వ్యాక్సిన్‌లు వేయించాలి
పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా మార్చి 16 నుంచి ఏప్రిల్ 14 వరకూ వ్యాక్సిన్ వేస్తున్నాం. రైతులు వారి పశువులకు శ్రద్ధ తీసుకుని వ్యాక్సిన్లు వేయించాలి. వీధి పశువులకు వ్యాక్సిన్‌ల విషయంలో ఎవరూ పట్టించుకునే పరిస్థితి ఉండదు. అందువల్ల మున్సిపల్ అధికారులు, ఎన్జీవో ఆర్గనైజేషన్ సహకారంతో వీధి పశువులకు వ్యాక్సిన్ వేస్తాం. ఈ వ్యాక్సిన్లు ఎనిమిదో రౌండ్ అమలు జరుగుతుంది. ప్రతి సంవత్సరం గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు మార్చి, సెప్టెంబర్ నెలల్లో రెండు డోసులు వేయించాలి. ముందస్తు చర్యలతో గాలికుంటును అడ్డుకోవచ్చు.
–డాక్టర్ జి.సత్యనారాయణ, సహాయ సంచాలకుడు, ప్రాంతీయ పశువైద్యశాల, పాలకొల్లు


