మహారాష్ట్రలో భూకంపం వచ్చింది. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత హింగోలి, నాందేడ్, పర్భనీ జిల్లాలలో భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రగా 4.6 గా నమోదైంది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించనట్లు తెలుస్తోంది.
నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) వివరాల ప్రకారం, గురువారం తెల్లవారుజామునహింగోలి జిల్లాలో వరుసగా భూమి స్వల్పంగా కంపించింది. రెండు గంటల వ్యవధిలో నాలుగు సార్లు భూమి కంపించింది. హింగోలిలో నమైదన భూకంపం 4.6 తీవ్రతతో నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ నాలుగు భూకంపాలు హింగోలి జిల్లాలోని సమీప ప్రాంతాలలోనే సంభవించాయని, 10 కిలోమీటర్ల లోతులో ఇవి నమోదైనట్లు పేర్కొన్నారు. వీటితో పాటు లాతూర్, పర్భణి, నాందేడ్ సహా పొరుగు జిల్లాల్లో సైతం భూప్రకంపనలు సంభవించాయి.
జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం సమాచారం ప్రకారం, ఈ ప్రాంతంలో ఇటీవలి కాలంలో ఇలాంటి భూకంపాలు చాలాసార్లు సంభవించాయి. జూలై 2, 2026న, హింగోలిలో 5 కిలోమీటర్ల లోతులో 3.6, 3.5 తీవ్రత గల రెండు భూకంపాలు నమోదయ్యాయి. అంతకుముందు, ఏప్రిల్ 11, 2026న, 10 కిలోమీటర్ల లోతులో 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. కాగా ఇటీవల ఇలా వరుసగా భూకంపాలు సంభవించడం కలకలం రేపుతోంది.
Maharashtra: Earthquake tremors were felt in Nanded, Hingoli and Parbhani districts of Marathwada region in the state.
The tremors were recorded between 1.37 am and 3.23 am and measured between 3.6 and 4.6 on the Richter scale. pic.twitter.com/i9pxCOhc9i
— Vani Mehrotra (@vani_mehrotra) July 9, 2026


