ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి | Rasi Phalalu: Daily Horoscope On 20-07-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి

Jul 20 2026 3:01 AM | Updated on Jul 20 2026 8:21 AM

Rasi Phalalu: Daily Horoscope On 20-07-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: శు.షష్ఠి ఉ.7.07 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: హస్త రా.11.15 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం: ఉ.7.19 నుండి 8.57 వరకు, దుర్ముహూర్తం: ప.12.31 నుండి 1.23 వరకు తదుపరి ప.3.07 నుండి 3.58 వరకు, అమృత ఘడియలు: సా.5.06 నుండి 6.44 వరకు.

సూర్యోదయం : 5.38
సూర్యాస్తమయం : 6.34
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం... పనుల్లో విజయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. దూరపు బంధువులతో సఖ్యత. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృషభం.... మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. కళాకారులకు ఒత్తిడులు. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

మిథునం.... పనుల్లో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. దైవదర్శనాలు. అనారోగ్యం. వివాదాలకు దూరంగా ఉండండి. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

కర్కాటకం.... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పరపతి పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటుంది.

సింహం.... కొన్ని కార్యక్రమాలు మధ్యలో వాయిదా వేస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కన్య... పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. ఆధ్యాత్మిక చింతన.విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి ఉంటుంది.

తుల.... పరిస్థితులు అనుకూలించవు. వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. మిత్రులతో మాటపట్టింపులు. కార్యక్రమాలలో జాప్యం. బంధువుల నుండి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృశ్చికం....మిత్రుల నుండి ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆలయ దర్శనాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.  వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు.

ధనుస్సు.... నూతన ఉద్యోగయోగం. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఉద్యోగయత్నాలు సానుకూలం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

మకరం.... రుణాలు చేస్తారు. పనుల్లో జాప్యం. బంధు,మిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కుంభం.... శ్రమ తప్ప ఫలితం ఉండదు. రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన. పనులు ముందుకు సాగవు. కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

మీనం.... కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. నూతన విద్యావకాశాలు. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement