breaking news
West Godavari
-
ఊరించి.. ఊసురుమనిపించారు !
● కొల్లేరు భూములపై స్వష్టమైన ప్రకటన చేయని సీఎం చంద్రబాబు ● టీడీపీకి దీటుగా జనసేన అత్యవసర సమావేశం సాక్షి టాస్క్‌పోర్స్: కొల్లేరు అభయారణ్య భూముల పంపిణీపై స్వష్టమైన హామీని ప్రకటిస్తారని వచ్చిన కొల్లేరు ప్రజలకు చంద్రబాబు మొండిచేయి చూపారు. కలిదిండిలో పట్టాల పంపిణికి సీఎం చంద్రబాబు వస్తున్నారని తెలియగానే చక్కటి ప్రకటన వస్తుందని కొల్లేరు నాయకులు ప్రజలను సభకు తీసుకొచ్చారు. చంద్రబాబు కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పుకొచ్చినా.. గతంలోనూ ఆయనే ఇదే చెప్పారని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో కొల్లేరు ప్రజలు విరక్తి చెందారు. దీంతో నేతలు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. కోర్టు పరిధిలో ఉండటం వల్ల చంద్రబాబు హామీ ఇవ్వలేదని చెప్పుకురావడం గమనార్హం. జనసేన శిబిరంలో ఆగ్రహం : పట్టాల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన సీఎం చంద్రబాబు సాయంత్రం టీడీపీ కేడర్‌తో సమావేశం నిర్వహించారు. జనసేన నాయకులు మంత్రి నాదెండ్ల మనోహర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణతో కలిసి కలిదిండి సమీపంలోని సానారుద్రవరం వద్ద కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఇందులో అనేక మంది ఆగ్రహంతో మాట్లాడారు. మండలాల్లో జనసేన నాయకులు కార్యాలయాలకు పనుల నిమిత్తం వెళుతుంటే ఎమ్మెల్యే సూచించిన వ్యక్తి సిఫార్సులు కావాలని చెబుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే మనుషులను ప్రశ్నిస్తుంటే కక్ష సాధింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో అందరూ కార్యక్రమ విజయవంతానికి కృషి చేశారని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చెప్పిన తర్వాత జనసేన నేతలు సమావేశమవడం గమనార్హం. ఆకలితో అలమటిస్తూ.. చంద్రబాబు సభలో ప్రసంగాలు ఆలస్యం కావడంతో వచ్చిన ప్రజలు ఆకలితో అలమటించారు. సీఎం చంద్రబాబు ఉదయం 11.45కు హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తహసీల్దారు కార్యాలయంలో 22ఏ పట్టాల పంపిణీలో పాల్గొన్నారు. 12.45 గంటలకు వేదికపైకి వచ్చి 2.45 వరకూ ఉన్నారు. సాయంత్రం 4.20 నుంచి 6.10 వరకు కేడర్‌తో మీటింగ్ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, బొమ్మనబోయిన విజయలక్ష్మీ, వీరమల్లు నరసింహారావు, బలే ఏసురాజు మీటింగ్‌లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే మధ్యాహ్నం భోజన సమయం కావడంతో వెనుక ఉన్న ప్రజలు అనేక మంది వెళ్లిపోయారు. స్వయంగా రెవెన్యూ వీఆర్వోలు ఇంటికి వెళ్లి సభకు రావాలని కోరారు. -
పోలీసు జులుం
డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీపై దర్యాప్తు, మంత్రి పదవికి లోకేష్ రాజీనామా కోరుతూ వైఎస్సార్సీపీ జిల్లా అంతటా నిర్వహించిన ర్యాలీలకు అనూహ్య స్పందన వచ్చింది. ర్యాలీలకు అనుమతి లేదంటూ ఎక్కడికక్కడ బలగాలను మోహరించి పోలీసు జులుంతో అడుగడుగునా అడ్డంకులు కల్పించినా పార్టీ శ్రేణులు, ప్రజలు తలొగ్గకుండా ప్రభుత్వంపై పోరుబాట సాగించారు. సాక్షి, భీమవరం: అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ మండుటెండ, ఉక్కపోతలను లెక్కచేయకుండా పాదయాత్రలు, మెటారు సైకిల్ ర్యాలీలతో హోరెత్తించారు. మెగా డీఎస్సీ–2025 అవినీతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు యువజన ర్యాలీలు, అధికారులకు వినతిపత్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో రిలే దీక్షలతో ఉద్యమాన్ని ఉధృతం చేయడం చంద్రబాబు సర్కారును ఇరకాటంలో పడేసింది. సోమవారం శాంతియుత ర్యాలీలను భగ్నం చేసేందుకు పోలీసులను ఉసిగొల్పింది. ఈ క్రమంలో ర్యాలీలకు అనుమతి లేదంటూ ఎక్కడికక్కడ పోలీసులు ఆటంకాలు కల్పించారు. ● నరసాపురంలో.. నరసాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహణకు ఏర్పాటు చేయగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డున్నారు. శాంతియుతంగా ర్యాలీ జరుగుతుందని చెప్పినా అంగీకరించలేదు. పార్టీ కార్యాలయం నుంచి స్టీమర్ రోడ్డు జంక్షన్‌లోని వైఎస్సార్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున పార్టీశ్రేణులతో ప్రసాదరాజు పాదయాత్ర చేశారు. లోకేష్ రాజీనామా చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సీజీసీ సభ్యుడు పీడీ రాజు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బర్రే శ్రీవెంకటరమణ, పార్టీ నేతలు బంధన పూర్ణచంద్రరావు, పప్పుల రామారావు, షేక్ బులి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ● ఆచంట నియోజకవర్గంలో.. ఆచంట నియోజకవర్గ కో–ఆర్డినేటర్ చెరుకువాడ శ్రీరంగనాథరాజు నేతృత్వంలో తూర్పుపాలెంలోని పార్టీ కార్యాలయం నుంచి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులతో బైక్ ర్యాలీ చేపట్టారు. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కోడేరు తదితర గ్రామాల మీదుగా గోదావరి తీరం వరకు ర్యాలీ సాగింది. దారిపొడవునా పార్టీశ్రేణులు జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. పెనుమంట్ర, ఆచంట, పోడూరు, పెనుగొండ మండలాల నుంచి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ● తణుకులో.. తణుకులో మోటారు సైకిల్ ర్యాలీకి పోలీసులు నిరాకరించారు. రాష్ట్రపతి రోడ్డులోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని శిబిరం వద్ద నుంచి నరేంద్ర సెంటర్ వరకు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్లమెంట్ కోఆర్డినేటర్ గూడూరి ఉమాబాల, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. ఎస్ఈసీ సభ్యుడు పెండ్ర వీరన్న, నియోజకవర్గ పరిశీలకుడు కొట్టు వెంకట నాగు, పార్టీ నేతలు వడ్లూరి సీతారాం, వెలగల సాయిబాబారెడ్డి, పొట్ల సురేష్, చోడే గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ● తాడేపల్లిగూడెంలో.. తాడేపల్లిగూడెంలో క్యాంపు కార్యాలయం నుంచి కోఆర్డినేటర్ వడ్డి రఘురాంనాయుడు బైక్ ర్యాలీ చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ వాహనదారుల నుంచి తాళాలు లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో రఘురాంనాయుడుకి పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అనుమతి కోసం దరఖాస్తు ఇచ్చినా అడ్డుకోవడం సరికాదని, కావాలంటే అరెస్ట్ చేసుకోమని తెగేసిచెప్పారు. భారీ సంఖ్యలో పార్టీశ్రేణులు, యువతతో కలిసి పట్టణంలోని పోలీస్ ఐలాండ్ తదితర ప్రాంతాల మీదుగా పాదయాత్ర చేశారు. అనంతరం మోటారు సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ● భీమవరంలో.. భీమవరంలోని పార్టీ అర్బన్ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు ఇంటి సమీపం నుంచి నియోజకవర్గ కోఆర్డినేటర్ చినమిల్లి వెంకటరాయుడు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ మోటారు సైకిల్ ర్యాలీకి సిద్ధం కాగా పోలీసులు అడ్డుకున్నారు. అందరూ ఒకేసారి పాదయాత్ర చేసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో బ్యాచ్‌లుగా విడిపోయి ర్యాలీ చేశారు. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించడం కంటే ర్యాలీలో పాల్గొన్న వారి ఫొటోలు, వీడియోలు తీసేందుకే పోలీసులు ప్రాధాన్యమివ్వడం కనిపించింది. రాష్ట్ర అధికార ప్రతినిధి, పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్లమెంట్ సమన్వయకర్త గూడూరి ఉమాబాల, పార్టీ నేతలు ఏఎస్ రాజు, మేడిది జాన్సన్, పాలవెల్లి మంగ, చిగురుపాటి సందీప్, గంటా రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ● ఉండిలో.. ఉండిలో నియోజకవర్గ కో–ఆర్డినేటర్ మంతెన యోగీంద్రకుమార్ ఆధ్వర్యంలో ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డు మీదకు రావద్దంటూ పార్టీ శ్రేణులను సందుల్లోకి గెంటివేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందిు. యోగీంద్రకుమార్ను నెట్టుకుంటూ ఒక ఇంటిలోకి తీసుకువెళ్లి బయటకురాకుండా నిర్భంధించారు. కొద్దిసేపటి తర్వాత ఆయన బయటకు వచ్చి బస్టాండు సెంటర్ వరకు మోటారు సైకిల్ ర్యాలీ చేశారు. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంత మంది నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఈసీ సభ్యుడు పాతపాటి శ్రీనివాసరాజు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ● పాలకొల్లులో.. పాలకొల్లులో ర్యాలీకి పోలీసులు ఆంక్షలు పెట్టారు. బైక్ ర్యాలీకి అంగీకరించకపోవడంతో నియోజకవర్గ కోఆర్డినేటర్ గుడాల శ్రీహరిగోపాలరావు పార్టీ శ్రేణులతో కలిసి యడ్ల బజార్ వరకు పాదయాత్ర చేశారు. లోకేష్ రాజీనామా చేయాలంటూ నల్ల బెలూన్లు గాల్లోకి వదిలి నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లెం ఆనంద ప్రకాష్‌బాబు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ, రాష్ట్ర అంగనన్‌వాడీ విభాగం ఉపాధ్యక్షురాలు మద్దాల చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. తణుకులో ర్యాలీలో ముదునూరి మురళీకృష్ణంరాజు, గూడూరి ఉమాబాల తదితరులు ఆచంటలో మోటార్‌సైకిల్ ర్యాలీలో చెరుకువాడ శ్రీరంగనాథరాజు తదితరులు ఉండిలో వైఎస్సార్సీపీ కన్వీనర్ యోగీంద్రబాబును అడ్డుకుంటున్న పోలీసులు తాడేపల్లిగూడెంలో వడ్డి రఘురాంను చుట్టుముట్టి ర్యాలీని అడ్డుకుంటున్న పోలీసులు పాలకొల్లులో గుడాల గోపీతో మాట్లాడుతున్న పోలీసులు భీమవరంలో చినమిల్లి వెంకట్రాయుడు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలు అడుగడుగునా అడ్డుకునేందుకు పోలీసుల యత్నం అనుమతులు లేవంటూ నేతలతో వాగ్వివాదం బెదిరింపులను ఖాతరు చేయని వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు జిల్లా అంతటా విజయవంతంగా ర్యాలీలు -
క్షీరారామంలో ఘనంగా జలాభిషేకం
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో పది రోజులుగా నిర్వహించిన వరుణ జపం పూజల్లో భాగంగా సోమవారం స్వామికి జలాభిషేకం చేశారు. ఉదయం గణపతి పూజ, 108 కలశాలతో అభిషేకం, రుద్ర పారాయణ, దేవతారాధన వంటి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కెనాల్ రోడ్డులో ఉన్న శ్రీకృష్ణ ఆలయం వద్దకు వెళ్లి కలశాలతో కాలువ నీళ్లు తీసుకుని వచ్చి స్వామికి జలాభిషేకం చేశారు. ఈ అభిషేకంలో పండిట్ భమిడిపాటి వెంకన్న, మద్దూరు సూరిబాబుల బ్రహ్మత్వంలో ఆలయ ప్రధానార్చకులు కిష్టప్ప, అనిల్, వీరబాబు, 25 మంది రుత్వికులు పాల్గొన్నారు. ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, సూపరింటెండెంట్ పి.వాసు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. గత పది రోజులుగా జరిగిన వరుణ జపం, జలాభిషేకం పూజలపై పట్టణంలో ఎక్కడా ప్రచారం చేయకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో మైక్ ద్వారా ప్రచారం చేసి ఉంటే భక్తులందరికీ తెలిసేదని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనేవారని చెబుతున్నారు. క్షీరారామలింగేశ్వరస్వామికి జలాభిషేకం చేస్తున్న దృశ్యం.. కలశాలతో నీళ్లు తీసుకొస్తున్న అర్చక స్వాములు -
అర్జీలు గడువులోగా పరిష్కరించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా ప్రజల నుంచి అందుతున్న ప్రతి ఫిర్యాదును అధికారులు అత్యంత బాధ్యతతో పరిశీలించి, వేగవంతంగా, నాణ్యమైన శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని నిర్దేశిత కాలపరిమితిలో పరిష్కరించాలని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యం, అలసత్వానికి తావులేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యల తీవ్రత, వాస్తవ పరిస్థితులను తెలుసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. పరిష్కారం అనంతరం సంబంధిత దరఖాస్తుదారుకు సమాచారం అందించడంతో పాటు సమస్య పూర్తిగా పరిష్కారమైందో లేదో కూడా ధ్రువీకరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 190 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్‌లో 37 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. కొన్ని అర్జీలు ● తణుకుకు చెందిన శ్రీదుర్గా చిట్‌ఫండ్స్‌లో చిట్స్ వేస్తే ఆ డబ్బంతా తీసుకుని గోలి శ్రీనివాసరావు పరారయ్యాడని బాధితులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ● అత్తిలి మండలానికి చెందిన పలువురు చేనేత కార్మికులు పీజీఆర్ఎస్కు వచ్చి తమకు ప్రభుత్వం అందించే చేనేత ఆర్థిక సాయం రూ.25 వేలు అందలేదని ఫిర్యాదు చేశారు. -
విద్యుత్ సబ్సిడీ అమలు చేయాలి
వీరవాసరం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రొయ్యల రైతులకు రూ.1.50కే కరెంట్ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు వెంటనే దానిని నెరవేర్చాలని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండలంలోని నవుడూరు జంక్షన్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రొయ్యల రైతులకు ఇచ్చిన హామీల మేరకు రెండున్నరేళ్ల నుంచి ఇవ్వాల్సిన రూ.1.50 సబ్సిడీ నగదును వెంటనే ఆయా రైతులకు జమ చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ – 2025 స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలని పరీక్ష లీకేజీ, అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలన్నారు. ఆకివీడు: ఆకివీడు ప్రధాన సెంటర్లో జాతీయ రహదారి–165పై గంగానమ్మకోడు మురుగు కాల్వకు ఉన్న కల్వర్టు ఇటీవల ధ్వంసమైంది. దీంతో ప్రమాదభరితంగా మారింది. ఈ నెల 6వ తేదీన ‘ప్రమాదభరితంగా జాతీయ రహదారి కల్వర్టులు’ శీర్షికతో సాక్షిలో వచ్చిన ప్రత్యేక కథనానికి జాతీయ రహదారుల శాఖ అధికారులు స్పందించారు. వెంటనే ధ్వంసమైన కల్వర్టుకు పిట్టగోడ నిర్మాణం చేపట్టారు. మరికొన్ని ప్రాంతాల్లో కల్వర్టుల గోడలు విరిగి ప్రమాదభరితంగా మారాయి. భీమవరం: తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశతో పోలీసు కార్యాలయాలను ఆశ్రయించే బాధితులకు పోలీసు శాఖ వెన్నెముకగా నిలిచి భరోసా కల్పించాలని జిల్లా అదనపు ఎస్పీ డి.విశ్వనాథ్ చెప్పారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయా పోలీసుస్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ ఫిర్యాదులు పునరావృతం కాకుండా సమస్యపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేకూరేలా చూడాలన్నారు. విచారణలో జాప్యంలేకుండా పారదర్శకమైన పద్ధతిలో సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కెవీవీఎన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): ‘సర్’ ప్రక్రియలో భాగంగా నోటీసులను సంబంధిత ఓటర్లకు త్వరితగతిన జారీ చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులకు సూచించారు. పీజీఆర్ఎస్లో ‘బుక్ ఎ కాల్’తో ప్రజల ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం ప్రజలకు మరింత చేరువ అవుతుందని కలెక్టర్ అన్నారు. సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం తర్వాత అధికారులతో ఆమె సమీక్షించారు. అనంతరం భీమవరం పీపీ రోడ్డులోని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ గోడౌన్స్‌లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఏలూరు (టూటౌన్): ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ ఏలూరు నగరంలో క్రైస్తవులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించకుండా గత 76 సంవత్సరాలుగా తీరని అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఆగస్టు 10న నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏలూరు గ్జేవియర్ నగర్‌లోని అమలోద్బవి కెథడ్రల్ గురువులు, పాస్టర్లు వివిధ మత శాఖలకు చెందిన క్రైస్తవులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఐసిఎం అగ్ర పీఠాధిపతులు రెవ.జాన్ ఎస్డి రాజు ప్రార్థన చేసి ర్యాలీని ప్రారంభించారు. అమలోద్భవి కెథడ్రల్ నుంచి ర్యాలీ ప్రధాన రహదారిలో కలెక్టరేట్‌కు వరకూ సాగింది. -
పోలవరం మండలంలోకి పులి
పోలవరం రూరల్: పోలవరం మండలంలోని గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో టేకూరు, శివగిరి గ్రామాల మధ్య పెద్ద పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నెల రోజులు క్రితం ఇదే ప్రాంతం నుంచి పెద్ద పులి గోపాలపురం, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల మీదుగా తెలంగాణ ప్రాంతానికి వెళ్ళి మళ్లీ తిరుగుముఖం పట్టింది. రెండు రోజుల క్రితం బుట్టాయగూడెం మండలంలో సంచరిస్తూ తిరిగి పాపికొండల అభయారణ్య ప్రాంతంలోకి ప్రవేశించింది. పాపికొండల అభయారణ్య ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతం నుంచి గోదావరి నది వైపు చేరింది. అటవీశాఖాధికారులు రేడియో కాలర్ సిగ్నల్ ద్వారా పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ఆదివారం గడ్డపల్లి ప్రాంతం నుంచి జలతారు వాగు ప్రాంతం మీదుగా సంచరించింది. నెల రోజులుగా అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ పశువులను హతమార్చిన విషయం తెలిసిందే. మళ్లీ నది దాటి తూర్పుగోదావరి జిల్లా వైపు వెళ్తుండా లేదా తిరుగుముఖం పడుతుందా? అనేది తెలియడం లేదు. -
గంజాయి విక్రేతల అరెస్ట్
గన్నవరం: గంజాయి అక్రమంగా రవాణా చేస్తూ విక్రయిస్తున్న ఏడుగురు యువకుల ముఠా సోమవారం ఉంగుటూరు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ మేరకు సోమవారం ఉంగుటూరు పోలీస్‌స్టేషన్‌లో నిందితులను అరెస్ట్ చూపించారు. ఈ సందర్భంగా ఎస్సై యూ గోవిందు మాట్లాడుతూ.. నూజివీడుకు చెందిన షేక్ సిద్ధిక్ హుస్సేన్‌బాషా, కస్తూరి హర్షవర్ధన్ అరకు ఏజెన్సీ ఏరియాలో గంజాయి కొనుగోలు చేసి మండల పరిధిలో విక్రయాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని గారపాడు వద్ద గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి దాడి చేసినట్లు తెలిపారు. బాషా, హర్షవర్ధన్‌తో పాటు మానికొండకు చెందిన కస్తూరి కార్తీక్, గోగు సంతోష్, ఆరేపల్లి సురేష్, చిట్టిపోతుల ప్రభు, చాట్ల చైతన్యను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి నుంచి రెండు కేజీల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు గంజాయికి అలవాటు పడడంతో పాటు సులభంగా డబ్బు సంపాదించేందుకు గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. కేసులో ఏ–1 నిందితుడైన హుస్సేన్బాషాపై మాచవరం, విజయవాడ టూటౌన్, వీరవల్లి, ఏలూరు రూరల్ పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు. అనంతరం నిందితులను గన్నవరం కోర్టులో హాజరుపరచగా జడ్జి 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
అమరావతి చాంపియన్‌షిప్ క్రీడా పోటీలు ప్రారంభం
భీమవరం: విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే మంచి శారీరక దారుఢ్యంతో పాటు విద్యలోనూ అగ్రస్థానంలో నిలుస్తారని కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. స్థానిక ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం అమరావతి చాంపియన్‌షిప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ డి.విశ్వనాథ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ పి.రవీంద్రనాథ్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి (డెవలప్మెంట్ ఆఫీసర్) నూతక్కి మోహన్‌దాస్ మాట్లాడుతూ క్రీడాకారులు మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడా ప్రతిభను చాటాలన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించి వాలీబాల్‌లో 190 మంది, వెయిట్ లిఫ్టింగ్‌లో ఏడుగురు, చెస్‌లో 41 మంది, బ్యాడ్మింటన్‌లో 56, యోగాలో 63 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజు అధ్యక్షత వహించగా, కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిషాంత వర్మ, సీహెచ్.దిలీప్ చక్రవర్తి, పీడీలు పాల్గొన్నారు. -
ఫ్లెక్సీల తొలగింపులో పక్షపాత వైఖరి
భీమవరం: భీమవరం పట్టణంలో మున్సిపల్ అధికారుల పక్షపాత వైఖరిపై వైఎస్సార్సీపీ నాయకులు మండిపడుతున్నారు. కూటమి నాయకుల ఫ్లెక్సీలు తొలగించకుండా వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలు, వైఎస్సార్ విగ్రహం దిమ్మెను మాత్రం తొలగించడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్వా రైతులకు భరోసా కల్పించడానికి గత నెల 15న భీమవరం పట్టణానికి వస్తున్న సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేశారు. జగన్ పర్యటన ముగిసిన మరుసటి రోజునే మున్సిపల్ అధికారులు ఆ ఫ్లెక్సీలు, బ్యానర్లను ఆగమేఘాలపై తొలగించడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, ఈనెల 4న కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని అనేక ప్రాంతాల్లో, యనమదుర్రు డ్రెయిన్ వంతెన ఇరువైపులా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేశారు. పుట్టినరోజు గడిచి వారం రోజులు కావస్తున్నా ఫ్లెక్సీలు తొలగించలేదని, ఇదేమి పక్షపాతమని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అలాగే, పట్టణంలోని ప్రకాశం చౌక్ సెంటర్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటుకు వైఎస్సార్సీపీ నాయకులు సిమెంట్ దిమ్మె నిర్మించగా.. అక్కడ ఎటువంటి విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు లేవంటూ గత నెలలో మున్సిపల్ అధికారులు పొక్లెయినర్‌తో తొలగించారు. కానీ, అదే ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాలను ఏర్పాటుచేసి పెద్ద ఎత్తున ఆవిష్కరణలు చేసినా అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు పక్షపాత వైఖరిని విడనాడి విధులను సక్రమంగా నిర్వహించకపోతే తగిన శాస్తితప్పదని హెచ్చరిస్తున్నారు. -
పారా క్రీడాకారులకు అభినందనలు
భీమవరం (ప్రకాశంచౌక్): థాయ్‌లాండ్‌లోని శ్రీరాచాలో ఏప్రిల్‌లో నిర్వహించిన ’వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్–2026లో జిల్లాకు చెందిన దివ్యాంగ క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఆ క్రీడాకారులు సోమవారం కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ చదలవాడ నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రీడాకారులను అభినందించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని జిల్లా నుంచి మరికొంతమంది క్రీడాకారులు తయారవ్వాలని ఆమె ఆకాంక్షించారు. పారా అథ్లెటిక్స్‌లో అత్తిలి గ్రామానికి చెందిన యడ్లపల్లి సూర్యనారాయణ షాట్‌పుట్ ఎఫ్–42 కేటగిరీలో బంగారు పతకం, జావెలిన్ త్రో ఎఫ్–42 కేటగిరీలో కాంస్య పతకం సాధించారు. అలాగే పాలకొల్లుకు చెందిన మురపాక నళిని రాజశేఖర్ పారా పికిల్‌బాల్ పీపీ–54 కేటగిరీలో కాంస్య పతకం, జావెలిన్ త్రో ఎఫ్–54 కేటగిరీలో వెండి పతకం సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కే.ఆర్. కల్పశ్రీ, డీఆర్వో పీ. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
పొగాకు రైతు కుటుంబానికి వైఎస్ జగన్ ఆర్థిక సహాయం
బుట్టాయగూడెం: గుండెపోటుతో మృతి చెందిన పొగాకు రైతు పాలా వెంకటేశ్వరరావు కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదుకున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పార్టీ తరఫున ప్రకటించిన రూ. 2 లక్షల ఆర్థిక సహాయం చెక్కును సోమవారం రాత్రి బాధిత కుటుంబానికి అందజేశారు. ఇటీవల దేవరపల్లికి వచ్చిన వైఎస్ జగన్‌ను మృతి చెందిన పొగాకు రైతు వెంకటేశ్వరరావు భార్య సీతారత్నం, కుమారుడు శ్రీనివాస్, కుమార్తె సుజాత కలిసి తమ పరిస్థితిని వివరించారు. స్పందించిన వైఎస్ జగన్ వారికి ధైర్యం చెప్పి, ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాథరావుల చేతుల మీదుగా బాధిత కుటుంబానికి రూ.2 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా పొగాకు రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, వైఎస్సార్సీపీ ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుందని వారు తెలిపారు. కూటమి ప్రభుత్వం కూడా స్పందించి ఈ రైతు కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీరావు, పార్టీ జిల్లా కార్యదర్శులు ఆరేటి సత్యనారాయణ, సయ్యద్ బాజీ, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు వాసిరెడ్డి మధు, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు తాళ్లూరి ప్రసాద్, నాయకులు పంపన నాగబాబు, పంపన కృష్ణ, జిత్తుక సురేష్, మేకరబోయిన శ్రీను, కుక్కల రాంపండు, తదితరులు పాల్గొన్నారు. -
కుమార్తెని అప్పగించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ఫిర్యాదు
నూజివీడు: ప్రియురాలిని ప్రేమ వివాహం చేసుకుని తన ఇంటికి తీసుకెళ్లిన యువకుడిపై యువతి తల్లిదండ్రులు రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గొల్లపల్లికి చెందిన యువతి కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలోని తన మేనమామ ఇంటి దగ్గర ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ, మూడు రోజుల క్రితం వివాహం చేసుకుని బాపులపాడు మండలం వీరవల్లి పోలీసులను ఆశ్రయించారు. వారిద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించి, యువతిని భర్త ఇంటికి పంపించారు. అయితే, తమ అమ్మాయిని తమ దగ్గరకు పంపించాలంటే ఆమె భర్త రూ.12 లక్షలు డిమాండ్ చేస్తున్నాడంటూ సోమవారం నూజివీడు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీమవరం: సర్వోదయ మండలి ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థాయిలో ‘భారత స్వాతంత్య్ర ఉద్యమం – అమరవీరుల త్యాగఫలాలు‘ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో 20 రచనలను ఉత్తమమైనవిగా ఎంపిక చేసినట్లు సర్వోదయ మండలి జిల్లా కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు తెలిపారు. పాఠశాల స్థాయిలో పి.సుహాసిని శ్రీదుర్గ (దర్శిపర్రు), ఎండీ యాస్మిన్ జారా (ఏలూరు), పి.వర్షిణి (జీలకర్రగూడెం), కె.కుషాలి (బొర్రంపాలెం), టి.కుసుమ (కళ్లచెరువు), సీహెచ్ భాను (సీతంపేట), ఏవీ స్వాగత్ (భీమవరం), ఎస్‌సీహెచ్.సత్యబ్రాహ్మణి (కొయ్యలగూడెం), సి.సాహితి (అత్తిలి), కె.క్రాంతి (పెదనిండ్రకొలను), కె.వర్ష (పాలకోడేరు), సీహెచ్.నాగవర్షిణి (రాయకుదురు), కె.వైష్ణవి (అనాకోడేరు), డి.గీతాంజలి (పాలకొల్లు), కేడీ కార్తీక్ (పత్తేపురం), ఓ.బిందు (ఈస్ట్ విప్పర్రు), కె.నిత్యత (నాగులగూడెం) ఎంపికయ్యారు. అలాగే, కళాశాలల స్థాయిలో కె.ప్రియాంక (జంగారెడ్డిగూడెం), ఎ.వర్షిత్ (పెన్నాడ), జె.ప్రణవి (వీరవాసరం) ఎంపికయ్యారని, విజేతలకు ఈ నెల 13, 14 తేదీల్లో భీమవరం, ఏలూరులలో బహుమతులు అందజేస్తామని ప్రసాదరాజు చెప్పారు. తణుకు అర్బన్: అమరావతి చాంపియన్‌షిప్ జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు తణుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించారు. నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ కేవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలను మునిసిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు ప్రారంభించారు. అథ్లెటిక్స్‌లో 100, 200, 400 మీటర్ల రన్నింగ్ పోటీలు, జావలిన్‌త్రో, హైజంప్, షాట్‌పుట్ విభాగాల్లో జిల్లా నలుమూలల నుంచి 140 మంది క్రీడాకారులు పోటీలో పాల్గొనగా 24 మంది క్రీడాకారులు మొదటి స్థానంలో నిలిచి విజయవాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, డీవైఈవో డి.మురళిసత్యనారాయణ, ఏంపీడీవో కార్యాలయ ఏవో వి.కృష్ణచంద్రరావు, క్రీడల కోఆర్డినేటర్ సంకు సూర్యనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కాళ్లరిగేలా తిరిగినా కనికరించక..
వేలేరుపాడు మండలం కన్నాయిగుట్ట గ్రామానికి చెందిన 74 ఏళ్ల కారం లక్ష్మయ్య.. జీవనాధారమైన వ్యవసాయ భూమిని అధికారులు అప్పగించకపోవడంతో ఆ దిగులుతో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం ఆయన భార్య కారం చిన్నక్కను కూడా అధికారులు కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారు. కారం లక్ష్మయ్యకు వేలేరుపాడు మండలం తిర్లాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 57, 60లలో 4.33 ఎకరాల పట్టా భూమి ఉంది. దీనికి బదులుగా 2017లో జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెం రెవెన్యూ సర్వే నంబర్ 118/1సీలో 4.33 ఎకరాల భూమిని జల్లేరు వాగు ఒడ్డున కేటాయించారు. అయితే, వరద ప్రవాహానికి ఆ భూమంతా కొట్టుకుపోయి, కనీసం అరెకరం భూమి కూడా మిగల్లేదు. అప్పటి నుంచి మరోచోట సాగుకు యోగ్యమైన భూమి చూపించాలని లక్ష్మయ్య అధికారులను వేడుకుంటూనే ఉన్నారు. పీఓలు మారినప్పుడల్లా వినతిపత్రాలు సమర్పించడం పరిపాటైంది. స్వర్ణవారిగూడెంలో మిగులు భూమిగా ఉన్న సర్వే నంబర్ 33/1లో 4.00 ఎకరాలు, సర్వే నంబర్ 33/2లో 0.62 ఎకరాలను రెండేళ్ల క్రితం మండల సర్వేయర్, వీఆర్వో, వీఆర్ఏ పరిశీలించి చూపించారు. కానీ, స్వర్ణవారిగూడెం వీఆర్వో, వీఆర్ఏ, స్థానిక ఓ పార్టీ నేత కుమ్మకై ్క ఈ భూములను కాజేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపడితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. -
కాలువలో దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
యువతి గల్లంతు పాలకోడేరు: ప్రేమ వ్యవహారంలో నిరాశకు గురైన ఓ ప్రేమజంట కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గొరగనమూడి లాకుల సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... కుముదవల్లికి చెందిన తురగళ్ల సందీప్ కుమార్ (22), పినతల్లి వద్ద ఉంటున్న గుడ్ల శ్రీలలిత జగదాంబిక అనే యువతి ప్రేమించుకున్నారు. జీవితంపై విరక్తి చెంది సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో గొరగనమూడి వద్ద ఉన్న వేండ్ర పెద్ద కాలువలోకి ఇద్దరూ ఒకేసారి దూకారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సందీప్‌కుమార్‌ను సురక్షితంగా బయటకు తీశారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో యువతి లలిత కాలువలో కొట్టుకుపోయింది. పాలకోడేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. గల్లంతైన యువతి ఆచూకీ కోసం భీమవరం అగ్నిమాపక కేంద్రం, రెస్క్యూ సిబ్బంది, శిక్షణ పొందిన ఈతగాళ్ల సహాయంతో కాలువలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెనుమంట్ర: పెనుమంట్ర–వీరవాసరం రోడ్డులోని పొలమూరు పెట్రోల్ బంకు వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో సైక్లిస్టు మృతి చెందాడు. ఏఎస్ఐ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కాళ్లకు చెందిన చెల్లబోయిన నాగరాజు (55) తన కుమార్తెను చూసేందుకు పెనుమంట్రకు సైకిల్‌పై వస్తున్నారు. ఈ క్రమంలో పొలమూరు పెట్రోల్ బంకు సమీపానికి రాగానే వేగంగా వచ్చిన కారు ఆయన్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ నేరుగా పెనుమంట్ర పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మృతుడి కుమారుడు సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
సీతమ్మ గోడుపై ఎంత నిర్లక్ష్యం!
వేలేరుపాడు మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన మడకం సీతమ్మ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తాట్కూరుగొమ్ము రెవెన్యూ పరిధిలో ఆమె భర్త మడకం రాజయ్య పేరిట ఉన్న 3.79 ఎకరాల భూమికి అవార్డు పాస్ అయింది. దీనికి బదులుగా రాసన్నగూడెం రెవెన్యూ సర్వే నంబర్ 54/1ఇ1లో 1.13 ఎకరాలు, 55/1లో 1.50 ఎకరాలు, 54/1ఇ5లో 1.10 ఎకరాలు.. మొత్తం 3.79 ఎకరాలను 2017లో కేటాయించి హక్కు పత్రం అందజేశారు. రాజయ్య మృతి చెందడంతో ఆ పట్టాను భార్య మడకం సీతమ్మ పేరిట నమోదు చేశారు. అయితే, ఆ భూమిని మరొకరు సాగు చేసుకుంటున్నా, అధికారులు సీతమ్మకు అప్పగించడం లేదు. గత ఎనిమిదేళ్లుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం, కేఆర్‌పురం ఐటీడీఏ పీఓ కార్యాలయం, జీలుగుమిల్లి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోవడంతో, తన బ్రతుకులో న్యాయం జరిగేలా లేదని సీతమ్మ కన్నీరుమున్నీరవుతోంది. వృద్ధాప్యంలో కార్యాలయాల చుట్టూ తిరిగి ప్రాణాలు వదలాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా యంత్రాంగం స్పందించి ఈ బాధిత గిరిజనులకు తగిన భూమిని అప్పగించి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
రైలులో అస్వస్థతతో ప్రయాణికుడు మృతి
ఏలూరు టౌన్: రైలులో ఓ ప్రయాణికుడు అస్వస్థతతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలివి. సికింద్రాబాద్ నుంచి జార్ఖండ్ వెళ్లేందుకు రైలులో ఒక వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. రైలు విజయవాడ రైల్వే స్టేషన్ దాటిన అనంతరం ప్రయాణికుడు తీవ్ర ఆస్వస్థతకు గురయ్యాడు. తోటి ప్రయాణికులు మెడికల్ ఎమర్జెన్సీపై ఏలూరు రైల్వే స్టేషన్లో అతడ్ని దించారు. రైల్వే హాస్పిటల్ వైద్యులు పరీక్షించి అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్థారించారు. మృతుడు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కమలేష్ చౌదరిగా గుర్తించారు. అనారోగ్యంతో కమలేష్ మృతి చెందటంతో ఏలూరు రైల్వే పోలీసులు సాధారణ మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్ మార్చురీలో భద్రపరిచారు. తణుకు అర్బన్: తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ఒక మహిళ అనుమానాస్పదంగా మృతి చెందారు. తణుకు రూరల్ ఎస్ఐ నాళం శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూరులో నివసిస్తున్న ఒగ్గువోలు వాణి అలియాస్ రోజా (43) 20 ఏళ్ల క్రితం భర్త నుంచి విడిపోయి, గ్రామానికి చెందిన కాళిదాసు చిన్నారావు అలియాస్ చిన్నితో సహజీవనం చేస్తున్నారు. సోమవారం ఉదయం ఆమె ఇంట్లో చలనం లేకుండా పడి ఉండడంతో, ఆమె కుమారుడు విజయ్‌కుమార్‌కు చిన్ని ఫోన్ చేసి తెలిపారు. ఘటనా ప్రాంతానికి వచ్చి పరిశీలించిన కుమారుడు, తన తల్లి చనిపోయినట్లు గుర్తించి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన
భీమవరం: రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి. బలరామ్, ఆలిండియా అగ్రగామి కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి పీవీ సుందరరామరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్విట్ ఇండియా స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా సోమవారం భీమవరం హెడ్‌పోస్టాఫీసు వద్ద నిర్వహించిన జైల్ భరో కార్యక్రమంలో వారు మాట్లాడారు. ముందుగా స్థానిక సీఐటీయూ కార్యాలయం నుంచి ప్రకాశం చౌక్ సెంటర్, తాలూకా ఆఫీస్ మీదుగా పోస్టాఫీస్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో బలరామ్, సుందరరామరాజు మాట్లాడుతూ... నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక సంపద సృష్టికర్తలైన రైతు, వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలను కార్పొరేట్లకు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. కార్మికులకు మేలు చేసే చట్టాలను రద్దు చేసి, కార్పొరేట్లకు అనుకూలమైన లేబర్ కోడ్స్‌ను తెచ్చారన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. వాసుదేవరావు, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నర్సింహమూర్తి మాట్లాడుతూ... ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే కనీస వేతనాలు అమలు చేయాలని, గ్రామీణ పేదలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా అమలు చేసి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వన్‌టౌన్ పోలీసులు జైల్‌భరోను అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో అక్కడ ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు దండు శ్రీనివాసరాజు, గొర్ల రామకృష్ణ, డి. కళ్యాణి, ధనికొండ శ్రీనివాస్, కె. తవిటి నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
వాడపల్లి వెంకన్నకే శఠగోపం !
● వాడపల్లి ఆలయ సన్నిధిలో అన్నదానానికి రూ.1.5 కోట్ల సామగ్రి ● మూడేళ్ల క్రితమే సిద్ధం చేసిన పశ్చిమ మిల్లర్స్ అసోసియేషన్ ● గత సీజన్లో మిల్లర్ల నుంచి సుమారు రూ.4.5 కోట్లు వసూలు చేసిన ముఖ్య నేత ● ఇప్పటికీ అసోసియేషన్ గోడౌన్ వద్దే మూలుగుతున్న సామగ్రి ● ఆ సొమ్ములు ఏమైనట్టని రైస్ మిల్లింగ్ వర్గాల్లో చర్చ సాక్షి, టాస్క్‌ఫోర్స్: వాడపల్లి వెంకన్న పేరిట అసోసియేషన్ నేత వసూళ్లపై పశ్చిమ రైస్ మిల్లింగ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వెంకన్న సన్నిధిలో అన్నదానం పేరిట క్వింటాల్ ధాన్యానికి రూ.5 చొప్పున గత సీజన్లో సుమారు రూ.4.5 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అప్పటికే సమకూర్చిన సామగ్రి ఇప్పటికీ మూలన ఉండగా ఆ సొమ్ములు ఏమాయ్యాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. రూ.1.50 కోట్ల సామగ్రి జిల్లాలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌కు అనుబంధమైన గోదావరి సొసైటీ గతంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించింది. భీమవరం, తాడేపల్లిగూడెంలోని కిచెన్స్ ద్వారా ఆహార పదార్థాలను పాఠశాలలకు సరఫరా చేసేవారు. ఆచంట, నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లోని విద్యార్థుల కోసం పాలకొల్లులో కిచెన్ నిర్మించాలని 2021–22లో సొసైటీ నిర్ణయించింది. అందుకోసం చైన్నె నుంచి లక్ష మందికి ఏకకాలంలో అన్నం, సాంబారు, కూరలు సిద్ధం చేసేందుకు దాదాపు రూ.1.5 కోట్ల విలువైన బాయిలర్, స్టీమ్డ్ కుకింగ్ వెసల్స్‌ను చైన్నెలో తయారుచేయించి తీసుకువచ్చారు. అవసరమైన షెడ్లు నిర్మాణాలు చేపట్టారు. అప్పటికే ఈ నియోజకవర్గాల పరిధిలో మధ్యాహ్న భోజనం వంటలు చేస్తున్న మహిళలు ఉపాధి కోల్పోతారని భావించి కిచెన్ ఏర్పాటు ఆలోచనను అసోసియేషన్ విరమించుకుంది. ద్వారకాతిరుమల స్వామివారి సన్నిధిలో అన్నదానం నిమిత్తం గతంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని అసోసియేషన్ సామగ్రిని సమకూర్చింది. అదే మాదిరిగా పాలకొల్లులో కిచెన్ కోసం తె చ్చిన సామగ్రిని వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి భక్తులకు అన్నదానం కోసం దేవస్థానానికి అందించాలని నాడు గృహ నిర్మాణశాఖ మంత్రిగా ఉన్న చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సొసైటీ చైర్మన్ పెనుమర్తి కృష్ణంరాజు, అసోసియేషన్ సభ్యులు భావించారు. ఈ మేరకు ఆలయ కమిటీతో చర్చించగా డైనింగ్ హాల్ సిద్ధమైన తర్వాత సామగ్రిని తీసుకువెళతామని సభ్యులు చెప్పినట్టు సొసైటీ నేత ఒకరు తెలిపారు. హాల్ సిద్ధం కావడంతో సామగ్రి కోసం ఆలయ ప్రతినిధులు 2024లో అసోసియేషన్ నేతలను కలిశారన్నారు. స్టీమ్డ్ కుకింగ్ వెసల్స్ వాడపల్లి వెంకన్న భక్తులకు అన్నదానం పేరిట 2024–25 మిల్లింగ్ సీజన్‌కు గాను గతేడాది మార్చిలో టన్ను ధాన్యంపై రూ. 50ల చొప్పున అసోసియేషన్ నేత ఒకరు దాదాపు రూ.4.5 కోట్ల మేర మిల్లర్లు నుంచి వసూలు చేసినట్టు తెలుస్తోంది. అయితే వంట సామగ్రి ఇంకా తాడేపల్లిగూడెం రూరల్ పెదతాడేపల్లిలోని రైస్‌మిల్లర్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆవరణలో ఉందంటున్నారు. కిచెన్‌లో సామగ్రిని అమర్చడం, డైనింగ్ టేబుల్స్ నిమిత్తం రూ.50 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని, రూ.కోట్లల్లో కలెక్షన్ ఎందుకు చేశారని, ఇప్పటికి సామగ్రి పంపకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంకన్న భక్తులకు అన్నదానం కోసమని వసూలు చేసిన సొమ్ములు ఏమైనట్టని మిల్లర్లు చర్చించుకుంటున్నట్టు సమా చారం. కాగా సదరు నేత కూటమికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, అధికారుల అండదండలతో ఇ ష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మిల్లింగ్ వర్గా ల్లో టాక్. ఆయనతో మనకెందుకొచ్చిన గొడవన్నట్టు మిన్నకుండి పోతున్నారంటున్నారు. -
వైఎస్సార్సీపీలోకి సత్యవరం టీడీపీ నాయకులు
పెనుమంట్ర: పెనుమంట్ర మండలం సత్యవరం గ్రామానికి చెందిన పలువురు టీడీపీ సీనియర్ నా యకులు ఆదివారం మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఆచంట నియోజకవర్గ ఇన్చార్జి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ సర్పంచ్ దివంగత చుక్క అప్పారావు సోదరుడు చుక్క శ్రీనివాస్, పుష్పలత దంపతులతో పాటు వారి సోదరులు గౌతమ్‌కుమార్, 14 మంది టీడీపీ సీనియర్ నాయకులు ఆదివారం తూర్పుపాలెం శ్రీరంగనాథరాజును కలిశారు. వారితో పాటు గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గెడ్డం విఘ్నేశ్వరులు, కుక్కల సూర్యనారాయణ, చెల్లబోయిన శ్రీను, కట్ట వెంకటేశ్వర్లు ముప్పిడి మోసే, గుబ్బల రామకృష్ణ, కట్ట మురళి, చొక్కాకుల నాగులు, మంగం మారేస్, ఖండవల్లి సురేష్ మంగం చిన్న వెంకటరావు తదితర నాయకులతో పాటు సుమారు 80 మంది కార్యకర్తలకు శ్రీరంగనాథరాజు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రతి కార్యకర్తకూ సముచిత స్థానం కల్పిస్తున్నామని, అదే స్ఫూర్తితో కొత్తగా చేరిన నాయకులు, కార్యకర్తలను కూడా అండగా నిలుస్తామన్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ ప్రభు త్వం నెరవేర్చలేని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. మాట తప్పని.. మడం తిప్పని వైఎస్ జగన్మోహన్రెడ్డి, శ్రీరంగనాథరాజుల నా యకత్వంలో వైఎస్సార్సీపీలో చేరుతున్నట్టు చె ప్పారు. పోడూరు జెడ్పీటీసీ గుంటూరు పెద్దిరాజు, మండల పార్టీ అధ్యక్షుడు గూడూరు దేవేంద్రుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు తమనంపూడి పల్లారెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి టి. సూర్య వెంకట గణేష్ రెడ్డి, అయ్యప్పరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు గడ్డం ఈశ్వరుడు, సీనియర్ నాయకుడు నల్లమిల్లి ప్రభాకర్ రెడ్డి, జక్కంచెట్టు శ్రీరాములు, పోతిమూడి రామచంద్రరావు, గుబ్బల వీరబ్రహ్మం, మండల ఎస్సీ సెల్ కన్వీనర్ బుర్ర రవికుమార్ తదితరులు ఉన్నారు. -
ఘనంగా ఆదివాసీ దినోత్సవం
భీమవరం (ప్రకాశంచౌక్): గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. కొమరం భీమ్ చిత్రపటానికి జేసీ కేఆర్ కల్పశ్రీ, కలెక్టరేట్ ఏఓ ఎ.వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి డి.పుష్పరాణి, గిరిజన సంక్షేమ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జేసీ సమావేశం నిర్వహించారు. గిరిజన సంస్కతి, సాంప్రదాయాలు, హక్కులు, విద్యా, సామాజిక, ఆర్థిక అభివద్ధి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. గిరిజన విద్యార్థులతో ముచ్చటించారు. జిల్లా ప్రోగ్రామింగ్ మేనేజర్ ఎ.శ్యాం, గిరిజన నాయకులు సాలా మల్లేశ్వరరావు, కుతాడి శ్రీనివాసరావు, మేకల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. తణుకు అర్బన్: అమరావతి జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు సోమవారం తణుకు బాలుర ఉన్న త పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్నట్టు ఎంపీడీఓ జి.శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభించే పోటీల్లో జి ల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారన్నారు. పోటీలను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభిస్తారని చెప్పారు. -
కోడిపందేలపై దాడి
నూజివీడు: మండలంలోని పాత రావిచర్లలో నిర్వహిస్తున్న కోడిపందేలపై ఆగిరిపల్లి పోలీసులు ఆదివారం సాయంత్రం మెరుపుదాడి చేశారు. గ్రామంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారంటూ వచ్చిన విశ్వనీసయ సమాచారం మేరకు ఆగిరిపల్లి ఎస్ఐ హెచ్.నాగరాజు సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో పందెంగాళ్లు, చూడటానికి వచ్చిన వారందరూ పారిపోగా దాదాపు 13 ద్విచక్ర వాహనాలు, కోడిపుంజును స్వాధీనం చేసుకున్నారు. పాత రావిచర్లలో ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో కోడిపందేలు జరుగుతూనే ఉన్నాయి. ఆదివారం వస్తే మాత్రం గ్రామంలో అంకమ్మ తల్లి గుడి ఎదురుగా పెద్ద ఎత్తున కోడిపందేలు నిర్వహిస్తున్నారు. ఈ పందేలలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. దీనిలో భాగంగా నూజివీడు మండలం రామన్నగూడెం, కృష్ణాజిల్లాలోని ఉంగుటూరు మండలం పొట్టిపాడు, కోడూరుపాడు, హనుమాన్‌జంక్షన్, విజయవాడ సమీపంలోని నున్న తదితర గ్రామాల నుంచి కూడా కోడిపందేలకు తరలివచ్చారు. కోడిపందేలు జరుగుతుండగా పందెగాళ్ల మధ్య గొడవ జరగడంతో సమాచారాన్ని పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు దాడి జరిపారు. -
చిట్టీల పేరుతో దగా
● ఒక్కొక్కరుగా బయటకొస్తున్న బాధితులు ● రూ.40 కోట్ల టోకరాపై ఏజెంట్లను నిలదీస్తున్న బాధితులు తణుకు అర్బన్: శ్రీదుర్గా భవాని చిట్స్ అండ్ ఫైనాన్స్ పేరుతో రూ.40 కోట్లకు టోకరా వేసిన వ్యవహారం తణుకు నియోజకవర్గంలో సంచలనం రేకెత్తించగా, ఈ ఘటనకు సంబంధించి బాధితులు భారీ స్థాయిలో బయటకు వస్తున్నారు. గత 20 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తూ అందరినీ నమ్మించిన ఫైనాన్స్ వ్యాపారి గోలి శ్రీనివాసరావు మోసంతో పేదవర్గానికి చెందిన బాధితులు అల్లాడిపోతున్నారు. తణుకు ఇరగవరం కాలనీ అక్షయనగర్‌లో అధునాతన వసతులతో విలాసవంతంగా నిర్మించుకున్న నాలుగు అంతస్థుల భవనంలో నివసిస్తున్న గోలి శ్రీనివాసరావు చిట్టీల పేరుతో పేదవర్గాల నుంచి కోట్లాది రూపాయలు దోచుకున్న విషయం తెలిసిందే. ఆదివారం వివిధ ప్రసార సాధనాలు, పత్రికల్లో వచ్చిన వార్తలతో బాధితులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. తణుకు కేంద్రంగా నిర్వహించిన ఈ దోపిడీలో ఇరగవరం మండలంలో అధిక శాతం బాధితులు ఉండగా, అత్తిలి, పెనుమంట్ర తదితర ప్రాంతాల్లో సైతం అనేకమంది మోసపోయారు. దీనిపై ఇప్పటికే ఇరగవరం పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. చిట్టీల వ్యవహారం బయటపడడంతో రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. తణుకు పోలీస్ స్టేషన్‌కు ఏజెంట్లు గోలి శ్రీనివాసరావు చిట్టీల సంస్థలో పనిచేసిన ఏజెంట్లు తణుకు పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. సంస్థను నమ్మి డబ్బు కట్టిన బాధితులు తమను నిలదీస్తూ ఒత్తిడి చేస్తున్నారంటూ పోలీసులను వేడుకున్నారు. తాము చిట్టీల సంస్థలో పనిచేశామని, బాధితుల నుంచి డబ్బులు తీసుకుని సంస్థకు చెల్లించామని వారు చెబుతున్నారు. ఈ సంస్థలో 20 మందికి పైగా ఏజెంట్లు పనిచేస్తున్నట్లు సమాచారం. చిట్స్, ఫైనాన్స్ పేరుతో మోసానికి పాల్పడిన గోలి శ్రీనివాసరావు ఆచూకీ ఇంకా దొరకలేదు. బాధితులంతా పేదవర్గానికి చెందినవారే అధికంగా ఉండడంతో వారి నుంచి ఒత్తిడి పెరుగుతోంది. శ్రీనివాసరావు, అతని కుటుంబసభ్యుల ఫోన్లు కూడా పనిచేయకపోవడంతో ఆచూకీ లభించడంలేదని బాధితులు వాపోతున్నారు. చిట్టీల శ్రీనివాసరావు వ్యవహారాన్ని పోలీసులు సైతం సీరియస్‌గా తీసుకున్నారు. మోసం భారీ స్థాయిలో ఉండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ చిట్టీల వ్యవహారంలో ఎంతమంది బాధితులు ఉన్నారు, మొత్తం ఎంత అనే కోణంలో పోలీసులు ఇప్పటికే కూపీ లాగుతున్నారు. ఈ నేపథ్యంలో బాధితులతోపాటు సంస్థలో పనిచేస్తున్న ఏజెంట్లను కూడా ఆరా తీస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు బాధితులు వస్తుండడంతో అసలు మోసపోయిన మొత్తం రూ. 40 కోట్లేనా లేక మరింత ఎక్కువ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
క్షీరారామం.. మోక్షధామం
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో 10 రోజులు విశేష పూజలు జరుగుతున్నాయి. సోమవారం లోక కల్యాణార్థం ఉదయం 7.15 గంటలకు (ఆరుద్ర నక్షత్రం) జలాభిషేకం నిర్వహించనున్నారు. ఆదివారం ఆలయ అ భిషేక పండిట్ భమిడపాటి వెంకన్న, మద్దూరి సూరిబాబు, సుబ్బయ్యల బ్రహ్మత్వంలో 108 కలశాలతో మహాన్యాసం, రుద్రాభిషేకం, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈఓ ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావ (రాము), ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్: ఆరుగొలను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో 5, 6వ తరగతి, జూనియర్ ఇంటర్లో ఖాళీల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ ఎం.దుర్గారావు ప్రకటనలో తెలిపారు. 5వ తరగతిలో 10 సీట్లు, 6వ తరగతిలో ఒక సీటు, జూనియర్ ఇంటర్ (10వ తరగతిలో 400లకు పైగా మార్కులు వచ్చిన వారు) ఎంపీసీ గ్రూపులో ఎనిమిది సీట్లు ఖాళీ ఉన్నాయన్నారు. ఆసక్తి గల వారు ఎస్సీ విద్యార్థులు ఈ నెల 10న గురుకులంలో సంప్రదించాలని కోరారు. కలిదిండి(కై కలూరు) : ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం కలిదిండిలో పర్యటించనున్నారు. మంత్రి కొలుసు పార్థసారథి, కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) పర్యటన వివరాలు వెల్లడించారు. మీ భూమి–మీ హక్కు పట్టాల పంపిణీలో భాగంగా ఇక్కడకు రానున్నారని, ఉదయం 10.45 గంటలకు ఇక్కడకు చేరుకుంటారన్నారు. హెలీప్యాడ్, సభ, సమావేశ స్థలాలను ఆదివారం పరిశీలించారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వీ, ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, జేసీ, ఆర్డీవో, సబ్ కలెక్టర్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షురాలు జానకిరెడ్డి మృతి
చింతలపూడి: వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా ఉపాధ్యక్షురాలు, మాజీ ఏఎంసీ చైర్పర్సన్ జగ్గవరపు జానకిరెడ్డి(60)ఆకస్మికంగా కన్నుమూశారు. కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం ఆదివారం ఉదయం తన స్వగృహంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమై మాట్లాడుతుండగా, ఆమెకు అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. కుటుంబసభ్యులు, అనుచరులు వెంటనే స్పందించి మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను విజయవాడకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మధ్యలో ఏలూరు సమీపానికి చేరుకునేసరికి ఆమె పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. జానకిరెడ్డి మృతి వార్త తెలిసిన వెంటనే వైఎస్సార్సీపీ వర్గాల్లో తీవ్ర విషాదం అలముకుంది. నిరంతరం ప్రజల్లో ఉంటూ, పార్టీ బలోపేతానికి విశేష సేవలందించిన నాయకురాలిని కోల్పోవడం తీరని లోటని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్చార్జ్ కంభం విజయరాజు, మచిలీపట్నం నియోజకవర్గ పరిశీలకులు జెట్టి గురునాథరావు, మండల అధ్యక్షుడు ఎస్.రమేష్‌రెడ్డి, పట్టణ వైపీపీ అధ్యక్షుడు కొప్పుల నాగేశ్వరరావు, మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు త్సల్లాబత్తుల శ్రీనివాసరావు, ఎ.సుబ్బారావు తదితరులు జానకిరెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. పాలకొల్లు సెంట్రల్: ధార్మిక సామాజిక పరిషత్ ఆధ్వర్యంలో సూర్యహోమం నిర్వహించారు. ఆదివారం స్థానిక హనుమాన్ కాలనీలో ఉన్న సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో 324వ సూర్యహోమం ఘనంగా చేశారు. గత ఆరు సంవత్సరాలుగా ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సూర్యహోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. పురోహితుడు రవీంద్ర బ్రహ్మత్వంలో ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకూ ఈ హోమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ హోమంలో పి.సత్యనారాయణరాజు, నిర్వాహకులు గాదె బాబు, నంబూరి పుల్లయ్య, జగపతిరాజు, సుబ్బరాజు, తదితరులు పాల్గొన్నారు. మండవల్లి: కొల్లేరు వరద నీటిని, ఉప్పు నీటిని నియంత్రించే రెగ్యులేటర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్యలు చేపట్టాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్ఎస్ భాస్కరరావు పేర్కొన్నారు. ఆదివారం మాట్లాడుతూ కొల్లేరు సరస్సుకు తిరిగి గత వైభవం రావాలన్నా, పక్షుల, మత్స్యకారుల జీవనం సజావుగా సాగాలన్నా, మత్స్య సంపద సమృద్ధిగా పెరగాలన్నా రెగ్యులేటర్ నిర్మాణమే మార్గమని పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ఎగువ ప్రాంతాల నుంచి కొల్లేరు సరస్సుకు భారీగా నీరు చేరుతుందని నీటిని నియంత్రించలేక పోవడంతో ఈ నీరంతా సముద్రంలో వృథాగా పోతుందన్నారు. నీరు ఎగతన్ని కొల్లేరులో కలవడంతో నీరు ఉప్పుమయమై భూములు చౌడుబారుతున్నాయని చెప్పారు. బుట్టాయగూడెం: కేఆర్‌పురం ఐటీడీఏలో ఆదివారం జరిగిన ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని జెడ్పీటీసీ మొడియం రామతులసి తీవ్రంగా ఆరోపించారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద విలేకర్లతో మాట్లాడుతూ సంవత్సరానికి ఒక్కసారి జరిగే గిరిజన పండుగలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లతోపాటు తనకు ఆహ్వానం రాలేదని ఆరోపించారు. ఈ సంఘటనతో ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌ల్లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతుందని ఆరోపించారు. ప్రభుత్వం ఈ అంశంపై స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రామతులసిని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ తెల్లం రమణ, మాజీ సర్పంచ్‌లు కూరం వెంకటేశ్వరరావు, బన్నే బుచ్చిరాజు, తెల్లం వెంకాయమ్మ, తెల్లం రాముడు, మాల్చి వెంకన్నబాబు, జోడే సత్యదుర్గాప్రసాద్, ఎంపీటీసీ గాలి దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు. -
ఆక్వా రైతుల పోరాట ఫలితమే
పాలకొల్లు సెంట్రల్: అందరూ సంఘటితంగా ఉంటే ఏదైనా సాధించవచ్చనడానికి నిదర్శనం ఆక్వా రైతులందరికీ రాయితీ యూనిట్ ధర నిర్ణయానికి కారణమని జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు బోణం చినబాబు అన్నారు. ఆదివారం స్థానిక కాస్మో స్పోర్ట్స్ కాంప్లెక్స్ భవనంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అని ఉండేవన్నారు. ఆక్వా జోన్లో ఉన్న రైతులకు మాత్రమే విద్యుత్ సబ్సిడీ వర్తించేదని నేడు నాన్ ఆక్వా జోన్లో ఉన్న ఆక్వా రైతులకు కూడా రూ.1.50 విద్యుత్ యూనిట్ ధరను వర్తింప చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపిందన్నారు. ఈ విజయానికి రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు ఆధ్వర్యంలో చేసిన పోరాట పలితమేనని అన్నారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11న పాలకొల్లు రామచంద్రా గార్డెన్స్ వెనుక భాగంలో ఉదయం 10 గంటలకు ఆక్వా రైతులతో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, బుట్టా రామ్‌కుమార్‌లతో పాటు ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పెన్మెత్స సత్యనారాయణ రాజు, సజ్జా బుజ్జి తదితరులు పాల్గొన్నారు. -
పాపికొండల వైపు పెద్దపులి
బుట్టాయగూడెం: గత నెల 30న ఏలూరు జిల్లాలోకి ప్రవేశించిన పెద్దపులి పోలవరం, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం, ఏలూరు జిల్లా కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో సంచరిస్తూ పశువులను హతమార్చింది. ఆదివారం లంకపాకల సమీపంలోని కాల్వ నుంచి నడుచుకుంటూ పాపికొండల అభయారణ్యంలోకి ప్రవేశించింది. బుట్టాయగూడెం మండలం వీరమద్దిగూడెం మీదుగా ముంజులూరు అటవీప్రాంతంలోకి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పాపికొండల అభయారణ్యంలో దట్టమైన అడవిలో ఉండడం వల్ల అటవీశాఖ అధికారులు రేడియో కాలర్ సిగ్నల్ ద్వారా పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. శనివారం గురుగుమిల్లి, గవరంపేటలో మూడు పశువులపై దాడి చేసిన పెద్దపులి శనివారం ఎక్కడా కూడా పశువులపై దాడి చేసిన దాఖలాలు లేవని అధికారులు తెలిపారు. గిరిజన ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులిని అటవీశాఖ అధికారులు త్వరితగతిన పట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కోరారు. ఆదివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ పెద్దపులి సంచారంతో గ్రామాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారన్నారు. అలాగే అనేక పశువులను పులి హతమార్చడంతో తీవ్రమైన ఆందోళన చెందుతున్నారని అన్నారు. పరిహారం మాట ఎలా ఉన్నా పశువులను కాపాడాలని ప్రజలపై పులి దాడి జరగకముందుగానే పులిని పట్టుకుని జూకు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. -
కొల్లేరు సంగతేంటి బాబూ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరు రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం.. ఆక్వా విద్యుత్ చార్జీలు తగ్గించి రైతులను ఆదుకుంటాం.. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని వేగంగా ప్రారంభించి పూర్తి చేస్తాం.. ఇలా లెక్కకు మించిన హామీలు గుప్పించారు. ఇక సూపర్‌సిక్స్ పేరుతో హామీలిచ్చి ఆడబిడ్డ నిధికి ఎగనామం పలికారు. ఉమ్మడి పశ్చిమకు లెక్కకు మించి హామీలిచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేశారు. ప్రభుత్వం కొలువుతీరి రెండేళ్లు అయినా హామీల అతీగతీ లేదు. సోమ వారం కై కలూరు నియోజకవర్గంలోని కలిదిండిలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. కొల్లేరు సరిహద్దులు సాధ్యమేనా? ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కై కలూరు, ఉంగుటూరు, దెందులూరు, ఉండి, ఏలూరు నియోజకవర్గాల్లోని 9 మండలాల్లోని 77,138 ఎకరాల్లో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. మొత్తం 122 గ్రామాలు కొల్లేరు పరీవాహకంలో ఉన్నాయి. అభయారణ్యంలో జిరాయితీ భూములు 14,932 ఎకరాలు, డీ–పట్టా భూము లు 5,510 ఎకరాలు కలిపి 20,442 ఎక రాలు ఉన్నాయి. వీటిని మినహాయించాలని ప్ర భుత్వం సీఈసీని కోరింది. ఇదిలా ఉంటే ఇదిగో కొల్లేరు మిగులు భూములు ఇచ్చేస్తోన్నారు? పత్తేపురం వద్ద సొసైటీ భూములు కేటాయిస్తాం అంటూ రాజకీయ నేతలు పబ్బం గడుపుకోడానికి పదేపదే వల్లిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆధీనంలో సీఈసీ ఒకటి చెబితే దానిని ఇక్కడ కొల్లేరు ప్రజలకు మరో రకంగా నాయకులు చెబుతున్నారు. దీనిపై స్పష్టమైన హామీని సీఎం చంద్రబాబు నుంచి కొల్లేరు ప్రజలు ఆశిస్తున్నా రు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ అథారిటీ (అ ప్సడా) చట్టాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. కంటి తుడుపు చర్యగా విద్యుత్ సబ్సిడీ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఆక్వా రంగం దేశంలోనే ప్రథమ స్థానం సాధిస్తుండగా ఏలూరు జిల్లా కలిదిండి మండలం తలసరి ఆదాయంలో ఏపీలో ప్రథమ స్థానంలో నిలుస్తోంది. అలాంటి ప్రాంతానికి సీఎం విచ్చేస్తున్నారు. జిల్లాలో రాయితీ విద్యుత్ కనెక్షన్లు 16,332 ఉన్నాయి. జోన్, సాగు విస్తీర్ణంతో సంబందం లేకుండా ఆక్వా రైతులు అందరికీ యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇస్తానని, 500 ట న్నుల కెపాసీటీ కలిగిన కోల్డ్ స్టోరేజీలు కట్టిస్తామని, ఏరియేటర్లు సబ్సిడీ ఇ స్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు.ఉమ్మడి జిల్లాలో చేపలు 1.80 లక్షల ఎకరాలు, రొయ్యలు 1.10 లక్షల ఎకరాలు మొత్తంగా 2.90 లక్షల్లో ఆక్వాసాగు ఉంది. మొత్తంగా 65 వేల మంది రైతులు ఆక్వాపై ఆధారపడి జీవిస్తున్నారు. మేత తయారు చేసే కంపెనీలు టన్నుకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు (వనామీ రొయ్యల మేత కిలోకు రూ.8, టైగర్ రొయ్యల మేత కిలోకు రూ.10 చొప్పున) ధరలను పెంచేశాయి. మేత కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడి కృత్రిమంగా ధరలను పెంచుతున్నాయని రైతులు పాలకొల్లు, భీమవరం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. మేత బస్తాల ను రోడ్లపై తగలబెట్టారు. రైతులతో చర్చించకుండా ధరలు ఎలా పెంచుతారని నిలదీశారు. ఆందోళనలు తీవ్రంగా కావడంతో మే త ధరల తగ్గింపు విషయాన్ని సీఎం చెప్పింది ఒకటైతే క్షేత్రస్థాయిలో ధరల తగ్గింపు లేదు. హామీల అమలెప్పుడో? కొల్లేరు సరిహద్దులు మార్పు సాధ్యమేనా? ఆక్వా మేత ధరల తగ్గింపులో చెప్పింది ఒకటి.. జరిగింది మరొకటి క్రాప్ హాలీడేను ప్రకటిస్తున్న ఆక్వా రైతులు నేడు సీఎం చంద్రబాబు రాక ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు చింతలపూడి ఎత్తిపోతల పథకం, పోలవరం నిర్వాసితులకు పరిహారం, కొల్లేరు సరస్సు పరిరక్షణ అంటూ హామీలు గుప్పించారు. వీటిని అమలు చేయలేదు. కొల్లేరు సరస్సు పరిరక్షణపై నేరుగా కేంద్రంతో మాట్లాడే అవకాశం ఉన్నా శ్రద్ధ తీసుకోవడం లేదని కొల్లేరు వాసులు భావిస్తున్నారు. -
ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేస్తే పట్టించుకోరా?
నూజివీడు: పట్టణంలోని ఎమ్మార్ అప్పారావు కాలనీలో పేద ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు గత ప్రభుత్వ హయాంలో రూ.80 లక్షలతో నిర్మించిన ఆసుపత్రి భవనం కిటికీల అద్దాలను ధ్వంసం చేస్తే అధికారులు ఎందుకు స్పందించడం లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్రశ్నించారు. నూజివీడులో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కిటికీల అద్దాలను ధ్వంసం చేస్తే దానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై లేదా అని నిలదీశారు. ప్రభుత్వ ఆస్తులను ఎవరు కాపాడాలో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అద్దాలను పగులగొట్టి ఐదు రోజులైనా ఇంత వరకు మున్సిపల్ అధికారులు గాని, పోలీసులు అధికారులు గాని స్పందించకపోవడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు పూర్తయ్యి అందుబాటులోకి వచ్చి రెండేళ్లైనా కూటమి పాలకులు అందులో ఆసుపత్రిని ఏర్పాటు చేయకుండా భవనాన్ని వృథాగా ఉంచుతున్నారని ధ్వజమెత్తారు. పట్టణంలోని ప్రజలకు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, కోనేరుపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు అనేక ప్రైవేటు ఆసుపత్రిలు అందుబాటులో ఉన్నాయని, ఎమ్మార్ అప్పారావు కాలనీలో నివసిస్తున్న దాదాపు 8 వేల మంది పేద ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత పాలకులపై లేదా అని నిలదీశారు. తనకేదో పేరు వస్తుందని పాలకులు సంకుచిత స్వభావంతో ఈ భవనంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం లేదని దుయ్యబట్టారు. ఆసుపత్రి భవనాన్ని పరిశీలించిన వైఎస్సార్సీపీ నాయకులు అద్దాలు ధ్వంసం చేసిన ఆసుపత్రి భవనాన్ని వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు శీలం రాము, జడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, నాయకులు మస్తాన్‌వలీ, కాలి సుగుణరావు తదితరులు పరిశీలించారు. లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఆసుపత్రి భవనాన్ని కూటమి ప్రభుత్వం పక్కన పెట్టడం దారుణమన్నారు. -
చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి
ఆకివీడు: స్థానిక పెదపేటలో ఉంటున్న 17 ఇళ్లకు మార్కింగ్ వేసి భయభ్రాంతులకు గురిచేయడం దారుణమని ఆలిండియా లాయర్స్ యూనియన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తంచేశారు. ఆ ప్రాంతాన్ని ఆదివారం ప్రతినిధి బృందం పరిశీలించింది. అధికారులు చట్ట ప్రకారం వ్యవహరించాలని సూచించింది. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలలో నిర్మించుకున్న ఇళ్లను ఖాళీ చేయించాలంటే నోటీసులు ఇవ్వాలని, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లతామన్నారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దిగుపాటి రాజగోపాల్, ఉపాధ్యక్షుడు కామన మునిస్వామి, జిల్లా కమిటీ సభ్యులు రామగాని కాస్ట్రో, సునీల్ కుమార్, వేగేశ్న సుబ్బరాజు పాల్గొన్నారు. -
గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అధికంగా తరలివచ్చిన భక్తుల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ వారితోపాటు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు. ఆగిరిపల్లి: మండలంలోని నెక్కలం గొల్లగూడెంలో గ్రావెల్ లోడుతో వెళ్తున్న లారీ బంగారు దుకాణంలోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. గ్రామస్తుల వివరాలు ప్రకారం ఆదివారం సాయంత్రం గ్రావెల్ లోడుతో లారీ అతివేగంగా విజయవాడ వెళుతుండగా నెక్కలం గొల్లగూడెం వద్దకు రాగానే ఎదురుగా కారును తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న శ్రీకృష్ణ జ్యువెలరీ షాపు దుకాణంలోకి దూసుకుపోయింది. అక్కడే ఉన్న వారు గమనించి వెంటనే పక్కకు తప్పుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రతిరోజు వందలాది గ్రావెల్ లారీలను మద్యం మత్తులో అతివేగంగా నడిపి ఆందోళనకు గురి చేస్తున్నా రవాణా శాఖ అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
కబ్జా కోరల్లో చెరువులు
లింగపాలెం: లింగపాలెం మండలంలో పలు ఇరిగేషన్ చెరువులు ఆక్రమణలతో బక్కచిక్కిపోతున్నాయి. మండలంలో సుమారు 96 ఇరిగేషన్ చెరువులు ఉన్నాయి. వీటిలో సగానికిపైగా ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణలతో చెరువు గర్భాలు కుచించుకుపోవడంతో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. వీటితో చెరువు ఆయకట్టదారుల పంటలకు నీరు చాలక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిపాటి వర్షాలకే చెరువులు నిండుతున్నాయని దీంతో సాగు నీరు సమృద్దిగా ఉండటంలేదని పలువురు రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు గర్భాల వైశాల్యం తగ్గిపోవటంతో నీరు త్వరితగతిన అయిపోవటంతో పంటలకు సాగు నీటి కొరత ఏర్పడుతుందని రైతులు అంటున్నారు. ఈ చెరువు ఆక్రమణలు కారణంగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వర్షాలు పడి రెండు మూడు సార్లు చెరువులు నిండితే గానీ పంటల సాగుకు నీరు సరిపోవడం లేదని రైతులు చెబుతున్నారు. ఈ ఆక్రమణలు ఇలాగే కొనసాగితే చెరువు గర్భాల వైశాల్యం పూర్తిగా తగ్గి, సాగుకు నీరు నిల్వ ఉండేపరిస్ధితి ఉండదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పలువురు అటవీ భూములను ఆక్రమించుకుని సాగుచేస్తున్నారు. ఆక్రమణలు కొందరు అధికారుల కనుసన్నల్లో సాగడంతో ఈ అక్రమాలకు హద్దూ అదుపు లేకుండా పోతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూబాగోతాలపై సమగ్ర విచారణ జరిపించి అక్రమంగా సాగుచేస్తున్న అటవీ భూములతోపాటు చెరువుల ఆక్రమణదారుల ఆట కట్టించాలని ప్రజలు కోరుతున్నారు. -
చైన్ స్నాచర్ల అరెస్టు
కుక్కునూరు: కుక్కునూరు మండలంలోని గుండంబోరు వద్ద మహిళ మెడలో బంగారు గొలుసు తెంచుకుని కారులో పారిపోతున్న నలుగురిని తెలంగాణ సరిహద్దులోని గ్రామస్తులు చాకచక్యంగా పట్టుకున్నారు. బాధితుల సమాచారం ప్రకారం.. గుండంబోరులో చర్చికి వెళ్ళి తిరిగి వస్తున్న ఒక మహిళను కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు అడ్రస్ అడుగుతున్నట్లు నమ్మించి మాటలు కలిపారు. ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కుని కారులో పరారయ్యారు. గమనించిన బాధితురాలి బంధువులు వెంటనే వాహనంలో వారిని వెంబడించారు. నిందితుల కారు వేగంగా వెంకటాపురం రహదారి మీదుగా తెలంగాణ సరిహద్దుల్లోకి దూసుకెళ్లింది. ములకలపల్లి మండలం తిమ్మంపేట గ్రామానికి చేరుకునే సరికి ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ఢీకొట్టడంతో కారు ముందు భాగం దెబ్బతిని అక్కడే నిలిచిపోయింది. అనుమానంతో స్థానిక తిమ్మంపేట గ్రామస్తులు కారులోని వారిని అడ్డుకోగా, అప్పటికే వెంబడిస్తూ వచ్చిన బాధితురాలి బంధువులు అక్కడికి చేరుకుని అసలు విషయం తెలిపారు. దీంతో గ్రామస్తులు నలుగురు నిందితులను పట్టుకుని ములకలపల్లి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి నిందితులను అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం కుక్కునూరు పోలీసులకు అప్పగించారు. -
ముగిసిన సీబీఎస్ఈ టేబుల్ టెన్నిస్ పోటీలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న సీబీఎస్ఈ టేబుల్ టెన్నిస్ క్లస్టర్ పోటీలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు జరిగిన ఉత్కంఠభరితమైన పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఆర్ రెడ్డి విద్యాసంస్థల వైస్ ప్రెసిడెంట్ వీవీ బాలకృష్ణ, జాయింట్ సెక్రటరీ వల్లభనేని శ్రీకృష్ణ, ట్రెజరర్ ప్రసాదరావు, డీఎస్డీఓ ఎస్ఏ అజీజ్, ఇంజినీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ కే.వెంకటేశ్వరరావు, సీబీఎస్ఈ అబ్జర్వర్ భూపతిరాజు రామకృష్ణంరాజు, సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ పీ.సాయి కుమారి శంకర్ పాల్గొన్నారు. విజేతల వివరాలు ● అండర్–14 బాలుర విజేత – సామ్రాక్ స్కూల్, రన్నరప్ – లిటిల్ ఏంజెల్స్, వైజాగ్ ● అండర్ –14 బాలికల విజేత – శ్రీ ప్రకాష్, పెద్దాపురం, రన్నరప్ – టైమ్ స్కూల్ ● అండర్ –17 బాలుర విజేత – లిటిల్ ఏంజెల్స్, రన్నరప్ – హ్యాపీ వ్యాలీ, ఆగిరిపల్లి ● అండర్– 17 బాలికల విజేత – శ్రీ ప్రకాష్, రన్నరప్ – సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ ● అండర్–19 బాలుర విజేత – చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్, రన్నరప్ – శ్రీ ప్రకాష్, పెద్దాపురం ● అండర్ 19 బాలికల విజేత – శ్రీ ప్రకాష్, పెద్దాపురం, రన్నరప్ – సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ సింగిల్స్ విభాగంలో ● అండర్ 14 బాలురు విజేత – సాయి మన్విత్, సామ్రాక్ స్కూల్, రన్నరప్ – హ్రిఆన్ కే సుచిత్ర స్కూల్ ● అండర్ 14 బాలికల విజేత – రిధి టొరో, టైమ్స్ స్కూల్, రన్నరప్ – హెత్విక కొల్లి ● అండర్ 17 బాలుర విజేత – జి.లోహిత్, ఎన్ఎస్టీ మాథ్యూస్, రన్నరప్ – ఉదయం కామ్రా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ ● అండర్ 17 బాలికల విజేత – జీ.గాయత్రి కృష్ణ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నాచారం, రన్నరప్ – టి.సాయి సుదీక్ష ● అండర్ 19 బాలుర విజేత – చేతన్ సాయి, చిరాక్ స్కూల్, రన్నరప్ – టీ.సాయి శ్రవణ్, శ్రీ ప్రకాష్, పెద్దాపురం ● అండర్ 19 బాలికల విజేత – మౌపర్ణ దాస్, శ్రీ ప్రకాష్ సినర్జీ, పెద్దాపురం, రన్నరప్ – ఎం. లినిషా, సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ -
●రహ‘దారి’ద్య్రం
భీమవరం మండలంలోని కొత్తపూసలమర్రు నుంచి దొంగపిండి వరకు ఆర్అండ్బీ రోడ్డుపై భారీ గోతులతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఇటుగా స్కూల్ బస్సులు, ఆటోలు, చేపల లోడుతో భారీ లారీలు, వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. భారీ గోతుల్లో వాహనాలు దిగబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. అలాగే ఒళ్లు హూనమై పోతుందని అంటున్నారు. ఈ ప్రాంతంలో మరమ్మతులు చేస్తున్నా మళ్లీ గోతులు పడుతున్నాయని, వర్షం నీరు నిలిచి రోడ్డు మరింత అధ్వానంగా మారుతుందని చెబుతున్నారు. అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – భీమవరం అర్బన్ -
తణుకు అబ్బాయి.. రష్యా అమ్మాయి
పశ్చిమగోదావరి: తణుకు అబ్బాయి.. రష్యా దేశ అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తణుకు పట్టణానికి చెందిన సిర్రా బ్రహ్మయ్య కుమారుడు జానకి రామ్ పాల్, రష్యా దేశానికి చెందిన అనస్తాసియా డానిలోవా వివాహం శనివారం స్థానిక వీకే ఫంక్షన్ హాలులో క్రైస్తవ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నాలుగేళ్ల క్రితం జానకి రామ్ పాల్ బైబిల్ కోర్సులో శిక్షణ పొందేందుకు రష్యా దేశానికి వెళ్లారు.అక్కడ అనస్తాసియా డానిలోవాతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా, అనంతరం ప్రేమగా మారడంతో ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియజేయగా, వారు కూడా సానుకూలంగా అంగీకరించారు. దీంతో రష్యా నుంచి వచ్చిన అనస్తాసియా కుటుంబ సభ్యులు, తణుకుకు చెందిన రామ్ పాల్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. -
26న గీత కార్మికుల ధర్నా
భీమవరం: మద్యం షాపులు పెంచాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విరమించుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నర్సింహమూర్తి హెచ్చరించారు. శనివారం భీమవరంలో కామన మునిస్వామి అధ్యక్షతన జరిగిన సంఘ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 26వ తేదీన భీమవరం ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాకు కల్లుగీత కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కల్లుగీత వృత్తిలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిసినా, ప్రభుత్వం ఆదుకోకపోయినా బ్రతుకుతెరువు కోసం తాటి చెట్లు ఎక్కుతూ జీవనం సాగిస్తున్న గీత కార్మికుల పొట్టలు కొట్టడం అన్యాయమన్నారు. భీమవరం: జిల్లాలో శనివారం నిర్వహించిన టెట్ పరీక్షకు 34 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఓవీఎస్ అనిల్‌కుమార్ తెలిపారు. మొత్తం 450 మంది అభ్యర్థులకుగాను 416 మంది హాజరయ్యారని, పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఆయన వెల్లడించారు. ఏలూరు జిల్లాలో.. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్లో శనివారం నిర్వహించిన టెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షా కేంద్రంలో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో కలిపి మొత్తం 329 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన పరీక్షకు 167 మంది హాజరుకాగా, 8 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన రెండో సెషన్ పరీక్షకు 162 మంది హాజరుకాగా, 13 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఆకస్మికంగా తనిఖీ చేశాయి. పరీక్షలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో జరిగాయని, ఎక్కడా ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ కేసులూ నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు. చింతలపూడి (జంగారెడ్డిగూడెం): గురవాయిగూడెంలోని మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం పూజలు నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాభిషేకం జరిపించారు. వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ.2,32,549 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. అనంతరం నిర్వహించిన ధర్మకర్తల మండలి సాధారణ సమావేశంలో పలు అభివృద్ధి పనుల టెండర్లకు ఆమోదం తెలిపినట్లు ధర్మకర్తల మండలి చైర్మన్ రాజాన సత్యనారాయణ, ఆలయ సహాయ కమిషనర్, ఈఓ ఆర్వీ చందన వెల్లడించారు. స్వామివారి గర్భాలయ ద్వారాలకు వెండి తాపడం వేయడంతో పాటు, అన్నదాన భవనంలో భక్తుల సౌకర్యార్థం స్టీలు బల్లలు, వంటల తయారీకి స్టీమ్ సౌకర్యం కల్పించే పనులకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. చింతలపూడి (జంగారెడ్డిగూడెం): గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం వేకువజామున స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, బాలభోగ నివేదన, తీర్థప్రసాద గోష్ఠి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు స్వామివారికి విశేష అలంకరణ జరిపించారు. ఉదయం 6 గంటల నుంచి మొదటి మార్గంలో భూవరాహ స్వామి దర్శనం అనంతరం భక్తులు ఏడు శనివారాల కాలినడక దీక్షలు ప్రారంభించారు. దీక్షాపరుల కోసం ప్రత్యేక ఉచిత దర్శనం, అష్టోత్తర పూజల నిమిత్తం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన మండపంలో ఉచిత అన్న ప్రసాద వితరణ చేపట్టారు. దాతలను ఆలయ మర్యాదలతో శేషవస్త్రాలు కప్పి, ప్రసాదాలతో ఘనంగా సన్మానించారు. -
మళ్లీ తిరిగొచ్చిన పెద్ద పులి
బుట్టాయగూడెం: తెలంగాణలోని అశ్వారావుపేట నుంచి మళ్లీ ఏపీ సరిహద్దుల్లోకి ప్రవేశించిన పెద్దపులి బుట్టాయగూడెం మండలంలో భయాందోళనలు సృష్టిస్తోంది. శనివారం తెల్లవారుజామున గవరంపేట, గురుగుమిల్లి గ్రామాల శివారులో కట్టేసి ఉన్న రెండు ఎద్దులు, ఒక ఆవుపై దాడి చేసి చంపేసింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు రేడియో కాలర్ సిగ్నల్స్ ద్వారా పులి కదలికలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం లంకపాకల సమీపంలోని కొండకాల్వ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. దీంతో రేపల్లె, రేగులపాడు, డోలుగండి, మోదేలు, అలివేరు, లంకపాకల, గుళ్లపూడి, వీరమద్దిగూడెం తదితర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పశువులను ఇళ్ల వద్దే సురక్షితంగా కట్టేయాలని, రాత్రి వేళల్లో బయట తిరగవద్దని, పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తలు వహించాలని సూచించారు. డీఎఫ్ఓ సందీప్‌రెడ్డి, జంగారెడ్డిగూడెం రేంజ్ అధికారి దుర్గాకుమార్‌బాబు నేతృత్వంలో మహారాష్ట్ర బృందాలు, బెంగళూరు వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్ నిపుణులు, ఆరుగురు ట్రాంక్విలైజింగ్ షూటర్లు రంగంలోకి దిగారు.లంకపాకల సమీపంలో ప్రత్యేక బృందాలు గురుగుమల్లిలో పెద్దపులి దాడిలో మృతి చెందిన ఎద్దు -
ఆక్వారంగం బలోపేతానికి కృషి
ఆక్వారంగంలోని అన్ని వర్గాలను ఒకే వేదికపైకి తెచ్చి సమస్యలను పరిష్కరించేందుకు ఆక్వా ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కృషి చేస్తోంది. 8లో uఅభివృద్ధి పనుల ముసుగులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో రామన్నగూడెం రావుల చెరువు వివాదాలకు నిలయంగా మారింది. 8లో uఆదివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2026సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలు, అవకతవకలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. డీఎస్సీ అక్రమాలపై విచారణ, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం, ఆచంట, పాలకొల్లు, భీమవరం, తణుకు ప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. తాడేపల్లిగూడెంలో.. డీఎస్సీలో దొడ్డిదారిన జరిగిన నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 7 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని నియోజకవర్గ వైఎస్సార్సీపీ కన్వీనర్ వడ్డి రఘురాం డిమాండ్ చేశారు. నీట్ అక్రమాలపై కేంద్రమంత్రి రాజీనామా చేసినట్లుగానే, డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. ఆచంటలో.. మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో ఆచంటలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఆచంట, పెనుమంట్ర, పోడూరు, పెనుగొండ మండలాల నుంచి వందలాదిగా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. యువతకు అండగా ఉంటామన్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసిందని దుయ్యబట్టారు. డీఎస్సీ అక్రమాలపై తక్షణ సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భీమవరంలో.. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముదునూరి మురళీకృష్ణంరాజు విమర్శించారు. నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు నేతృత్వంలో భీమవరంలో జరుగుతున్న దీక్షా శిబిరాన్ని సందర్శించి ఆయన మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక సర్టిఫికెట్లు రాక అనేక మంది విద్యార్థులు ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలకు లోకేష్ బాధ్యత వహిస్తూ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తణుకులో.. ఎన్నికల సమయంలో డీఎస్సీ కోసం మొదటి సంతకం చేస్తామన్న కూటమి నేతలు అభ్యర్థులను దగా చేశారని నరసాపురం పార్లమెంట్ ఇన్చార్జి గూడూరి ఉమాబాల విమర్శించారు. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో ఆమె మాట్లాడుతూ.. మెరిట్ అభ్యర్థులను మోసం చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాలకొల్లులో.. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం డీఎస్సీని అవినీతి, అక్రమాలకు నిలయంగా మార్చి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందని వైఎస్సార్సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల గోపి విమర్శించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శనివారం పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ వద్ద మూడో రోజూ రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణం విడదల చేయాలని డిమాండ్ చేశారు. లోకేష్ రాజీనామా చేయాలినేను ఎంఏ, బీఈడీ చదివాను. గత డీఎస్సీలో కష్టపడి చదవడంతో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగి కాల్ లెటర్ కూడా వచ్చింది. ఉద్యోగం ఇచ్చే సమయానికి మెరిట్ జాబితాలో నా పేరు లేదు. న్యాయం కోసం మంత్రి లోకేష్‌తో పాటు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. నాలాంటి ఎంతోమంది మోసపోయిన అభ్యర్థులకు న్యాయం జరగాలంటే డీఎస్సీపై సీబీఐ విచారణ జరపాలి. – తగరం నాగరాజు, లింగపాలెం నేను బీఎస్సీ, బీఈడీ చదివాను. డీఎస్సీలో ఎలాంటి అర్హత లేని వారికి స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు కట్టబెట్టడం వల్ల మాలాంటి మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ అక్రమాలకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. సీబీఐ విచారణ జరిపించి మోసపోయిన నిజమైన అభ్యర్థులను ఆదుకోవాలి. – వెలగలేటి వెంకటేశ్వరరావు, కొత్తూరు, కామవరపుకోట మండలం డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడిస్తారు? జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు -
కొండలపైనే జీవనం.. సంక్షేమానికి దూరం
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజన తెగల్లో కొండరెడ్డి గిరిజనులు ఒకరు. వీరు నేటికీ కొండలపై ఆవాసాలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. అక్కడే వారి సంప్రదాయ పంటలైన జొన్న, సామలు, మొక్కజొన్న వంటి పంటలను పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. అలాగే పలు గ్రామాల్లో వెదురు అల్లికలు, తేనె, చింతపండు, ఇప్పపువ్వు వంటి అటవీ ఉత్పత్తులను సేకరిస్తుంటారు. వారాంతపు సంత, ఇతర ప్రభుత్వ కార్యాలయ పనుల నిమిత్తం మాత్రమే కొండ దిగి కిందకు వస్తుంటారు. వీరికి ప్రధానంగా పోడు వ్యవసాయమే జీవనాధారం. స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు కావొస్తున్నా నేటికీ కొండరెడ్డి గిరిజనులు కొండ ప్రాంతంలోనే జీవనం సాగిస్తూ, ప్రకృతిమాత ఒడిలోనే జీవిస్తున్నారు. ప్రకృతే దైవం : ఆదివాసీ గిరిజనులు ప్రకృతినే ఆరాధ్య దైవంగా కొలుస్తుంటారు. రావి, వేప చెట్లను ముత్యాలమ్మగా భావిస్తారు. ముఖ్యంగా బాట పండుగ, పప్పుల పండుగ, మామిడికాయ పండుగ వంటి పండుగలను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అయితే, గిరిజనుల్లోని కోయ తెగవారు భూదేవి పండుగను తొలకరి సమయంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. నేటికీ ఈ పండుగ సంప్రదాయం సజీవంగా కొనసాగుతోంది. జగన్ పాలనలో సంక్షేమానికి పెద్దపేట : గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేశారు. సుమారు 3,220 మంది గిరిజనులకు 69,814.72 ఎకరాల పోడు భూములకు పట్టాలు అందజేశారు. ‘రైతు భరోసా’ పథకం ద్వారా రైతులకు ప్రతిఏటా రూ.15,000 పెట్టుబడి సాయం అందేలా కృషి చేశారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానంతో కొండ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు సైతం మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా కొండపైన ఉన్నవారికి కూడా పింఛన్లు ఇంటికే అందేలా చేశారు. విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా సుమారు రూ.50 కోట్లతో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ప్రస్తుతం ఈ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అలాగే మారుమూల గ్రామాల ప్రజలకు డోలి కష్టాలు తప్పించేందుకు బైక్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. గిరిజనులకు పునరావృతమవుతున్న కష్టాలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో అమలైన కొన్ని సంక్షేమ పథకాల అమలులో మార్పులు చోటుచేసుకున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో డీసీఎం వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ సరుకులు అందించేవారు. ప్రస్తుతం ఆ విధానం నిలిచిపోవడంతో గిరిజనులు మళ్లీ వాగులు దాటుతూ, తలపై బియ్యం మూటలు పెట్టుకుని మైళ్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. గతంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా కోడికూయక ముందే మారుమూల కొండ ప్రాంతాల్లో ఉన్నవారికి సైతం పింఛన్లు అందేవి. ప్రస్తుతం ఆ పింఛన్లు అందడానికి వారం రోజులకు పైగా సమయం పడుతోందని గిరిజనులు వాపోతున్నారు. అదేవిధంగా వైద్యసేవల పట్ల కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రస్తుత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. పోడు వ్యవసాయం ఇలా..సంప్రదాయ డోలు వాయిద్యాల నృత్యం చేస్తున్న గిరిజనులు జొన్న పంటను రోకలితో దంచుతూ..వన దేవతకు పూజలు చేస్తున్న గిరిజనులు జగన్ పాలనలో గిరిజన సంక్షేమానికి పెద్ద పీట మారుమూల గ్రామాల్లో సైతం విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కూటమి ప్రభుత్వంలో గిరిపుత్రులకు కష్టాలు పునరావుృతం నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం -
మన్యం బంద్ ప్రశాంతం
కుక్కునూరు / బుట్టాయగూడెం: జీవో నంబర్ 3కు ప్రత్యామ్నాయ చట్టాన్ని తీసుకురావాలని, 1/70 చట్టాన్ని పరిరక్షించాలని, ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాలు శనివారం చేపట్టిన రాష్ట్ర మన్యం బంద్ ప్రశాంతంగా జరిగింది. కుక్కునూరు మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ నుంచి పాత బస్టాండ్ వరకు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. బంద్‌కు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు, పెట్రోల్ బంకులను మూసివేశారు. గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల వద్ద కూడా నిరసనలు తెలిపారు ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పిల్లి రామకృష్ణ మాట్లాడుతూ గిరిజనులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు. జీవో నెం.3కి ప్రత్యామ్నాయంగా తక్షణమే ఆర్డినెన్స్ జారీ చేయాలని, 1/70 చట్టం పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి యర్నం సాయికిరణ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నాగేంద్రరావు, గిరిజన సంఘం నాయకులు శ్యామల లక్ష్మణరావు, పట్ల లక్ష్మయ్య, కాక ఆనంద్, వర్షా నాగేశ్వరరావు, ఎం. ప్రశాంత్, షేక్ వలీ పాషా తదితరులు పాల్గొన్నారు. బుట్టాయగూడెంలో చట్టాల అమలు కోసం నినాదాలు బుట్టాయగూడెంలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి బంద్‌కు సహకరించారు. స్థానిక బస్‌స్టాండ్ వద్ద గిరిజన సంఘ నాయకులు ర్యాలీ, రాస్తారోకో నిర్వహించి హక్కుల సాధనకు నినాదాలు చేశారు. రెండో శనివారం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూసి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్ మంగరాజు, నాయకులు మొడియం నాగమణి, పోలోజు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జీలుగుమిల్లిలో ప్రధాన రహదారిపై నిరసన జీలుగుమిల్లి మండలంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. ప్రధాన రహదారిపై ఆందోళనకారులు ధర్నా చేపట్టి నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మొడియం నాగమణి, గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కారం దారయ్య, నాయకులు కారం భాస్కర్, తెల్లం దుర్గారావు, సీహెచ్ కొండలరావు పాల్గొన్నారు. వేలేరుపాడు/పోలవరం రూరల్: వేలేరుపాడు మండలంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మన్యం బంద్ విజయవంతమైంది. ఈ మేరకు శనివారం వారు గ్రామంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో కారం దారయ్య పిట్టా ప్రసాద్ ధర్ముల రమేష్, పొట్ల మోహన్, గడ్డాల ముత్యాలరావు, బంధం ప్రసాద్, మడకం సునీత పాల్గొన్నారు. అలాగే పోలవంరలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఏటిగట్టు సెంటర్ వరకు గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఆర్.లింగరాజు, బొరగం భూచందర్రావు, మడివి చలపతిరావు పాల్గొన్నారు. -
నీటి తొట్టెలో పడి వృద్ధుడి మృతి
దెందులూరు : మండలంలోని కొవ్వలి గ్రామంలో నీళ్ల తొట్టెలో పడి సూరిలేటి రామారావు (65) అనే వృద్ధుడు మృతి చెందినట్లు ఎస్సై డి. వెంకట్‌కుమార్ తెలిపారు. ఈ నెల 7న రాత్రి బాత్రూమ్కు వెళ్లిన రామారావు ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. బాత్రూమ్ ఎదురుగా ఉన్న నీళ్ల తొట్టెలో పడి ఉన్న అతడిని వెంటనే బయటకు తీసినప్పటికీ అప్పటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు టౌన్: నగర శివారులోని ఆటోనగర్ మురుగు కాలువ సమీపంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఏలూరు రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుని వివరాలు తెలిసిన వారు ఏలూరు రూరల్ పోలీసులను సంప్రదించాలని కోరారు. వేలేరుపాడు : మండలంలోని శివకాశీపురం గిరిజన ప్రాథమికోన్నత బాలికల ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం విద్యుత్ షాక్‌తో విద్యార్థిని కెచ్చెల లక్ష్మీపార్వతి (13) మృతి చెందిన ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. కేఆర్‌పురం ఐటీడీఏ విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథరావు వార్డెన్ పండు ఇందు, హెచ్ఎం బి.గంగారత్నాన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బాలికల పాఠశాలలో పనిచేస్తున్న పురుష ఉపాధ్యాయుడిని విజయవాడలోని ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆశ్రమ పాఠశాలలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ వైరింగ్‌ను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీడీ తెలిపారు. -
న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని, న్యాయవాదుల భద్రత కోసం ప్రత్యేకంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు బీవీ కృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు సీహెచ్ రాజేంద్రప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రామాంజనేయులు డిమాండ్ చేశారు. శనివారం ఏలూరులోని రాజేంద్రప్రసాద్ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నియోజకవర్గాల అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ లా నేస్తం ద్వారా జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5 వేల చొప్పున మూడేళ్లపాటు స్టైఫండ్ అందించారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ మొత్తం రూ.10 వేలకు పెంచి ఇస్తామని హామీ ఇచ్చి నేటికీ అమలు చేయకపోవడం విచారకరమన్నారు. వృత్తిపరమైన దాడులు, బెదిరింపుల నుంచి రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. అనంతరం జిల్లాలో లీగల్ సెల్ బలోపేతంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బీవీ కృష్ణారెడ్డి, సీహెచ్ రాజేంద్రప్రసాద్‌లను నాయకులు శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నియోజకవర్గాల అధ్యక్షుడు ప్రత్తిపాటి తంబి (ఏలూరు), జేడీ గాంధీ (నూజివీడు), అడ్డగర్ల రాంబాబు (కై కలూరు), యర్రా సురేష్ (దెందులూరు) తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా మండలి కృష్ణారావు శత జయంతి వేడుకలు
యలమంచిలి: శ్రీకృష్ణదేవరాయల 518వ పట్టాభిషేకం, దివిసీమ గాంధీ మండలి వెంకట కృష్ణారావు శతజయంతి స్మారక వేడుకలు ఒకే వేదికపై నిర్వహించడం సంతోషదాయకమని ఏపీ నాటక పరిషత్‌ల సమాఖ్య అధ్యక్షుడు బుద్ధాల వెంకట రామారావు అన్నారు. పాలకొల్లులోని లయన్స్ కమ్యూనిటీ హాల్లో శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శనివారం సాహితీ సభ, ప్రతిభా సత్కార కార్యక్రమం జరిగాయి. ఈ సందర్భంగా సమాజానికి విశిష్ట సేవలందించిన పలువురు ప్రముఖులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విద్యార్థినుల భువనవిజయం సాహితీ రూపకం, చైతన్య ప్రసాద్ అభ్యుదయ గీతాలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు అలరించాయి. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు యర్రంశెట్టి వెంకటరత్నం అధ్యక్షతన జరిగిన ఈ సభలో పెనుమాక రామమోహనరావు, గుండా రామకృష్ణ, కడిమిళ్ల వరప్రసాద్ శతావధాని, సివివి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. భీమవరం: భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లవానితిప్ప రోడ్డులో ఉన్న పంటకాలువ రేవులో శనివారం సుమారు 75 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. వీఆర్వో అమిరపు నాగవరప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రహ్మాన్ తెలిపారు. ఉండి: ఎదురుగా వస్తున్న లారీకి దారిచ్చే క్రమంలో ఓ ట్రాక్టర్ పంట కాలువలోకి బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాళ్ల మండలం సీసలిలో ఇటుకలు దిగుమతి చేసుకుని అత్తిలి వైపు వెళ్తున్న ట్రాక్టర్, పెదపుల్లేరులోని ఆర్అండ్బీ రోడ్డుపై ఎదురుగా వస్తున్న లారీకి దారి ఇచ్చేందుకు ట్రాక్టర్ డ్రైవర్ వాహనాన్ని పక్కకు తీశాడు. అక్కడ రోడ్డు మార్జిన్ లేకపోవడంతో నియంత్రణ కోల్పోయి పంట కాలువలోకి బోల్తా కొట్టింది. ఈ ప్రమాద సమయంలో ట్రాక్టర్లో ఐదుగురు ప్రయాణిస్తుండగా, వారందరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. -
సాంకేతిక నైపుణ్యాలతోనే విద్యకు సార్థకత
తాడేపల్లిగూడెం: విద్యార్థులు వినూత్నంగా ఆలోచించి సాంకేతిక నిపుణులుగా తయారైనప్పుడే నేర్చుకున్న విద్యకు సార్థకత చేకూరుతుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కొత్త మధుమూర్తి పేర్కొన్నారు. పెదతాడేపల్లిలోని వాసవి ఇంజనీరింగ్ కళాశాల 5వ గ్రాడ్యుయేషన్ డే శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని, ఉద్యోగాలు చేసేవారిగా కాకుండా నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ఏఐ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ రంగాలపై దృష్టి సారించాలని సూచించారు. అతిథులుగా హాజరైన ఏఎస్ఎం టెక్నాలజీస్ ఎండీ రబీంద్ర శ్రీకాంతన్, ఈడీ అఖిల్ రబీంద్ర మాట్లాడుతూ పరిశ్రమల్లో సమష్టి కృషి, నైతిక విలువలు కీలకమని తెలిపారు. కళాశాల ఉత్తమ విద్యార్థి రాపర్ల ప్రసన్నకుమార్‌కు బంగారు పతకం, ప్రశంసాపతకం అందించారు. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు పతకాలు అందజేశారు. కార్యక్రమంలో పాలకవర్గ అధ్యక్షుడు గ్రంథి సత్యనారాయణ, కార్యదర్శి చలంచర్ల సుబ్బారావు పాల్గొన్నారు. -
రావుల చెరువు.. అక్రమాల దరువు
● అక్రమ తవ్వకాలతో తలకిందులైన రూపం ● నేతల కుయుక్తులతో కాంట్రాక్టర్ జంప్ ద్వారకాతిరుమల: రావుల చెరువు కొందరు టీడీపీ నేతలకు వరంగా మారింది అభివృద్ధి పనుల ముసుగులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో రామన్నగూడెం రావుల చెరువు వివాదాలకు నిలయంగా మారింది. 43.77 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు కింద 114.98 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. పూడికతీత, గట్ల పటిష్టీకరణ, లాకుల ఏర్పాటు కోసం మినరల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.94.30 లక్షల నిధులను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మంజూరు చేశారు. జిల్లాలోనే అత్యధికంగా మైనింగ్ నిధులు పొందిన ఏకై క చెరువు ఇది కావడం గమనార్హం. ఆదాయ వనరుగా మలుచుకున్న నేతలు నిబంధనల ప్రకారం 3 నుంచి 6 నెలల్లో పూర్తికావాల్సిన ఈ పనులు కొందరు స్థానిక టీడీపీ నేతల దందా వల్ల నిలిచిపోయాయి. అక్రమంగా మట్టిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ ఈ దోపిడీపై అధికారులను నిలదీసినప్పటికీ, ఈ దందా ఆగలేదు. రూ.35 లక్షల నష్టంతో చేతులెత్తేసిన కాంట్రాక్టర్ ఈ ఏడాది మార్చిలో విజయవాడకు చెందిన ఒక కాంట్రాక్టర్ రూ.25 లక్షలకు ఇరిగేషన్ టెండర్ దక్కించుకుని, మైనింగ్ శాఖకు మరో రూ.5 లక్షలు చెల్లించి పనులు ప్రారంభించారు. గతంలో నేతలు టిప్పర్ మట్టిని రూ.3,500కి విక్రయించగా, సదరు కాంట్రాక్టర్ రూ.2,500 చొప్పున 100 టిప్పర్ల మట్టి విక్రయానికి అనుమతి పొందారు. అయితే స్థానిక నేతలు ఆ టిప్పర్లను సూర్యచంద్రరావుపేట చెరువుకు మళ్లించడమే కాకుండా, టిప్పర్ యజమానులను సిండికేట్‌గా మార్చి రూ.1,000కే మట్టి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో దాదాపు రూ.35 లక్షల వరకు నష్టపోయిన కాంట్రాక్టర్, మే నెలాఖరులో పనులను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు. ప్రస్తుతం దేవినేనివారిగూడెంకు చెందిన ఓ టీడీపీ నేత తన పేరు మీద ఉన్న అనుమతులతో మట్టి తవ్వకాలు కొనసాగిస్తున్నారు. చెరువులో జరుగుతున్న అక్రమ తవ్వకాలను రామన్నగూడెంకు చెందిన ఒక జనసేన కార్యకర్త ఫొటోలు తీయడంతో వివాదం మరింత తీవ్రమైంది. ఈ విషయం తెలుసుకున్న సదరు టీడీపీ నేత, ఆ కార్యకర్తను తన ఇంటికి పిలిపించి తీవ్రంగా హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఆడియో రికార్డింగ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. -
‘జైల్‌భరో’తో స్వచ్ఛంద అరెస్టులకు సిద్ధం
భీమవరం: పెరుగుతున్న ధరలు, నిరుద్యోగానికి సమాధానం చెప్పలేని ప్రభుత్వంపై జైల్‌భరో పేరుతో స్వచ్ఛంద అరెస్టులకు కార్మిక, రైతు సంఘాలు పిలుపునిచ్చాయని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రాజారామ్మోహన్రాయ్ అన్నారు. ఈ నెల 10వ తేదీన క్విట్ కార్పొరేట్, క్విట్ నరేంద్ర మోదీ నినాదంతో జైలు భరో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈమేరకు ప్రచారంలో భాగంగా శనివారం భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో బైక్ ర్యాలీని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం.. ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, విపరీతమైన ధరల పెరుగుదల, ఉపాధి కోతలు వంటి సమస్యలను దేశ ప్రజలపై మోపిందని విమర్శించారు. ఈ బైక్ యాత్రకు వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీలు సంఘీభావం తెలిపాయి. అనంతరం బైక్ యాత్ర ప్రకాశం చౌక్ సెంటర్ నుంచి బస్టాండ్ మీదుగా తాడేరు, యమునాపల్లి, శృంగవృక్షం ప్రాంతాల వరకు సాగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, సీఐటీయూ నాయకులు ఎం.ఆంజనేయులు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని వెల్డింగ్ కార్మికుడి దుర్మరణం
ముదినేపల్లి(కై కలూరు): ద్విచక్రవాహనాన్ని లారీ వెనుక నుంచి వేగంగా ఢీకొట్టిన ప్రమాదంలో వెల్డింగ్ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ముదినేపల్లి సమీపంలోని బంటుమిల్లి రోడ్డులో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుడివాడ సత్యనారాయణపురానికి చెందిన షేక్ నాగుర్ వలీ (47) ప్రస్తుతం పెదపారుపూడి మండలం, రావులపాడులో నివాసముంటూ, పూర్ణ థియేటర్ సమీపంలోని ఓ షాప్‌లో గత మూడేళ్లుగా వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. సహచర కార్మికుడు దాసరి భరత్ చంద్రతో కలిసి సింగరాయపాలెంలో పని ముగించుకుని బైక్‌పై తిరిగి వస్తుండగా, కోమర్రు అడ్డరోడ్డు వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న నాగుర్ వలీ కిందపడటంతో లారీ టైర్లు అతని నడుముపై నుంచి వెళ్లాయి. తీవ్రగాయాలపాలైన నాగుర్ వలీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, బైక్ నడుపుతున్న భరత్ చంద్ర స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భరత్ చంద్ర ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆక్వా రంగం బలోపేతానికి కృషి
కై కలూరు: ఆక్వారంగంలోని అన్ని వర్గాలను ఒకే వేదికపైకి తెచ్చి సమస్యలను సమిష్టిగా పరిష్కరించేందుకు ఆక్వా ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఏపీడబ్ల్యూఏ) కృషి చేస్తోందని సంఘ అధ్యక్షుడు తేతల శ్రీనివాస్, కార్యదర్శి బీవీ సతీష్ కుమార్ తెలిపారు. కై కలూరులోని కంఫర్ట్ ఇన్ హోటల్లో శనివారం కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నాలుగో విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూఏ నూతన లోగో, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. సంఘ భవిష్యత్ కార్యాచరణ, సభ్యుల సంక్షేమం, ఆక్వారంగాభివృద్ధి, చేపలు–రొయ్యల ధరలు, మేతల వినియోగంపై సమగ్రంగా చర్చించారు. సెప్టెంబర్ 29, 30 తేదీల్లో విజయవాడ నోవటెల్ హోటల్లో జరగనున్న రొయ్యల రిటైల్ – 2026 కార్యక్రమం వివరాలను ప్రతినిధులు వెల్లడించారు. బ్లూబెల్ ఆక్వా కంపెనీ అధినేత సీతారామ్ ఆర్థిక సహకారంతో నిర్వహించిన ఈ సమావేశంలో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం చేపట్టారు. ఉమ్మడి జిల్లాల నుంచి దాదాపు 250 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈసీ సభ్యులు వైవీ రమణ, బీవీ నరసింహారావు, బీహెచ్ సుబ్బరాజు, జీఎన్వీడీ ప్రసాద్, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల అధ్యక్షులు ఆర్.సతీష్, ఏ.శ్రీధర్, ప్రతినిధులు జీ.సునీల్‌కుమార్, ఏ.నాగేశ్వరరావు, జీ.నరేష్, బీ.వెంకటరత్నం, పీ.గోవిందరావు, ఆర్.శ్రీనివాసరాజు, ఫిషరీస్ న్యూస్ వ్యవస్థాపకుడు ఇందువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారి ప్రాణం బలి
వేలేరుపాడు: అధికారుల నిర్లక్ష్యం కారణంగా 13 ఏళ్ల గిరిజన విద్యార్థిని నిండు ప్రాణం బలయ్యింది. తమ బిడ్డ ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగం సాధించి తమను పోషిస్తుందని ఆ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెంచుకున్నారు. కానీ వారి ఒక్కగానొక్క బిడ్డ కలలు, తల్లిదండ్రుల ఆశలు అకాలంగా ఆవిరైపోయాయి. పాఠశాలలో లూజుగా వేలాడుతున్న విద్యుత్ తీగలే యమపాశాలుగా మారి చిన్నారిని బలి తీసుకున్నాయి. మండలంలోని శివకాశీపురం గిరిజన బాలికల ఉన్నత పాఠశాల అధికారుల నిర్లక్ష్యానికి ఈ ఘటన పరాకాష్టగా నిలిచింది. ఈ పాఠశాలలో 144 మంది విద్యార్థులు, 14 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. శుక్రవారం విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని కెచ్చెల లక్ష్మీపార్వతి ఘటనలో పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. చిందరవందరగా తీగలు : ఆశ్రమ పాఠశాల భవనాల్లో విద్యుత్ వైర్లు జాయింట్లతో చిందరవందరగా వేలాడుతున్నాయి. విద్యార్థిని దుస్తులు ఆరబెడుతున్న ప్రదేశంలో శాశ్వత విద్యుత్ వైరింగ్ లేదు. అక్కడ సాధారణ వైరుతో లైటు ఏర్పాటు చేసి, ఆ తర్వాత బల్బును తీసేశారు. అయితే, బల్బు తొలగించినా ఆ వైరుకు విద్యుత్ సరఫరా కొనసాగుతూనే ఉంది. పైగా ఆ లైవ్ వైరు లీడ్లు ఇనుప కిటికీకి ఆనుకుని ఉండటంతో విద్యుత్ ప్రసారమై, దానిని తాకిన పార్వతి షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పాఠశాలలోని ఏ భవనం చూసినా ఇదే పరిస్థితి నెలకొంది. నిత్యం కళ్ల ముందే ఇది కనిపిస్తున్నా, సిబ్బంది తమకేమీ పట్టనట్లు వ్యవహరించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అందుబాటులో లేని సిబ్బంది ఆశ్రమ పాఠశాలలో యమపాశాలుగా విద్యుత్ తీగలు శివకాశీపురంలో విద్యార్థిని దుర్మరణం ఆ సమయంలో అందుబాటులో లేని సిబ్బంది చోద్యం చూస్తున్న ఐటీడీఏ అధికారులు పాఠశాలలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పాఠాలు చెప్పడం మానేసి నిత్యం ఆఫీసు రూమ్‌లో కాలక్షేపం చేస్తున్నారు. పాఠశాల భవనాల్లో విద్యుత్ తీగలు వేలాడుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో కేఆర్‌పురం ఐటీడీఏ అధికారులు కూడా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. – మచ్చా కన్నయ్య, ఆశ్రమ పాఠశాల చైర్మన్ లక్ష్మీపార్వతీ విద్యుత్ షాక్‌కు గురైన సమయంలో వార్డెన్, హెచ్ఎంలు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఉదయం 6 గంటలకే విద్యార్థిని మృతిచెందగా, వారు జంగారెడ్డిగూడెం డిపో ఆర్టీసీ బస్సులో ఉదయం 9 గంటలకు పాఠశాలకు చేరుకున్నారు. ఇది వారి విధుల పట్ల ఉన్న బాధ్యతారా హిత్యాన్ని తేటతెల్లం చేస్తోంది. నిబంధనలకు నీళ్లు కేఆర్ పురం ఐటీడీఏ విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టారు. గిరిజన బాలికల పాఠశాలల్లో కేవలం మహిళా ఉపాధ్యాయులను మాత్రమే నియమించాలనే నిబంధన ఉన్నా, ఇక్కడ ఓ పురుష ఉపాధ్యాయుడిని నియమించడం అధికారుల నిర్లక్ష్యానికి మరో నిదర్శనం. -
డీఎస్సీ దీక్షలపై ఖాకీల కక్ష!
● మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరిని అడ్డుకున్న పోలీసులు ● ఏలూరులో కార్యాలయం వద్ద బైఠాయింపు ● గేటు వద్దనే రిలే నిరాహార దీక్షలు శనివారం శ్రీ 8 శ్రీ ఆగస్టు శ్రీ 2026దెందులూరు: దెందులూరు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరిని ఏలూరు రూ రల్ మండలం మాదేపల్లిలో జరిగే రిలే నిరాహార దీక్షలకు వెళ్లకుండా శుక్రవారం పోలీసులు అడ్డుకున్నారు. 30 మంది పోలీసులు శాంతిభద్రతల సాకు తో ఏలూరులోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో గంటకు పైగా నిలిపివేయడంతో, ఆయన కార్యా లయం గేటు వద్దే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక రాజ్యాంగం అమలు అవుతుంటే, దెందులూరులో మాత్రం మరో రాజ్యాంగం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మా జీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. ప్రతిభ కలిగిన నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే డీఎస్సీ అక్రమాలపై కూటమి ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణకు ఆ దేశించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి తప్పులు జరగనప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. శాంతియుతంగా మాదేపల్లిలో వైఎస్సార్సీపీ నాయకులు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే టెంట్ తీసేసి వాళ్లని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లాల్సిన అవసరం ఏముందన్నారు. అక్కడే ఉన్న టీడీపీ శ్రేణులను ఎందుకు అరెస్ట్ చేయలేదని, వారి మీద ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. ఏ అక్రమాలూ జరగలేదని చెబుతున్న ప్రభు త్వం సీబీఐ విచారణకు సిద్ధపడాలని, ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
కావడి సేవకు కదిలిన భక్తజనం
కై కలూరు: ఆడి కృత్తిక సందర్భంగా శింగరాయపాలెం సుబ్రహ్మణ్యేశ్వరుడి దేవస్థానంలో శుక్రవారం నిర్వహించిన కావడి సేవ ప్రజల్లో భక్తి భావాన్ని నింపింది. కావడి ఉత్సవాన్ని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రారంభించి, భక్తులతో కావడి మోసి స్వామికి పూజలు చేశారు. తమిళనాడు రాష్ట్రం పళని మురగన్ క్షేత్రంలో నిర్వహించే కావడి సేవను గతేడాది నుంచి శింగరాయపాలెం దేవాలయంలో ప్రవేశపెట్టారు. కావడి సేవలో పసుపు వస్త్రాలు ధరించి 340 మంది భక్తులు పాల్గొన్నారు. శింగరాయపాలెం, చేవూరుపాలెం, శ్రీహరిపురం గ్రామాల్లో కావడి ప్రదర్శనలు చేసి అనంతరం స్వామికి సమర్పించారు. ఉదయం స్వామికి విఘ్నేశ్వర, గోపూజలు నిర్వహించారు. గ్రామోత్సవం అనంతరం స్వామికి శాంతి కల్యాణాన్ని అత్యంత వైభవోపేతంగా చేపట్టారు. దేవస్థానం వద్ద 3,000 మందికి భారీ అన్నసమారాధన జరిగింది. కేరళ చండా మేళం, భారీ ఆకారంలో ఆంజనేయ బొమ్మలు ఆకట్టుకున్నాయి. ఆలయ చైర్మన్ బొంగు రవికుమార్, ఆలయ సహాయ కమిషనర్ ఆర్.గంగాశ్రీదేవి, ఆలయ ధర్మకర్తలు విమల, శ్రీనాగలలిత, శివరమేష్, కృష్ణ, సోవమ్మ, సుబ్బలక్ష్మీ, నాగలక్ష్మి, నాగ వెంకట రాధాకృష్ణ, నాగ శిరిష, నాగకొండ ఏర్పాట్లను పర్యవేక్షించారు. నాయకులు పరసా విశ్వేశ్వరరావు, బొర్రా చలమయ్య, చల్లగుళ్ళ శోభనాద్రిచౌదరీ, కోడూరు శేషుబాబు, ఈడ్పూగంటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆడి కృత్తిక కావడి సేవ -
పొన్నమండకు ఘన నివాళులు
భీమవరం: అగ్నికుల క్షత్రియ జాతిపితగా, సంఘ సంస్కర్తగా పొన్నమండ లక్ష్మణస్వామివర్మ సమాజానికి విశిష్ట సేవలందించారని అదనపు ఎస్పీ డి.విశ్వనాథ్ అన్నారు. శుక్రవారం లక్ష్మణవర్మ జయంతి సందర్బంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అగ్నికుల క్షత్రియులకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో, ఆయుర్వేదంలో పొన్నమండ విశేష సేవలందించారన్నారు. జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎంవీవీ సత్యనారాయణ, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ, మహిళా ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఈ.ఇందుమతి పాల్గొన్నారు. కలెక్టరేట్లో.. భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక కలెక్టరేట్లో శుక్ర వారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పొన్నమండ లక్ష్మణ స్వామివర్మ 157వ జ యంతి నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి జేసీ కేఆర్ కల్పశ్రీ పూలమాలలు వేసి నివాళులర్పించా రు. డీఆర్వో పి.ప్రభాకర్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఏవీ సూరిబాబు, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ సబ్సిడీ కొందరికేనా?
భీమవరం: కూటమి ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఆక్వా విద్యుత్ సబ్సిడీ అందరికీ దక్కే అవకాశం లేకపోవడంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే జోన్ల ప్రమేయం లేకుండా ఆక్వా రైతులందరికీ సబ్సిడీ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి నాయకులు, రెండేళ్ల తర్వాత నిర్ణయం తీసుకున్నా కొత్తగా విద్యుత్ కనెక్షన్లు పొందినవారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వైఎస్సార్సీపీ హయాంలో లభించిన మద్దతు గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఆక్వా రైతులకు యూనిట్‌ను రూ.1.50లకే అందించారు. దీంతో వేలాది మంది రైతులు మోటార్లు ఏర్పాటు చేసుకుని నిశ్చింతగా సాగు చేశారు. కోవిడ్ సమయంలో రొయ్యల ఎగుమతులు మందగించినప్పుడు ప్రభుత్వం స్పందించి, ప్రాసెసింగ్ ప్లాంట్ల వద్ద అధికారులను నియమించి మద్దతు ధర దక్కేలా చూసింది. మేతల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవడంతో రైతులంతా ప్రభుత్వానికి అండగా నిలిచారు. నెరవేరని హామీలు.. ఉధృతమైన పోరాటం కూటమి ప్రభుత్వం వచ్చాక సీడ్, ఫీడ్ ధరలు పెరిగి, రొయ్యల ధరలు పడిపోవడంతో రైతులు పోరుబాట పట్టారు. గత నెలలో వైఎస్ జగన్ భీమవరంలో నిర్వహించిన భారీ సభ ద్వారా రైతులకు మద్దతుగా ఉద్యమిస్తామని హెచ్చరించడంతో ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ అమలుకు ముందుకొచ్చింది. కొందరికేనా సబ్సిడీ? జిల్లాలోని 20 మండలాల్లో దాదాపు 1.30 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుండగా, అందులో 90 వేల ఎకరాల్లో రొయ్యల సాగు ఉనట్లు అంచనా. గతంలో 14,000 కనెక్షన్లకు సబ్సిడీ లభించగా, ప్రస్తుతం కొత్తగా మరొక 2,457 కనెక్షన్లకు సబ్సిడీ ఇవ్వనున్నారు. అయితే, మరో 3,000 వరకు ఉన్న కొత్త విద్యుత్ కనెక్షన్లకు సబ్సిడీపై స్పష్టత లేదని రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో 90వేల ఎకరాల్లో రొయ్యల సాగు గత ప్రభుత్వంలో 14 వేల విద్యుత్ కనెక్షన్లకు సబ్సిడీ అందరికీ సబ్సిడీ అంటూ కూటమి హామీ కొత్తగా ఇచ్చేది 2,417 కనెక్షన్లకే.. మరో 3 వేల మందికి మొండిచేయి ! -
అరకమాలపై విచారణ జరిపించాలి
పార్టీ నాయకులు ముదుగురు సూర్యనారాయణ, మండల కొండలరావు, మోరు రామరాజు, ఆళ్ల సతీష్ చౌదరి, తేరా ఆనంద్ తదితరులు కూటమి ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కేవరకు, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ ఇక్కడకు వచ్చి సంఘీభావం తెలిపారు. జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయ్ బాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గంగరాజు, పళ్లెం ప్రసాద్, డీవీఆర్కే చౌదరి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల సతీష్‌చౌదరి, యువజన విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షుడు కామిరెడ్డి నాని, రజక విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షుడు కె.శేషు, వడ్డీల కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ ముంగర సంజీవ్‌కుమార్, పెదపాడు ఎంపీపీ బత్తుల రత్నకుమారి ఏసు రాజు, మాజీ సర్పంచులు పి.సునీత ప్రభుదేవా, వరి నారాయణ, బాల, ఎంపీటీసీ పులవర్తి దేవానంద్, క్లస్టర్ ఇన్చార్జి తొత్తడి కృష్ణ, ప్రేమ్ బాబు, పార్టీ అధ్యక్షులు కురుమ ప్రకాష్, మాజీ ఉపసర్పంచ్ యేసు, పెదవేగి మండల నాయకులు మేడికొండ కృష్ణారావు, పాలడుగు భానుప్రకాష్, బలుసు శేఖర్, చల్లగొల్ల తేజ, కార్యకర్తలు నియోజవర్గంలో వైఎస్సార్సీపీ అన్ని విభాగాల నాయకులు కార్యకర్తలు శ్రేణులు అభిమానులు ఉన్నారు. -
బాలిక అదృశ్యంపై కేసు నమోదు
భీమవరం: భీమవరం టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బాలిక కనిపించడం లేదంటూ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రహ్మన్ శుక్రవారం చెప్పారు. పట్టణంలోని శ్రీరామపురం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక గురువారం రాత్రి తల్లితో కలిసి ఇంట్లో నిద్రపోయింది. శుక్రవారం ఉదయం బాలిక కనిపించకపోవడంతో చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో గాలించినా జాడ తెలియకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై చెప్పారు. భీమడోలు : భీమడోలు రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం పట్టాలు దాటుతున్న ఓ గుర్తుతెలియని వృద్ధుడిని రైలు ఢీకొనడంతో మృతిచెందాడు. ఆకివీడు నుంచి నిడదవోలు వచ్చి, అక్కడ నుంచి భీమడోలు వచ్చినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వయస్సు 60 ఏళ్లు ఉంటుందని.. షర్టుపై టైలర్ అని రాసి ఉందని చెబుతున్నారు. మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించినట్లు రైల్వే ఎస్ఐ కృపాదానం తెలిపారు. ఆచూకీ తెలిస్తే 944041100 నెంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. చింతలపూడి: జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కె.వి.నాగ ప్రభు కుమార్ శుక్రవారం చింతలపూడి ఎకై ్సజ్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్‌లోని పలు రికార్డులు, కేసు ఫైళ్లను పరిశీలించారు. అనంతరం ఎకై ్సజ్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి, విధి నిర్వహణపై పలు కీలక సూచనలు జారీ చేశారు. సర్కిల్ పరిధిలో నాటుసారా తయారీ, విక్రయాలు, అక్రమ మద్యం రవాణా, గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ పి. అశోక్, ఎస్ఐ జె. జగ్గారావు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్: భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ వివాహిత ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్సై ఎస్.రవికుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన గరిమెళ్ళ ధనలక్ష్మికి కృష్ణాజిల్లా గన్నవరం మండలం గోపవరపుగూడెం గ్రామానికి చెందిన సాగర్‌తో 2022వ సంవత్సరంలో వివాహం జరిగింది. కొంతకాలం కాపురం సజావుగా సాగింది. భర్త సాగర్ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని, ఇందుకు కుటుంబ సభ్యులు గరిమెళ్ళ రాజయ్య సురేష్, గరిమెళ్ళ సురేష్, గరిమెళ్ళ మాధవ రామారావు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం బాధితురాలు ధనలక్ష్మి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై రవికుమార్ తెలిపారు. -
చేనేతను ప్రోత్సహించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): చేనేత ఉత్పత్తులను వినియోగించడం ద్వారా నేత కార్మికుల కుటుంబాలకు ఉపాధి భద్రత కల్పించడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చని జేసీ కేఆర్ కల్పశ్రీ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో శనివారం 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ చేనేత కార్మికుల నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తూ, సాంప్రదాయ చేనేత కళను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. యువత చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియను నేర్చుకోవడం ద్వారా ఈ కళ తరతరాలకు కొనసాగుతుందని తెలిపారు. 82 చేనేత స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాల కింద మంజూరు చేసిన రూ.1.30 కోట్ల చెక్కును జేసీ కలెక్టర్ చేతులమీదుగా అందజేశారు. చేనేత వస్త్రాలు తయారుచేస్తున్న ఎ.నాగేశ్వరరావు (రాయకుదురు), వి.కోటయ్య (దగ్గులూరు), మేక పూర్ణారావు (చింతపర్రు)ను సత్కరించారు. జిల్లా చేనేత, జౌళి శాఖాధికారి ఎ.అప్పారావు, డీఆర్ఓపీ ప్రభాకర్, కలెక్టరేట్ ఏఓ ఎన్.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. భీమవరం: పాలకోడేరు మండలం మోగల్లు జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం ఎంవీ త్రినాథులను సస్పెండ్ చేసినట్టు డీఈఓ ఓవీఎస్ అనిల్‌కుమార్ శుక్రవారం తెలిపారు. విధి నిర్వహణలో అలసత్వం, విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందున త్రినాథులను విధుల నుంచి సస్పెండ్ చేసినట్టు చెప్పారు. భీమవరం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.సుబ్బారావు తెలిపారు. జిల్లాలో మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఫిర్యాదు మేరకు ఆరు ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలోని 193 బ్రాందీ షాపులు, 28 బార్లపై దాడులు నిర్వహించినట్టుచెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. బుట్టాయగూడెం: మండలంలోని మారుమూరు అలివేరు గ్రామంలో శుక్రవారం చిరుజల్లులు కురవడంతో చల్లదనాన్ని ఆస్వాదించేందుకు సమీపంలోని అడవి నుంచి నెమలి వచ్చింది. గ్రామ సమీపంలోని చెట్టు కొమ్మపై కొద్దిసేపు కూర్చున్న తర్వాత జల్లులు పడగానే కిందకు దిగి పురివిప్పి నర్తించింది. ఓ పక్క జల్లులు.. మరోపక్క మయూర నృత్యంతో ఈ ప్రాంతంలో వాతావరణం రమణీయంగా మా రింది. స్థానికులు ఈ దృశ్యాన్ని వీక్షించి సెల్ఫోన్లో బంధించారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వి.శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ సింగిల్ మేజర్ ప్రోగ్రాంలో ప్రవేశాలు కల్పిస్తున్నారని, ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జిల్లాలో హెల్ప్‌లైన్ సెంటర్‌గా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. అడ్మిషన్ ప్రక్రియలో ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఈ సెంటర్‌ను సంప్రదించవచ్చన్నారు. మరిన్ని వివరాలకు హెచ్ఎల్సీ కోఆర్డినేటర్ కె.రమేశ్ 9247203460, వెరిఫికేషన్ ఆఫీసర్–1 ఎం.కృష్ణ చైతన్య 9490216357, వెరిఫికేషన్ ఆఫీసర్–2 పీఆర్ కావ్యశ్రీ 9441376464, ప్రిన్సిపల్ శ్రీనివాసరావును 9010042250 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. పోలవరం రూరల్: గోదావరి వరద యథాస్థితికి చేరుకుంటోంది. నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు తగ్గడం, నదిలోకి చేరే నీరు కూడా క్రమేపీ తగ్గుతుండటంతో వరద ప్రవాహం నెమ్మదిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 28 మీటర్ల వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. స్పిల్‌వే నుంచి దిగువకు 2.47 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. దిగువన వరద ప్రభావం తగ్గుతోంది. -
హత్య కేసులో జీవిత ఖైదు
కలిదిండి(కై కలూరు): హత్య కేసులో నేరం రుజువవడంతో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించిందని ఎస్పీ కే.ప్రతాప్ శివ కిషోర్ చెప్పారు. కలిదిండి పోలీసు స్టేషన్లో ఆయన వివరాలు వెల్లడిస్తూ.. కలిదిండి మండలం ఎస్ఆర్పీ అగ్రహారం శివారు కట్టావానిపాలెంకు చెందిన కట్టా పెద్దిరాజులు ఆస్తి కుమారుడి పేరున రాయాలని అడిగినందుకు భార్య జయలక్ష్మీని కత్తితో పొడిచి హత్య చేశాడన్నారు. అనంతరం నిందుతుడు ఆత్మహత్య నాటకమాడి తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, పోలీసులు సేకరించిన శాసీ్త్రయ ఆధారాలు, ప్రత్యక్ష సాక్ష్యాలతో నేరం రుజువైందన్నారు. మృతురాలి కుమారుడు రాము ఫిర్యాదుపై అప్పటి కలిదిండి ఎస్సై వీ.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేయగా, కై కలూరు రూరల్ సీఐ వి.రవి కుమార్ దర్యాప్తు జరిపి చార్జిషీట్ దాఖలు చేశారన్నారు. పోలీసు సిబ్బంది ఈ కేసు దర్యాప్తులో విశేష కృషి చేశారని అభినందించారు. -
నిట్‌లో సింపోజియం
తాడేపల్లిగూడెం: ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ సాంకేతికత ఎంతో కీలకమని కోల్‌కతాలోని సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బిస్వరూప్ సత్పతి అన్నారు. నిట్‌లో శుక్రవారం ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిపై పరిశోధన సింపోజియం జరిగింది. ఆధునిక పరిశోధనల్లో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కీలకమని వక్తలు పేర్కొన్నారు. ఎలక్ట్రాన్స్ మైక్రోస్కోప్ , ప్రిన్సిపల్ టెక్నిక్స్ అండ్ అప్లికేషన్స్‌పై సింపోజియం నిర్వహించారు. ఆధునిక శాసీ్త్రయ పరిఽశోధనలు ముఖ్యంగా మెటీరియల్ సైన్సు, నానో టెక్నాలజీ, ఎనర్జీ మెటీరియల్స్, నానో మెటీరియల్స్ తదితర అంశాలపై వక్తలు మాట్లాడారు. ఆధునిక సాంకేతికత వాటి పని సూత్రాలు, పరిశోధనల్లో వాటి వినియోగంపై విద్యార్థులకు, పరిశోధకులకు అవగాహన కల్పించారు. బిస్వరూప్ సత్పతి ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ గురించి వివరించారు. ఐఐటీ ఖర్గపూర్కు చెందిన సహాయ ఆచార్యులు డాక్టర్ అహిన్ రాయ్ స్కానింగ్ టన్నెలింగ్ మైక్రోస్కోపీపై మాట్లాడారు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ ద్వారా పొందే సూక్ష్మస్ధాయి సమాచారం కొత్త పదార్ధాల రూపకల్పన, అధిక సామర్ధ్యం కలిగిన ఎనర్జీ స్టోరేజ్ పరికరాలు, బ్యాటరీలు, కాటలిస్టులు, సెమీకండక్టర్ పదార్థాలు, నానో మెటీరియల్స్ బయో మెటీరియల్స్ రంగాల్లో పరిశోధనలకు సాంకేతికతలు కీలకంగా ఉంటాయన్నారు. నిట్ డీన్ రవికిరణ్‌శాస్త్రి మాట్లాడుతూ ఆధునిక పరిశోధనల్లో అత్యాధునిక పరికరాలు ఉపయుక్తంగా ఉంటాయన్నారు. అసోసియేట్ డీన్ తపస్ పరమాణిక్ అవగాహన కల్పించేందుకు ఈ సింపోజియంలు ఉపయోగపడతాయన్నారు. -
శ్రీవారి ఆలయానికి రూ.5 లక్షల విరాళం
కాళ్ల : కాళ్లకూరు వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులకు భక్తులు విరాళం అందించినట్లు దేవస్థానం చైర్మన్ అడ్డాల శివరామరాజు శుక్రవారం తెలిపారు. కలవపూడికి చెందిన నల్లపురాజు చిన్నకృష్ణంరాజు, అచ్యుతాయమ్మ దంపతుల కుమారుడు నీలాద్రిరాజు, సౌజన్యలక్ష్మి దంపతులు దక్షిణం వైపు కేశఖండన శాల పక్కన భవనం నిర్మాణానికి రూ.5,01,116 అందించారన్నారు. నూజివీడు: లారీకి బ్రేకులు ఫెయిల్ అయిన నేపథ్యంలో ట్రిపుల్‌ఐటీలో శుక్రవారం పెనుప్రమాదం తప్పింది. మెస్‌లకు బియ్యం లోడుతో ఉదయం 6.30 గంటల సమయంలో క్యాంపస్‌లోకి వచ్చిన లారీకి బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో లారీ ఐ–3 భవనానికి, మెస్‌కు మధ్య ఉన్న రోడ్డులో ఐ–2, ఐ–1 భవనాల మధ్య వెళ్లి ప్రహరీగోడను ఢీకొట్టి ఆగింది. లారీ ఢీకొట్టడంతో గోడ పడిపోయింది. ఇదే సంఘటన విద్యార్థులు వెళ్లే సమయంలో జరిగి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేది. పెద్ద ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
అథ్లెటిక్స్‌కు మండపాక విద్యార్థిని
తణుకు అర్బన్: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు తణుకు మండలం మండపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం.నాగలక్ష్మి అర్హత సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.ఫణిశ్రీ తెలిపారు. గతనెల 26న తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి భారతీయ విద్యాభవన్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ అండ్ అండర్–18 విభాగంలో 800 మీటర్ల పరుగులో ప్రథమ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ఈ ప్రతిభ కారణంగా ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థిని నాగలక్ష్మి ఎంపికై నట్లు వివరించారు. ఎంపికై న విద్యార్థినితోపాటు శిక్షణనిచ్చిన ఫిజికల్ డైరెక్టర్ సంకు సూర్యనారాయణను ప్రత్యేకంగా అభినందించారు. -
కామవరంలో పశువులపై పులి దాడి
బుట్టాయగూడెం: గత 10 రోజులుగా ఏలూరు జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి పోలవరం, గోపాలపురం, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో పశువులను హతమారుస్తూ అటవీశాఖ అధికారులకు కంటిపై కునుకులేకుండా చేసింది. శుక్రవారం సాయంత్రానికి తెలంగాణ రాష్ట్రం ఆశ్వారావుపేట మండలం కావిడిగుండ్ల, గోపన్నగూడెం వైపు వెళ్ళినట్లు గుర్తించామని అటవీశాఖ అధికారులు తెలిపారు. తెల్లవారుజామున కామవరంలోని మడివి కృష్ణకు చెందిన ఆవు, గిత్తలపై దాడి చేసి పులి హతమార్చింది. పశువులపై దాడి చేసిన నేపథ్యంలో మళ్లీ వస్తుందనే అనుమానంతో రాత్రి 9 గంటల వరకూ సరిహద్దుల్లోనే జిల్లా అటవీశాఖ అధికారి సందీప్‌రెడ్డి పర్యవేక్షణలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. పులి ఏపీ బోర్డర్ దాటుతూ తెలంగాణ బోర్డర్లోకి వెళ్ళడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. డిసెంబర్లో కావిడిగుండ్ల నుంచే ఏపీలోకి ప్రవేశించి బుట్టాయగూడెం మండలంలో పలు పశువులపై దాడి చేసి చంపిన పెద్దపులి మొదటిసారిగా అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్‌కెమెరాకు చిక్కింది. మళ్లీ శుక్రవారం అధికారుల డ్రోన్ కెమెరాకు పులి ఒక ప్రదేశంలో దాగి ఉన్న దృశ్యం చిక్కింది. ఇటీవల ఏపీ నుంచి తెలంగాణకు వెళ్ళిన పులి మళ్లీ పోలవరంలో ప్రత్యక్షమై గోదావరి ఈదుతూ పోలవరం జిల్లాలోకి వెళ్ళి మళ్లీ ఏలూరు జిల్లాలోని పోలవరం మీదుగా పలు మండలాల్లో సంచరిస్తూ అధికారులను, ప్రజలను ముప్పు తిప్పలు పెట్టింది. ఇప్పుడు తెలంగాణలోకి వెళ్ళిన పెద్ద పులి తిరిగి వస్తుందా లేక మొదటిసారిగా వచ్చిన మార్గంలోనే వెళ్తుందా అనే విషయాన్ని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కామవరం సమీపంలో డ్రోన్ కెమెరాకు చిక్కిన పెద్దపులి మండలంలోని కామవరం సమీపంలో పెద్దపులి దాడిలో మృతి చెందిన గిత్త -
ఎంటీఎస్ అమలులో తీవ్ర జాప్యం
● హైకోర్టు ఆదేశాలను పట్టించుకోని వైనం ● ఆర్జీయూకేటీ అధికారుల నిర్లక్ష్యం నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ, సిబ్బందికి మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. కోర్టు తీర్పుల మేరకు ప్రభుత్వం జీఓలు జారీ చేసి ఆర్థిక అనుమతులు మంజూరు చేసి నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు ఎంటీఎస్ అమలుకు నోచుకోకపోవడంపై నాలుగు ట్రిపుల్‌ఐటీల్లోని బోధనా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్న చందంగా యూనివర్సిటీ అధికారుల వ్యవహారంపై తీవ్ర విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు ఆదేశాలున్నా విశ్వవిద్యాలయం వాటిని అమలు చేయకపోవడం పట్ల డొమైన్ మెంటార్లు, ఐటీ మెంటార్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నాన్–టీచింగ్ సిబ్బంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వం ఆర్థిక అనుమతి ఇస్తే వెంటనే ఎంటీఎస్ అమలు చేస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. తీరా ప్రభుత్వం వరుసగా జీఓలు జారీ చేసి ఆర్థిక అనుమతులు మంజూరు చేసిన తర్వాత, ఇప్పుడు అమలు చేయకుండా ఉండటానికి ఏవో సాకులు వెతికే పనిలో పడ్డారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం జీఓలు విడుదల చేసినా యూనివర్సిటీ ఎంటీఎస్‌ను అమలు చేయకపోతే న్యాయం కోసం ఇంకెవరి దగ్గరకు వెళ్లాలని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాకల్టీ, నాన్‌టీచింగ్ స్టాఫ్‌కు అమలు చేయాలి నాలుగు ట్రిపుల్ఐటీల్లో కలిపి కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 63 మంది మెంటార్లు, 64 మంది ఐటీ మెంటార్లు, 126 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 29 మంది బోధనేతర సిబ్బందితో కలిపి మొత్తం 282 మంది ఉద్యోగులకు హైకోర్టు ఆదేశాల మేరకు ఎంటీఎస్ అమలుకు ప్రభుత్వం జీఓ నంబర్లు 78, 106, 124, 128, 143ను జారీ చేసింది. వీటిల్లో జీఓ నంబర్లు 78, 128లు ఐటీ మెంటార్లకు, జీఓ నంబర్లు 106, 124లు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు, జీఓ నంబరు 143 మెంటార్స్‌తో పాటు 29 మంది బోధనేతర సిబ్బందికి సంబంధించినవి. 44 మంది ఐటీ మెంటార్లకు సంబంధించి మే 12న జీఓ వచ్చినా ఇప్పటికీ దానిని అమలు చేయలేదు. జీఓలు వచ్చి రెండు నుంచి మూడు నెలలు గడుస్తున్నా ఆర్జీయూకేటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంపై ఉద్యోగుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కోర్టును ఆశ్రయించిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఫ్యాకల్టీ అందరూ కోర్టుకు వెళ్లి ఎంటీఎస్ అమలు చేయాలని ఉత్తర్వులు తెచ్చుకోవడంతో, 2010లో నియమితులైన దాదాపు 53 మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమకూ అమలు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. కొన్నాళ్లుగా ఆర్జీయూకేటీ ఉద్యోగులందరూ కోర్టు మెట్లు ఎక్కుతున్న నేపథ్యంలో ఇక్కడ పరిపాలన ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతోంది. నూజివీడులోని ట్రిపుల్ఐటీ ఎంటీఎస్ అమలు చేయాలని ఫ్యాకల్టీ ఎప్పటి నుంచో ఆర్జీయూకేటీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. యూనివర్సిటీలో ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారి ఒకరు కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకోండి.. అమలు చేస్తాం అంటూ ఉచిత సలహా ఇచ్చారు. దీంతో ఫ్యాకల్టీ అందరూ ఒక కేడర్ తర్వాత మరొకరు వరుసగా కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెస్తుండటం, ప్రభుత్వం కూడా వరుసగా జీఓలు ఇవ్వడంతో ఇప్పుడు ఎంటీఎస్‌ను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావడంతో ఆ అధికారి గొంతులో వెలక్కాయ పడినట్లయింది. ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలో పాలుపోక ఆర్జీయూకేటీ అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రభుత్వం జీఓలు జారీ చేసిన నేపథ్యంలో, జీఓ ఇచ్చిన నాటి నుంచే ఎంటీఎస్ అమలు చేయాల్సిందేనని ఫ్యాకల్టీ స్పష్టం చేస్తున్నారు. -
నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తే సహించం
భీమడోలు: పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తే సహించేది లేదని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు జక్కంపూడి కృష్ణకిరణ్ హెచ్చరించారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజైన గురువారం ఆయన పొలసానిపల్లి, భీమడోలు గ్రామాల్లోని గురుకుల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, బాలికల వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పొలసానిపల్లి గురుకుల పాఠశాలలో వంటగది, బియ్యం, నిత్యావసర సరుకుల నాణ్యత, ఎక్స్పైరీ తేదీలు, స్టాక్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించి, మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. అనంతరం విద్యార్థినులతో ప్రత్యేకంగా సమావేశమై భోజన వసతులపై ఆరాతీశారు. ఈ సందర్భంగా బాలికలు తమ సమస్యలను ఆయనకు లిఖితపూర్వకంగా విన్నవించారు. భోజనంలో ఉప్మా, పులిహోర సరిగా ఉండటం లేదని, చికెన్ సరిగా ఉడకడం లేదని ఫిర్యాదు చేశారు. అలాగే తమకు నచ్చని గోరుచిక్కుడు వంటి కూరగాయలనే ఎక్కువగా వండి పెడుతున్నారని, తాగునీటి ఎద్దడి కూడా ఉందని తెలిపారు. విద్యార్థులకు రుచికరమైన, శుభ్రమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత ప్రిన్సిపాల్‌దేనని స్పష్టం చేసిన ఆయన, ఈ సమస్యలను జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం భీమడోలు జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి, స్టోర్ రూమ్, వంట పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై హెచ్ఎంను ప్రశ్నించారు. అలాగే భీమడోలు బాలికల వసతి గృహం శిథిలావస్థకు చేరిందని, తమను వేరే ప్రాంతానికి తరలించాలని కోరిన విద్యార్థినుల విజ్ఞప్తిపై స్పందిస్తూ, ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఆహార భద్రత కల్పించడమే ఫుడ్ కమిషన్ ముఖ్య ఉద్దేశమని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదన్నారు. పర్యటనలో భాగంగా టి.నరసాపురం పరిధిలోని సాగిపాడు అంగన్వాడీ కేంద్రం మూసివేసి ఉండడాన్ని, ద్వారకాతిరుమల మండలంలోని ఒక పాఠశాలలో 300 కోడిగుడ్లు కుళ్లిపోవడాన్ని గుర్తించామన్నారు. ఈ లోపాలన్నింటిపై సమగ్ర నివేదిక తయారు చేసి కమిషన్ చైర్మన్, సంబంధిత అధికారులకు అందజేస్తామని తెలిపారు. ఈ తనిఖీల్లో సీఎస్‌డీటీ భరత్‌కుమార్, ఎంఈఓ–2 అయినపర్తి భాస్కర్‌కుమార్, ఐసీడీఎస్ పీఓ ఎంఎస్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్సీ అక్రమాలపై సమరభేరి
ఉత్సాహంగా క్రీడా పోటీలు ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జిల్లా స్థాయి అమరావతి చాంపియన్‌షిప్ పోటీలను గురువారం ప్రారంభించారు. 8లో uకాళ్లకూరు వేంకటేశ్వరస్వామి ఆలయం నానాటికి అభివృద్ధి చెందుతోంది. దాతల సహకారంతో ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 8లో uశుక్రవారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2026సాక్షి, భీమవరం: డీఎస్సీ –2025 నియామకాల్లో అవకతవకలు, పేపర్ లీకేజీ వ్యవహారాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన రిలేదీక్షలు గురువారం జిల్లా అంతటా మొదలయ్యాయి. పార్టీ శ్రేణులు, డీఎస్సీ బాదిత అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, మేధావులు నడుమ పార్టీ నేతలు శిబిరాలను ప్రారంభించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించి అర్హులకు న్యాయం చేయాలని, మంత్రి పదవికి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ స్కూళ్లకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ విద్యావ్యవస్థను చంద్రబాబు సర్కారు నిర్వీర్యం చేస్తోందని నిప్పులు చెరిగారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అందజేయాలని, పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయా లని, హాస్టల్ విద్యార్థులకు వసతి దీవెన పథకాన్ని అమలుచేయాలని, నిరుద్యోగ యువతకు నెలనెలా రూ. మూడు వేలు భృతి చెల్లించాలని నినదించారు. తణుకులోని ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో రిలే దీక్షల శిబిరాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, పార్లమెంట్ పరిశీలకుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి ముదునూరి మురళీకృష్ణంరాజు ప్రారంభించారు. పాలకొల్లు, నరసాపురంలోని దీక్షా శిబిరాలను సందర్శించారు. తణుకు పరిశీలకుడు కొట్టు వెంకటనాగు, లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి, పంచాయితీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం పాల్గొన్నారు. ఆచంటలోని కచేరి సెంటర్ వద్ద నియోజకవర్గ కోఆర్డినేటర్ చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో ప్రారంభమైన దీక్షల్లో ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు చెల్లెం ఆనంద ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి దంపనబోయిన బాబూరావు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలోని పోలీస్ ఐలాండ్ వద్ద నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డి రఘురాంనాయుడు ఆధ్వర్యంలో రిలేదీక్షలు ప్రారంభించారు. భీమవరంలోని ప్రకాశంచౌక్ వద్ద నియోజకవర్గ కోఆర్డినేటర్ చినమిల్లి వెంకటరాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దీక్షల్లో ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి అల్లూరి రవిరాజు, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి గంటా రాహుల్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి పాలవెల్లి మంగ పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో నరసాపురం అంబేడ్కర్ సెంటర్ వద్ద దీక్షలు నిర్వహించారు. సీజీసీ సభ్యుడు పీడీ రాజు, పార్టీ నేతలు పాల్గొన్నారు. పాలకొల్లులోని గాంధీబొమ్మల సెంటర్ వద్ద దీక్షా శిబిరంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గుడాల గోపి, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, రాష్ట్ర కార్యదర్శి యడ్ల తాతాజి, గుణ్ణం నాగబాబు, చిగురుపాటి సందీప్, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కర్రా జయ సరిత పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ కో–ఆర్డినేటర్ మంతెన యోగీంద్రబాబు ఆధ్వర్యంలో కాళ్లలోని బస్టాండు వద్ద ఏర్పాటుచేసిన దీక్షల్లో క్షత్రియ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శివకుమార్, ఆర్టీఐ రాష్ట్ర కార్యదర్శి బడుగు బాలాజి పాల్గొన్నారు. దీక్షాదక్షత నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ రిలే దీక్షలు తరలివచ్చిన పార్డీ కేడర్, యువత, మేధావులు సీబీఐ విచారణ, లోకేష్ రాజీనామాకు డిమాండ్ -
ఎల్‌నినోపై రైతులకు అవగాహన
కాళ్ల: ఎల్‌నినో ప్రభావంతో తగ్గుతున్న వర్షపాతం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు రైతులకు అవగాహన కల్పించేలా కేవీకే, ఆంగ్రూ శాస్త్రవేత్తల బృందం గురువారం కాళ్ళ మండలంలోని కోపల్లె, సీసలి, కాళ్ళ, బొండాడ గ్రామాల్లో పర్యటించింది. పొలాలను పరిశీలించిన అనంతరం రైతులతో సమావేశమయ్యారు. కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.మల్లికార్జునరావు మాట్లాడుతూ వర్షపాతానికి అనుగుణంగా సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. నేలలో తేమను నిలిపేందుకు మల్చింగ్, అంతర దుక్కి పద్ధతులు పాటించాలని, సకాలంలో సమతుల్య ఎరువులు వేయాలని తెలిపారు. కరవును తట్టుకునే, స్వల్పకాలిక పంట రకాలను ఎంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి పి.రమేష్ నాయుడు, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. తణుకు అర్బన్: అంతర్జాతీయ సాహితీ సంస్థ విశ్వసాహితీ కళావేదిక నిర్వహించిన జాతీయ స్థాయి కవితల పోటీల్లో తణుకుకు చెందిన ప్రముఖ కవి వీఎస్వీ ప్రసాద్ రెండు పురస్కారాలు సాధించారు. కనిపించని గాయం, గుండెకో వ్యథ అనే అంశాలపై నిర్వహించిన ఈ పోటీల్లో టాప్–20లో నిలిచినందుకు కళావేదిక అధ్యక్షురాలు కొల్లి రమాదేవి, జడ్జిలు జి.భవాని, అంజనీకుమారి, భవానిదేవి, సత్తివాడ శ్రీకాంత్, జంధ్యాల శరత్ బాబు, గేదెల శివప్రసాద్ ఆయనను అభినందించారు. చింతలపూడి (జంగారెడ్డిగూడెం) : ఎర్రకాలువ మిగులు భూమిలో సాగు చేసిన వరి పంటను కొంతమంది ఉద్దేశపూర్వకంగా ట్రాక్టర్‌తో దున్ని ధ్వంసం చేశారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతు ఏలేటి విశ్వేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైకోర్టు పరిధిలోని ఈ భూమిలో పంట సాగు చేసుకుంటున్న తమకు రక్షణ కల్పించాలని కోరినా అధికారులు స్పందించలేదని వాపోయారు. అనంతరం స్థానిక సచివాలయం వద్ద గ్రామస్తులతో కలిసి నిరసన తెలిపారు. స్పందించకుంటే ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీతా, బొక్క వెంకటేశు, కలపాల వెంకయ్య, ఎడ్లపల్లి దుర్గారావు, ఎంకమ్మ, కలపాల నాగభూషణం, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ముసునూరు: ఇంజిన్ ఆపకుండా నిర్లక్ష్యంగా న్యూట్రల్లో ఉంచిన ట్రాక్టర్ వెనుకకు వచ్చి ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన సంఘటన ముసునూరులో చోటు చేసుకుంది. ఎస్సై ఎం.చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పాకనాటి వెంకటేశ్వరరావు (64) పశువులను మేతకు తోలుకెళ్తుండగా, సందు దారిలో ఆగి ఉన్న ట్రాక్టర్ ఒక్కసారిగా వెనక్కి వచ్చి ఢీకొట్టింది. ట్రాక్టర్ చక్రం తలపై నుంచి వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహానికి నూజివీడు ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరవాసరం: మండలంలోని పెరికిపాలెం గ్రామంలో ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తెగిపడటంతో రెండు గేదెలు మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన సనకం వెంకటేశ్వరరావుకు చెందిన పశువుల పాక వద్ద గురువారం విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఈ ప్రమాదంలో పాక వద్ద ఉన్న పాడి గేదె, దూడ అక్కడికక్కడే మృతి చెందాయి. బాధితుడు తీవ్రంగా నష్టపోవడంతో ప్రభుత్వం చొరవ తీసుకుని బాధితుడికి పరిహారం అందించి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఉండి: అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్తలపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల ప్రకారం ఉండి శివారు నక్కరాజుగుంట ప్రాంతానికి చెందిన అందుకూరి మౌనిక, అందుకూరి కిరణ్‌లు 2011లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహ సమయంలో రూ.5 లక్షలు కట్నంగానూ, ఐదు కాసులు బంగారం ఇచ్చారు. ప్రస్తుతం కిరణ్ హైదరాబాద్‌లో ఉంటూ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని, ఇటీవల ఆమె అత్తతో కలిసి అదనంగా రూ.2 లక్షలు నగదు తేవాలని వేధిస్తున్నాడు. దీంతో మైనిక పోలీసులను ఆశ్రయించడంతో ఎస్సై హెచ్.మల్లికార్జునరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మళ్లీ తప్పించుకున్న పెద్దపులి
అంకన్నగూడెం అటవీ ప్రాంతంలో సంచారం బుట్టాయగూడెం: గత కొద్ది రోజులుగా అటవీశాఖ అధికారులకు చిక్కకుండా ముప్పుతిప్పలు పెడుతున్న పెద్దపులి గురువారం కూడా వారికి చిక్కకుండా తప్పించుకుంది. పులిని బంధించేందుకు సుమారు 400 మందికి పైగా సిబ్బంది ప్రయత్నిస్తున్నప్పటికీ, అది దొరకకుండా తిరుగుతూ చుక్కలు చూపిస్తోంది. ప్రస్తుతం ఈ పులి జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెం అటవీ ప్రాంతంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజులుగా పెద్దపులి ఏ ఒక్క పశువుపై దాడి చేసిన సంఘటన జరగలేదు. అయినప్పటికీ, పులి ప్రస్తుతం మంచి ఆకలితో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గురువారం రాత్రి 10 గంటల వరకు పులిని బంధించేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, అది తప్పించుకు తిరుగుతోందని వెల్లడించారు. ప్రస్తుతం పులి సంచరిస్తున్న ప్రదేశానికి కొద్ది దూరంలోనే తెలంగాణ ప్రాంతం ఉంది. ఈ నేపథ్యంలో రాత్రికి పెద్దపులి తెలంగాణ వైపు వెళ్తుందా, లేక మళ్లీ గుబ్బల మంగమ్మ గుడి వైపు వెళ్తుందా అని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు అనువైన ప్రదేశాల్లోనే పులి సంచరించినప్పటికీ, అటవీశాఖ అధికారుల వ్యూహాలను తిప్పికొడుతూ తప్పించుకు తిరుగుతోంది. ఒకవేళ పులి అటు తెలంగాణ వైపు వెళ్లినా, ఇటు గుబ్బల మంగమ్మ గుడి వైపు వచ్చినా అక్కడ దట్టమైన కొండలు, గుట్టలు, అడవి ఉండటంతో ఈ పరిస్థితుల్లో దానిని పట్టుకోవడం కష్టమేనని భావిస్తున్నారు. పులిని బంధించే ప్రయత్నాల్లో జిల్లా అటవీశాఖ అధికారి సందీప్ రెడ్డి, రాజమండ్రి సీసీఎఫ్ టి.జ్యోతి, జంగారెడ్డిగూడెం, కన్నాపురం రేంజ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
దాతల సహకారం.. అభివృద్ధికి శ్రీకారం
కాళ్ల : పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం, కాళ్ల మండలం కాళ్లకూరులో స్వయంభూగా వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నానాటికీ సుప్రసిద్ధ క్షేత్రంగా అభివృద్ధి చెందుతోంది. తిరుపతి తరహాలోనే ఏటా స్వామివారి ఊరేగింపు నిర్వహించేందుకు ఆలయ మాడవీధుల నిర్మాణంతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పనకు దాతల ప్రోత్సాహంతో సుమారు రూ.3 కోట్లతో ఆలయాభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రగతిలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు ● ఆలయంలోని తూర్పు, ఉత్తర రాజగోపురాలకు దాత గాదిరాజు కిరణ్ కుమార్ వర్మ (కలిగొట్ల కిరణ్) సహకారంతో రూ.10 లక్షల వ్యయంతో రాతి గుమ్మాలు, టేకు తలుపులు ఏర్పాటు చేస్తున్నారు. ● ఏలూరుపాడు గ్రామానికి చెందిన దాత దాట్ల శ్రీనివాసరాజు ఆర్థిక సహకారంతో రూ.12 లక్షల వ్యయంతో నూతన కేశఖండనశాల భవన నిర్మాణం చేస్తున్నారు. ● రూ.కోటి అంచనా వ్యయంతో నిర్మిస్తున్న అన్నదాన భవన పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రభుత్వం నుంచి రూ.60 లక్షలు, దాతల నుంచి రూ.40 లక్షలతో దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో రూ.25 లక్షల వ్యయంతో భగవాన్ ట్రేడర్స్ అధినేత నడింపల్లి వెంకట రామరాజు సహకారంతో నూతన వంటశాల, గొట్టుముక్కల వెంకట సత్యనారాయణరాజు సహకారంతో టైల్స్ పనులు చేపడుతున్నారు. ● అన్నదాన భవనాన్ని ఆనుకుని ముదునూరి వెంకట శివరామరాజు (పాందువ్వ శివ) సహకారంతో రూ.11.50 లక్షల వ్యయంతో 123 అడుగుల షెడ్ నిర్మిస్తున్నారు. ● మాడవీధుల ఏర్పాటు, అన్నదాన భవన మార్గం కోసం భక్తులు స్వచ్ఛందంగా 13 సెంట్ల (15 అడుగుల వెడల్పు) భూమిని అందజేశారు. అలాగే మాడవీధుల కోసం రూ.99 లక్షలతో ఐదున్నర సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. దీనికి గాను దాతలు ఇప్పటివరకు రూ.55 లక్షలు అందించగా, మరో రూ.44 లక్షలు సేకరించాల్సి ఉంది. భవిష్యత్తు ప్రణాళికలివే ● మాడవీధుల నిర్మాణానికి అడ్డుగా ఉన్న పాత వంటశాలను తొలగించి దాతల సహకారంతో కొత్త వంటశాల, ప్రసాదం ప్యాకింగ్ భవనం, ఆలయ కార్యాలయాన్ని నిర్మించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్ నెలల్లో పనులు ప్రారంభించి, నూతన సంవత్సరం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ● దేవస్థాన ప్రాంగణంలో రూ.80 లక్షల అంచనా వ్యయంతో నూతన మండపాన్ని నిర్మించనున్నారు. అక్టోబర్–నవంబర్ మాసాల్లో పనులు ప్రారంభించి నూతన సంవత్సరానికి భక్తులకు అందుబాటులోకి తెస్తారు. ● భక్తులకు స్వామివారి మూలవిరాట్ స్పష్టంగా కనిపించేలా ప్రస్తుతం గుడిలో ఉన్న 4 గుమ్మాలను మార్చి నూతనంగా ఏర్పాటు చేయనున్నారు. ● తూర్పు రాజగోపురం వద్ద దానితో సమాన ఎత్తు కలిగిన భారీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని వచ్చే ఏడాది మార్చి నాటికి ఆవిష్కరించేలా ఒక దాత ముందుకు వచ్చారు. ● ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన దక్షిణం వైపు కాంపౌండ్ వాల్‌ను పునర్నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నారు. కాళ్లకూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు గతంలో ఎన్నడూ లేనివిధంగా స్వామివారి సేవలో తరించేందుకు భక్తులు, దాతలు విరివిగా విరాళాలు అందిస్తున్నారు. పెద్ద తిరుపతి మాదిరిగా మాడవీధులు, అన్నదాన భవనం, కేశఖండన శాల వంటి నిర్మాణాలు చేపడుతున్నాం. స్వామివారి కృప దాతలు, భక్తులపై ఎల్లప్పుడూ ఉంటుంది. – అడ్డాల శివరామరాజు, ఆలయ చైర్మన్ కలియుగ దైవమైన కాళ్లకూరు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాభివృద్ధికి కృష్ణా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల నుంచి భక్తులు, దాతలు విశేషంగా ముందుకు వస్తున్నారు. ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో దాతలను ప్రోత్సహిస్తూ ఆలయంలో మరిన్ని సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. – ఎం.అరుణ్ కుమార్, ఆలయ ఈఓ -
ఆరోగ్యకర సమాజానికి తల్లిపాలే పునాది
భీమవరం: ఆరోగ్యకర సమాజానికి తల్లిపాలే పునాది అని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గురువారం భీమవరం పట్టణంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ ప్రైమరీ పాఠశాల అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే ముర్రుపాలు తప్పనిసరిగా పట్టించడం వల్ల అవి బిడ్డకు మొదటి టీకాగా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయన్నారు. శిశువుకు మొదటి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. గర్భిణులు, బాలింతలు ఆహారంలో పప్పులు, ఆకుకూరలు, పాలు, గుడ్లు వంటి పోషకాలు ఉన్నవాటిని తీసుకోవాలని, అంగన్వాడీల ద్వారా అందించే సంపూర్ణ పోషణ కిట్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఇన్చార్జ్ పీడీ పి.విజయలక్ష్మి, భీమవరం సీడీపీఓ టీకేవీ లక్ష్మీకాంతం, సూపర్వైజర్ డి.అనిల్‌కుమారి తదితరులు పాల్గొన్నారు. -
పోడు భూముల వసూళ్ల ఆరోపణలు నిరాధారం
టేకూరు గిరిజనుల వెల్లడి వేలేరుపాడు: పోడు భూముల పట్టాల పేరుతో తాము డబ్బులు వసూలు చేసినట్లు వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని వేలేరుపాడు మండలం టేకూరుకు చెందిన పూరెం రమేష్, కట్కూరు జీసీసీ సేల్స్‌మ్యాన్ పూరెం వెంకటేశ్వర్లు, నూపా శ్రీనివాసరావు, నూపా వెంకటేశ్వర్లు, పూరెం నవీన్ స్పష్టం చేశారు. గురువారం వేలేరుపాడులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమపై వచ్చిన ప్రచారాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న తమకు పోడు భూముల వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. టేకూరు గ్రామంలో అసలు 200 ఎకరాల పోడు భూమే లేదని తెలిపారు. ఏ ఆధారాలు లేకుండా గిరిజనుల నుంచి పట్టాల పేరుతో ఎకరానికి రూ.2 లక్షల చొప్పున, మొత్తం రూ.1.20 కోట్లు వసూలు చేశామంటూ కొన్ని మీడియా సంస్థలు అసత్య కథనాలు ప్రసారం చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమన్నారు. తాము ఎవరి వద్ద ఒక్క పైసా కూడా తీసుకోలేదని, వసూలు చేసినట్లు ఆధారాలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని సవాలు చేశారు. తమ ఎదుగుదల ఓర్వలేక, పరువు ప్రతిష్టలను, ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు కొందరు కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేస్తే న్యాయస్థానంలో పరువునష్టం దావాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కూటమి ప్రభుత్వానిది దుర్మార్గ పాలన
తాడేపల్లిగూడెం అర్బన్: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం దుర్మార్గ పాలన సాగిస్తోందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ధ్వజమెత్తారు. తాడేపల్లిగూడెంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. దేవరపల్లిలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు పోలీసులు తగిన భద్రత కల్పించలేదని విమర్శించారు. జగన్ వచ్చే హెలీప్యాడ్ ప్రాంతాన్ని హైవేకు పక్కనే ఏర్పాటు చేయడం కుట్రపూరితమన్నారు. జగన్‌ను దగ్గర నుంచి చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారని, ఆ సమయంలో పార్టీ నాయకులు, మంత్రులు కిందపడిపోయార న్నారు. తాను కూడా కింద పడిపోగా తాడేపల్లిగూడెం 23వ వార్డుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త అఖిల్ తనను లేపడంతో మిగిలిన వారిని తాము పైకి లేవదీశామన్నారు. నేతలు, కార్యకర్తలు కిందపడిపోయేలా జనం మీదపడినా పోలీసులు నియంత్రించలేకపోయారని, ఇది చంద్రబాబు, లోకేష్‌ల కుట్రలో భాగమేనని ఆరోపించారు. అలాగే ప్రభుత్వ శాఖలను అనుయాయులకు అప్పగించి వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని కొట్టు మండిపడ్డారు. రైతులు పండించిన ధాన్యం, మామిడి, మిర్చి వంటి పంటలకు గిట్టుబాటు ధర దక్కకుండా వ్యాపారులు, దళారులతో కూడిన సిండికేట్ దోపిడీ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా మార్చి, పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయకుండా నీరుగార్చారని ఆరోపించారు. కొందరికి మాత్రమే అరకొర సొమ్ములు అందాయని విమర్శించారు. డీఎస్సీ–25 నియామకాల్లో మెరిట్ అభ్యర్థులను పక్కనపెట్టి, అర్హత లేని వారి నుంచి డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు కట్టబెట్టారని కొట్టు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ దుర్మార్గ పాలనను ప్రజలు, ముఖ్యంగా జెన్‌జీ తరానికి చెందిన యువత నిశితంగా గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. నాయకులు కర్రి భాస్కరరావు, చెన్నా జనార్దన్, ముప్పిడి సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ -
సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
నరసాపురం రూరల్ : మున్సిపల్ ఉపాధ్యాయులకు నిలిచిపోయిన పీఎఫ్ ఖాతాల నిర్వహణను వెంటనే పునరుద్ధరించాలని, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు కూడా పీఎఫ్ ఖాతాలు కేటాయించాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎఫ్‌ఏపీటీఓ చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం నరసాపురం పట్టణంలోని మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలలను సందర్శించిన ఆయన ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై మాట్లాడారు. పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలకు బకాయి పడిన వేతనాలను వెంటనే చెల్లించాలని, అందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. తల్లికి వందనం పథకం నిధుల నుంచి ఎయిడెడ్ పాఠశాలలకు కేటాయించాల్సిన రూ.2,000ను వెంటనే విడుదల చేయాలన్నారు. జిల్లాల పునర్విభజన వల్ల ఇబ్బందులు పడుతున్న మున్సిపల్ ఉపాధ్యాయులను అంతర్ యాజమాన్య బదిలీల ద్వారా సొంత జిల్లాలకు పంపాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే 12వ పీఆర్సీ కమిటీని నియమించాలని, 11వ పీఆర్సీ బకాయిలతో పాటు నిలిచిపోయిన నాలుగు డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ రామచంద్రరావు, రాష్ట్ర మహిళా విభాగ కన్వీనర్ బాలాకుమారి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
ఉంగుటూరు: అమరావతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్–17 కబడ్డీ పోటీల్లో ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ పోటీల్లో బాలికల జట్టు ద్వితీయ స్థానంలో నిలవగా, ఆ జట్టుకు నియోజకవర్గం నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. ఉంగుటూరుకు చెందిన ఎం.దీక్షిత, పెదనిండ్రకొలను హైస్కూల్ విద్యార్థిని ఎం.ప్రియదర్శిని, కై కరం హైస్కూల్ విద్యార్థిని ఎస్. కనకదుర్గ ఎంపికై న వారిలో ఉన్నారు. అలాగే రాష్ట్రస్థాయి బాలుర కబడ్డీ జట్టుకు నియోజకవర్గానికి చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. పెదనిండ్రకొలను జెడ్పీ హైస్కూల్ విద్యార్థి సీహెచ్ బాబులు, కాగుపాడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థి వై.సాయితేజ, గొల్లగూడెం సూర్య స్కూల్ విద్యార్థి టి.సాత్విక్, నారాయణపురం జెడ్పీ హైస్కూల్ విద్యార్థి ఎ.రోహిత్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. కారుమూరి పీఏ సురజిత్‌పై కేసు నమోదు తణుకు అర్బన్: మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పర్సనల్ అసిస్టెంట్ సురజిత్‌పై తణుకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేశారంటూ తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన తణుకు ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాళం శ్రీనివాసరావు తెలిపారు. అక్రమ కేసు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పర్సనల్ అసిస్టెంట్ సురజిత్‌పై అక్రమ కేసు నమోదుచేయడం దారుణమని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి అన్నారు. తణుకు కూటమి నాయకులు కారుమూరి కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నారని, తాజాగా పీఏ సురజిత్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. కూటమి నాయకుల ఒత్తిడి మేరకు నమోదుచేసిన అక్రమ కేసుపై లీగల్‌గానే పోరాడతామని స్పష్టం చేశారు. -
కారుమూరిపై దుష్ప్రచారం తగదు
తణుకు అర్బన్: మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై కూటమి నాయకులు ఎంత దుష్ప్రచారం చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా భయపడేది లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, తణుకు నియోజకవర్గ పరిశీలకుడు కొట్టు వెంకట నాగు స్పష్టం చేశారు. తణుకులో డీఎస్సీ అవకతవకలపై గురువారం నిర్వహించిన రిలే నిరాహార దీక్షా శిబిరంలో వారు మాట్లాడారు. ప్రశ్నిస్తున్న గొంతుకలను నొక్కివేయాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని, అయినప్పటికీ తాము దేనికీ వెనకంజ వేసేది లేదన్నారు. కూటమి నేతలు పెడుతున్న ఇబ్బందుల కారణంగానే కారుమూరి కుటుంబం కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉందని, రానున్న రోజుల్లో వారు మరింత ఉత్సాహంతో పనిచేస్తారని తెలిపారు. తణుకులో కూటమి నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా పార్టీ కార్యక్రమాలను ఆపలేరని, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు భవిష్యత్తులోనూ కార్యక్రమాలను విజయవంతం చేస్తామని వారు తేల్చిచెప్పారు. భీమవరం: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే చెకుముకి సైన్స్ సంబరాల పోస్టర్‌ను గురువారం కలెక్టరేట్లోని విద్యాశాఖ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఓవీఎస్ అనిల్‌కుమార్ ఆవిష్కరించారు. చెకుముకి జిల్లా కన్వీనర్ రేపాక వెంకన్న బాబు మాట్లాడుతూ చెకుముకి సంబరాలు పాఠశాల స్థాయిలో ఈనెల 27న, మండల స్థాయిలో సెప్టెంబరు 11న, జిల్లా స్థాయిలో సెప్టెంబరు 27న, రాష్ట్ర స్థాయిలో నవంబర్ 1వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. 8, 9, 10వ తరగతి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లుల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు చింతపల్లి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. భీమవరం: జిల్లాలో పెనుగొండ, తాడేపల్లిగూడెం మండల విద్యాశాఖాధికారులను సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఓవీఎస్ అనిల్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెనుగొండ విద్యాశాఖాధికారి డి.శుభాకరరావు, తాడేపల్లిగూడెం విద్యాశాఖాధికారి వి.హనుమలపై వచ్చిన ఆరోపణలపై ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా వీరిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు అనిల్‌కుమార్ తెలిపారు. ఫ్యాప్టో హర్షం : అవినీతి వ్యవహారాలు, లంచగొండితనం, కక్ష సాధింపులతో ఉపాధ్యాయులను బెదిరించిన పెనుగొండ, తాడేపల్లిగూడెం మండల విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేయడం పట్ల ఫ్యాప్టో గురువారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసింది. రెండు నెలలుగా ఫ్యాప్టో జిల్లా కమిటీ చేసిన ఐక్య ఉద్యమాలు, పోరాటాల ఫలితంగానే ఈ చర్యలు తీసుకున్నారని ఫ్యాప్టో జిల్లా యూనిట్ అధ్యక్షుడు పీఎస్ విజయరామరాజు, జనరల్ సెక్రటరీ జి.ప్రకాశం ఆ ప్రకటనలో పేర్కొన్నారు. భీమవరం: జిల్లాలో గురువారం జరిగిన టెట్ పరీక్షలకు 381 మంది హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఓవీఎస్ అనిల్‌కుమార్ తెలిపారు. పరీక్షకు 415 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 34 మంది గైర్హాజరయ్యారని, పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో గురువారం రాష్ట్రీయ బాలల స్వాస్థ్య కార్యక్రమం అమలుపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పుట్టిన పిల్లల నుంచి 18 ఏళ్ల వయస్సు వరకు ఉన్న వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. స్క్రీనింగ్‌లో ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తేలిన పిల్లలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు లేదా జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రానికి పంపాలని సూచించారు. జిల్లా ఆసుపత్రిలోని బాలల సత్వర చికిత్స కేంద్రం పనితీరు, సిబ్బంది సేవలపై నివేదికలను పరిశీలించి, ప్రజలు ఆ సేవలను పూర్తిగా వినియోగించుకునేలా తగు ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. -
ఉత్సాహంగా క్రీడా పోటీలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నేటి యువత కూడా దేశం గర్వించే క్రీడాకారులుగా ఎదగాలని ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జిల్ల స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ పోటీలను గురువారం ఆయన ప్రారంభించారు. జిల్లాలో నియోజకవర్గ స్థాయి ఎంపికలు గత నెల 27 నుంచి 31 వరకు 7 నియోజకవర్గాలలో నిర్వహించామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్ఏ అజీజ్ తెలిపారు. మొత్తం 1,200 మంది క్రీడాకారులను 12 క్రీడాంశాల్లో జిల్లా స్థాయి టోర్నమెంట్‌కు ఎంపిక చేశామన్నారు. పోటీల తొలిరోజు ఆర్చరీ, అథ్లెటిక్స్, చెస్, వెయిట్ లిఫ్టింగ్, అండర్–17 విభాగంలో వాలీ బాల్, కబడ్డీ, ఖో–ఖో అంశాల్లో జిల్లా స్థాయి ఎంపికలు, నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాప్ డైరెక్టర్ కె.జగదీశ్వరి, ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎం.పార్థసారధి, ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ బడేటి వెంకట రామయ్య, అథ్లెటిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అదిరెడ్డి సత్యనారాయణ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి అలివేలు మంగ, సెట్వెల్ సీఈఓ కేఎస్ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. వాలీబాల్ పోటీల్లో తలపడుతున్న క్రీడాకారులు -
అటవీ భూముల్లో అక్రమ మైనింగ్
ముసునూరు: మండల పరిధిలోని బలివే, గోపవరం శివారు వెంకటాపురం అటవీ భూముల్లో అక్రమ మట్టి, గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన టీడీపీ నేతలు నలుగురు కలిసి సిండికేట్‌గా ఏర్పడి ఈ దందా కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. ట్రాక్టర్ ట్రక్కు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే వాహనాలను వేగంగా నడుపుతూ భయాందోళనకు గురిచేస్తున్నారని, ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా మట్టి తోలకాలు నిర్వహించడంపై ప్రశ్నిస్తే, అనుమతి ఉందని, ఒకసారి, పర్మిషన్ లేకపోయినా మమ్మల్ని ఆపేది ఎవడు అంటూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అటవీ భూముల్లో మట్టి తవ్వకాలకు డబ్బులు ఇచ్చి అనుమతి తెచ్చుకున్నాం అని ధీమాగా సమాధానం చెబుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. సంబంధిత అటవీ, రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు వెంటనే స్పందించి అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని గ్రామీణులు కోరుతున్నారు. -
ఏలూరు జీజీహెచ్‌లో అమానుష ఘటన
బాలింతకు హెచ్ఐవీ అంటూ వైద్యుల నిర్లక్ష్యం ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రిలో పేదవర్గాల ప్రజలకు సరైన వైద్య సేవలు అందడం లేదు. అప్పులు చేసి కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లలేని స్థితిలో ఉన్న పేదలు ఏలూరు జీజీహెచ్‌కు వైద్యం కోసం వస్తుంటారు. అయితే, ఇక్కడ గర్భిణులు, బాలింతలు పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా మారాయి. రోజుకో సంఘటనతో ఏలూరు జీజీహెచ్‌లోని ఎంసీహెచ్ వైద్యులు, సిబ్బంది ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నారు. తాజాగా, ఒక బాలింతకు రక్త పరీక్షల రిపోర్టులో హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిందంటూ వైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బంధువులందరినీ పిలిచి అందరి ముందూ అవమానకరంగా మాట్లాడారని బాధితులు చెబుతున్నారు. తీరా బుధవారం అదే బాలింతకు ఏలూరులోని ప్రైవేటు ల్యాబ్‌లో రక్త పరీక్షలు చేయించగా ‘నెగిటివ్’ రావడంతో బాధితురాలి భర్త, బంధువులు ఏలూరు జీజీహెచ్‌లో ఆందోళనకు దిగారు. వైద్యులు, సిబ్బంది తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలేం జరిగిందంటే? ఏలూరు జిల్లా కై కలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఓ మహిళ ప్రసూతి కోసం ఏలూరు సర్వజన ఆసుపత్రిలో చేరింది. ఆమె జీజీహెచ్‌లో చేరిన వెంటనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం వైద్యులు ఆమెకు రక్త పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో బాలింతకు హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిందంటూ ఆసుపత్రిలో హడావిడి చేశారు. బాధితులకు కౌన్సిలింగ్ ఇవ్వడమో, లేదా గోప్యంగా చెప్పి వైద్య చికిత్స అందించడమో చేయకుండా.. ఆమె బంధువులందరినీ పిలిచి మరీ అవమానకరంగా మాట్లాడటం పట్ల వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ల్యాబ్‌లో బయటపడిన నిజం బుధవారం ఏలూరులోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో ఆమెకు మళ్లీ రక్త పరీక్షలు చేయించగా హెచ్ఐవీ ‘నెగిటివ్’ వచ్చింది. దీంతో బాధితురాలి బంధువులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు జరిగిన అవమానంతో తీవ్ర మానసిక వేదనకు గురై చనిపోదామని నిర్ణయించుకున్నామని, తీరా బయట రక్త పరీక్షలు చేయిస్తే నెగిటివ్ వచ్చిందని బాధితులు తెలిపారు. ఏలూరు జీజీహెచ్‌లో వైద్యం సరిగా అందించే పరిస్థితి లేదని, ఇక్కడి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బాలింత భర్త కన్నీటిపర్యంతమవుతూ ఆవేదన వ్యక్తం చేశారు. -
రోడ్డు విస్తరణలో ఇల్లు తొలగిస్తున్నారని..
బుట్టాయగూడెం : రోడ్డు విస్తరణ పనుల్లో ఇల్లు తొలగింపునకు గురవుతుందన్న మనస్తాపంతో జీలుగుమిల్లి మండలం కనకాపురంనకు చెందిన వి.శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల ప్రకారం జాతీయ రహదారి భూసేకరణలో భాగంగా శ్రీనివాస్ ఇల్లు కూల్చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్ రెవెన్యూ అధికారుల సమక్షంలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన కొందరు వ్యక్తులు వెంటనే స్పందించి అతని చేతిలోని పెట్రోల్ బాటిల్‌ను లాక్కున్నారు. రోడ్డు వెడల్పు పనుల్లో మొదట తన నివాసాన్ని తొలగించమని అధికారులు చెప్పారని, కానీ ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాలని అధికారులు చెప్పడంతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు శ్రీనివాస్ తెలిపాడు. ప్రభుత్వ అధికారులు స్పందించి తమ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. -
కృషి, క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు
భీమవరం: కృషి, పట్టుదల, క్రమశిక్షణతో ముందుకు సాగితే జీవితంలో ఏదైనా సాధించవచ్చని తిరుపతి ఐఐటీ ఫౌండర్, డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ విద్యార్థులకు సూచించారు. భీమవరం స్థానిక భారతీయ విద్యాభవన్ స్కూల్లో ఐఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఐఐటీ, ఎన్ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో సీటు సాధించేందుకు కష్టపడి చదవడంతో పాటు కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఎంతో అవసరమని తెలిపారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని సాధన కోసం నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు. సదస్సులో ఐఐటీ, ఏఐ విద్యకు సంబంధించిన విద్యార్థుల సందేహాలను ఆయన నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో భవన్ స్కూల్స్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, భవన్ స్కూల్స్ సెక్రటరీ సామంతపూడి శ్రీరామరాజు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీ కొత్త శ్రీమన్నారాయణ శ్రీనివాస్, భవన్ స్కూల్ డైరెక్టర్ మంతెన వెంకట రఘుపతి రాజు, ప్రిన్సిపాల్ గౌరవ్ శర్మ పాల్గొన్నారు. ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ -
వైఎస్సార్సీపీని అణగదొక్కాలని చూస్తున్నారు
నూజివీడు: పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి రాష్ట్రంలో వైఎస్సార్సీపీని అణగదొక్కేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా అది సాధ్యమయ్యేది కాదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు స్పష్టం చేశారు. నూజివీడులో బుధవారం రాత్రి వైఎస్సార్సీపీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అంబటి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తాఫాపై రాజకీయంగా కక్ష కట్టి కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు పెట్టడం దారుణమన్నారు. ఆయన అందుబాటులో లేకపోతే ఆయన కుమార్తె నూరీ పాతిమా ఇంటితోపాటు ఆ అపార్ట్మెంట్లో ఉన్న ఏడెనిమిది ఫ్లాట్లను రాత్రిపూట తనిఖీ చేయడం దారుణమన్నారు. ఇటీవల ఆలూరులో ఒక మహిళను వేధించినట్లు, చీర చించినట్లు ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసు పెట్టారని, తీరా చూస్తే ఆమె భర్తే చించి కేసు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇలా లేనిపోని కేసులు నమోదు చేసి వైఎస్సార్సీపీ నాయకులను, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను జైల్లో ఉంచాలనే చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని ప్రజల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ గొంతును నొక్కేయడానికి మాత్రం పోలీసు వ్యవస్థను వాడుతోందన్నారు. పొగాకు రైతులను పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవరపల్లి వెళ్తే అక్కడ ఒక్క పోలీస్ లేడన్నారు. జడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్న వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు వేలాది మంది ప్రజలు వస్తే ప్రభుత్వం సెక్యూరిటీని ఇవ్వకపోవడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ నేతల అక్రమ అరెస్టులపై రాబోయే రోజుల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించి కార్యాచరణకు దిగుతామన్నారు. మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, గుంటూరు సిటీ అధ్యక్షురాలు నూరీఫాతిమా, తాడికొండ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు, విజయవాడ సిటీ నాయకులు పోతిన మహేష్, గుంటూరు ఏఎంసీ మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ పాల్గొన్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు -
అన్నదాతలూ.. తస్మాత్ జాగ్రత్త
● ఎల్‌నినో ప్రభావం నుంచి పంటలను కాపాడుకోవాలి ● వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన ముసునూరు : రైతన్నలు తమ పంటలను ఎల్‌నినో ప్రభావం నుంచి కాపాడుకోవాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సూచించారు. మండలంలోని వలసపల్లిలో బుధవారం మండల వ్యవసాయ శాఖాధికారి ఆలూరు చాముండేశ్వరి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ కంబాట్ బృందం, ఏరువాక కేంద్రం, వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు పంటల సాగుపై ఎల్ నినో ప్రభావం అనే అంశంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన శాస్త్రవేత్తలు డా. కె.ఫణికుమార్, డా.ఎన్. నాగేంద్ర బాబు మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో ప్రధాన పొలంలో వరి పంట సుడులు తిరిగి ఎండినట్లయితే, పంట తిరిగి కోలుకోవడానికి లీటరు నీటికి 20 గ్రాముల యూరియా కలుపుకొని పిచికారీ చేసుకోవాలని సూచించారు. రసాయనిక ఎరువుల మోతాదును 25 శాతం వరకు తగ్గించుకునేందుకు, జీవన ఎరువులైన అజటోబాక్టర్, అజోస్పిరిల్లమ్ను ఎకరాకు 500 గ్రాముల చొప్పున 500 లీటర్ల నీటిలో కలిపి అందించాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలుగా మినుములు, పెసలు, కందులు సాగు చేసుకోవాలన్నారు. విత్తనం వేసే ముందు బంకమట్టి, బూడిద నీటిలో కలిపి విత్తన గుళికలు తయారు చేయాలని తెలిపారు. దీనివల్ల మొలక శాతం తగ్గకుండా, పురుగు బారిన పడకుండా, వర్షం పడే వరకు విత్తనాలకు నష్టం వాటిల్లదని వివరించారు. రైతు సమాచార కేంద్రం పొందుపరిచిన యూట్యూబ్ లింక్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుని, పంటలకు సంబంధించి రూపొందించిన సాంకేతికతను వీక్షించాలని కోరారు. రైతులు సాగులో ఖర్చు తగ్గించుకుని అదనపు ఆదాయాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ సునీత, రైతు సేవా కేంద్రం, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. -
స్నేహ సౌధం
మోతీనగర్: ఆపదలో ఉన్న సమయంలో సొంత బంధువులు, కుటుంబ సభ్యులు సైతం ఆదుకోవడం అరుదు. అలాంటిది పాతికేళ్ల క్రితం తమతో పాటు కలిసి పనిచేసిన ఒక మిత్రుని బీదరికానికి చలించి ఇల్లు కట్టించి ఇచ్చిన మరో మిత్రుడి ఔదార్యమిది. సుమారు 25 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం మండలం దిరుసుమర్రు గ్రామానికి చెందిన కేల వెంకట్రావు అలియాస్ సురేష్, మరో నలుగురు మిత్రులు హైదరాబాద్ వచ్చారు. గాయత్రినగర్ డివిజన్ శ్రీ వివేకానందనగర్‌లో నివాసం ఉంటూ వివిధ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందారు. అందులో వెంకట్రావుతో పాటు వచ్చిన మిగిలిన నలుగురు మిత్రులు ఇక్కడ ఉండలేక తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోయారు. అందులో గోవిందు అనే మిత్రుడు ప్రస్తుతం ఆర్థికంగా వెనుకబడి ఉన్నాడని వెంకట్రావు తెలుసుకున్నారు. ఆయనకి ఇద్దరు కుమార్తెలున్నారని తెలుసుకుని.. ఆయనకు శాశ్వతంగా నిలిచే సహాయం చేయాలని నిశ్చయించుకున్నారు. వెంకట్రావు తన మిత్రుడు సత్తిబాబు సహకారంతో గోవిందు కోసం స్వగ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం చేపట్టారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా గోవిందుకు తెలియకుండా.. ఆయనతోనే గృహప్రవేశం సైతం చేయించి ఇంటిని అప్పగించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమ సంపాదనలో కొంతైనా ఆపదలో ఉన్న వారికి అందించి ఆదుకోవాలన్నారు. -
డీఎస్సీ అక్రమాల నిగ్గు తేల్చాలి
పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి ● దగాపడ్డ అభ్యర్థులకు అండగా వైఎస్సార్సీపీ రిలే దీక్షలు ● నేడు జిల్లా అంతటా నిర్వహణ ● 10న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు సాక్షి, భీమవరం: మెగా డీఎస్సీలో దగాపడ్డ అభ్యర్థులకు అండగా వైఎస్సార్సీపీ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. సీబీఐ విచారణ జరిపించి అక్రమాల నిగ్గు తేల్చాలని. అర్హులకు న్యాయం చేయాలని, లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని తదితర డిమాండ్లతో గురువారం నుంచి జిల్లా అంతటా రిలే దీక్షలు నిర్వహించనుంది. 10న నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున ర్యాలీలు చేయనున్నారు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ అంటూ ఆర్భాటంగా ప్రచారం చేసిన టీచర్ల నియామకాల్లో అంతులేని అక్రమాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీ చేపట్టగా, స్పోర్ట్స్ కోటా కింద 421 ఉపాధ్యాయ పోస్టులకు రాత పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటాగా ఎంపిక చేశారు. కనీస అర్హతలు లేకున్నా శాప్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి వేలాది మంది అభ్యర్థులు డీఎస్సీకి హాజరయ్యారు. వీరిలో క్వాలిఫై అయిన పలువురు అభ్యర్థులకు కాల్ లెటర్లు సైతం వచ్చాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల నేరవేరిందని సంబరపడేలోపే వారి ఆశలపై చంద్రబాబు సర్కారు నీళ్లు చల్లింది. దేశంలో ఎక్కడాలేని విధంగా మెరిట్ లిస్ట్‌ను మార్చేసింది. అర్హులకు అన్యాయం చేస్తూ మెగా డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐ విచారణకు వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. సర్కారు కుట్రలను ఎండగడుతూ ఆధారాలను సైతం చూపింది. వీటిని పక్కనపెట్టి సవ్యంగా నియామకాలు చేసినట్టు సర్కారు క్లీన్‌చీట్ ఇచ్చుకోవడం విమర్శలకు తావిస్తోంది. డీఎస్సీ–2025లో అక్రమాలు జరగకపోతే సీబీఐ దర్యాప్తుకు ఎందుకు ఒప్పుకోవడం లేదని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. డీఎస్సీపై సీబీఐ వంటి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని, అక్రమాలకు నైతిక బాద్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ అందని విద్యాకానుక కిట్లు ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేయడం, పాఠశాలలు తెరిచి నెలన్నర రోజులైనా ఇంకా పూర్తిస్థాయిలో విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అందజేయకపోవడం, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం తదితర సమస్యలతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సూపర్స్సిక్స్లోని నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి హామీని కూటమి ప్రభుత్వం అమలుచేయకపోవడంతో నిరుద్యోగ యువత అవస్థలు పడుతున్నారు. రౌండ్ టేబుల్ సమావేశాలకు అపూర్వ స్పందన ఆయా డిమాండ్ల సాధన కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు మేరకు జిల్లా అంతటా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. యువజన విభాగం ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించడంతో పాటు జిల్లా నాయకత్వం, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. సోమ, మంగళవారాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన రౌండ్ టేబుల్, టౌన్‌హాల్ సమావేశాలకు అపూర్వ స్పందన వచ్చింది. యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, అభ్యర్థులు హాజరై తమ గళాన్ని వినిపించారు. భీమవరం: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న డిగ్రీ, పీజీ, ఇంటర్, ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ బుధవారం కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. అంబేద్కర్ సెంటర్లో జరిగిన నిరసనలో జిల్లా కన్వీనర్ రాయి వెంకట దుర్గా సాయి మాట్లాడుతూ రూ.6,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రవేశాలు ఆలస్యం కావడం వల్ల విద్యార్థులు పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారని తెలిపారు. అన్ని కోర్సుల ప్రవేశాలను తక్షణమే పూర్తి చేయడం, విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్ ప్రకటించడం, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించడం చేయాలన్నారు. జీవో నంబర్ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్రైవేట్ కళాశాలల ఫీజుల దోపిడీని నియంత్రించి, ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కన్వీనర్ శ్యామ్ విజయరాజ్, కార్యదర్శి సాయిరాం, తేజ, ప్రశాంత్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. భీమవరం: భీమవరంలో బుధవారం టెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఎస్‌ఆర్‌కెఆర్ కళాశాల, డీఎన్నార్ కళాశాలల్లో రెండు షిప్టులుగా పరీక్ష నిర్వహించారు. ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లలో మొత్తం 450కి 418 మంది అభ్యర్థులు హాజరయ్యారని డీఈఓ అనిల్ కుమార్ తెలిపారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన రిలే నిరాహార దీక్షలను జిల్లాలో విజయవంతం చేయాలి. గతంలో ఎప్పుడులేని విధంగా మంత్రి లోకేష్ కనుసన్నల్లో డీఎస్సీలో కుంభకోణం జరిగింది. అడ్డగోలుగా స్పోర్ట్స్ కోటా పెట్టి టీడీపీ నాయకులు సిఫార్సు చేసిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టి అర్హులకు అన్యాయం చేశారు. దీనిని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల్లో చేపడుతున్న రిలే నిరాహారదీక్షలు, 10వ తేదిన భారీ ర్యాలీని విజయవంతం చేయాలి. – ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎస్సీ అక్రమాలపై విచారణ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల, నిరుద్యోగభృతి పథకం అమలు, తదితర డిమాండ్లపై గురువారం నుంచి ఆదివారం వరకు జిల్లా అంతటా నియోజకవర్గాల్లో రిలే నిరాహారదీక్షల నిర్వహణకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. ఈమేరకు భీమవరంలోని ప్రకాశంచౌక్ సెంటర్, నరసాపురంలోని అంబేడ్కర్ సెంటర్, ఆచంటలోని కచేరి సెంటర్, తాడేపల్లిగూడెంలోని పోలీస్ ఐలాండ్, తణుకు రాష్ట్రపతి రోడ్డులోని బాయ్స్ హైస్కూల్ సమీపంలోని వైఎస్సార్ విగ్రహం, పాలకొల్లులోని గాంధీబొమ్మల సెంటర్, ఉండి నియోజకవర్గానికి సంబంధించి కాళ్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద రిలేదీక్షలు మొదలుకానున్నాయి. సోమవారం నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నారు. ఆయా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు, నిరుద్యోగులు, అభ్యర్థులు పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ నేతలు కోరుతున్నారు. -
కావడి సేవ.. భక్తికి తోవ
ముదినేపల్లి (కై కలూరు): ఆడి కృత్తిక కావడి సేవా మహోత్సవానికి శింగరాయపాలెం – చేవూరుపాలెం సెంటర్లో కొలువైన వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం సిద్ధమయ్యింది. తమిళనాడు రాష్ట్రం పళినిలో జరిగే కావడి సేవను రెండో ఏడాది శింగరాయపాలెంలో నిర్వహిస్తున్నారు. గతేడాది భక్తుల నుంచి వచ్చిన స్పందన చూసి ఈ ఏడాది కావడి ఉత్సవానికి మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం కావడి సేవతో పాటు గ్రామోత్సవం, శాంతికల్యాణం నిర్వహించనున్నారు. కావడి ఉత్సవానికి 500 మంది భక్తులు పాల్గొంటారని కావడిలను దేవస్థానం సిద్ధం చేసింది. బుధవారం నాటికి 300 మంది పైబడి భక్తులు పేర్లు నమోదు చేసుకోవడం విశేషం. ఈ వేడుకకు పురాణ ప్రాశస్త్యం ఉంది. భక్తులు తమ భుజాలపై కావడి మోస్తూ మురుగన్‌ను దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. ఇదే పద్ధతిని సింగరాయపాలెం దేవస్థానంలో గతేడాది నుంచి అమలు చేస్తున్నారు. కార్యక్రమాలు ఇలా.. ఈనెల 7వ తేదీ విఘ్నేశ్వర, గో పూజా, పుణ్యాహవచన, పంచగవ్య ప్రాసన, సర్వసూక్త పారాయణ, గ్రామోత్సవం, అభిషేకాలు, శాంతి కల్యాణం నిర్వహిస్తున్నారు. కావడి సేవలో పాల్గొనే భక్తులు రూ.558 చెల్లిస్తే దేవస్థానం కావడి అందిస్తుంది. కావడి ఉత్సవంలో పాల్గొనే భక్తులు పుసుపు వస్త్రాలు మాత్రమే ధరించాలని దేవస్థాన సిబ్బంది చెప్పారు. అదే రోజు 3 వేల మంది భక్తులకు అన్నసమారాధన ఏర్పాటు చేశారు. ఒక్క కావడి ఉత్సవానికి దాదాపు 1,500 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఆలయ చైర్మన్ బొంగు రవికుమార్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆడికృత్తిక నక్షత్రం రోజున వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి కావడి సేవ చేయడంతో ఇష్టకామ్య సిద్ధి లభిస్తుంది. దేవస్థానం తరుఫున 500 కావడిలు సిద్ధం చేశాం. పాలు, నెయ్యి, పుష్పాలు, చందన, పండ్లు, పంచామృత, బెల్లం ఇలా వివిధ రూపాల్లో స్వామికి కావడిని సమర్పించవచ్చు. భక్తులకు అన్నసమారాధన ఏర్పాటు చేస్తున్నాం. భక్తులు పెద్ద ఎత్తున హాజరవ్వండి. – ఆర్.గంగాశ్రీదేవి, సహాయ కమిషనర్, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం, శింగరాయపాలెం రేపు శింగరాయపాలెం ఆలయంలో ఉత్సవం తమిళనాడు పళని తరహాలో ఆడి కృత్తిక కావడి సేవ ఏర్పాట్లు చేస్తున్న దేవదాయ శాఖ -
శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను పాటించాలి
పెదవేగి : కొప్పాకలోని వరి పొలాలు, పీఏసీఎస్‌ను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జీలానీ సమూన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో పాటు ఆర్ఎస్కే అసిస్టెంట్‌తో పంటల ప్రస్తుత పరిస్థితి, సాగు విస్తీర్ణం, పంట ఎదుగుదల దశ, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే చర్యలు, ఏపీఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ, అలాగే పీఎంఎఫ్‌బీవై పంట బీమా నమోదు పురోగతి, రైతుల స్పందనపై సమగ్రంగా ఆరా తీశారు. డైరెక్టర్ మాట్లాడుతూ... పీఎంఎఫ్‌బీవై పంట బీమా పథకంలో అర్హులైన ప్రతి రైతు తప్పనిసరిగా నమోదు చేసుకొని, గడువులోపు ప్రీమియం చెల్లించి తమ పంటలను ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాల నుంచి రక్షించుకోవాలని సూచించారు. రైతులు సహజ వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అవలంబించడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, నేల సారాన్ని పెంపొందించి, వాతావరణ మార్పులను తట్టుకునే స్థిరమైన వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఎల్‌నినో పరిస్థితులకు అనుగుణంగా శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులను పాటించాలని రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏలూరు జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా, ఏలూరు ఏడీఏ ఈ అనిలకుమారి, డీపీఎం శ్రీ బి.వెంకటేష్, డీఎం (మార్క్‌ఫెడ్) ఎల్డీవీ ప్రసాద్ గుప్త, పీఏసీఎస్ చైర్పర్సన్ కొసరాజు వీరవెంకట వరప్రసాద్, పీఏసీఎస్ సెక్రటరీ రమేష్, వీరగంటి రాంబాబు, వేగొంట శ్రీనివాసరావు, ఆర్ఎస్కే సిబ్బంది, ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
దారులన్నీ దేవరపల్లి వైపే..
ప్రమాదభరితంగా కల్వర్టులు ఆకివీడు మండలంలోని జాతీయ రహదారి 165పై పలుచోట్ల కల్వర్టులు, రోడ్డు మార్జిన్లు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారాయి. 10లో uకావడి సేవ మహోత్సవానికి ముదినేపల్లి మండలం శింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం సిద్ధమైంది. 10లో uగురువారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2026ద్వారకాతిరుమల: పొగాకు రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లికి విచ్చేశారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు గోపాలపురం నియోజకవర్గంలోని ద్వారకాతిరుమల, నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం మండలాల నుంచి భారీ సంఖ్యలో పొగాకు రైతులు, పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. అలాగే రాష్ట్ర నలుమూలల నుంచి నాయకులు, అభిమానులు తరలివచ్చారు. హెలీప్యాడ్‌కు చేరుకున్న వైఎస్ జగన్‌కు మాజీ హోం మంత్రి తానేటి వనిత, విశాఖ స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్ గన్నమని వెంకటేశ్వరరావు (జీవీ), భీమవరం నియోజకవర్గ ఇన్చార్జి చినమిల్లి వెంకటరాయుడు తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జై జగన్ నినాదాల మధ్య రోడ్డు మార్గంలో పొగాకు వేలం కేంద్రానికి చేరుకున్న వైఎస్ జగన్‌కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. చూడాలన్న తపనతో.. వైఎస్ జగన్‌ను ఒక్కసారైనా చూడాలన్న తపనతో వృద్ధులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొందరు చెట్లు, లారీలు, ఇతర వాహనాలపైకి ఎక్కి మరీ అభిమాన నేతను చూసి సంబరపడగా, మార్గమధ్యంలో క్రేన్ సాయంతో భారీ గజమాలలు వేసి అభిమానాన్ని చాటుకున్నారు. రహదారులన్నీ జన సందోహంతో కిక్కిరిశాయి. భద్రతా వైఫల్యం : హెలికాప్టర్ దిగగానే అభిమానుల ఉత్సాహం కట్టలు తెంచుకుంది. జగన్‌ను దగ్గరగా చూసేందుకు కొందరు బారికేడ్లు దూకగా, మరికొందరు వాటిని పడగొట్టి హెలీప్యాడ్ వైపు పరుగులు తీశారు. వారిని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. తగినంత మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వచ్చాయి. జగన్ భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అడుగడుగునా అడ్డంకులు : ట్రాఫిక్ నియంత్రణ పేరుతో పోలీసులు వైఎస్సార్సీపీ కార్యకర్తలను పలుచోట్ల అడ్డుకున్నారు. దేవరపల్లి డైమండ్ సర్కిల్ వద్ద బైక్‌లు, కార్లలో వస్తున్న కార్యకర్తలను నిలిపివేయడంతో పెద్ద సంఖ్యలో వారు పొగాకు వేలం కేంద్రానికి చేరుకోలేకపోయారు. యాదవోలు–దేవరపల్లి రహదారిలోనూ వాహనాలను నిలిపివేయడంతో కార్యకర్తలు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా వైఎస్ జగన్ పర్యటన విజయవంతంగా ముగిసింది. వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దూలం నాగేశ్వరరావు, ముదునూరి ప్రసాదరాజు, రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, తెల్లం బాలరాజు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, తాడేపల్లిగూడెం, చింతలపూడి నియోజకవర్గాల ఇన్చార్జులు వడ్డి రఘురామ్, కంభంపాటి విజయరాజు తదితరులు ఉన్నారు. అభయమిస్తూ.. మాట్లాడుతున్న వైఎస్ జగన్. చిత్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్, మాజీ మంత్రి వనిత, మాజీ ఎమ్మెల్యే బాలరాజు, భీమవరం కన్వీనర్ చినమిల్లి, మాజీ ఎమ్మెల్సీ శేషుబాబు ఘన స్వాగతం.. వైఎస్ జగన్‌కు స్వాగతం పలుకుతున్న మాజీ మంత్రి వనిత, భీమవరం కన్వీనర్ చినమిల్లి జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ కై కలూరు: పొగాకు రైతుల ఇబ్బందులపై దేవరపల్లికి పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రావడంతో రైతులకు భరోసా కలిగిందని పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన జిల్లాలోని నియోజకవర్గాల సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలను బుధవారం ఆయన అభినందించారు. డీఎన్నార్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పాలనలో కిలో రూ.289 ధర పలికిన పొగాకు నేడు రూ.236కి పడిపోయిందన్నారు. నాడు వైఎస్ జగన్ రూ.3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఆందోళన కార్యక్రమానికి జెన్‌జీ యువత పెద్ద ఎత్తున తరలిరావడం ప్రభుత్వంపై విరక్తికి కారణమని చెప్పారు. జిల్లాలో ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేద్దామని పార్టీ శ్రేణులకు డీఎన్నార్ పిలుపునిచ్చారు. అభిమాన పరవళ్లు వైఎస్ జగన్ పర్యటనలో జన జాతర ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తరలిన పొగాకు రైతులు, పార్టీ శ్రేణులు వైఎస్ జగన్ భరోసాతో రైతులకు ఊరట భద్రతా వైఫల్యాలు, పోలీసుల అడ్డంకులు ఎదురైనా పర్యటన జయప్రదం -
ప్రమాదభరితంగా జాతీయరహదారి కల్వర్టులు
మూలలంక బోదెకు ఉన్న పిట్టగోడలు కూలిపోయి ప్రమాదభరితంగా ఉన్న కల్వర్టు ప్రధాన సెంటర్లో కల్వర్టు పిట్టగోడ పడి అండలు జారుతున్న దృశ్యం ఆకివీడు: జాతీయ రహదారి నెం.165పై పలుచోట్ల కల్వర్టులు, రోడ్డు మార్జిన్లు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారాయి. వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్న ఈ మార్గంలో చాలా కల్వర్టులు పురాతనమైనవి కావడంతో పిట్టగోడలు విరిగిపోయాయి. గంగానమ్మ కోడు, అయిభీమవరం రోడ్డు, తెల్లవంతెన, మాదివాడ సెంటర్ల వద్ద కల్వర్టులు కుంగిపోయి, నీటి ప్రవాహానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఎదురుగా వాహనాలు వస్తే కిందపడిపోయే ప్రమాదముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు శాశ్వత మరమ్మతులు చేయకుండా, కేవలం రేడియం స్టిక్కర్లు, హెచ్చరిక బోర్డులతో సరిపెడుతున్నారనే విమర్శలున్నాయి. అలాగే, వర్షపు నీటితో నిండిన ప్రమాదకర మార్జిన్లు, ఆక్రమణల వల్ల రోడ్డుపై నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత ఎన్‌హెచ్ అధికారులు స్పందించి, శిథిలావస్థలో ఉన్న కల్వర్టులను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. -
తణుకు నుంచి ఆషాఢ దేవి దర్శనయాత్ర
™èl׿$MýS$ AÆý‡¾¯ŒS: ™èl׿$MýS$ BÈtïÜ yìl´ù ¯]l$…_ BÚëÉýl §ólÑ §ýlÆý‡Ø¯]l Ķæ*{™èlMýS$ Æð‡…yýl$ {ç³™ólÅMýS ºçÜ$ÞË$ ç³…í³…-_-¯]lr$Ï yìl´ù Ðól$¯ól-fÆý‡$ Hyîl-G‹Ü çÜ$«§é-Æ>×ìæ ™ðlÍ-´ëÆý‡$. Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… ºÄ¶æ$-Ë$-§ól-ǯ]l D Ķæ*{™èlÌZ ¿êVýS…V> ¿ýæMýS$¢Ë$ _…™èlË*Æý‡$ ¯]l*M>-ÌSÐ]l$à ™èlÍÏ, Ð]l$rÏ´ëÌñæ… Ð]l$à-ÌS„ìS-Ã, M>MìS-¯éyýl ÐéÆ>íßæ, í³u>-ç³#Æý‡… ç³#Æø-íßæ†, ™éyìlç³{† Aç³-Æ>®-§ólÑ, ò³§éª-ç³#Æý‡… Ð]l$Ç-yýlÐ]l$Ã, M>…{yýl-Mør ¯]l*M>-ÌSÐ]l$Ã, MýSyýl$-ç³#-ÌS…MýS Ð]l¬çÜÌS-Ð]l$ÃÌS §ýlÆý‡Ø-¯]l…™ø ´ër$ MýSyìlĶæ$-ç³#-ÌS…-MýSÌZ AçÙt àÆý‡-™èl$ÌS §ýlÆý‡Ø-¯]l…, ÑÆý‡-fÌZ ™öÍ †Æý‡$糆 Ðól…MýS-sôæ-ÔèæÓ-Æý‡ÝëÓÑ$ દર-્-Ôèæ¯]l… ^ólçÜ$MýS$° ™èl׿$MýS$ ^ólÆý‡$-MýS$…-sêÆý‡° ÑÐ]l-Ç…-^éÆý‡$. D ¯ðlÌS 7¯]l MýS*yé D Ķæ*{™èlMýS$ {ç³™ólÅMýS ºçÜ$ÞË$ HÆ>µr$ ^ólçÜ$¢¯é²-Ð]l$-°, sìæMðSsŒæ «§ýlÆý‡ Æý‡*.500 Ð]l*{™èl-Ðól$¯]l° ^ðl´ëµÆý‡$. BçÜMìS¢ E¯]l² ¿ýæMýS$¢Ë$ ÇfÆó‡ÓçÙ¯ŒS Mú…rÆŠ‡ ¯]l…ºÆý‡$ 94404 19144ÌZ çÜ…{ç³-¨…-^éÌS° MøÆ>Æý‡$. -
నేడు దేవరపల్లికి వైఎస్ జగన్
● పొగాకు రైతుల సమస్యలు తెలుసుకునేందుకు పర్యటన ● జగన్ పర్యటన ఏర్పాట్లపై సమీక్ష చింతలపూడి (జంగారెడ్డిగూడెం): పొగాకు రైతుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో దేవరపల్లిలోని కరటూరి కల్యాణ మండపంలో మంగళవారం ముందస్తు ఏర్పాట్లపై నాయకులు సన్నాహక సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకుడు జెట్టి గురునాథరావు, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జ్ కంభం విజయరాజు, నౌడు వెంకటరమణ పాల్గొని ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. సమావేశంలో చింతలపూడి నియోజకవర్గ నాయకులు బీవీఆర్ చౌదరి, జెట్టి సత్య ఆదిత్య, ముప్పిడి శ్రీనివాసరావు, ఓరుగంటి నాగేంద్ర కుమార్, కర్పూరం గవరయ్య గుప్తా, కుర్రు రవి, కనికళ్ళ ప్రసాద్‌లతో పాటు రైతు నాయకులు వామిశెట్టి హరిబాబు, అట్లూరి సతీష్, గంటికోటి సత్తిబాబు, జుంగ బాబ్జి, నేకూరి కిషోర్, వీరవల్లి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
22ఎ కేసులు, రీ–సర్వేపై సమీక్ష
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం రెవెన్యూ, సర్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 1,92,591 పెండింగ్ ఓటరు కేసులను ఈ నెలాఖరులోగా పరిశీలించి క్లోజ్ చేయాలని, భూమి రీ–సర్వేను గడువులోగా పూర్తి చేసి తప్పులు లేని పాసుపుస్తకాలు అందించాలని ఆదేశించారు. అలాగే పెండింగ్‌లో ఉన్న 22–ఏ భూముల కేసులను రెవెన్యూ రికార్డుల ఆధారంగా సత్వరమే పరిష్కరించాలని సూచించారు. అలాగే కలెక్టరేట్లో జిల్లా స్థాయి సిఫార్సు కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జువైనెల్ జస్టిస్ చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తూ అనుమతులు లేకుండా నడుస్తున్న చైల్డ్ కేర్ సంస్థలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు పాటించని 11 సంస్థల దరఖాస్తులను తిరస్కరించి, ఇప్పటికే నాలుగు సంస్థలను మూసివేశామని, నిబంధనలకు అనుగుణంగా ఉన్న రెండు సంస్థలకు తుది రిజిస్ట్రేషన్ మంజూరుకు సిఫార్సు చేశామని తెలిపారు. వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భీమవరం కలెక్టరేట్లో పోడూరు మండలం సబ్బేవారిపేటకు చెందిన పోలియో బాధితురాలు బుంగ కృష్ణకుమారికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వీల్‌చైర్ అందజేశారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, సహాయక ఉపకరణాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. -
నిరుద్యోగ యువత జీవితాలతో ఆటలొద్దంటూ చంద్రబాబు సర్కారుపై జనం ఆగ్రహం వ్యక్తంచేశారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించి వాస్తవాల నిగ్గుతేల్చాలని, మంత్రి పదవికి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అర్హులైన అభ్య
సాక్షి, భీమవరం: డీఎస్సీ–2025 అక్రమాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చిన రౌండ్ టేబుల్, టౌన్‌హాల్ సమావేశాలకు జిల్లాలో అనూహ్య స్పందన లభించింది. అధిక సంఖ్యలో పార్టీ నేతలు, డీఎస్సీ బాదిత అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, మేధావులు పాల్గొని ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టారు. స్పోర్ట్స్ కోటా పేరిట అర్హులకు అన్యాయం చేయడాన్ని తీవ్రంగా విమర్శిం చారు. బాధితులకు అండగా వైఎస్సార్సీపీ చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో మంగళవారం నరసాపురంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీజీసీ సభ్యుడు పీడీ రాజు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బర్రే శ్రీవెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. భీమవరంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ చినమిల్లి వెంకటరాయుడు ఆధ్యక్షతన పార్టీ కార్యాలయంలో సమావేశంలో పార్లమెంట్ కోఆర్డినేటర్ గూడూరి ఉమాబాల, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు వేండ్ర వెంకటస్వామి, ఏఎస్ రాజు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి అల్లూరి రవికుమార్‌రాజు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి పాలవెల్లి మంగ, జిల్లా యూత్ అధ్యక్షుడు చిగురుపాటి సందీప్ పాల్గొన్నారు. పాలకొల్లులో నియోజకవర్గ కోఆర్డినేటర్ గుడాల శ్రీహరిగోపాలరావు అధ్యక్షతన పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, డీఎంఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ, కుమార దత్తాత్రేయవర్మ, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రా జయచరిత పాల్గొన్నారు. ఉండిలో నియోజకవర్గ కోఆర్డినేటర్ మంతెన యోగీంద్రబాబు అధ్యక్షతన పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో జరిగిన సమావేశంలో ఎస్ఈసీ సభ్యుడు పాతపాటి శ్రీనివాసరాజు పాల్గొన్నారు. తణుకులోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు చెల్లెం ఆనందప్రకాష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి, పంచాయితీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పొట్ల సురేష్ పాల్గొన్నారు. కాగా సోమవారం తాడేపల్లిగూడెంలోని రేణుక ఫంక్షన్ హాలులో నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డి రఘురాంనాయుడు అధ్యక్షతన, ఆచంట నియోజకవర్గం నియోజకవర్గ కోఆర్డినేటర్ చెరుకువాడ శ్రీరంగనాథరాజు అధ్యక్షతన తూర్పుపాలెంలో సమావేశాలు జరిగాయి. డీఎస్సీ అక్రమాలపై జనగళం సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందే మంత్రి లోకేష్ రాజీనామాకు డిమాండ్ వైఎస్సార్సీపీ రౌండ్ టేబుల్ సమావేశాలకు జిల్లాలో అనూహ్య స్పందన హాజరైన అభ్యర్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువత -
కొరియన్ కనకరాజు ప్రీ రిలీజ్ వేడుక
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం రాత్రి కొరియన్ కనకరాజు చిత్ర ప్రీ–రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సినీ హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ... గతంలో తన ‘తొలిప్రేమ’ సినిమా ప్రీ–రిలీజ్ ఈవెంట్‌ను ఇక్కడే చేశానని, ఆ సినిమా మంచి విజయం సాధించిందని గుర్తుచేసుకున్నారు. కళాశాల సెక్రటరీ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ తన ప్రాణ స్నేహితుడు కావడంతోనే తన తాజా చిత్ర ఈవెంట్‌ను కూడా ఇక్కడే నిర్వహించానని, ఈ సినిమా కూడా గొప్ప విజయం సాధించాలని భీమవరం మావుళ్ళమ్మ సాక్షిగా ఆశిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యాంకర్ సుమను వరుణ్ తేజ్ ఘనంగా సత్కరించారు. ఈ చిత్ర యూనిట్‌కు ఏపీఐఐసీ చైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు, కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ, ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ మురళీకృష్ణమరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీహెచ్ దిలీప్ చక్రవర్తి అభినందనలు తెలిపి సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. -
ఉద్యోగాలను అమ్ముకున్నారు
డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడింది. టీడీపీ నాయకులు సిఫార్సు చేసిన వారికి, ఉద్యోగాలు ఇచ్చి మెరిట్ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారు. స్పోర్ట్స్ కోటా అంటూ వింత జీఓలు తీసుకువచ్చి ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఒక్కో ఉద్యోగానికి రూ.15 నుంచి రూ. 20 లక్షలు వసూలు చేశారు. అక్రమాలకు పాల్పడిన లోకేష్‌కు కేంద్ర విద్యాశాఖ మంత్రికి పట్టిన గతే పడుతుంది. – ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దగాపడ్డ డీఎస్సీ అభ్యర్థులకు అండగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. వారికి న్యాయం జరిగేంత వరకు వైఎస్సార్సీపీ తరుఫున నిరంతరం పోరాటం చేస్తాం. దీనిలో భాగంగానే 6 నుంచి నాలుగు రోజులపాటు రిలే నిరాహార దీక్షలు చేపడతాం. 10న భారీ ర్యాలీ నిర్వహిస్తాం. పార్టీ నేతలు, నిరుద్యోగులు, యువత పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలి. – చినమిల్లి వెంకటరాయుడు, భీమవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను గాలికొదిలేసి నయవంచనతో పాలన సాగిస్తోంది. డీఎస్సీలో అక్రమాలకు పాల్పడి అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేసింది. కూటమి మోసాలను ప్రశ్నిస్తున్న వారిపై పోలీసు జులుం ప్రదర్శించి అక్రమ కేసులు బనాయించి అణగదొక్కాలని చూస్తోంది. కూటమి ఎన్ని కుట్ర రాజకీయాలు చేసినా వెనక్కి తగ్గేది లేదు. – గూడూరి ఉమాబాల, నరసాపురం పార్లమెంట్ కోఆర్డినేటర్ డీఎస్సీలో జరిగిన అక్రమాలపై దగా పడ్డ డీఎస్సీ అభ్యర్థులు పోరాటాలు చేసినా ప్రభుత్వంలో కదలిక లేకపోవడంతో ప్రభుత్వం మెడలు వంచి అభ్యర్థులకు న్యాయం చేకూర్చడానికి వైఎస్సార్సీపీ ఆందోళన బాట పట్టింది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే ఢిల్లీలో జంతర్‌మంతర్ మాదిరిగానే ఉద్యమం తీవ్రతరం చేస్తాం. – కవురు శ్రీనివాస్, ఎమ్మెల్సీ డీఎస్సీలో అక్రమాల ద్వారా అర్హులకు అన్యాయం చేసిన మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. అభ్యర్థులు రోడ్డెక్కుతున్నా కనీసం వారితో మాట్లాడేందుకు కూడా కూటమి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. వారి పక్షాన పోరాడుతుంది. – గుడాల గోపి, పాలకొల్లు కోఆర్డినేటర్ చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోంది. ప్రభుత్వ అణిచివేత ధోరణికి జడిసి తమకు జరిగిన అన్యాయంపై అభ్యర్థులు రోడ్డెక్కలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారికి న్యాయం జరిగేలా వైఎస్సార్సీపీ కృషిచేస్తుంది. డీఎస్సీ అక్రమాలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేస్తున్న ఆందోళనలు విజయవంతం కావడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం. – మంతెన యోగీంద్రకుమార్, ఉండి కోఆర్డినేటర్ -
తయారీ రంగాలపై దృష్టి పెట్టాలి
తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం: వికసిత్ భారత్‌ను నిర్మించేందుకు తయారీ రంగంలోని అవకాశాలపై యువత ప్రత్యేక దృష్టి పెట్టాలని ఐ–ల్యాబ్స్ గ్రూప్ చైర్మన్ చింతలపాటి శ్రీనివాసరాజు పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్ ఎనిమిదో స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ... విద్యార్థులకు లోకజ్ఞానాన్ని అందించి, వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో విశ్వవిద్యాలయాల పాత్ర కీలకమన్నారు. విద్యార్థుల ఎదుగుదలలో గురువుల భాగస్వామ్యం ఎప్పటికీ మరవలేనిదని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థీ తాను ఎంచుకున్న రంగంలో పరిణతి సాధించాలని, కొత్త సాంకేతికతలు ఆవిష్కృతమవుతున్న ఈ డిజిటల్ యుగంలో వాటిపై పట్టు సాధిస్తేనే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని శ్రీనివాసరాజు సూచించారు. యువ ఇంజనీర్ల పాత్ర కీలకం: ఐఐటీ తిరుపతి డైరెక్టర్ గెస్ట్ ఆఫ్ హానర్‌గా హాజరైన ఐఐటీ తిరుపతి డైరెక్టర్ కె.ఎన్.సత్యనారాయణ మాట్లాడుతూ... విద్యార్థుల క్రమశిక్షణ, జిజ్ఞాస, పట్టుదలకు స్నాతకోత్సవ సర్టిఫికెట్ నిదర్శనమని అన్నారు. విద్యార్థులు జీవితాంతం నేర్చుకునే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. సమాజానికి ఉపయోగపడే సాంకేతిక పరిష్కారాలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చిన ఆయన, విజయవంతమైన జీవితానికి ఐదు ముఖ్య సూత్రాలను వివరించారు. నిట్ ప్రగతి నివేదిక వెల్లడి నిట్ ఇన్చార్జి డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.వి.రమణరావు మాట్లాడుతూ.. విద్యార్థుల కఠిన శ్రమ, తల్లిదండ్రుల త్యాగం, అధ్యాపకుల అంకితభావం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని కొనియాడారు. ఈ స్నాతకోత్సవంలో 644 మందికి బీటెక్, 53 మందికి పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేసినట్లు వెల్లడించారు. జాతీయ స్థాయిలో నిట్ సంస్థల శ్రేణీకరణలో సంస్థ ఉన్నత ర్యాంకులు సాధించిందని తెలిపారు. వేడుకలో అత్యధిక గ్రేడ్ పాయింట్లు సాధించిన ఎనిమిది మందికి, అలాగే ఆల్‌రౌండ్ ప్రతిభ ప్రదర్శించిన సమయమంతుల అవ్యక్తకు ఇన్స్టిట్యూట్ తరఫున రెండు బంగారు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిట్ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నిట్ స్నాతకోత్సవంలో వక్తలు -
చలో విజయవాడ పోస్టర్ ఆవిష్కరణ
భీమవరం: విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈనెల 10వ తేదీన తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యుత్ ఉద్యోగుల స్ట్రగుల్ కమిటీ చైర్మన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజఫర్ అహ్మద్ కోరారు. చలో విజయవాడ కార్యక్రమ ప్రచారంలో భాగంగా మంగళవారం భీమవరం ప్రాంతంలోని విద్యుత్ సబ్స్టేషన్లు, విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద ఆయన ప్రచారం నిర్వహించి మాట్లాడారు. విద్యుత్ శాఖలో సుమారు 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు వివిధ సబ్స్టేషన్లు, ఆఫీసుల్లో పనిచేస్తున్నారని, వారందరికీ వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులందరికీ నేరుగా వేతనాలు చెల్లించాలని, కనీస వేతనం రూ. 46 వేలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో విజయవాడ ధర్నా పోస్టర్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. డిస్కం అధ్యక్షుడు జె. శ్రీనివాసరావు, ఎం.సురేష్, కె.శ్రీనివాసరాజు, పాండురంగరాజు, బోస్, ప్రశాంత్ పాల్గొన్నారు. భీమవరం: ఉపాధ్యాయుల టెట్ పరీక్షకు సంబంధించిన సూచనలు, సలహాలు, ఫిర్యాదుల కోసం భీమవరం జిల్లా కలెక్టరేట్లోని విద్యాశాఖ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఇ నారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5 నుంచి 16వ తేదీ వరకు నిర్వ హించే టెట్ పరీక్షకు సంబంధించి ఏవైనా ఫిర్యా దులు ఉంటే 93982 31218, 94919 69299, 83418 79098 నంబర్లలో సంప్రదించాలన్నారు. చింతలపూడి: ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో చింతలపూడికి చెందిన చిన్ని గోల్డ్ జిమ్ సభ్యుడు కె.ధనుష్ యాదవ్ ప్రతిభ చాటాడు. భీమవరంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్‌లో 75 కేజీల విభాగంలో అత్యుత్తమ ప్రతిభతో ప్రతిష్టాత్మక ‘మిస్టర్ ఆంధ్ర’ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ఫిట్నెస్ కోచ్ కె. సాయికుమార్ మాట్లాడుతూ సరైన శిక్షణ, క్రమ శిక్షణ, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయాలు సాధించవచ్చనడానికి ధనుష్ యాదవ్ ఒక నిదర్శనం అన్నారు. మిస్టర్ ఆంధ్ర టైటిల్ సాధించిన ధనుష్ యాదవ్‌ను పట్టణ ప్రము ఖులు, క్రీడాభిమానులు, యువత అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. కై కలూరు: కొల్లేరు చేపల సాగు ఎంతో ఆచరణాత్మకంగా ఉందని, రైతులే శాస్త్రవేత్తల మాదిరిగా ఆలోచించి సాగులో విజయాలు సాధిస్తున్నా రని ఒడిశా రాష్ట్ర ఉత్సాహిక చేపల రైతులు కితాబిచ్చారు. ఒడిశా మత్స్యశాఖ అధికారి పార్థో ఆధ్వర్యంలో 22 మంది ఔత్సాహిక రైతులు మంగళవారం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ముందుగా దానగూడెంలో చేపల పట్టుబడిని పరిశీలించి సాగు పద్ధతులు తెలుసుకున్నారు. ఆ తర్వాత కైకలూరులో ఆక్వా షాప్‌ను సందర్శించారు. అనంతరం సమీపంలోని కొల్లేరు ప్రాంత చెరువులను సందర్శించారు. కొర్రమీను, ఫంగస్, కట్టా, రూహు, మృగల చేపల రకాలను స్థాని కులు సందర్శకులకు వివరించారు. అక్కడి నుంచి చేపల ప్యాకింగ్ సెంటర్‌ను పరిశీలించి, కై కలూరు మత్స్యశాఖ కార్యాలయంలో మత్స్యశాఖ అధికారి సీహెచ్ గణపతిని కలిసి ల్యాబ్‌లో లభించే సేవలను అడిగి తెలుసుకున్నారు. పోలవరం రూరల్: గోదావరి వరద రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో క్రమేపీ వరద నీరు తగ్గుతూ వస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 31 మీటర్లకు చేరుకోగా, స్పిల్‌వే నుంచి 6.50 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. -
జీతాలు రాక ఆయాల అవస్థలు
భీమవరం: ఎన్నికల సమయంలో రూ. 15 వేలు ఇస్తామంటూ గొప్పగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు పాఠశాలల్లో పనిచేసే ఆయాలు, నైట్ వాచ్మెన్లకు జీతాలు సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గత నాలుగు నెలలుగా జీతాలు అందక వారు ఆందోళన చెందుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ’మనబడి నాడు–నేడు’ పథకంలో భాగంగా పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా తీర్చిదిద్దడమే గాక, పేద విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు స్వస్తి చెప్పకుండా ఉండేందుకు అమ్మ ఒడి పథకం పేరుతో ఏటా రూ.15 వేలు చెల్లించారు. అదే సమయంలో పాఠశాలల్లోని మరుగుదొడ్లు, విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసిన పరిసరాలను శుభ్రం చేయడానికి అన్ని పాఠశాలల్లో ఆయాలను నియమించారు. పాఠశాలలకు రక్షణగా ఉండేందుకు నైట్వాచ్మెన్లను నియమించి వారికి నెలకు రూ.6 వేలు చొప్పున వేతనాలు చెల్లించారు. ఆయాలు పాఠశాలలను, మరుగుదొడ్లను శుభ్రం చేసి, మధ్యాహ్న భోజనం అనంతరం వ్యర్థాలను తొలగిస్తుంటారు. మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి అవసరమైన మెటీరియల్‌ను కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో సరఫరా చేసింది. జిల్లాలో పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యను బట్టి 300 మంది విద్యార్థులకు ఒక ఆయా, 600 మంది విద్యార్థులకు ఇద్దరు, 900 మంది విద్యార్థులకు ముగ్గురు, 900లకు పైగా విద్యార్థులుంటే నలుగురు ఆయాల చొప్పున నియమించారు. ఈ విధంగా జిల్లాలోని 1,379 పాఠశాలల్లో 1,445 మంది ఆయాలు, 180 మంది నైట్ వాచ్మెన్లను నియమించారు. వీరికి ప్రతి నెలా విద్యాశాఖ నుంచి రూ.6 వేల చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయ్యేది. కోస్తా జిల్లాల్లో మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి పారిశుద్ధ్య కార్మికులు మినహా మిగిలిన వారు పెద్దగా ఆసక్తి చూపలేదు. కుటుంబ పోషణకు ఈ జీతం ఉపయోగపడుతుందనే ఆశతో పాటు, స్కూల్ విద్యార్థులకు సేవ చేస్తే తమ పిల్లలకు చేసినట్లుగా ఉంటుందని భావించి కొంతమంది మహిళలు ఆయాలుగా పనిచేస్తున్నారు. ఆయాలకు నాలుగు నెలలు, నైట్వాచ్మెన్లకు ఐదు నెలలుగా జీతాలు నిలిచిపోవడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో జీవనం గడపడం కష్టతరమైపోతున్న తరుణంలో, జీతాలు సక్రమంగా చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, మే, జూన్ నెలల్లో కేవలం సగం జీతం మాత్రమే ఇచ్చారని వాపోతున్నారు. సెలవు రోజుల్లో ఉపాధ్యాయులకు పూర్తి జీతం ఇచ్చే ప్రభుత్వం, ఆయాలు, నైట్వాచ్మెన్ల పట్ల పక్షపాతం చూపడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. జీతాలు ప్రతి నెలా క్రమం తప్పక ఇవ్వాలని, మే, జూన్ నెలల్లో కూడా పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు. స్కూళ్లలో పనిచేసే ఆయాలు, నైట్వాచ్మెన్లకు నాలుగు నెలలుగా జీతాలు అందని మాట వాస్తవమే. వారి జీతాల బడ్జెట్ మంజూరైంది. జిల్లావ్యాప్తంగా 1,445 మంది ఆయాలు, 180 మంది నైట్వాచ్మెన్లు పనిచేస్తున్నారు. వీరందరికీ నాలుగైదు రోజుల్లో జీతాలు చెల్లించే ఏర్పాటు చేస్తున్నాం. ఎం.సత్యనారాయణ, మధ్యాహ్న భోజన పథకం అసిస్టెంట్ డైరెక్టర్ -
సార్వాలో ఎరువుల యాజమాన్యం
అత్తిలి: వరిసాగులో రైతులు అవసరం మేరకే ఎరువులు, పురుగు మందులు వినియోగించాలని, దీని ద్వారా సాగు ఖర్చులు తగ్గి, నాణ్యమైన మంచి దిగుబడులు లభిస్తాయని మండల వ్యవసాయశాఖ అధికారి టీకే రాజేష్ చెప్పారు. సార్వా సాగులో రైతులు ఎరువుల యాజమాన్య పద్ధతులను పాటించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవాలని ఆయన సూచించారు. భూసార పరిరక్షణకు, ఉత్పత్తి కోసం రసాయన ఎరువులతో పాటు సేంద్రియ జీవన ఎరువులను వాడాలి. సేంద్రియ, రసాయన ఎరువులను కలిపి వినియోగించడం వల్ల భూసారం పెరగడమే కాకుండా పోషకాల లభ్యత పెరుగుతుంది. భూసార పరీక్షా ఫలితాల ప్రకారం నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను వేసుకోవాలి. సార్వాలో ఎకరాకు సిఫార్సు చేసిన 36:24:24 కిలోల నత్రజని, భాస్వరం, పొటాష్‌ను స్వర్ణ, ఎంటీయూ –1318 రకాలకు తప్ప అన్ని మిగిలిన రకాలకు వేసుకోవచ్చు. స్వర్ణ, ఎంటీయూ 1318 రకాలకు 24:24:24 కిలోల నత్రజని, భాస్వరం, పొటాష్ మాత్రమే వేయాలి. నత్రజని వినియోగ సామర్ధ్యం పెంచడానికి 50 కిలోల యూరియాకి 10 కిలోల వేపపిండి కలిపి రెండు రోజులు నిల్వ ఉంచి పొలంలో వెదజల్లితే నత్రజని వినియోగం సామర్ధ్యం పెరుగుతుంది. పురుగులు, తెగుళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు నత్రజని ఎరువుల వాడకం తగ్గించాలి. నత్రజనిని ఎక్కువగా వాడి భాస్వరం, పొటాష్ ఎరువులను సరైన మోతాదులో వేయకపోతే చీడపీడల ఉధృతి పెరిగి, తాలు, కంకులు ఎక్కువగా ఏర్పడి దిగుబడి తగ్గిపోతుంది. పంట నాణ్యత లోపిస్తుంది. ప్రతి రైతు రెండేళ్లకోసారైనా భూసార పరీక్షలు చేయించుకుని ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. అగ్గితెగులు, పొట్టకుళ్లు తెగులు, గోధుమ రంగు మచ్చ తెగులు నివారణకు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు నివారణ చర్యలు చేపట్టాలి. -
అడవికి మేమే రాజులం
బుట్టాయగూడెం: అరుదైన జంతుజాలానికి నిలయమైన పాపికొండల అభయారణ్యంలో అత్యంత క్రూర జంతువులైన అడవి కుక్కలు (వైల్డ్ డాగ్స్) గుంపులుగా సంచరిస్తున్నాయి. ఇవి అటవీ ప్రాంతంలోని అనేక జంతువులను వేటాడుతుంటాయి. అడవికి పులే రాజుగా చెప్పుకుంటున్నప్పటికీ, ఆ పులిని సైతం అడవి కుక్కలు భయపెట్టగలవని చెబుతుంటారు. అడవి కుక్కలు సంచరించే ప్రదేశాల్లో పులులు కూడా సంచరించవని, వాటి ఉనికిని కనిపెట్టి పులులు తప్పించుకుంటూ తిరుగుతాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. పరిమాణంలో ఊరకుక్కల కంటే కొంచెం పెద్దవిగా ఉండే వైల్డ్‌డాగ్స్, తమకంటే బరువు, శక్తి కలిగిన పెద్ద పులులను సైతం సమూహ శక్తితో తరిమికొట్టగలవు. అడవిలో సంచరించే అడవి పందులను ఈ వైల్డ్‌డాగ్స్ చిటికెలో వేటాడి ఆహారంగా మార్చుకుంటాయి. వాటి బరువుతో పోల్చుకుంటే ఎన్నో రెట్లు పెద్దవైన కణితి (సాంబార్ డీర్) లాంటి పెద్ద జంతువులను కూడా ఈ అడవి కుక్కల సమూహం వేటాడతాయి. ఈ వైల్డ్‌డాగ్ గుంపులు ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉండకుండా నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. ఇవి ఊరకుక్కల కంటే కాస్త పెద్దవిగా ఉండి, తోకకు కుచ్చుగా వెంట్రుకలు ఉంటాయి. ఇవి యూరప్ దేశాల్లో నల్ల మచ్చలతో కనిపిస్తాయి. పాపికొండల అభయారణ్యంలో 200 వేట కుక్కలు పాపికొండలు, నాగార్జున సాగర్–శ్రీశైలం, గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యాల్లో అడవి కుక్కల సంచారం ఎక్కువగా ఉంటుందని వైల్డ్‌లైఫ్ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కవ్వాల్ టైగర్ జోన్లో కూడా అడవి కుక్కల సంచారం అధికంగా ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు. పాపికొండల అభయారణ్యంలో సుమారు 200కు పైగా కుక్కలు గుంపులుగా సంచరిస్తున్నట్లు గుర్తించామని, ప్రస్తుతం వాటి జాడ అల్లూరి సీతారామరాజు అటవీ ప్రాంతంలో ఉన్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో, ఇవి స్వేచ్ఛగా సంచరించడానికి మరింత అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వైల్డ్‌డాగ్స్ జీవావరణ సమతుల్యతలో ప్రధాన భూమిక పోషిస్తుంటాయి. మాంసాహార జంతువులు, గడ్డి తినే జంతువుల మధ్య సమతుల్యత భూమిపై మొత్తం పర్యావరణ స్థితిని నిర్ణయిస్తుంది. చిరుతపులి, పెద్దపులి, అడవి కుక్కల వంటి మాంసాహార జంతువుల సంఖ్య తగ్గిపోతే, వాటి ఆహార జంతువులైన వివిధ జింకల సంఖ్య అమాంతంగా పెరిగి అడవిలోని వృక్షాలు తగ్గిపోతాయి. రైతులకు ఇబ్బంది కలిగించే అడవిపందులు, జింకల సంఖ్య ప్రమాదకరంగా పెరగకుండా నియంత్రణలో ఈ అడవికుక్కలు కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు అంటున్నారు. పాపికొండల అభయారణ్యంలో వైల్డ్ డాగ్స్ సంచారం -
దొరకని పులి ఆచూకీ
బుట్టాయగూడెం: అటవీశాఖ అధికారులు వలలకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న పెద్ద పులి సోమవారం కూడా తప్పించుకుంది. జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం మధ్యలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ పులి దాక్కొంది. రేడియో కాలర్ ద్వారా సిగ్నల్ రాకపోవడంతో అటవీశాఖ అధికారులు పులి సంచరించే ప్రదేశంలో కొద్దిసేపు శబ్దాలు చేస్తూ హడావుడి చేశారు. కొంతసేపటికి బయటకు వచ్చిన పెద్దపులి కాల్వ వెంట సంచరిస్తున్నట్లు గుర్తించారు. పులిని క్షేమంగా బంధించేందుకు అటవీశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ వారికి చిక్కకుండా అక్కడి నుంచి జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెం, ములగలంపల్లి మీదుగా రౌతుగూడెం రోడ్డు దాటుకుంటూ బుట్టాయగూడెం మండలం బెడదనూరు అటవీప్రాంతంలోకి చేరుకున్నట్లు సమాచారం. ఆ ప్రాంతంలో పులి సంచరిస్తున్న సిగ్నల్ లభించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. బెడదనూరు అటవీ ప్రాంతం నుంచి కొద్దిదూరంలో పూచికపాడు ఉంది. అక్కడి నుంచి మళ్లీ తెలంగాణ ప్రాంతం మొదలవుతుంది. పులి ఈ రాత్రికి ఆ ప్రాంతం దాటితే ఇక తెలంగాణ ప్రాంత అటవీశాఖ అధికారులకు సమాచారం అందిస్తామని అధికారులు తెలిపారు. ఉండి: ఉండిలో బాలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై హెచ్.మల్లికార్జునరావు తెలిపిన వివరాల ప్రకారం ఉండి జెడ్పీ హైస్కూల్లో పదోతరగతి చదువుతున్న కడలి తాప్సీ(15) కొద్ది రోజులుగా టైఫాయిడ్‌తో పాటు ఇన్ఫెక్షన్తో బాధపడుతుంది. ఆమెకు కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయిస్తున్నారు. తండ్రి గల్ఫ్ వెళ్ళగా తల్లి భీమవరంలోని ఓ కార్పొరేట్ దుకాణంలో పని చేస్తుంది. అనారోగ్యం కారణంగా సోమవారం స్కూల్‌కు వెళ్ళలేదు. సాయంత్రం ఇంటి వద్ద అమ్మమ్మతో పాటు బాలిక మాత్రమే ఉంది. సాయంత్రం అమ్మమ్మ బయటకు వెళ్ళడంతో బాలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనాస్థలికి చేరుకుని ప్రాథమిక కారణాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆకివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తాడేపల్లిగూడెం రూరల్: దాళ్వాకు ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి జడ్. వెంకటేశ్వరరావు కోరారు. ఎల్‌నినో పరిస్థితులపై సోమవారం మండలంలోని కొండ్రుప్రోలు, ఎల్.అగ్రహారం, మెట్ట ఉప్పరగూడెం, కుంచనపల్లి రైతు సేవా కేంద్రాల్లో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు కొనసాగితే ఆయా గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటి వ్యవసాయానికి రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలతో పాటు నూనె గింజలు, పచ్చిరొట్ట పంటలు వేసుకోవాలన్నారు. ప్రస్తుతం నువ్వుల పంటకు మంచి గిరాకీ ఉందన్నారు. -
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
నూజివీడు: మండలంలోని పల్లెర్లమూడిలో సోమవారం జరిగిన ఘటనలో వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ జ్యోతిబసు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన పులవర్తి వీరబ్రహ్మం(35) తన ఇంట్లో మోటార్‌ను బిగిస్తుండగా, ఒక్కసారిగా విద్యుత్ ప్రవహించి షాక్‌కు గురై అక్కడికక్కడే పడిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నూజివీడు: మండలంలోని మీర్జాపురానికి చెందిన నల్లగుంట్ల సురేష్ (40) ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించగా, విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఎస్సై జ్యోతిబసు తెలిపిన వివరాల ప్రకారం, సురేష్ భార్యతో ఆరేళ్ల క్రితమే విడిపోయారు. అప్పటి నుంచి ఒంటరిగా జీవిస్తూ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే ఈ నెల 1న ఇంట్లో ఉరివేసుకోగా, గమనించిన స్థానికులు అతడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. భీమవరం: రాష్ట్ర విద్యా రంగం సమస్యల వలయంలో ఉందని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించలేని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.వలరాజు డిమాండ్ చేశారు. భీమవరంలో సోమవారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జిల్లా సమితి సమావేశం, అధ్యక్షురాలు యామిని దేవిశ్రీ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో వలరాజు మాట్లాడుతూ, పాఠశాల విద్య నుంచి యూనివర్సిటీల వరకు సమస్యలు తాండవిస్తున్నాయని, ఇంటర్, పీజీ విద్యార్థులకు ఇప్పటివరకు అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వ వసతి గృహాలకు నిధులు కేటాయించకపోవడం, దశాబ్ద కాలంగా ఖాళీగా ఉన్న కుక్, కమాటి, వార్డెన్ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో డ్రాపవుట్స్ పెరిగిపోతున్నాయని, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో సర్టిఫికెట్లు రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సుందర్, హేమంత్, కౌశిక్, అఖిల్ పాల్గొన్నారు. కుక్కునూరు: మండలంలోని అమరవరం శివారులో పాత హైస్కూల్‌కు వెళ్లే దారిలోని ముత్తయ్య పొలంలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఎస్సై రాజారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం ఇటీవల గోదావరి వరద ప్రవాహంలో కొట్టుకువచ్చి ఉండవచ్చని లేదా నీటిలో మునిగి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు సుమారు 5 అడుగుల ఎత్తు, నలుపు రంగుతో ఉన్నాడని, ఎరుపు రంగు టీ–షర్టు, నీలం రంగు షార్ట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. ఏమైనా వివరాలు తెలిస్తే వెంటనే కుక్కునూరు పోలీస్ స్టేషన్‌ను గానీ, 7382623699 నంబర్‌ను గానీ సంప్రదించాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు. భీమడోలు: పూళ్ల పంచాయతీ శివారు ఎంఎంపురంలో చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న ఓ ట్రక్ ఆటోను భీమడోలు పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. 100 కేజీల చికెన్ వ్యర్థాలను పూడ్చి పాతిపెట్టారు. ఎంఎంపురానికి చెందిన భలే సాంబశివరావు ఆక్వా చెరువులోకి మండలంలోని పలు గ్రామాల్లోని చికెన్ దుకాణాల వద్ద చికెన్ వ్యర్థాలు కొనుగోలు చేసుకుని తన ట్రక్ ఆటోలో తీసుకుని వెళ్లాడు. గ్రామస్తులు ఎంఎంపురం బస్టాండ్ వద్ద పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు సాంబశివరావు అదుపులోకి తీసుకున్నారు. ద్వారకాతిరుమల: మండలంలోని బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన బెజవాడ రామారావు అనే 85 ఏళ్ల వృద్ధుడు శనివారం అదృశ్యమయ్యాడు. నల్లజర్ల వెళుతున్నట్టు ఇంట్లో చెప్పి, బయటకు వెళ్లిన రామారావు తిరిగి ఇంటికి చేరుకోలేదు. దాంతో చుట్టుపక్కల, బంధువుల ఇళ్ల వద్ద, ఇలా పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. దాంతో రామారావు పెద్ద కుమారుడు చిన్న ఏసు ఆదివారం ద్వారకాతిరుమల పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
అధికారుల అండతో అక్రమ మైనింగ్
నూజివీడు: మైనింగ్, రెవెన్యూ అధికారుల అండదండలతోనే తోటపల్లిలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్, రవాణా జరుగుతోందని గ్రామస్తులు, రైతులు ఆరోపిస్తున్నారు. మంత్రి కొలుసు పార్థసారథి కుమారుడు నితిన్ కృష్ణకు చెందిన బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా కొండను చదును చేసే పేరుతో అక్కడ గ్రావెల్‌ను తవ్వి భారీ ఎత్తున బయట ప్రాంతాలకు తరలిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన రైతులు పట్టా భూముల్లో సాగు చేసుకుంటున్న చోట కూడా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరిపి తరలిస్తున్నారని, దీనిపై ప్రశ్నిస్తే మంత్రి అనుచరులు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. విచారణకు రాని రెవెన్యూ అధికారులు గత నెల 30న జిల్లా కలెక్టర్‌కు, మైనింగ్ శాఖ అధికారులకు రైతులు, గ్రామస్తులు కలిసి అక్రమ మైనింగ్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం మైనింగ్ జరిగే ప్రదేశంలో రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు సంయుక్తంగా విచారణ జరుపుతారని రైతులకు సమాచారం అందింది. దీంతో రైతులు అక్రమ మైనింగ్ జరుగుతున్న కొండ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో ఏలూరు జిల్లా మైనింగ్ శాఖ ఆర్ఐలు కె.వి.రమణ, శ్రీనివాస్ ప్రసాద్, సర్వేయర్ శ్రీనివాసరావు ఆగిరిపల్లి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. తహసీల్దార్ పి.ఎన్.వి.ప్రసాద్ ఏలూరులో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారని, తహసీల్దార్ అనుమతి లేకుండా విచారణలో పాల్గొనలేమని, ఆయన కోసం ఎదురుచూస్తున్నామని మైనింగ్ శాఖ అధికారులు తెలిపారు. రెవెన్యూ అధికారులు రాకపోవడంతో, మైనింగ్ శాఖ అధికారులు కొంతసేపు వేచి చూసి వెనుదిరిగారు. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు అక్రమ మైనింగ్ చేసే వారితో కుమ్మకై ్క కావాలనే విచారణకు రాలేదని వారు ఆరోపించారు. మంత్రి అనుచరులకు అన్నీ అనుమతులు ఉంటే, మమ్మల్ని చూసి ఎందుకు తవ్వకాలు నిలిపివేస్తారని ప్రశ్నించారు. రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో అక్రమ తవ్వకాలు చేసిన వారిపై విచారణ జరిపి జరిమానా విధించాలని వారు డిమాండ్ చేశారు. అక్రమ తవ్వకాల వల్ల కొండపై కొలువై ఉన్న దుగ్గిరాల బాలరావమ్మ తల్లి ఆలయానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు అక్రమ మైనింగ్‌ను అడ్డుకుంటామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు హెచ్చరించారు. -
పేదింట ధరల మంట
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ శాతాన్ని ఇటీవల తగ్గించినా ఆయా వస్తువుల ధరలు అనుకున్నంత రీతిలో తగ్గలేదు. ధరల తగ్గుదలపై ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. విజిలెన్స్ కమిటీలు, విజిలెన్స్ తనిఖీలు కరువయ్యాయి. అధిక ధరలతో ప్రజలు సతమతమవుతున్నారు. ధరల తగ్గింపునకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేయాలి. – కె.ప్రసాద్, జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు, సిద్ధాపురం, ఆకివీడు మండలం మార్కెట్లో ఏమీ కొనే పరిస్థితి కనిపించడం లేదు. పప్పులు, నూనెల ధరలు బాగా పెరిగిపోయాయి. ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అన్నిరకాల నిత్యావసర సరుకులు తక్కువ ధరలకే అందించేలా చర్యలు తీసుకోవాలి. – బైనపాలెం మాణిక్యాలదేవి, లక్ష్మణేశ్వరం సాక్షి, భీమవరం: నిత్యావసర వస్తువుల ధరలు పేదింట మంటలు పుట్టిస్తున్నాయి. పప్పులు ఉడకనంటుంటే.. నూనెలు సలసలమంటున్నాయి. గోదావరికి వరదలతో కూరగాయల ధరలకు రెక్కలొస్తున్నాయి. ఏమీ కొనేట్టు, తినేట్టుగా లేని పరిస్థితుల్లో పేదవర్గాల వారు సతమతమవుతున్నారు. సర్కారు ధరల నియంత్రణ చర్యలు కేవలం బియ్యానికే పరిమితమం కావడం విమర్శలకు తావిస్తోంది. ఆకాశంలో ధరలు.. జనం గగ్గోలు నిత్యావసర సరుకులు లేనిదే రోజు గడవని పరిస్థితి. పశ్చిమాసియా సంక్షోభంతో ఇప్పటికే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, కృత్రిమ కొరత తదితర కారణాలతో మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగాయి. నాణ్యతను బట్టి కిలో కందిపప్పు రూ.150 వరకు ఉంటే పెసరపప్పు రూ.140, మినపప్పు రూ.130, చాయ మినపగుళ్లు రూ.150, షుగర్ రూ.55, పామాయిల్ రూ.140, సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.180, బియ్యం రూ.70ల వరకు ఉన్నాయి. మసాల దినుసులు, సబ్బులు, టీపొడి తదితర ప్రతి వస్తువు పైనా కొద్దినెలల వ్యవధిలో పది నుంచి 25 శాతం మేర ధరలు పెరిగి పేదలకు భారమవుతున్నాయి. ఇంటిలో పరిస్థితి ఇలా ఉంటే గ్యాస్ ధరల పెంపు, సిలెండర్ల కొరతతో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బజ్జీల బళ్లు, స్వీట్స్ షాపులు, కర్రీ పాయింట్లలో టిఫిన్, మీల్స్‌పై ప్లేటుకు రూ.10 నుంచి రూ.30ల వరకు ధరలు పెంచేశారు. జిల్లాలో రేషన్‌కార్డులు కలిగిన కుటుంబాలు 5.68 లక్షలు ఉన్నాయి. అన్నింటా పెరిగిన ధరలతో నెలవారీ బడ్జెట్‌పై రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు అదనపు భారం పడుతుండటం వారి జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బియ్యంతో సరి మార్కెట్లో బియ్యం ధరలు అదుపు చేసేందుకు సివిల్ సప్లయిస్ శాఖ ఆదివారం ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించింది. స్టీమ్ బియ్యం కిలో రూ.52, రా రైస్ రూ.50లు చొప్పున రేషన్‌కార్డుపై 10 కిలోలు చొప్పున ఇస్తారని, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రత్యేక కౌంటర్లు తెరిచి ఉంటాయని అధికారులు ప్రకటించారు. జిల్లాలో మూడు రైతు బజార్లు, 40 రైస్ మిల్లులకు చెందిన ఔట్లెట్లలో ఏర్పాటుచేయనున్నట్టు చెప్పగా ఉన్నతస్థాయి నుంచి 33 ఔట్లెట్లు ఏర్పాటుకు మాత్రమే అనుమతులు వచ్చినట్టు సమాచారం. సోమవారం నాటికి జిల్లాలో 29 ఔట్లెట్లకు సంబంధించిన నిర్వాహకులు మాత్రమే సైట్లో లాగిన్ అయ్యారు. తాడేపల్లిగూడెం చాంబర్ ఆఫ్ కామర్స్, నరసాపురం రైతు బజారు, రెండు రైస్‌మిల్లులకు చెందిన ఔట్లెట్స్ లాగిన్ కాలేదు. కాగా జిల్లాలో ఏఏ రైస్‌మిల్లుల వద్ద ఈ కౌంటర్లు ఏర్పాటుచేసింది స్పష్టమైన సమాచారం లేదు. ఎమ్మెల్యేలు అందుబాటులో లేక పలుచోట్ల ఇంకా కేంద్రాలు ప్రారంభించలేదని తెలుస్తోంది. బె‘ధర’గొడుతున్నాయ్ ఉడకని పప్పులు.. సలసలమంటున్న నూనెలు దుర్భరంగా సామాన్యుల జీవనం బియ్యానికి మాత్రమే ప్రత్యేక కౌంటర్లు మిగిలిన నిత్యావసర సరుకుల ఊసెత్తని సర్కారు గతంలో ఎన్నడూ కూరగాయల ధరలు పెరగడం చూడలేదని, రోజువారీ అమ్మకాలు తగ్గాయని వ్యాపారులు అంటున్నారు. ఇప్పటికే కిలో ఉల్లిపాయలు రూ.35 నుంచి రూ.40ల వరకు ఉండగా, గోదావరికి వరదలతో స్థానికంగా లంక భూముల్లో పండించే వంకాయ, దొండ, బెండ, చిక్కుడు, ఆనబ, క్యాబేజీ, బీరకాయ తదితర కూరగాయల పంటలకు నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం నిలకడగానే ఉన్నప్పటికి రానున్న రోజుల్లో కూరగాయల ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. నిత్యావసర సరుకుల ధరల నియంత్రణ కోసం ఏడాది క్రితం సివిల్ సప్లయీస్ శాఖ జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు తదితర నియోజకవర్గ, మండల కేంద్రాల్లో గల సూపర్ మార్కెట్లు, రైతు బజార్లు, ప్రైవేట్ దుకాణాల్లో 22 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేసింది. హోల్‌సేల్ ధరలపై ఉల్లిపాయలు, పామాయిల్, బియ్యం తదితర సరుకుల అమ్మకాలు చేపట్టారు. పామాయిల్ రూ.110లకు, ఇతర సరుకులను బయటి మార్కెట్లో కంటే కొంతమేర తగ్గింపు రేట్లు నిర్ణయించారు. నిర్వహణ సరిగా లేక కొద్దిరోజులకే చాలాచోట్ల ఇవి మూతపడిపోయాయి. ప్రస్తుత పరిస్థితిలో పప్పు దినుసులు, వంట నూనెలు తదితర వాటిని ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి తక్కువ ధరలకు విక్రయించాలని సామాన్య, మధ్యతరగతి ప్రజలు కోరుతున్నారు. -
అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలి
భీమవరం (ప్రకాశంచౌక్) : ప్రజల వినతులు, ఫిర్యాదులను అధికారులు స్వీకరించి పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్ఎస్లో 168, రెవెన్యూ క్లినిక్‌లో 32 అర్జీలు స్వీకరించారు. జేసీ కేఆర్ కల్పశ్రీ, ఇన్చార్జి డీఆర్వో పి.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని.. ● గణపవరం మండలం కోమర్రులో మంచినీటి చెరువులను బాగుచేయించాలని పత్తి రెడ్డి కోరారు. ● గణపవరం మండలం కాశిపాడు హైస్కూల్లో హిందీ, సోషల్ టీచర్లను నియమించాలని జె.వెంకటరత్నం వినతిపత్రం అందించారు. ● కాళ్ల మండలం ఏలూరుపాడులో తనకున్న 56 సెంట్ల భూమి 22ఏలో ఉండటంతో ఇబ్బంది పడుతున్నామని, పరిష్కరించాలని అడపా వెంకటలక్ష్మి అర్జీ అందించారు. ● పాలకోడేరు మండలం శృంగవృక్షంలో తన 52 సెంట్ల భూమికి సాగునీరందించే పంట బోదెను ఓ రైతు పూడ్చివేశారని బందెల మౌనిక ఫిర్యాదు చేశారు. -
మధ్యవర్తిత్వం 3.0పై అవగాహన
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి జిల్లాలో అక్టోబర్ 31 వరకు నిర్వహించనున్న మధ్యవర్తిత్వం 3.0 ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి ఆధ్వర్యంలో సో మవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం వద్ద ర్యాలీ ని ప్రారంభించి న్యాయమూర్తి శ్రీదేవి మాట్లాడుతూ గతేడాది 1.0, 2.0లో కేసుల పరిష్కారానికి విశేష కృషి చేశామని, అదే స్ఫూర్తితో 3.0 కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. వారం పాటు సదస్సులు నిర్వహిస్తామన్నారు. రాజీయోగ్యమైన కేసుల సామరస్య పరిష్కారానికి కృషిచేస్తామన్నా రు. అన్ని కోర్టుల పరిధిలో మధ్యవర్తులు ద్వారా కా ర్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మొదటి అద న పు జిల్లా జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని, 7వ అదనపు జిల్లా జడ్జి వైస్. శ్రీనివాసరావు, 8వ అదనపు జిల్లా జడ్జి ఐ.శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
5న కళాశాలల బంద్
భీమవరం: కళాశాలల విద్యార్థుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీ వీపీ ఆధ్వర్యంలో బుధవారం కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చినట్టు జిల్లా కన్వీనర్ రాయి వెంకట దుర్గాసాయి, భీమవరం విభాగ్ కన్వీనర్ కాయిత డిన్ను చందు చెప్పారు. సోమవారం కలెక్టరేట్ వద్ద బంద్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.6,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రవేశ పరీక్షలు పూర్తయి రెండు నెలలు గడిచినా సగం కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహించలేదన్నారు. కన్వీనర్ శ్యామ్ విజయరాజ్, పట్టణ సహాయ కార్యదర్శి దొమ్మేటి అనూష భవ్య పాల్గొన్నారు. భీమవరం: ప్రజాసమస్యలపై త్వరితగతిన స్పందించి, నిర్ణీత గడువులోపు చట్టపరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా అడిషినల్ ఎస్పీ డి.విశ్వనాథ్ ఆదేశించారు. జిల్లా పోలీసు ప్రధా న కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్య ల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంత రం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ పాల్గొన్నారు. భీమవరం : జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో టెట్ పరీక్షల ఏర్పాట్లపై సమీక్షించారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్, డీఎన్నార్ కళాశాల కేంద్రాల్లో బుధవారం నుంచి 16 వరకు రోజు కు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారన్నా రు. మొత్తంగా 4,812 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్టు చెప్పారు. పరీక్ష కేంద్రాల సమీప ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. ద్వారకాతిరుమల: శ్రీవారి హుండీల ఆదాయాన్ని సోమవారం దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, ఎంఎస్ఎన్ చారిటీస్ (కాకినాడ) ఈఓ సీహెచ్ సురేష్‌నాయుడు పర్యవేక్షణలో లె క్కించారు. గత 25 రోజులకు నగదు రూపంలో 2,81,82,065లు, 242 గ్రాముల బంగారం, 3.330 కిలోల వెండితో పాటు విదేశీ కరెన్సీ లభించినట్టు ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే లెక్కింపులోకి రాని రద్దయిన రూ.2,000, రూ.500 నోట్ల ద్వారా రూ.22 వేలు లభించిందన్నారు. సగటున రోజుకు రూ.11,27,283 ఆదాయం లభించిందన్నారు. ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా ఏపీపీటీడీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ప్రభు త్వం ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని, ఎలక్ట్రికల్ బస్సులను పూర్తిగా ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని 1,000 ఉద్యోగులు, ప్రజల నుంచి సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రా న్ని జేసీ అభిషేక్ గౌడకి సమర్పించారు. జిల్లా జేఏసీ చైర్మన్లు కె.రమేష్‌కుమార్, రాంబాబు, కో–కన్వీనర్ ఎన్.సురేష్, కె.రమేష్‌కుమార్ మాట్లాడుతూ ప్రైవేట్ సంస్థలకు అప్పగించ డం వల్ల ప్రజారవాణా దెబ్బతింటుందన్నారు. -
ఆస్పత్రిని డంపింగ్ యార్డుగా చేస్తారా?
పాలకొల్లు సెంట్రల్: ‘నియోజకవర్గంలో ఏ చిన్న విషయం జరిగినా తెలిసే మంత్రి గారికి, ఏరియా ఆస్పత్రి ప్రాంగణాన్ని డంపింగ్ యార్డుగా మారుస్తున్నా తెలియలేదనడం నమ్మశక్యంగా లేదు’ అని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి నూతన భవన ప్రాంగణంలో చెత్తతో ల్యాండ్ ఫిల్లింగ్ చేయడంపై సోమవారం ఆయన ఆస్పత్రి వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ ప్రాంగణంలో లెగసీ వేస్ట్‌తో పాటు చెత్తను కూడా పారబోయడంతో వర్షానికి డయాలసిస్ సెంటర్ పరిసరాలన్నీ తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి చిన్న అంశంపై అధికారులతో సమీక్షించే మంత్రి రామానాయుడికి ఈ విషయం తెలియదనడం విడ్డూరంగా ఉందని, నాటకాలకు స్వస్తి చెప్పి నిజాలు మాట్లాడాలని డిమాండ్ చేశారు. అలాగే కాంట్రాక్టర్ చేయాల్సిన పనిని మున్సిపల్ కార్మికులతో చేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, శానిటరీ సిబ్బందిని అక్కడి నుంచి పంపించివేశారు. ఆస్పత్రి ఆవరణలోని చెత్తను తక్షణమే తొలగించాలని ఆర్డీఓ, మున్సిపల్ ప్రత్యేకాధికారి దాసి రాజును డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంత్రి రామానాయుడు 2029లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాదని ముందే గ్రహించినట్టున్నా రని అందుకే అతిగా జగన్మామస్మరణ చేస్తున్నారని గోపి అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు యడ్ల తాతాజీ, కోరాడ శ్రీనివాసరావు, ఉచ్చుల స్టాలిన్, బండి రమేష్, మోర్త గిరీష్, పాలపర్తి కృపానాథ్, కర్రా జయసరిత, లోపింటి చిరంజీవి, కెల్లా దుర్గారావు, రేలంగి శ్రీనివాస్, పిల్లా శ్రీనివాసు, కొరగింజల హనుమంతురావు, జోగి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. పాలకొల్లులో వైఎస్సార్సీపీ నిరసన -
గోదావరి వరద తగ్గుముఖం
సిద్ధాంతంలో కేదారీఘాట్ వద్ద గోదావరి నరసాపురంలో పిండ ప్రదానం షెడ్డుపైకి వరద పెనుగొండ: గోదావరి వరద ఉధృతి నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. సోమవారం ఎగువ నుంచి వ రద నీరు రావడం తగ్గడంతో సిద్ధాంతం కేదారీఘాట్‌లో రెండు అడుగుల మేర నీటిమట్టం తగ్గింది. ఆ దివారం గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. అ యితే తగ్గుముఖం పట్టడంతో గోదావరి లంకల్లోకి రైతులు రాకపోకలు ప్రారంభించారు. అయినా అ ప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆచంట మండలంలో పెదమల్లం మాచేనమ్మ కట్ట లో ప్రవేశించిన వరద నీరు నెమ్మదిగా తగ్గుతోంది. కోడేరులో పుష్కర రేవులు బయట పడుతున్నాయి. గోదావరిలో పడవల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. లంక గ్రామాల్లో ప్రజలు మాత్రం ఆందోళనలోనూ ఉన్నాయి. ఎటువంటి సహాయం అందకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. నరసాపురంలో వరద ఉధృతి నరసాపురం: నరసాపురం వశిష్ట గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. పరీవాహక ప్రాంతాల ప్రజ లు భయపడుతున్నారు. స్థానికంగా నదిలో, గోదా వరి మాత విగ్రహంవద్ద నీటి మట్టం భారీగా పెరి గింది. వలంధరరేవు వద్ద పోలీసు పహారా ఏర్పా టు చేశారు. పడవల రేవులో పంటు రాకపోకలపై నిషేధం కొనసాగుతోంది. -
పంచాయతీ నిధులపై కన్ను!
● కూటమి నేతల వ్యూహాలు ● అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు ఇరగవరం : గ్రామ పంచాయతీల ఖాతాల్లోని నిధులపై కూటమి నేతలు కన్నేశారు. గ్రామాల అభివృద్ధికి కేటాయించిన నిధులను ఏ రకమైన నెపంతోనైనా వెలికితీయాలని కొందరు వ్యూహాలు రచిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాల్లోని 912 పంచాయతీల సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో, ప్రస్తుతం నిర్ణయాధికారం ప్రత్యేకాధికారుల చేతికి వచ్చింది. అయినా కూటమి నేతల రాజకీయ జోక్యం తగ్గలేదు. నేరుగా పనులు మంజూరు చేసే అధికారం లేకపోయినా, అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలమైన పనులను ఆమోదింపజేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో కొత్త పనుల అనుమతులు, బిల్లుల చెల్లింపుల విషయంలో అధికారులు అప్రమత్తంగా, ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పనులు చేయకుండానే బిల్లులు పొందడానికి.. మండల స్థాయి పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేకాధికారులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. నాయకులే స్వయంగా పనుల జాబితా తయారు చేసి అధికారులకు అందిస్తున్నారు. పనులు చేయకుండానే బిల్లులు పొందడానికి, లేదా పూర్తయినట్లు చూపించి నిధులు మళ్లించడానికి డ్రెయిన్లు, రోడ్ల మరమ్మతులు, పారిశుద్ధ్యం వంటి పనుల పేరిట ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఒకే పని కోసం కూటమిలోని నలుగురైదుగురు పోటీ పడుతుండటంతో అధికారులకు తలనొప్పిగా మారింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ముందే నిధులు కాజేయాలనే నేతల ప్రయత్నాలకు తలొగ్గకుండా నిధులను పరిరక్షించాలని పలువురు కోరుతున్నారు. -
‘నిట్టూ’రుస్తూ.. నెట్టుకొస్తూ..!
తాడేపల్లిగూడెం : ప్రతిష్టాత్మకంగా తాడేపల్లిగూడెంలో ఏర్పాటైన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆంధ్రప్రదేశ్ (ఏపీ నిట్) ప్రస్తుతం పాలనాపరమైన నిర్లక్ష్యం, అంతర్గత కోటరీ వ్యవస్థ కారణంగా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సంస్థ 8వ స్నాతకోత్సవం నిర్వహించనున్నారు. రెగ్యులర్ డైరెక్టర్ కరువు తొలి రెగ్యులర్ డైరెక్టర్ సీఎస్పీ రావు సస్పెన్షన్ తర్వాత ఇప్పటివరకు మరో రెగ్యులర్ డైరెక్టర్ ని యమితులు కాలేదు. పలువురు ఇన్చార్జి డైరెక్టర్లు మారినా పరిస్థితి చక్కబడలేదు. చివరకు ఎంపికై న రెగ్యులర్ డైరెక్టర్ కూడా బాధ్యతలు తీసుకోకుండా వెనుదిరిగేలా ఇక్కడి వాతావరణం తయారైంది. రెండేళ్ల క్రితం రెగ్యులర్ డైరెక్టర్ పోస్టు నియామకం కోసం నోటిఫికేషన్ వేసినా ఇప్పటికీ కొలిక్కిరాలేదు. ప్రస్తుతం వరంగల్ నిట్‌లో పనిచేస్తున్న డాక్టర్ ఎన్వీ రమణరావు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. కరిగిన సీట్లు.. ఆగిన అభివృద్ధి రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరనే సాకుతో గతంలో ఉన్న 720 సీట్లను 480కి తగ్గించారు. దీనివల్ల హోమ్ స్టేట్ కోటా కింద రావాల్సిన 240 సీట్లను ఏపీ విద్యార్థులు కోల్పోయారు. ర్యాంకింగ్స్‌లో వెనుకంజ గతంలో క్యాంపస్ సెలెక్షన్లలో ముందంజలో ఉన్న నిట్ ఇప్పుడు తీవ్రంగా దిగజారింది. కంపెనీలు రా క, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కక వె నుకబడింది. రూ.1,700 కోట్ల హెఫా నిధుల ప్రతిపాదనలు తగిన ఫాలోఅప్ లేక మూలనపడ్డాయి. మీడియాపై ఆంక్షలు క్యాంపస్ లోపల జరిగే అక్రమాలు బాహ్య ప్రపంచానికి తెలియకుండా మీడియా ప్రవేశంపై ఆంక్షలు విధిస్తూ, తామే సర్వం అనే రీతిలో నలుగురు నిట్‌ను తమ గుప్పెట్లో ఉంచుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ నిట్‌లో పడకేసిన అభివృద్ధి ఒక్క డైరెక్టర్‌తో సరి వెనక్కి వెళ్లిన 240 సీట్లు మీడియాపై ఆంక్షలు నేడు 8వ స్నాతకోత్సవం -
వైభవంగా ఎస్.జానకి స్వర నీరాజనం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): దక్షిణ భారతదేశ నైటింగేల్, గానకోకిల ఎస్.జానకి సుమధుర గీతాలకు స్వర నీరాజనం అర్పిస్తూ నగరంలో ప్రత్యేక సంగీత కార్యక్రమం అలరించింది. కేవీఎస్ ట్రస్ట్, రేహాన్స్ ఈవెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం వైఎంహెచ్ఏ హాలులోని కానాల గురుమూర్తి కళావేదికపై ఈ వేడుక ఘనంగా నిర్వహించారు. తొలుత దివంగత గాయని జానకి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేఎల్వీ నరసింహం ఆధ్వర్యంలో గాయనీ గాయకులు జానకి పాడిన ప్రజాదరణ పొందిన పాటలను ఆలపించి ప్రేక్షకులను మైమరిపించారు. హైదరాబాద్ నుంచి విచ్చేసిన ఎం.లలిత, రాంబాబు వేణువాయిద్యం, శాక్సోఫోన్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంగీత ప్రియులు, నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ సంగీత విభావరిని ఆశ్వాదించారు. -
వాహనం అదుపు తప్పి.. తల్లీకూతుళ్ల దుర్మరణం
తణుకులో దుర్ఘటన తణుకు అర్బన్: రోడ్డు ప్రమాదంలో తల్లి, కూతురు మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి తణుకు శివారులో చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవడంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన గంధం వంశీకృష్ణ తన భార్య లావణ్య (22), కుమార్తె కీర్తన (2)లను తీసుకుని ద్విచక్ర వాహనంపై తణుకు మీదుగా కొమరవరం రోడ్డులో వెళ్తుండగా స్థానికంగా ఉన్న ప్రైవేటు పాఠశాల వద్ద స్పీడ్ బ్రేకర్స్ ఎక్కిన తరువాత అదుపుతప్పి పడిపోయినట్టు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంలో లావణ్య ముఖభాగం పూర్తిగా ఛిద్రమైపోగా, చి న్నారి కీర్తనకు తీవ్రగాయాలయ్యాయి. ఘటన సమయంలో స్పీడ్ బ్రేకర్స్‌పై నుంచి వాహనం ఎక్కగానే వాహనం మీద నుంచి ఎగిరి సమీపంలో ఉన్న స్తంభానికి ఢీకొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న 108 వాహన సిబ్బంది హుటాహుటిన క్షతగ్రాత్రులను తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి వచ్చేసరికే కుమార్తె ప్రాణాలతో లేదని, తల్లి మాత్రం కొన ఊపిరితో కొట్టుకుని చనిపోయినట్టు వైద్యులు చెబుతున్నారు. వంశీకృష్ణ పరిస్థితి విషమంగా ఉండటంతో తణుకులో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఉండ్రాజవరం నుంచి లావణ్య తల్లి ఊరు గణపవరం మండలం భువనపల్లికి వెళ్తున్నట్టు బంధువులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న బంధువులు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపిస్తున్నారు. చిన్నారి మరణం బంధువులతోపాటు స్థానికులను కలచివేసింది. చిన్నారి కీర్తన, తల్లి లావణ్య మృతదేహాలు -
స్పందన
నూజివీడు : నెల రోజులుగా చికెన్, గుడ్డుకు దూరమైన నూజివీడు ట్రిపుల్ఐటీ విద్యార్థులకు ఎట్టకేలకు చికెన్ అందింది. విద్యార్థులకు ఆదివారం చికెన్‌తో భోజనం పెట్టారు. చికెన్, గుడ్డు అందించకపోవడంతో పోషకాహారం దూరమైందని ‘సాక్షి’లో గత నెల 17న, 27న వరుసగా కథనాలు ప్రచురించింది. దీంతో యూనివర్సిటీ అధికారులు పలు రకాలుగా ప్రయత్నించి చివరకు గతేడాది మాదిరిగా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. దీంతో విద్యార్థులకు ఒక్కొక్కరికి పులుసుతో కలిసి 150 గ్రాముల చికెన్‌ను భోజనంలో వడ్డించారు. ఇలా సుమా రు 8 వేల మందికి అందించారు. ఏఓ బి. లక్ష్మణరావు పరిశీలించారు. ‘సాక్షి’కి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. -
తగ్గింపు ధరలకే బియ్యం
భీమవరం (ప్రకాశం చౌక్): ప్రభుత్వం తక్కువ ధరలకే సన్నరకం బియ్యం విక్రయాలను ప్రారంభించినట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి, పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. ఆదివారం భీమవరం రైతుబజార్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌ను జేసీ కేఆర్ కల్పశ్రీతో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మూడు రైతు బజార్లు, 40 రైస్ మిల్లుల అవుట్లెట్లలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బి య్యం విక్రయాలు జరుగుతాయన్నారు. రేషన్ కార్డుకు 10 కిలోల చొప్పున స్టీమ్ బియ్యం కిలో రూ.52, రా బియ్యం కిలో రూ.50 చొప్పున అందజేస్తామన్నారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడారు. మార్కెటింగ్ ఏడీ సునీల్‌కుమార్, కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షబీనా బేగం, ఎస్టేట్ ఆఫీసర్ కల్యాణ్ పాల్గొన్నారు. -
లోతట్టు ప్రాంతాల్లోకి చేరుతున్న వరద నీరు
నరసాపురం రూరల్: నరసాపురం మండలంలో గోదావరి వరద ఉధృతి ఆదివారం మధ్యాహ్నం నుంచి క్రమంగా పెరుగుతోంది. ఎగువన ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో, దిగువకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో నరసాపురం మండల పరిధిలోని కొత్త నవరసపురం ఎస్టీ కాలనీతో పాటు పలు లోతట్టు ప్రాంతాలు ఆదివారం సాయంత్రానికి జలమయమయ్యాయి. పరిస్థితిని సమీక్షించేందుకు తహసీల్దార్ నాగార్జున ఆయా ప్రాంతాల్లో నిరంతరం పర్యటిస్తున్నారు. వరద ప్రభావం మరింత పెరిగితే బాధితులను సోమవారం నాటికి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశామని, సిద్ధంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు. ముందస్తు చర్యల్లో భాగంగా రెవెన్యూ, పంచాయతీ, సచివాలయ సిబ్బందితో నిరంతర గస్తీ ఏర్పాటు చేశారు. అలాగే కొత్త నవరసపురం, పాత నవరసపురం గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి బాధితులకు సేవలందిస్తున్నారు. వరద ముప్పు పెరిగితే తీసుకోవాల్సిన తదితర చర్యలపై సిబ్బందికి తహసీల్దార్ దిశానిర్దేశం చేశారు. -
నారు వ్యాపారానికి ఎల్‌నినో దెబ్బ
గణపవరం: ఏటా తొలకరి వచ్చిందంటే నారు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లు ఉండేది. జూన్ ఆరంభం నుంచి సుమారు నాలుగు నెలల పాటు ఈ వ్యాపారం జోరుగా సాగుతుంది. వివిధ రకాల కూరగాయలు, పూలమొక్కలు, విత్తనాలను వారపు సంతలతో పాటు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి అమ్ముతూ సుమారు 200 మంది చిరు వ్యాపారులు జీవనోపాధి పొందుతున్నారు. గణపవరం మండలం వల్లూరు, ముగ్గుళ్ల గ్రామాలకు చెందిన రైతులు దశాబ్దాలుగా నారు మొక్కలు సాగు చేస్తూ జిల్లాలోని పలు సంతల్లో అమ్ముతుంటారు. వర్షాలు పడగానే వంగ, టమాటా, పచ్చిమిర్చి, బంతి, చామంతి, గులాబి వంటి పూలమొక్కల నారును విక్రయిస్తారు. వీటితో పాటు తోటకూర, పాలకూర, బీర, బెండ వంటి పలు రకాల కూరగాయల విత్తనాలను సైతం అమ్ముతుంటారు. సంతలు లేని రోజుల్లో గ్రామాల్లో సైకిళ్లపై తిరుగుతూ రోజుకు మూడు నుంచి నాలుగు వేల రూపాయల వరకూ వ్యాపారం చేస్తుంటారు. ఎల్‌నినోతో కష్టాలు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు మొహం చాటేయడం నారు వ్యాపారాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. గత రెండు నెలలుగా వర్షాలు లేకపోవడంతో నారు మొక్కలు కొనేవారే కరువయ్యారు. దీనితో మొక్కలు ముదిరిపోయి వ్యాపారులకు నష్టాలు మిగిలాయి. విత్తనాలు కూడా అమ్ముడుపోక నిరుపయోగంగా మారే ప్రమాదం ఉందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. సాధారణంగా జూన్, జూలై నెలల్లో రైతులు పొలాల గట్ల మీద, ప్రజలు తమ ఇళ్ల పెరటిలో కూరగాయల మొక్కలు నాటుతుంటారు. కానీ, ఈ ఏడాది ఎండల తీవ్రతకు నాటిన మొక్కలు చనిపోతుండటంతో నారు పెంచడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు. దీనితో నారునే నమ్ముకున్న వ్యాపారులు జీవనోపాధి కోల్పోయారు. వల్లూరు నారుకు డిమాండ్ వల్లూరు, ముగ్గుళ్ల గ్రామాల్లో సాగుచేసే నారుకు జిల్లా వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంటుంది. ఈ గ్రామాలకు చెందిన రైతులు నాలుగు దశాబ్దాలుగా పొలం గట్లు, ఖాళీ స్థలాలు, చెరువు గట్ల మీద వివిధ రకాల నారు సాగు చేస్తుంటారు. 20 సెంట్ల నారుమడి తయారీ, సస్యరక్షణకు సుమారు రూ.30 నుంచి 40 వేల వరకు ఖర్చవుతుంది. మే చివరి వారంలో నారు మడులు వేసి జూన్ రెండో వారం నుంచి విక్రయిస్తారు. ఇక్కడి వంగ, మిరప, టమాటా నారు మంచి దిగుబడి ఇస్తాయని పేరు. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల గతంలో మాదిరిగా అమ్మకాలు లేవని వ్యాపారులు వాపోతున్నారు. కోతుల బెడదతో తగ్గిన ఆసక్తి గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల వద్ద ఖాళీ స్థలాలు, పొలం గట్లపై ప్రజలు, రైతులు ఎంతో ఆసక్తిగా కూరగాయలు పండించేవారు. కానీ, కొన్నేళ్లుగా కోతుల బెడద ఎక్కువైంది. కోతుల గుంపులు కష్టపడి పెంచిన మొక్కలను పీకేస్తూ, పందిళ్లను పాడు చేస్తున్నాయి. దీంతో ప్రజల్లో ఆసక్తి సన్నగిల్లి, ఆ ప్రభావం నారు వ్యాపారంపై పడింది. అమ్మకాలు లేక వ్యాపారం వెలవెల రెండు దశాబ్దాలుగా వారపు సంతల్లో నారు వ్యాపారం చేస్తున్నా, ఇప్పుడున్నంత గడ్డు పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. కరోనా సమయంలో దెబ్బతిన్న వ్యాపారం, మళ్లీ ఇప్పుడు ఎల్‌నినో వల్ల దారుణంగా పడిపోయింది. నారు పెంపకం, సస్యరక్షణ కోసం రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాం. కానీ సంతలో రోజుకు కనీసం వెయ్యి రూపాయలు అమ్మడమే గగనంగా మారింది. నారు ముదిరిపోయి వృథా అవుతోంది. ప్రభుత్వం మా లాంటి చిరు వ్యాపారులకు సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆదుకోవాలి. మంగెన రాంబాబు, నారు వ్యాపారి గతంలో వారపు సంతల్లో రోజుకు రూ.3–4 వేల వ్యాపారం జరిగేది. ఇప్పుడు రోజుకు నాలుగైదు వందలు అమ్మడమే కష్టంగా ఉంది. వర్షాభావ పరిస్థితుల వల్ల మహిళలు పూల మొక్కల పెంపకంపై ఆసక్తి చూపడం లేదు. గతంలో రైతులు, ఆక్వా రైతులు చెరువు గట్లపై కూరగాయల మొక్కలు నాటేవారు. ఈ ఏడాది వర్షాలు లేక వారు కూడా కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. బేతు శ్రీనివాసరావు, నారు వ్యాపారి -
రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించండి
భీమడోలు: ద్వారకాతిరుమల దేవస్థానం ఆధీనంలో భీమడోలు, కామవరపుకోట జూనియర్ కళాశాల్లో అధ్యాపకులుగా, నాన్–టీచింగ్ సిబ్బందిగా మూడు దశాబ్దాలుగా పనిచేసినా.. కొన్నేళ్లుగా దేవస్థానం యాజమాన్యం ఎలాంటి బెనిఫిట్స్, ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా పదవీ విరమణ చేయించిందని అధ్యాపకులు, నాన్–టీచింగ్ సిబ్బంది వాపోయిరు. ఆదివారం భీమడోలులో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఎంపీ పుట్టా మహేష్‌కుమార్, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు వద్ద తమ గోడును విన్నవించుకున్నారు. 5, 6 ఏళ్ల క్రితం పదవీ విరమణ చేసిన వారికి గ్రాట్యుటీ, పెన్షన్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నవరం దేవస్థానంలో ఉద్యోగులు రిటైర్ కాగానే వారందరికీ అన్ని సదుపాయాలను కల్పించారని, బదిలీపై ఇక్కడకు వచ్చిన ఈవో ఇవ్వకపోవడం దారుణమని వాపోయారు. మా జీవితాలతో దేవస్థానం అధికారులు ఆడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎంపీ ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్లు, ఇంక్రిమెంట్లు, పే స్కేల్స్ చెల్లించేలా తగు చర్యలు తీసుకుంటానని భరోసా కల్పించారు. -
ఉధృతంగా గోదావరి
● లంకలను ముంచుతూ ప్రవాహం ● దిగువన పెరుగుతున్న ఉధృతి ● ముంపులోనే కనకాయలంక కాజ్వే పెనుగొండ మండలం సిద్ధాంతంలో లంక భూముల్లోకి వరద పెనుగొండ: గోదావరిఽ ఉధృతంగా ప్రహిస్తుంది. సిద్ధాంతంలో గంటగంటకూ వరద నీరు పెరుగుతోంది. మధ్యస్థలంకకు వరద చేరుకోవడంతో కొబ్బరి, అరటి, కూరగాయల తోటలు ముంపు బారినపడ్డాయి. సిద్ధాంతం, నడిపూడి, పెదమల్లం, కోడేరు, భీమలాపురం, కరుగోరుమిల్లిల్లోని పుష్కర ఘాట్లు, స్నానాల రేవులు నీట మునిగాయి. అధికారులు సిద్ధాంతం మధ్యస్థలంకలోకి రాకపోకలను నిషేధించారు. పశువులు మధ్యస్థలంకలో వందాలాదిగా ఉండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు, నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో వెళ్లి పాలను తీసుకొస్తుంటారు. ఒక్కసారిగా గోదావరి ఉధృతి పెరగడంతో రక్షణ ఏర్పాట్లు చేసుకోలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వరదతో పాముల బెడద ఎక్కువవుతుందని, దీని వల్ల పశునష్టం జరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. అలాగే సిద్ధాంతం ఏటిగట్టుకు చేర్చి ఉన్న లంక భూముల్లోని కూరగాయలు, అరటి, కొబ్బరి, కోకో తోటలు పూర్తిగా నీట మునిగాయి. ఎక్కువ కాలం నీరు నిలిచి ఉంటి తోటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఆందోళనలో లంక గ్రామాలు ఆచంట మండలంలో అధికంగా గోదావరి మధ్యలో ఉన్న లంక గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఆందోళనకు గు రవుతున్నారు. పెదమల్లంలంక, అయోధ్యలంక, పు చ్చల్లంక, మర్రేమూల, కోడేరులంక, అణగారలంకల్లోని పల్లపు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోవడంతో నిత్యావసర వస్తువులు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వైద్య శిభిరాలు తప్ప ఇతర ఏర్పాట్లు చేయలేదు. ఆయా ప్రాంతాల్లో తా గునీటికి ఇబ్బంది పడుతున్నా కనీసం ప్రభుత్వం చ ర్యలు తీసుకోలేదని బాధితులు వాపోతున్నారు. ముంపులో అరటి, కొబ్బరి తోటలు సిద్ధాంతంలో నిండుగా ప్రవహిస్తున్న గోదావరి నరసాపురం: నరసాపురంలో వశిష్ట గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. మూడు రోజులుగా వరద నీటితో నీటిమట్టం పెరిగింది. వలంధరరేవులో పిండ ప్రదానాలు చేసే షెడ్డును తాకి వరద నీరు చేరి గోదావరి ప్రవహిస్తోంది. గోదావరి మాత విగ్రహం వద్ద నీటిమట్టం పెరిగింది. దీంతో వలంధరరేవులో స్నానాలను నిషేధించారు. పట్టణంలోని ఐదు చోట్ల ఉన్న అవుట్‌ఫాల్ స్లూయిజ్‌ల నుంచి వరద నీరు ఎగదన్నుతోంది. గోదావరి బండ్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతాలు రానున్న రెండు రోజుల్లో వరద తాకిడికి గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు పడవల రేవులో పంటు రాకపోకలు వరుసగా మూడో రోజు కూడా నిలుపుదల చేశారు. -
మద్దిలో హనుమద్ కల్యాణం
చింతలపూడి (జంగారెడ్డిగూడెం): జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఆదివారం శ్రీ సువర్చలా సమేత హనుమద్ కల్యాణం ఘనంగా జరిగింది. స్వామి జన్మ నక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ఈ కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. వేడుకలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించి తరించారని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వాహణాధికారిణి ఆర్.వి.చందన వెల్లడించారు. -
పెద్దింట్లమ్మా.. చల్లగా చూడమ్మా
కై కలూరు: అమ్మా.. కొల్లేటికోట పెద్దింట్లమ్మా.. చల్లంగా చూడమ్మా అంటూ భక్తులు ఆర్తితో వేడుకున్నారు. పెద్దింట్లమ్మను సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆదివారం దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకున్నారు. సమీప కోనేరులో స్నానాలు ఆచరించి, తలనీలాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ.. ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదాలు, గదుల అద్దెలు, అమ్మవారి ఫొటోల విక్రయాలు, వాహనపూజలు, విరాళాల ద్వారా రూ.1,30,161 ఆదాయం వచ్చిందని తెలిపారు. ముదినేపల్లి: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని మనస్తాపంతో ఎలుకల మందు తిని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ముదినేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరం గ్రామానికి చెందిన రమేష్ రొయ్యల చెరువు వద్ద మామిడి గురునాథం(33) నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. శనివారం భార్య దగ్గర రూ.200 మద్యానికి తీసుకున్నాడు. తిరిగి రాత్రికి మళ్ళీ డబ్బులు అడగగా, లేవని చెప్పడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడి నుంచి 108 వాహనంలో గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించాడు. భార్య ఫిర్యాదుపై ఆదివారం కేసు నమోదు చేశారు. -
వణికిస్తున్న పులి
● స్వర్ణవారిగూడెంలో గేదైపె దాడి ● పులిని పట్టుకునేందుకు ప్రత్యేక షూటర్లు బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలంలో సంచరిస్తున్న పులి పశువులపై దాడి చేసి చంపుతూ రోజుకో ఊరు మారుస్తోంది. అటవీ అధికారులకు చిక్కకుండా పెద్దపులి అందరిని భయాందోళనకు గురి చేస్తుంది. శనివారం బుట్టాయగూడెం మండలం మర్లగూడెంలో పూనె నుంచి వచ్చిన మత్తు నిపుణులకు దాదాపు పులి చిక్కినట్టే భావించారు. అయితే పులి భావించి వారికి చిక్కకుండా అటవీ ప్రాంతంలోని పాటెమ్మగుడి దాటుకుంటూ రాత్రి ఒంటి గంట సమయంలో పట్టెనపాలెం, అక్కంపేట మధ్యలో బస చేసింది. పులి అక్కడ ఉన్నట్లు రేడియో కాలర్ ద్వారా గుర్తించిన అధికారులు అక్కడికి చేరుకోగానే అక్కడి నుంచి జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెం వెళ్ళి అక్కడ గేదైపె దాడి చేసి చంపేసింది. అదే ప్రదేశంలో అటు జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి మండలాల సరిహద్దులో ఒక తోటలో మకాం వేసింది. మళ్లీ పులిని పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు పరంజిలు ఏర్పాటు చేశారు. ఇప్పటికై నా చిక్కుతుందో లేదోనని అటు అటవీశాఖ అధికారుల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఆందోళన నెలకొంది. ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు పులి స్వర్ణవారిగూడెం సమీపంలోనే మకాం వేయడంతో పాములవారిగూడెం, స్వర్ణవారిగూడెం గ్రామాలతోపాటు జంగారెడ్డిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రజలెవరూ భయబ్రాంతులకు గురికాకుండా ఉండాలని పులిని పట్టుకుని సురక్షితంగా తరలిస్తామని చెప్పారు. జిల్లా అటవీశాఖ అధికారి సందీప్ రెడ్డి పర్యవేక్షణలో సబ్ డీఎఫ్ఓ వెంకట సుబ్బయ్య, దావీదురాజు, దుర్గాప్రసాద్ బాబు, తదితరులు పులిని పట్టుకునేందుకు శ్రమిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేక బృందాలు కూడా వస్తున్నట్టు సమాచారం. -
పశువుల్లో గురక నివారణ ఇలా
చింతలపూడి: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పాడి పశువుల పెంపకానికి ప్రసిద్ధి. అనాదిగా పాడి పరిశ్రమను ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. వర్షాకాలం వచ్చిందంటే పశువులు రకరకాల అంటు రోగాల బారినపడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కొత్త నీరు మురుగుతో కలిసి కలుషితం కావడం, ఆ నీటిని పశువులు తాగడం వల్ల అంటు రోగాలు సోకి విలువైన పశు సంపదను కోల్పోయే ముప్పు ఉంటుంది. వర్షాకాలంలో గేదెలు, దూడలకు ఎక్కువగా వచ్చే వ్యాధి గురక.. దీనినే గొంతు వాపు వ్యాధి అని కూడా పిలుస్తారు. పశువుల్లో వచ్చే వ్యాధుల్లో ఇది అత్యంత ప్రమాదకరమైంది. గురక వ్యాధి సోకిన పశువులకు అందించాల్సిన చికిత్స, నివారణ చర్యల గురించి పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ కె. లింగయ్య సూచనలు తెలుసుకుందాం. ఎలా సంక్రమిస్తుంది? పాశ్చురెల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియా వల్ల పశువులు, గొర్రెలు, మేకల్లో వచ్చే ఈ వ్యాధి క్రిములు ఎడతెరిపి లేని ముసురు వాతావరణంలో వేగంగా వృద్ధి చెందుతాయి. కలుషితమైన నీరు, మేత, పరికరాలు, విసర్జకాలు, స్రావాలు, కళేబరాలు, మాంసం ద్వారా ఇవి వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇందుకు ఈగలు, దోమలు, ఇతర కీటకాలు కూడా దోహదపడతాయి. వ్యాధి క్రిములు శ్వాస, జీర్ణ వ్యవస్థలు, దోమ కాట్ల ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఎర్ర రక్తకణాలను ధ్వంసం చేస్తాయి. రక్తంలో ఆక్సిజన్ సరఫరాను దెబ్బతీస్తాయి. దీంతో ప్రాణవాయువు సరిగా అందక పశువులు గురక పెట్టడం, రొప్పడం, ఆయాస పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పశువుల శరీర ఉష్ణోగ్రత 106 నుంచి 108 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు పెరగడం, కనుపాపలు ఎర్రగా మారిపోవడం, మేత తినడం, నెమరు వేయడం ఆగిపోవడం, మెడ, గొంతు వాయడం వంటి లక్షణాలు బయటపడతాయి. వ్యాధి క్రిములు శరీరంలోకి ప్రవేశించిన 12 నుంచి 36 గంటల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో సరైన వైద్యం అందకపోతే మరో 12 నుంచి 24 గంటల్లో పశువు మరణించే ప్రమాదం ఉంది. గురక వ్యాధికి చికిత్స వ్యాధిని గుర్తించిన మరుక్షణమే రక్త పరీక్షలు నిర్వహించాలి. వ్యాధి సోకిన పశువును వెంటనే ఇతర పశువుల నుంచి వేరు చేయాలి. ప్రశాంత వాతావరణంలో పశువులకు పరీక్షలు చేయిస్తే మంచిది. ఈ పరిస్థితుల్లో పశువులను నిలబెట్టి మాత్రమే వైద్యం చేయడం శ్రేయస్కరం. యాంపిసిలిన్, క్లాక్సాసిలిన్, జెంటామైసిన్, సెఫలెక్సిన్ వంటి యాంటీబయాటిక్ మందులను పశువైద్యుల సూచనల మేరకు అవసరాన్ని బట్టి రక్తంలోకి ఎక్కిస్తే వేగంగా ఉపశమనం కలుగుతుంది. సాంబ్రాణి ధూపం వేయడం కూడా మంచిదే. వ్యాధి నిరోధక శక్తిని పెంచే మోమెజోల్ ఇంజెక్షన్లు, బి–కాంప్లెక్స్ ఇంజెక్షన్లు వాడాలి. బాగా నీరసించిన పశువుకై తే డెక్స్ట్రోజ్ సైలెన్లు ఎక్కించాల్సిన అవసరం కూడా ఉంటుంది. నివారణ చర్యలు గురక వ్యాధి సోకిన పశువులకు, రోగ కారకాలైన కలుషిత మేత, నీరు, పరికరాలకు ఇతర పశువులను దూరంగా ఉంచాలి. చనిపోయిన కళేబరాలను లోతుగా గొయ్యి తీసి పూడ్చివేయాలి. పరిసరాల్లో క్రిమికీటకాలు వృద్ధి చెందకుండా పొడిగా ఉంచాలి. డీడీటీ, గమేక్సన్, సైపర్ మెథ్రిన్, కార్బరిల్ వంటి క్రిమిసంహారకాలను చల్లి పరిసరాలను క్రిమిరహితం చేయాలి. పొరుగు ప్రాంతాల నుంచి కొత్తగా తెచ్చిన పశువులను కనీసం వారం రోజుల పాటు వేరుగా ఉంచి, వాటికి ఎలాంటి వ్యాధి లేదని నిర్ధారించుకున్నాకే మిగిలిన పశువులతో కలవనివ్వాలి. గురక వ్యాధి నివారణకు ప్రభుత్వం ఏటా ఉచితంగా టీకాలు వేయిస్తోంది. ప్రస్తుతం గురక వ్యాధి, జబ్బ వాపు, గాలికుంటు వ్యాధుల నిర్మూలనకు ఒకే వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. పశువైద్యుల సూచనల మేరకు ఈ టీకాలను తొలకరి తొలి దశలో లేదా ఎండలు ముదరక ముందే వేయిస్తే పశువులను ఈ ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. డాక్టర్ కె. లింగయ్య, పశుసంవర్ధక శాఖ ఏడీ -
గుర్తుతెలియని వ్యక్తి మృతి
తణుకు అర్బన్: తణుకు ఆర్టీసీ బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు తణుకు పట్టణ ఎస్ఐ సీహెచ్‌వీ సత్యనారాయణ తెలిపారు. సుమారు 55 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి అనారోగ్య కారణాలతో మృతిచెందినట్లు తెలిసిందని. మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచినట్లు వివరించారు. మృతుడిని గుర్తించిన వారు తణుకు పట్టణ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. తణుకు అర్బన్: తణుకు పట్టణ పరిధిలోని వెంకటరాయపురంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో రామదాసు వెంకటేశ్వరరావు(64) మృతి చెందారు. వెంకటేశ్వరరావు సైకిల్‌పై వెళ్తుండగా ఫిట్స్ రావడంతో ప్రమాదవశాత్తు అదుపు తప్పి కింద పడిపోయారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తణుకు రూరల్ ఎస్ఐ నాళం శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాలకొల్లు సెంట్రల్: ఆటోను వెనుక నుంచి మరో ఆటో ఢీకొట్టిన సంఘటనలో మహిళ మృతి చెందింది. రూరల్ పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం చింతపల్లికి చెందిన పడాల పద్మావతి(38) పాలకొల్లులో ఉంటున్న తన సోదరుడి ఇంటికి వెళ్లింది. మధ్యాహ్నం పని చూసుకుని తిరుగు ప్రయాణంలో పాలకొల్లులో ఆటో ఎక్కారు. దిగమర్రు బైపాస్ రోడ్డు వద్దకు వెళ్లేసరికి వెనుక నుంచి మరో ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ముందు ఆటోలో ఉన్న పద్మావతి రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు పద్మావతిని హుటాహుటిన పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సాయంత్రం 5:30 గంటలకు మృతి చెందారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. భీమడోలు: జాతీయ రహదారి భీమడోలు అయ్యప్పస్వామి ఆలయం వద్ద శనివారం రాత్రి బైక్ అదుపు తప్పిన ఘటనలో ఒక వ్యక్తి జారి పడి మృతి చెందాడు, ఏలూరుకు చెందిన పందిరిపల్లి రాము (59), విజయవాడకు చెందిన సంతాట సురేష్‌లు బాదంపూడిలో వడ్రంగి పనులు చేసేందుకు ఏలూరు నుంచి వస్తున్నారు. బైక్‌పై ఏలూరు వెళ్తుండగా, అయ్యప్ప స్వామి ఆలయం వద్దకు వచ్చేసరికి బైక్ ఒక్కసారిగా అదుపుతప్పడంతో రోడ్డుపై జారి పడ్డారు. బైక్ నడుపుతున్న రాముకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. రామును అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. సురేష్‌కు తీవ్ర గాయాలు కాగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. భీమడోలు ఎస్సై ఎస్కే మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముదినేపల్లి(కై కలూరు): భర్త వేధింపులు తాళలేక భార్య పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ముదినేపల్లి మండలం వైవాకలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వైవాక గ్రామానికి చెందిన నగుళ్ళ నరసింహరావుతో కై కలూరు మండలం వరహాపట్నంకు చెందిన వెంకట సత్యవతికి వివాహం జరిగింది. ఇటీవల పలు సార్లు భార్యభర్తల మద్య విభేదాలు రావడంతో సత్యవతి పుట్టింటికి వెళ్లింది. పెద్దలు సర్దిచెప్పి పంపించేవారు. ఆదివారం తిరిగి భర్త, అత్తతో గొడవ జరగడంతో మనస్తాపం చెంది సత్యవతి పురుగు మందు తాగింది. ఆమెను గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కై కలూరు: వేగంగా ఇద్దరు యువకులు వాహనంతో ఢీకొట్టిన ఘటనలో కై కలూరుకు చెందిన తాపీమేస్తీ గంధం రామయ్య(65) మరణించాడు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్దకు రామయ్య వాహనంపై వస్తుండగా పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామానికి చెందిన కొత్తపల్లి బాను, చందక ఉమామహేశ్వరరావులు అతి వేగంగా వాహనంతో ఢీకొట్టారు. రామయ్యను కై కలూరు ప్రభుత్వాసుపత్రి అక్కడ నుంచి ఏలూరు ప్రభుత్వాసుపత్రి తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. వాహనంతో ఢీకొట్టిన యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. -
వరదపై అప్రమత్తం
పెనుగొండ : కోడేరులో గోదావరి వరద పరిస్థితిని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదివారం పరిశీలించారు. వరద నీరు భారీగా వస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆచంట మండలంలోని అయోధ్యలంక, పెదమల్లంలంక, పుచ్చల్లంక, మర్రి మూలలంకల్లో ఏర్పాట్లు, పరిస్థితిపై ఆరా తీశారు. లంక గ్రామాల్లో గర్భిణులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వాటర్ గ్రిడ్ పనుల పరిశీలన మార్టేరు–కోడేరు రోడ్డులో జరుగుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులను కలెక్టర్ పరిశీలించారు. పైప్‌లైన్ పనులతో దెబ్బతిన్న రోడ్లను నాణ్యతతో పునరుద్ధరించాలన్నారు. ఆర్అండ్బీ అధికారి ఎ.శ్రీనివాస్, ఆర్డీఓ దాసి రాజు ఉన్నారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ వీరవాసరం: డీఎస్సీ–2025లో జరిగిన పేపర్ లీకేజీ, అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని, ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం నౌడూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు చెల్లించాల్సిన విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతిని అమలు చేయాలని కోరారు. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తే ఎవరూ భయపడేది లేదని హెచ్చరించారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప నాయకుడు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడి్డ్ అని కొనియాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను, అన్యాయాలను ప్రజలంతా గమనిస్తున్నారని, సరైన సమయంలో వారికి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని కవురు శ్రీనివాస్ అన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను సోమవారం భీమవరం కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ కూడా నిర్వహిస్తామన్నారు. ప్రజలు నేరుగా వెబ్సైట్, టోల్‌ఫ్రీ 1100 ద్వారా కూడా అర్జీలు సమర్పించవచ్చని సూచించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారిని కేంద్రాలకు తీసుకురాకుండా, వారి ప్రతినిధుల ద్వారా అర్జీలు అందజేయవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. ద్వారకాతిరుమల: శ్రీవారి దర్శనార్థం ఆ దివారం ఉదయం క్షేత్రానికి విచ్చేసిన ఓ వృద్ధ భక్తుడు తీవ్ర అస్వస్థతకు గుర య్యాడు. దేవస్థానం సిబ్బంది వెంటనే పీహెచ్‌సీకి తరలించా రు. వివరాలిలా ఉన్నాయి.. తణుకుకు చెందిన కె.సూర్యనారాయణ కుటుంబసభ్యులతో కలిసి క్షేత్రానికి వచ్చారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే దేవస్థానం ఆంబులెన్స్‌లో స్థానిక పీహెచ్‌సీకి తరలించగా, అక్కడ ప్రథమచికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం 108లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పోలవరం రూరల్: పోలవరంలో గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. దిగువన స్పిల్‌వే వద్ద 34.550 మీటర్ల వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. స్పిల్‌వే నుంచి 14.20 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. దిగువన వరద ప్రవాహం కొనసాగుతోంది. పట్టిసం శివక్షేత్రం వద్ద మె ట్లను తాకుతూ వరద ప్రవాహిస్తోంది. లాంచీలను తాత్కాలికంగా నిలిపివేశారు. -
చింతలపూడి.. నల్ల బంగారం సవ్వడి
చింతలపూడి: చింతలపూడి ప్రాంతం త్వరలోనే దేశంలోనే అతిపెద్ద ఇంధన హబ్‌గా మారబోతోంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ ఇటీవల నిర్వహించిన ఈ–వేలంలో చింతలపూడి, రేచర్ల బొగ్గు గనులను ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ సంస్థ దక్కించుకుంది. శనివారం రిలయన్స్ ప్రతినిధుల బృందం చింతలపూడి మండలంలో బొగ్గు నిల్వలు ఉన్న ప్రాంతాలను, గతంలో చేసిన సర్వే స్థలాలను ప్రత్యక్షంగా పరిశీలించింది. సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడితో ఇక్కడ భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి రిలయన్స్ సన్నాహాలు వేగవంతం చేసింది. 2029 నాటికి ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసి వాయు వెలికితీతను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 3,130 మిలియన్ టన్నుల బొగ్గు నిఽల్వలు కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ ప్రాంతంలో భూగర్భ బొగ్గు నిల్వలు భారీగా ఉన్నాయి. చింతలపూడి బ్లాక్‌లో 1,200 హెక్టార్ల విస్తీర్ణంలో 904.94 మిలియన్ టన్నుల ఎ–12 రకం బొగ్గు ఉన్నట్టు గుర్తించారు. రేచర్ల బ్లాక్‌లో 2,225 హెక్టార్ల విస్తీర్ణంలో 2,225.67 మిలియన్ టన్నుల ఎ–13 రకం బొగ్గు నిల్వలు ఉన్నాయి. మొత్తం రెండు బ్లాకుల్లో కలిపి 3,130.61 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ అంటే.. ఈ ప్రాంతంలో బొగ్గు పొరలు భూ ఉపరితలానికి 600 మీటర్ల కంటే లోతులో ఉండటం వల్ల మామూలు తవ్వకాల ద్వారా బొగ్గును బయటకు తీయడం అత్యంత ఖరీదైన వ్యవహారం. అందుకే రిలయన్స్ సంస్థ అండర్ గ్రౌండ్ గ్యాసిఫికేషన్ (యూసీజీ) విధానాన్ని ఎంచుకుంది. సాంకేతికత ఎలా పనిచేస్తుంది? భూమి లోపలి బొగ్గు పొరల్లోకి డ్రిల్లింగ్ ద్వారా పైపులు పంపిస్తారు. పరిమిత ఆక్సిజన్, ఆవిరిని పంపి భూమి లోపలే బొగ్గును పాక్షికంగా కాలుస్తారు. దీని వల్ల బొగ్గు వాయువుగా మారుతుంది. ఈ గ్యాస్‌ను పైపుల ద్వారా భూఉపరితలానికి తీసుకొచ్చి విద్యుత్ ఉత్పత్తికి, రసాయనాల తయారీకి ఉపయోగిస్తారు. ఈ పద్ధతి వల్ల ఓపెన్ కాస్ట్ గనుల మాదిరిగా వేలాది ఎకరాలు తవ్వాల్సిన అవసరం ఉండదు. పైన చెట్లు, పొలాలు దెబ్బతినవు. సాంప్రదాయ గనుల్లో జరిగే ప్రమాదాలు, ప్రాణనష్టాలు ఇందులో ఉండవు. పైగా వేలాది మంది చదువుకున్న యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. రైతుల్లో తీవ్ర ఆందోళన ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే చింతలపూడి, రాఘవపురం, ప్రగడవరం, లింగగూడెం, ఎరగ్రుంటపల్లి గ్రామాలతో పాటు తెలంగాణ సరిహద్దులోని సత్తుపల్లి వైపు ఉన్న ఖమ్మం జిల్లా సరిహద్దుల వరకు రిలయన్స్ సంస్థ ప్రభావం ఉంటుంది. కేవలం పైప్లైన్లు వేయడానికి, డ్రిల్లింగ్ రంధ్రాలు చేయడానికి, ప్లాంట్ నిర్మాణానికి మాత్రమే భూసేకరణ చేస్తామని చెబుతున్నా, భవిష్యత్తులో ఈ భూసేకరణ ప్రక్రియ ఏ మలుపు తిరుగుతుందోనని స్థానిక రైతులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ ప్రతికూలతలు చింతలపూడి ప్రాంతం అత్యంత సారవంతమైన భూములు, సమృద్ధిగా భూగర్భ జలాలు ఉన్న వ్యవసాయ ఆధారితం. యూసీజీ విధానం వల్ల కొన్ని తీవ్రమైన పర్యావరణ ముప్పులు పొంచి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు: తాగు, సాగునీరుపై ప్రభావం భూమి లోపల బొగ్గు కాలినప్పుడు ఫినాల్స్, బెంజిన్, పాదరసం వంటి ప్రమాదకర రసాయనాలు విడుదలవుతాయి. గ్యాసిఫికేషన్ జరిగే ప్రాంతం చుట్టూ ఉన్న మంచినీటి పొరల్లోకి ఇవి కలిస్తే, పరిసర ప్రాంతాల్లోని బావులు, బోరుబావుల నీరు విషపూరితంగా మారే ప్రమాదం ఉంది. ఇది తాగునీటికే కాక వ్యవసాయానికి కూడా పనికి రాకుండా పోతుంది. కఠిన నిబంధనలే శరణ్యం భూగర్భ జలాలు కలుషితం కాకుండా చూడటమే అతిపెద్ద సవాలు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, పర్యావరణ అనుమతులను కఠినంగా అమలు చేస్తేనే ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. లేకుంటే చింతలపూడి ప్రాంతంలో వ్యవసాయం, తాగునీటి వ్యవస్థపై కోలుకోలేని దెబ్బతీనే ప్రమాదం ఉందని స్థానికులు, పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. బొగ్గు నమూనాలు (ఫైల్) చింతలపూడి–రేచర్ల బొగ్గు గనులకు ఈ–వేలం రిలయన్స్ సంస్థ దక్కించుకున్న వైనం భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం 2029 నాటికి పూర్తిస్థాయి ప్లాంట్ పొంచి ఉన్న పర్యావరణ ముప్పు -
ప్లాస్టిక్ నిషేధం.. ఆచరణ శూన్యం
● విచ్చలవిడిగా పాలిథిన్ కవర్ల వాడకం ● పంట కాలువలు, డ్రెయిన్లలోకి వ్యర్థాలు ● చర్యలు తీసుకోకుంటే పర్యావరణానికి ముప్పు భీమవరం : ప్లాస్టిక్‌రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామంటూ అధికారులు చెబుతున్న మాటలు ఆచరణలో నీటిమూటలవుతున్నాయి. భూమి, నీరు కలుషితమై ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతున్నా ప్రజలు ప్లాస్టిక్ కవర్ల వాడకం మానడం లేదు. ‘గుడ్డ సంచులే ముద్దు’ అని స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పి స్తున్నా, వినియోగదారుల్లో మార్పు రావడం లేదు. దుకాణదారులు విచ్చలవిడిగా ప్లాస్టిక్ సంచులు ఇస్తున్నా, అధికారులు నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారు. గతంలో ప్రజలు బజారుకు వెళ్తే చేతితో గుడ్డ సంచి తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు కిరాణా, కూరగాయలు, హోటళ్లలో ఆహారం వరకు ప్రతీదీ ప్లాస్టిక్ కవర్లలోనే ప్యాక్ చేసి ఇస్తుండటంతో, చేతిసంచి తీసుకెళ్లడం నామోషిగా భావిస్తున్నారు. పేరుకుపోతున్న చెత్త భీమవరం పట్టణాన్ని ప్లాస్టిక్‌రహితంగా మార్చాలని కలెక్టర్ గట్టి సంకల్పంతో మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ముందస్తుగా కలెక్టరేట్లో ప్లాస్టిక్ రహిత వాతావరణం కోసం గాజు, స్టీల్ పాత్రల వినియోగాన్ని అమలుచేశారు. అయితే, మున్సిపల్ అధికారులు పట్టణంలో మొక్కబడిగా తనిఖీలు చేసి, కొద్దిపాటి జరిమానాలతో వదిలేస్తుండటంతో నిషే ధం ఏమాత్రం ఫలించడం లేదు. పంట కాలువలు, డ్రెయిన్లలో పేరుకుపోతున్న చెత్తే దీనికి నిదర్శనం. నిషేధాన్ని పాటించే కొద్దిమంది వ్యాపారులు, ప్లాస్టిక్ వాడే ఇతర వ్యాపారుల వల్ల బోణీలు లేక తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లా కేంద్రమైన భీమవరంలోనే ప్లాస్టిక్ నిషేధం సరిగ్గా అమలు కాకపోతే, ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఎలా సాధ్యమవుతుందని ప్రజ లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ప్లాస్టిక్ వాడకంపై కఠిన చర్యలు తీసుకోకపోతే పర్యావరణానికి తీవ్ర ముప్పు తప్పదు. -
క్యాంపస్ ఉద్యోగాలకు ఎంపిక
భీమవరం: భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఇంజనీరింగ్ విద్యార్థులు ఏడాది ప్రారంభంలోనే క్యాంపస్ సెలక్షన్స్‌లో 249 మంది ఉద్యోగాలు సాధించారని కళాశాల డైరెక్టర్ ఎం.జగపతిరాజు, ప్రిన్సిపల్ కె.వి.మురళీకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్.దిలీప్ చక్రవర్తి చెప్పారు. శనివారం కళాశాలలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. టీసీఎస్ సాఫ్ట్వేర్ సంస్థలో భారీ వేతనాలతో 249 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయన్నారు. ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్స్ సెల్ డీన్ కె.ఆర్.సత్యనారాయణ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా తమ కళాశాల విద్యార్థులకు టీసీఎస్‌లో అత్యధిక ప్రాధాన్యత లభిస్తుందని, దానికి విధి నిర్వహణలో వారు కనబరుస్తున్న పెర్ఫార్మెన్స్ కారణమన్నారు. -
కొల్లేరులో కానరాని నీరు
● ఆగస్టు వచ్చినా నిండని కొల్లేరు ● ఎగువ నుంచి తగ్గుతున్న నీటి వనరులు సూపర్ ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురుస్తున్నాయి. కొల్లేరుకు ప్రధానంగా డ్రెయిన్లు, కాల్వల నుంచి నీరు చేరుతుంది. వర్షాభావ పరిస్థితుల వల్ల నీటి శాతం తగ్గింది. గోదావరి జలాలను కొల్లేరుకు మళ్లించే అంశం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది. – ఎం.రామకృష్ణ, ఇరిగేషన్ డీఈఈ, కై కలూరుకై కలూరు: కొల్లేరులో జలకళ కనిపించడం లేదు. సూపర్ ఎల్ నినో ప్రభావం సరస్సుపై స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా ఆగస్టు నెలలో కొల్లేరు నీటితో నిండుకుండలా కళకళలాడుతూ, పరివాహక లోతట్టు ప్రాంతాలను ముంపుబారిన పడేసేది. కానీ, ప్రస్తుత పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఇప్పటికీ కొల్లేరు మధ్యలో పశువులు మేత మేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎగువ నుంచి కొల్లేరుకు చేరాల్సిన నీటి వనరులు నానాటికీ తగ్గుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నా, పాలకులు మాత్రం కొల్లేరును విస్మరిస్తున్నారు. కృష్ణా, గోదావరి నదీ డెల్టా ప్రాంతాల మధ్య కొల్లేరు సహజ సిద్ధమైన వరద నివారణ జలాశయంగా ఉంది. సరస్సులోకి ప్రతి ఏటా వర్షాకాలంలో సగటున 65 నుండి 110 టీఎంసీల నీరు చేరుతుంది. వేసవి కాలంలో 135 చదరపు కిలోమీటర్లకు పరిమితమయ్యే సరస్సు వైశాల్యం, వర్షాకాలంలో దాదాపు 901 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంది. సాధారణ రోజుల్లో ఇన్‌ఫ్లో సామర్థ్యం సెకనుకు 90 నుంచి 603 క్యూబిక్ మీటర్ల వరకు ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొల్లేరు నీటి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోలలో తీవ్ర వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. కొల్లేరులో కరువైన జలకళ ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 77,138 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు విస్తరించి ఉంది. రెండు జిల్లాల్లోని 122 గ్రామాల్లో సుమారు 3.50 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. కొల్లేరు సరస్సులోకి ప్రధానంగా 4 సహజ నదులు, వాగులతో పాటు 60కి పైగా ప్రభుత్వ, ప్రైవేటు నీటి పారుదల కాలువలు, డ్రెయిన్ల ద్వారా వరద నీరు చేరుతుంది. సాధారణంగా ఆగస్టులోనే కొల్లేరు పరవళ్లు తొక్కుతుంది. అలాంటిది, ఇప్పుడు పెదఎడ్లగాడి వద్ద నీటి ప్రవాహం లేక మధ్యలో పశువులు మేత మేస్తున్నాయి. ఈ నీటి కొరత ప్రభావం సహజ జాతి చేపలపై, అభయారణ్యంలో విహరించే పక్షులపై పడుతోంది. ముఖ్యంగా ప్రసిద్ధ ఆటపాక పక్షుల విహార కేంద్రంలోని చెరువులో నీటిని పూర్తి స్థాయిలో నింపకపోవడంతో బోటు షికారు నిలిచిపోయింది. నిలకడ లేని నీటి వనరులు కొల్లేరులోకి బుడమేరు నుంచి 30 శాతం, తమ్మిలేరు నుంచి 25 శాతం, రామిలేరు, గుండేరుల నుంచి 20 శాతం వరద నీరు చేరుతుంది. కృష్ణా, గోదావరి డెల్టా కాలువల మిగులు జలాలు, సముద్రపు ఉప్పునీటి పోటు ద్వారా ఏటా దాదాపు 9.6 టీఎంసీల నీరు చేరుతుందని అంచనా. నీటిని చేరవేసే ప్రధాన వనరులను దారి మళ్లించడం వల్ల సరస్సుకు చేరాల్సినంత నీరు రావడం లేదు. గోదావరి నీటిని కొల్లేరుకు మళ్లించాలని ప్రజలు కోరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. ఆటపాక పక్షుల కేంద్రంలో బోటు షికారు లేకపోవడంతో వెలవెలబోతున్న దృశ్యం మండవల్లి మండలం పెదఎడ్లగాడి ప్రధాన వంతెన వద్ద నీరు లేక పశువులు మేస్తున్న దృశ్యం కొల్లేరు అభయారణ్యంలో 18,000 ఎకరాల్లో ఆక్రమిత రొయ్యల, చేపల చెరువులు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. కొల్లేరుకు వరదల సమయంలో చేరే లక్షా 11 వేల క్యూసెక్కుల నీరు ఉప్పుటేరు ద్వారా దిగువకు వెళ్లాల్సి ఉండగా, కేవలం 12,000 క్యూసెక్కులు మాత్రమే వెళ్తోంది. మిగిలిన నీరు ఆక్రమిత చెరువుల్లోకి చేరుతోంది. అభయారణ్యంలో 5 నుంచి 10 అడుగుల ఎత్తులో చేపల చెరువుల గట్లు ఏర్పాటు చేయడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకాలు కలుగుతున్నాయి. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ) ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని పదేపదే హెచ్చరిస్తున్నా, రాజకీయ నాయకుల అండదండలతో ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. -
నీట మునిగిన కనకాయలంక కాజ్వే
యలమంచిలి: గోదావరిలో వరద నీరు పెరగడంతో కనకాయలంకవద్ద కాజ్వే నీట మునిగింది. గ్రామస్తుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా అధికారులు ఇంజన్ పడవలను ఏర్పాటుచేశారు. వరద ఉధృతిని పరిశీలించేందుకు జేసీ కేఆర్ కల్పశ్రీ, నరసాపురం ఆర్డీవో దాసి రాజుతో కలిసి కనకాయలంక వచ్చారు. వరద సహాయక చర్యలపై తహసీల్దార్ గ్రంధి నాగవెంకట పవన్‌కుమార్, ఎంపీడీఓ జేడీవీ ప్రసాద్‌కు సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 12 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారన్నారు. ఆదివారం మరో 15 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లంక గ్రామాల్లోని గర్భిణులు, దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రోగులను, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జేసీ ఆదేశించారు. పాఠశాలలను మూసివేయాలన్నారు. గ్రామంలోని హెల్త్ క్యాంపు, పశువైద్య శిబిరాలను జేసీ కల్పశ్రీ సందర్శించారు. కనకాయలంకలో నీటమునిగిన కాజ్వే కనకాయలంకకు పడవపై వెళుతున్న జేసీ, ఆర్డీఓ నరసాపురం: నరసాపురంలో వశిష్ట గోదావరి నీటిమట్టం భారీగా పెరుగుతోంది. రెండు రోజుల నుంచి నీరు పెరుగుతూనే ఉంది. శనివారం వలంధర్ రేవులో పిండ ప్రదానం షెడ్డుకు సమాంతరంగా నీటిమట్టం చేరింది. సముద్రం పోటు సమయంలో నీటిమట్టం మరింతగా పెరుగుతుంది. దీంతో భక్తులు స్నానాలకు దిగవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో గోదావరి స్నానాలు, పిండ ప్రదానాలకు వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు. పడవల రేవులో పంటు రాకపోకలను అధికారులు శుక్రవారం రాత్రి నుంచి నిలిపివేశారు. ప్రస్తుతానికి వరద పరిస్థితి అదుపులో ఉందని, అధికారులను అప్రమత్తం చేశామని నరసాపురం ఆర్డీఓ దాసి రాజు తెలిపారు. -
తల్లిపాల వారోత్సవాలు
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఈనెల 7 వరకు నిర్వహించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. భీమవరం కలెక్టరేట్లో శనివారం జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు అందించడం, మొదటి ఆరు నెలల వరకు పూర్తిగా తల్లిపాలే ఇవ్వడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రతి కుటుంబానికి వివరించాలని సూచించారు. నవ చేతన అప్లికేషన్ ద్వారా ఆరేళ్లలోపు పిల్లలకు నూరు శాతం ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. అనంతరం వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ పి.విజయలక్ష్మి, జిల్లా కో–ఆర్డినేటర్ పి.చంద్రశేఖర్, సీడీపీవోలు, అంగన్వాడీ సూపర్వైజర్లు పాల్గొన్నారు. భీమవరం: సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థులతో సైన్స్ ప్రాజెక్టులు తయారు చేయించి వారిని బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని డీఈఓ ఈ. నారాయణ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి నిర్వహిస్తున్న 32వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ పోస్టర్‌ను శనివారం ఆయన ఆవిష్కరించారు. జిల్లాలోని పాఠశాలల్లో 10 నుంచి 17 ఏళ్ల వయసున్న పిల్లలో ప్రాజెక్టులు తయారు చేయించాలన్నారు. అప్కాస్ట్ జిల్లా సమన్వయ అధికారి మల్లుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈనెల 15లోపు ప్రాజెక్టులకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 93942 38826లో సంప్రించాలని కోరారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ పీవీ సత్యనారాయణరాజు, పీఎంఎస్ కో–ఆర్డినేటర్ కె.కృష్ణారావు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు చేయాలని డీఆర్వో పెంచల ప్రభాకర్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. జాతీయ స్పూర్తి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలని, సీటింగ్, వీఐపీలకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, శానిటేషన్, తాగునీటి సరఫరా తదితర ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా పర్యవేక్షించాలనిఇ భీమవరం ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఆర్డీఓ కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సీపీఓ కె.శివపార్వతి, డీఈఓ ఈ.నారాయణ, వ్యవసాయ శాఖ జేడీ వెంకటేశ్వరరావు, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు టౌన్: బాలికను సోషల్ మీడియాలో వేధిస్తున్న వ్యక్తిని ఏలూరు వన్‌టౌన్ సీఐ కె.రామకృష్ణ చాకచక్యంగా అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు రూరల్ ప్రాంతానికి చెందిన బాలికకు సోషల్ మీడియాలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడి ప్రవర్తన నచ్చకపోవటంతో ఆమె సోషల్ మీడియా ఖాతాను బ్లాక్‌లో పెట్టింది. దీంతో ద్వేషం పెంచుకున్న సదరు వ్యక్తి సోషల్ మీడియాలో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో బాధితురాలు ఏలూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై వి.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు. వన్‌టౌన్ సీఐ రామకృష్ణ దర్యాప్తు ప్రారంభించారు. కర్నూలు జిల్లాకు చెందిన పరంపోగు విల్సన్‌బాబు అనే వ్యక్తి ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. శనివారం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని వన్‌టౌన్ సీఐ రామకృష్ణ తెలిపారు. -
పోషకాహారంపై మల్లగుల్లాలు
నూజివీడు: ఆర్జీయూకేటీ అధికారుల అసమర్థత, అనుభవరాహిత్యం, సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ట్రిపుల్‌ఐటీలో చదువుకుంటున్న దాదాపు 8,800 మంది పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదు. విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచినా విద్యార్థులకు కోడిగుడ్డు, చికెన్ వడ్డించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల తీవ్ర జాప్యం వల్ల ప్రజల్లో, తల్లిదండ్రుల్లో ట్రిపుల్ఐటీ పట్ల ఉన్న గౌరవం క్రమేణా తగ్గిపోతోంది. నామినేషన్ పద్ధతిలో కేటాయింపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా 2024 సెప్టెంబరులో పాత మెస్ కాంట్రాక్టర్లను తప్పించారు. అయితే పారదర్శకంగా టెండర్లు పిలవకుండా, నామినేషన్ పద్ధతిలో మెస్ నిర్వహణను ‘హరేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్’కు అప్పగించారు. ముందే తెలిసినా నిర్లక్ష్యం: తాము శాకాహారమే అందిస్తామని, చికెన్, కోడిగుడ్లు పెట్టలేమని ఫౌండేషన్ స్పష్టం చేసినప్పటికీ... అధికారులకు దూరదృష్టి, అవగాహన లేకపోవడంతో వారికి కాక వేరేవారికి టెండర్లు ఇవ్వకుండా అత్యుత్సాహంతో ఫౌండేషన్‌కే బాధ్యతలు అప్పగించారు. తాత్కాలిక ప్రత్యామ్నాయం విఫలం గతేడాది దసరా నుంచి నాన్–వెజ్ బాధ్యతలను క్యాంపస్‌లోని ‘హెల్పింగ్ హ్యాండ్స్’ (ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో నడిచే సంస్థ)కు అప్పగించారు. అయితే, ఈ విద్యాసంవత్సరంలో నాన్–వెజ్ పెట్టడం తమవల్ల కాదని హెల్పింగ్ హ్యాండ్స్ చేతులెత్తేయడంతో సమస్య మరింత జటిలమైంది. అధికారుల దిద్దుబాటు చర్యలు.. తాజా పరిస్థితి నెలరోజుల నుంచి చికెన్, గుడ్డు పెట్టకపోవడంతో వస్తున్న తీవ్ర విమర్శలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆర్జీయూకేటీ అధికారులు ఎలాగైనా సరే హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులను బతిమాలైనా సరే వారితోనే పెట్టించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు శుక్రవారం వారితో సమావేశం ఏర్పాటు చేసి చికెన్, గుడ్డు పెట్టేలా ఒప్పించినట్లు తెలిసింది. సేవా ధృక్ఫథంతో ఏర్పాటైన హెల్పింగ్ హ్యాండ్స్‌కు ఎలా ఇస్తారనే దానిపై గతంలోనే విమర్శలు వ చ్చినా మరలా ఆ సంస్థకే అప్పగించడం గమనార్హం. దీంతో ఇక నుంచి హెల్పింగ్ హ్యాండ్స్ బాధ్యతలు నిర్వర్తించే ఫ్యాకల్టీ గుడ్డు, చికెన్ పెట్టే పనిలో నిమగ్నం కానున్నారు. గుడ్డు, చికెన్ పెట్టడానికి ఒక విద్యార్థికి వారానికి రూ.46.20 కేటాయించిన నేపథ్యంలో వారానికి ఎన్ని రోజులు గుడ్డు, చికెన్ పెడతారో మన్ముందు తెలియనుంది. ట్రిపుల్‌ఐటీలో విద్యార్థులకు అందని గుడ్డు, చికెన్ మెనూలోనూ కోతలు నెల రోజులు దాటినా పిలవని టెండర్లు హెల్పింగ్ హ్యాండ్స్‌కు బాధ్యతలు -
ముంచేస్తోన్న బొండాడ డ్రెయిన్
వాండ్రంలో బొండాడ డ్రెయిన్ వంతెనపైకి చేరిన నీరు వాండ్రం పరిధిలో ముంపునకు గురైన వరిచేలు ఉండి: పనులు సమయానికి పూర్తి కాకపోవడంతో బొండాడ మేజర్ డ్రెయిన్ ఉప్పొంగి, సమీప గ్రామాలు, వరి చేలు ముంపునకు గురవుతున్నాయి. గత వేసవిలో మట్టిమాఫియా వల్ల ఇబ్బందులు రాగా, ప్రస్తుతం కాళ్ల మండలం కోపల్లె హైస్కూల్ వద్ద జువ్వల పాలెం రాష్ట్ర రహదారిపై నిర్మిస్తున్న వంతెన పనుల ఆలస్యమే దీనికి ప్రధాన కారణం. ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ పనులను నాలుగు నెలల్లో పూర్తి చేస్తామన్న అధికారులు, ఆరు నెలలైనా పూర్తి చేయకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. ప్రవాహ ఉధృతి పెరిగి.. ఉండి, ఆకివీడు, పాలకోడేరు మండలాల నుంచి వర్షపు నీరు డ్రెయిన్‌లోకి చేరడం, కోపల్లె వద్ద నీటి మళ్లింపు కాలువ వెడల్పు సరిపోకపోవడంతో ప్రవాహ ఉధృతి పెరిగింది. దీని వల్ల ఉండి, ఎన్నార్పీ అగ్రహారం, వాండ్రం గ్రామాల్లోని వరి పొలాలు మునిగిపోయాయి. వాండ్రం నుంచి రామాపురం, పెదపుల్లేరు, చినపుల్లేరు, సీసలి గ్రామా లకు వెళ్లే చిన్న వంతెనపై నుంచి వరద నీరు పారుతుండటంతో రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే.. వాండ్రం గ్రామంలోకి వరద నీరు చేరడమే కాకుండా, మీడియం, మైనర్ డ్రెయిన్లు బిగదన్నడంతో వరి నాట్లు కుళ్లిపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పనులు పూర్తయి వంతెన అందుబాటులోకి రావడానికి మరో నెల రోజులు పట్టేలా ఉంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోని అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంపులోకి వరి చేలు, లోతట్టు ప్రాంతాలు -
ముంచెత్తినది
ఆదివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2026వేలేరుపాడు: నిన్న మొన్నటి వరకు ఇసుక తెన్నెల్లో ఉన్న గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఉగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద శుక్రవారం రాత్రి నుంచే మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది, దీంతో గోదావరి పరీవాహక ప్రాంతవాసులు భయంతో వణికిపోతున్నారు. భద్రాచలం వద్ద శనివారం రాత్రి 9 గంటలకు నీటిమట్టం 54.50 అడుగులు పెరగడంతో 15,02,258 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలో కలుస్తోంది. శనివారం వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్లు నీట మునగ్గా.. మరికొన్ని గ్రామాలు జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. ఏ క్షణాన నీటిమట్టం పెరుగుతుందో అన్న భయంతో పరీవాహక ప్రజలకు కళ్లపై కునుకులేకుండా పోయింది. రెండో రోజు కూడా మండలంలో 32 గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. దిగువ ప్రాంతంలో వేలేరుపాడు మండల కేంద్రంలో ఐదు, టేకూరులో ఏడు, కాకిస్‌నూరులో పది, పేరటపల్లిలో ఆరు ఇళ్లు నీటమునిగాయి. దిగువ ప్రాంతంలో 16 గిరిజన గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఆయా గ్రా మాల్లో ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. మండలంలో పెద్దవాగు, ఎద్దెలవాగు, టేకూరు వా గు, మేళ్లవాగుల మీదుగా గోదావరి నీరు చేరడంతో రహదారులన్నీ నీటమునిగాయి. వేలేరుపాడు నుంచి రుద్రమకోట వెళ్లే రెండు వైపులా ఉన్న రహదారులు నీట మునిగాయి. వసంతవాడ నుంచి రుద్రమకోట వెళ్లే రహదారి, కన్నాయిగుట్ట వెళ్లే రహదారి, రేపాకగొమ్ము, తాట్కూరుగొమ్ము, తిర్లాపురం వెళ్లే రహదారులన్నీ నీటమునిగాయి. నార్లవరం–కొత్తూరు రహదారిలో మంచినీటి పంపు ప్రాంతంలో రహదారి నీట మునిగింది. ఎడవల్లి, ఎద్దెలవాగు, టేకూరు, వాగుల వద్ద, నార్లవరం కాలనీ, రేపాకగొమ్ము, రుద్రమకోట ప్రాంతాల్లో అధికారులు నాటు పడవలు ఏర్పాటు చేశారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు వీటిపై రాకపోకలు సాగిస్తున్నారు. జల దిగ్బంధనంలో ఉన్న రేపాకగొమ్ము గ్రామంలో 186 కుటుంబాలను తాడువాయి, కుక్కునూరు మండలం రాయికుంట, పునరావాస కాలనీ, వారి బంధువుల ఇళ్లకు తరలించినట్టు అధికారులు చెబుతున్నారు. వరద గోదావరి రెండోరోజూ జల దిగ్బంధంలోనే 32 గ్రామాలు వేలేరుపాడు, టేకూరు, కాకిస్‌నూరు, పేరంటపల్లిలో నీటమునిగిన ఇళ్లు ముంపులో రహదారులు.. స్తంభించిన రాకపోకలు భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ భయం గుప్పిట్లో నదీ పరీవాహక జనం -
క్వాంటం టెక్నాలజీస్ ప్రాజెక్టుపై సమీక్ష
నూజివీడు: జాతీయ క్వాంటం మిషన్ కింద నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఏర్పాటు చేసిన అండర్ గ్రాడ్యుయేట్ క్వాంటం టెక్నాలజీస్ బోధనా ప్రయోగశాల ప్రాజెక్టును సమీక్షించేందుకు భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ ఉన్నత స్థాయి బృందం శనివారం ట్రిపుల్‌ఐటీని సందర్శించింది. దీనిలో భాగంగా జాతీయ క్వాంటం మిషన్ డైరెక్టర్ జే.బి.వి.రెడ్డి, ఏపీ స్టేట్ క్వాంటం మిషన్ డైరెక్టర్ శ్రీధర్ సి.వి., టీ హబ్ సీఈఓ విజయ్ ఏ.రామానుజన్‌లతో పాటు ఆర్జీయూకేటీ ఛాన్సలర్ ఆచార్య కొత్తా మధుమూర్తి, ఐఐటీ తిరుపతి డైరెక్టర్ ఆచార్య కె.ఎన్.సత్యన్నారాయణలు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన క్వాంటం టెక్నాలజీ పోస్టర్ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ పోస్టర్ల ద్వారా విద్యార్థులు తమ సాంకేతిక ఆలోచనలు, పరిశోధనా విధానాలు, భవిష్యత్ అనువర్తనాలపై రూపొందించిన ప్రతిపాదనలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఉన్నత స్థాయి బృందం జాతీయ క్వాంటం మిషన్ లక్ష్యాల గురించి వివరించారు. క్వాంటం టెక్నాలజీలో మైనర్ డిగ్రీ అభ్యసిస్తున్న విద్యార్థులతో ప్రత్యేక ఇంటరాక్టివ్ సమావేశం నిర్వహించారు. క్వాంటం హార్డ్‌వేర్ ప్లాట్‌ఫారమ్‌లు, క్వాంటం అల్గోరిథంలు, పరిశోధనా అవకాశాలు, ఉన్నత విద్య, అంతర్జాతీయ స్థాయిలో కెరీర్ అవకాశాలు వంటి అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఆర్జీయూకేటీ వీసీ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణరావు, రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, డీన్ ఆఫ్ అకడమిక్స్ దువ్వూరు శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఈనెల 6వ తేదీ నుంచి జిల్లా స్థాయి అమరావతి ఛాంపియన్ షిప్ 2026 అంతర్ నియోజకవర్గాల క్రీడా పోటీలు, ఎంపికలు నిర్వహించనున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.ఏ.అజీజ్, సెట్వెల్ సీఈఓ కె.ఎస్.ప్రభాకర రావు, స్కూల్ గేమ్స్ సెక్రటరీ పి.అలివేలు మంగ ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని అల్లూరి సీతారామ రాజు స్టేడియంలో ఈ నెల 6 నుంచి 12 క్రీడాంశాలలో ఈ పోటీలు, ఎంపికలు జరుగుతాయన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 6వ తేదీన ఏలూరు అల్లూరి సీతారామ రాజు స్టేడియంలో అండర్–17 (బాలురు – బాలికలు), అండర్–23 (పురుషులు – మహిళలు) విభాగాలకు ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, హాకీ పోటీలు జరుగుతాయన్నారు. ఏఆర్‌డీజీకే నగరపాలక ఉన్నత పాఠశాలలో చెస్ పోటీలు జరుగుతాయని, 6, 7 తేదీల్లో అల్లూరి స్టేడియంలో కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్ పోటీలు, ఇండోర్ స్టేడియంలో వెయిట్ లిఫ్టింగ్, యోగా ట్రైనింగ్ సెంటర్లో యోగా పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. -
మధ్యస్త లంకను తాకుతూ..
పెనుగొండ: గోదావరికి వరద నీరు పోటేత్తడంతో ఉధృతంగా ప్రవహిస్తుంది. సిద్ధాంతం మధ్యస్థ లంకను తాకుతూ నిండుగా ప్రవహిస్తుంది. శనివారం సాయంత్రానికి కేదారీఘాట్లోని పుష్కరరేవుల పైభాగం వరకూ వరద నీరు చేరుకుంది. దీంతో గోదావరిలో పడవల రాకపోకలపై అధికారులు ని యంత్రణ పెట్టారు. మధ్యస్థలంకలోని పంట ఉత్పత్తులను పడవలపై రైతులు గట్టుకు చేర్చుకొంటున్నారు. సిద్ధాంతంలో వరద ఉధృతిని తహసీల్దార్ జి.అనితకుమారి పర్యవేక్షించారు. కోడేరులోని పుష్కర రేవుల్లోకి వరద నీరు చేరింది. ఆచంట మండలంలో లంక గ్రామాల్లో పునరావాస కేంద్రాల ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నారు. -
ఎల్‌నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
పెనుమంట్ర: ఎల్‌నినో కారణంగా సాధారణం కంటే 50 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, దీని ప్రభావం డెల్టా భూములపై పెద్దగా లేకపోయినా, బోర్ల కింద సాగుచేసే పంటలపై ఉండవచ్చని తెలిపారు. మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానంలో శనివారం శిక్షణ, సందర్శన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఏడీఆర్ డాక్టర్ పి.రాధిక మాట్లాడుతూ.. ఎల్.నినో కారణంగా రాష్ట్రంలో వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయని సాధారణం కంటే 50 శాతం తక్కువ వర్షపాతం నమోదయిందన్నారు. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.గిరిజా రాణి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల్లో కలుపు నివారణ చర్యలు ముఖ్యమన్నారు. ఇనుప ధాతు లోపం వచ్చే అవకాశం ఉందన్నారు. ఆకులు పసుపు రంగులోకి మారతాయని రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తక్కువ నీరు ఉన్నప్పుడు పొటాషియం నైట్రేట్ లీటరు నీటికి 10 గ్రాములు పిచికారీ చేయాలని, ఆరుతడి పద్ధతి పాటించాలని పొలం గట్లు గట్టిగా చేసుకోవడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ నీరు అందుబాటులో ఉన్నపుడు పంట మూన తిరిగిన దగ్గర నుంచి పిలకలు కట్టే దశ వరకు ఆరు తడి పద్ధతిలో నీటి తడులు పెట్టుకోవాలన్నారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన ఎంటీయూ 1462 రకాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ఈ రకంగా 135–140 రోజుల కాలపరిమితి ఉంటుందని తెలిపారు. జిల్లా వ్యవసాయాధికారి జెడ్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, జిల్లాలో 60,000 హెక్టార్లలో నాట్లు పూర్తయ్యాయని, వర్షాల వల్ల బాక్టీరియా ఎండాకు తెగులు ఆశించే అవకాశం ఉన్నందున రైతులను అప్రమత్తం చేయాలని కోరారు. అనంతరం ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది విత్తన గుళికల తయారీని, శాస్త్రవేత్తలు బ్రష్ కట్టర్ వినియోగాన్ని ప్రయోగాత్మకంగా చూపారు. శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం.వి.కృష్ణాజీ, వివిధ డివిజన్ల సహాయ వ్యవసాయ సంచాలకులు పాల్గొన్నారు. -
చిక్కని పెద్దపులి
బంధించేందుకు అధికారుల ప్రయత్నాలు విఫలం బుట్టాయగూడెం: గత 8 నెలలుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి అధికారులు వేసే ఎరకు చిక్కకుండా తప్పించుకోవడం చర్చనీయాంశంగా మారింది. గ్రామ శివారులో కట్టేసిన పశువులపై తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య పెద్దపులి విరుచుకు పడుతుంది. దాడి చేసి కడుపునిండా తిని రక్తం తాగుతుంది. పగలంతా పులికి అనువైన ప్రదేశాల్లో, పొదల్లో నిద్రపోయి చీకటి పడగానే మళ్లీ వేటకు బయల్దేరుతుంది. పెద్దపులి పేరు వినగానే గ్రామాల్లో ప్రజలు, రైతులు భయపడుతున్నారు. బుట్టాయగూడెం మండలంలో నాలుగు రోజులుగా మళ్లీ సంచరిస్తున్న పెద్దపులి కండ్రికగూడెం, పండుగూడెం గ్రామాల్లో పశువులపై దాడి చేసింది. శనివారం తెల్లవారుజామున మండలంలోని లక్ష్ముడుగూడెం, కొమ్ముగూడెం సమీపంలో కట్టేసి ఉన్న లేగదూడపై దాడి చేసింది. అక్కడి నుంచి మర్లగూడెం సమీపంలో ఉన్న జామాయిల్ తోటలో మకాం వేసింది. పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పులి దాక్కున్న ప్రదేశంలోనే పులిని పట్టుకునేందుకు పూణెకు చెందిన ప్రత్యేక నిపుణుల బృందాలు జామాయిల్ తోటలో మంచెలు ఏర్పాటు చేసారు. పులికి ఎరను ఏర్పాటు చేశారు. మత్తు ఇచ్చేందుకు గన్ను సిద్ధం చేసుకుని సాయంత్రం ఆరున్నర వరకూ సిద్ధంగా ఉన్నారు. పెద్దపులి వారి ఎత్తులకు చిక్కకుండా ఆ ప్రదేశం నుంచి పాటెమ్మ గుడివైపు నడుచుకుంటూ వెళ్ళిపోవడంతో అధికారుల ప్రయత్నాలు ఫలించలేదు. పెద్దపులి కొమ్ముగూడెం, లక్ష్ముడుగూడెం, బూసరాజుపల్లి, పట్టినపాలెం గ్రామాల పరిసర ప్రాంతాల్లో సంచరించడంతో ఆయా పరిసర ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బుట్టాయగూడెం మండలంలోని కొమ్ముగూడెం, లక్ష్ముడుగూడెం సమీపంలో కట్టేసిన ఆవు, గేదె దూడపై శనివారం ఉదయం పెద్దపులి దాడి చేసి చంపేసింది. లక్ష్ముడుగూడెం చెందిన నారం నాగేశ్వరరావుకు చెందిన ఆవుపై దాడి చేసి హతమార్చింది. కంగాలవారిగూడెంకు చెందిన మడకం సురేష్‌కి చెందిన లేగదూడపై దాడి చేసింది. పశువులు మృతి చెంది ఉండటంతో ఆందోళన చెంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. -
కాలేయంలో అరుదైన తిత్తి తొలగింపు
తణుకు అర్బన్: కాలేయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న రోగికి అరుదైన శస్త్రచికిత్స చేసినట్లు తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాకర్లమూడి సాయికిరణ్ తెలిపారు. రోగి బి.ఇస్రాయేల్ (62) కాలేయ సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరగా, వైద్య పరీక్షల అనంతరం ఆస్పత్రిలోని సీనియర్ జనరల్ సర్జరీ వైద్యుడు డాక్టర్ చక్రధర్ శస్త్రచికిత్స చేసి కాలేయంలో ఉన్న అరుదైన తిత్తిని తొలగించినట్లు వివరించారు. మత్తు వైద్యుడు డాక్టర్ శ్రీనివాసరాజు, వైద్య బృందం ఎంతో శ్రమించి ఈ అరుదైన శస్త్రచికిత్సను చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ద్వారకాతిరుమల: చిన్నతిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగింది. ఆషాఢ మాసం కావడంతో పాటు, తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షం కారణంగా భక్తుల రాక తగ్గింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూ లైన్లు, కల్యాణకట్ట, ప్రసాదాల విక్రయాల కౌంటర్ల వద్ద సాయంత్రం వరకు భక్తుల రద్దీ సాధారణంగానే కనిపించింది. వచ్చిన భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారికి మొక్కులు చెల్లించుకుని, దర్శించుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచి, దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. తాడేపల్లిగూడెం: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు శనివారం పట్టుకున్నారు. 27వ వార్డులో ఆటోలో తీసుకెళ్తున్న 600 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదుచేశారు. -
నిట్ స్నాతకోత్సవానికి ముస్తాబు
● 4న వేడుకలు ● 2022–26 బ్యాచ్ విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్ ఎనిమిదో స్నాతకోత్సవం ఈనెల 4న నిర్వహించ నున్నట్టు అధికారులు తెలిపారు. 2022–26 బ్యాచ్ విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేయనున్నారు. 2015లో ఏర్పాటు.. 2015లో ఏపీ నిట్‌ను ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సును ఎనిమిది బ్యా చ్‌లు పూర్తిచేసి 2022–26 బ్యాచ్‌గా 492 మంది బా లురు, 152 మంది బాలికలు సంస్థ నుంచి బయటకు వెళుతున్నారు. వీరితో పాటు పీహెచ్డీ పూర్తి చేసిన 53 మంది పరిశోధక విద్యార్థులు డాక్టరేట్ ప ట్టాలు అందుకోనున్నారు. సంస్థలో ఎనిమిది కో ర్సులు నిర్వహిస్తుండగా, ఆయా కోర్సుల్లో అత్యధిక గ్రేడ్ పాయింట్లు సాధించిన ఒక్కో విద్యార్థి చొప్పున ఎనిమిది మంది బ్యాచ్ వారీగా, అద్భుత ప్రతిభ కనపర్చిన ఒక విద్యార్థికి ఇనిస్టిట్యూట్ తరఫున బంగారు పతకాన్ని అందజేయనున్నారు. అతిథులు వీరే.. ఏపీ నిట్ ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్వి.రమణరావు అధ్యక్షతన జరుగనున్న స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా ఐ ల్యాబ్స్ గ్రూప్ చైర్మన్ చింతలపాటి శ్రీనివాసరాజు, ఐఐటీ తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కలిదించి ఎన్.సత్యనారాయణ, నిట్ ఇన్చార్జి రిజిస్ట్రార్ పి.దినేష్ శంకరరెడ్డి హాజరు కానున్నారు. ఏపీ నిట్ డీన్ అకడమిక్ డైరెక్టర్ ఎన్.జయరామ్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. విభాగం పేరు పాయింట్లు బయో టెక్నాలజీ ఊర్వశి పాల్ 8.78 కెమికల్ ఇంజనీరింగ్ ఖండాల చంద్రశేఖర్ 9.20 సివిల్ ఇంజనీరింగ్ ఉజ్వల పాండే 9.56 సీఎస్ఈ కలిదిండి శ్రీధర్‌వర్మ 9.53 ఈఈఈ విపుల్ యాదవ్ 9.53 ఈసీఇ సమయమంతుల అవ్యక్త 9.73 మెకానికల్ కొతూరు సుభాష్ 9.41 ఎంఎఐ తండుడి తేజామణిదీప్ 9.38 అత్యధిక గ్రేడ్ పాయింట్లు సాధించిన సమయమంతుల అవ్యక్త ఇనిస్టిట్యూట్ తరఫున, కోర్సులో రెండు బంగారు పతకాలను అందుకోనున్నారు. -
● మావుళ్లమ్మకు మనసారె
భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మవారికి శనివారం పట్టణంతో పాటు ఇతర గ్రామాల నుంచి అమ్మవారి సేవలో పాల్గొనే మహిళా భక్తులు సుమారు 2 వేల మంది సారె సమర్పించారు. సుమారు వెయ్యి కిలోలకు పైగా మిఠాయిలు, పండ్లు సమర్పించినట్టు ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. సుమారు 1500 మంది భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేసినట్టు చైర్మన్ బొండాడ నాగ భూషణం తెలిపారు. ఆలయంలో ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా సేవకులు మద్దాల విజయలక్ష్మి, కొప్పర్తి దేవిఆదిలక్ష్మికి దేవస్థానం తరఫున సత్కారం చేశారు. ధర్మకర్తలు పాల్గొన్నారు. – భీమవరం (ప్రకాశంచౌక్) -
మెగా కాదు దగా డీఎస్సీ
భీమవరం (ప్రకాశంచౌక్): తొలి సంతకం అంటూ మెగా డీఎస్సీ పేరుతో ఆర్భాటంగా ప్రచారం చేసి టీచర్ల నియామకాల్లో అంతులేని అక్రమాలు చేశారని, డీఎస్సీ స్కామ్ సూత్రధారి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చే యాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి డీఎస్సీ అవకతవకలపై నిరసన తెలియజేసి అనంతరం డీఆర్వో కె.ప్రభాకర్‌కు సీబీఐ విచారణ చేయించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం ప్రసాదరాజు మాట్లాడుతూ డీఎస్సీ–2025లో 16 వేలకుపైగా టీచర్ పోస్టుల భర్తీ చేపట్టగా స్పోర్ట్స్ కోటా కింద 421 ఉపాధ్యాయ పోస్టులకు రాత పరీక్ష లేకుండా క్రీడా ప్రతిభ, సర్టిఫికెట్ల ఆధారంగా ఎంపిక చేశారన్నారు. అందుకోసం ప్రత్యేకంగా జీఓలు జారీ చేసి కనీసం డిగ్రీ, టెట్‌లో అర్హత లేకున్నా కేవలం శాప్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చేయడం దారుణమన్నారు. అంతులేని అక్రమాలతో కూడిన ఈ డీఎస్సీ పరీక్షపై తమ పార్టీ స్పష్టంగా ఆధారాలు చూపించిందన్నారు. అయితే పొంతన లేని సమాధానాలతో ఈ ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోందని మండిపడ్డారు. వాస్తవాలు ఒప్పుకోకుండా ప్రగల్భాలు దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన ఉపాధ్యాయ నియామకాల్లో ఒక్క అక్రమం జరిగినా అది మొత్తం విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తుందని ప్రసాదరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెబుతున్నట్లు అవకతవకలు జరగకపోతే సీబీఐ వంటి స్వతంత్ర సంస్థతో విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని నిలదీశారు. విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించాలి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యాదీవెన, వసతిదీవెనల పథకాలకు పూర్తిగా మంగళం పాడిందని ముదునూరి ధ్వజమెత్తారు. ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున మొత్తంగా రూ.9,100 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయన్నారు. అలాగే వసతి దీవెన బకాయిలు రూ.3,300 కోట్ల వరకు ఉన్నాయన్నారు. అలాగే సూపర్‌సిక్స్‌లో భాగంగా యువతకు ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ భృతి మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏడాదికి 4 లక్షలు, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల మాటేంటని, అప్పటివరకూ నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగి భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై వైఎస్సార్సీపీ నిత్యం పో రాటం చేస్తూనే ఉంటుందన్నారు. ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనపై రాజీలేని పోరాటం చేసి ప్రజలకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్లమెంట్ సమన్వయకర్త గూడూరి ఉమాబాల, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, నియోజకవర్గాల ఇన్చార్జులు చినమిల్లి వెంకటరాయుడు, వడ్డి రఘురాం, మంతెన యోగేంద్రకుమార్, ఎస్ఈసీ మెంబర్లు పాతపాటి శ్రీనివాసరాజు, పెండ్ర వీరన్న, సుబ్బరాజు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్లమెంట్ సెక్రటరీలు వేండ్ర వెంకటస్వామి, ఏఎస్ రాజు, యడ్ల తాతాజీ, యూత్ వింగ్ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, స్టూడెంట్ వింగ్ జిల్లా అధ్యక్షుడు అరిగెల్ అభి షేక్,స్టేట్ స్టూడెంట్ సెక్రటరీ గంటా రాహుల్, పా ర్టీ పట్టణాధ్యక్షుడు గాదిరాజు రామరాజు, గొర్రెల శ్రీ ను, అంబటి రమేష్, సీతారామయ్య, దుర్గా ప్ర సాద్, ఉండి జెడ్పీటీసీ రణస్థల మహాంకాళి, ఉండి ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణ పాల్గొన్నారు. నిరుద్యోగులను మోసం చేస్తూ నిర్వహించిన 2025 డీఎస్సీ అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలి. డీఎస్సీలో పలు అవకతవకాలు జరిగాయని తమ పార్టీ నుంచి ఆధారాలు చూపుతున్నా ప్రభుత్వం డీఎస్సీ విచారణకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. – ముదునూరి మురళీకృష్ణంరాజు, వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకుడు డీఎస్సీ–2025 మొత్తం అక్రమాల పర్వంగా సాగింది. గత ప్రభుత్వంలో కన్వీనర్‌గా ఉన్న అధికారిని మార్చారు. ప్రశ్నాపత్రాల తయారీ, స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల వరకూ చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే జరిగింది. జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన వారు కాకుండా జిల్లాస్థాయిలో ప్రతిభ చాటిన వారికి ఉద్యోగాలు ఇచ్చారు. – గూడూరి ఉమాబాల, నరసాపురం పార్లమెంట్ సమన్వయకర్త డీఎస్సీలో అక్రమాలు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలి విద్యా, వసతి దీవెన బకాయిలు చెల్లించాలి వైఎస్సార్సీపీ నాయకుల ధ్వజం -
బస్సులు లేక.. ప్రయాణాలు సాగక..
భీమవరం (ప్రకాశంచౌక్): భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభానికి విచ్చేస్తున్న ప్రధాని మోదీ కార్యక్రమానికి విజయనగరం జిల్లా నుంచి జనాన్ని తరలించడం కోసం పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగు డిపోల నుంచి 100 ఆర్టీసీ బస్సులను శుక్రవారం విజయనగరం జిల్లాకు పంపించారు. భీమవరం, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం డిపోల నుంచి 25 బస్సుల చొప్పున తరలించడంతో జిల్లాలో ప్రయాణికులకు బస్సుల కొరత ఎదురైంది. దీంతో బస్సుల కోసం రోడ్లపై, బస్టాండ్ల వద్ద గంటల తరబడి వేచి చూసే పరిస్థితి. దీనిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
న్యాయ సేవాధికార సంస్థ పథకాలపై సమీక్ష
భీమవరం: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్, మూడో అదనపు జిల్లా జడ్జిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్ బి.లక్ష్మీనారాయణ తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పథకాలపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పలు పథకాలను వివరించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ డిప్యూటీ కార్యదర్శి, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) హెచ్.అమర రంగేశ్వరరావు పథకాల పనితీరు, అమలు పరిచే క్రమంలో ఎదురయ్యే సమస్యలను అడిగారు. పథకాల అమలులో సమస్యలు ఎదురైతే సంస్థ దృష్టికి తీసుకు రావాలన్నారు.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సి విల్ జడ్జి (సీనియర్ డివిజన్) ఎన్.శ్రీలక్ష్మి, బార్ అ సోసియేషన్ అధ్యక్షుడు యేలేటి యోహాన్ (న్యూటన్), డీఎస్పీ రఘవీర్ విష్ణు, మాతా శిశు సంరక్షణ, సాధికారత జిల్లా అధికారి డి.క్షలక్ష్మి, పిల్లల సంరక్షణ జిల్లా అధికారి ఆర్.రాజేష్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. -
పారదర్శకంగా ఓటర్ల చేర్పులు, మార్పులు
డీఆర్వో ప్రభాకర్ భీమవరం (ప్రకాశంచౌక్): ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పుల ప్రక్రియను తప్పులు లేకుండా, వంద శాతం పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.పెంచల్ ప్రభాకర్ సూచించారు. కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 14,75,036 మంది ఓటర్లలో ఇప్పటికే 13,89,592 ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలనలో 43,746 మంది మరణించినట్లు, 22,131 మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు, 15,676 మంది ఇతర చోట్ల నమో దైనట్లు, 3,816 మంది అందుబాటులో లేనట్లు గుర్తించామన్నారు. పెండింగ్‌లో ఉన్న 85,444 ఫారాల సమస్యను త్వరగా పరిష్కరించేందుకు పార్టీలు సహకరించాలని కోరారు. ముఖ్యంగా తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం నియోజకవర్గాల్లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లు, బూత్ లెవల్ అధికారులతో కలిసి మరణించిన, వలస వెళ్లిన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా సరిచూసుకోవాలని ఆదేశించారు. జిల్లా ఎన్నికల సూపరింటెండెంట్ హెచ్.చంద్రశేఖర్, రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
గళమెత్తిన స్కీమ్ వర్కర్లు
భీమవరం: సంబంధం లేని పనులు సైతం చే యించుకుంటూ స్కీమ్ వర్కర్లతో వెట్టి చేయికుంటున్న ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, ప్రభుత్వానికి తగిని గుణపాఠం చెబుతామంటూ స్కీమ్ వర్కర్లు గర్జించారు. తమ సమస్యలను చెప్పుకోడానికి కలెక్టరేట్‌కు వస్తే ఒక్క అధికారి కూడా అందుబాటులో లేకుండా ప్రభుత్వం కుట్ర చేసిందంటూ మండిపడ్డారు. శుక్రవారం జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆశ, ఐకేపీ, మిడ్డే మీల్స్ కార్మికులు భీమవరంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ముందుగా కలెక్టరేట్ సమీపంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వాసుదేవరావు మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లంటే ప్రభుత్వానికి బానిసలు కాదన్నారు. సంబంధం లేని పనులను స్కీమ్ వర్కర్ల అన్యాయంగా చేయించుకుంటున్నారని, సమస్యలు చెప్పేందుకు కలెక్టరేట్‌కు వస్తే ఉన్నతాధికారులు లేకపోవడం దారుణమని దుయ్యబట్టారు. శ్రామిక మహిళ నాయకురాలు డి.కళ్యాణి, అంగన్వాడీ నాయకురాలు ఎండీ హసీనా, ఆశ వర్కర్ల యూనియన్ నాయకురాలు సీహెచ్ లక్ష్మి, ఐకేపీ నాయకురాలు గో విందమ్మ మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో ఊక దంపుడు ఉపన్యాసాలిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు కార్మికుల సమస్యలను పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. అనంతరం కలెక్టరేట్ వద్దకు చేరుకుని పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్లను తోసుకువచ్చారు. కలెక్టరేట్ గుటు వద్ద బైఠాయించారు. వీరి వద్దకు డీఆర్వో వచ్చి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. సీఐటీయూ జిల్లా నాయకులు పీవీ ప్రతాప్, ఎం.ఆంజనేయులు, గొర్ల రామకృష్ణ, తెలగంశెట్టి సత్యనారాయణ, ఎస్. రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
ముసాయిదా సిద్ధం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ముసాయిదా జాబితా విడుదలైంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ముసాయిదా జాబితాను అందజేశారు. ప్రధానంగా రెండు జిల్లాల్లో మృతి చెందిన ఓట్లు సుమారు 99 వేల పైగా, అలాగే వలస వెళ్ళిన ఓట్లు 46 వేలు ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. రెండు జిల్లాలో సమావేశాలు సర్ కార్యక్రమానికి సంబంధించి ఉమ్మడి పశ్చిమలో ముసాయిదా జాబితాను విడుదల చేశారు. ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధ్యక్షతన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరగ్గా, పశ్చిమగోదావరిలో డీఆర్వో బి.పెంచల ప్రభాకర్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులు, క్లయిమ్స్ పరిష్కార ప్రక్రియ, తప్పులు లేకుండా చేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. పశ్చిమలో 14,75,036 మంది ఓటర్లు ఉండగా 13,89,592 ఎలక్ట్రోరల్ ఫామ్స్ డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. అలాగే 43,746 మంది ఓటర్లు మృతి చెందిన కారణంగా తొలగించారు. 22,131 మంది వలస వెళ్లడంతో ఓట్లను తొలగించారు. అలాగే ఇతర ప్రాంతాల్లో నమోదైన ఓట్లు 15,676 ఉన్నట్లుగా నిర్ధారించారు. ఇక ఏలూరు జిల్లాలో 16,44,193 మంది ఓటర్లు ఉండగా 6,12,979 మంది మ్యాపింగ్ పూర్తయింది. ఇక 1,02,472 ఓట్లు తొలగించాల్సిన జాబితాలో చేర్చారని, క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు శాశ్వత వలస వెళ్లినవారు, రెండు ఓట్లు ఉన్నవారు, మృతి చెందిన వారి పేర్లను తొలగించాల్సిన జాబితాలో చేర్చారు. ఇక జిల్లాలో 651 సర్వీ సు ఓట్లు ఉన్నాయి. ఆగస్టు 31 వరకు క్లయిమ్‌లు, దరఖాస్తులు చేసుకోవచ్చని, కొత్త ఓటు నమోదు, అడ్రస్ మార్పులు, సవరణ, తదితర అంశాలకు నెల రోజుల సమయం ఉందని ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు పరిశీలించి, అక్టోబర్ 3న తుది జాబితా ప్రకటిస్తామని ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి ప్రకటించారు. ఏలూరు జిల్లాలో 55,852 మంది ఓట్లను మృతి చెందిన కారణంగా తొలగించారు. డెత్ సర్టిఫికెట్ ప్రామాణికంగా తీసుకుని వీటిని తొలగించారు. చింతలపూడిలో అత్యధికంగా 12,172 ఓట్లు ఉన్నాయి. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో 43,746 ఓట్లను తొలగించారు. వీటిలో అత్యధికంగా తణుకు నియోజకవర్గంలో 7,685 ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా ఏలూరు జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వలస వెళ్లిన ఓటర్లు 24,034 మందిగా గుర్తించారు. పోలవరం నియోజకవర్గంలో 4,366 ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. అలాగే పశ్చిమగోదావరిలో 22,131 ఓట్లను గుర్తించారు. వీటిలో తణుకులో 6,600 ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. ఏలూరులో 15,41,650 మంది ఓటర్లు పశ్చిమలో 14,75,036 మంది ఓటర్లు ఏలూరులో 55,852, పశ్చిమలో 43,756 మంది మృతి చెందిన ఓట్లు తొలగింపు ఏలూరులో 24,036, పశ్చిమలో 22,131 వలస ఓట్లు తొలగింపు రాజకీయ పార్టీలతో రెండు జిల్లాల్లో అధికారుల సమావేశం -
క్యాంపు కార్యాలయాలకు స్థల పరిశీలన
ఉండి: పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీ క్యాంపు కార్యాలయాల కోసం భీమవరం ఆర్డీఓ ప్రవీణ్‌కుమార్ శుక్రవారం మండలంలోని ఎన్నార్పీ అగ్రహారంలోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. అలాగే సివిల్ సప్లయీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్, గోడౌన్స్ లోని ఎంఎల్ఎస్ పాయింట్‌ను పరిశీలించారు. తహసీల్దార్ మంతెన రామప్రసాదరాజు, ఆర్ఐ ఆర్.కార్తీక్, మండల సర్వేయర్ రత్నవల్లి, వీఆర్వో గోవింద్ ఉన్నారు. నరసాపురం: గోదావరిలో వరద నీటి ప్రవాహ ఉధృతి పెరగడంతో నరసాపురంలోని వశిష్ట రేవులో పంటు రాకపోకలు శుక్రవారం నుంచి అధికారులు నిలుపుదల చేశారు. ప్రవాహ ఉధృతి తగ్గిన తర్వాత అనుమతిస్తామని చెప్పారు. నరసాపురం: గోదావరి వరద ఉధృతి, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో నరసాపురం డివిజన్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు నరసాపురం ఆర్డీఓ దాసి రాజు తెలిపారు. నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం, నరసాపురం, యలమంచిలి, పెనుగొండ, ఆచంట తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాడేపల్లిగూడెం: స్థానిక శశి ఇంజనీరింగ్ కళాశాలలో ఆల్వింగ్ ఇంటర్ డైరెక్టరేట్ షూటింగ్ పోటీలు శుక్రవారం జరిగాయి. 9 గ్రూపుల నుంచి 108 మంది ఎన్సీసీ క్యాడెట్లు పా ల్గొన్నారు. ఫైరింగ్ క్యాంపును ఈనెల 7 వరకు నిర్వహించనున్నారు. కల్నల్ రితిన్మోహన్ అగర్వాల్, కమాండింగ్ ఆఫీసర్ అమిత్ పాండేలు పర్యవేక్షించారు. ఏపీ, తెలంగాణకు చెందిన క్యాడెట్లు హాజరయ్యారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సర్వేలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పో లింగ్స్టేషన్లలో, ఎన్నికల నమోదు అధికారుల కార్యాలయాల్లో, సహాయ ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో, జిల్లా ఎన్నికల అధికారి కా ర్యాలయంలో జాబితాను ప్రదర్శిస్తామన్నారు. జాబితాలో లోపాలుంటే సవరణ కోసం దరఖాస్తులను బీఎల్ఓలకు సమర్పించాలని సూచించారు. బుట్టాయగూడెం: మండలంలోని పండుగూడెంలో లేగదూడపై పెద్దపులి శుక్రవారం దాడి చేసి హతమార్చింది. దీంతో మరింత అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు పులిని బంధించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మహారాష్ట్ర, పూనె నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందాలు రంగంలోకి దిగాయి. సీసీఎఫ్ ఆశాజ్యోతి, డీఎఫ్ఓ సందీప్‌రెడ్డి తదితరులు కండ్రికగూడెం సమీపంలో పులి సంచారాన్ని గుర్తించి, దాన్ని బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతం కొండలు, గుట్టలతో కూడి ఉండటం, వాతావరణం అనుకూలించకపోవడంతో పులిని పట్టుకోవడం సవాలుగా మారిందని డీఎఫ్ఓ తెలిపారు. అయితే పులి మైదాన ప్రాంతంలోకి రాగానే మత్తుమందు (రసాయన పద్ధతి) ఇచ్చి సురక్షితంగా పట్టుకోవడానికి ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, చింతూరు, పాపికొండల నేషనల్ పార్క్ బృందాలు సిద్ధంగా ఉన్నా యని చెప్పారు. మైక్ ప్రచారం, డప్పు చాటింపుల ద్వారా పరిసర ప్రాంత ప్రజలను అప్రమ త్తం చేస్తున్నారు. కన్నాపురం, పోలవరం, కు క్కునూరు, జంగారెడ్డిగూడెం రేంజ్ అధికారులు పులి సంచారాన్ని ట్రాక్ చేస్తున్నారు. -
మరణంలోనూ వీడని రక్త బంధం
● తండ్రి మరణ వార్త తెలిసి కుమార్తె మృతి ● ఒకేరోజు తండ్రీ కూతుళ్ల మృతితో విషాదఛాయలు తణుకు అర్బన్: పేగు బంధం అంటే ఇదేనేమో! ప్రాణంగా చూసుకున్న తండ్రి ఇక లేడన్న చేదు వార్త ఆ కుమార్తె గుండెను పిండేసింది. శస్త్రచికిత్స విజయవంతమైందన్న ఆనందం క్షణాల్లోనే ఆవిరై, తండ్రి మరణ వార్త వినగానే ఆమె గుండె నిమిషాల్లోనే ఆగిపోయింది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. తణుకు ఎన్జీవోస్ కాలనీకి చెందిన సరెళ్ల ప్రిస్కిల్లా (65) వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ సూపర్వైజర్గా పనిచేసి, నాలుగేళ్ల క్రితం అత్తిలి మండలం మంచిలి పీహెచ్సీలో పదవీ విరమణ చేశారు. ఆమె తండ్రి, పాలకొల్లు నివాసి సరెళ్ల సుబ్బారావు (90) టెలిఫోన్ శాఖలో టీఎస్వోగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇటీవల సుబ్బారావుకు హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో మోకాళ్ల శస్త్రచికిత్స జరిగింది. శుక్రవారం వేకువజామున శస్త్రచికిత్స విజయవంతమైందని వైద్యులు చెప్పడంతో ప్రిస్కిల్లా ఆస్పత్రికి సమీపంలోనే ఉన్న తన కుమార్తె ఇంటికి వెళ్లారు. అయితే వయోభారం కారణంగా శరీరం సహకరించక కాసేపటికే సుబ్బారావు మృతిచెందారు. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా తెలుసుకున్న ప్రిస్కిల్లా తీవ్ర దిగ్భ్రాంతికి గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆమెను పరిశీలించిన వైద్యులు కార్డియాక్ అరెస్ట్‌తో మరణించినట్లు నిర్ధారించారు. గతంలోనే సుబ్బారావు భార్య, ప్రిస్కిల్లా భర్త (ఉపాధ్యాయుడు) మరణించారు. సుబ్బారావుకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండగా.. ప్రిస్కిల్లాకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఒకే రోజు తండ్రీకూతుళ్లు ఇద్దరూ అనంత లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది. హైదరాబాద్ నుంచి మృతదేహాలను తీసుకొచ్చి, సుబ్బారావు భౌతికకాయానికి పాలకొల్లులోనూ, ప్రిస్కిల్లా భౌతికకాయానికి తణుకులోనూ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ దారుణ ఘటనతో తణుకు, పాలకొల్లు ప్రాంతాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. -
ఇన్‌స్టాలో వేధింపులు..
మైలవరం: మార్ఫింగ్ ఫొటోలతో మహిళను వేధిస్తున్న వ్యక్తిని మైలవరం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీఐ కిశోర్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం పండితవల్లూరు గ్రామానికి చెందిన తోట కృష్ణ మైలవరానికి చెందిన ఓ వివాహితతో ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పరిచయం పెంచుకుని చాటింగ్ చేస్తున్నాడు. వివాహితను తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని పదేపదే వేధిస్తున్నాడు. వివాహిత అతనికి లొంగకపోవడంతో ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి నకిలీ ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలు సృష్టించి ఆమెను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మార్ఫింగ్ ఫొటోలను మైలవరం ప్రాంతానికి చెందిన పలువురు వ్యక్తులు పబ్లిక్, సోషల్ మీడియా ఖాతాలు, గ్రూపులకు పంపిస్తూ బాధితురాలిని మానసిక వేదనకు గురిచేస్తున్నాడు. దీనిపై గత 20 రోజుల క్రితం బాధితురాలు మైలవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు గత రెండు రోజులుగా బాధితురాలి కదలికలపై నిఘా ఉంచేందుకు మైలవరం ప్రాంతానికి వచ్చాడు. విశ్వసనీయ సమాచారం మేరకు మైలవరం పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ విశ్లేషణ తదితర సాంకేతిక ఆధారాలను వినియోగించి నిందితుడి కదలికలు గుర్తించి అరెస్టు చేసినట్లు సీఐ కిశోర్‌బాబు తెలిపారు. నిందితుడికి సహకరించివారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
ఉద్రిక్తతగా కలెక్టరేట్ ముట్టడి
భీమవరం: సమస్యల పరిష్కారం కోరుతూ షెడ్యూల్డ్ పరిశ్రమల కార్మికులు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కలెక్టరేట్‌కు చేరిన కార్మికులను అడ్డుకోడానికి పోలీసులు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. దీంతో కొందరు కార్మికులు, పోలీసులు సైతం కింద పడిపోయారు. కనీస సౌకర్యాలు కల్పించాలి కలెక్టరేట్‌కు దగ్గరలోని ప్రైవేట్ విద్యాసంస్థ వద్ద రోడ్డుపై సీఐటీయూ ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ పరిశ్రమల కార్మికులు గురువారం ఆందోళన చేపట్టారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యూటీ సదుపాయం కల్పించాలని, కార్మికులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అదనపు డ్యూటీలు రద్దు చేయాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి పీవీ ప్రతాప్ అధ్యక్షతన నిర్వహించిన సభలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రాజారామ్మోహన్రాయ్ మాట్లాడుతూ షెడ్యూల్ పరిశ్రమల్లో లక్షలాది మంది కనీస సౌకర్యాలు, వేతనాలు లేకుండా పని చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వాసుదేవరావు మాట్లాడుతూ కార్మికులను పారిశ్రామికవేత్తలుగా చేస్తామని కూటమి ప్రభుత్వం గొప్పగా మాటలు చెప్పడం తప్ప చట్టప్రకారం వారికి ఇవ్వాల్సిన వేతనాలు, సౌకర్యాలు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. అధికారులకు సమస్యలు చెప్పుకుందామని వస్తే నిలబడ్డానికి కూడా చోటు లేదని ఆంక్షలు విధించడం సిగ్గుచేటన్నారు. సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ మాట్లాడుతూ కార్మిక వర్గం చేస్తున్న పోరాటానికి సీపీఎం మద్దతుగా ఉంటుందన్నారు. కోట్లాది రూపాయల విలువచేసే భూములను రైతుల వద్ద నుంచి బలవంతంగా లాక్కుని బడా బాబులకు కేవలం 99 పైసలకే ఇస్తానంటున్న ప్రభుత్వం షెడ్యూలు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులను గుర్తించకపోవడం దారుణమన్నారు. తోపులాట కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే ఉద్యోగులు, ప్రజలకు దారి లేకపోవడంతో అడ్డు తొలగాలని పోలీసులు కార్మికులను హెచ్చరించారు. అయినా పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా కార్మికులు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. కలెక్టరేట్ గేటు వద్దకు దూసుకువచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోడానికి ప్రయత్నించారు. కార్మికులు, సీఐటీయూ, సీపీఎం నాయకులు బారికేడ్లు, రోప్ అడ్డంకిని దాటుకుని ముందుకు రావడంతో తోపులాట జరిగింది. పోలీసు ఆంక్షలను తోసిరాజని కలెక్టరేట్ గేట్ వద్ద కూర్చుని ముట్టడి చేశారు. కలెక్టర్ స్వయంగా వచ్చి సమస్యలు వినాలని పట్టుబట్టారు. దీంతో జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ ఆందోళనకారుల వద్దకు వచ్చి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు ఎం.ఆంజనేయులు, ఎస్.రంగారావు, డి.కళ్యాణి, ఎస్.వెంకటేశ్వరరావు, గొర్ల రామకృష్ణ, ఎం.త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ షెడ్యూల్డ్ పరిశ్రమ కార్మికుల ఆందోళన కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట -
మళ్లీ.. పులి
గోదావరి జిల్లాల్లో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. గడచిన ఎనిమిది నెలలుగా ఏలూరు, తూర్పుగోదావరి, పోలవరం జిల్లాల సరిహద్దు గ్రామాల్లో సంచరిస్తున్న ఈ పులి, తరచూ పశువులపై దాడి చేస్తూ హతమారుస్తోంది. ఈ పరిణామం అటవీశాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బుట్టాయగూడెం: తెలంగాణలోని కావిడిగుండ్లలో గత డిసెంబర్లో పశువులపై దాడి చేసిన పెద్దపులి, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో ప్రవేశించింది. పలు గ్రామాల్లో తిరుగుతూ పశువులను హతమార్చిన అనంతరం పోలవరం మండలంలోకి అడుగుపెట్టింది. పట్టిసీమ వద్ద గోదావరి నదిని ఈదుకుంటూ తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించి, కూర్మాపురం వద్ద అటవీశాఖ ప్రత్యేక బృందాలకు చిక్కింది. శ్రీశైలం, బెంగళూరు, విశాఖపట్నం నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందాలు పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి సురక్షితంగా విశాఖపట్నం జూ పార్కుకు తరలించారు. అయితే పులి మనుగడను దృష్టిలో ఉంచు కుని, వన్యప్రాణి సంరక్షణ చట్టాల ప్రకారం అటవీశాఖ అధికారులు దానిని మళ్లీ జూ నుంచి తీసుకొచ్చి, రేడియో కాలర్ అమర్చి పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టారు. దీంతో పులి సంచారం మళ్లీ మొదలైంది. పోలవరం ప్రాంతంలోని దేవీపట్నం, పరిసర సరిహద్దు గ్రామాల్లో తిరిగిన పులి, అక్కడి నుంచి మళ్లీ పోలవరం మండలం మీదుగా బుట్టాయగూడెం చేరి, ఆపై తెలంగాణ ప్రాంతానికి వెళ్లింది. ఆ సమయంలో పులి ఇక రాదని అందరూ భావించారు. కానీ, కొద్ది రోజులకు మళ్లీ పోలవరం, ఏలూరు జిల్లాల్లో దాని కదలికలను అధికారులు గుర్తించారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని కంచర్లగూడెం, నందిగూడెం ప్రాంతాలతో పాటు కొయ్యలగూడెం మండలంలోని మంగపతీదేవిపేటలో పశువులపై దాడి చేసిన ఈ పులి, ప్రస్తుతం బుట్టాయగూడెం మండలం మొద్దప్పగూడెంలోని ఒక జామాయిల్ తోటలో మకాం వేసింది. 150కి పైగా పశువులపై దాడి గడచిన ఎనిమిది నెలల్లో ఏలూరు, తూర్పుగోదావరి, పోలవరం జిల్లాల సరిహద్దుల్లో సంచరిస్తున్న ఈ పెద్దపులి సుమారు 150కి పైగా పశువులను హత మార్చినట్లు సమాచారం. పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టినప్పటికీ, అది తిరిగి గ్రామాల వైపు వస్తూ పశువులపై దాడి చేస్తుండటంతో అటవీశాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. పులిని బంధించేందుకు అధికారులు ఎన్ని వ్యూహాలు పన్నుతున్నప్పటికీ, అది చాకచక్యంగా తప్పించుకు తిరుగుతోంది. దీనితో స్థానికులు ఈ పులికి సరదాగా ‘చాణక్య పులి’ అంటూ సైటెర్లు వేస్తున్నారు. ప్రజల్లో తీవ్ర ఆందోళన ఎనిమిది నెలలుగా గోదావరి జిల్లాల ప్రజలు, రైతులు పులి బెడదతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అనేక మంది రైతులు పశువులను కోల్పోయి జీవనోపాధి కరువై నిరాశకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే పులిని సజీవంగా పట్టుకుని దట్టమైన అడవిలోకి తరలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనుల సీజన్ కావడంతో తోటలకు వెళ్లేందుకు కూలీలు, రైతులు భయపడుతున్నారు. సాయంత్రం ఐదు దాటితే ఇంటి నుంచి బయటకు రావడానికి సాహసించడం లేదు. పిల్లలను ఒంటరిగా స్కూళ్లకు పంపలేకపోతున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు సవాల్ పెద్దపులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు, ప్రత్యేక బృందాలు గత ఎనిమిది నెలలుగా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పులికి అమర్చిన రేడియో కాలర్ సిగ్నల్స్ ఆధారంగా ఎప్పటికప్పుడు దాని కదలికలను పర్యవేక్షిస్తూ, అనువైన ప్రదేశంలో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఆ పులి అధికారులకు చిక్కకుండా మూడు జిల్లాల పరిధిలో ముప్పుతిప్పలు పెడుతోంది. అటవీశాఖ అధికారులు డ్రోన్లతోనూ నిఘా పెట్టి పులి జాడను కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పెద్దపులి ఎప్పుడు చిక్కుతుందో, ఈ భయాందోళనల నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందోనని గోదావరి జిల్లాల ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గోదావరి జిల్లాలను వణికిస్తున్న పెద్దపులి ఎనిమిది నెలలుగా అటవీశాఖ అధికారులకు చుక్కలు చూపిస్తున్న వైనం పులి దెబ్బకు 150కు పైగా పశువుల బలి అధికారులకు సవాల్‌గా మారిన పెద్దపులి సంచారం ప్రజల్లో, పశురైతుల్లో తీవ్ర ఆందోళన -
దిగుబడి.. తడబడి
● ఎల్‌నినోతో ఎండిన కొబ్బరితోటలు ● పడిపోయిన కొబ్బరి దిగుబడులు ● రైతుల్లో ఆందోళన భీమవరం: వర్షాభావం, వడగాల్పుల ప్రభావంతో జిల్లాలో కొబ్బరి దిగుబడులు గణనీయంగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన ఈ జిల్లాలో వరి తర్వాత అత్యధికంగా సాగవుతున్న కొబ్బరి పంటకు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు తీవ్ర ముప్పుగా మారుతున్నాయి. జిల్లాలోని 20 మండలాల్లో కొబ్బరి తోటలతో పాటు పెరటి దొడ్లు, పుంత గట్లు, రోడ్ల వెంబడి ఈ సాగు విస్తరించి ఉంది. సాధారణంగా వేసవిలో నీటి కొరత కారణంగా చెట్లు పసుపు రంగులోకి మారి మోడువారడం సహజమే అయినప్పటికీ, ప్రస్తుత వర్షాకాలంలోనూ ఇదే పరిస్థితి కొనసాగడం గమనార్హం. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోగా ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి. సాధారణంగా జూన్, జూలై నెలల్లో సరాసరి 147.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఈ ఏడాది కేవలం 66.9 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. వర్షాలు లేకపోవడం, తీవ్రమైన ఎండల కారణంగా భూగర్భ జలాలు అడుగంటి, చెట్లకు సరిపడా నీరు అందక తోటలు దెబ్బతింటున్నాయి. 25 వేల ఎకరాల్లో సాగు జిల్లా వ్యాప్తంగా దాదాపు 25 వేల ఎకరాల్లో కొబ్బరి తోటలు సాగులో ఉండగా, ముఖ్యంగా యలమంచిలి, పెనుగొండ, పోడూరు, వీరవాసరం, పాలకొల్లు, పాలకోడేరు తదితర మండలాల్లో ఈ సాగు ఎక్కువగా ఉంది. ఇటీవల కాలంలో ఆక్వా చెరువుల విస్తరణ పెరగడంతో చెరువు గట్లపై కూడా పెద్ద ఎత్తున కొబ్బరి పెంచుతున్నారు. ఎకరా విస్తీర్ణంలో 60 చెట్లు ఉండాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా కొందరు రైతులు 90 చెట్ల వరకు సాగు చేస్తున్నారు. గతంలో కొబ్బరి పెంపకానికి పెద్దగా పెట్టుబడి అవసరం ఉండేది కాదు. కానీ, కొన్నేళ్లుగా నల్లమట్టి పురుగు, తెల్లదోమ వంటి తెగుళ్లు ఆశించడంతో తోటల యాజమాన్యం భారంగా మారింది. ఎరువులు, పురుగుమందుల వాడకం విపరీతంగా పెరగడంతో పెట్టుబడి ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయని రైతులు వాపోతున్నారు. ధర పెరిగినా ప్రయోజనం శూన్యం దిగుబడి భారీగా పడిపోవడంతో కొబ్బరి ధరలు పెరిగినప్పటికీ, రైతులకు పూర్తిస్థాయిలో ప్రయోజనం దక్కడం లేదు. మే, జూన్ నెలల్లో వెయ్యి కొబ్బరి కాయల ధర కేవలం రూ.13 వేలు మాత్రమే పలకగా.. ప్రస్తుతం ఎగుమతులకు కాయలు సరిపడా లభించకపోవడంతో వ్యాపారులు రూ.18 వేలు పైబడి కొనుగోలు చేస్తున్నారు. అయితే, తోటల్లో దిగుబడి నామమాత్రంగా ఉండటంతో కాయల దింపు, వలుపు కూలి ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నుంచి తోటలను కాపాడుకోవడానికి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చెట్ల మొదళ్ల వద్ద చిన్నచిన్న గుంటలు తీయడం వల్ల కొద్దిపాటి వర్షం కురిసినా నీరు ఇంకి చెట్లకు చేరుతుంది. అలాగే తోటల్లో బోదెలు ఏర్పాటు చేయడం ద్వారా నీటి ఎద్దడి నుంచి రక్షణ కల్పించవచ్చు. రైతులు కేవలం ముడి కాయల ఎగుమతులపైనే ఆధారపడకుండా, మార్కెట్లో ధరల హెచ్చుతగ్గుల నుంచి రక్షణ పొందడానికి కొబ్బరి ఆధారిత అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలి. – ఎం.హరిప్రసాద్, జిల్లా ఉద్యానశాఖాధికారి, భీమవరం


