రూ.200-300 కోట్ల కలెక్షన్స్ వస్తాయనుకున్నా.. కానీ | Vignesh Shivan Opens Up On LIK Movie Failure, Says I Dreamed Of A Much Bigger Blockbuster | Sakshi
Sakshi News home page

Vignesh Shivan: ఇది రిలీజ్ కావడమే పెద్ద బ్లాక్‌బస్టర్

May 12 2026 9:01 AM | Updated on May 12 2026 9:32 AM

Vignesh Shivan Reacts Love Insurance Kompany Result

ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అలాంటి భావననే దర్శకుడు విఘ్నేశ్  శివన్‌ వ్యక్తం చేశాడు. నయనతార భర్త అయిన ఇతడు డైరెక్ట్ చేసిన లేటెస్ట్ సినిమా 'లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ' (ఎల్‌ఐకే). ప్రదీప్‌ రంగనాథన్‌, కృతిశెట్టి జంటగా నటించారు. ఎస్‌జే.సూర్య విలన్. నయనతార రౌడీ పిక్చర్స్‌, సెవన్‌ స్క్రీన్‌ స్టూడియో సంస్థ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతమందించాడు. కాగా గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఫ్లాప్ అయింది. ప్రదీప్‌ రంగనాథన్‌ చేసిన గత చిత్రాలన్నీ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాయి. ఇది కూడా అదే రేంజ్ హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ ఎల్‌ఐకే ఆ దరిదాపులకు కూడా వెళ్లలేదు. ఈ క్రమంలోనే చిత్ర ఫలితంపై విఘ్నేశ్ తాజాగా స్పందించాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

నేను ఓ డ్రీమ్‌తో వచ్చాను. అది చిన్నది కాదు. ఈ మూవీ స్టోరీ కోట్ల థియేటర్లలో అదిరిపోతుందని నమ్మాను. ప్రేక్షకుల చప్పట్ల ధ్వని మారుమోగుతుందని భావించాను. ఎంటర్‌టైన్ చేసినప్పటికీ రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరలేదు. నిజం చెప్పాలంటే అంతకంటే రెండు రెట్లు వసుళ్లూ సాధిస్తుందని భావించాను. అయితే ఏదో సరిగా సెట్ అవ్వలేదు. ఫలితం బాధ కలిగించినా, నేను సంతోషంగా, సంతృప్తిగానే ఉన్నాను. ఎందుకంటే ముందు చెప్పినట్లుగానే ఇది విడుదలవ్వడమే పెద్ద బ్లాక్‌బ్టస్టర్‌. ప్రశంసలు కంటే విమర్శలే ఎక్కువగా వచ్చినా, నేను ఇంకా నిలబడే ఉన్నాను. ఈ చిత్రం వెనుక ఎవరూ చూడని పలు ఇబ్బందులున్నాయి. అయినా నిజాయితీని, శ్రమను సంపాదించి పెట్టిందీ మూవీ అని దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ పేర్కొన్నారు. 

(ఇదీ చదవండి: రాధిక కంటే నేనే బాగా చేసేదాన్ని: షకీలా)

Advertisement
 
Advertisement
Advertisement