నేడు గుట్టలో టెంపుల్‌ రన్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు గుట్టలో టెంపుల్‌ రన్‌

Feb 8 2026 7:15 AM | Updated on Feb 8 2026 7:15 AM

నేడు గుట్టలో టెంపుల్‌ రన్‌

నేడు గుట్టలో టెంపుల్‌ రన్‌

యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట పరిధిలోని టెంపుల్‌ సిటీ(పెద్దగుట్ట)పై ఆదివారం టెంపుల్‌ రన్‌ నిర్వహించనున్నారు. సాక్షి మీడియా పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం అవంతిక కన్‌స్ట్రక్షన్స్‌ సౌజన్యంతో ఆదివారం ఉదయం 6గంటలకు టెంపుల్‌ సిటీపై ప్రారంభమవుతుందని తెలంగాణ రన్నర్స్‌ అధ్యక్షుడు సోమ జగన్‌మోహన్‌రెడ్డి, సాక్షి సర్క్యులేషన్‌ డీజీఎం సతీష్‌ తెలిపారు. శనివారం టెంపుల్‌ సిటీ, ప్రెసిడెన్షియల్‌ సూట్‌, మల్లాపురం గ్రామానికి వెళ్లే ప్రాంతాలను వారు పరిశీలించి మాట్లాడుతూ.. ఆరోగ్యంపై ప్రజలను చైతన్యం చేసేందుకు 21.1కే, 10కే, 5కే విభాగాల్లో ఈ రన్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రన్నర్స్‌ ఉదయం 5.30గంటలకే టెంపుల్‌ సిటీ పైకి చేరుకోవాలన్నారు. ఇప్పటికే 800 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికి టీషర్టులు అందజేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement