ఇపుడా పని..క్యాబ్‌ బుక్‌ చేసినంత ఈజీ : ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ | Anand Mahindra Amazed By Digital India, Kerala’s App Based Coconut Harvesters Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

ఇపుడా పని..క్యాబ్‌ బుక్‌ చేసినంత ఈజీ : ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌

Apr 2 2026 5:02 PM | Updated on Apr 2 2026 5:29 PM

Anand Mahinda tweet about coconut harvester the same way you book a cab In Kerala

పారిశ్రామిక వేత్త, మహీంద్ర అండ్‌ మహీంద్ర అధినేత  ఆనంద్‌ మహీంద్ర మరో ఆసక్తికర కథనాన్ని సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. ఆధునిక కాలంలో పెరుగుతున్న టెక్నాలజీ, భారతీయులు దాన్ని వినియోగించుకుంటున్నతీరుపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అత్యంత సాంప్రదాయకమైన, స్థానిక సేవలను కూడా డిజిటలైజ్ చేస్తున్నామంటూ ఆనందాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన ఆయన షేర్‌ చేసిన వీడియో నెట్టింట సందడిగా మారింది. 


ఆనంద్‌ మహీంద్ర తన ట్వీట్‌లో ఏమన్నారంటే..
క్యాబ్‌ని బుక్ చేసుకున్నంత సులభంగా  ఇపుడు కేరళలో కొబ్బరి కాయలను తీసే వ్యక్తిని (Coconut Harvester) పిలిపించుకోవచ్చు. ఒక శిక్షణ పొందిన వృత్తినిపుణుడులా యూనిఫాం ధరించి, అవసరమైన పరికరాలతో సైకిల్‌పై వచ్చి తన పనిని పూర్తి చేసుకొని వెళ్లిపోతాడు. ఈ ఉదంతంలో తనను  బాగా ఆకట్టుకున్న మరో విషయం ఏమిటంటే.. ఆ చెట్లు ఎక్కిన యువకుడు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవాడు అంటూ రాసుకొచ్చారు.

అలాగే తన కరీర్‌ ప్రారంభం నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. తన  కెరీర్ ప్రారంభంలో  గ్రూప్ స్టీల్ బిజినెస్‌లో పనిచేస్తున్నప్పుడు,  ఫర్నేస్ , ఫౌండ్రీ షాపుల్లో పనిచేసే వాళ్లకోసం ఎదురు చూడాల్సి వచ్చేది.  వీరిలో చాలా మంది తమ ఇళ్లకు దూరంగా వచ్చినవారే. ముఖ్యంగా వీరంతా  బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి ఉపాధి వెతుక్కుంటూ వచ్చేవారు. <

 భారతదేశ సేవా రంగాన్ని (Services Economy) గురించి మనం మాట్లాడుకున్నప్పుడు సాధారణంగా ఐటీ ఎగుమతులు లేదా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల గురించే చర్చించుకుంటాం. కానీ ఇపుడు పరిస్థితి చాలా మారింది.కానీ మనం మన అత్యంత సాంప్రదాయ, అతి స్థానిక సేవలను కూడా డిజిటలైజ్ చేస్తున్నామన్నారు.  గతంలో భారీ పరిశ్రమలలో మాత్రమే కనిపించిన ఈ ఆశలు, ఆకాంక్షలు.. నేడు సాంకేతికతతో కూడిన సరికొత్త సేవా రంగాలలో కూడా మార్గాలను వెతుక్కుంటున్నాయి మెరుగైన భవిష్యత్తు కోసం ప్రజలు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలి వెళ్లడం, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మారడం, అభివృద్ధి చెందిన అనేది నిజంగా  శక్తివంతమైన ఆర్థిక చోదక శక్తి మాత్రమే కాదు, ఇది దేశ సమగ్రతకు (Integration) కూడా ఒక గొప్ప బలం అని అభివర్ణించారు.  ఆయా రాష్ట్రాలు ఈ వలస కార్మికులను సాదరంగా ఆహ్వానించినంత కాలం ఈ ప్రగతి ఇలాగే కొనసాగుతుంది! అన్నారు.

ఇదీ చదవండి: లక్ష రూపాయలా? నా కొద్దు బాబూ : ఇంట్రస్టింగ్‌ స్టోరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement