న ఉదయం మిర్యాలగూడ పట్టణంలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో ఓ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు తన ఇంటి ముందు నిలబడి ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన నాగుల్‌మీరా ఆమెను మాటల్లో పెట్టి మెడలో ఉన్న సుమారు 9తులాల బంగారు ఆభరణాలను లాక్కొని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. ఈ క్రమంలో శనివారం మిర్యాలగూడలోని ఫ్లైఓవర్ వద్ద స్కూటీపై తచ్చాడుతున్న అతడిని చూసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.10లక్షల విలువైన 7.5 తులాల బంగారు ఆభరణాలు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించామని, పోలీస్ కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారణ చేస్తామని అడిషనల్ ఎస్పీ తెలిపారు. సమావేశంలో ఇన్చార్జి డీఎస్పీ రవి, వన్‌టౌన్ సీఐ నాగభూషణరావు, ఎస్ఐలు ప్రవీణ్, వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఫ నిందితుడిపై రెండు హత్య కేసులతోపాటు, 8 చైన్‌స్నాచింగ్ కేసులు ఫ రిమాండ్‌కు తరలించిన పోలీసులు -
కారు ఢీకొని మృతి
భువనగిరిటౌన్ : భువనగిరి బైపాస్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో షియా ముస్లిం సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ రజా హుస్సేన్ (75) మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సయ్యద్ రజా హుస్సేన్ శనివారం భువనగిరి నుంచి రామకృష్ణాపురం రోడ్డులో ఉన్న తన వ్యవసాయ బావి వద్దకు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో బైపాస్ రోడ్డుపై రామకృష్ణాపురం రోడ్డు వైపు మళ్లుతుండగా, హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వేగంగా వెళ్తున్న కారు ఆయన బైక్‌ను బలంగా ఢీకొట్టి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. దీంతో బైక్‌పై ఉన్న రజా హుస్సేన్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని వారు అక్కడి నుంచి పరారయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. అడవిపంది దాడిలో వ్యక్తికి గాయాలుఆలేరురూరల్: ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామానికి చెందిన ఎలుగందుల చక్రపాణి అనే వ్యక్తి శనివారం ఇంటి సమీపంలో పనులు చేస్తుండగా అడవిపంది ఒక్కసారిగా దాడి చేసింది. ఈప్రమాదంలో ఆయన ఎడమ చేయి, కడుపులో తీవ్ర గాయాలయ్యాయి, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పశువులను తరలిస్తున్న వాహనం పట్టివేత చౌటుప్పల్ : అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని చౌటుప్పల్ మండల పరిధిలోని తూప్రాన్‌పేట గ్రామం వద్ద పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని బహదూర్‌పుర ప్రాంతానికి చెందిన మహ్మద్ అలీ(26) శనివారం కోదాడలోని పశువుల సంతలో కొనుగోలు చేసిన ఎద్దులు, ఆవులను తన వాహనంలో ఎక్కించుకున్నాడు. వాటిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. చౌటుప్పల్ మండల పరిధిలోని తూప్రాన్‌పేట గ్రామం వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు పట్టుకున్నారు. వాహనంలో నాలుగు ఆవులు, ఆరు ఎద్దులు ఉన్నాయి. వాహనాన్ని స్వాధీనం చేసుకొని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పశువులను గోశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. -
రాత్రివేళల్లో త్రీఫేజ్ కరెంట్ సరఫరా నిలిపివేత
సాక్షి, యాదాద్రి: రైతులకు అప్పడే కరెంటు కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటి పోగా ఉన్న కొద్దిపాటి నీటితో పంటలు సాగు చేసుకుందామంటే కరెంటు కోతలు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. వ్యవసాయ రంగానికి ఇచ్చే 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా వేళల్లో అధికారులు మార్పులు చేశారు. వారం రోజులుగా రాత్రి వేళల్లో త్రీ–ఫేజ్ కరెంట్‌ను పూర్తిగా నిలిపివేసి.. పగటిపూట మాత్రమే ఇస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తిలో లోటు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.దీంతో బోర్లు, బావులపై ఆధారపడి వేసిన వరి నారుమళ్లు, నాట్లువేసిన పొలాలు నీరందక బీటలు వారుతున్నాయి. దీంతో రైతులు కరెంట్ కోసం సబ్స్టేషన్ల ఎదుట ఆందోళనకు దిగుతున్నారు. గత ఏడాదితో పోల్చితే తగ్గిన వరిసాగు ఈ వానాకాలంలో జిల్లాలో 2,94,255 ఎకరాల్లో వరిసాగు అవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 1,09,934 ఎకరాల్లో వరిసాగు అయ్యింది. ఇందులో మూసీ మండలాలైన బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ, రామన్నపేటలో 57561 ఎకరాలు, సెమీ మూసీ మండలాలైన భువనగిరి, అడ్డగూడూరు, చౌటుప్పల్ మండలాల్లో16,680 ఎకరాలు, నాన్ మూసీ ఆయకట్టులో 35693 ఎకరాల్లో వరిసాగు అయ్యింది. గత సంవత్సరం ఇదే సమయానికి జిల్లాలో 2.23 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. అంటే దాదాపు లక్ష ఎకరాల్లో వరి సాగు తగ్గింది. ఎండిపోతున్న వరిపొలాలు ఎల్‌నినో ప్రభావంతో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. నాన్ ఆయకట్టు ప్రాంతంలో బోర్లు, వ్యవసాయ బావుల కింద విద్యుత్ మోటార్ల ద్వారా వరిసాగు చేస్తున్నారు. ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరాను రాత్రి పూట నిలిపివేసింది. ఉదయం 5:15 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు మాత్రమే త్రీ–ఫేజ్ ఇస్తున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు తాళ్ల ఉప్పల్ రెడ్డి .యాదగిరిగుట్ట కు చెందిన ఈ రైతు ఏడు ఎకరాల్లో వరి సాగు చేశాడు. కొన్ని రోజుల నుంచి రాత్రి సమయంలో త్రీఫేజ్ కరెంట్ సరఫరాలో అంతరాయం కలగడంతో రెండు ఎకరాల పొలానికి నీళ్లు సరిగ్గా అందక ఎండిపోతుంది. దీంతో ఈ ఎండిన పొలాన్ని కాపాడుకోవడానికి, నీళ్లను షిఫ్టింగ్ లాగా మార్చుకుంటున్నాడు. ఆత్మకూర్ఎం మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన మక్తల నరసింహ 15 ఎకరాల వరకు సాగు చేసేవాడు. ప్రస్తుతం నీళ్లు , కరెంటు సక్రమంగా లేక మూడు ఎకరాల్లో వరి నాటు వేశాడు. త్రీఫేజ్ కరెంటు ఉదయం 5 గంటలకు వచ్చి సాయంత్రం ఐదు గంటలకు తీస్తున్నారు. అందులో మధ్యన కరెంటు బంద్ చేస్తున్నారు. అందులోనే ఎల్సీలు తీసుకుంటున్నారు. సుమారు రెండు గంటల పాటు విద్యుత్ అప్పుడప్పుడు తీసివేస్తున్నారు. దీంతో నాటువేసిన వరి చేను ఎండిపోయే దశకు చేరుకుంది. ఫ ఇప్పటికే వర్షాభావంతో ఇబ్బందులు ఫ ఉన్నకొద్దిపాటి నీటితో సాగు చేద్దామంటే కరెంటు కోతలు ఫ బీటలువారుతున్న వరిపొలాలు -
ఈ– కేవైసీ ఇబ్బందులు
భువనగిరిటౌన్ : రేషన్ కార్డుల ఈ–కేవైసీ నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నారులకు ఈ–కేవైసీ చేసే సమయంలో వేలిముద్రలు (ఫింగర్ ప్రింట్స్) రాకపోవడంతో అప్డేట్ కోసం తల్లిదండ్రులు వారిని తీసుకొని ఆధార్ కేంద్రాల వద్దకు వెళ్తున్నారు. శనివారం భువనగిరి పట్టణంలోని ఆధార్ కేంద్రానికి తమ పిల్లలను తీసుకొని వచ్చిన తల్లిదండ్రులు అప్డేట్ కోసం గంటల తరబడి బారులు దీరారు. రేషన్ దుకాణాల్లో ఈ కేవైసీ నమోదు కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆధార్ కేంద్రాలకు రావాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రతి పాఠశాలలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్
భువనగిరిటౌన్ : ప్రతి ప్రభుత్వ పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయురాలిని చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్(బాలల పరిరక్షణ అధికారి)గా నామినేట్ చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.జయరాజు వెల్లడించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయినులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి.మాధవీ లతతో కలిసి పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు.జిల్లా వ్యాప్తంగా 180 మంది ఉపాధ్యాయినులు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ బాధ్యతల్లో ఉన్నారని చెప్పారు. సదస్సులో సంస్థ కార్యదర్శి వి.మాధవీ లత బాలల చట్టాలు, పారా లీగల్ వలంటీర్ల వ్యవస్థ, న్యాయ సేవా సంస్థల విధులపై మాట్లాడారు. స్పెషల్ జడ్జి మిలింద్ కాంబ్లి పోక్సో చట్టం, ఉపాధ్యాయుల బాధ్యతలు, భువనగిరి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి జి.స్వాతి బాల్యవివాహాల నిషేధ చట్టం, అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ షేక్ ఆరీఫ్ జువైనెల్ జస్టిస్ చట్టాన్ని వివరించారు. అలాగే, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి బాలల హక్కులు–సమస్యలపై, ఇన్చార్జ్ సిహెచ్.శ్రీనివాస్ బాధితులకు అందే నష్టపరిహారంపై, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ బండారు జయశ్రీ కమిటీ సేవలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి లింగారెడ్డితో పాటు జిల్లా వ్యాప్తంగా ఎన్నికై న చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఫ జిల్లా ప్రధాన న్యాయముర్తి జయరాజు -
కర్రంటు స్తంభం
నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంభువనగిరి(బీబీనగర్): విద్యార్థులకు నాణ్య మైన విద్యతో పాటు రుచికరమైన ఆహారం, క్రీడా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. శనివారం బీబీనగర్ మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను కలెక్టర్ తనిఖీ చేసి మాట్లాడారు. ఆహార పదార్థాలు నిల్వ ఉంచడంలో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్యామ్‌సుందర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలిసాక్షి, యాదాద్రి : ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోఇ అదనపు కలెక్టర్ చాంబర్లో వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల దష్ట్యా వరికి బదులు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలన్నారు. రైతులకు శాసీ్త్రయ సలహాలు అందిస్తూ, పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఉద్యానవన శాఖ అధికారిణి హేమలత, వ్యవసాయ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. సగటున 60 మంది కూలీలు వచ్చేలా చూడాలిగుండాల : ప్రతి గ్రామంలో సగటున 60 కూలీలు వచ్చేలా చూడాలని డీపీఓ కె.శ్రీనివాస్ రెడ్డి సూచించారు.శనివారం గుండాల మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, వీబీజీ రామ్‌జీ అధికారులు, వీఓలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. జలసిరిలో ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలను భాగస్వాములను చేసి ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవడానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో అదనపు డీఆర్డీఓ జి.సురేష్, డీఎల్పీఓ బి.శ్రీకాంత్ రెడ్డి, ఎంపీడీఓ చండీరాణి, ఎంపీఓ రవూఫ్ అలీ, ఏఈలు దామోదర్, భావన, ఏపీఓ ఇమ్మానియల్, ఏపీఎం వెంకటేశ్వర్లు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. ఆత్మకూరు(ఎం): రహీంఖాన్‌పేటలో ఐదేళ్లుగా విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. సమస్యను పరిష్కరించాలని రైతులు లైన్‌మన్ దృష్టికి తీసుకెళ్లినానిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కర్రనే స్తంభంగా ఏర్పాటు చేసుకున్నారు. -
స్వర్ణగిరీశుడికి లక్ష తులసి సహస్రనామార్చన
భువనగిరి: తొలి ఏకాదశిని పురస్కరించుకుని భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరి క్షేత్రంలో గల వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శనివారం స్వామి వారికి లక్ష తులసి సహస్రనామార్చన నిర్వహించారు. తెల్లవారుజామున స్వామి వారికి సుప్రభాత సేవ అనంతరం మూలవిరాట్‌కు నవకలశ పంచామృతాభిషేకం జరిపించారు. పట్టువస్త్రాలు ధరింపజేసి పుష్పామాలతో అలంకరించారు. తోమాల సేవ, అనంతరం స్వామి వారికి నిత్య కల్యాణ మహోత్సవం నిర్వహించారు. సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ, రాత్రి జలనారాయణ స్వామికి మంగళహారతుల సమర్పన చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక దర్మకర్తలు మానేపల్లి రామారావు, ధర్మకర్తలు మానేపల్లి మురళీ, గోపి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
గంజాయి ముఠా అరెస్ట్
నల్లగొండ: ఒడిశా నుంచి గంజాయి, వీడ్ (హాష్) ఆయిల్‌ను అక్రమంగా తరలించి నల్లగొండలో విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి శనివారం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శుక్రవారం మునుగోడు బైపాస్ రోడ్డులోని ఖాళీ స్థలంలో కొందరు యువకులు గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఎనిమిది మంది నిందితులతో పాటు ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిలో తిప్పర్తి మండలానికి చెందిన కస్పరాజు నాగరాజు ప్రస్తుతం నల్లగొండలోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్నాడు. తిప్పర్తి మండలం ఖాజీరామారం గ్రామానికి చెందిన గంటెకంపు మధు, నల్లగొండలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన చెన్నపాక సుశాంక్, నల్లగొండలోని మాధవనగర్‌కు చెందిన పెండ్ర వాసు, నల్లగొండలోని పాతబస్తీకి చెందిన సయ్యద్ షోయబ్, సూర్యాపేట తాళ్లగడ్డకు చెందిన గంధం శివమణి, అదే మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన చెరుకు దీపక్, జేజేనగర్‌కు చెందిన నకిరేకంటి ధరణికుమార్ ఉన్నారు. అంతేకాకుండా ఒడిశాకు చెందిన మనుకర్, మహబూబాబాద్‌కు చెందిన హరి, నల్లగొండకు చెందిన ఉదయ్, జున్నులు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితులైన కస్పరాజు నాగరాజు, గంటెకంపు మధులపై గతంలో కూడా పలు కేసులు నమోదై ఉన్నాయి. చోరీ చేసిన వాహనాలను ఇచ్చి వాటికి బదులుగా.. త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరంతా ముఠాగా ఏర్పడి బైక్ దొంగతనాలకు పాల్పడుతుండేవారు. ఈ వాహనాలను ఒడిశాలో ఇచ్చి వాటికి బదులుగా గంజాయి, వీడ్ ఆయిల్ తీసుకొచ్చి నల్లగొండలో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుల నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన 5.6 కిలోల గంజాయి, 100 ఎంఎల్ వీడ్ (హాష్) ఆయిల్, 5 బైక్‌లు, 4 సెల్ఫోన్లు, ఒక డమ్మీ తుపాకీ, ఒక చాకు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కేసును ఛేదించిన వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు ముత్తయ్య, సంపత్, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారని తెలిపారు. ఫ ఎనిమిది మంది రిమాండ్, పరారీలో మరో నలుగురు ఫ రూ.10 లక్షల విలువైన గంజాయి స్వాధీనం -
పోలీస్ సిబ్బంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు
యాదగిరిగుట్ట: పోలీసులు విధి నిర్వహణలో ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని ఎస్పీ అక్షాంశ్ యాదవ్ సూచించారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీలక్ష్మీనరసింహ గార్డెన్స్‌లో చావా ఫౌండేషన్, ఆర్కె ఆస్పత్రి, ఎల్బీ నగర్‌లోని కామినేని హాస్పిటల్ సంయుక్తంగా డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో పోలీసులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు బీపీ, షుగర్, ఈసీజీ, టూడీ ఇకో, బీఎండీ పరీక్షలను వైద్యులు నిర్వహించారు. అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం, శారీరక శ్రమ చాలా అవసరమని, దీంతో ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. అంతే కాకుండా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకొని, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలన్నారు. ఆర్కే హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చావా రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి జనరల్ హెల్త్ చెకప్ చాలా అవసరమని, సిబ్బంది పని ఒత్తిడిలో ఆరోగ్యం చాలా నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు, పట్టణ సీఐ భాస్కర్, రూరల్ సీఐ శంకర్‌గౌడ్, హాస్పిటల్ ఇన్చార్జ్ ఎంపల్లి కొండల్ రెడ్డి, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఫ ఎస్పీ అక్షాంశ్ యాదవ్ -
యాదగిరి క్షేత్రంలో తొలి ఏకాదశి
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో తొలి ఏకాదశి వేడుకలను ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారం జరిపించారు. వేకువజామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు పంచామృతాలతో నిజాభిషేకం, తులసీ దళాలతో సహస్ర నామార్చన, అమ్మవారికి కుంకుమార్చన పూజ చేపట్టారు. ఇక తొలి ఏకాదశిని పురస్కరించుకొని ఆలయ ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకులక్ష పుష్పార్చన పూజ నిర్వహించారు. శ్రీలక్ష్మీనృసింహ సహస్రనామార్చనతో వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన పూజను అర్చకులు జరిపారు. పూలతో అలంకృతులైన శ్రీస్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకొని, సువర్ణ పుష్పార్చనపూజల్లో పాల్గొన్నారు. ఏకాదశి రోజున భగవంతుడిని దర్శిస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం అని ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటచార్యులు తెలిపారు. తొలి ఏకాదశి వ్రతాన్ని చేపట్టిన భక్తులకు శ్రీస్వామి వారి అనుగ్రహం ఉంటుందన్నారు. ఈ వేడుకల్లో ఆలయ ఈఓ భవానీ శంకర్, భక్తులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కంది సాగు.. యాజమాన్య పద్ధతులు
అంతర పంటల్లో భాగంగా కందిసాగు చేయడంతో భూసారం పెరుగుతుంది. పంట ఆకులు, వేర్లు, కాండం నేలలో పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేల భౌతిక, రసాయనిక లక్షణాలు మెరుగు పడతాయి. భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి బలంగా, మెత్తగా మారడంతో నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. నీటి వసతి గల ప్రాంతాలలో తొలకరి వర్షాలు పడగానే తక్కువ కాల పరిమితి గల పైర్లు సాగు చేసి దాని తర్వాత కంది పంటను రబీలో కూడా పండించుకోవచ్చు. పెద్దవూర: ఎల్‌నిలో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆరు తడి పంటలైన కూరగాయలు, పప్పు ధాన్యాలు సాగు చేసుకోవాలని సూచిస్తుంది. ఇందులో భాగంగా కందిని పత్తి, వేరుశనగ వంటి పంటల్లో అంతర పంటగానూ, నేరుగా కందినే సాగు చేసుకుని లాభాలను అర్జించవచ్చని మండల వ్యవసాయ అధికారి సత్యనారాయణ పేర్కొంటున్నారు. ప్రభుత్వం కంది పంటకు మద్దతు ధరకు అదనంగా రూ.800 ప్రకటించిందని తెలిపారు. ఆగస్టు 15 వరకు ఈ పంటను సాగు చేసుకోవచ్చని చెబుతున్నారు. కంది సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులపై ఆయన పలు సూచనలు చేశారు. కంది పంటకు అనువైన నేలలు ఎర్ర భూములు, నల్లరేగడి, మురుగు నీరు పోయే వసతి గల నేలలు అనుకూలం. చౌడు, నీటి ముంపునకు గురయ్యే నేలలు కంది పంట సాగుకు పనికిరావు. రకం, పంట కాలం, దిగుబడి ● ఎల్‌ఆర్‌జీ 41 రకం పంట కాలం 180 రోజులు. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. శనగపచ్చ పురుగును బాగా తట్టుకుంటుంది. నల్లరేగడి భూములు అనుకూలం. నీటి వసతితో తేలికపాటి భూములలో కూడా పండించవచ్చు. ● లక్ష్మీ(ఐసీపీఎల్ 85063) రకానికి చెందిన కంది 160 నుంచి 170 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎండుతెగులును కొంతవరకు తట్టుకుంటుంది. ● ఆశ(ఐసీపీఎల్87119) రకం కంది 170 నుంచి 180 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దిగుబడి 7–8 క్వింటాళ్లు వస్తుంది. ప్యూజేరియం ఎండు, వెర్రి తెగుళ్లను తట్టుకుంటుంది. ● మారుతి(ఐసీపీ8863) రకం 155 నుంచి 160 రోజుల్లో చేతికి రానుండగా.. ఎకరాకు 7–8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎండు తెగులును తట్టుకుంటుంది. మాగాణి, గట్ల మీద పెంచేందుకు అనువైన రకం ● డబ్ల్యూఆర్టీ27 రకం పంట కాలం 180 రోజులు. 7–8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. శనగపచ్చ పురుగును కొంత మేర తట్టుకుంటాయి. ● పాలెం కంది(సీఆర్జీ158) పంటకాలం 165–180 రోజులు, ఎకరాకు దిగుబడి 6–7 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్యూజేరియం ఎండు తెగులును తట్టుకుంటుంది. ● సూర్య(ఎంఆర్జీ1004) రకం పంటకాలం 165–180 రోజులు. దిగుబడి 8–9 క్వింటాళ్లు వస్తుంది. ● వరంగల్ కంది53( డబ్ల్యూర్జీ) రకం పంటకాలం 160–180 రోజులు. దిగుబడి 6–8 క్వింటాళ్లు. కాయతొలుచు పురుగును కొంత వరకు తట్టుకుంటుంది. ● ఆర్జీటీ–1(తాండూరు తెల్లకంది) పంట కాలం 145–155 రోజులు, దిగుబడి 5–6 క్వింటాళ్లు వస్తుంది. ఫ్యూజేరియం ఎండు తెగులును తట్టుకుంటుంది. ● డబ్ల్యూఆర్‌జీ–65(రుద్రేశ్వర) పంటకాలం 160–180 రోజులు. దిగుబడి 8–10 క్వింటాళ్లు. ఎండు తెగులు, శనగపచ్చ పురుగును కొంతవరకు తట్టుకుంటుంది. నల్లరేగడి భూములకు అనువైన పంట. ● టీడీఆర్జీ–4(హనుమ) రకం కంది పంట కాలం 160–180 రోజులు. దిగుబడి 8–10 క్వింటాళ్లు. ఎండుతెగులును పూర్తిగా తట్టుకుంటుంది. ● ఐసీసీహెచ్–2740(మన్నెంకొండ కంది) పంటకాలం 170–190 రోజులు, దిగుబడి 8–9 క్వింటాళ్లు. ఎండుతెగులును తట్టుకుంటుంది. విత్తనశుద్ధి మొదటగా విత్తనాలకు థైరామ్ లేదా కాప్టాన్ ఒక కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున పట్టించాలి. ఆ తర్వాత విత్తుకునే ముందు 200 నుంచి 400 గ్రాముల రైజోబియం ఎకరం విత్తనానికి కలిపి విత్తుకోవాలి. వానాకాలంలో నల్లరేగడి భూమిలో సాలుకు, సాలుకు మధ్య 150 లేదా 180 సెం.మీ., ఎర్ర భూముల్లో సాలుకు, సాలుకు 90 లేదా 120 సెం.మీ., మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ దూరం ఉండేలా విత్తుకోవాలి. ఎరువులు పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. వానాకాలంలో 8 కిలోల నత్రజని, 20కిలోల భాస్వరం, యాసంగిలో అయితే 16 కిలోల నత్రజని, 20కిలోల భాస్వరం ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. ఫ ఆగస్టు 15 వరకు ఈ పంట సాగు చేసుకోవచ్చు -
ప్రతి ప్రాజెక్టులో ఇద్దరు విద్యార్థులు
ప్రతి విద్యార్థి తన గైడ్ లేదా టీచర్ మార్గదర్శకత్వంలో తమ ప్రాంతంలో ఉన్న ఒక సామాజిక లేదా పర్యావరణ, వ్యర్థాల నిర్వహణ, వ్యవసాయం, ఆరోగ్యం,ఆహారం, నీటి సంరక్షణ తదితర సమస్యల్లో ఒకటి ఎంపిక చేసుకొని దానిపై పరిశోధనాత్మక ప్రాజెక్టును రూపొందించాలి. ఒక ప్రాజెక్టులో ఇద్దరు విద్యార్థులు గ్రూప్‌గా ఉండాలి. ప్రాజెక్టుల తయారీలో శాసీ్త్రయ పద్ధతితోపాటు సమస్యలకు సంబంధించి కేస్‌స్టడీలు, సర్వేలు,డేటా విశ్లేషణ తదితర సమగ్ర వివరాల ఆధారంగా రూపొందించాలి. పూర్తి వివరాలకు 8555824054 నంబర్‌కు సంప్రదించాలి. –రాజశేఖర్,జిల్లా సైన్స్ అధికారి -
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
త్వరలో ప్రారంభంకానున్న దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 32వ ఎన్సీఎస్సీ కార్యక్రమంలో జిల్లా నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనేలా హెచ్ఎం, టీచర్లు చొరవ చూపాలి. విద్యార్థి దశ నుంచే సామాజిక సమస్యలను అర్థం చేసుకొని ప్రాజెక్టులను తయారు చేసి ప్రదర్శించడం వల్ల భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ఎన్సీఎస్సీ గొప్ప వేదిక. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. టీచర్లు,తల్లిదండ్రులు తమ పిల్లల్లోని శాస్త్రవిజ్ఞానాన్ని ప్రోత్సహించాలి. –బొల్లారం భిక్షపతి, జిల్లా విద్యాధికారి -
గడువులోగా యూనిఫాం అందిస్తాం
సాక్షి, యాదాద్రి : నిర్ణీత గడువులోగా యూనిఫాం కుట్టు పని పూర్తిచేయించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తామని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శుక్రవారం హైదరాబాద్ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిశోర్, సెర్ప్ సీఈఓ దివ్య, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహనన్‌తో కలిసి పాఠశాల యూనిఫాం కుట్టు పనుల పురోగతి, సీజనల్ పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్.. జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ట్లాడారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని వరి మినహా ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి పీవీ రమణారెడ్డి, జిల్లా ఉద్యానవన అధికారి హేమలత తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
‘మధ్యాహ్న’ ఏజెన్సీలపై గుడ్డు భారం తగదు
భువనగిరిటౌన్ : మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు కోడిగుడ్లు పెట్టడం భారంగా మారుతోందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ అన్నారు. ప్రస్తుతం ఇస్తున్న గుడ్డుపై అదనంగా రూ.2లు ఇవ్వాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ అంజిరెడ్డి, డీఈఓ బొల్లారం భిక్షపతికి ఏఐటీయూసీ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కోడి గుడ్డుకు రూ.6 మాత్రమే ఇస్తుండగా, మార్కెట్లో రూ.8 ఉందన్నారు. నెలకు రూ.3 వేల వేతనం పొందే కార్మికులు ప్రతి గుడ్డుపై రూ.2 అదనంగా భరించాల్సి వస్తోందని తెలిపారు. మార్కెట్ రేటు ప్రకారం కోడి గుడ్డు ధర సవరించాలన్నారు. ఎన్నికల హామీ మేరకు రూ.10,000 గౌరవ వేతనం, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా 5వ తేదీలోపు వేతనాలు, బిల్లులు చెల్లించడంతో పాటు గ్యాస్, వంట సామగ్రి ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజనం పథకం జిల్లా ప్రధాన కార్యదర్శి ముంతాజ్ బేగం, నాయకులు రాజమణి, బుచ్చయ్య, శ్యామ్, గీత, బాలమణి, నీలమ్మ, పుష్ప, లలిత, అరుణ, అండాలు, వాణి, సుగుణ తదితరులు పాల్గొన్నారు. -
అర్హుల ఓట్లు మిస్ కాకుండా చూడాలి
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆత్మకూరు(ఎం): రాష్ట్రంలో అర్హులైన వారి ఓట్లు మిస్ కాకుండా చూడడం అధికార పార్టీ బాధ్యత అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆత్మకూరు(ఎం)లోని జేఏఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆలేరు నియోజకవర్గ స్థాయి బీఎల్ఏల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఎల్ఏలు.. బీఎల్ఓలకు క్షేత్రస్థాయిలో సహాయ పడడం, ప్రజలకు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాదాద్రి భువనగిరి జిల్లా అధికంగా 98.5 శాతం ఎన్యుమరేషన్ పూర్తి చేయడం సంతోషకర విషయమన్నారు. ఆత్మకూరు(ఎం) మండలం తుక్కాపురం–మోత్కూరు రోడ్డు పనులు మూడు రోజుల్లో మొదలు పెట్టి నెలలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. రహీంఖాన్‌పేట–రాఘవాపురం బీటీ రోడ్డు, ఆత్మకూరు(ఎం)–కొరటికల్, మొరిపిరాల బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ జిల్లాలో వంద శాతం మ్యాపింగ్ పూర్తిచేసిన బీఎల్ఏలను అభినందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం బీఎల్ఏలకు నగదు ప్రోత్సాహకాలు అందించి సన్మానించారు. కార్యక్రమంలో సర్ భువనగిరి పార్లమెంట్ నియోజక వర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి బసవరాజు సారయ్య, నియోజకవర్గ ఇన్చార్జి లింగంయాదవ్, పీఏసీఎస్ చైర్మన్లు యాస లక్ష్మారెడ్డి, అండెం సంజీవరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కందడి అనంతరెడ్డి, ప్రధాన కార్యదర్శి జన్నాయికోడె నగేష్, మాజీ ఎంపీపీ తండ మంగమ్మ, మాజీ జెడ్పీటీసీ కొడిత్యాల నరేందర్ గుప్తా పాల్గొన్నారు. -
ప్రతిభకు కొలమానం.. బేస్‌లైన్
రామన్నపేట : ప్రభుత్వ పాఠశాలల్లో రెండో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించేందుకు నిర్వహించే తొలి మెట్టు కార్యక్రమం షెడ్యూల్ ఖరారైంది. గతంలో విద్యార్థులకు ఆప్‌లైన్‌లో బేస్‌లైన్ పరీక్ష నిర్వహించేవారు. ఈ ఏడాది మొదటి సారి ఆన్లైన్లో పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఈనెల 25, 27 తేదీల్లో రెండు విడతలుగా బేస్‌లైన్ పరీక్ష నిర్వహిచంనున్నారు. విద్యా ప్రమాణాలను మెరుగునకే.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసి వారి బలాలు, బలహీనతలను గుర్తించేందుకు విద్యా శాఖ బేస్‌లైన్ పరీక్షకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో 2 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 13,918 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష ఫలితాల ఆధారంగా విద్యార్థులకు అవసరమైన ప్రత్యేక బోధనను అందించి, విద్యా ప్రమాణాలను మెరుగు పరచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. సామర్థ్యాలు గుర్తించేది ఇలా.. ● బేస్‌లైన్ పరీక్ష నిర్వహించడం ద్వారా ప్రాథమిక తరగతుల విద్యార్థులకు రెండు లాంగ్వేజెస్ (తెలుగు, ఇంగ్లిష్)లను చదవడం, రాయడం, చదివింది అర్థం చేసుకోవడం, వంటి భాషా నైపుణ్యాలను పరీక్షిస్తారు. ● సరళ పదాలు, గుణింతాలు, ఒత్తుల పదాలు, వాక్యాలు, పేరాలను నిర్దిష్ట వేగంతో తప్పులు లేకుండా చదివే సామర్థ్యాలను అంచనా వేస్తారు. ● గణితం విషయంలో 1, 2 తరగతుల విద్యార్థులకు సంఖ్యలను గుర్తించడం, కూడికలు, తీసివేతలు 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారం అంశాలపై పరీక్ష ఉంటుంది. ● పాఠ్యాంశాల ఆధారంగా కనీస సామర్థ్యాలను పరీక్షించే ప్రశ్నలు ఇచ్చి విద్యార్థులతో పరీక్ష రాయిస్తారు. పరీక్ష కోసం ప్రశ్నపత్రాలను ఇప్పటికే ఆన్లైన్లో జిల్లాలకు, మండలాలకు పంపించారు. పరీక్షల రోజున ఉపాధ్యాయులను లింక్ ద్వారా ప్రశ్నప్రతం ఓపెన్‌చేసి పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలు పూర్తయిన అనంతరం ఫలితాలను తెలంగాణ ఎడ్యుకేషన్ యాప్‌లో నమోదు చేయనున్నారు. ఆ వివరాలను ఎస్సీఈఆర్టీఈ విశ్లేషించి విద్యార్థుల అభ్యాస లోపాలను గర్తిస్తుంది. లోపాల నివారణకు ప్రత్యేక ఽభోధన, శిక్షణ కార్యక్రమాలు అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. తద్వారా ప్రతీ విద్యార్తి అభ్యాస స్థాయి స్పష్టంగా తెలిసి విద్యా ప్రమాణాల పెంపునకు మార్గం సుగమం కానుంది. ఫ 2 నుంచి 5వ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫ ‘తొలిమెట్టు’లో భాగంగా నేడు, ఎల్లుండి ఫ మొదటి సారి ఆన్లైన్లో నిర్వహణ ఫ ఫలితాల ఆధారంగా ప్రత్యేక బోధన -
పరిశోధనల దిశగా అడుగులేద్దాం
ఆలేరు, ఆలేరు రూరల్ : విద్యార్థుల్లోని శాసీ్త్రయ నైపుణ్యాలను వెలికితీసేందుకు 32వ జాతీయ బాలల విజ్ఞాన సదస్సు (ఎన్సీఎస్సీ) సన్నద్ధమైంది. స్థానిక సమస్యలకు పరిష్కారం చూసేలా రూపొందించే వినూత్న ప్రాజెక్టులను ఆహ్వానిస్తోంది. 10 నుంచి 17 ఏళ్ల విద్యార్థులు ఈ నెల 31లోగా ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని, జిల్లా నుంచి అత్యధిక ప్రాజెక్టులు వెళ్లేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలని జిల్లా విద్యా శాఖ కోరుతోంది. 2026–27 విద్యా సంవత్సరానికి.. విద్యార్థులకు కేవలం పుస్తక విజ్ఞానమే కాకుండా, ప్రయోగాత్మక పరిశోధనలపై మక్కువ పెంచేందుకు, వివిధ సామాజిక సమస్యలకు పరిష్కారం కనుగొనేలా ప్రేరేపించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 2026–27 విద్యా సంవత్సరానికి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్(నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్) నిర్వహిస్తుంది. ఇందులో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, గురుకులాలు, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ స్కూళ్ల విద్యార్థులను భాగస్వామ్యులను చేసేందుకు జిల్లా విద్యా శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్స్ టీచర్లతో సమన్వయం చేస్తూ జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొనేలా అవగాహన కల్పిస్తున్నారు. ● జూనియర్, సీనియర్ గ్రూప్‌లు 6వ తరగతి నుంచి ఇంటర్ చదివే 10–17 ఏళ్ల విద్యార్థులు ఎన్సీఎస్సీలో పాల్గొనేందుకు అర్హులు. ఎన్సీఎస్సీలో పాల్గొనే విద్యార్థులను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. 10–14ఏళ్ల విద్యార్థులను జూనియర్ గ్రూపు, 14 –17 ఏళ్ల విద్యార్థులను సీనియర్ గ్రూప్‌గా విభజిస్తారు. ● ప్రాజెక్టుల ఎంపిక.. మొదట జిల్లా స్థాయిలో జరిగే పోటీల్లో ఎంపికై న ప్రాజెక్టులను ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి, రాష్ట్రస్థాయిలో ఉత్తమమైన ప్రాజెక్టులను జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. ● స్టూడెంట్ రిజిస్టర్.. ఎన్సీఎస్సీలో పాల్గొనేందుకు n-csc.in పోర్టల్ స్టూడెంట్ రిజిస్టర్ చేసుకోవాలి. టీచర్/గైడ్ లేదా విద్యార్థి ఈ–మెయిల్లో వివరాలను ఓటీపీతో నమోదు చేసుకోవాలి. వివరాల నమోదుకు ఈనెల 31 చివరి తేదీ. ఫ సమస్యను గుర్తించు.. పరిష్కారాన్ని ఆవిష్కరించు ఫ భావి శాస్త్రవేత్తలకు సువర్ణావకాశం ఫ వినూత్న ప్రాజెక్టులకు సైన్స్ కాంగ్రెస్ పిలుపు ఫ నమోదుకు 31వ తేదీ వరకు గడువు -
23,400 ఓట్లు తొలగింపే!
సాక్షి, యాదాద్రి : ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అయితే నకిలీ ఓట్ల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. జిల్లాలో పల్లెలు, పట్టణాల్లో ఓటుహక్కు కలిగి ఉన్నవారు, హైదరాబాద్‌లోనూ ఉన్నవారి పేర్లను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. నియోజకవర్గాల శివారులో ఉన్న చాలామందికి రెండు ఓట్లు ఉన్నాయి. గ్రామంలో ఓటు ఉంచుకోవాలా.. లేదా అనే మీమాంసలో ఇంకా కొందరు ఉన్నారు. మొత్తం ఓటర్లలో హాజరు కాని, వలసలు, మరణించిన, రెండుచోట్ల ఓట్లు ఉన్న ఓటర్ల సంఖ్యపై ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. పైనాలుగు కేటగిరీలను కలిపి ఓకే జాబితాగా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ వివరాలన్నీ పూర్తి చేస్తే ఓటర్ల జాబితా ప్రక్రియ ఓ కొలిక్కి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఆగస్టు 3న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. జాగ్రత్తగా తొలగింపు జాబితా జిల్లాలో హైదరాబాద్‌తోపాటు మున్సిపల్ కేంద్రాలు, గ్రామాలో్‌ల్ రెండు, మూడు చోట్ల ఓటు హక్కుఉన్న వారిని, శాశ్వతంగా వలస వెళ్లిన వారిని, చనిపోయిన వారిని గుర్తిస్తూ డిజిటౖలైజేషన్ చేసి తొలగింపు జాబితాను జాగ్రత్తగా రూపొందిస్తున్నారు. మరణించిన వారి వివరాలను పరిశీలించి ఇంటి యజమాని లేదా కుటుంబ సభ్యుల నుంచి సంతకం తీసుకున్న తర్వాతే ఓటు తొలగిస్తున్నారు. ఇల్లు మారినా, అద్దెకు ఉండి ఇల్లు ఖాళీచేసి వెళ్లిపోయిన వారి వివరాలను ఇంటి యజమాని నుంచి వివరాలను సేకరిస్తున్నారు. రాజకీయ పార్టీల బీఎల్ఏల సమక్షంలో బీఎల్ఓలు విచారణ జరిపి వారి సమక్షంలో ఓట్లను తొలగిస్తున్నారు. జిల్లాలో డబుల్ ఓటర్లు, వలసలు, మృతిచెందిన వారి జాబితా ప్రకారం 23,400 వరకు ఓటర్ల ఫారాలు తిరిగి రాలేదు. ఇందులో భువనగిరి నియోజకవర్గంలో 11,400, ఆలేరు నియోజకవర్గంలో 12వేల మంది ఓటర్లు ఉన్నారు. రెండు ఓట్ల భయంతో వెనుకంజ జిల్లాలో పలువురికి రెండు, మూడు ఓట్ల భయం పట్టుకుంది. డీ. డూప్లీకేట్ సాప్ట్ వేర్ ద్వారా రెండు ఓట్ల గుర్తింపు జరుగుతోంది. ఒకటి అంతకంటే ఎక్కువ చోట్ల ఓటరు ఫారాలు సమర్పిస్తే అధికారులు ఫారం డిజిటలైజ్ చేసే సమయంలో దొరికిపోతారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రెండుచోట్ల ఓట్లు నేరం. ఈ భయంతో చాలా మంది ఓట ర్లు తమ ఫారాలు ఇవ్వడానికి వెనుకాడుతున్నారు. ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ నియోజకవర్గం ఓటర్లు డిజిటలైజేషన్ భువనగిరి 2,21,903 1,99,444 ఆలేరు 2,38,040 2,25,197 ఫ ఆలేరు నియోజకవర్గంలో 12 వేలు.. భువనగిరిలో 11,400 ఓట్లు తొలగింపు జాబితాలోకి.. ఫ తుది దశకు ఎన్యుమరేషన్ ప్రక్రియ ఫ ఆగస్టు 3న ముసాయిదా విడుదల మొత్తం ఓటర్లు 4,59,943డిజిటలైజేషన్ 4,35,689తిరిగిరాని ఫారాలు 23,400 -
రెండు నెలల్లో రోడ్డు పనులు పూర్తిచేయండి
మోత్కూరు: మరో రెండు నెలల్లో మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో నిలిచిపోయిన రాజన్నగూడెం రహదారి పనులు పూర్తి కావాలని, లేనిపక్షంలో ఉపేంక్షించేది లేదని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను, కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు. శుక్రవారం మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో నిలిచిపోయిన మోత్కూరు–రాజన్నగూడెం రోడ్డు పనులను శుక్రవారం ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి పరిశీలించి మాట్లాడారు. రూ.5.80 కోట్ల నిధులతో చేపట్టిన రహదారి మూడేళ్లుగా అసంపూర్తిగా ఉండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా ఇప్పటికే జరిగిన ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఇకపై పనుల్లో ఎలాంటి జాప్యానికి అవకాశం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు పూర్తి చేసిన వెంటనే కాంట్రాక్టర్‌కు బిల్లులు వచ్చేలా తానే స్వయంగా బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. మంత్రి వెంట ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ రాంబాబు, ఈఈ సరిత, డీఈఈ సురేందర్, ఏఈ మెంట స్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, డీసీసీ ఉపాధ్యక్షుడు వంగాల సత్యనారాయణ, మాజీ ఉపాధ్యక్షుడు పైళ్ల సోమిరెడ్డి, కౌన్సిలర్ కారుపోతుల వెంకన్న తదితరులు ఉన్నారు. -
‘సర్’పై అప్రమత్తంగా ఉండాలి
ఫ డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య భువనగిరిటౌన్ : సమగ్ర ఓటు సవరణ (సర్) ప్రక్రియ పట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్, డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య సూచించారు. శుక్రవారం భువనగిరిలో నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. అనంతరం బూతుల వారీగా నిర్వహించిన సమీక్షలో ఓటర్ల జాబితా పరిశీలన, సవరణలపై పలు కీలక సూచనలు చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, సర్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ తంగెళ్లపల్లి శ్రీవాణిరవికుమార్, వైస్ చైర్పర్సన్ పోతంశెట్టి మంజులవెంకటేశ్వర్లు, కాంగ్రెస్ కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర బృందం సందర్శనభువనగిరిటౌన్ : జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న జిల్లా మహిళా సమాఖ్య (ఇందిరా మహిళా శక్తి) భవనాన్ని కేంద్ర ఎన్ఆర్ఎల్ఎం (జాతీయ గ్రామీణ జీవనోపాధుల సంస్థ) బృందం సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టి.నాగిరెడ్డి, కేంద్ర బృందం సభ్యులకు భవన నిర్మాణ పనుల పురోగతితోపాటు పలువ విషయాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ నవీన్, నేషనల్ రిసోర్స్ పర్సన్ గిరీష్ ప్రధాన్, మిషన్ మేనేజర్ మహ్మద్ హసన్, అడిషనల్ డీఆర్డీఓ జంగారెడ్డి, డీపీఎంలు స్వర్ణలత, కరుణాకర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఫ్లెక్సీల తొలగింపుపై బీఆర్ఎస్ ఆందోళన ఆలేరు : కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆలేరు పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను శుక్రవారం మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఫ్లెక్సీలు తొలగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు బస్టాండ్ వెళ్లే రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఇతర పార్టీల ఫ్లెక్సీలు నెలల తరబడి అలాగే ఉన్నా తొలగించకుండా మూడు రోజుల క్రితం ఏర్పాటు చేసిన తమ ఫ్లెక్సీలను తొలగించడం ఏంటని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు వింటూ మున్సిపల్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వివమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పంతం కృష్ణ, పాకాల హరీష్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
‘నా నియోజకవర్గానికి వస్తే మీకు మర్యాద దక్కదు’
యాదాద్రి: కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్‌పై సొంత పార్టీకే చెందిన ఎమ్మెల్యే మందుల సామేల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనకు సమాచారం లేకుండా తన నియోజకవర్గంలో అడుగుపెట్టే అధికారం ఎవరిచ్చారంటూ మండిపడ్డారు. ప్రొటోకాల్ పాటించాలని తెలియదా, తన నియోజకవర్గానికి వస్తే మర్యాద దక్కదంటూ హెచ్చరించారు. రెండు కిలోమీటర్ల రోడ్డు కోసం మంత్రి కోమటిరెడ్డి చుట్టూ వందసార్లు తిరిగాను. ఆర్ అండ్ బీ మినిస్టర్‌గా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏం చేశారు?, రాజగోపాల్‌రెడ్డికి తుంగతుర్తి గురించి ఎందుకు?, నా నియోజకవర్గం జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ వస్తే ప్రొటోకాల్ పాటించాలని తెలియదా?, నాకు సమాచారం లేకుండా నా నియోజకవర్గంలో అడుగుపెట్టే అధికారం నీకు ఎవరు ఇచ్చారు. మీ నియోజకవర్గాల్లో మీ సక్కదనం చూసుకోండి. మీ దగ్గర మేం చేతులు చాపలేదు. తుంగతుర్తిలో మందుల సామేలే ఉంటాడు ఖబర్దార్. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఎందుకు చేరాడో సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ సోనియా గాంధీని రాజగోపాల్ తిట్టాడు. పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డి నికార్సైన కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు. తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల గురించి మాట్లాడితే సహించే ప్రసక్తే లేదు. ముందు మీ నియోజకవర్గాల సంగతి చూసుకోండి’ అంటూ విమర్శించారు. -
యాదగిరీశుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. తెల్లవారు జామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యా లను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
ఆయిల్‌పామ్ సాగు ఎంతో శ్రేయస్కరం
మోటకొండూర్ : ఎల్‌నినో ప్రభావంతో రైతులు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగు చేయడం ఎంతో శ్రేయస్కరం అని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి స్రవంతి సూచించారు. బుధవారం మోటకొండూర్‌లోని రైతు పద్మారెడ్డి ఆయిల్ పామ్తోటను సందర్శించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎకరం వరి సాగుకు ఉపయోగించే నీటితో 5 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయవచ్చన్నారు. కార్యక్రమంలో ఆయిల్‌ఫెడ్ జిల్లా మేనేజర్ పి. ప్రవీణ్‌రెడ్డి, పద్మారెడ్డి, అంజిరెడ్డి, పన్నాల ప్రతాప్‌రెడ్డి, వెంకటేష్, నోముల నర్సిరెడ్డి, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
నేడు మంత్రి కోమటిరెడ్డి రాక
మోత్కూరు: రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం ఉదయం 11 గంటలకు మోత్కూరు మండలంలో పర్యటించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు పైళ్ల సోమిరెడ్డి తెలిపారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ఏలుగు సందీప్ కుటుంబ సభ్యులు, మాజీ ఎంపీటీసీ ఎలుగు పార్వతమ్మ–యాదయ్య దంపతులను మంత్రి పరామర్శించనున్నట్లు చెప్పారు. అనంతరం రాజన్నగూడెం–మోత్కూరు రహదారిని పరిశీలించి ఆర్అండ్బీ అధికారులతో సమీక్షించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. బీఎల్ఓలు, సూపర్వైజర్ల గౌరవ వేతనం విడుదలసాక్షి, యాదాద్రి: ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేసే బీఎల్ఓలు, సూపర్ వైజర్ల గౌరవ వేతనం రూ.53.83 లక్షలను ఎన్నికల సంఘం విడుదల చేసినట్లు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. వెంకారెడ్డి వెల్లడించారు. జిల్లాలో ఉన్న 566 మంది బీఎల్ఓలు, 57 మంది బీఎల్ఓ సూపర్ వైజర్ల బ్యాంకు ఖాతాల్లో ఈ వేతాలు జమ చేస్తామని తెలిపారు. బీఎల్ఓలకు ఆగస్టు 2025 నుంచి మార్చి 2026 వరకు 8 నెలలవి.. నెలకు రూ.500 చొప్పున మొత్తం రూ. 22.64 లక్షలు, ఏప్రిల్ 2026 నుంచి జూలై 2026 వరకు 4 నెలలవి.. నెలకు రూ. 1,000 చొప్పున మొత్తం రూ. 22.64 లక్షలు వచ్చినట్లు వివరించారు. బీఎల్ఏ సూపర్ వైజర్లకు జూలై 2025 నుంచి మార్చి 2026 వరకు 9 నెలలవి నెలకు రూ.1,000 చొప్పున మొత్తం రూ.5.13 లక్షలు, ఏప్రిల్ 2026 నుంచి జూలై 2026 వరకు 4 నెలలవి నెలకు రూ. 1,500 చొప్పున మొత్తం రూ. 3.42 లక్షలు వచ్చినట్లు తెలిపారు. నేడు విద్యా సంస్థల బంద్భువనగిరి: ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ శుక్రవారం విద్యా సంస్థల బంద్ నిర్వహించనున్నట్లు ఎన్ఎస్యూఐ నాయకులు సురుంగ చందు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బంద్‌కు విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. నీట్ పేపర్ లీకేజీ పై ఢిల్లీలో జరుగుతున్న నిరసనలో భాగంగా యువత, విద్యార్థులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయంగా మునగ సాగు మేలు యాదగిరిగుట్ట రూరల్ : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా మునగ సాగు చేయడం మేలని, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని డీఆర్డీఓ నాగిరెడ్డి సూచించారు. గురువారం యాదగిరిగుట్ట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో తడి, పొడి చెత్తలతో పాటుగా, హానికరమైన, ప్రత్యేక జాగ్రత్త కలిగిన చెత్తలను సేకరించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ నవీన్ కుమార్, తహసీల్దార్ గణేష్ నాయక్, ఎంపీఓ దినకర్, ఏపీఓ నర్సయ్య, ఈసీ రాజశేఖర్, పీఆర్ఏఈ రాకేష్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. త్వరలో మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులు పూర్తిమోత్కూరు : త్వరలో మిషన్‌భగీరథ పైప్‌లైన్ పనులు పూర్తి చేయాలని మోత్కూరు మున్సిపల్ కమిషన్ గోల్కొండ నర్సయ్య సూచించారు. మోత్కూరు పట్టణంలోని పెద్ద చెరువు కట్టపై సాగుతున్న రోడ్డు మరమ్మతుల కారణంగా డ్యామేజ్ అయిన మిషన్ భగీరథ పైపు లైన్ ను గురువారం మిషన్ భగీరథ డీఈ నరసింహారావుతో కలిసి ఆయన పరిశీలించారు. వారి వెంట మిషన్ భగీరథ ఏఈ నితిన్‌రెడ్డి, మున్సిపల్ వాటర్ సప్లయ్ ఇన్చార్జ్ నరసింహాచారి తదితరులు ఉన్నారు. -
భోంగీర్ కాదు.. భువనగిరి
సాక్షి, యాదాద్రి : చారిత్రక ప్రాశస్త్యం ఉన్న భువనగిరి పేరు తన అస్థిత్వాన్ని కోల్పోతోంది. కొందరి నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ రికార్డులు, రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్సుల డిజిటల్ బోర్డులపై ‘భోనగిరి’, ‘భోంగీర్’ అని తప్పుగా రాస్తుండటంతో తీవ్ర గందరగోళం నెలకొంది. సోషల్ మీడియా ప్రభావంతో ఈ తప్పు మరింతగా ప్రచారమవుతూ అసలు పేరు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. దీనివల్ల భవిష్యత్తులో విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో సాంకేతిక సమస్యలు వస్తాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే గెజిట్‌లో అధికారికంగా భువనగిరిగా పేరును సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏఐ అనువాదాలు.. డిజిటల్ బోర్డుల గందరగోళం ఇటీవల వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ బస్సులు, డిజిటల్ సైన్ బోర్డులలో కృత్రిమ మేధ అనువాదాల వల్ల తీవ్ర తప్పిదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ గెజిట్‌లో పాత ఆంగ్ల స్పెల్లింగ్ ఉందనే సాకుతో ఆర్టీసీ బస్సు బోర్డులపై ఏఐ ట్రాన్స్లేషన్ వాడటం వల్ల భోంగీర్ఙ్ అని అర్థం లేని పదాలు వస్తున్నాయి. మున్సిపాలిటీలు, ఎకై ్సజ్, పోలీస్, స్థానిక రెవెన్యూకార్యాలయాలు, ప్రైవేట్ పాఠశాలల ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ల వరకు ప్రతీ చోటా ఒకే ఊరికి వేర్వేరు స్పెల్లింగ్‌లతో కూడిన పేరు వాడటం పరిపాటిగా మారింది. అధికారిక గెజిట్‌లో భోంగీర్ అనే ఇంగ్లీష్ రికార్డును భువనగిరి మార్చాలి. ముందుగా మున్సిపాలిటీ, జిల్లా పరిషత్ సమావేశాల్లో ఏకగ్రీవంగా తీర్మానాలు చేయాలి. ఈ తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వం, రెవెన్యూశాఖ ద్వారా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపాలి. రైల్వే స్టేషన్లలో పేరు మార్పునకు కేంద్ర అనుమతి అవసరం. గెజిట్ మారితే ఆధార్‌కార్డులు, గూగుల్ మ్యాప్స్, రైల్వేకోడ్లు అన్ని మారుతాయి. ఈ ప్రాంతం పూర్వ వైభవం చాటుకోవాలంటే భువనగిరి గా నమోదు కావాల్సిందే. – శ్రీచంద్ర, చిత్రకారుడు, జర్నలిస్ట్ రైల్వే స్టేషన్ బోర్డులపై హిందీ, తెలుగులో భువనగిరి అని ఉన్నప్పటికీ, ఇంగ్లిష్‌లో వచ్చేసరికి భోంగీర్ అని దర్శనమిస్తోంది. ఆర్టీసీ డిపోలు, బస్సు బోర్డులపై కూడా తప్పుడు పేర్లే రాజ్యమేలుతున్నాయి. విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగుల పాస్‌పోర్టులు, వీసాలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో సాంకేతిక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. – అశోక్ ఈ సాంకేతిక, చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దాలని ఇటీవల కలెక్టర్‌ను కలసి విన్నవించాం. స్పందించిన కలెక్టర్.. త్వరలోనే అన్ని డిపార్ట్మెంట్లకు ఒక స్పష్టమైన సర్క్యులర్ జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తాం. భువనగిరి ఎంపీ ద్వారా పార్లమెంట్లో ప్రస్తావించి, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ప్రధానంగా రైల్వే శాఖ రికార్డుల్లోనూ భువనగిరిగా మార్పులు తీసుకురావాలని కోరుతాం. – గోట్టిపాముల బాబురావు, న్యాయవాదియూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లు గుట్టపైకి వచ్చి చేసే వీడియోలలో భువనగిరి కి బదులుగా భోంగీర్, భోనగిరి అని పలు రకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఈ తప్పుడు పదం మరింత వైరల్ అవుతోంది. దీనివల్ల రాబోయే తరం, పాఠశాల విద్యార్థులు తమ సొంత ఊరి అసలు పేరునే మరిచిపోయే పరిస్థితి దాపురిచింది. చారిత్రక నేపథ్యం ఉన్న భువనగిరిని పేరును కాపాడుకోవాలిన అవసరం ఉంది. – మెరుగు మధుసూదన్, బీడీఎఫ్,ప్రభుత్వ రికార్డుల్లో ఇంగ్లిష్ స్పెల్లింగ్‌పై తీవ్ర గందరగోళం ఫ అసలు పేరు స్థానంలో భోంగీర్, భోనగిరి ఫ ఆర్టీసీ, రైల్వే స్టేషన్ల బోర్డుల్లోనూ తప్పులే ఫ అస్థిత్వం కోల్పోతున్న చారిత్రక పేరు ఫ గెజిట్‌లో సవరించాలని మేధావుల డిమాండ్ -
విద్యార్థి బరువు కంటే
భువనగిరి: ఆడిపాడే వయసులో బడి సంచుల మోతతో చిన్నారులు కుంగిపోతున్నారు. విద్యార్థులపై పుస్తకాల భారం తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నో బ్యాగ్ డే నిబంధనలు జిల్లాలో అపహాస్యమవుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు, సీబీఎస్ఈ స్కూళ్లలో పుస్తకాల మోతతో పిల్లలు రోజూ 5 నుంచి 8 కిలోల బరువు మోయాల్సి వస్తోంది. ఫలితంగా చిన్న వయసులోనే వెన్నెముక, మెడ నొప్పుల బారిన పడుతూ భవిష్యత్తులో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదంలో పడుతున్నారు. సీబీఎస్ఈ, ప్రైవేటులోనూ.. జిల్లాలోని సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్ ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రతి సబ్జెక్టుకు పాఠ్యపుస్తకాలు, క్లాస్వర్క్స్, హోంవర్క్, వర్క్‌బుక్, అసైన్బుక్, ప్రాక్టీస్ బుక్ పేరిట ఐదు నుంచి ఆరు పుస్తకాలను తీసుకురావాలని సూచిస్తున్నారు. దీంతో చిన్నారులు రోజూ 5 నుంచి 8 కిలోల వరకు బరువున్న బ్యాగులను మోయాల్సి వస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. నెలలో ఒక రోజు అమలు లేదు జాతీయ విద్యా ప్రణాళిక–2005, స్కూల్ బ్యాగ్–2020 విధానంలో పుస్తకాల సంచిపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. నెలలో ఒక రోజు పుస్తకాల సంచి నుంచి విముక్తి(నో బ్యాగ్‌డే) కల్పించాలని సూచించారు. రాష్ట్ర విద్యా శాఖ సైతం ఆమోదించింది. ప్రతి నెలా మూడో శనివారం అమలు చేయాలని నిర్ణయించినా జిల్లాలో ఎక్కడ ఆ ఊసేలేదు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు అధిక బరువు ఉన్న బ్యాగులను రోజూ మోయడంతో చిన్నారుల్లో మెడ, నడుము నొప్పితోపాటు వెన్నెముక పై ఒత్తిడి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. చిన్న వయస్సులోనే శరీర భంగిమలో మార్పులు రావడంతో పాటు కండరాల పై అధిక ఒత్తిడి ఏర్పడి భవిష్యత్తులో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. విద్యార్థులు అధిక పుస్తకాలతో కూడిన బ్యాగు మోయడం వారి వెన్ను పూస పై ప్రభావం చూపుతుంది. మోకాళ్ల నొప్పులు వస్తాయి. త్వరగా అలిసిపోతారు.చిన్నారుల వయస్సుకు అనుగుణంగానే బరువు మోయాలి. అంతకు మించి బరువు మోస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి. – కిరణ్, ఎముకల వైద్య నిపుణుడుఫ అధిక బరువు గల పుస్తకాల సంచితో అనర్థాలు ఫ పిల్లల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం ఫ పాఠశాలల్లో అమలుకు నోచని నోబ్యాగ్ డే వివిధ విద్యా సంస్థల్లో తరగతుల వారీగా విద్యార్థులు మోస్తున్న పుస్తకాల బరువు(కిలోల్లో) తరగతి కేంద్రీయ సీబీఎస్ఈ ప్రైవేటు ప్రభుత్వ 1 2.4 3.8 3.5 1.8 2–5 4.5 5.8 8.0 5.0 6–8 6.4 6.7 7.2 5.6 9–10 8.5 7.2 8.2 6.5 తరగతుల ప్రకారం ఉండాల్సిన పుస్తకాల బరువు (కిలోల్లో) తరగతులు బరువు 1, 2 1.5 –2 3–5 2 –3 6, 7 4 9,8 4.5 10 5 -
రక్తదానం.. ప్రాణదానంతో సమానం
సాక్షి యాదాద్రి : రెడ్ క్రాస్ ద్వారా చేసే రక్తదానం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానంతో సమానమని అదనపు కలెక్టర్లు వెంకారెడ్డి, భాస్కర్ రావు పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో వారు మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు విధులతో పాటు సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఒత్తిడితో కూడిన ఉద్యోగ బాధ్యతల మధ్య సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. కలెక్టర్ అనురాగ్ జయంతి చొరవతో ఉద్యోగులు రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమని రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ జి.లక్ష్మీనరసింహారెడ్డి అన్నారు. హైదరాబాద్ విద్యానగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ బృందం నిర్వహించిన ఈ శిబిరంలో 53 మంది ఉద్యోగులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ రావు, డీఆర్ఓ జయమ్మ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ కృతిక, ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, టీఎన్జీవోస్ నాయకులు ఉపేందర్ రెడ్డి, భగత్, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, రెడ్ క్రాస్ ప్రతినిధులు మహేందర్ రెడ్డి, బాలాజీ, ఇన్నర్ వీల్ అధ్యక్షురాలు స్వాతి పాల్గొన్నారు. -
నిర్దేశిత గడువులోగా హైవే–65 పనులు
సాక్షి, యాదాద్రి: హైదరాబాద్ –విజయవాడ జాతీయ రహదారి– 65 విస్తరణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో రోడ్ సేఫ్టీపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. హైదరాబాద్– విజయవాడ మార్గంలో ప్రమాదాలు నివారించాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారుల వెంట భారీ వాహనాలు, ట్రక్కులు పార్కింగ్ చేయవద్దని సూచించారు. రోడ్డుపై ఆక్రమణలు జరగకుండా చూడాలని సూచించారు. టాస్క్ ఫోర్స్ టీంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ప్రమాదాలకు గురయ్యే బ్లాక్ స్పాట్లను గుర్తించాలన్నారు. రహదారులపై అవసరమైన చోట హెచ్చరిక బోర్డులు, స్పీడ్ లిమిట్ బోర్డులు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. మాదకద్రవ్యాల రవాణాపై నిరంతర నిఘా మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై నిరంతరం నిఘా ఉండాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన మత్తు పదార్థాల నిరోధక కమిటీ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో ఒకటి, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏడు కేసులు నమోదుచేశారన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి,అదనపు ఎస్పీ లక్ష్మీ నారాయణ , అధికారులు పాల్గొన్నారు. ఫ రోడ్ సేఫ్టీ సమావేశంలో కలెక్టర్ అనురాగ్ జయంతి -
విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యం
యాదగిరిగుట్ట: విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని దేవాదాయశాఖ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని బీసీ కాలనీలో ఉన్న ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని ఆమె గురువారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం, సురక్షితమైన వసతి కల్పించడం అధికారుల బాధ్యత అని సూచించారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మౌలిక సదుపాయాలన్ని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, విద్యార్థినుల ఆరోగ్యం, విద్య, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి, విద్యార్థినులకు మెరుగైన సౌకర్యాలు అందించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వసతి గృహంలోని విద్యార్థినుల విశ్రాంతి గదులు, భోజనశాల, వంటగది, నిల్వ ఉంచిన బియ్యం, పప్పులు, నూనె తదితర వంట సరుకులు, కూరగాయల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, పరిశుభ్రత, విద్యుత్ సదుపాయం, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆమె వెంట తహసీల్దార్ గణేష్ నాయక్, ఎంపీడీఓ నవీన్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ చీర శ్రీశైలం, బాలికల హాస్టల్ అధికారిని సోని తదితరులున్నారు. ఫ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ -
‘సర్’లో పేరు నమోదైందో లేదో తెలుసుకోండిలా..
పెద్దవూర : రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ(సర్) వేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఓటర్లు సర్‌లో తమ వివరాలు నమోదయ్యాయో లేదో తెలుసుకునేందుకు బీఎల్ఓలను సంప్రదిస్తున్నారు. అయితే ఇంట్లోనే మొబైల్ ఫోన్‌తో కేవలం ఒక ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఓటు వివరాలు సర్‌లో నమోదయ్యాయో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవాలంటే.. మొబైల్ ఫోన్లో మెసేజ్ ఓపెన్ చేసి ఇంగ్లిష్‌లో ఈసీఐ అని టైప్ చేసి ఆ తర్వాత స్పేస్ ఇచ్చి ఓటరు గుర్తింపు కార్డు నంబర్(ఉదా. ECI ABC123456) టైపు చేసి 1950 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. వెంటనే ఎన్నికల కమిషన్ నుంచి మీ ఓటుకు సంబంధించిన వివరాలతో ఎస్ఎంఎస్ వస్తుంది. ఇలా వివరాలు వస్తే మీ పేరు సర్ ప్రక్రియలో నమోదు అయినట్లు, రాకపోతే ప్రాసెస్‌లో జాప్యం ఉండటం, సరిగ్గా నమోదు కాలేదని తెలుసుకోవాలి. ఇలా జరిగితే బూత్ లెవల్ అధికారి(బీఎల్ఓ)లను సంప్రదించాలి. ప్రతి ఒక్కరూ 1950 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపి తమ సర్‌లో తమ పేరు నమోదయ్యిందో లేదో పరిశీలించుకోవాలని ఎన్నికల సంఘం అధికారులు సూచిస్తున్నారు. -
పేద విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి ఆర్థిక భరోసా
నల్లగొండ : పేదరికం ప్రతిభకు అడ్డుకాకూడదనే ఉద్దేశంతో దేవరకొండకు చెందిన నిరుపేద విద్యార్థిని పరిమళ ఉన్నత చదువులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆర్థిక భరోసా అందించారు. రోజువారీ కూలీ కుటుంబానికి చెందిన పరిమళ ఐఐటీ మద్రాస్‌లో ఇంజనీరింగ్ పూర్తిచేసి జర్మనీలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య(మాస్టర్స్) అభ్యసించేందుకు సీటు సాధించింది. అయితే కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల విదేశీ విద్య సాధ్యమవుతుందా లేదా అనే అనిశ్చితి ఏర్పడింది. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్ తెలుసుకుని పరిమళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం సమస్యను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి హైదరాబాద్‌లో ఆయనను కలిసేలా ఏర్పాట్లు చేశారు. పరిమళ ప్రతిభను, అంకితభావాన్ని అభినందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ‘కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్’ ద్వారా తక్షణమే రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించి అందజేశారు. తనకు సాయం చేసినందుకు గాను మంత్రి కోమటిరెడ్డికి పరిమళ ధన్యవాదాలు తెలిపింది. -
కారు ఢీకొని యువకుడి దుర్మరణం
తిరుమలగిరి (తుంగతుర్తి) : బైక్‌పై వెళ్తున్న యువకుడిని కారు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. గురువారం ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన బాలెంల మల్లు స్వామి(34) బుధవారం పని నిమిత్తం బైక్‌పై తిరుమలగిరికి వచ్చాడు. రాత్రి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం బ్రిడ్జి సమీపంలోకి రాగానే వెనుక నుంచి కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో మల్లు స్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. విద్యుదాఘాతంతో మెకానిక్ మృతిచండూరు : బోరు మోటారు రిపేర్ చేసేందుకు వచ్చిన మెకానిక్ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ ఘటన చండూరు మండలం పుల్లెంల గ్రామంలో గురువారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చండూరు మండలం లకినేనిగూడెం గ్రామానికి చెందిన షేక్ సయ్యద్(38) బోరు మోటారు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. గురువారం పుల్లెంల గ్రామానికి చెందిన బద్దుల స్వామి వ్యవసాయ మోటారు రిపేరు చేసేందుకు సయ్యద్ వచ్చాడు. మోటారు రిపేరు పూర్తిచేసిన తర్వాత మోటారు ఆన్ చేసేందుకు సయ్యద్ స్టాటర్ బాక్స్ వద్దకు వెళ్లగా.. భూమి తడిగా ఉండడంతో ఎర్త్ వచ్చి విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయాడు. చుట్టుపక్కల రైతులు 108 అంబులెన్స్‌లో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బూజుపట్టిన కేక్ తిని చిన్నారులకు అస్వస్థతగరిడేపల్లి : బూజుపట్టిన కేక్ తిని చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గరిడేపల్లి మండలం సర్వారం గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలు..సర్వారం గ్రామానికి చెందిన భరత్ తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా బుధవారం కీతవారిగూడెంలోని ఓ బేకరీ నుంచి కిలో కేక్ కొనుగోలు చేశాడు. రాత్రి ఇంట్లో పుట్టినరోజు వేడుక నిర్వహించి తన కుమారుడితో పాటు అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులకు కేక్ పెట్టాడు. అనంతరం కేక్‌ను పరిశీలించగా దానికి బూజు పట్టినట్లు గుర్తించారు. కేక్ తిన్న చిన్నారులు అస్వస్థతకు గురికావడంతో వెంటనే వారిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గురువారం భరత్, అతడి స్నేహితులు కలిసి కీతవారిగూడెంలోని బేకరీ వద్దకు వెళ్లి బూజుపట్టిన కేక్ విక్రయించడంపై నిలదీశారు. అయినపప్పటికీ బేకరీ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై బేకరీ నిర్వాహకులు స్పందిస్తూ.. తమ బేకరీలో కేకులు తయారు చేయడం లేదని, గరిడేపల్లిలోని మరో బేకరీలో తయారైన కేకులను తీసుకొచ్చి తాముఉ విక్రయిస్తున్నామని తెలిపారు. నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు ఫ 14 లీటర్ల సారా స్వాధీనం ఫ 400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసందేవరకొండ : దేవరకొండ మండలం ఇద్దంపల్లి, పూసల్రాం తండా, లచ్య తండా, పాత్లావత్ తండా, మేగ్యా తండాల్లో నాటుసారా స్థావరాలపై గురువారం టాస్క్‌ఫోర్స్, నల్లగొండ ఎన్ఫోర్స్మెంట్, ఎకై ్సజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 14 లీటర్ల నాటుసారా, 70 కేజీల నల్లబెల్లం, 90 కిలోల పటిక స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసినట్లు దేవరకొండ ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
హాల్‌టికెట్లు ఇవ్వలేదని నిరాహార దీక్ష
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో గురువారం మధ్యాహ్నం సెమిస్టర్ పరీక్షలకు హాజరుకావాల్సిన విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వనందుకు నిరసనగా విద్యార్థి సంఘాల నాయకులు అనుముల సురేష్ వీసీ చాంబర్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అనుముల సురేష్ మాట్లాడుతూ.. హాల్‌టికెట్లు ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. యూనివర్సిటీ అధికారులు వెంటనే విద్యార్థుల హాల్‌టికెట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు దీక్ష కొనసాగుతుందని ఆయన తెలిపారు. -
ఇలా ముందుకు సాగుదాం
నడిగూడెం : ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు సాగు చేస్తున్న వివిధ రకాల పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను నడిగూడెం మండల వ్యవసాయాధికారి గోలి మల్సూర్ వివరించారు. కంది : కంది పంటను వచ్చే నెల 15వ తేదీ వరకు విత్తుకోవచ్చు. ఎల్‌ఆర్‌జి–41, ఐసీపీఎల్–85063, ఐసీపీఎల్–87119, ఐసీపీఎల్–8866, పీఆర్ఎజీ–158, డబ్ల్యూఆర్‌జీ–65 తదితర రకాలను సాగు చేసుకోవచ్చు. ముందుగా కిలో కంది విత్తనాలకు 3 గ్రాముల థూరమ్ లేదా క్యాప్టాన్ను పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తుకొనే ముందు 200–400 గ్రాముల రైజోబియంను పట్టించి విత్తుకోవాలి. పెండిమిథాలీన్ 30 శాతం కలుపు మందు ఎకరానికి 1.2 లీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారీ చేయాలి. పత్తి : పత్తి నాలుగు వరసలు, కంది ఒక వరుసలో విత్తుకొని సాగు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. తగిన తేమ ఉన్నప్పుడు పంట ఎదుగుదలను పెంచేందుకు ఎకరానికి 20 కిలోల యూరియా, 15 కిలోలు మ్యూరెట్ ఆఫ్ పొటాష్ వేయాలి. వర్షాభావ పరిస్థితుల్లో కోలుకొనేందుకు 19:19:19 పోషకాన్ని లేదా మల్టీ–కె లేదా 10 గ్రాముల యూరియాను లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పత్తి మొక్కలపై పిచికారీ చేయాలి. భూమిలో తగిన తేమ ఉన్నప్పుడు గుంటుక లేదా గొర్రుతో అంతరకృషి చేసి కలుపును నివారించుకోవాలి. పెసర, మినుము : పెసర, మినుములను ప్రస్తుతం విత్తుకోవచ్చు. ఇది వరకు విత్తుకున్న పెసర, మినుముల్లో ఆశించే చిత్త పురుగుల నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. మందును ఎకరానికి కలిపి పిచికారీ చేయాలి. మిరపలో ఆశించిన తామర పురుగుల నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా డైమీథోయేట్ 2 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే టమాటలో ఆకు ఎండు తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరప : ఈ తరుణంలో మిరప నారును నాటుకోచువచ్చు. ఖాళీగా ఉన్న నేలల్లో కూరగాయల పంటలను సాగు చేయవచ్చు. ఎత్తైన నారుమడులు తయారు చేసుకొని కూరగాయల విత్తనాలు విత్తుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్, 3 గ్రాముల క్యాప్టాన్తో విత్తనశుద్ధి చేసి విత్తుకుంటే రసం పీల్చు పురుగులు, ఆకుమచ్చ తెగులును నిరోధించవచ్చు. -
వర్షాలు సమృద్ధిగా కురువాలని వరుణ యాగం
యాదగిరిగుట్ట: దేశంలో, రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురువాలని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో అర్చకులు, వేద పండితులు, పూజారుల సమక్షంలో వర్ష పాశుపత వరుణ యాగాన్ని నిర్వహించినట్లు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో మూడు రోజులుగా కొనసాగుతున్న వర్ష పాశుపత వరుణ యాగం గురువారం ముగిసింది. ఈ సందర్భంగా పూర్ణాహుతి నిర్వహించారు. ఆలయంలో చివరి రోజు పూజల్లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి మంత్రి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి చెరువు, కుంటలు నిండి రైతాంగం సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో వరుణుడిని కోరుతూ ఈ యాగం చేసినట్లు వెల్లడించారు. కరువు వస్తే ప్రభుత్వంపై ప్రభావం పడుతుందని ఈ నేపథ్యంలో యాదగిరీశుడి ఆలయంలో వరుణ యాగం చేసి వర్షం కురువాలని వరుణ దేవుడిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. వర్షాలు కురువని సమయంలో గతంలో రాజులు సైతం వరుణ యాగం చేశారని గుర్తు చేశారు. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు సుభిక్షంగా ఉండాలనే ఆలోచనతో యాగం వేద మంత్రాలతో నిర్వహించారన్నారు. ఈ యాగంతో వరుణుడు శాంతించడం ద్వారా రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకు ముందు శివాలయంలోని యాగశాలలో నిర్వహించిన పూర్ణాహుతిలో మంత్రి పాల్గొన్నారు. ముందుగా యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యలకు అర్చకులు సంప్రదాయంగా స్వాగతంపలికి, దర్శనం అనంతరం వేద ఆశీర్వనం నిర్వహించారు. ఆమె వెంట అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, వైటీడీ పాలక మండలి సభ్యుడు లక్ష్మీనారాయణ నాయక్, ఈఓ భవానీ శంకర్, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. ఫ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఫ యాదగిరి క్షేత్రంలో ముగిసిన వర్ష పాశుపత వరుణ యాగం -
ఆరోగ్యానికి స్వీయ సంరక్షణ ముఖ్యం
స్వీయ సంరక్షణతో కలిగే ప్రయోజనాలు ● నిరంతర పని ఒత్తిడి వల్ల కలిగే అలసట, ఆందోళన దూరమై మానసిక ప్రశాంతత లభిస్తుంది. ● మంచి పోషకాహారం, తగినంత నిద్ర, వ్యాయామం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ దొరుకుతుంది. ● శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడు ఏ పనినైనా మరింత ఉత్సాహంగా, సమర్థవంతంగా చేయగలుగుతాం. ● మన ఆరోగ్యం, అవసరాలపై మనం శ్రద్ధ వహించినప్పుడు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం రెట్టింపవుతాయి. మిర్యాలగూడ అర్బన్ : ఆస్పత్రులు, వైద్యుల పైనే పూర్తిగా ఆధారపడకుండా ఎవరికి వారు స్వీయ సంరక్షణ పాటిస్తేనే సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నేడు అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించాలని కోరుతున్నారు. ఆందోళన కల్గిస్తున్న గణాంకాలు 108 ఈఎంఆర్ఐ అత్యవసర సేవల నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 17,940 ఛాతినొప్పి కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా 30 నుంచి 40 ఏళ్ల వయసున్న యువత గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత ఆరు నెలల్లో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ కేసులు సైతం వేగంగా పెరుగుతున్నాయి. వీటన్నింటికీ అస్తవ్యస్తమైన ప్రజల జీవనశైలే ప్రధాన కారణమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ముందస్తు పరీక్షలతోనే మేలు.. ● వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఆరోగ్య స్థితిని పరీక్షించుకోవడం అత్యవసరం. ● గుండె జబ్బులను నివారించడానికి క్రమం తప్పకుండా బీపీ, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్ తదితర పరీక్షలు చేయించుకోవాలి. ● తాజా పండ్లు, కూరగాయలతో కూడిన పౌష్టికాహారం తీసుకోవాలి. ● రాత్రి భోజనం తర్వాత కనీసం 30 నిమిషాల పాటు నడవాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ● ప్రతి మూడు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు, మానసిక ప్రశాంతత కోసం నిద్రకు ముందు 10 నిమిషాల పాటు ధ్యానం చేయడం ఉత్తమం. స్వీయ సంరక్షణ పద్ధతులు ఇవే.. ● శారీరక ఆరోగ్యం: రోజూ సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం దినచర్యలో భాగం చేసుకోవాలి. ● మానసిక ఆరోగ్యం: యోగా, ధ్యానంతో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. దైనందిన పనుల నుంచి విరామం తీసుకోవడం, పుస్తకాలు చదవడం లేదా సంగీతం వినడం ద్వారా ఒత్తిడిని జయించవచ్చు. ● సామాజిక, భావోద్వేగ సంరక్షణ: ఆత్మీయులతో సమయం గడపడం, భావాలను ఇతరులతో పంచుకోవడం ముఖ్యం. నచ్చని పనులు లేదా ఇబ్బందికర పరిస్థితులకు ‘వద్దు’ అని చెప్పగలగడం కూడా స్వీయ సంరక్షణలో భాగమే. ● డిజిటల్ డిటాక్స్: స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియాకు రోజూ కొంత సమయం దూరంగా ఉండటం వల్ల మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. ● అత్యవసర సేవలు: అత్యవసర సమయంలో 108కి కాల్ చేసి, ప్రాణరక్షణ సేవలను సకాలంలో వినియోగించుకోవడంపై అవగాహన కలిగి ఉండటం కూడా బాధ్యతాయుతమైన స్వీయ సంరక్షణే అవుతుంది. ఫ సరైన నిద్ర, వ్యాయామం, పోషకాహారంతో వ్యాధులకు చెక్ ఫ ఇంటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు -
ఓపెన్ స్కూల్ పిలుస్తోంది..
పెద్దవూర : చదువు మధ్యలో మానేసిన వారికి ఓపెన్ స్కూల్ వరంలాంటిది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిగత కారణాలతో పాఠశాల స్థాయిలోనే కొందరు చదువు మధ్యలో ఆపేస్తుంటారు. మరికొందరు పది పూర్తయ్యాక పలు కారణాలతో ఇంటర్ చదవకుండా మానేస్తుంటారు. అలాంటి వారి కోసం తెలంగాణ స్టేట్ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) విధానం కొత్త ఆశలు నింపుతోంది. చదువుకోవాలనే ఆశ ఉన్న ఏ వయస్సు వారైనా మళ్లీ విద్యను కొనసాగించేందుకు గరిష్ట వయోపరిమితి లేకుండా ప్రోత్సహిస్తుంది. రెగ్యులర్‌గా తరగతులకు హాజరు కావాల్సిన అవసరం లేకుండా స్వీయ అధ్యయనం, అనుకూలమైన సమయంలో పరీక్షలు రాసే వెసలుబాటు కల్పిస్తోంది. ప్రభుత్వం సార్వత్రిక విద్యను 2008–09 విద్యా సంవత్సరంలో అందుబాటులోకి తెచ్చింది. ఎలాంటి విద్యార్హత లేనివారి కోసం ముందుగా పదో తరగతి చదివేందుకు అవకాశం కల్పించింది. ప్రవేశాలకు స్పందన, అభ్యాసకులకు మరింత ప్రయోజనం కలిగేలా 2010–11 విద్యా సంవత్సరంలో ఇంటర్ విద్యను అమల్లోకి తీసుకువచ్చింది. ఎంపిక చేసిన మండల కేంద్రాలలో అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యతలు మండల సమన్వయనకర్తలకు అప్పగించింది. 2026–27 విద్యా సంవత్సరంలో ఓపెన్ టెన్త్, ఇంటర్లో ప్రవేశాలకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. అపరాధ రుసుంతో ఆగస్టు 29వ తేదీ వరకు అడ్మిషన్లు పొందవచ్చు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 76 టెన్త్, 71 ఇంటర్ ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లు ఉన్నాయి. అందులో నల్లగొండ జిల్లాలో టెన్త్‌కు 42, ఇంటర్‌కు 37, యాదాద్రి భువనగిరి జిల్లాలో టెన్త్‌కు 12, ఇంటర్ 8 కేంద్రాలు, సూర్యాపేట జిల్లాలో టెన్త్‌కు 22, ఇంటర్‌కు 26 అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో అభ్యర్థులు వృత్తి విద్యా కోర్సును ఆప్షన్‌గా ఎంపిక చేసుకోవచ్చు. ఇంటర్లో ఎంపీసీ, బైపీపీ, సీఈసీ ఇతర కోర్సులు ఉంటాయి. తెలుగు, హిందీ, ఆంగ్లం, ఉర్దూ భాషలలో చదువుకోవచ్చు. ఫీజు వివరాలు ● టెన్త్‌లో చేరితే ఫీజు ఓసీ అభ్యర్థులకు రూ.1400, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు రూ.1000తో పాటు అందరూ రూ.150 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ● ఇంటర్మీడియట్లో అడ్మిషన్‌కు ఓసీ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులకు రూ.1200తో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు అందరూ రూ.200 చెల్లించాలి. ● దరఖాస్తు చేసుకునే వారు స్థానిక పాఠశాలలో సంప్రదించి మీసేవా, ఇతర కేంద్రాలలో ఆన్లైన్ ద్వారా www.telanganaopenschool.org వెబ్సైట్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ● ఫీజు ఆన్లైన్లో లేదా మీ సేవా కేంద్రాల ద్వారా చెల్లించి ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రంలో దరఖాస్తు సమర్పించాలి. బోధన ఇలా.. ఓపెన్ టెన్త్, ఇంటర్లో ప్రవేశం పొందిన వారికి కేటాయించిన స్టడీ సెంటర్లలో సెలవు రోజులలో తరగతులు నిర్వహిస్తారు. ఏదైనా పాఠశాల, కళాశాలలో 20కు పైగా అడ్మిషన్లు ఉన్నట్లైతే వారికి ప్రతీ ఆదివారం, రెండో శనివారం, ఇతర సెలవు దినాలలో తరగతులు నిర్వహిస్తారు. 20 కంటే తక్కువగా అడ్మిషన్లు ఉంటే సమీపంలోని స్టడీ సెంటర్లో తరగతులు నిర్వహిస్తారు. ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటు అధ్యయన సామగ్రి పంపిణీ చేస్తారు. ఫ టెన్త్, ఇంటర్లో అడ్మిషన్లకు ఆహ్వానం ఫ దరఖాస్తుకు ఈ నెల 28 చివరి తేదీ ఫ ఉమ్మడి జిల్లాలో 76 టెన్త్, 71 ఇంటర్ ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లు ఫ ఓపెన్ స్కూల్లో పదో తరగతిలో ప్రవేశాలకు ఎలాంటి విద్యార్హత లేదు. కనీస వయస్సు 15 ఏళ్లు, ఆపై వయస్సు గల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ తహసీల్దార్ లేదా మున్సిపల్ అధికారులు జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రం ఉండాలి. ఫ పాఠశాల స్థాయిలో చదువు మానేస్తే బదిలీ సర్టిఫికెట్(టీసీ), ఆధార్ కార్డుతో ప్రవేశం పొందవచ్చు. ఫ ఇంటర్లో ప్రవేశం పొందాలంటే తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణత అవ్వాలి. ఫ ఆధార్ కార్డు, ఫోన్ నంబర్, 2 పాస్‌పోర్టు సైజు ఫొటోలు దరఖాస్తుకు జత చేయాలి. -
స్మార్ట్ రేషన్ కార్డులు
భువనగిరి: ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి నూతన విధానాన్ని అమలు చేయనుంది. రేషన్ సరకుల పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా ఏటీఎం కార్డు తరహాలో రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులను అందించనుంది. కొత్త కార్డులు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. త్వరలోనే వాటిని ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు పంపిణీ చేయనున్నారు. స్కాన్ చేస్తే వివరాలు ప్రత్యక్షం స్మార్ట్ కార్డు పై యజమానిపేరుతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు ఉండనున్నాయి. లబ్ధిదారు రేషన్ దుకాణానికి వెళ్లి డీలర్‌కు కార్డు అందిస్తే తన వద్ద ఉన్న ఈ పాస్ యంత్రంతో స్కాన్ చేస్తారు. అందులో లబ్ధిదారుల వివరాలతో పాటు ఇప్పటి వరకు తీసుకున్న, తీసుకోవల్సిన రేషన్ సరకుల వివరాలు కనిపిస్తాయి. కార్డు చిరిగిపోకుండా తడిసినా ఇబ్బంది లేకుండా ఉండేలా రూపొందించారు. చిన్న సైజులో.. కొత్తగా అందించే రేషన్ కార్డు ఏటీఎం కార్డు సైజులో ఉండనుంది. ఇప్పటి వరకు సరైన కార్డులు లేకపోవడంతో మీ సేవ ద్వారా అప్లోడ్ చేసుకున్న పత్రాలను తీసుకుని రేషన్ దుకాణానికి వెళ్లి అందులోఉన్న నంబర్ తీసుకుని సరకులను అందిస్తూవస్తున్నారు. అయితే పేపర్ చిరిగిపోవడం నంబర్ గుర్తుండకపోవడం వంటి సమస్యలతో వృద్ధులు, నిరక్షరాస్యులు ఇబ్బందులు పడేవారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు రారష్ట్‌ర ప్రభుత్వం చిన్న సైజులో క్యూ ఆర్ కోడ్‌తో ఉన్న కార్డును త్వరలోనే అందించనుంది. కాగా జిల్లాలో 515 రేషన్ దుకాణాలు ఉండగా 2,52,187 కార్డులున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త కార్డుల పంపిణీ : డీఎస్ఓ ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల అధికారిణి రోజా తెలిపారు. ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాల ప్రకారం అందించనున్నట్లు పేర్కొన్నారు.రేషన్ లబ్ధిదారుల వివరాలు రేషన్ దుకాణాలు 515కార్డులు 2,52,187యూనిట్లు 7,95,239ఫ జిల్లాకు చేరుకున్న కొత్త కార్డులు ఫ ఏటీఎం కార్డు సైజులో రూపకల్పన ఫ త్వరలో పంపిణీకి సన్నాహాలు -
ఫ జెండా దినోత్సవం
బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలి సాక్షి,యాదాద్రి : చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు లబ్ధిదారులకు బ్యాంక్ రుణాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు సకాలంలో అందేలా అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని డీఆర్డీఓ నాగిరెడ్డి కోరారు. పీఎంఎఫ్‌ఎమ్‌ఈ పథకం ద్వారా ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించిన బ్యాంక్ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు బుధవారం కలెక్టరేట్ లో ప్రత్యేక సింగిల్ విండో డ్రైవ్ పై సమీక్షించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ , వివిధ బ్యాంకుల ప్రతినిధులు, సెర్ప్ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు. -
జెడ్పీ అకౌంట్స్‌పై అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లకు శిక్షణ
భువనగిరిటౌన్ : స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతన అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లకు జెడ్పీ అకౌంట్స్‌పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా జెడ్పీ ఖాతాల నిర్వహణ, నిధుల వినియోగం, ఆడిట్ సూత్రాలు, నిబంధనలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఉప కార్యనిర్వహణాధికారి చిలుకూరి శ్రీనివాస్, పర్యవేక్షకులు జి. జ్ఞాన ప్రకాష్ రెడ్డి, డి. కృష్ణ, సీనియర్ అసిస్టెంట్ కె. రమేష్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మొక్కల సంరక్షణ ప్రజల బాధ్యతయాదగిరిగుట్ట: మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతను ప్రజలు తీసుకోవాలని యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఈఓ భవానీ శంకర్, ఎస్పీఎఫ్ కమాండెంట్ ఎన్.త్రినాథ్, యాదగిరిగుట్ట డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా యాదగిరి దేవస్థానానికి చెందిన గోశాలలో బుధవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు విరివిగా కురువాలంటే పచ్చని చెట్లు ఉండాలన్నారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట పట్టణ సీఐ భాస్కర్, యాదగిరి ఆలయ సీఎస్ఓ కే.శేషగిరి రావు పాల్గొన్నారు. డిగ్రీ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులుహుజూర్నగర్ : హుజూర్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.రామారావు తెలిపారు. కళాశాలలో కామర్స్, కంప్యూటర్ సైనన్స్ అండ్ అప్లికేషన్, గణితశాస్త్రం, తెలుగు విభాగాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టు ఒకటి చొప్పున మొత్తం నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత పీజీ సబ్జెక్టులో ఓసీ, బీసీ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులు సాధించి ఉండాలని సూచించారు. ఈ నెల 27న హుజూర్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కార్యాలయంలో నేరుగా దరఖాస్తులను సమర్పించాలని కోరారు. -
విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం
ఆలేరు : విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆరోపించారు. జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జి, రాహుల్‌గాంధీ, ప్రతిపక్ష నేతల అరెస్టులను వ్యతిరేకిస్తూ ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు డీసీసీ ఆధ్వర్యంలో బుధవారం ఆలేరు పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టి, ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు గాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి, నివాళుర్పించారు. ఈసందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ బీజేపీ పాలనలో పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు సాధారణ ఘటనలుగా మారాయని విమర్శించారు. కేంద్రం వైఫల్యంతోనే నీట్‌తోపాటు ఇప్పటి వరకు152 ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కేంద్రం బాధ్యత వహించాలన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ హక్కుల సాధనకు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఈ ఘటనపై విద్యార్థులకు మోదీ బేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్గాంధీతోపా టు ఇతర ప్రతిపక్ష నాయకుల అరెస్టులను ఆయన ఖండించారు. తెలంగాణలో మోదీ, బీజేపీ ఆటలు సాగవని స్పష్టం చేశారు. సర్ పేరుతో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని, అలాంటి చర్యలను అడ్డుకునేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కేంద్రప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీకి యువత అండగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, మున్సి పల్ చైర్పర్సన్ బీజన బాలమణి, వైస్ చైర్మన్ అంగిడి ఆంజనేయులు, కౌన్సిలర్లు జూకంటి సంపత్, నాయకులు ఇజాజ్, బీజన భాస్కర్, జెట్ట సిద్ధులు, రాజశేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.ఫ కేంద్రం వైఫల్యంతోనే నీట్ సహా 152 ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు ఫ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి ఫ తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవు ఫ ఆలేరులో నిరసన దీక్షలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
నాలుగు రకాల చెత్తడబ్బాలు
సాక్షి,యాదాద్రి : స్వచ్ఛ భారత్ మిషన్–గ్రామీణ్ నిబంధనలకు అనుగుణంగా ఇకపై ప్రతి ఇల్లు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలలో తప్పనిసరిగా నాలుగు రకాల చెత్త డబ్బాలను ఏర్పాటు చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన చెత్త డబ్బాలను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ చెత్తను మూలం వద్దనే వేరు చేయడం ద్వారా తడి చెత్తను కంపోస్టింగ్ తయారు చేయడానికి, పొడి చెత్తను రీసైక్లింగ్‌కు ఉపయోగించవచ్చని అధికారులు తెలిపారు. మృతిచెందిన ఓటర్ల వివరాలు ఇవ్వాలి ఆలేరు : ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా మరణించిన ఓటర్ల వివరాలను కుటుంబ సభ్యులు లేదా సంబంధిత వ్యక్తులు స్వచ్ఛందంగా అధికారులకు ఇవ్వాలని అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డి సూచించారు. బుధవారం ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధిలతో ఎస్ఐఆర్పై సమావేశం నిర్వహించారు. ఎవరైన ఓటర్లు తమ వివరాలను నమోదు చేసుకోని పక్షంలో ఆగస్టు 3వ తేదీలోపు బీఎల్ఓలను సంప్రదించి ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. ఆలేరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 97.90శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్టు ఆయన తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ వలిగొండ ఆంజనేయులు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ రాందాస్ పాల్గొన్నారు. -
దొడ్డు రకాలకే మొగ్గు!
ఫ సన్నాలకు బోనస్ ఇస్తామని ప్రచారం చేసినా ఆసక్తి చూపని రైతులు ఫ తెగుళ్ల బెడద, నూక శాతం, నీటి సమస్యల భయంతో సాగుకు వెనకడుగు ఫ దొడ్డు రకం వరి సాగుకే తొలి ప్రాధాన్యం నాకు ఐదు ఎకరాలు ఉంది. మరో తొమ్మిది ఎకరాలు కౌలుకు తీసుకుని మొత్తం 14 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాను. కుటుంబ అవసరాల కోసం ఎకరంలో మాత్రమే సన్న రకం(బీపీటీ ) వేశాను. మిగతా 13 ఎకరాల్లో దొడ్డు రకమే సాగు చేస్తున్నాను. దొడ్డు వరికి పెట్టుబడి తక్కువ దిగుబడి బాగుంటుంది. దీనికి తెగుళ్లు రావు. విక్రయించడానికి ఇబ్బందులు ఉండవు. సన్నాలు వేస్తే నీటి సమస్య, నూక శాతం, మార్కెటింగ్ తిప్పలు ఎక్కువ. – జక్కిడి వెంకట్‌రెడ్డి, రైతు, సంస్థాన్ నారాయణపురం సంస్థాన్ నారాయణపురం: సన్న రకం వరి సాగు పెంచాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు కొంత మేర ఫలిస్తున్నా రైతులు మాత్రం దొడ్డు రకాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మద్దతు ధరకు తోడు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు, రైతు వేదికల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం వల్ల గత యా సంగితో పోలిస్తే ఈసారి సన్నాల సాగు పెరిగింది. కానీ మొత్తం వరి సాగులో అధిక శాతం దొడ్డు రకా లకే కేటాయిస్తున్నారు. సాగు ఖర్చు నుంచి మా ర్కెటింగ్ వరకు లాభనష్టాలు బేరీజు వేసుకున్న రైతులు చివరకు దొడ్డు రకాల వైపే మొగ్గు చూపుతున్నారు. వరిసాగు అంచనా 3.05 లక్షల ఎకరాలు జిల్లాలో ఈ వానాకాలంలో సుమారు 3.05 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో సన్న, దొడ్డు రకాల సాగు విస్తీర్ణంపై గ్రామాల వారీగా అంచనాలు సిద్ధం చేస్తున్నారు. ప్రచారం చేసినా.. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహించి సన్నాల సాగు ప్రయోజనాలను వివరించారు. క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించడం కూడా వారిలో ఆసక్తి పెంచింది. ఫలితంగా గత యాసంగితో పోలిస్తే ఈసారి వానాకాలంలో సన్న రకాల సాగు విస్తీర్ణం పెరిగింది. కానీ మెజార్టీ రైతులు దొడ్డు రకాలే సాగు చేసేందుకు నార్లు పోస్తున్నారు. దొడ్డు రకాల సాగుకే మొగ్గు ఎందుకంటే.. దొడ్డు రకాల్లో సాగు ఖర్చు తక్కువ. ఎరువులు, మందుల వినియోగం కూడా కొంతమేర నియంత్రణలో ఉంటుంది. పంట కాలం, వాతావరణ మార్పుల ప్రభావం తక్కువ. నీటి కొరత వచ్చినా తట్టుకుంటుంది. దొడ్డు ధాన్యం ఎకరాకు 25 నుంచి 28 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని, పెద్దగా తెగుళ్లు రావని రైతుల నమ్మకం. దిగుబడి ఎక్కువ రావడంతో పాటు కోత పూర్తయిన వెంటనే మిల్లులకు విక్రయించే అవకాశం ఉంటుంది. దీంతో పెట్టిన పెట్టుబడి త్వరగా చేతికి వస్తుందని రైతులు చెబుతున్నారు. సన్నాలకు అడ్డంకులే ఎక్కువని.. సన్న రకాల సాగులో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సన్నాలు సాగు చేస్తే తెగుళ్లు, పురుగుల బెడద ఎక్కువగా ఉంటుందని, దిగుబడి కూడా ఎకరాకు 20 క్వింటాళ్లకు మించి రాదనే అభిప్రాయంతో రైతులు ముందుకు రావడం లేదు. పంట కాలం ఎక్కువ ఉండటంతో చివరి దశలో నీటి అవసరం అధికంగా ఉంటుంది. నీటి కొరత ఏర్పడితే నూక శాతం పెరిగి దిగుబడిపై ప్రభావం పడుతుంది. చీడపీడల బెడద, గింజలపై మచ్చలు, తేమ సమస్యల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ధాన్యం నాణ్యతలో చిన్న లోపం ఉన్నా ధర తగ్గిపోతుందని రైతులు చెబుతున్నారు. -
మహిళలను సాధికారత వైపు నడిపించడమే లక్ష్యం
సాక్షి, యాదాద్రి : సీ్త్రనిధి రుణాల ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించి వారిని సాధికారత వైపు నడిపించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో సీ్త్రనిధి అమలుపై అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుతో కలిసి కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. జిల్లాలో సీ్త్రనిధి రుణాల పంపిణీ, రికవరీ, డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేయాలని ఆదేశించారు. రుణ లావాదేవీలను సులభతరం చేసేందుకు ప్రతి మహిళా సభ్యురాలు తప్పనిసరిగా మన సీ్త్రనిధి మొబైల్ యాప్‌ను వినియోగించేలా అవగాహన కల్పించాలని సూచించారు. మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు డ్రోన్లు, ఇ–ఆటోలు, కార్లు వంటి ఆధునిక ఆదాయ వనరులను సమకూర్చాలని, ఆసక్తి గల మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణతో పాటు లైసెన్సులు అందించాలని పేర్కొన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, అదనపు డీఆర్డీఓ, సీ్త్రనిధి జోనల్ మేనేజర్, రీజినల్ మేనేజర్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
గోల్డ్ షాపు యజమాని ఇంట్లో చోరీ
ఫ రూ.1.80 లక్షల నగదు, 2.5 తులాల బంగారం అపహరణ మిర్యాలగూడ అర్బన్ : గోల్డ్ షాపు యజమాని ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలో బుధవారం జరిగింది. మిర్యాలగూడలోని షాబూనగర్కు చెందిన గౌరు సతీష్ స్థానిక పెద్దబజారులో గోల్డ్ షాపు నిర్వహిస్తున్నాడు. బుధవారం ఉదయం భార్యతో కలిసి అతడు షాపు వద్దకు వెళ్లారు. మధ్యాహ్నం సతీష్ ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి రూ.1.80లక్షల నగదు, 2.5 తులాల బంగారం అపహరించారు. సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి చోరీ జరిగిందని గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్లూస్‌టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ నాగభూషణరావు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణంకేతేపల్లి : విజయవాడ–హైదరాబాద్ హైవేపై కేతేపల్లి మండలం చీకటిగూడెం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. కేతేపల్లి మండలం ఉప్పలపహాడ్‌కు చెందిన కుక్కముడి శ్రీనివాస్(44) కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం ఉదయం డీజిల్ కోసం బైక్‌పై చీకటిగూడెం శివారులోని పెట్రోల్ బంక్ వద్దకు బయల్దేరాడు. చీకటిగూడెం బస్ స్టేజీ వద్ద హైవేపై యూటర్న్ తీసుకుంటుండగా.. విజయవాడ వైపు వెళ్తున్న టస్కర్ వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీను అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. మృతుడికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకొని బుధవారం ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. వేకువజామునే ముఖ మండపంలో స్వాతి హోమాన్ని జరిపించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు శత ఘటాభిషేకం నిర్వహించారు. ఆలయంలో గజ వాహనసేవ, నిత్య కల్యాణం వైభవంగా జరిపించారు. భక్తులు యాదగిరిగుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. పూజల్లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దంపతులు, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఈఓ భవానీ శంకర్, తదితరులు పాల్గొన్నారు. -
దైవ దర్శనానికి వెళ్తూ అనంత లోకాలకు..
గిద్దలూరు రూరల్, మర్రిగూడ(చింతపల్లి) : దైవ దర్శనం చేసుకుని ఆనందంగా ప్రయాణిస్తున్న ఆ కుటుంబంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. మహానంది నుంచి శ్రీశైలం వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. బస్సును ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న బొలేరో వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో మూడేళ్ల బాలుడు, మరో వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదలగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ హృదయ విదారక ఘటన బుధవారం ఏపీలోని మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణ శివారులో చోటుచేసుకుంది. మహానంది నుంచి శ్రీశైలం వెళ్తుండగా.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ గ్రామానికి చెందిన సిద్ధగోని మహేశ్, మానస దంపతులతో పాటు వారి ఇద్దరు కుమారులతో పాటు అదే గ్రామానికి చెందిన శేఖర్(35) కలిసి కారులో తీర్ధయాత్రలకు వెళ్లారు. ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మహానందికి చేరుకున్నారు. మహానందిలో దర్శనం అనంతరం బుధవారం శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనానికి బయల్దేరారు. కారును శేఖర్ నడుపుతున్నాడు. ఏపీలోని మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణ సమీపంలోకి రాగానే.. ముందు వెళ్తున్న బస్సును ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న బొలేరో వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. కారు నడుపుతున్న మహేష్ మూడేళ్ల కుమారుడితో పాటు శేఖర్‌తో అక్కడికక్కడే మృతి చెందారు. మహేశ్, మానస దంపతులతో పాటు వారి మరో కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. బొలేరో వాహనం డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సెల్‌ఫోన్ నంబర్ల ఆధారంగా గుర్తింపు.. స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. బాధితుల సెల్‌ఫోన్‌లోని నంబర్ల ఆధారంగా వారు నల్లగొండ జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. వెంటనే వారి బంధువులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై గిద్దలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన శేఖర్, మూడేళ్ల బాలుడుఫ బొలేరో వాహనాన్ని ఢీకొన్న కారు.. ఇద్దరు దుర్మరణం ఫ మృతుల్లో మూడేళ్ల బాలుడు ఫ మరో ముగ్గురికి తీవ్ర గాయాలు ఫ మృతుల స్వస్థలం నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ -
ఆగమ శాస్త్ర పూజా విధానాలపై ముగిసిన శిక్షణ
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆగమ శాస్త్ర పూజా విధానాలు, ఆలయ సంప్రదాయ పరిరక్షణపై స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్(ఎస్ఐటీఏ) ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ఎస్ఐటీఏ డైరెక్టర్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు, ప్రొఫెసర్ జీఎస్ కుర్మానందస్వామి, జీవీ శేషవతార స్వామి, ఎంవీ రామారావు, దరూరి రామాచార్యులు, రిటైర్డ్ ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట దేవాలయానికి వచ్చే భక్తులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు దేవాలయ నిర్వహణలో పారదర్శకత, ఆధ్యాత్మిక విలువలను బలోపేతం చేసేలా ప్రభుత్వ నిబంధనలు, పరిపాలన అంశాలపై ఆలయ సిబ్బంది, అర్చకులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. -
కొనసాగుతున్న వర్ష పాశుపత వరుణ యాగం
యాదగిరిగుట్ట : వానలు కురవాలని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అనుబంధ దేవాలయమైన పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో చేపట్టిన వర్ష పాశుపత వరుణ యాగం బుధవారం మూడో రోజు కూడా కొనసాగుతుంది. ఈ సందర్భంఆ ఆలయ పూజారులు స్థాపిత దేవతా, రుష్యశృంగ, శివ, వరుణ జపం, విరాట పర్వ పారాయణం, వర్ష పాశుపత హవన పూర్వక పూర్వాంగ విధులు నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటల నుంచి స్పటిక రామలింగేశ్వరుడికి అభిషేకం, శత రుద్రాభిషేం, బిల్వార్చన, నివేధన, నీరాజన మంత్ర పుష్పం పూజలు జరిపించారు. అనంతరం శివ అంతరాలయంలో జల దిగ్భంద చతుర్వేద పారాయణం చేపట్టారు. స్వర్ణగిరీశుడికి పాదపద్మార్చన సేవభువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం 108 బంగారు అష్టదళ పుష్పాలతో స్వామివారికి అర్చకులు అష్టదళ పాదపద్మార్చన సేవ నిర్వహించారు. అంతకుముందు సుప్రభాత సేవ, సహస్రనామార్చన, నిత్య కల్యాణోత్సవం జరిపించారు. సాయంత్రం తిరువీది ఉత్సవ సేవ నిర్వహించారు. ఆయా పూజా కార్యక్రమాల్లో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
విజ్ఞానంతోనే దేశ అభివృద్ధి సాధ్యం
రామగిరి (నల్లగొండ) : విజ్ఞానంతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. బుధవారం నల్లగొండ పట్టణంలోని ఎంఎన్ఆర్ కన్వెన్షన్‌లో నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ) మొదటి స్నాతకోత్సవం, వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతిఒక్కరూ తమ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడమే నిజమైన దేశ సేవ అని పేర్కొన్నారు. విద్యార్థులు కేవలం డిగ్రీతోనే ఆగిపోకుండా ఉన్నత చదువుల వైపు అడుగులు వేయాలన్నారు. విద్యార్థులను స్కిల్ రీసోర్స్‌పర్సన్లుగా తీర్చిదిద్దడానికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీని స్థాపించిందని తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో నైపుణ్యాలే విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు. ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ.. ఎన్జీ కళాశాల చరిత్రలో మొదటిసారిగా స్నాతకోత్సవం నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. విద్యార్థులు జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను పెట్టుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డిగ్రీలో 18 బంగారు పతకాలు, పీజీలో 5 బంగారు పతకాలను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల పూర్వ విద్యార్థి మందడి నర్సిరెడ్డి జియాలజీ సబ్జెక్టులో బంగారు పతకం బహూకరించడానికి తన వంతుగా రూ.2 లక్షల విరాళం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ పరీక్షల నియంత్రణాధికారి జి. ఉపేందర్‌రెడ్డి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ పరంగి రవికుమార్, అంతటి శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణాధికారి డి. మునిస్వామి, అకాడమిక్ కోఆర్డినేటర్ బి. నాగరాజు, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరాజు, రామన్నపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రహత్ఖానమ్, పూర్వ విద్యార్థుల సంఘం కన్వీనర్ రాజారామ్, ఎంఎన్ఆర్ కన్వెన్షన్ యజమాని మందడి నర్సిరెడ్డి, తెలుగు శాఖ అధ్యక్షుడు వెల్దౌడి శ్రీధర్, జంతుశాస్త్ర విభాగ అధ్యక్షుడు జ్యోత్స్న, స్టాటిస్టికల్ విభాగ అధ్యక్షుడు బొజ్జ అనిల్, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ సీహెచ్. సుధాకర్, అధ్యాపకులు అనిల్, అబ్రహం, మల్లేశం, ఎన్. కోటయ్య, వాసుదేవ్, వేణు, బంగారు పతకాల దాతలు, పూర్వ విద్యార్థులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఫ మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఫ ఘనంగా ఎన్జీ కళాశాల స్నాతకోత్సవం ఫ టాపర్లకు బంగారు పతకాల అందజేత -
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ
చిలుకూరు : ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఎనిమిది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామ స్టేజీ వద్ద బుధవారం జరిగింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు హుజూర్నగర్ నుంచి కోదాడకు వెళ్తూ.. చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామ స్టేజీ వద్ద ప్రయాణికులను ఎక్కించుకునేందు కోసం ఆగింది. అదే మార్గంలో లారీ అతివేగంగా వచ్చి బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు, లారీ రోడ్డు పక్కకు దూసుకెళ్లాయి. ఈ ప్రమాదంలో బస్సు వెనుక అద్దాలు పగలడంతో ఎనిమిది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 68 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనా స్థలాన్ని కోదాడ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ జిలానీ, తహసీల్దార్ ధృవకుమార్, ఎస్ఐ మోహన్ పరిశీలించారు. ప్రయాణికులను కోదాడ బస్టాండ్‌కు తరలించారు. బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మోహన్ తెలిపారు.ఫ ఎనిమిది మంది ప్రయాణికులకు గాయాలు -
రోగులకు అత్యవసర వైద్యం అందాల్సిందే
సాక్షి, యాదాద్రి : రోగులకు అత్యవసర వైద్యం అందించాల్సిందేనని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆస్పత్రి అభివృద్ధి, రోగులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై సమీక్షించారు. ఈ సమావేశానికి చైర్మన్ హోదాలో హాజరైన ఎమ్మెల్యే.. ఆస్పత్రిలో ఎదురవుతున్న పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి, వాటి పరిష్కారానికి కార్యాచరణ ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. జీజీహెచ్‌ను మోడల్ ఆస్పత్రిగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ నిధులు తెస్తానని వెల్లడించారు. లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు ఆస్పత్రిలో అత్యవసర చికిత్స కోసం ఆక్సిజన్ సమస్యను వైద్యాధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ నెలకొల్పాలని ఆయన నిర్ణయించారు. ప్లాంట్ ఏర్పాటుకు ఆస్పత్రి ఆవరణలో స్తలాభావం ఉండటంతో, వెనుక భాగంలో ఉన్న పాత క్వార్టర్లను తొలగించి బేస్ ఏర్పాటు చేసి ప్లాంట్ నెలకొల్పాలని నిర్ణయించారు. అటెండెంట్లు, రోగులకు సౌకర్యాలు రోగుల వెంట వచ్చే అటెండెంట్లు, బంధువులకు ఆస్పత్రి కారిడార్లలో కూర్చొని భోజనాలు చేస్తున్న తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరికి ప్రత్యేకంగా షెడ్ నిర్మించాలని, రోగులకు పౌష్టికాహారం వండటానికి వీలుగా కిచెన్ షెడ్ నిర్మించాలని నిర్ణయించారు. కాంట్రాక్టర్‌తో సమీక్షిస్తాం ఆస్పత్రి పైన కొనసాగుతున్న నిర్మాణ పనులపై కాంట్రాక్టర్‌తో సమీక్షించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సమావేశానికి కాంట్రాక్టర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఆస్పత్రి అభివృద్ధికి సుమారు రూ. 3 కోట్ల నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ అరుణ కుమారి, డీసీహెచ్ఎస్ సూర్యశ్రీ రావు, మున్సిపల్ చైర్మన్ తంగెళ్లపల్లి శ్రీవాణి, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు చంద్రప్రకాశ్‌రెడ్డి, అంగడినాగరాజు, భువనగిరి వెంకటరమణ, పలుగుల ఆగేశ్వరావు, రేణుక, ఎంపల్ల బచ్చిరెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ సద్గుణాచారి పాల్గొన్నారు. ఫ జీజీహెచ్‌ను మోడల్‌గా తీర్చిదిద్దుతా ఫ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో కుంభం క్యాజువాలిటీ విభాగంలో కొత్త బెడ్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. అలాగే ప్రస్తుతం జీజీహెచ్ మార్చురీలో ఒక్క ఫ్రీజర్ మాత్రమే ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని గుర్తించారు. వెంటనే మరిన్ని ఫ్రీజర్లను అందుబాటులోకి తెచ్చి మార్చురీని విస్తరించాలని సూచించారు. -
టెస్కో డైరెక్టర్ పదవిపై దృష్టి
సాక్షి, యాదాద్రి: నిస్తేజంగా ఉన్న ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు మళ్లీ జీవం పోసేలా టెస్కో ఎన్నికల ప్రక్రియ దిశగా అడుగులు పడుతున్నాయి. 2013తో చేనేత సహకార సంఘాల పదవీకాలం ముగియగా ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించలేదు. ఎట్టకేలకు ఈనెల 10న ఎన్నికలు నిర్వహించగా కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ఇక రాష్ట్ర స్థాయిలో టెస్కోకు పాలకవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంది. ఇందుకోసం త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో చేనేత సహకార రంగంలో ఒక్కసారిగా రాజకీయ హడావుడి మొదలైంది. డైరెక్టర్ల ఎంపిక ప్రక్రియ ఎలా? టెస్కోకు చైర్మన్‌తో పాటు డైరెక్టర్లు ఉంటారు. చేనేత సహకార సంఘాల అధ్యక్షులందరూ (చైర్మన్లు) కలిసి ముందుగా జిల్లాల వారీగా డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఇలా ఎన్నికై న డైరెక్టర్లలో ఒకరిని అందరూ కలిసి టెస్కో రాష్ట్ర చైర్మన్‌గా ఎన్నుకుంటారు. అయితే, సాధారణంగా ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యక్తినే చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టడం ఆనవాయితీ. ఈ టెస్కో ఎన్నికలు కేవలం చేనేత ప్రాథమిక సహకార సంఘాలకు మాత్రమే పరిమితం, ఇందులో పవర్ లూమ్ (మరమగ్గాల) సంఘాల చైర్మన్లకు భాగస్వామ్యం ఉండదు. గతంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 10 మంది డైరెక్టర్లను టెస్కోకు ఎన్నుకునే అవకాశం ఉండేది. అయితే, ఈసారి పాత జిల్లాల ప్రాతిపదికన డైరెక్టర్ల సంఖ్య ఉంటుందా? లేక కొత్త జిల్లాల ప్రకారం స్థానాలు కేటాయిస్తారా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. మద్దతు కోసం బేరసారాలు నోటిఫికేషన్ రాకముందే డైరెక్టర్ పదవులను దక్కించుకోవడానికి తీవ్ర పోటీ నెలకొంది. జిల్లాల్లోని ప్రాథమిక చేనేత సహకార సంఘాల అధ్యక్షుల మద్దతు కూడగట్టేందుకు అభ్యర్థులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఓట్ల కోసం ఒక్కో చైర్మన్‌కు పెద్ద మొత్తంలో ఆఫర్లు ఇస్తూ, మద్దతు కూడగట్టే ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు సమాచారం. కొన్ని చోట్ల తమకు మద్దతు ఇస్తే నగదు, బహుమతులు అప్పజెబుతామని బేరసారాలు చేస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉండటమే కాకుండా చేనేత కుటుంబాలకు పని కల్పిస్తున్న సంఘాల చైర్మన్లు ఈ రేసులో తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించారు.ఫ డైరెక్టర్ పదవికి తీవ్ర పోటీ ఫ ప్రాథమిక సంఘాల చైర్మన్ల నుంచి టెస్కో డైరెక్టర్ల ఎంపిక ఫ మద్దతు కూడగట్టేందుకు బేరసారాలు ఫ పదవుల కోసం ఎమ్మెల్యేల వద్దకు ఆశావహుల క్యూడైరెక్టర్ రేసులో ఉమ్మడి జిల్లా నుంచి పలువురు చైర్మన్లు రంగంలో ఉన్నారు. ఇప్పటికే తమ పరిధిలోని ఎమ్మెల్యేలను కలిసి తమకు డైరెక్టర్ పదవి ఇప్పించాలని ప్రాధేయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో అత్యధికమంది చైర్మన్లు ఉన్నారు. ఆ తర్వాత ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి నియోజకవర్గాలున్నాయి. గతంలో రెండు సార్లు డైరెక్టర్‌గా గెలిచిన వారితో పాటు, ఈసారి కొత్తగా చైర్మన్‌గా ఎన్నికై న వారు కూడా ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కొందరైతే పోటీలో దిగే ముందే డైరెక్టర్ పదవే లక్ష్యంగా ఎమ్మెల్యేల వద్ద హామీ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి లభిస్తుంది? డైరెక్టర్ స్థానాలను ఎవరు కై వసం చేసుకుంటారు? అనేది త్వరలో విడుదలయ్యే అధికారిక నోటిఫికేషన్‌తో స్పష్టం కానుంది. -
పారదర్శకంగా భూముల రీసర్వే
సాక్షి, యాదాద్రి : భూము రీ సర్వేను పారదర్శకంగా చేపట్టాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి ఆదేశించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో భూముల రీసర్వేపై అధికారులతో సమీక్షించి మాట్లాడారు. నిర్దేశించిన గడువులోగా సర్వేను పూర్తి చేయాలని కోరారు. సహాయ సంచాలకులు (సర్వే – భూ రికార్డులు ) సుజాత , మండల సర్వేయర్ శ్రీ దేవా రీసర్వే ప్రాజెక్టు లక్ష్యాలు, అమలు విధానంపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ జయమ్మ, ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి -
పురుగులు పట్టి.. తుట్టెలు కట్టి..
సాక్షి, యాదాద్రి : రేషన్ షాపులు, గోదాముల్లో మిగిలిపోయిన దొడ్డు బియ్యం పురుగులు పట్టి.. తుట్టెలు కట్టి పందికొక్కులు, ఎలుకలు, పురుగుల పాలు అవుతున్నాయి. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించే నాటికి జిల్లాలోని 515 రేషన్ దుకాణాలు, సివిల్ సప్లయ్ గోదాములు, ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్, రామన్నపేట, మోత్కూరు ఎంఎల్ఎస్ పాయింట్లలో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం కొంతవరకు అక్రమార్కుల పాలయ్యాయి. పౌరసరఫరాల శాఖ పిలిచిన టెండర్లలో ఎంఎల్ఎస్ పాయింట్లు, బఫర్ గోదాముల్లోని బియ్యాన్ని మాత్రమే టెండర్‌దారులు దక్కించుకున్నారు. రేషన్ దుకాణాల బియ్యానికి టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రేషన్ దుకాణాల్లో పేరుకుపోయిన దొడ్డుబియ్యం నిల్వలను వెంటనే తరలించాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు. దేనికీ పనికిరాకుండా.. రేషన్ దుకాణాల్లో నెలల తరబడి ఉన్న 773.536 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం పాడైపోతున్నాయి. తెల్లపురుగు, లక్క పురుగులు పట్టడం, ముక్కిపోవడం, తుట్టెలు కట్టి ఎందుకూ పనిరాకుండా పోతున్నాయి. పందికొక్కులు, ఎలుకలు తినడంతో పాటు గోనె సంచుల నుంచి జారిపోతున్నాయి. దీంతో బియ్యం తగ్గిపోతున్నాయి. రేషన్ దుకాణాల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం పురుగులు సన్నబియ్యానికి పట్టే అవకాశం ఉందని డీలర్లు వాపోతున్నారు. దొడ్డు బియ్యం నిల్వలు 1,302 మెట్రిక్ టన్నులు జిల్లాలో 1,302.553 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. వీటిలో ఐదు ఎంఎల్ఎస్ పాయింట్లలో 181.236 మెట్రిక్ టన్నులు, బఫర్ గోదాముల్లో 347.781 మెట్రిక్ టన్నులు, రేషన్ దుకాణాల్లో 773.536 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైన తర్వాత దొడ్డు బియ్యం అక్కడినుంచి తరలించలేదు. మరో వైపు ఇళ్లలో పిండి వంటలకు, హోటళ్లలో టిఫిన్లు చేయడానికి ఈ బియ్యానికి డిమాండ్ పెరిగింది. టెండర్కాని రేషన్ బియ్యం పౌరసరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో దొడ్డు బియ్యం టెండర్లు ఇటీవల పూర్తి అయ్యాయి. రేషన్ బియ్యం మాత్రం మరికొంత కాలం అక్కడే ఉండనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దొడ్డు బియ్యం బఫర్ గోదాములు, మండల్ లెవల్ స్టాక్ పాయింట్లలో నిల్వ ఉన్న బియ్యానికి మాత్రమే టెండరుదారు దక్కించుకున్నాడు. కిలో రూ.21.70 చొప్పున ధర పలికింది. కాగా జిల్లాలో దొడ్డు బియ్యం బఫర్ గోదాముల్లో 347.781 మెట్రిక్ టన్నులు, ఎంఎల్ఎస్ పాయింట్లలో 181.236 మెట్రిక్ టన్నులను టెండర్లో చైన్నెకి చెందిన పర్చ్యూన్ ఆగ్రో ఫుడ్స్ సంస్థ కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. ఫ రేషన్ షాపుల్లో పేరుకుపోయిన దొడ్డు బియ్యం నిల్వలు ఫ పందికొక్కులు, ఎలుకల పాలవుతున్న బియ్యం ఫ టెండర్లకు ముందుకురాని వ్యాపారులు ఫ ఆందోళనలో రేషన్ డీలర్లు దొడ్డు బియ్యం నిల్వల వివరాలు (మెట్రిక్ టన్నుల్లో) రేషన్ దుకాణాల్లో 773.536 ఎంఎల్ఎస్ పాయింట్లలో 181.236 బఫర్ గోదాముల్లో 347.781 మొత్తం 1302.553 -
చిన్నారులకు తొలి ముద్ద
ఆలేరురూరల్: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు అమలు చేస్తోంది. గ్రామాల్లోని పిల్లలందరూ తప్పనిసరిగా కేంద్రాలకు వచ్చేలా చేయడమే లక్ష్యంగా తొలిముద్ద పథకాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. దీనిని ఆగస్టు మొదటి వారంలో శ్రీకారం చుట్టనుంది. ఈపథకం కింద చిన్నారులకు అల్పాహారంగా కిచిడీ, ఉప్మా అందించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నారు. పోషకాహార లోపం నివారణకు.. జిల్లాలో ఆలేరు, భువనగిరి, మోత్కూరు, రామన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలకు నిత్యం పౌష్టికాహారం అందిస్తున్నారు. రోజూ గుడ్డు సైతం ఇస్తున్నారు. అయినా కొందరు చిన్నారులు పౌష్టికాహార లోపంతో పాటు వయసుకు తగిన ఎత్తు, బరువు ఉండటం లేదు. దీనికి ప్రధాన కారణం ఉదయం వేళ ఇంటి వద్ద సరైన ఆహారం తీసుకోకపోవడమేనని గుర్తించిన ప్రభుత్వం ఈ దిశగా అడుగువేసింది. దీన్ని పక్కాగా అమలు చేస్తే చిన్నారుల హాజరు పెరగడంతో పాటు అనారోగ్యం బారిన పడకుండా ఉంటాన్నది ప్రభుత్వ ఉద్దేశం.ఫ ఆగస్టు నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో అమలు ఫ పోషకాహార లోపం నివారణకు ప్రణాళిక ఫ 901 అంగన్వాడీ కేంద్రాలు ఫ 46,679 మంది పిల్లలకు ప్రయోజనం అంగన్వాడీ కేంద్రాల వివరాలు ప్రాజెక్టులు : 04 కేంద్రాలు : 901 గర్భిణులు : 4,994 బాలింతలు : 3,232 చిన్నారులు : 46,679 -
డిసెంబర్ నాటికి ధర్మారెడ్డిపల్లి కాల్వ ఫేజ్–2
వలిగొండ : డిసెంబర్ నాటికి ధర్మారెడ్డి కాల్వ ఫేజ్–2 పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వెల్లడించారు. వలిగొండ మండలం సంగెం సమీపంలో కత్వ వద్ద గేట్లు తెరిచి ధర్మారెడ్డిపల్లి కాల్వ ఫేజ్–1కు మంగళవారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన15 నెలల్లో కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి 15 నెలల్లో గోకారం వరకు ఫేజ్–1 పనులు పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించిన ఘనత కాంగ్రెస్‌కు దక్కిందన్నారు. సాగు నీటితో రైతుల వ్యవసాయ ఉత్పత్తులు పెరిగి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, డీఈ కృష్ణారెడ్డి, రాధాకృష్ణ, గరిసే రవి, వాకిటి అనంతరెడ్డి, కుంభం వెంకట పాపిరెడ్డి, బత్తిని సహదేవ, పాశం సతిరెడ్డి, చిట్టెడి జనార్దన్ రెడ్డి, గూడూరు శివశాంత్ రెడ్డి, బాతారాజు బాల్ నర్సింహ, నూతి రమేష్, సిరిగిరి మల్లారెడ్డి, సురకంటి మల్లారెడ్డి, పోలేపాక జానకి రాములు, పున్న జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ధ్యేయం
బస్సు సర్వీస్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి, బస్సు నడుపుతున్న ఎమ్మెల్యే కుంభం భువనగిరి: ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ధ్యేయమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు.భువనగిరి ఆర్టీసీ బస్టాండ్ నుంచి నమాత్‌పల్లి మీదుగా వలిగొండ మండలం టేకుల సోమారం వరకు వెళ్లే ఆర్టీసీ బస్సును ఆయన జెండా ఊపి ప్రారంభించారు. బస్సు నడిపిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనిల్‌కుమారెడ్డి.. ఆర్టీసీ డ్రైవర్‌గా మారి బస్సు నడిపి ప్రయాణికులను ఉత్సాహపరిచారు. నమాత్‌పల్లి మీదుగా వెళ్లే బస్సును ఆయన ప్రారంభించిన సందర్భంగా విద్యార్థులు, ప్రయాణికులతో మాట్లాడారు. నెరవేరిన 25 ఏళ్ల కల నమాత్‌పల్లికి 25 ఏళ్ల నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లలేదు. ఆ కల ఎమ్మెల్యే చొరవతో నెరవేరింది . బస్సులోనే ఎమ్మెల్యే టేకుల సోమారం చేరుకొని అక్కడ జెడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీవాణి, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ, కాంగ్రెస్ మండల కమిటీ అధ్యక్షుడు జంగయ్య, భువనగిరి, చందుపట్ల పీఏసీఎస్‌ల చైర్మన్లు ఫక్కీర్ కొండల్‌రెడ్డి, సతీష్‌పవన్, ఆర్టీసీ డీఎం సురేష్, సర్పంచ్ అరుణ, శివానంద్, ప్రమోద్‌కుమార్, జహంగీర్, వెంకటస్వామి, కృష్ణ, స్వామి పాల్గొన్నారు. -
పొట్టు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా
మోత్కూరు : పొట్టు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం ఉదయం జరిగింది. మోత్కూరులోని ఓ రైస్ మిల్లులో పొట్టు లోడు చేసుకున్న ట్రాక్టర్ పనకబండ చౌరస్తా నుంచి రాజన్నగూడెం వెళ్లే రహదారి మీదుగా వెళ్తుండగా.. టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ సమీపంలో గుంతలమయంగా మారిన రోడ్డులో అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాక్టర్ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పనకబండ చౌరస్తా–రాజన్నగూడెం డబుల్ బీటీ రోడ్డు పనులు మూడేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోవడంతో రహదారి గుంతలమయంగా మారి ప్రయాణికులకు నరకయాతన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు. -
అధిక శబ్దం చేసే సైలెన్సర్లు వాడొద్దు
ఫ సూర్యాపేట ఎస్పీ నరసింహ కోదాడరూరల్ : ద్విచక్ర వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దం చేసే సైలెన్సర్లను తమ వాహనాలకు ఉపయోగిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట ఎస్పీ కె. నరసింహ హెచ్చరించారు. మంగళవారం కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ సెంటర్లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో పట్టుబడిన 40 మోడిఫైడ్ సైలెన్సర్లను పోలీసులు రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. అధిక శబ్ధం చేసే సైలెన్సర్లతో ద్విచక్రజు వాహనాలపై పట్టణంలో ఇష్టానుసారంగా తిరుగుతూ వృద్ధులు, చిన్నారులు, బాటసారులను భయబ్రాంతులకు కలిగించే వారిపై ప్రత్యేక నిఘా పెడతామన్నారు. ద్విచక్ర వాహనదారులు కంపెనీ సూచించిన సైలెన్సర్లు మాత్రమే వాడాలని, లేదంటే వాహనాలను సీజ్ చేసి జరిమానాలు విధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, కోదాడ పట్టణ సీఐ కె.శివశంకర్, ట్రాఫిక్ ఎస్ఐ బైరెడ్డి అంజిరెడ్డితో పాటు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ మోటార్లు, తీగలు చోరీ నడిగూడెం : మండల కేంద్రం సమీపంలోని సాగర్ ఎడమ కాల్వ కట్టపై నడిగూడెం, కృష్ణానగర్ గ్రామాలకు చెందిన రైతులు దున్నా వెంకన్న, సురగాని లింగయ్య, ఎలకా వెంకటరెడ్డి, జూకంటి అచ్చయ్యకు చెందిన ఐదు విద్యుత్ మోటార్లను సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. మంగళవారం ఉదయం రైతులు వెళ్లి చూసేసరికి మోటార్లు కనిపించలేదు. అదేవిధంగా నడిగూడెం ప్రభుత్వాస్పత్రి వెనుక పొలం కౌలు చేస్తున్న గుండు పాపయ్యకు చెందిన దాదాపు 200 మీటర్ల విద్యుత్ తీగలు కూడా చోరీకి గురయ్యాయి. బాధితులు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
చిరు నవ్వును చిదిమేసిన ఆటో
ఆలేరురూరల్ : అప్పటివరకు సరదాగా నవ్వుతూ ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని మృత్యువు ఆటో రూపంలో కబళించింది. వేగంగా దూసుకొచ్చిన ఆటో ఢీకొని ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. పోలీసులు, చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొలనుపాక గ్రామానికి చెందిన శ్రీరాముల కరుణాకర్, కీర్తన దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కరుణాకర్ గ్రామంలోనే సెలూన్ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి రెండో కుమార్తె శ్రీహన్సిక(3) మంగళవారం ఉదయం ఇంటి ముందు రోడ్డుపై ఆడుకుంటుండగా.. అదే గ్రామానికి చెందిన ట్రాలీ ఆటో వేగంగా వచ్చి చిన్నారిని ఢీకొని ఆమైపె నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని స్థానికుల సహాయంతో తల్లిదండ్రులు ఆలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. చిన్నారి తండి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు. పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా.. శ్రీహన్సిక మృతికి కారణమైన ఆటో డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని చిన్నారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆలేరు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఫ ఇంటి ముందు ఆడుకుంటుండగా ఆటో ఢీకొని చిన్నారి మృతి -
వరుణుడు కరుణించాలని..
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో చేపట్టిన వర్ష పాశుపత వరుణ యాగం మంగళవారం రెండవ రోజుకు చేరింది. శివాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పండితుల వేత మంత్ర పఠనాలు, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాలతో మండపారాధనలు, కలశ స్థాపన, రుష్య శృంగ విగ్రహ స్థాపన, జపములు, పారాయణాలు, అగ్ని ప్రతిష్ఠ వంటి పూజలను నిర్వహించారు. వరుణ దేవుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా కురిసేలా చూడాలని వేడుకుంటూ పూజలు జరిపించారు.రాత్రి శివాలయంలో అభిషేకాలు, హవనములు, వరుణానువాక పారాయణాలు, నీరాజన మంత్ర పుష్పాలు, శివ అంతరాలయ జల దిగ్భంధనం, చతుర్వేద పారాయణాలను నిర్వహించారు. ఈ పూజల్లో ఆలయ ఈవో భవానీ శంకర్, అధికారులు, పూజారులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. ఫ యాదగిరి క్షేత్రంలో రెండవ రోజుకు చేరిన వరుణ యాగం -
పోచంపల్లిని సందర్శించిన తెలుగు అకాడమీ చైర్మన్
భూదాన్‌పోచంపల్లి : చేనేత కార్మికుల స్థితిగతులను తెలుసుకునేందుకు తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మంగళవారం పోచంపల్లిని సందర్శించారు. చేనేత సహకార సంఘాన్ని సందర్శించి కార్మికులు మగ్గాలపై తయారుచేస్తున్న వస్త్రోత్పత్తులను పరిశీలించారు. మార్కెటింగ్ సదుపాయాలు, వారికి లభిస్తున్న గిట్టుబాటు ధర, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, ప్రోత్సహాకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత లవకుమార్ ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. ఆయన వెంట నిజాం కాలేజీ ప్రొఫెసర్ తడక యాదగిరి తదితరులు ఉన్నారు. -
100 శాతం మ్యాపింగ్‌కు సహకరించండి
మోటకొండూర్ : ఎస్ఐఆర్ ప్రక్రియలో 100శాతం మ్యాపింగ్‌కు బీఎల్ఏలు ప్రతి గ్రామంలో బీఎల్ఓలకు సహకరించాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కోరారు. మంగళవారం మోటకొండూరులో ఏర్పాటు చేసిన బీఎల్ఏల అభినందన సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మండలంలో 100 శాతం మ్యాపింగ్ పూర్తి అయిన బూత్‌లకు చెందిన ఐదుగురు కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలకు రూ.5వేల చొప్పున నగదు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఐనాల చైతన్యరెడ్డి, పచ్చిమట్ల మదార్‌గౌడ్, భూమండ్ల జయమ్మ శ్రీనివాస్, ఆకుల శ్రీనివాస్, పేరబోయిన దివ్యమకరజ్యోతి కార్తీక్, బొట్ల కవిత, పరుశరాములు, బు డిగె బాలరాజుగౌడ్, బుగ్గ కొమురయ్య, బొట్ల రంజిత్, పచ్చిమట్ల మాధవి పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగే మేలుసంస్థాన్ నారాయణపురం: ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడమే మేలని డీఏఓ పి.వెంకటరమణారెడ్డి సూచించారు. సంస్థాన్ నారాయణపురం, మహ్మదాపురం రైతు రైతు వేదికల్లో అవగాహన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత వ్యవసాయ సీజన్లో వాతావరణ పరిస్థితులు, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. రైతు మల్లేపల్లి ప్రముఖరెడ్డి నిర్వహిస్తున్న తేనెటీగల పెంపకం క్షేత్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి సందర్శించారు. చిమిర్యాలలో రైతు ధోనూరు జంగారెడ్డి డ్రిప్‌తో సాగుచేస్తున్న పత్తి పంటను పరిశీలించారు. కార్యక్రమాల్లో మండల వ్యవసాయ అధికారి బి.పూజ, ఏఈఓలు సైదులు జె. రాజేష్ కె. నవ్య పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన బోధన ఆలేరురూరల్: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన బోధన అందుతుందని డీఈఓ భిక్షపతి అన్నారు. మంగళవారం ఆలేరు మండలం శారాజీపేట జెజడ్పీహెచ్ఎస్, ఆలేరు పీఎంశ్రీ హైస్కూల్‌ను సందర్శించారు. పదవ తరగతి విద్యార్థుల సామర్థ్యాలు, బోధనాపద్ధతులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను తనిఖీ చేశారు. ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మధ్యాహ్న భోజనంలో తాజా కూరగాయలు నాణ్యత కలిగిన నిత్యావసరాలు వినియోగించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ఎర్ర లక్ష్మి, ప్రధానోపాధ్యాయురాలు మంజుల, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేడు ఎన్జీ కాలేజీ స్నాతకోత్సవం రామగిరి(నల్లగొండ) : ఉమ్మడి జిల్లాలోనే అత్యున్నత విద్యా ప్రమాణాలతో విరాజిల్లుతున్న చారిత్రాత్మక విద్యాసంస్థ నాగార్జున ప్రభుత్వ కళాశాల (ఆటానమస్) మొదటి స్నాతకోత్సవం, బంగారు పతకాల ప్రధానోత్సవం, వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు బుధవారం స్థానిక ఎంఎన్ఆర్ కన్వెన్షన్‌లో జరగనున్నాయి. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. 1956 జూలై 22న స్థాపించిన ఈ కళాశాల ప్రస్థానాన్ని వేదికపై స్మరించుకోనున్నామని తెలిపారు. ముఖ్య అతిథిగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఖజా అల్తాఫ్ హుస్సేన్, గౌరవ అతిథులు ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.అంజిరెడ్డి, సీఓఈ ప్రొఫెసర్ జి.ఉపేందర్‌రెడ్డి, తెలంగాణ కళాశాల విద్యా సంయుక్త సంచాలకుడు ప్రొఫెసర్ డిఎస్ఆర్.రాజేందర్‌సింగ్, ప్రొఫెసర్ పి.బాలభాస్కర్, అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ ప్రొఫెసర్ వి.రాజేంద్ర ప్రసాద్, రూసా కోఆర్డినేటర్ డాక్టర్ సౌందర్య జోసెఫ్ హాజరుకానున్నారని పేర్కొన్నారు. వివిధ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలతో పాటు, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రతిభావంతులకు బంగారు పతకాలను ప్రదానం చేయనున్నట్లు కళాశాల పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ డి.మునిస్వామి తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
ప్రధాని మోదీ రాజీనామా చేయాలి
నకిరేకల్ : నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే రాజీనామా చేయాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీపై ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి నిరసనగా ఆందోళన చేపట్టిన ఏఐసీసీ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నకిరేకల్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వేముల వీరేశం పాల్గొని మాట్లాడారు. రాహుల్ గాంధీని అరెస్టు చేయడం బాధాకరమని, ఆయనను బేషరతుగా విడుదల చేయాలని కోరారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్ష నేతల గొంతు నొక్కే విధంగా వ్యహరించడం దురదృష్టకరమన్నారు. విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సర్ కోఆర్టినేటర్ మువ్వా విజయ్‌బాబు, డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్‌నేత, టీపీసీసీ మేనిఫెస్టో మెంబర్ చామల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు లింగాల వెంకన్న, నాయకులు పన్నాల రాఘవరెడ్డి, బచ్చుపల్లి గంగధర్‌రావు, నాగులంచ వెంకటేశ్వరరావు, చౌగోని శ్రీనివాస్, యాసా కరుణాకర్‌రెడ్డి, గాజుల సుకన్య, బ్రహ్మదేవర రమేష్, బొజ్జ సుందర్, కోట మల్లికార్జున్, కొండ శంకర్, ఉగ్గిడి శ్రీనివాస్, కంపసాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ విప్ వేముల వీరేశం డిమాండ్ -
ఖతార్ దేశంలో భారత రాయబారిగా మోత్కూరు వాసి
మోత్కూరు : మండలంలోని కొండగడపకు చెందిన 2001 బ్యాచ్ ఐఎఫ్ఎస్(ఇండియన్ ఫారిన్ సర్వీస్) అధికారి కొప్పుల శ్రీకర్‌రెడ్డిని ఖతార్ దేశంలో భారత రాయబారిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో కాన్సులేట్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ప్రవంచ వాణిజ్య సంస్థ, విదేశాంగ శాఖలో కీలక విభాగాల్లో ఆయన సేవలందించారు. హైదరాబాద్‌లో ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా మొదలుకొని ఐక్యరాజ్యసమితి వరకు వివిధ హోదాలలో పనిచేశారు. ఆఫ్రికా, అరబ్ దేశాలతో భారత్ చేసుకున్న చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాలలో ఆయన కీలకపాత్ర పోషించారు. -
‘ఐకెమ్‌ఈ’ ఫెలోగా శశి రవి సుమన్ రుద్రంగి ఎన్నిక
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లాకు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ శాస్త్రవేత్త డా. శశి రవి సుమన్ రుద్రంగి ప్రతిష్టాత్మకమైన ఇనిస్టిట్యూషన్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్(ఐకెమ్‌ఈ) ఫెలోగా ఎన్నికయ్యారు. కెమికల్ ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అరుదైన గౌరవం లభించింది. ప్రస్తుతం ఆయన ఐర్లాండ్‌లోని ఒలేమా ఆంకాలజీ సంస్థలో సీఎంసీ డ్రగ్ ప్రొడక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్ ఫెలోగా ఎన్నిక కావడం తన వృత్తి జీవితంలో ఒక గొప్ప మైలురాయన్నారు. దీని వెనుక తన కుటుంబ సభ్యులు, గురువులు, సహోద్యోగుల ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ అభివృద్ధికి, ప్రపంచవ్యాప్తంగా రోగుల జీవి తాలను మెరుగుపర్చే ఔషధాల అభివృద్ధికి మరింత కృషి చేస్తానని ఆయన తెలిపారు. విద్యుదాఘాతంతో గేదె మృతితుంగతుర్తి : మండలంలోని దేవునిగుట్ట తండా గ్రామంలో మంగళవారం విద్యుదాఘాతంతో గేదె మృతిచెందింది. తండాకు చెందిన గుగులోతు ఈరు గేదె పొలంలో మేత మేస్తుండగా.. గానుగబండ ఫీడర్‌కు చెందిన ఎల్టీ లైన్ కింద పడిపోవడంతో ఆ వైరు గేదెకు తగిలి విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తన గేదె మృతిచెందిందని బాధిత రైతు ఆరోపించాడు. తమ కుటుంబానికి మృతిచెందిన గేదె జీవనాధారమని, విద్యుత్ అధికారులు నష్టపరిహారం అందించాలని బాధితుడు కోరుతున్నాడు. నర్సు అదృశ్యంఇబ్రహీంపట్నం రూరల్: విధులకు వెళ్లిన నర్సు అదృశ్యమైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లికి చెందిన అందుగుల వెన్నెల రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ సమీపంలోని మహోనియా ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈ నెల 13న డ్యూటీకి వెళ్లిన ఆమె సాయంత్రం తండ్రి మనోహర్‌కు ఫోన్ చేసి ఆధార్ కార్డు కోసం మల్కాజ్‌గిరిలో ఉంటున్న తన బాబాయి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పింది. 14న డ్యూటీకి రాకపోవడంతో ఆస్పత్రి నుంచి తండ్రికి ఫోన్ చేశారు. దీంతో ఆయన ఎక్కడ వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో మంగళవారం ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ కిందకు దూసుకెళ్లిన బైక్గరిడేపల్లి : ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పెట్రోల్ బంక్‌లో నుంచి రివర్స్ తీసుకుంటున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటన గరిడేపల్లి మండల కేంద్రం శివారులో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి శివారులోని భారత్ పెట్రోల్ బంక్‌లో డీజిల్ నింపించుకున్న అనంతరం లారీని డ్రైవర్ రివర్స్ తీస్తుండగా.. ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులను లారీ వెనుక భాగం తగిలింది. బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదాన్ని ముందే గమనించి బైక్‌పై నుంచి కిందకు దూకడంతో పెను ప్రమాదం తప్పింది. బైక్ మాత్రం లారీ కిందకు వెళ్లింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. -
కోతులు, కుక్కల బెడద నివారించాలని ధర్నా
చిట్యాల : పట్టణంలోని వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతూ దాడులకు పాల్పడుతున్న కోతులు, కుక్కల బెడద నివారించాలని డిమాండ్ చేస్తూ చిట్యాల మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగళవారం బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. వీధుల్లో కోతులు, కుక్కలు సంచరిస్తూ చిన్నారులు, వృద్ధులు, మహిళలపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత పది రోజుల్లోనే పదుల సంఖ్యలో ప్రజలు కోతుల దాడిలో గాయపడ్డారని, అయినప్పటికీ మున్సిపల్ పాలకవర్గం, అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కోతులు, కుక్కల దాడుల్లో గాయపడిన వారికి ప్రభుత్వం ఉచిత వైద్య చికిత్సతో పాటు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ మెండు సైదులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, జిట్ట బొందయ్య, జమాండ్ల శ్రీనివాసరెడ్డి, బొబ్బల శివశంకర్ రెడ్డి, నిమ్మనగోటి శ్రీనివాస్, ఎస్.కె.అజీమ్, ఆగు అశోక్, మారగోని రమేష్, ఆవుల ఆనంద్, బొల్గూరి సైదులు, జిట్ట శేఖర్, పోకల రమేష్, ఉప్పలపల్లి నగేష్, సాయిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, పోకల రాములు, కూనూరు శంకర్, మన్నన్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యా వ్యవస్థను కాంగ్రెస్ భ్రష్టుపట్టించింది
నల్లగొండ టూటౌన్ : తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు తెలియని సీఎం రేవంత్‌రెడ్డి విద్యా శాఖను తన దగ్గర పెట్టుకొని విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించాడని పలువురు వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నల్లగొండ పట్టణంలోని లయన్స్‌క్లబ్ భవన్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు వక్తలు పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే సంక్షోభం అని, 30 నెలల్లోనే అన్ని వ్యవస్థలను నాశనం చేశారన్నారు. శాసనమండలిలో ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యను లేవనెత్తుతానని ఆయన తెలిపారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రులు హెలికాప్టర్లో తిరగడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు గాని, విద్యార్థులు చదువుకునేందుకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలనే సోయి లేదన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ కేవలం విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాల సమస్య కాదని, ఇదొక సామాజిక సమస్య అన్నారు. పేద పిల్లలను విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతుందని, దానిని అడ్డుకోవడానికే ఈ రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటికీ లక్షల కోట్ల రూపాయలు వస్తాయి కానీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కమిషన్లు రావు కాబట్టే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా మొండికేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి విద్యారంగాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడన్నారు. మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగానికి ఏ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇవ్వడంలేదన్నారు. రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణలో రూ.11,300 కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ.. కేసీఆర్ గురుకులాలు, మెడికల్ కాలేజీలను అద్భుతంగా తీర్చిదిద్దారని, కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. ఇంకా పలువురు వక్తలు మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బకాయిల విడుదల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వణికించేలా ఉద్యమం చేపడతామని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, బీసీ సంఘం, ప్రజా సంఘాల నాయకులు మిర్యాల యాదగిరి, జనార్దన్‌గౌడ్, కోడూరి లక్ష్మీనారాయణ, పాలడుగు నాగార్జున, రఫీ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల అసోసియేషన్ నాయకుడు మారం నాగేందర్‌రెడ్డి, హనుమంతు యాదవ్, మల్లారెడ్డి, రాజేందర్‌రెడ్డి, రాపోలు శ్రీజ, విద్యార్థులు పాల్గొన్నారు. ఫ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి ఫ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్ -
ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ వద్దు
భువనగిరిటౌన్ : ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించి ప్రతినెలా 1వ తేదీన హమాలీ బిల్లులు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఏఐటీయూసీ అనుబంధ సివిల్ సప్లయ్ హమాలీస్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి మాట్లాడారు. హమాలీలు మూడు నెలల బియ్యాన్ని ఒకటే నెల ఎలా దిగుమతి చేస్తారని ప్రశ్నించారు. ఈ విధానం వల్ల హమాలీ కార్మికులు, రేషన్ డీలర్లు, లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అనంతరం ప్రజావాణిలో భువనగిరి ఆర్డీఓ క్రిష్ణారెడ్డి, సివిల్ సప్లయ్ డీఎం హరికృష్ణకు వేరువేరుగా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, హమాలీ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవంతుల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు పల్లె శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు జంగ నర్సయ్య, ప్రధాన కార్యదర్శి పాపగళ్ల శంకరయ్య, సహాయ కార్యదర్శి పురుగుల రవి, కోశాధికారి గొరిగే శంకరయ్య, నాయకులు పిన్నం జగన్, మడుగుల స్వామి, కొట్టూరి శ్రీను, బోదల యాదయ్య, స్వామి, మైసమ్మ, గణేష్, కిష్టయ్య, సైదులు, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. ఫ ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ -
అర్జీలను త్వరగా పరిష్కరించాలి
భువనగిరిటౌన్ : ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వెంకారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం భువనగిరిలోని కలెక్టరేట్లో డీఆర్ఓ జయమ్మ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కృతికతో కలిసి నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకారెడ్డి మాట్లాడారు. ప్రజావాణిలో మొత్తం 92 అర్జీలు రాగా, అందులో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 56 దరఖాస్తులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణిలో వచ్చిన కొన్ని వినతులు.. ● నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో రెండు రకాల కూరలు, కోడిగుడ్లు వడ్డించడం తమ వల్ల కావడం లేదని మధ్యాహ్న భోజన వంట కార్మికులు అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌కు విన్నవించి రేట్లు పెంచాలని కోరారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీల ప్రతినిధులు వరలక్ష్మి, స్వప్న తదితరులు పాల్గొన్నారు. ● మార్చి నుంచి జూన్ వరకు నాలుగు నెలలుగా తమకు జీతాలు రావడం లేదని వెంటనే అందించి ఆదుకోవాలని మోత్కూరు ఎస్టీఓ పరిధి నుంచి వేతనాలు పొందే వివిధ మండలాలకు చెందిన 61 ఏళ్లు దాటిన మొత్తం 28 మంది వీఆర్ఏలు కోరారు. కార్యక్రమంలో వీఆర్ఏలు ఈ.శ్రీశైలం, జె.ఎల్లయ్య, జి.మత్స్యగిరి, ఆంజనేయులు, ఎం.రమేష్ తదితరులు ఉన్నారు. ● భువనగిరి మున్సిపల్ పరిధిలోని రాయగిరి రైల్వే స్టేషన్ విస్తరణ పనుల పేరుతో శతాబ్ద కాలంగా నివాసముంటున్న తమ ఇళ్లను తొలగించాలని ముందస్తు సమాచారం లేకుండానే నోటీసులు ఇవ్వడం అన్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు శాశ్వత గృహవసతి కల్పించిన తర్వాతే ఇళ్లను ఖాళీ చేయించాలని డిమాండ్ చేస్తూ భువనగిరి కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు రాకేశ్, యాదగిరి, సందీప్, శ్రీనివాస్, కిశోర్, రవీందర్, సలీం, మహబూబ్, గణేశ్, జయరామ్ తదితరులు పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి -
శాసీ్త్రయ సాక్ష్యాలు ఎంతో కీలకం
ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు భువనగిరిటౌన్ : క్రిమినల్ న్యాయ వ్యవస్థలో కేసుల నిష్పక్షపాత ముగింపునకు శాసీ్త్రయ సాక్ష్యాలు ఎంతో కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు అన్నారు. భువనగిరి బార్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు హైదరాబాద్‌కు చెందిన ప్రోబ్ల్యాబ్ ఫోరెన్సిక్ సంస్థ సహకారంతో జిల్లా కోర్టు ప్రాంగణంలో సోమవారం ఫోరెన్సిక్ సైన్స్ క్రిమినల్ న్యాయ వ్యవస్థలో ప్రాముఖ్యత అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌ను జిల్లా ప్రధాన జడ్జి ప్రారంభించి మాట్లాడారు. నకిలీ పత్రాల గుర్తింపు, వేలిముద్రల విశ్లేషణలో ఫోరెన్సిక్ పాత్ర పెరిగిందన్నారు. అనంతరం ప్రోబ్ల్యాబ్ ఫోరెన్సిక్ డైరెక్టర్ డాక్టర్ మోహన్ ఎర్రగొల్ల (పీహెచ్డీ) మాట్లాడుతూ డిజిటల్ ఫోరెన్సిక్స్, నేరస్థల దర్యాప్తు, వివాదాస్పద పత్రాల పరిశీలన వంటి అంశాలపై న్యాయవాదులకు అవగాహన కల్పించి, వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.శారద, ప్రతినిధులు యు.సురేష్, సి.రజని, జి.శంకర్, ఎం.వసంత రాణి, ఎస్.రాజేందర్‌రెడ్డి, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. జాతీయ జెండా చిరిగినా పట్టించుకోరా!భువనగిరిటౌన్ : భువనగిరి పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువు (మినీ ట్యాంక్ బండ్) వద్ద ఏర్పాటు చేసిన భారీ జాతీయ జెండా చిరిగిపోయి దర్శనమిస్తోంది. దేశ గౌరవానికి ప్రతీకగా నిలిచే మువ్వన్నెల జెండా పైభాగం చిరిగిపోయి గాలికి కొట్టుకుంటున్నా, అధికారులు పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లాగ్ కోడ్ ప్రకారం చిరిగిన జాతీయ జెండాను అలా ఉంచడం అవమానించడమే అవుతుంది. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి, చిరిగిన జెండా స్థానంలో కొత్త జాతీయ జెండాను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మహాశివుడికి సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. మహాశివుడికి ఇష్టమైన రోజు కావడంతో ముఖ మండపంలోని శ్రీస్పటిక రామలింగేశ్వరుడికి పూజారులు అభిషేకం, అష్టోత్తర, బిల్వా పత్రాలతో పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయంలో శ్రీరామలింగేశ్వర సమేత పార్వతీ దేవి సేవను ఊరేగించారు. యాదగిరీశుడి ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలను అర్చకులు సంప్రదాయంగా జరిపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఆయా పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
రైతుల గోస పట్టని కాంగ్రెస్ సర్కార్
బొమ్మలరామారం : కాంగ్రెస్ బీఆర్ఎస్లు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. రైతు బంధు, రుణమాఫీ చేయని అబద్దాలకోరు కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. బొమ్మలరామారం మండలంలోని వివిధ సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్ర సోమవారం రాత్రి ముగిసింది. ఈ సందర్భంగా ముగింపు సభకు హాజరైన రామచంద్రరావు మాట్లాడుతూ.. సాగు నీరు లేక ఇబ్బంది పడుతున్న రైతుల గోడును ప్రభుత్వం వినడం లేదన్నారు. బీబీనగర్‌లో దేశం గర్వించదగ్గ రీతిలో ఎయిమ్స్ ఆసుపత్రిని నిర్మించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందన్నారు. కోట్లాది రూపాయలతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 12 జాతీయ రహదారులను నిర్మిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం రోడ్లను మరమ్మతులు చేయలేని స్థితిలో ఉందన్నారు. సబ్సిడీపై ఎరువులు, తెలంగాణలో లక్షా 60 వేల మంది రైతులకు క్రమం తప్పకుండా పీఎం కిసాన్ సమ్మాన్ డబ్బులను జమ చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు చేయడం తగదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపి నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బినామీల పేరున వడపర్తి నుంచి మర్యాల, చీకటిమామిడి రోడ్డును కాంట్రాక్ట్ తీసుకున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య.. రేండేళ్లు దాటినా రోడ్డు వేయకుండా ప్రజల ఉసురు తీస్తున్నాడని అన్నారు. చెరువుల మట్టిని కాంగ్రెస్ నాయకులు మాఫీయగా మారి దోచుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఊట్కూరు అశోక్‌గౌడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పడమటి జగన్మోహన్రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఫక్కీరు రాజేందర్‌రెడ్డి, నాయకులు రంగారామాగౌడ్, వినోద్ నాయక్, కొలను చంద్రశేఖర్‌రెడ్డి, తిర్మని క్రిష్ణాగౌడ్, కుర్మిండ్ల ఈశ్వర్‌గౌడ్, మాదిరెడ్డి సుభాష్‌రెడ్డి, జగ్గర్ల ఆనంద్‌గౌడ్, చిమ్ముల రవీందర్‌రెడ్డి, రవిశంకర్, పెంటయ్య పాల్గొన్నారు. ఫ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు -
అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయండి
భువనగిరి : గ్రామ పంచాయతీలకు సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసి ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సరిత అన్నారు. పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక పైలెట్ ప్రాజెక్టులో భాగంగా సోమవారం భువనగిరి మండలం అనంతారం గ్రామాన్ని సందర్శించి వివిధ శాఖల అధికారులతో సమావేశమై మాట్లాడారు. ప్రణాళికల తయారీలో పాలుపంచుకున్న అధికారులను తీరు పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకు ఆమెకు గ్రామంలో స్వాతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంపీఓ దినకర్, వివిధ శాఖల అధికారులు శ్యామ్‌సుందర్, గుండురావు, బాలస్వామి, మల్లేశం, సర్పంచ్ పల్లెపాటి నాగరాణి, ఉప సర్పంచ్ వెంకటేశం, సిబ్బంది పాల్గొన్నారు. -
గృహజ్యోతికి కరెంట్ షాక్!
జిల్లాలో గృహ వినియోగదారులు 2,93,559 గృహజ్యోతి లబ్ధిదారులు 1,51446 ఐదు నెలలుగా గృహజ్యోతికి అర్హత కోల్పోయింది 33,688 ఆలేరు రూరల్ : ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సాధారణంగా జూలై నెలలో జోరుగా వర్షాలు కురిసి చెరువులు కుంటలు నిండాల్సింది పోయి.. భానుడు భగభగలాడుతున్నాడు. జులై నెల సగం దాటినా ఎండల తీవ్రత తగ్గకపోగా, ఉక్కపోత భరించలేక ప్రజలు విలవిలలాడుతున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు సైతం తట్టుకోలేక ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను నిరంతరాయంగా వినియోగిస్తున్నారు. ఫలితంగా గృహ విద్యుత్ వినియోగం అమాంతం పెరిగిపోతోంది. ఇది కాస్తా ఉచిత విద్యుత్ పథకమైన ‘గృహజ్యోతి’ లబ్ధిదారులకు భారంగా మారుతోంది. వేసవిని తలపిస్తున్న వాతావరణం గత ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగా రావడంతో జూలై నాటికే జిల్లాలోని చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. కానీ, ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. జూన్ ఆరంభంలో ముగియాల్సిన వేసవి తీవ్రత.. జూలై ముగింపునకు వస్తున్నా కొనసాగుతూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతున్నాయి. తీవ్రమైన ఉక్కపోతతో గృహాల్లో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. పలు ప్రాంతాల్లో లోడ్ ఎక్కువై విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు కూడా ఏర్పడుతున్నాయి. రికార్డు స్థాయిలో పెరిగిన డిమాండ్ గత ఏడాది మార్చి నుంచి జూన్ మొదటి వారం వరకు జిల్లాలో పేదల ఇళ్లలో రోజువారీ విద్యుత్ వినియోగం 150 మెగావాట్లను మించలేదు. కానీ ఈ ఏడాది ఎండల దెబ్బకు మే నెలలో కొన్ని రోజులు ఏకంగా 281 మెగావాట్ల అత్యధిక వినియోగం నమోదు కావడం గమనార్హం. జూన్, జూలై నెలల్లో సైతం ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఉచిత పరిధి దాటుతున్న మీటర్లు జిల్లాలో మొత్తం 2,93,559 గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో తెల్ల రేషన్ కార్డు ఉండి, ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘గృహజ్యోతి’ పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందుతున్న లబ్ధిదారులు 1,51,446 మంది ఉన్నారు. అయితే, వాతావరణ పరిస్థితుల వల్ల ఇళ్లలో కూలర్లు, ఏసీలు గంటల తరబడి ఆన్ చేయాల్సి వస్తుండడంతో మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. నెలవారీ వాడకం 200 యూనిట్ల పరిధి దాటిపోతుండడంతో లబ్ధిదారులు గృహజ్యోతి పథకానికి అనర్హులుగా మారుతున్నారు. ఫలితంగా భారీగా కరెంట్ బిల్లులు వస్తుండడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.11,9679,4766,4084,7661,071ఎల్‌నినో ఎఫెక్ట్ ఫ వర్షాకాలంలోనూ సుర్రుమంటున్న ఎండలు, తీవ్ర ఉక్కపోత ఫ కూలర్లు, ఏసీల వాడకంతో పెరిగిన విద్యుత్ వినియోగం ఫ 200 యూనిట్ల పరిధి దాటడడంతో లబ్ధిదారుల్లో ఆందోళన ఐదు నెలుగా ‘గృహజ్యోతి’కి అర్హత కోల్పోయిన వారు మేఏప్రిల్మార్చిజూలైజూన్ -
వైభవంగా జగన్నాథ రథయాత్ర
ఆలేరు : ఆలేరు పట్టణంలో ఆదివారం రాత్రి జై జగన్నాథ నినాదాలు.. వేద పండితుల మంత్రోచ్ఛరణలు..భక్తుల సంకీర్తనలతో శ్రీజగన్నాథ స్వామి రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు జూకంటి సంపత్, జెట్ట నీరజ పాల్గొని రథయాత్రను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే బంగారు చీపురులతో రథం ముందు శుభ్రం చేశారు. ప్రత్యేక పూజల అనంతరం సంప్రదాయబద్ధంగా జగన్నాథ స్వామి రథాన్ని తాడుతో లాగి స్వామివారి సేవలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు హరే కృష్ణ నామస్మరణ చేస్తూ రథాన్ని లాగుతూ ముందుకుసాగటంతో పట్టణ వీధుల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కార్యక్రమంలో విద్యావేత్త బండిరాజుల శంకర్, ఇస్కాన్ ప్రతినిధులు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు గంగేష్, న్యాయవాది సీసా రవి, రంగనాయకుల దేవాలయం అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
వాణిజ్య ఒప్పందంతో రైతుల ఆత్మహత్యలు
యాదగిరిగుట్ట : భారత్– అమెరికా దేశాల వాణిజ్య ఒప్పందాలతో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ ఆరోపించారు. యాదగిరిగుట్టలో రాష్ట్ర రైతు సంఘం శిక్షణ శిబిరం ఆదివారం రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందంతో దేశంలోని 14 కోట్ల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాణిజ్య ఒప్పంద నిర్ణయాన్ని ప్రధాని మోదీ ఉపసంహరించుకోవాలన్నారు. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి నీటిని పంప్ చేయాలన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. సాగు నీటి అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత తీసుకోవాలన్నారు. ఈనెల 28న ఢిల్లీలో జాతీయ స్థాయి సమావేశం ఏర్పాటు చేసి భారత్– అమెరికా వాణిజ్య ఒప్పందంపై భారత రైతాంగానికి ఎంత ప్రమాదం ఏర్పడుతుందనే దానిపై చర్చ ఉంటుందన్నారు. 29న కార్మిక, రైతు సంఘాలు సంయుక్త కార్యక్రమాలపై జాతీయ స్థాయి సదస్సు ఉంటుందని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు శరత్ బాబు, సాగునీటి నిపుణులు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, రైతు సంఘం నాయకుడు కొల్లూరి రాజయ్య పాల్గొన్నారు. -
సొసైటీల్లోనూ యూరియా ధర భారమే!
రామన్నపేట : ఇప్పటికే వర్షాలు లేక అల్లాడుతున్న అన్నదాతలను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. యాప్ ద్వారా యూరియా బుక్ చేసి కొనుగోలు చేయడానికి అవస్థలు పడుతున్న రైతులకు ధర భారంగా మారనుంది. రవాణా చార్జీలు సొసైటీలే భరించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల 391 జీఓ జారీ చేసింది. పీఏసీఎస్, ఎన్డీసీఎంఎస్ల్లో ఇప్పటి వరకు తక్కువ ధరకే లభించిన యూరియా బస్తా ఒక్కంటికి రూ.30 వరకు పెరగనుంది. యాప్‌తో మొదలైన కష్టాలు యూరియా కృత్రిమ కొరతను అరికట్టడంతోపాటు మోతాదుకు మించి వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ ఫర్టిలైజర్ యాప్‌ను తీసుకొచ్చింది. యాప్ డౌన్లోడ్ చేసి పట్టాదారు పాసు పుస్తకం నంబర్‌ను ఎంట్రీ చేస్తే భూ వివరాలు వస్తాయి. భూమి ఆధారంగా ఎకరాలకు రెండు బస్తాల చొప్పున 20 రోజుల వ్యవధిలో రెండు విడతల్లో యూరియా బుకింగ్ అవుతుంది. గతంలో రైతులు యూరియాతో పాటు విత్తనాలు ఎరువులు, పురుగు మందులు ఒకే ఫరిలైజర్ షాపులో కొనుగోలు చేసేవారు. యాప్ రాకతో యూరియా ఏ సొసైటీ, ఏ షాపు, ఏ గ్రామంలో దొరుకుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నిన్నటి వరకు సొసైటీ, సీఎంఎస్‌లలో తక్కువ ధర రూ.267కు దొరికేది. అదే షాపుల్లో అయితే రూ.310 నుంచి రూ.320 పెట్టి కొనుగోలు చేయాల్సి వచ్చేది. సొసైటీలకు యూరియా సరఫరా చేస్తే రవాణా చార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది. దుకాణాదారులు మార్క్‌ఫెడ్ నుంచి యూరియాను తీసుకురావడానికి అయ్యే రవాణా ఖర్చులు భరించాల్సి రావడంతో బస్తాకు రూ.30 నుంచి రూ.40 ఎక్కువకు విక్రయించాల్సి వచ్చేది. ఇకపై సొసైటీల్లోనూ అధిక ధరే.. ఈ వానాకాలంలో వర్షాలు కురిసి, కాలువలకు నీళ్లు వదిలితే సుమారు 4.75లక్షల ఎకరాల విస్తీర్ణంలో అన్నిరకాల పంటలు సాగు అవుతాయని అధికారులు అంచనా వేశారు. మొత్తం సీజన్‌కు 37,766 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ఇప్పటికే రైతులు నలభైశాతం మేర యూరియాను కొనుగోలు చేశారు. ఇకపై సొసైటీలకు సరఫరా చేసే యూరియా రవాణా ఖర్చులను ప్రభుత్వం చెల్లించదు. సొసైటీలే భరించాల్సి ఉంటుంది. దీంతో సొసైటీల్లో కూడా మిగిలిన దుకాణదారుల వలే రూ.300 నుంచి రూ.320లకు అమ్మాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అంచనా ప్రకారం పంటలసాగు అయితే జిల్లాలోని రైతులపై సుమారు రూ.65 లక్షల నుంచి రూ.70 లక్షల భారం పడనుంది. ఫ యూరియా రవాణా చార్జీలు సంఘాలే భరించాలని ఆదేశాలు ఫ ఇటీవలే జీఓ జారీ చేసిన కేంద్రం ఫ ఒక్కో బస్తాపై రూ.30 వరకు ధర పెంచి అమ్మనున్న సంఘాలు -
వైటీడీ పాలకమండలి సభ్యుడిగా విజయేందర్ ప్రమాణ స్వీకారం
యాదగిరిగుట్ట : వైటీడీ పాలకమండలి సభ్యుడిగా తూళ్ల విజయేందర్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 11న పాలకమండలి చైర్మన్ ఎం. సత్యనారాయణరెడ్డితో పాటు 8 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, తూళ్ల విజయేందర్ ప్రమాణ స్వీకారం చేయలేదు. దీంతో ఆదివారం తూళ్ల విజయేందర్ తన సతీమణి, కుమార్తెతో వచ్చి గర్భాలయ బంగారు వాకిలి వద్ద ఈఓ భవానీ శంకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారికి అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఈఓ లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటం అందజేశారు. అనంతరం తూళ్ల విజయేందర్ మాట్లాడుతూ.. వైటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తిరుమల తిరుపతి స్థాయిలో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. -
సారా తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
హుజూర్నగర్ : బైక్‌పై సారా తరలిస్తున్న వ్యక్తిని ఎకై ్సజ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఎకై ్సజ్ ఎస్ఐ దివ్య తెలిపిన వివరాల ప్రకారం.. పాలకవీడు మండలం అలింగాపురం గ్రామానికి చెందిన మట్టపల్లి సైదులు తన బైక్‌పై సారా తరలిస్తుండగా.. వాహనాల తనిఖీల్లో భాగంగా ఎకై ్సజ్ పోలీసులు అతడిని పట్టుకున్నారు. అతడి నుంచి 8 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని బైక్ సీజ్ చేసినట్లు ఎకై ్సజ్ ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారుతిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి మండలం తొండ గ్రామ శివారులో 365బీ జాతీయ రహదారిపై ఆదివారం కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం నర్సింగపురం గ్రామానికి చెందిన వ్యక్తి కారులో తిరుమలగిరి నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన సదరు వ్యక్తిని స్థానికులు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధంబొమ్మలరామారం : మండలంలోని మర్యాల గ్రామం ఎస్సీ కాలనీలో నివాసముంటున్న సంగి స్వామి ఇంట్లో ఆదివారం షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు రావడంతో ఇరుగుపొరుగు వారు గమనించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. ఇంట్లోని సామగ్రి, నిత్యావసర వస్తువులతో పాటు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం అప్పుగా తీసుకొచ్చిన రూ.2.50లక్షల నగదు కాలిపోయాయనని బాధితుడు స్వామి బోరున విలపించాడు. తహసీల్దార్ శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులకు బియ్యం, నిత్యావసర సరకులు అందజేశారు. ఎస్ఐ కుటుంబానికి రూ.25 లక్షలు ఆర్థికసాయంచిలుకూరు : మండలంలోని బేతవోలు గ్రామానికి చెందిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కీసరలో ఎస్ఐగా పనిచేస్తూ అకాల మరణం చెందిన గుండెపంగు వెంకటనారాయణ కుటుంబానికి ఆదివారం తోటి ఉద్యోగులు రూ.25 లక్షల ఆర్థికసాయం చేశారు. ఈ మేరకు చిలుకూరు ఎస్ఐ మోహన్‌బాబు ఆధ్వర్యంలో 50 మందికి పైగా ఎస్ఐలు కలిసి చెక్కును వెంకటనారాయణ కుటుంబ సభ్యులకు అందజేశారు. -
నెలాఖరు వరకే ఇ–కేవైసీ
భువనగిరి : రేషన్ కార్డుల ఇ–కేవైసీకి పౌరసరఫరాల శాఖ ఈ నెల 31 వరకు తుది గడువు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కార్డులోని సభ్యులంతా తమ పరిధిలోని రేషన్ దుకాణాలకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వాస్తవానికి రెండున్నరేళ్ల క్రితమే కార్డు కారులందరూ ఇ–కేవైసీ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా వ్యాప్తంగా ఈ ప్రక్రియ కొన్ని నెలలు వేగంగా కొనసాగి ఆ తర్వాత కాస్త మందగించింది. ప్రస్తుతం నకిలీ కార్డులను ఏరివేయడానికి ఈకేవైసీలో వేగం పెంచారు. 82 శాతం పూర్తి జిల్లాలో 515 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఆయా దుకాణాల పరిధిలో 2,52,187 కార్డులు ఉన్నాయి. ఇందులో ఆహార భద్రత కార్డులు 2,38,260, అంత్యోదయ కార్డులు 13,727 కార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 82 శాతం ఇ–కేవైసీ ప్రక్రియ పూర్తయింది. ఇ–కేవైసీకి సూచనలు.. ఫ కార్డుదారులు సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి అక్కడ డీలర్ చెప్పినట్లుగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకుంటే ఇ–కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. ఫ కార్డులోని ప్రతి సభ్యుడు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ పూర్తి చేయించుకోవాలి. ఫ ఇ–కేవైసీకి నెలవారి సరుకుల పంపిణీకి ఎలాంటి సంబంధం లేదు. ఎప్పుడైనా వెళ్లి చేయించుకోవచ్చు. ఫ రేషన్ దుకాణానికి వెళ్లలేని వృద్ధులు కదల్లేనివారు, దివ్యాంగుల మినహాయింపు కోసం రేషన్ డీలర్ లేదా తహసీల్దార్‌ను సంప్రదించాలి. ఫ బయోమెట్రిక్ వేలిముద్రలు రాకుంటే ఆధార్ సేవలో అప్డేట్ చేయించుకోవాలి. జిల్లాలో రేషన్‌కార్డులకు ఈకేవైసీ పూర్తి చేయించాలని ఆదేశాలు వచ్చాయి. దుకాణాల వారీగా కేఈవైసీ చేయించుకోని వారిని గుర్తించి పూర్తిచేయించాలని తహసీల్దార్లకు సైతం సూచించాం. ఈకేవైసీ చేయించుకోకపోతే భవిష్యత్‌లో రేషన్ కార్డులో పేరు తొలగించబడుతుంది. ఆహార ధాన్యాల కేటాయింపు ఉండదు. కార్డులో పేరున్న వారందరూ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. – రోజా, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఫ రేషన్ కార్డుదారులకు చివరి అవకాశం ఫ 31 నాటికి తుది గడువు విధించి పౌరసరఫరాల శాఖ ఫ ఇప్పటి వరకు 82 శాతం పూర్తి -
కార్మిక సమస్యలపై ఏఐటీయూసీ పోరాటం
గుర్రంపోడు : కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటాలు చేస్తుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏఐటీయూసీ జిల్లా మహాసభల్లో ఆయన మాట్లాడారు. కార్మికుల హక్కుల సాధనకు దేశంలో మొట్టమొదట ఏర్పడిన సంఘం ఏఐటీయూసీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కార్మికలోకం పోరాటాన్ని తీవ్రతరం చేస్తోందన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై మోయలేని భారం మోపిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల పేద వారు మరింత పేదవారుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్ మాట్లాడుతూ 1920 అక్టోబర్ 31 ఆవిర్భవించిన కార్మిక సంఘం ఏఐటీయూసీ అన్నారు. స్వాతంత్య్రానికి పూర్వమే కార్మిక చట్టం, పారిశ్రామిక విధానాల చట్టం, బిట్రీష్ సామ్రాజ్యవాదుల నుంచి భారతదేశాన్ని విముక్తి కోసం పోరాటాలు చేసిన గొప్ప సంఘమని చెప్పారు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు గడిచినా రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికుల జీవితాలు మారలేదన్నారు. మహాసభలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు ఎం.నర్సింహ, ఉజ్జిని రత్నాకర్‌రావు, ఎండీ ఇమ్రాన్, పల్లా దేవేందర్‌రెడ్డి, రామస్వామి, నాయకులు కేఎన్.రెడ్డి, నూనె వెంకటేశ్వర్లు, వెంకట్రావ్, వెంకన్న, రేపాక లక్ష్మీపతి, ఎస్కే అమీర్ తదితరులు పాల్గొన్నారు. -
బస్వాపురం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలి
భువనగిరి : బస్వాపురం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేసి ప్రాజెక్టు పరిధిలోని చెరువులను నింపి సాగు నీరు అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. బస్వాపురం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి భూ నిర్వాహసితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రాజెక్టు కట్టపై చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రైతులకు ఉపయోగపడే బస్వాపురం ప్రాజెక్టును పూర్తి చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం నిధుల విడుదలలోనూ ప్రభుత్వం వివక్ష చూపడం తగదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నీటి విడుదల చేయని పక్షంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బాలరాజు, నాయకులు దయ్యాల నర్సింహ, అంజయ్య, ఈర్లపల్లి ముత్యాలు, అన్నంపల్ల కృష్ణ, కొండ అశోక్, మాతయ్య, ఎల్లయ్య, వెంకటేష్, బాబు, చంద్రయ్య, దేవేందర్ పాల్గొన్నారు. -
రెడ్డి కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించాలి
నల్లగొండ టౌన్ : ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి కుటుంబాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలను రూపొందించాలని రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టెంగారి మాధవరెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన రెడ్డి జాగృతి విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రెడ్డి జాగృతి జిల్లా అధ్యక్షుడు ఎంరెడ్డి నర్సిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జ జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రముఖ నాయకులు నీరుడు దయాకర్ రెడ్డి, యానాల ప్రభాకర్ రెడ్డి, మందడి వెంకట్‌రెడ్డి, వంగాల నరేందర్‌రెడ్డి, పైళ్ల మధుసూదన్‌రెడ్డి, మారెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి
ఆలేరు : చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆదివారం ఆలేరు పట్టణంలో హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. సొసైటీ చైర్మన్‌గా దాసి శంకర్, డైరెక్టర్లుగా చింతకింది రంగ, గాడిపెల్లి రమేష్,ఎలగందుల ఉమాబుషి, బింగి నర్సింహులు, అంకం మల్లేశం, అందె రామలు, ఎలగందుల పద్మతో చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా హాజరైన ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ఆలేరు సొసైటీ చైర్మన్ దాసి శంకర్‌కు టెస్కో డైరెక్టర్ పదవి వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చేనేత కార్మికుల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.25లక్షల నిధులు మంజూరు చేస్తానన్నారు. చేనేత ఉత్పత్తులు ప్రభుత్వరంగ సంస్థలు కొనుగోలు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో చేనేతలకు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా అభివృద్ధి సంస్థ మాజీ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, మాజీ ఆప్కో చైర్మన్ మండల శ్రీరాములు, మున్సిపల్ చైర్పర్సన్ బీజన బాలమణి, వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, కౌన్సిలర్లు జూకంటి సంపత్, జెట్ట నీరజ తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
విద్యార్థులకు నైతిక విలువలు, క్రమశిక్షణ అవసరం
భూదాన్‌పోచంపల్లి : విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ అవసరమని విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య అన్నారు. ఆదివారం పోచంపల్లి మండలం దేశ్ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో నిర్వహించిన ఓరియేంటేషన్ డేలో ఆయన పాల్గొని మాట్లాడారు. విజ్ఞాన్స్ విద్యాసంస్థల్లో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంమ, ప్లానింగ్, ట్రైనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, సీఆర్టీ తరగతులు, బోధనా పద్దతులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని అన్నారు. విజ్ఞాన్స్ యూనివర్సిటీలో చదువుకున్న 85శాతం విద్యార్థులకు మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. అధ్యాపకులు సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ విద్యార్థుల సర్వతోముఖావృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. యూన్సివర్సిటీ అడ్వెయిజర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నిరంతరం నేర్చుకోవాలనే తపన ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ కేవీ కృష్ణకిషోర్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, యూనివర్సిటీ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వర్‌రావు, ఆయా విభాగాల డీన్లు, డైరెక్టర్లు, హెచ్ఓడీలు, అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య -
నేటి నుంచి ‘మిషన్ ఇంద్రధనస్సు’
భువనగిరి : ఐదు సంవత్సరాల ్లలోపు వయస్సు కలగిన చిన్నారులు, గర్భిణుల్లో వచ్చే ప్రాణాంతక వ్యాధుల నిరోధానికి టీకాలు ఇచ్చేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు మిషన్ ఇంద్రధనస్సు పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం వైద్యారోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. టీకాలు వేయించుకోని లేదా పాక్షికంగా టీకాలు వేయించుకున్న గర్భిణులు, 5 సంవత్సరాల లోపు పిల్లలకు 100 శాతం రోగ నిరోధక శక్తి పెంచేందుకు ఈ కార్యక్రమం ద్వారా మీజిల్స్ రూబెల్లా (ఎంఆర్) టీకాను ఇవ్వనున్నారు. నిరోధించే వ్యాధులు ఇవే.. మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం ద్వారా ఎంఆర్ టీకాలు వేయడంతో డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం, పోలియో, క్షయ, హెపటైటిస్–బి, తట్టు, రుబెల్లా, మెనింజైటిస్, నిమోనియా, జపనిస్ ఎల్సెఫలేటిస్, రోటా వైరస్ వంటి ప్రాణాంతక వ్యాధుల నిరోధించవచ్చు. జిల్లాలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా జనరల్ ఆస్పత్రి, మూడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పరిధిలో ఉన్న టీకాలు వేయించుకోని వారిని గుర్తించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సంచార జాతులు, వలస కార్మికులు ఉండే స్థలాల్లో ఉన్న పిల్లలకు టీకాలు వేయించుకోని వారిని గుర్తించి ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఫ ప్రాణాంతక వ్యాధుల నిరోధానికి టీకాలు ఫ పిల్లలు, గర్భిణుల్లో రోగ నిరోధక శక్తి పెంపునకు ప్రణాళి ఫ 27 వరకు టీకాల ప్రక్రియ కొనసాగింపు -
బీబీనగర్ ఎయిమ్స్‌లో భవన నిర్మాణాల్లో తీవ్ర జాప్యం
బీబీనగర్ ఎయిమ్స్‌పై ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు. నిధులకు ఎలాంటి కొరత లేదు. పనులు ఆలస్యమవుతున్న విషయాన్ని గుర్తించాం. ఈ సంవత్సరం చివరి నాటికి క్యాంపస్‌లో నిర్మాణాలు పూర్తవుతాయి. ఇక్కడ ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం లభిస్తుంది. క్యాంపస్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతానని ఇటీవల ఎయిమ్స్ సందర్శనకు వచ్చిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. సాక్షి, యాదాద్రి : బీబీనగర్‌లోని ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో అద్భుతమైన వైద్యసేవలు, పరిశోధనల్లో ఎన్నో మైలురాళ్లను చేరుకుంటున్నా భవన నిర్మాణ పనుల్లో జాప్యం.. మౌలిక వసతుల లేమి, సిబ్బంది కొరత కారణంగా రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందడ ం లేదు. ముఖ్యంగా భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేసి ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, డాక్టర్ పోస్టులను భర్తీ చేస్తేనే ఈ ప్రాంత ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి రానుంది. నత్తనడకన భవన నిర్మాణాలు రూ.1,000 కోట్లకుపైగా నిధులతో 201 ఎకరాల విస్తీర్ణంలో 750 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు 85 శాతం పూర్తయ్యాయి. సైట్లో కార్మికుల కొరత వల్ల పనుల పూర్తికి గడువులు మారుతూ వస్తున్నాయి. 2025 నాటికే పూర్తి కావాల్సిన ఈ పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేస్తామని ఇటీవల ఎయిమ్స్ సందర్శనకు వచ్చిన కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు నిర్మాణ సంస్థ హామీ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఆడిటోరియం, రెసిడెన్షియల్ క్వార్టర్స్, కొత్త ఆస్పత్రి బ్లాక్ పనులు సెప్టెంబర్ 2026 నాటికి పూర్తి కావాల్సి ఉంది. వేధిస్తున్న ఫ్యాకల్టీ, డాక్టర్ల కొరత ఎయిమ్స్ మెడికల్ కళాశాలలో ప్రస్తుతం 902 మంది వైద్య విద్యార్థులున్నారు. వీరికి విద్యాబోధన, రోగులకు చికిత్స అందించే నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. మంజూరైన 183 ఫ్యాకల్టీ పోస్టులకు 131 మాత్రమే భర్తీ అయ్యాయి. ప్రొఫెసర్ పోస్టులలో ఏకంగా 65 శాతం ఖాళీలున్నాయి. 186 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు 101 భర్తీ కాగా, 85 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఒక్కరే డాక్టర్ ఉండడంతో పనిభారం పెరుగుతోంది. అత్యవసర కేసులను సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఫైర్ స్టేషన్, ట్రామా కేర్ ఏవీ? క్యాంపస్‌లో 18 నుంచి 23 అంతస్తుల భవనాలు ఉన్నాయి. 1,000 మందికి పైగా విద్యార్థులు నివసిస్తుండగా, ఈ సంఖ్య త్వరలో 1,500కి చేరనుంది. అయినా ఇక్కడ పూర్తిస్థాయి ఫైర్ స్టేషన్ అందుబాటులోకి రాలేదు. భవనం సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కొలిక్కి రాలేదు. అలాగే జాతీయ రహదారి పక్కనే ఉన్నా ఎమర్జెన్సీ వార్డులో కేవలం 13 బెడ్లు మాత్రమే ఉండడం ఆందోళనకరం. ట్రామా కేర్ సెంటర్, రోగుల సహాయకుల కోసం ‘విశ్రామ్ సదన్’ ఏర్పాటుతో పాటు గ్రీన్ క్యాంపస్‌గా (సోలార్ ప్యానెళ్లు, ఈవీ చార్జింగ్) మార్చాల్సిన అవసరం ఉంది. పరిశోధనలకు పెద్దపీట ఐదు సంవత్సరాలల్లో ఎయిమ్స్ పరిశోధనలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)తో కలిసి క్యాన్సర్, వైరల్ వ్యాధులు, క్షయ, పోషకాహారం తదితర అంశాలపై పరిశోధనలు కేంద్రీకరించింది. మొత్తం గా ఎయిమ్స్‌లో 1,156 ప్రచురణలు చేయగా, 64 కోట్ల రూపాయలు పరిశోధనలకే కేటాయించారు. ఇందులో 129 ప్రాజెక్టులకు నిధులు దక్కగా, 6 పేటెంట్లు, కాపీరైట్లను సంస్థ సాధించింది. ఫ ఇప్పటికే రెండు సార్లు గడువు పెంచిన కేంద్రం ఫ వేధిస్తున్న ఫ్యాకల్టీ, డాక్టర్ల కొరత ఫ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపితేనే కార్పొరేట్ స్థాయి వైద్యం సమస్యలున్నప్పటికీ ఓపీడీ సేవలు మెరుగుపడ్డాయి. 2020–21లో 7,116గా ఉన్న ఓపీడీ రోగుల సంఖ్య, 2025–26 నాటికి 5,09,299కి చేరుకుంది. ఇప్పటివరకు 16,83,121 మందికి వైద్యసేవలు అందించగా, సగటున రోజుకు 1,800 మంది వస్తున్నారు. 2025–26లో ఇన్–పేషెంట్ల (ఐపీ) సంఖ్య 10,883కు చేరింది. ‘ఈ–సంజీవని’ ద్వారా ఇప్పటివరకు 1,53,408 టెలిమెడిసిన్ కన్సల్టేషన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. రోగ నిర్ధారణ పరీక్షల సంఖ్య 2019–20లో 2,665 ఉండగా, 2025–26 నాటికి 10,44,167కు పెరిగింది. క్యాథ్ ల్యాబ్, లీనియర్ యాక్సిలరేటర్, సీటీ సిమ్యులేటర్ వంటి అత్యాధునిక పరికరాలను అమర్చుతున్నారు. -
ఆటోను ఢీకొట్టిన కారు
మర్రిగూడ(చింతపల్లి) : ఆటోను కారు ఢీకొట్టడంతో ఎనిమిది మంది మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కొల్కులపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జింకల లింగస్వామి తన ఆటోలో గ్రామానికి చెందిన పలువురు మహిళలను ఎక్కించుకుని నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలం వావిల్‌కోల్ గ్రామానికి బయల్దేరాడు. మధ్యాహ్నం వీరు నల్లగొండ జిల్లా చింతపల్లి ఎక్స్ రోడ్డు సమీపంలోకి చేరుకోగానే ప్రయాణికులకు దాహం వేయడంతో లింగస్వామి ఆటోను రహదారి పక్కన నిలిపాడు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి వస్తున్న కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మహిళలతో పాటు ఆటో పక్కనే నిలబడిన వారు రోడ్డుపై పడిపోయారు. కొల్కులపల్లి గ్రామానికి చెందిన ఈర్లపల్లి ఇంద్రమ్మ, పడాల లక్ష్మమ్మ, పడాల మైసమ్మ, పడాల జంగమ్మ, పాలె నర్సమ్మ, పడాల వసంత, పడాల కాశమ్మ, పడాల యాదమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ కృష్ణయ్యపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఆటో డ్రైవర్ లింగస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.● ఎనిమిది మంది మహిళలకు గాయాలు -
బీసీలకు అడుగడుగునా అన్యాయమే..
యాదగిరిగుట్ట : బీసీలకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు కళ్లెం కృష్ణ అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో ఆదివారం నిర్వహించిన బీసీ హక్కుల సాధన సమితి మండల మహాసభలో ఆయన మాట్లాడారు. దేశ జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు మాత్రం ఇప్పటి వరకు రాజకీయ రిజర్వేషన్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. కేవలం విద్యా, ఉద్యోగ రంగాల్లో మాత్రమే 27 శాతం రిజర్వేషన్లు లభించిందని పేర్కోన్నారు. కనీసం బీసీ సబ్ ప్లాన్, రక్షణ చట్టాలు కల్పించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అడగకుండానే 13వ రాజ్యాంగ సవరణతో అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్ కల్పించారని, బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ బిల్లులను పెండింగ్‌లోనే పెట్టడం శోచనీయమన్నారు. సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి కల్లెపల్లి మహేందర్, మున్సిపల్ కౌన్సిలర్ బబ్బురి శ్రీధర్, రైతు సంఘం నాయకులు పేరబోయిన పెంటయ్య, బొదాసు జగన్, పాకాలపాటి రాజు, పబ్బాల స్వామి, కోనేరు శీను, అనంతుల నరసింహ, శెట్టి నరసింహ, సత్యం, మహేష్ పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో సుదర్శన హోమంయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి పుణ్యక్షేత్రంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా జరిపించారు. ఆదివారం వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం సంప్రదాయంగా నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలు చేపట్టారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన జరిపించారు. సాయంత్రం వేళ అలంకారమూర్తులైన శ్రీస్వామి అమ్మవార్ల జోడు సేవను అర్చకులు ఊరేగించారు. మత్తుకు బానిస కావొద్దు సూర్యాపేటటౌన్ : సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో యువత వా టికి బానిస కాకుండా ఉండేందుకు పోలీసులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, సామాజిక సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యుడు డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో పోలీసుల పాత్ర ఎంత ముఖ్యమో, అదే స్థాయిలో యువత, తల్లిదండ్రులు, ప్రతి వర్గం అంతే బాధ్యతగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
సిరిపురంలో ఈటీపీ రెడీ
రామన్నపేట : చేనేత వస్త్రాల రంగుల అద్దకం ద్వారా వెలువడే రసాయన జలాల కాలుష్యానికి ఇక తెరపడనుంది. ఇందుకు రామన్నపేట మండలం సిరిపురం గ్రామం వేదికగా నిలిచింది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(డీఎస్టీ) ఆర్థిక సహకారంతో హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) ఆధ్వర్యంలో ఇక్కడ నిర్మించిన ఎఫ్లూయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఈటీపీ) ట్రయల్ రన్ విజయవంతమైంది. ‘సిరిపురం మోడల్ ప్లాంట్’గా పిలిచే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సోమవారం ప్రభుత్వ విప్ వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఐఐసీటీ డైరెక్టర్ డి. శ్రీనివాస్‌రెడ్డిల చేతుల మీదుగా గ్రామ పంచాయతీకి అప్పగించనున్నారు. దేశంలోనే తొలి ప్లాంట్.. సిరిపురం మోడల్ సిరిపురం గ్రామం బెడ్షీట్లు, మెర్సైరెజ్డ్ (మస్రస్) చీరల తయారీకి ప్రసిద్ధి చెందింది. ఇక్కడి సగానికి పైగా కుటుంబాలు చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. వస్త్రాల తయారీలో వివిధ డిజైన్ల కోసం రసాయన రంగులను వినియోగిస్తారు. దాదాపు ప్రతి ఇంట్లో డైయింగ్ యూనిట్ ఉండటంతో.. అద్దకంలో వాడిన రసాయన జలాలు మురుగు కాలువల ద్వారా సమీపంలోని ఊరకుంటకు చేరి తీవ్ర కాలుష్యానికి కారణమవుతున్నాయి. గతంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో నదీ జలాల కాలుష్యానికి కారణమవుతున్నాయంటూ పలు డైయింగ్ యూనిట్లను అధికారులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో కాలుష్య కారక రసాయన జలాలను సహజసిద్ధంగా శుద్ధి చేసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఆర్థిక సాయంతో హైదరాబాద్‌లోని ఐఐసీటీ దేశంలోనే ప్రప్రథమంగా సిరిపురంలో ఈ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. సుమారు రూ.2 కోట్లకు పైగా నిధులతో దీనిని నిర్మించారు. గ్రామంలోని ప్రధాన రహదారి వెంట అండర్‌గ్రౌండ్ డ్రైన్‌ను నిర్మించి ఇళ్ల నుంచి వచ్చే రసాయన, మురుగు నీరు నేరుగా ప్లాంట్‌కు చేరేలా డిజైన్ చేశారు. రసాయన నీటి శుద్ధి ఇలా.. ప్లాంట్‌కు చేరిన మురుగునీటిలోని వ్యర్థాలు, ప్లాస్టిక్ వస్తువులు, చెత్తాచెదారాన్ని మొదటి దశలో వేరుచేసి నీటిని సంపులోకి పంపుతారు. ఆ తర్వాత బ్యాక్టీరియా సహకారంతో పూర్తిగా సహజ సిద్ధమైన పద్ధతిలో కాలుష్య కారకాలను, రసాయనాలను వివిధ దశల్లో శుద్ధి చేస్తారు. ఆఖరి దశలో నీటి నాణ్యతను పరీక్షించి, ప్రమాణాల మేరకు శుద్ధి అయితేనే బయటకు వదులుతారు. నాణ్యత లోపిస్తే మళ్లీ రీ–ట్రీట్ చేస్తారు. ఇలా శుద్ధి చేసిన నీటిని వ్యవసాయం, చెట్ల పెంపకం, గృహ నిర్మాణాలకు వినియోగించుకునేలా పైప్‌లైన్ ఏర్పాటు చేశారు.సిరిపురం చేనేతకు దక్కనున్న ‘ఎకో లేబుల్’ దేశంలో రసాయన జలాల శుద్ధి కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి పైలట్ ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. ఇది విజయవంతం కావడంతో భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఎక్కడ ఇలాంటి ప్లాంట్లు ఏర్పాటు చేసినా వాటికి ‘సిరిపురం మోడల్ ట్రీట్మెంట్ ప్లాంట్’ గానే నామకరణం చేస్తామని ఐఐసీటీ శాస్త్రవేత్తలు తెలిపారు. కాలుష్యరహిత విధానాలను పాటించడం వల్ల సిరిపురం గ్రామానికి ప్రభుత్వం ‘ఎకో లేబుల్’ ఇచ్చే అవకాశం ఉందని, తద్వారా ఇక్కడి చేనేత ఉత్పత్తుల ఎగుమతులకు అంతర్జాతీయంగా మరింత డిమాండ్ పెరుగుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ట్రయల్ రన్ విజయవంతం నేడు గ్రామ పంచాయతీకి అప్పగింతగతంలో నేను సర్పంచ్‌గా ఉన్న సమయంలో ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ మంజూరు కావడం ఎంతో సంతోషంగా ఉంది. ప్లాంట్ నిర్మాణానికి శాస్త్రవేత్తలు, కాంట్రాక్టర్ ఎంతో శ్రమించారు. అందరి కృషితో నిర్మాణం పూర్తయి, ట్రయల్ రన్ విజయవంతమైంది. సిరిపురం గ్రామంలో ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఐఐసీటీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. – అప్పం లక్ష్మీనర్సు, సిరిపురం మాజీ సర్పంచ్ -
వన్నె తరగని విద్యా వృక్షం
రామగిరి(నల్లగొండ) : ఉమ్మడి జిల్లాలోనే ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థగా పేరొందిన నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల (ఎన్జీ) మరో అపూర్వ ఘట్టానికి వేదిక కాబోతోంది. ఏడు దశాబ్దాల సుదీర్ఘ విద్యా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఈ కళాశాల స్నాతకోత్సవాన్ని(కాన్వొకేషన్ డే) ఈ నెల 22న నిర్వహించనున్నారు. 1956లో ప్రారంభం..1956 జూలై 22న అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు చేతుల మీదుగా ఈ కళాశాల ప్రారంభమైంది. అప్పట్లో హైదరాబాద్‌లో నిజాం కళాశాలతో పాటు ఖమ్మం, సిద్దిపేట, కరీంనగర్, నల్లగొండలో కలిపి కేవలం ఐదు ప్రభుత్వ కళాశాలలు మాత్రమే ఉండగా.. అందులో ఎన్జీ కళాశాల ఒకటి కావడం విశేషం. ఆచార్య నాగార్జునుడి స్ఫూర్తితో 29 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో ప్రారంభమైన ఈ కళాశాల వేలాది మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చి అగ్రగామిగా నిలిచింది. ఈ కళాశాలలో సీటు వస్తే గొప్ప వరంగా విద్యార్థులు భావిస్తారు. అత్యుత్తమ బోధనా ప్రమాణాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అధునాతన ల్యాబ్‌లు ఉండటమే దీనికి ప్రధాన కారణం. రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా ఎన్జీ కళాశాల సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక్కడ చదివిన వారిలో ఇప్పటివరకు 25 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎంపికయ్యారు. ఎంతో మంది శాస్త్రవేత్తలుగా, రాజకీయ నాయకులుగా, ఉన్నతాధికారులుగా స్థిరపడ్డారు. స్వయం ప్రతిపత్తితో ఉన్నత శిఖరాలకు..2004 ఫిబ్రవరి 16న మొదటిసారి యూజీసీ న్యాక్ శ్రీబిశ్రీ గుర్తింపు పొందిన ఈ కళాశాల 2007–08 విద్యాసంవత్సరం నుంచి స్వయం ప్రతిపత్తి (అటానమస్) హోదాను దక్కించుకుంది. సిలబస్ రూపకల్పన, అకడమిక్ షెడ్యూల్, పరీక్షల నిర్వహణ తదితర విషయాల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ విద్యా ప్రమాణాలను మరింత పెంచింది. ప్రస్తుతం కళాశాలలో 18 యూజీ కోర్సులు, 6 పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 4500 పైచిలుకు విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు. డిజిటల్ లైబ్రరీ సదుపాయం కలదు. గ్రంథాలయంలో వేల కొలది పుస్తకాలు, జర్నల్స్ అందుబాటులో ఉన్నాయి. 23 మందికి బంగారు పతకాలు..2024–25 విద్యా సంవత్సరంలో ఐదు పీజీ కోర్సులు, 2025–26 విద్యా సంవత్సరంలో 18 యూజీ కోర్సుల్లో అసాధారణ ప్రతిభ కనబరిచి, అకడమిక్ విభాగాల్లో ప్రథమ స్థానాల్లో నిలిచిన 23 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ స్నాతకోత్సవంలో బంగారు పతకాలు ప్రదానం చేయనున్నారు. సుమారు 400 మంది విద్యార్థులు కాన్వొకేషన్ సర్టిఫికెట్ కొరకు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రతినిధులు, ప్రముఖ విద్యావేత్తల చేతులమీదుగా బంగారు పతకాలు, పట్టాలు ప్రదానం చేయనున్నారు. స్నాతకోత్సవంలో పాల్గొనే విద్యార్థుల కోసం కళాశాల యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పట్టాలు స్వీకరించే విద్యార్థులతో పాటు వారి తల్లితండ్రులను కూడా ఈ వేడుకకు అనుమతిస్తారు. 22న ఎన్జీ కళాశాల 70వ వ్యవస్థాపక వేడుకలు అదే రోజు స్నాతకోత్సవం బంగారు పతకాలు అందుకోనున్న 23 మంది టాపర్లుఎంతో మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘన చరిత్ర ఎన్జీ కళాశాలకు ఉంది. ఈ కళాశాలను ప్రారంభించిన రోజునే స్నాతకోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉంది. కష్టపడి చదివిన విద్యార్థులకు, వారిని చదివించిన తల్లిదండ్రులకు ఈ కాన్వొకేషన్ వేడుక అపురూపమైన జ్ఞాపకంగా మిగిలిపోవాలన్నదే మా సంకల్పం. అందుకే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా ఈ వేడుకకు సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. – సముద్రాల ఉపేందర్, ప్రిన్సిపాల్ -
రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు
యాదగిరిగుట్ట: రైతులు తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోతున్నారని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో మూడు రోజుల రాష్ట్రీయ స్థాయి శిక్షణ తరగతులు శనివారం యాదగిరిగుట్ట పట్టణంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ మహిళల ఆధ్వర్యంలో నడిచే చిన్న గృహ ఆధారిత పౌల్ట్రీ పారిశ్రమలు దెబ్బతినకుండా ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో హేమంతరావు, ఉపాధ్యక్షుడు కొప్పుజు సత్యనారాయణ, దొండపాటి రమేష్, కొల్లూరి రాజయ్య, మెడికంటి వెంకట్‌రెడ్డి, ప్రభు లింగం, దొడ్డ వెంకటయ్య, నెట్టెం నారాయణ, కార్యదర్శులు కందపర్తి గోవిందరావు, వెంకటయ్య, దేవబత్తుని సంధ్య, నరేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. -
ముగిసిన ఇంటర్ సర్కిల్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో తెలంగాణ ట్రాన్స్‌కో, టీజీ ఎనన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ సర్కిల్ వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, క్యారం క్రీడా పోటీలు శనివారం ముగిశాయి. టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్) టి.మధుసూదన్. హెచ్ఆర్డీ సి.ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరై గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. గెలుపొందిన జట్లు.. బాల్ బ్యాడ్మింటన్ విభాగంలో టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ ఆపరేషన్ సర్కిల్ జట్టు ప్రథమ బహుమతి, టీజీ ఎస్పీడీసీఎల్ నల్లగొండ సర్కిల్ జట్టు ద్వితీయ బహుమతి, మహబూబ్‌నగర్ సర్కిల్ జట్టు తృతీయ బహుమతి కై వసం చేసుకుంది. వాలీబాల్ విభాగంలో టీజీ ఎన్న్పీడీసీఎల్ ఖమ్మం ఆపరేషన్ సర్కిల్ జట్టు ప్రథమ బహుమతి, టీజీ ఎస్పీడీసీఎల్ మహబూబ్‌నగర్ సర్కిల్ జట్టు ద్వితీయ బహుమతి, హైదరాబాద్ సౌత్ సర్కిల్ జట్టు తృతీయ బహుమతి సాధించింది. క్యారం విభాగంలో టీజీ ఎన్న్పీడీసీఎల్ నిజామాబాద్ సర్కిల్ ప్రథమ బహుమతి, విద్యుత్ సౌధ, హైదరాబాద్ ద్వితీయ బహుమతి, ట్రాన్స్‌కో వరంగల్ తృతీయ బహుమతి దక్కించుకున్నాయి. సాగర్‌లో కార్మిక శాఖ కమిషనర్నాగార్జునసాగర్ : రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ పమేలా సత్పతి కుటుంబ సమేతంగా శనివారం నాగార్జునసాగర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాన డ్యాం, జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం బుద్ధవనంలో ధ్యానవనం, స్థూపవనం, జాతక పార్కును సందర్శించారు. మహాస్థూపంలోని ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతి వెలిగించారు. బుద్ధవనం అధికారులు శాసన, రవిచంద్ర ఆమెను సత్కరించారు. ఆమె వెంట అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ శ్రీనివాస్, ప్రొటోకాల్ అధికారి దండ శ్రీనివాసరెడ్డి, కార్మిక శాఖ అధికారి నాగరాజు తదితరులు ఉన్నారు. -
జల సంరక్షణకు కదులుదాం
భువనగిరిటౌన్ : ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జల మట్టాలు గణనీయంగా పడిపోతున్నాయి. ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో బోరుబావులు ఎండిపోతూ తాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. భూగర్భ జలాలను పెంచేందుకుగాను ‘క్యాచ్ ది రెయిన్–2026’ జాతీయ ప్రచారాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రతి చుక్క వర్షపు నీటిని పొదుపు చేయడమే లక్ష్యంగా ఈ ప్రచారాన్ని భారీ ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని కేంద్రం నిర్ణయించింది. ఆరు మున్సిపాలిటీల్లో విస్తృత ప్రచారం జిల్లాలోని భువనగిరి, పోచంపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు, చౌటుప్పల్ మున్సిపాలిటీల్లో భూగర్భ జలాలను పెంచే ప్రయత్నాలను మున్సిపల్ శాఖ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే కలెక్టరేట్‌తో పాటు ప్రధాన కూడళ్లలో హోర్డింగులు, అవగాహన బోర్డులను ఏర్పాటు చేశారు. భువనగిరి మున్సిపాలి టీలో ఖాళీ స్థలాలు, ఇళ్ల పరిసరాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్, కమి షనర్ ఆధ్వర్యంలో ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ప్రజా భాగస్వామ్యంతో అవగాహన భూగర్భ జలాల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కాలనీ సంక్షేమ సంఘాలు, స్వయం సహాయక సంఘాలు (ఐకేపీ), విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేస్తూ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. స్థానిక భాషల్లో బ్యానర్లు ఏర్పాటు చేయడంతో పాటు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో విద్యార్థులతో భారీ ర్యాలీలు నిర్వహిస్తూ, వారి చేత మొక్కలు నాటించే కార్యక్రమాలను చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కార్యక్రమాల వివరాలు ● అన్ని ప్రభుత్వ భవనాల్లో రూఫ్‌టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థ తప్పనిసరి. ● రీఛార్జ్ పిట్లు, రీఛార్జ్ బావులు, రీఛార్జ్ షాఫ్టులు, ఇంజెక్షన్ బావుల నిర్మాణానికి ఆదేశాలు. ● వినియోగంలో లేని బోరుబావులను పునరుద్ధరించడం. ● చెరువులు, సరస్సులు, సంప్రదాయ నీటి వనరుల పునరుజ్జీవనానికి ప్రత్యేక చర్యలు. ● పట్టణాల్లోని కాలువలు, జలాశయాల్లో పూడికతీత పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టడం. ● వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా చర్యలు. పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో ‘స్పాంజ్ పార్కులు’ అభివృద్ధి. ● రీఛార్జ్ జోన్లు, క్యాచ్మెంట్ ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కల పెంపకం. కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రతి మున్సిపాలిటీకి ఒక నోడల్ అధికారిని మున్సిపల్ శాఖ నియమించింది. క్షేత్రస్థాయిలో చేపట్టిన ప్రతి పని వివరాలను, జియో–ట్యాగ్ చేసిన ఫొటోలను ప్రతిరోజూ కేంద్ర ప్రభుత్వానికి చెందిన అమృత్ యూనివర్స్ ప్లాట్‌ఫామ్, జల్ సంచయ్ జన్ భాగీదారీ (జేఎస్జేబీ) పోర్టల్‌లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు వ్యక్తిగతంగా ఈ పనులను పర్యవేక్షించి, సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఫ ‘క్యాచ్ ది రెయిన్–2026’కు శ్రీకారం ఫ జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ప్రత్యేక కార్యాచరణ ఫ ప్రజా ఉద్యమంగా మార్చాలని కేంద్రం పిలుపు -
పత్తి మొలకలకు రెయిన్ గన్‌తో తడి
సాక్షి, యాదాద్రి : యూట్యూబ్‌లో చూసిన ఓ చిన్న ఆలోచనతో.. తన పత్తి పంటను కాపాడుకునేందుకు రెయిన్ గన్లను రంగంలోకి దించాడు. తక్కువ నీటితోనే పొలమంతా వర్షం కురిపిస్తూ సాగులో ఆదర్శంగా నిలుస్తున్నాడు భువనగిరి మండలం జమ్మాపురం గ్రామానికి చెందిన రైతు బాలస్వామి. ఆయన తనకున్న 15 ఎకరాల్లో పత్తి సాగు చేపట్టాడు. విత్తనాలు వేసి నెలన్నర దాటినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. రెండుసార్లు విత్తనాలు వేయడంతో ఇప్పటికే దాదాపు రూ.6 లక్షల వరకు పెట్టుబడి అయింది. మొక్కలు ఎండు ముఖం పట్టడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తూ యూట్యూబ్‌లో ‘రెయిన్ గన్’ ద్వారా పంటలకు నీరందించే విధానాన్ని చూశాడు. ఆలస్యం చేయకుండా వెంటనే రూ.40 వేల ఖర్చుతో మూడు రెయిన్ గన్లను కొనుగోలు చేసి, తన పొలంలో అమర్చాడు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో జమ్మాపురం గ్రామానికి చెందిన మరికొంతమంది రైతులు రెయిన్ గన్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. -
నకిలీ ఎరువుల తయారీ ముఠా గుట్టురట్టు
మఠంపల్లి : మండలంలోని రఘునాథపాలెం, మేళ్లచెరువు మండల వేపలమాదారంలో పట్టుబడిన నకిలీ డీఏపీ ఎరువులకు సంబంధించిన మూలాలను హుజూర్నగర్, మఠంపల్లి పోలీసులు కనిపెట్టారు. హుజూర్నగర్సీఐ గజ్జె చరమందరాజు, మఠంపల్లి ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్‌లో ఓ గోదాంలో నకిలీ ఎరువులు తయారు చేస్తున్నట్లు కనిపెట్టారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి గోదాంపై మెరుపు దాడి చేయగా.. నకిలీ ఎరువులు తయారుచేసే ముఠా తప్పించుకున్నారు. రూ.15లక్షలు విలువైన సుమారు 1000 నకిలీ డీఏపీ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. మట్టి, ఉప్పు, రసాయనాలతో కూడిన నాసిరకం పదార్థాలతో డీఏపీ ఎరువులు తయారుచేసి ప్రముఖ కంపెనీల పేర్లతో ఉన్న ఖాళీ సంచుల్లో నింపి ఒక్కో బస్తా రూ.1500 వరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ నకిలీ ఎరువులను సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు, నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి తదితర ప్రాంతాలకు ఏజెంట్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందని సీఐ చరమందరాజు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నకిలీ ఎరువులను వ్యవసాయశాఖ అధికారులకు అప్పగించామని.. ,పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామన్నారు.ఫ రూ.15లక్షల విలువైన 1000 బస్తాల నకిలీ ఎరువులు సీజ్ -
రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి
సాక్షి,యాదాద్రి : రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అన్నారు. శనివారం కలెక్టరేట్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీరాజ్ శాఖ వారిచే రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, వెంకారెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ.. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా ఆపదలో ఉన్న వారిని ప్రాణాలను రక్షించే అవకాశం ఉందన్నారు. రెడ్‌క్రాస్ రాష్ట్ర కార్యదర్శి, సీఈఓ ప్రొఫెసర్ శ్రీరాములు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో త్వరలోనే బ్లడ్ బ్యాంకు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర రెడ్ క్రాస్ రెండు కోట్ల మేర ఎక్విప్మెంట్ను సమకూర్చిందని, భవన నిర్మాణం కోసం దాత శ్రీధర్ రెడ్డి రూ.5కోట్ల మేర అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, సీఈఓ శోభారాణి, చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, అదనపు పీడీ సురేష్, డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్, పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి హరి శివప్రసాద్, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. – అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు -
గోరింట పండింది
ఆషాఢంలో మైదాకు పండుగ జరుపుకుంటున్న మహిళలు ఫ అందంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గోరింటాకు గుర్తుకొస్తుంది. ఈ మాసం ముగిసేలోపు మహిళలు ఒకరోజు గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెబుతుంటారు. గోరింటాకు పెట్టుకోవడం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అదొక పెద్ద పండుగ. ఇటీవల కాలంలో నగరాల నుంచి పల్లెల వరకు ప్రతి ఇంటా మహిళలు, యువతులు, చిన్న పిల్లలు అనే తేడా లేకుండా అందరూ చేతులకు గోరింటాకు పెట్టుకుంటూ సందడి చేస్తున్నారు. రామగిరి(నల్లగొండ) : వర్షాకాలం ఆరంభంలో వచ్చే ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక శాసీ్త్రయ, ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. ప్రకృతిని ప్రేమిస్తూ, సాంప్రదాయాన్ని గౌరవిస్తూ జరుపుకునే ఈ గోరింటాకు సంబరం ముత్తైదువుల చేతుల్లో ఎర్రటి కాంతులు వెదజల్లుతోంది. మహిళలకు గోరింటాకుకు ఎంతో ప్రత్యేకం. పురాణాల ప్రకారం పడుచమ్మాయిల చేతులకు గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని చెబుతుంటారు. దీంతో ఈ ఆధునిక యుగంలో సైతం చాలా మంది అమ్మాయిలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ఈ ఆనవాయితీని కంటిన్యూ చేస్తున్నారు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఏ ఇంట్లో చూసినా గోరింటాకు సందడే కనిపిస్తుంది. గోరింటాకును చేతులకు పెట్టుకుంటే శరీరానికి కూడా ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు. గోరింటాకులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని చాలా పరిశోధనల్లో రుజువైంది. వర్షాకాలంలో ప్రారంభంలో బయటి వాతావరణం చల్లగా ఉంటుంది. దీంతో శరీర ఉష్ణోగ్రత తగ్గి జ్వరాలు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. గోరింటాకులోని ప్రత్యేక గుణం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని, అందుకే ఈ కాలంలో గోరింటాకు తప్పక పెట్టుకోవాలని పెద్దలు చెబుతుంటారు. వర్షాకాలంలో గోరింటాకు పెట్టుకుంటే చర్మవ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. ఆషాఢంలో వర్షాలు ఎక్కువగా కురవడంతో పంట పొలాలు బురదమయమై క్రిమికీటకాలు పెరుగుతాయి. మహిళలు పొలంలో వరినాట్లు వేయడం వలన చేతులు, కాళ్లకు బురద అంటుకుంటుంది. ఈ మాసంలో మైదాకు పెట్టుకుంటే చర్మవ్యాధులు రాకుండా కాపాడుతుందని వైద్యులు చెబుతున్నారు. మైదాకు వేళ్లకు పెట్టుకోవడం వలన గోళ్లు పెలుసుబారకుండా కాపాడుతుంది. ఆకులే కాకుండా పూలు, వేర్లు, బెరడు, విత్తనాలు కూడా ఔషధ యుక్తాలే. వీటితో శరీరంలో అలర్జీలను దూరం చేసుకోవచ్చు. ఆటలమ్మ మచ్చలు పోగొట్టాలంటే గోరింటాకును బాగా నూరి పూస్తే మంచి ఫలితాన్నిస్తుంది. నెలకోసారి గోరింటాకు ముద్దను తలకు ప్యాక్‌గా వేసుకుంటే జట్టు రాలదు. ఈ రోజుల్లో గోరింటాకు పెట్టుకోవడం ఒక పెద్ద ఆర్ట్ (మెహందీ ఫ్యాషన్) అయిపోయింది. కానీ ఆషాఢంలో పెట్టుకోవడం వెనుక ఆరోగ్య సూత్రం ఉంది. వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు, గోళ్ల వ్యాధులు రాకుండా ఈ గోరింటాకు కాపాడుతుంది. శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం.. అందుకే ఈ పండుగ అంటే నాకు చాలా ఇష్టం. – సిరా వరుణ కాలేజీకి సెలవులు ఉన్నా, లేకపోయినా ఆషాఢం రాగానే ఫ్రెండ్స్ అందరం ఒకరి ఇంట్లో చేరి చేతులకు గోరింటాకు పెట్టుకుంటాం. ఎవరి చెయ్యి బాగా పండిందోనని పోటీలు పడతాం. ఇదొక మంచి గెట్ టుగెదర్ లాంటిది. కొత్త కొత్త డిజైన్లు ట్రై చేస్తూ, సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ గడపడం బాగుంటుంది. – చందనమా చిన్నప్పటి నుంచి ఆషాఢ మాసం వస్తే చాలు.. ఇంట్లో అందరం కూర్చొని గోరింటాకు రుబ్బుకుని పెట్టుకునేవాళ్లం. ఇప్పటి కాలం అమ్మాయిలు కోన్ల వైపు మొగ్గు చూపుతున్నా.. మేము మాత్రం చెట్టు ఆకులు కోసుకొచ్చి సాంప్రదాయ పద్ధతిలోనే రుబ్బి పెట్టుకుంటాం. చేతులు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడని ఒక నమ్మకం. ఈ పండుగ మాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. – ఇందిర మా చిన్నప్పుడు అమ్మమ్మలు, అమ్మలు చెబుతుండేవారు.. ఆషాఢం వచ్చిందంటే వర్షాలు పడతాయి, వాతావరణం చల్లబడుతుందని, ఈ టైంలో ఒంట్లో వేడి తగ్గడానికి, వర్షాల వల్ల వచ్చే చర్మ వ్యాధులు, గోరుచుట్టు వంటి సమస్యలు రాకుండా ఉండడానికి గోరింటాకు అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే దీన్ని కేవలం సంప్రదాయంగా కాకుండా, సీ్త్రల ఆరోగ్యం కోసం ప్రకృతి ఇచ్చిన ఔషధంగా భావిస్తాను. – తులసి -
అతివలకు ఆరోగ్య పరీక్షలు
సాక్షి, యాదాద్రి: మహిళల ఆరోగ్య స్థితిపై సమగ్రం గా రూపొందించి, వ్యాధులను ముందస్తుగా గుర్తించడమే లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సెర్ఫ్, మెప్మా పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు ఉచిత వైద్య పరీక్షలు అందించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. పైలట్ ప్రాజెక్ట్ కింద మొదటగా జిల్లాలోని మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేశారు. వీటిలె బీబీనగర్, షారా జీపేట, భూదాన్‌పోచంపల్లి పీహెచ్‌సీలు ఉన్నాయి. ఇక్కడ లభించే ఫలితాల ఆధారంగా విడతల వారీగా జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాల సభ్యులందరికీ ఈ సేవలను విస్తరించనున్నారు. 3 నెలల్లో 2 లక్షల మంది మహిళలకు పరీక్షలు మూడు నెలల కాలంలోనే సుమారు 2 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు వైద్య పరీక్షలు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో మొత్తం 1,94,493 మంది స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు. వారందరికీ దశలవారీగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం రోజుకు 800 నుంచి 2,000 వరకు నమూనాలను పరీక్షించగల సామర్థ్యం ఉన్న అత్యాధునిక ‘అనలైజర్’ మిషన్లను సమకూర్చుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్వహణ కోసం ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సాంకేతిక సిబ్బందిని కొత్తగా నియామకం చేసుకుంటున్నారు. కాగా. మహిళా సంఘాల సభ్యుల ఆరోగ్య పరీక్షలు, నమూనాల సేకరణ, డేటా నమోదు, ఫాలోఅప్ కోసం వైద్య ఆరోగ్యశాఖ, మెప్మా, మున్సిపల్ శాఖ, డీఆర్డీఏ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. డీసీహెచ్ఎస్, ఆర్‌ఎంఓలు, వైద్యులు, టీ–హబ్ ప్రతినిధులు భాగస్వాములు కానున్నారు. ఫ బీబీనగర్, షారాజీపేట, భూదాన్ పోచంపల్లి పీహెచ్‌సీలు ఎంపిక ఫ 3 నెలల్లో 2 లక్షల మంది మహిళలకు స్క్రీనింగ్ లక్ష్యం ఫ వైద్య పరీక్షల కోసం ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం బయోకెమిస్ట్రీ పరీక్షలు : బ్లడ్ షుగర్, సీరం బిలిరుబిన్, సీరం క్రియాటినిన్, బ్లడ్ యూరియా, ఎస్‌జీపీటీ, ఎస్జీఓటీ, సీరం ఆల్కలైన్ ఫాస్ఫటేస్, సీరం టోటల్ ప్రొటీన్, సీరం ఆల్బుమిన్. హిమటాలజీ పరీక్షలు : థైరాయిడ్ నిర్ధారణకు టీఎస్‌హెచ్, హీమోగ్లోబిన్, తెల్ల రక్తకణాల సంఖ్య, ప్లేట్లెట్ కౌంట్, ఎర్ర రక్తకణాల సంఖ్య. స్పోక్ స్థాయి పరీక్షలు : బ్లడ్ గ్రూప్, ఎత్తు, బరువు, బాడీ మాస్ ఇండెక్స్ (BMI), రక్తపోటు (బీపీ), వైకల్య నిర్ధారణ, శరీర ఉష్ణోగ్రత, గుండె స్పందన రేటు, శ్వాస రేటు, కంటి పరీక్షలు, నోటి పరీక్షలు, చర్మం–గోళ్ల పరీక్షలు. -
భూమి కేటాయించాలని కోరాం
బొమ్మలరామారం మండలానికి మంజూరైన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం సుమారు ఎకరం భూమి అవసరం ఉంది. ఇందుకోసం అనువైన స్థలాన్ని కేటాయించాలని రెవెన్యూ అధికారులను కోరాం. ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటైతే కూరగాయల రైతులకు బహుల ప్రయోజనాలు ఉంటాయి. తమ పంటలను సులభంగా మంచి గిట్టుబాటు ధరలకు అమ్ముకోవడానికి వేదిక కానుంది. – యాదగిరి, సెర్ప్ ఏపీఎం రవాణా భారం, కూలీల కొరత వల్ల కూరగాయల సాగు తగ్గించాం. రైతులకు సబ్సిడీపై పరికరాలు, విత్తనాలు, ఎరువులు అందించాలి. మండలంలో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తే చాలా మంది రైతులు మళ్లీ కూరగాయల సాగు వైపు వస్తారు. అధికారులు ఈ దిశగా వేగంగా చర్యలు తీసుకోవాలి. – దాసరి జంగారెడ్డి, రైతు, హాజీపూర్ -
యాదగిరి క్షేత్రంలో విశేష పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. శనివారం వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చన పూజలు జరిపించారు. ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు చేపట్టారు. ప్రథమ ప్రాకార మండపంలో ముందుగా శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం నిర్వహించారు. సాయంత్రం వేళ జోడు సేవలను తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
ఐదు చెక్ బౌన్స్ కేసులు పరిష్కారం
భువనగిరిటౌన్ : జిల్లా కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న ఖైదీల కేసుల పురోగతిపై శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు జయరాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన చెక్ బౌన్స్ ప్రత్యేక లోక్ అదాలత్‌లో మొత్తం 5 దీర్ఘకాలిక కేసులను రాజీ కుదిర్చి పరిష్కరించినట్లు తెలిపారు. దీని ద్వారా కక్షిదారులకు రూ.19,60,000 చెల్లింపులు జరిగేలా చూశామని వెల్లడించారు. మరిన్ని చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి నవంబర్ 21న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో స్పెషల్ జడ్జి మిలింద్ కాంబ్లీ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవిలత, సబ్ జైలు సూపరింటెండెంట్ నెహ్రూ, భువనగిరి ఏసీపీ రవీందర్, యాదాద్రి ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. స్పోర్ట్స్ అథ్లెటిక్స్ అకాడమీలో ప్రవేశాలకు దరఖాస్తులు భువనగిరి: ఖమ్మం స్పోర్ట్స్ అథ్లెటిక్స్ అకాడమీలో ప్రవేశాల ఎంపికకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి శ్యాంసుందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించే ఎంపికకు 14 నుంచి 16 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన విద్యార్థులు రావాలని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి మోత్కూరు : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. శనివారం మోత్కూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులను సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం 150కి పైగా నూతన విద్యార్థులు రావడం శుభ సూచకమన్నారు. ప్రధానోపాధ్యాయుడు దేవినేని అరవిందరాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ పోరెడ్డి రంగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తా, ఇన్స్పెక్టర్ సి.వెంకటేశ్వర్లు, మండల విద్యాధికారి టి.సత్యనారాయణ, పాఠశాల కమిటీ చైర్మన్ దబ్బెటి శైలజ, కౌన్సిలర్ కుర్మిళ్ల ప్రమీల రాములు పాల్గొన్నారు. 31లోగా బయోమెట్రిక్ పూర్తిచేయాలిసాక్షి, యాదాద్రి : రేషన్ కార్డుదారులు ఈనెల 31లోగా బయోమెట్రిక్ ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని అదనపు కలెక్టర్ వెంకారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నివాస ప్రాంతానికి సమీపంలో అందుబాటులో ఉన్న ఏ రేషన్ దుకాణానికై నా స్వయంగా వెళ్లి వేలిముద్ర వేసి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు. మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం భువనగిరి: జిల్లాలో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖాళీగా ఉన్న మూడు పోస్టులకుగాను ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు తమ దరఖాస్తులను ఈ నెల 20 నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. రైతు వేదికల్లో విద్యుత్ బకాయిలు ఆత్మకూరు(ఎం): రైతు వేదికలు విద్యుత్ బకాయిల బారిన పడ్డాయి. ప్రభుత్వం నిర్వహణ ఖర్చులు ఇవ్వకపోవడంతో నెల వారీ బిల్లులు బకాయి పడాల్సి వచ్చింది. ఆత్మకూరు(ఎం), పల్లెపహాడ్, పల్లెర్ల, కూరెల్ల, కప్రాయపల్లి క్లస్టర్లలోని రైతు వేదికల్లో సెప్టెంబర్– 2022 నుంచి ప్రభుత్వం మెయింటనెన్స్ కింద ఖర్చులు ఇవ్వకపోవడంతో ఈ బిల్లులు పేరుకుపోయాయి. ఆత్మకూరు(ఎం) రైతు వేదిక విద్యుత్ బిల్లు రూ.14,730 రాగా నెల రోజుల క్రితం విద్యుత్ కనెక్షన్ తొలగించారు. పల్లెర్ల రైతు వేదిక విద్యుత్ బిల్లు రూ.14,797, కప్రాయపల్లి రైతు వేదిక బిల్లు రూ.10,200, పల్లెపహాడ్‌లో రూ. 10వేలు, కూరెల్ల రైతు వేదికలో రూ.14వేల వరకు బకాయి ఉంది. -
మహిళా సంఘాలకు ఆహారశుద్ధి యూనిట్లు
బొమ్మలరామారం: మార్కెటింగ్ సమస్యలు, రవాణా భారం, కూలీల కొరతతో పాటు గిట్టుబాటు ధర లభించక కుదేలవుతున్న కూరగాయల రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సరికొత్త అడుగు వేసింది. జిల్లాకు రూ. 50 లక్షల అంచనా వ్యయంతో ఆహార శుద్ధి కేంద్రాలు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా బొమ్మలరామారంలో రూ. 13.05 లక్షల ఖర్చుతో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ప్రాసెసింగ్ యూనిట్, భూదాన్ పోచంపల్లిలో రూ. 17.91 లక్షల వ్యయంతో రైస్ ఫ్లేక్స్ (అటుకులు), పఫ్డ్ రైస్ (బొరుగులు) ప్రాసెసింగ్ యూనిట్, గుండాలలో రూ. 19.03 లక్షలతో దాల్ (పప్పు దినుసుల) ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ఫ్), అంతర్జాతీయ పొడి ప్రాంత వ్యవసాయ పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్) సంయుక్తంగా ఈ యూనిట్లు ఏర్పాటు చేయనున్నాయి. బొమ్మలరామారంలో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం ఒక ఎకరం అనువైన స్థలాన్ని కేటాయించాలని సెర్ఫ్ ప్రతినిధులు రెవెన్యూ అధికారులను కోరారు. ప్రస్తుతం మండలంలో గిట్టుబాటు ధర లేక సుమారు 80 శాతం మంది రైతులు కూరగాయల సాగును వదిలేసి వరి వైపు మళ్లారు. ప్రాసెసింగ్ యూనిట్ అందుబాటులోకి వస్తే యావపూర్, సోలీపేట్ వంటి గ్రామాల్లో కొత్తిమీర, కాలీఫ్లవర్, పాలకూర సాగు మరింత పెరగడంతో పాటు మహిళా రైతుల ఆర్థిక స్వాలంబనకు దోహదపడనుంది. ఇక్రిశాట్ ఆధ్వర్యంలో అత్యాధునిక శిక్షణ మండలంలోని రైతులకు ఇక్రిశాట్ సహకారంతో నాణ్యమైన పంటల సాగుకు మార్గం సులభం కానుంది. చీడపీడలను తట్టుకునే విత్తనాల పంపిణీ, మెరుగైన సాగు పద్ధతులు, నేల ఆరోగ్యం, వాతావరణ సూచనలు, డిజిటల్ వ్యవసాయం, నీటి సంరక్షణ యాజమాన్యంపై రైతులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. గ్రేడింగ్ అండ్ ఎక్స్పోర్ట్ మార్కెటింగ్ ఈ యూనిట్ల ఏర్పాటు ద్వారా మహిళా రైతులు పండించిన పంటలను నేరుగా తక్కువ ధరకు అమ్ముకోకుండా, ప్రాసెసింగ్ ప్రక్రియ ద్వారా గ్రేడింగ్ చేస్తారు. ఆపై హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లోని సూపర్ మార్కెట్లతో ఒప్పందాలు కుదుర్చుకుని ఆన్లైన్, ఆఫ్‌లైన్ వేదికల ద్వారా నేరుగా మార్కెటింగ్ చేసుకునే సదుపాయం కల్పిస్తారు. జిల్లాకు మూడు కేంద్రాలు మంజూరు ఫ బొమ్మలరామారంలో వెజిటబుల్ ప్రాసెసింగ్ యూనిట్ ఫ పోచంపల్లిలో అటుకులు, బొరుగులు, గుండాలలో పప్పుదినుసుల కేంద్రం ఏర్పాటు -
ఎల్‌నినో.. ‘ఆయిల్ పామ్’లో రక్షణ చర్యలు
సూర్యాపేట : ఈ వానాకాలం సీజన్లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో రైతులంతా ఎంతో ఆశతో సాగుచేస్తున్న ఆయిల్ పామ్ తోటల్లో ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా మొక్కల ఆరోగ్యాన్ని, ఉత్పాదకతను కాపాడుకునే అవకాశం ఉంటుందని సూర్యాపేట జిల్లా ఉద్యాన అధికారి తీగల నాగయ్య, సాంకేతిక అధికారి ముత్తినేని మహేష్ చెబుతున్నారు. వారు రైతులకు అందిస్తున్న సూచనలు, సలహాలు.. ఎల్‌నినో పరిస్థితుల్లో భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. పగటిపూట సాపేక్ష ఆర్ధ్రత తగ్గుతుంది. దీని వల్ల పొడి వాతావర పరిస్థితులు ఏర్పడి ఆయిల్ పామ్ తోటల్లో గెలలు పూర్తిగా తయారుకావు. మగ పుష్పగుచ్ఛాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మూడేళ్ల కంటే తక్కువ వయస్సున్న ఆయిల్ పామ్ మొక్కలకు వేరు వ్యవస్థలు ౖపైపెనే ఉంటాయి. కావున పైన మట్టి పొర ఎండిపోవడం వల్ల ఆ వేర్లు ప్రభావితమవుతాయి. పొడి వాతావరణ ఎక్కువ కాలం కొనసాగితే మొక్కల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. అదనపు నీటి పారుదల కొనసాగించకపోతే ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇవి పాటించాలి.. ఫ రక్షణాత్మక నీటిపారుదల, తేమ సంరక్షణ చర్యలు పాటించాలి. క్రమం తప్పకుండా సూక్ష్మ పద్ధతిలో నీటిపారుదల జరిగేలా చూసుకోవాలి. చెట్టు దీర్ఘకాలిక తేమ ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి. ఫ మొక్క మొదలు చుట్టూ కత్తిరించిన ఆకులు లేదా సేంద్రియ జీవ పదార్థంతో ఒక పొరగా కప్పటం వల్ల నేలలోని తేమ ఆదా అవుతుంది. దీని వలన సూక్ష్మ వాతావరణాన్ని చల్లబర్చి నీటి నష్టాన్ని తగ్గిస్తుందన్నారు. ఫ అధిక ఉష్ణోగ్రతల ఒత్తిడి ఉన్న కాలంలో తగినంత నీటిపారుదల లేకుండా అధికంగా ఎరువులు వేయకూడదు. నీటి ఒత్తిడిని తట్టుకోవడానికి ప్రతి చెట్టుకు ఇచ్చే సాధారణం కంటే 0.5కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అదనంగా అందించాలి. ఫ అధిక ఉష్ణోగ్రతల వల్ల పరాగ సంపర్కం చేయు వివిల్స్ మనుగడ, విస్తరణ ప్రతికూలంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇది అంతిమంగా పరాగ సంపర్కం సరిగ్గా జరగకపోవడానికి, ఫలితంగా గెలలు విచ్చిన్నం కావడానికి దారి తీస్తుంది. కొత్తగా ఏర్పాటుచేసిన, ఒంటరి తోటల్లో వీటి స్థిరనివాసం తగ్గే అవకాశం ఉంది. కావున తోటల్లో తేమను పెంచడానికి బిందు సేద్య వ్యవస్థలో అవుట్లెట్ తెరిచి ఉంచాలి. వేడి ఒత్తిడిని తగ్గించడానికి కోకో, వక్క వంటి అంతర పంటలు వేసుకోవాలి.


