యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో చైత్ర పౌర్ణమి సందర్భంగా గురువారం రాత్రి తెప్పోత్సవం నిర్వహించారు. మొదట శ్రీస్వామి, అమ్మవారిని అలంకరించి ఆలయ తీరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం విష్ణు పుష్కరిణిలోని వేదికపై ఉత్సవమూర్తులను అధిష్టింపజేశారు. దేవతల సేనాధిపతి విశ్వక్సేనుడిని ఆరాధిస్తూ ఉత్సవమూర్తులను కొలిచారు. ఆ తరువాత అర్చకులు, వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య తెప్పోత్సం నిర్వహించారు. పుష్కరిణిలోని నీటిపై తెప్పపై ఆశీనులైన శ్రీస్వామి అమ్మవార్లను నిండు వెన్నెల కనిపించే విధంగా తెప్పోత్సవం జరిపించారు. వేడుకల్లో ఆలయ ఈవో భవాని శంకర్‌తో పాటు అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.


