లక్ష రూపాయలా? నా కొద్దు బాబూ : ఇంట్రస్టింగ్‌ స్టోరీ | Man Buys Rs 1 Lakh Gift For His Mother, After Emotional 30 Minutes Effort To Convince Her | Sakshi
Sakshi News home page

లక్ష రూపాయలా? నా కొద్దు బాబూ : ఇంట్రస్టింగ్‌ స్టోరీ

Apr 2 2026 4:24 PM | Updated on Apr 2 2026 5:16 PM

Man Buys Rs 1 Lakh Gift For His Mother 30 Minutes To Convince Her

కనిపెంచిన తల్లిదండ్రులకు  బిడ్డలు ఖరీదైన బహుమతులు అందించడం చాలా కామన్‌. ఎదిగిన బిడ్డలు ఎంతో ప్రేమగా  ఇచ్చిన కానుకను చూసి మురిసిపోవడం ఇంకా కామన్‌. అయితే తల్లికి ఖరీదైన అందమైన  గిష్ట్‌ ఇచ్చిన కొడుకు ఆ తరువాత  తల్లిని ఒప్పించడానికి  చాలా కష్టపడ్డాడు. దీనికి సంబంధింన వివరాలను సోషల్‌మీడియాలో షేర్‌ చేయడంతో ఇది  వైరల్‌గా మారింది. 
స్టోరీ ఏంటంటే..

వేదిక్‌క్రాఫ్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సాహిల్ రాజ్ కుమార్ తన తల్లికి లక్ష రూపాయల బహుమతి కొన్నాడు. కానీ  దాన్నితల్లి తీసుకునేందుకు చాలా ష్టపడాల్సి వచ్చింది. దాదాపు  అరగంటపాటు  ఆమెకు నచ్చచెప్పి  ఒప్పించారు.. ఊహించిన దానికంటే తాను చాలా ఎక్కువ సంపాదిస్తానమ్మా.. డోంట్‌ వర్రీ అంటూ ఆమెను ఒప్పించారు.  ఆమెకు 1,200 డాలర్ల (సుమారు 1,00,500 రూపాయలు) విలువైన కళ్లజోడును కొనిచ్చిన హృద్యమైన కథను  ఎక్స్‌లో షేర్‌ చేశారు.  ఆ క్షణాన్ని గుర్తుచేసుకుంటూ, సాహిల్ దానిని "చాలా హృద్యమైన రోజు"గా అభివర్ణించారు.

సోషల్ మీడియాలో పంచుకున్న ఒక హృద్యమైన కథ ఆన్‌లైన్‌లో వేలాది మంది నెటిజనులను ఆకర్షించింది. తన తల్లి షాపింగ్ చేస్తుండగా అనుకోకుండా చేసిన వీడియో కాల్ అనంతరం, ఆమెకు  లక్ష రూపాయల విలువైన డిజైనర్ కళ్లజోడును ఎలా బహుమతిగా ఇచ్చాడో వెల్లడించారు. తాను ఆర్థికంగా బాగానే ఉన్నప్పటికీ, తన కోసం విలాస వస్తువులపై అరుదుగా ఖర్చు చేసే తన తల్లి, ఒక దుకాణంలో కళ్లద్దాలు చూస్తుండగా, వాటిలో కొన్నింటిని చూపించడానికి  తనకు వీడియో కాల్ చేసిందని గుర్తుచేసుకున్నాడు. అయితే  తనకు బాగా నచ్చిన కళ్లజోడు విలువ ఎక్కువ ఉండటంతో , దాన్ని  కొనే ఆలోచనను ఆమె వెంటనే విరమించుకుంది. దీంతో కొడుకు కుమార్ కల్పించుకుని, ఆ డబ్బు తానే చెల్లిస్తానని చెప్పాడు, కానీ అతని తల్లికి నమ్మకం కుదరలేదు. అతను నెలకు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు, సంపాదిస్తూ,  పొదుపు చేసినప్పుడే అలాంటి బహుమతిని అంగీకరిస్తానని ఆమె చెప్పింది. అలా కుమార్‌  ఆమెను 30 నిమిషాలు వాదించి ఒప్పించి, చివరకు ఆమె అతన్ని నమ్మిన తర్వాత, కళ్లద్దాలు కొనడానికి అంగీకరించింది. 

ఇదీ చదవండి : బెంగళూరులో మహిళా టెకీ విషాదాంతం

ఇది సోషల్ మీడియా వినియోగదారులను ఆకర్షించింది. కుమారుడిపై  ప్రశంసలు కురిపించారు.  సగటు  భారతీయ కుటుంబాల్లో ఇలాంటి ఉదంతాలు కోకొల్లలని వ్యాఖ్యానించారు. పిల్లలు తమ జీవితంలో బాగా రాణిస్తున్నా, ఎంత సంపాదిస్తున్నా వారి నుండి ఆర్థిక సహాయం స్వీకరించడానికి తల్లిదండ్రులు ఇష్టపడరని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : రెండు అణుబాంబుదాడులు : బయటపడిన ఏకైక వ్యక్తి

Advertisement
 
Advertisement
Advertisement