బెంగళూరులో మహిళా టెకీ విషాదాంతం | bengaluru woman techie kills self after child drowns | Sakshi
Sakshi News home page

బెంగళూరులో మహిళా టెకీ విషాదాంతం

Apr 2 2026 3:24 PM | Updated on Apr 2 2026 4:36 PM

bengaluru woman techie kills self after child drowns

బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. 11 నెలల తన బిడ్డ ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో మునిగి చనిపోయిన కొద్ది నిమిషాలకే, 29 ఏళ్ల మహిళా టెకీ ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

సాఫ్ట్‌వేర్ నిపుణురాలైన ప్రతిభ తన బిడ్డతో ఇంట్లో ఉండగా, ఆమె భర్త మహంతేష్ పనిలో ఉన్నారు. ప్రతిభ తన బిడ్డ అగస్త్యను బట్టలు తీసుకోవడానికి టెర్రస్‌పైకి వెళ్లింది. ఆమె తన పనిలో ఉండగా, పాకుతూ వెళ్లిన బిడ్డ ప్రమాదవశాత్తు నీటితో నిండిన బకెట్‌లో పడిపోయింది. ప్రతిభ ఇది గమనించేసరికి, తన బిడ్డ బకెట్‌లో ప్రాణాలు కోల్పోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె, మొదల మణికట్టు కోసుకుని, కొన్ని మాత్రలు మింగి,  తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయంతో కుటుంబం సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

ఆ తర్వాత అదే రోజు సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో, మహంతేష్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, తలుపు లోపలి నుండి గడియ పెట్టి ఉండటాన్ని గమనించాడు. వారి వద్ద ఉన్న అదనపు తాళంచెవితో అతను ఇంట్లోకి ప్రవేశించి చూడగా, తన భార్య, బిడ్డ ఇద్దరూ చనిపోయి ఉన్నారు. ప్రతిభ రాసిన ఆత్మహత్య లేఖను చూశాడు. తన తప్పిదం వల్లే  బిడ్డ చనిపోయిందని ప్రతిభ తన సూసైడ్‌ లేఖలో పేర్కొంది.   దీంతో  15 మాత్రల ఖాళీ స్ట్రిప్‌ను కూడా  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తన బిడ్డ మరణానికి తానే 'బాధ్యురాలినని' సూసైడ్‌లో ఆమె పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు జరుగుతోందన్నారు. గత నాలుగేళ్లుగా ఆ కుటుంబం అద్దె ఫ్లాట్‌లో నివసిస్తోందని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: లాస్ట్‌ మినిట్‌ ట్విస్ట్‌ : వరుడితో కాదు పెళ్లి !

Advertisement
 
Advertisement
Advertisement