మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ అరెస్ట్ | YSRCP Usha Shricharan Arrest At Penugonda | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ అరెస్ట్

Jul 9 2026 11:28 AM | Updated on Jul 9 2026 1:13 PM

YSRCP Usha Shricharan Arrest At Penugonda

సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని కలిసేందుకు వెళ్తున్న మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్‌ను పోలీసులు అడుకుని అరెస్ట్‌ చేశారు.

వివరాల మేరకు.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్.. రాప్తాడుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఉషాశ్రీచరణ్‌ను పోలీసులు పెనుకొండలో అడ్డుకున్నారు. అనంతరం, వాగ్వాదం జరగడంతో పోలీసులు.. ఉషాశ్రీచరణ్‌ను అరెస్ట్‌ చేశారు. దీంతో, పోలీసుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ఏకపక్ష వైఖరికి నిరసనగా రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement