బెంగాల్‌లో బీజేపీకి బిగ్‌ షాక్‌.. | MLA Bishnu Prasad Sharma quits BJP And joins TMC | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో బీజేపీకి బిగ్‌ షాక్‌..

Feb 20 2026 8:35 AM | Updated on Feb 20 2026 9:54 AM

MLA Bishnu Prasad Sharma quits BJP And joins TMC

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ప్రత్యేక గూర్ఖాల్యాండ్‌ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రంలోని తమ పార్టీ అనుకూలంగా లేదన్న ఆగ్రహంతో పశ్చిమబెంగాల్‌లో బీజేపీ ఎమ్మెల్యే బిష్ణు ప్రసాద్‌ శర్మ కాషాయ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, గురువారం మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

కుర్సియాంగ్‌ శాసనసభ్యుడైన శర్మ కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో టీఎంసీలో చేరారు. మరో రెండు నెలల్లో బెంగాల్‌లో ఎన్నికల వేడి మొదలవుతున్న వేళ బీజేపీ రెబల్‌ ఎమ్మెల్యే పార్టీని వీడటం గమనార్హం. ‘కుర్సియాంగ్‌ ఓటర్ల మనోభీష్టానికి వ్యతిరేకంగా పనిచేయదల్చుకోలేదు. ఇప్పుడు నేను స్వేచ్ఛాజీవిని. ఎవరేం అనుకున్నా భయపడేదే లేదు’ అని పార్టీ మారాక బిష్ణుప్రసాద్‌ అన్నారు.

బెంగాల్‌ కొండ ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలనా విభాగం ఉండాలని గత రెండేళ్లుగా బీజేపీ అధిష్టానంతో బిష్ణు పోరాడుతున్నారు. పశ్చిమబెంగాల్‌ మాత్రమేకాదు నార్త్‌ బెంగాల్‌ కూడా ముఖ్యమే’ అని గతంలో వ్యాఖ్యానించారు. పార్టీ వద్దని వారించినాసరే బిష్ణు ప్రసాద్‌ 2024 లోక్‌సభ ఎన్నికల్లో డార్జిలింగ్‌ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement