ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్ | Upcoming OTT Movies Telugu July Second Week 2026 | Sakshi
Sakshi News home page

OTT Movies This Week: ఓటీటీల్లో ఈ వారం 18 మూవీస్.. మరి థియేటర్లలో?

Jul 6 2026 10:03 AM | Updated on Jul 6 2026 10:15 AM

Upcoming OTT Movies Telugu July Second Week 2026

మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'లెనిన్' రిలీజ్ కానుంది. దాదాపు మూడేళ్ల తర్వాత అఖిల్ బాక్సాఫీస్ బరిలో ఉన్నాడు. అంచనాలైతే పర్లేదనిపించేలా ఉన్నాయి. దీనితోపాటు వసుదేవసుతం, చంద్రప్పన్ అనే తెలుగు చిత్రాలు కూడా లిస్టులో ఉన్నాయి. అలానే పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఐ నోబడీ', 'హృదయం మురళి', నాగదుర్గ 'లవ్ ఓ లవ్', ధమాల్ 4 అనే డబ్బింగ్, హిందీ చిత్రాలు కూడా విడుదల కానున్నాయి.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా)

ఓటీటీ రిలీజుల విషయానికొస్తే.. ఈ వారమే 'పెద్ది' రానుంది. దీనితో పాటు మ్యూజికల్ మూవీ 'సింగ్ గీతం' కూడా స్ట్రీమింగ్ కానుంది. బల్టీ, పరిమళ అండ్ కో చిత్రాలు కూడా ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు పలు సిరీస్‌లు, సినిమాలు కూడా ఉన్నాయండోయ్. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ కానుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 06 నుంచి 12వ తేదీ వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • సింగ్ గీతం (తెలుగు మూవీ) - జూలై 08

  • ఐ యామ్ నాట్ అఫ్రైడ్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 08

  • సల్సేడో, లెదర్ అండ్ బోగాలో (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 08

  • నథింగ్ టూ లూజ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 08

  • పెద్ది (తెలుగు సినిమా) - జూలై 09

  • లిటిల్ హౌస్ ఆన్ ద ప్రయిరే (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 09

  • పతి పత్ని ఔర్ వో దో (హిందీ మూవీ) - జూలై 10

  • ఇక్కా (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 10

  • షిప్ రెక్డ్: నైట్ మేర్ ఎట్ సీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూలై 10

  • ద అపార్ట్‌మెంట్ జాబ్ (కొరియన్ సిరీస్) - జూలై 11

  • సుసాన అండ్ ఎల్విరా: నో ప్లాన్ బి (కొలంబియన్ మూవీ) - జూలై 12

హాట్‌స్టార్

  • ద ఫైవ్ స్టార్ వీకెండ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 10

సోనీ లివ్

  • బల్టీ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 10

అమెజాన్ ప్రైమ్

  • ద వెస్టీస్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 12

జీ5

  • ఫ్రేమ్ (మరాఠీ సినిమా) - జూలై 10

  • పరిమిళ అండ్ కో (తమిళ మూవీ) - జూలై 10

లయన్స్ గేట్ ప్లే

  • ద సెంటినల్స్ (ఫ్రెంచ్ సిరీస్) - జూలై 10

ఆపిల్ టీవీ ప్లస్

  • ట్రైయింగ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 08

(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన వివాదాస్పద సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement