పారిశ్రామివేత్త, బిలియనీర్ ముకేష్ అంబానీ తనయ, వ్యాపారవేత్త ఇషా అంబానీ మరోసారి తన ఫ్యాషన్ స్టైల్‌తో ఆకట్టుకున్నారు. ఇటీవల పారిస్‌లో జరిగిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా ఫ్యాషన్ షోలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఇషా అంబానీ, హాలీవుడ్ పాప్ సింగర్ కార్డి బి (Cardi B)తో కలిసి ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన అల్ట్రా మోడ్రన్ డ్రెస్‌లో సరికొత్త లుక్‌తో మెరిసి పోయింది. ముఖ్యంగా ఆమె చేతిలో ఉన్న లగ్జరీ బ్యాగ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. దీని రేటెంతో తెలుసా?
ప్యారిస్ హాట్ కోచర్ వీక్ జూలై 6న ఎంతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. రాహుల్ మిశ్రా తన 'దేవి' కలెక్షన్‌ను ఈ స్టేజి పైన ప్రదర్శించారు. ఇక ఈ ప్రతిష్టాత్మక షోను చూడటానికి ఈషా అంబానీ ఫ్రంట్ రోలో కూర్చుని ప్రత్యేక ఆకర్షణగా నిలచింది.
Isha Ambani in full luxury mode ✨ Custom Rahul Mishra couture is a masterpiece!#IshaAmbani #RahulMishra #LuxuryFashion pic.twitter.com/UWmba4YZH5
— Global Celeb Updates (@gcelebupdates_) July 7, 2026
fy"> సెలబ్రిటీ స్టైలిస్ట్ ఆండ్రూ ముకమల్ ఆధ్వర్యంలో ఇషా అంబానీ లుక్ వైరల్ అయింది. రాహుల్ మిశ్రా కస్టమ్ మేడ్‌గా తయారు చేసిన చార్కోల్-గ్రే రంగులతో కూడిన రాహుల్ మిశ్రా కస్టమ్ స్ట్రాప్‌లెస్ గౌన్‌ను ధరించారు.. ఈ డ్రెస్ టాప్ పార్ట్‌ను క్రిస్టల్స్, సీక్విన్స్, త్రీడీ బీడ్‌వర్క్‌తో ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారు. ఇక ఇది చూడటానికి మన సాంప్రదాయ గుడి నగల డిజైన్‌లా అనిపించింది. దీనికి తోడు స్టైలిష్ బ్రెయిడెడ్ జడ, సన్‌గ్లాసెస్‌తో ఆమె లుక్ అదిరిపోయింది.

ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది

రూ. 17 కోట్ల అత్యంత అరుదైన బిర్కిన్ బ్యాగ్
ఈ వేడుకలో ఇషా అంబానీ దుస్తుల కంటే ఆమె చేతిలోని అల్ట్రా లగ్జరీ బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ బ్యాగ్ విలువ అక్షరాలా రూ. 17 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి బ్యాగులు కేవలం మూడు మాత్రమే తయారు కాగా, అందులో ఒకటి అంబానీ వారసురాలి చేతిలో అందంగా ఇమిడిపోయింది. నిజానికి ఇది నీతా అంబానీ వ్యక్తిగత కలెక్షన్‌కు చెందినది. ఈ బ్యాగ్‌ను మొసలి చర్మం (crocodile leather), 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో తయారు చేశారు. అంతేకాకుండా, దీనిపై దాదాపు 111 క్యారెట్ల బరువు కలిగిన 3000 నిజమైన వజ్రాలను అమర్చారు.

ఇదీ చదవండి: క్యాన్సర్‌తో కొడుకు మృతి: కోడలికి కన్యాదానం చేసిన మామగారు


