వన్–వే విధానం తొలిరోజే వాహనదారులకు చుక్కలు చూపించింది. దారులు మారి.. యూటర్న్లు పెరిగి.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లతో నగరవాసులు నరకం చూశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్ నుంచి పంజగుట్ట వరకు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరో ఏడాది, ఏడాదిన్నరపాటు ఇలాగే పోవాలా? అంటూ కొందరు అసహనం వ్యక్తం చేశారు. కేబీఆర్ చుట్టూ తొలి రోజు ట్రాఫిక్ తిప్పలు ఎలా ఉన్నాయో ఈ ఫొటో గ్యాలరీలో చూడండి.


