‘రాయుడు గారి తాలూకా’ సందడి | - | Sakshi
Sakshi News home page

‘రాయుడు గారి తాలూకా’ సందడి

Mar 2 2026 7:17 AM | Updated on Mar 2 2026 7:17 AM

‘రాయుడు గారి తాలూకా’ సందడి

‘రాయుడు గారి తాలూకా’ సందడి

నరసాపురం రూరల్‌: శ్రీనివాస్‌ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా ఉలిశెట్టి మూవీస్‌ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం శ్రీరాయుడు గారి తాలూకాశ్రీ. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక స్థానిక వైఎన్‌ కళాశాలలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. హీరో శ్రీనివాస్‌ మాట్లాడుతూ పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన కథ అన్నారు. ఈ ప్రాంతంలోనే పుట్టి పెరగడం వల్ల ఇక్కడి మనుషులు, వారి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలను కళ్ళకు కట్టినట్లు ఈ చిత్రంలో చూపించినట్లు తెలిపారు. ఈ సినిమాలో నరసాపురానికి చెందిన నటీనటులకు పెద్దపీట వేశామని చెప్పారు. ఈ సందర్బంగా యూనిట్‌ సభ్యులు అమ్మరాజు, ఉలిశెట్టి రాజు, శ్రీహరి, శివన్న, మమత, సజన, మణికంఠ, ఏకాంత్‌, గణపతి, సుబ్రహ్మణ్యం, రాఘవ, డైరెక్టర్‌ కొరప్రాటి నవీన్‌, తదితరులు పాల్గొని సినిమా గురించి విషయాలను అందరితో పంచుకున్నారు. మార్చి 6న సినిమా విడుదలవుతున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement