నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన వివాదాస్పద సినిమా | Satluj Movie OTT Release, Diljit Dosanjh’s Controversial Punjab 95 Finally Released, Check Out Streaming Platform | Sakshi
Sakshi News home page

Satluj OTT: సెన్సార్ ఇబ్బందులు.. డైరెక్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్

Jul 5 2026 3:47 PM | Updated on Jul 5 2026 4:32 PM

Satluj Movie Ott Streaming Now

ప్రతివారం ఓటీటీల్లోకి పదుల సంఖ్యలో సినిమాలు వస్తూనే ఉంటాయి. వీటిలో దక్షిణాది చిత్రాలతో పాటు హిందీ, ఇతర భాషలకు చెందిన మూవీస్ కూడా ఉంటూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రం స్టార్స్ నటించినవి కూడా నేరుగా ఓటీటీలో రిలీజైపోతుంటాయి. ఇప్పుడు కూడా అలానే ఓ వివాదాస్పద చిత్రం పెద్దగా హడావుడి లేకుండానే అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?

(ఇదీ చదవండి: ఓటీటీలో కామెడీ సిరీస్.. 'సూపర్ సుబ్బు' రివ్యూ)

పంజాబ్‌కి చెందిన మానవ హక్కుల నేత జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా 'పంజాబ్ 95' పేరుతో దర్శకుడు హనీ టెహ్రాన్ ఓ సినిమా తీశారు. ప్రముఖ సింగర్ దిల్జిత్ దోసాంజ్ ఇందులో లీడ్ రోల్ చేశాడు. పంజాబ్‌లో 25,000 మందిని అన్యాయంగా పోలీసులు చంపిన సంగతి.. తన పరిశోధన ద్వారా వెలుగులోకి తెచ్చిన జస్వంత్ సింగ్.. 1995లో హత్యకు గురయ్యారు. ఈయన్ని పోలీసులే చంపారనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ సినిమాని మూడేళ్ల క్రితమే తీసినప్పటికీ సెన్సార్ బోర్డ్.. తీవ్ర అభ్యంతరాలు చెప్పింది. ఏకంగా 127 కట్స్ సూచించింది. మూవీ టీమ్ కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా ఫలితం లేకపోవడంతో ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయలేదు. దీంతో 'సత్లుజ్'గా టైటిల్ మార్చి నేరుగా జీ5 ఓటీటీలోకి రెండు రోజుల క్రితమే స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. నార్త్ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కానీ దక్షిణాది ఆడియెన్స్‌కి నచ్చుతుందా లేదా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement