పెళ్లిలో మద్యం ఇవ్వలేదని రెచ్చిపోయిన గెస్ట్‌లు, వీడియో వైరల్‌ | Guests attack bride groom after not being served liquor at wedding in MP | Sakshi
Sakshi News home page

పెళ్లిలో మద్యం ఇవ్వలేదని రెచ్చిపోయిన గెస్ట్‌లు, వీడియో వైరల్‌

Apr 2 2026 5:58 PM | Updated on Apr 2 2026 8:01 PM

Guests attack bride groom after not being served liquor at wedding in MP

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఒక  వివాహ వేడుక రసాభాసగా మారిపోయింది.  స్వల్ప వివాదానికే అతిథులు రెచ్చిపోయారు. ఇది కాస్తా తీవ్ర ఘర్షణకు దారి తీయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దాడి సమయంలో నిందితులు ఇంట్లోని వస్తువులను, నగదును కూడా  ఎత్తుకుపోవడం  కలకలం రేపింది.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఆరోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటాయ్ గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది.  స్థానిక నివాసి మహేష్ జాతవ్ వివాహం జరుగుతుండగా, వేడుకలో తమకు మద్యం సరఫరా చేయాలని అతిథులు గొడవకు దిగారు. దీంతో వివాదం చెలరేగింది. మందు పోస్తావా, డబ్బులు ఇస్తావా అంటూ నానా యాగీ చేశారు. దీనికి వరుడు నిరాకరించడంతో వివాదం మరింత ముదిరి ఇరు వర్గాల మధ్య ఘర్షణగా మారింది. 

మద్యం ఇవ్వలేదని ఆగ్రహించిన అతిథుల బృందం, వధూవరులతో పాటు, కుటుంబ సభ్యులపై కూడా దాడి చేసి నట్లు నగర పోలీస్ సూపరింటెండెంట్ మనీష్ యాదవ్ విలేకరులకు తెలిపారు. ఈ ఘర్షణలో వరుడి కుటుంబానికి చెందిన కొందరు సభ్యులు గాయపడ్డారు. ఈ సమయంలో కొన్ని విలువైన వస్తువులు, నగలు దొంగిలించిన ఆరోపణలున్నాయని  తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందన్నారు.

ఇదీ చదవండి : ఇపుడా పని..క్యాబ్‌ బుక్‌ చేసినంత ఈజీ : ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌

 

వరుడి తల్లి ఆరోపణలు
పెళ్లింటికి తమ వధువు  చేరుకున్న తర్వాత కొన్ని ఆచారాలు జరుగుతుండగా, కొందరు పొరుగువారు అక్కడికి వచ్చి మద్యం కోసం తన కుమారుడిని డబ్బులు డిమాండ్ చేయడం ప్రారంభించారని వరుడి తల్లి షీలా విలేకరులకు తెలిపారు. మద్యం కొనుగోలుకు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో, ఆ పొరుగువారు వరుడితో సహా తన కుటుంబ సభ్యులపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. తాము జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా, తనపై, తన భర్తపై , వధువుపై కూడా దాడి చేశారని జాతవ్ తల్లి ఆరోపించారు.

ఇదీ చదవండి : లాస్ట్‌ మినిట్‌ ట్విస్ట్‌ : వరుడితో కాదు పెళ్లి !
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement