ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం | Rasi Phalalu: Daily Horoscope On 06-06-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం

Jun 6 2026 1:17 AM | Updated on Jun 6 2026 1:17 AM

Rasi Phalalu: Daily Horoscope On 06-06-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధికజ్యేష్ఠ మాసం, తిథి: బ.షష్ఠి రా.10.02 వరకుతదుపరి సప్తమి, నక్షత్రం: ధనిష్ఠ రా.3.58 వరకు తదుపరి శతభిషం, వర్జ్యం: ఉ.6.56 నుండి 8.37 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.28 నుండి 7.12 వరకు,అమృత ఘడియలు: సా.5.01 నుండి 6.43 వరకు.

సూర్యోదయం :    5.28
సూర్యాస్తమయం     :  6.28
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు

మేషం: సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

వృషభం: కుటుంబసభ్యులు ఒత్తిడులు పెంచుతారు. పనుల్లో జాప్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు ఎదురవుతాయి.

మిథునం: పనులు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణాలు. అనుకోని ఖర్చులు. కుటుంబసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ తప్పకపోవచ్చు.

కర్కాటకం: శుభకార్యాల రీత్యా ఖర్చులు. అదనపు ఆదాయం. విందువినోదాలు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. శ్రమ ఫలిస్తుంది. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

సింహం: పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. పనులలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కన్య: మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. పనులలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితి.

తుల: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

వృశ్చికం: ప్రముఖుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు సేకరిస్తారు. సంఘంలో ఆదరణ. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

ధనుస్సు: కొన్ని పనులు వాయిదా వేస్తారు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

మకరం: నూతన ఉద్యోగయోగం. పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు. విందువినోదాలు.

కుంభం: ముఖ్య వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

మీనం: వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

Advertisement
 
Advertisement
Advertisement