Photo Credit: BCCI Twitter
జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా శనివారం రాత్రి భారత్ నుంచి బయల్దేరి వెళ్లింది. ఈ సిరీస్‌కు హెడ్‌కోచ్ గంభీర్‌కు విశ్రాంతినివ్వడంతో అతడి స్థానంలో జట్టు మెంటార్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి వీవీఎస్ లక్ష్మణ్ సహా తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఇతర క్రికెటర్లు జింబాబ్వే టూర్‌కు వెళ్తున్న ఫొటోలను బీసీసీఐ పంచుకుంది.
ఇంగ్లండ్ టూర్‌లో ఇవాళ చివరి వన్డే ఆడిన అనంతరం టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, శివమ్ దూబేలు నేరుగా జింబాబ్వేకు పయనం కానున్నారు. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో టీ20 కెప్టెన్‌గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా.. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరిగిన టీ20 సిరీస్‌ల్లో ఓటమిపాలైంది.
తన కెప్టెన్సీలో శ్రేయస్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడంతో జింబాబ్వే సిరీస్ అతడికి కీలకం కానుంది. జింబాబ్వే టూర్‌లో టీమిండియానే ఫెవరెట్‌గా కనిపిస్తున్నప్పటికీ ఆతిథ్య జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో జూలై 23 నుంచి మొదలుకానుంది. తొలి టీ20 జూలై 23న హరారే వేదికగా సాయంత్రం 4.30 గంటలకు జరగనుంది. 2024 జూలైలో చివరగా జింబాబ్వేలో పర్యటించిన భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది.
ఇక ఈ సిరీస్‌కు సంజూ శాంసన్‌ను పక్కకు తప్పించారు. రింకూ సింగ్, మయాంక్ యాదవ్‌లతో పాటు ప్రబ్‌సిమ్రన్‌లను జింబాబ్వే టూర్‌కు ఎంపిక చేసింది.
జింబాబ్వే టూర్‌కు టీమిండియా: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, యాష్ ఠాకూర్, అశోక్ శర్మ, ప్రబ్‌సిమ్రన్, మయాంక్ యాదవ్.
𝙀𝙣 𝙧𝙤𝙪𝙩𝙚 𝙩𝙤 𝙕𝙞𝙢𝙗𝙖𝙗𝙬𝙚 🇿🇼#TeamIndia | #ZIMvIND pic.twitter.com/akRFqycwXC
— BCCI (@BCCI) July 18, 2026


