breaking news
news
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో వర్ష బీభత్సం (ఫొటోలు)
-
@
గ్రాండ్ ఫాదర్‌గా భాస్కర్ కూలీ చిత్రంలోరజనీకాంత్ తమిళసినిమా: చిత్రాలకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చిందంటే ఆ చిత్రాలను 12 ఏళ్ల లోపు పిల్లలు చూడడానికి థియేటర్లో అనుమతించరాదని అర్థం అనే విషయం తెలిసిందే. అయితే ఈ నిబంధనలను ఇప్పుడు పెద్దగా ఏ సినిమా థియేటర్ నిర్వాహకులు పాటించడం లేదన్నది వేరే విషయం. సాధారణంగా క్రైమ్, థ్రిల్లర్, హర్రర్ కథా చిత్రాలకు, హింసాత్మక సంఘటనలు అధికంగా ఉన్న చిత్రాలకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇస్తుంది. అదే సర్టిఫికెట్‌ను ఇప్పుడు రజనీకాంత్ తాజాగా కథానాయకుడు నటించిన కూలీ చిత్రానికి ఇవ్వడం గమనార్హం. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్, టాలీవుడ్ స్టార్ నాగార్జున, శాండిల్‌వుడ్ స్టార్ ఉపేంద్ర, ,క్రేజీ స్టార్ శ్రుతిహాసన్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇక అదనపు ఆకర్షణగా పూజాహెగ్డే ఐటమ్ సాంగ్ ఉండనే ఉంది. కాగా అనిరుద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూలీ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్‌ను ఇవ్వడం చర్చనీయంగా మారింది. కారణం ఈ చిత్రంలో భారీగా హింసాత్మక సన్నివేశాలు చోటు చేసుకోవడమే అని తెలిసింది. రజనీకాంత్ నటించిన అత్యధిక చిత్రాలు యూ /ఏ సర్టిఫికెట్ తోనే విడుదలయ్యాయి. అయితే 1982లో నటించిన పుదుకవితై, రంగా, 1985లో నటించిన ఊరుక్కావాలన్, 1989లో నటించిన శివ చిత్రాలు మాత్రం ఏ సర్టిఫికెట్తో విడుదలయ్యాయి. ఇప్పుడు 36 ఏళ్ల తర్వాత మళ్లీ కూలీ చిత్రం ఏ సర్టిఫికెట్తో తెరపైకి రాబోతుందన్నది గమనార్హం. అయితే ఈ చిత్ర ట్రైలర్ ,ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చైన్నెలోని నెహ్రూ హిందూ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించారు. గ్రాండ్ ఫాదర్ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ తమిళసినిమా: ఎంఎస్ భాస్కర్, ఫ్రాంక్ స్టార్ రాహుల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రానికి గ్రాండ్ ఫాదర్ అనే టైటిల్ నిర్ణయించారు. కుట్టి స్టోరీస్ పిక్చర్స్ పతాకంపై భువనేష్ చిన్నస్వామి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెట్రో మురళి, మెట్రోగిరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాగా ఫ్రాంక్ స్టార్ రాహుల్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటి స్మీక కథానాయకిగా నటిస్తున్న ఇందులో అరుణ్‌దాస్, మునీష్కాంత్, శ్రీనాథ్, శివ అరవింద్, ప్రియదర్శిని, అంజలిరావ్, అభినయ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీధర్ చాయాగ్రహణం, రంజిన్ రాజ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కామెడీ విత్ హర్రర్, ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కాగా పార్కింగ్ చిత్రంలో నటనకుగాను నటుడు ఎంఎస్ భాస్కర్‌కు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ సహాయ నటుడు అవార్డును ప్రకటించిన నేపథ్యంలో గ్రాండ్ ఫాదర్ చిత్ర యూనిట్ ఆయన్ను అభినందించడంతో పాటు ఆయన గౌరవించే విధంగా ఈ చిత్ర టైటిల్‌ను, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. ఈ చిత్రంలో ఎమ్మెస్ భాస్కర్ గ్రాండ్ ఫాదర్‌గా టైటిల్ రోల్‌ను పోషిస్తున్నారు. ఫస్ట్‌లుక్ పోస్టర్లలో ఆయన గెటప్ కొత్తగా ఉండడంతో చిత్రంపై ఆసక్తి నెలకొంది. రాగా గ్రాండ్ ఫాదర్ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
ట...ట...ట... నిజమౌనా?
ఫలానా హీరో–హీరోయిన్ కాంబినేషన్ కుదిరింద‘ట’... ఓ పాట సెట్ కోసం ఐదువందల మందికి పైగా పని చేస్తున్నార‘ట’... ఆ డైరెక్టర్ 60 రోజుల్లోనే సినిమా పూర్తి చేయాలనుకుంటున్నాడ‘ట’... ఆ స్టార్ హీరో సినిమాలో ఇంకో స్టార్ హీరో విలన్‌గా ఫిక్స్ అయ్యాడ‘ట’... ఇలా సినిమా పరిశ్రమ గురించి రోజుకో ‘ట...ట...ట...’ అంటూ వార్తలు ప్రచారంలో ఉంటాయి. మరి... ఈ ప్రచారంలో ఉన్న ఈ ‘ట’లు నిజమౌనా? అనేది తెలియాలంటే మాత్రం యూనిట్ చెప్పాల్సిందే. ఇక ప్రస్తుతం ఆ నోటా ఈ నోటా విహారం చేస్తున్న కొన్ని ‘ట’ల గురించి ఓ లుక్కేద్దాం.హీరో మహేశ్‌బాబు, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన పంథాకి భిన్నంగా ఈ చిత్రాన్ని అతి వేగంగా పూర్తి చేసేం దుకు రాజమౌళి షూటింగ్ ప్లాన్ చేశారని టాక్. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే హై ఓల్టేజ్ యాక్షన్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం పొడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ఉన్న మహేశ్ లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారాయి. ఇప్పటికే హైదరాబాద్, ఒడిశాలోని కోరాపుట్‌లో రెండు షెడ్యూల్స్‌ని మెరుపు వేగంతో పూర్తి చేసిన రాజమౌళి మూడవ షెడ్యూల్‌కి సిద్ధం అయ్యారు. ఇందుకోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ని సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సెట్ కోసం దాదాపు 550 మంది పని చేస్తున్నారని టాక్. ఈ సెట్లో త్వరలోనే ఓ భారీ సాంగ్‌ని చిత్రీకరించనున్నారట రాజమౌళి. ఈ పాట సినిమాలో హైలైట్ అవుతుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్తలు కూడా గత కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై స్పష్టత రావాలంటే చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రజనీకాంత్‌కి విలన్‌గా... రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ సినిమాలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ఓ కీలక పాత్ర చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ చిత్రంలో ఫాహద్‌ది పాజిటివ్ క్యారెక్టర్. ఒక రకంగా చెప్పాలంటే రజనీ పాత్రకు హెల్ప్‌ఫుల్‌గా ఉండే పాత్ర. అయితే ఇప్పుడు రజనీకాంత్‌కి విలన్‌గా మారారట ఫాహద్. ఏ సినిమాలో అంటే ‘జైలర్ 2’లో అని సమాచారం. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఇదే కాంబినేషన్లో ‘జైలర్ 2’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఫాహద్‌ని విలన్‌గా ఎంపిక చేశారని టాక్. ఇటీవల కేరళలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభమైంది. తదుపరి షెడ్యూల్లో ఫాహద్ పాల్గొంటారట. అప్పుడు ఈ చిత్రంలో ఫాహద్ విలన్‌గా నటిస్తున్న విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించాలని అనుకుంటోందని సమాచారం. సూర్య–కీర్తి మళ్లీ కుదిరేనా? సూర్య–కీర్తీ సురేష్ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారా? అంటే అవుననే అంటోంది తమిళ పరిశ్రమ. ఈ ఇద్దరూ జంటగా ‘తానా సేంద కూట్టమ్’ (2018) అనే చిత్రంలో నటించారు. మళ్లీ ఇప్పుడు ఈ కాంబినేషన్లో సినిమా రూపొందనుందనే ప్రచారం జరుగుతోంది. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సూర్యకి జోడీగా కీర్తీ సురేష్ నటించనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి ‘796 సీసీ’ అనే టైటిల్ అనుకుంటున్నారట. ‘సార్, లక్కీ భాస్కర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కించనున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ప్రీ ్రపొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో సూర్యకు జోడీగా కీర్తీ సురేష్‌ను ఎంపిక చేశారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి... ఈ వార్తలపై స్పష్టత రావాలంటే వేచి చూడాలి. తమిళ దర్శకుడితో... హీరో కల్యాణ్ రామ్ జోరు మీదున్నారు. ఆయన హీరోగా నటించిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ ఈ నెల 18న విడుదలై, హిట్‌గా నిలిచింది. తన తర్వాతి చిత్రాన్ని తమిళ దర్శకుడు గిరీశాయతో చేయనున్నారట కల్యాణ్ రామ్. తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని తమిళంలో ‘ఆదిత్య వర్మ’ పేరుతో రీమేక్ చేశారు గిరీశాయ. ఈ సినిమా కోలీవుడ్‌లోనూ హిట్‌గా నిలిచింది. కాగా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘రంగ రంగ వైభవంగా’ (2022) సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమయ్యారు గిరీశాయ. తాజాగా కల్యాణ్ రామ్ కోసం ఓ కథని సిద్ధం చేశారట ఆయన. యాక్షన్ డ్రామా నేపథ్యంలో రొటీన్ ఫార్ములాకు భిన్నంగా సాగే ఈ కథ కల్యాణ్ రామ్‌కి కూడా నచ్చిందట. దీంతో తన తర్వాతి మూవీని గిరీశాయ దర్శకత్వంలో చేయనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ తర్వాత ‘బింబిసార 2’ చేస్తారనే ప్రచారం సాగింది. అయితే డైరెక్టర్ వశిష్ఠ ప్రస్తుతం చిరంజీవి హీరోగా ‘విశ్వంభర’ సినిమా తెరకెక్కిస్తున్నారు. దీంతో ‘బింబిసార 2’ మొదలయ్యేందుకు మరికొంత సమయం పట్టనుంది. ఈలోపు గిరీశాయ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు కల్యాణ్ రామ్ ఆసక్తిగా ఉన్నారని టాక్. ఇక కల్యాణ్ రామ్, గిరీశాయ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అరవై రోజుల్లో... డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్టైలే వేరు. సినిమాలను జెట్ స్పీడ్‌లో తెరకెక్కిస్తారనే పేరుంది ఆయనకి. ఎంత పెద్ద సినిమా అయినా మూడు నాలుగు నెలల్లోనే చిత్రీకరణ పూర్తి చేస్తుంటారు. అయితే తన తాజా చిత్రాన్ని కేవలం అరవై రోజుల్లోనే పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట పూరి. ఆయన దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటించనున్నారు. ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటించనున్నారు. కాగా ఈ మూవీకి ‘బెగ్గర్’ అనే టైటిల్ అనుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. పూరి సొంత నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నారట. అందుకే ‘బెగ్గర్’ అనే టైటిల్‌ను లాక్ చేశారని టాక్. మే లేదా జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని కేవలం అరవై రోజుల్లో పూర్తి చేయాలన్నది పూరి జగన్నాథ్ ఆలోచన అట. ఎందుకంటే వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి ‘బెగ్గర్’ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పూరీని కోరారట. అందుకు తగ్గట్టు జెట్ స్పీడ్‌లో షూటింగ్ పూర్తి చేసేందుకు షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారట పూరి జగన్నాథ్. రీమేక్ చిత్రంతో... వైవిధ్యమైన కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు రాజశేఖర్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన తర్వాతి సినిమా ఏంటి? అన్నదానిపై క్లారిటీ లేదు. ఆయన హీరోగా నటించిన చివరి చిత్రం ‘శేఖర్’. ఆయన భార్య జీవిత దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2022 మే 20న విడుదలైంది. ఆ తర్వాత నితిన్ హీరోగా నటించిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్’ (2023) సినిమాలో కీలక పాత్రలో కనిపించారు రాజశేఖర్. ఆ చిత్రం విడుదలై ఏడాదిన్నర దాటినా రాజశేఖర్ తర్వాతి సినిమాపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటన లేదు. ఇదిలా ఉంటే... తమిళంలో ఘన విజయం సాధించిన ‘లబ్బర్ పందు’ సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు రాజశేఖర్ సన్నాహాలు చేస్తున్నారని టాక్. తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వం వహించిన ‘లబ్బర్ పందు’ చిత్రం గత ఏడాది సెప్టెంబరు 20న తమిళంలో రిలీజై, సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు హక్కులు కొనుగోలు చేశారట రాజశేఖర్. పెళ్లీడుకి వచ్చిన కూతురు ఉన్న ఒక వ్యక్తికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయిని ప్రేమించే అబ్బాయికి కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెట్, ప్రేమ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం కోలీవుడ్‌లో హిట్‌గా నిలిచింది. ఈ మూవీని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథ, కథనంలో మార్పులు చేసి, రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట రాజశేఖర్. మరి... ఈ వార్తల్లో వాస్తవం ఏంటన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాలి.– డేరంగుల జగన్ మోహన్ -
‘ఇదిగో చూడు.. చంద్రబాబే చెప్పారు కదయ్యా..!’ ఫ్రీ బస్సు అమలుపై వినూత్న నిరసన (ఫొటోలు)
-
క్షేమంగా భూమిపైకి తిరిగొచ్చిన సునీత విలియమ్స్ (ఫోటోలు)
-
తెనాలికి వైఎస్ జగన్ రాక.. పోటెత్తిన అభిమాన సంద్రం
-
ఘోరంగా కొట్టుకున్న అత్తా కోడళ్లు.. (వీడియో)
మహారాష్ట్ర: మహారాష్ట్రలోని నాసిక్ కోర్టు వెలుపల అత్తాకోడళ్లు జుట్టు పట్టుకుని ఘోరంగా కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కేసు విచారణ కోసం అత్త(58), కోడలు కోర్టుకు చేరుకున్నారు. ఇంతలోనే కోడలి సోదరుడితో అత్త గొడవకు దిగింది. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం పెరగడంతో అత్తాకోడలితో పాటు ఆమె తమ్ముడు, ఇతర కుటుంబీకులు తీవ్రంగా కొట్టుకున్నారు. -
టాప్ న్యూస్ యాప్‌గా ఎక్స్: మస్క్
న్యూఢిల్లీ: భారత్‌లోని యాప్ స్టోర్‌లో సామాజిక మాధ్యమం ఎక్స్ (గతంలో ట్విటర్) ప్రస్తుతం టాప్ న్యూస్ యాప్ అని ఎలాన్ మస్క్ తెలిపారు. భారత్‌లో యాపిల్ యాప్‌స్టోర్‌లో ఎక్స్ మొదటి స్థానంలో నిలిచిన న్యూస్ యాప్ అని డోజ్‌డిజైనర్ అనే ఒక వినియోగదారు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన తర్వాత.. భారత్‌లో వార్తల కోసం ప్లాట్‌ఫామ్ నిజంగా నంబర్ వన్ అయిందని బిలియనీర్ ఎలాన్ మస్క్ అన్నారు.మస్క్ 2022 అక్టోబర్‌లో ఎక్స్‌ను (గతంలో ట్విటర్) 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. స్టాటిస్టా (Statista.com) ప్రకారం, దేశం వారీగా అత్యధిక ట్విటర్ యూజర్ల సంఖ్యలో సుమారుగా 25 మిలియన్లకు పైగా వినియోగదారులతో భారత్ మూడవ స్థానంలో ఉంది. మస్క్ ప్రకటన తరువాత అభినందనలు వెల్లువెత్తాయి.𝕏 is now #1 for news in India! https://t.co/beLobq1Dfo— Elon Musk (@elonmusk) November 22, 2024 -
ఓదార్చి.. ధైర్యం చెప్పి.. వైఎస్ జగన్ గుర్ల పర్యటన (ఫొటోలు)
-
భారత విప్లవ ప్రతీక!
భారతదేశం గర్వించే వీర కిశోరం భగత్ సింగ్. నేటి పాకిస్తాన్లో ఉన్నపంజాబ్ రాష్ట్రంలో 1907 సెప్టెంబర్ 27న జన్మించాడు. చిన్నతనంలో తన బాబాయి సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ... పట్టుబడకుండా ఉండేందుకు విదేశాలలో ఉండేవాడు. ఆ సమయంలో కంటనీరు పెట్టుకొనే చిన్నమ్మను చూసి ‘పిన్నీ ఏడవొద్దు. నేను ఆంగ్లే యులపై ప్రతీకారం తీర్చుకుంటా’ అంటూ ఉండేవాడు.గాంధీ, నెహ్రుల సారథ్యంలో నడుస్తున్న స్వాతంత్రోద్యమంలో చిన్ననాటి నుండే చురుకుగా పాల్గొంటూ వస్తున్న భగత్ సింగ్‌కు స్వాతంత్య్రం యాచిస్తే రాదనీ, శాసిస్తేనే వస్తుందని గ్రహించాడు. రష్యా విప్లవ సాహిత్యాన్ని అధ్యయనం చేసి, గాంధీ కోరిన స్వాతంత్య్రం అంటే తెల్లదొరలు పోయి నల్లదొరలు రావడమేనని అర్థం చేసుకున్నాడు. అందుకే ముందు సోషలిస్టు సమాజం నిర్మించాలని తలంచి తను పనిచేస్తున్న హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌ను, హిందు స్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోషియేషన్‌గా మార్చాడు.బ్రిటిష్ వాళ్లు సాగిస్తున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా నినదించే గొంతులు ఈ దేశంలో ఉన్నాయని తెలియచేసేందుకు కేంద్ర శాసనసభలో బాంబువేసి పారిపోకుండా ‘సామ్రాజ్యవాదం నశించాలి, విప్లవం వర్ధిల్లా ల’నే నినాదాలను చేశాడు భగత్ సింగ్. జలియన్ వాలాబాగ్, చౌరీచౌరా ఘటనలు భగత్ సింగ్‌లో స్వాతంత్య్ర కాంక్షను రగిలిస్తే; సైమన్ కమిషన్ పర్యటన సమయంలో దెబ్బలు తిన్న కారణంగా లాలా లజపతిరాయ్ మరణించడం ప్రతీకారేచ్ఛను కలిగించింది.భగత్ సింగ్‌ను బ్రిటిష్‌వాళ్లు ఉరితీసే కొద్ది రోజుల ముందు ఆయన తండ్రి క్షమాభిక్ష కోసం బ్రిటిష్ వారికి ఉత్తరం రాశారు. తన మరణం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోయగలదనే విశ్వాసం తనదనీ, అందువల్ల బ్రిటిష్ వాళ్లకు చేసిన అభ్యర్థనను వెనక్కి తీసుకోవాలనీ కోరాడు భగత్. అదీ ఆ వీరుని దేశభక్తి! – జి. పవన్ కుమార్, బిజ్వార్ఇవి చదవండి: సీఎం సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం -
Chakali Ailamma: ఆత్మగౌరవ ప్రతీక!
ఆధిపత్య వర్గాల పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి దొరలను గడీల నుంచి ఉరికించి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడిన వీర వనిత చాకలి ఐలమ్మ. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిలో అగ్రగణ్య ఐలమ్మ.ఉమ్మడి నల్లగొండజిల్లా (నేటి జనగాం జిల్లా) పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్య – ఐలమ్మలకు ఆరుగురు సంతానం. వారిది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం. కులవృత్తే వారికి జీవనాధారం. కులవృత్తితో బతకలేక పాలకుర్తికి పక్కనే ఉన్న మల్లంపల్లి దొర కుటుంబానికి చెందిన ఉత్తంరాజు జయప్రదాదేవి వద్ద 40 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుంది ఐలమ్మ. అదే విసునూరు దేశ్‌ముఖ్ రాపాక రామచంద్రారెడ్డికి కంటగింపు అయింది.అప్పుడే వెట్టి గొట్టాలు చేయవద్దని పిలుపునిచ్చి... 1940–44 మధ్య కాలంలో విసునూరులో దేశ్‌ముఖ్‌లు, రజాకర్ల అరాచకా లపై ఎదురుతిరిగి ఎర్రజెండా పట్టి ఆంధ్రమహాసభ (సంఘం)లో చేరింది ఐలమ్మ. దీంతో రామచంద్రారెడ్డి రగిలిపోయాడు. ఆమె కౌలుకు తీసుకున్న భూమిలో కాపు కొచ్చిన పంటను కాజేయాలని పన్నాగం పన్నాడు. గూండా లను పురమాయించారు. ‘ఈ భూమి నాది. పండించిన పంట నాది. తీసుకెళ్లడానికి దొరెవ్వడు... నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలిగేది’ అంటూ తన పంటను దోచుకోవడానికి వచ్చిన దొరగూండాలతో పలికింది ఐలమ్మ.సంఘం కార్యకర్తలు వరిని కోసి, వరికట్టం కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. భీంరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, చకిలం యాదగిరిలు సైతం ధాన్యపు బస్తాలను భుజాలపై మోశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారంతో ఐలమ్మకు అనుకూలంగా కోర్టులో తీర్పువచ్చింది. ఐలమ్మ భూపోరాటం సామాజికంగా దిగువ ఉన్న జనానికి ప్రేరణ, స్ఫూర్తి నిచ్చింది. పల్లెపల్లెన ఉద్యమం ఎగిసిపడి, దొరల ఆధిపత్యం నేలమట్టమైంది. బడుగులను ఆదుకోవడమే ఆమెకు నిజమైన నివాళి! – ఆలేటి రమేష్, రజక విద్యార్థి సంఘం తెలంగాణ ప్రధాన కార్యదర్శిఇవి చదవండి: మహాలక్ష్మి కేసులో షాకింగ్ ట్విస్ట్ -
ఆధ్యాత్మిక సమాచారం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ లైన్ టీబీసీ వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 84,060 మంది స్వామివారిని దర్శించుకోగా 34,985 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.01 కోట్లు సమరి్పంచారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఆగమోక్తంగా మృత్యంజయస్వామికి ప్రత్యేక పూజలు శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలోని మృత్యుంజయస్వామికి సోమవారం ఆగమోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గణపతిపూజ, కలశ స్థాపన పూజలు చేశారు. అనంతరం స్వామివారికి చందనం, నారికేళ, పసుపు, కుంకుమ, విభూథి వంటి వాటితోఅభిõÙకాలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులుచెల్లించుకున్నారు. కనులపండువగా రాధాకృష్ణుల కల్యాణం రాపూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు సమీపంలోని మద్దెలమడుగులో ఉన్న రాధాసమేతర గోపాలకృష్ణమందిరంలో సోమవారం కృష్ణాష్టమినిపురస్కరించుకుని రాధా కృష్ణుల కల్యాణం రంగరంగవైభవంగా నిర్వహించారు.శ్రీమఠంలో గోకులాష్టమి వేడుకలు మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాతి్మక కేంద్రమైన కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో గోకులాష్టమి వేడుకలు సోమవారం వైభవంగా జరిగాయి. శ్రీమఠం ఊంజల మంటపంలో అక్షోభ్య మఠం ఉప పీఠాధిపతి అక్షోభ్య రామప్రియ తీర్థులు ఆశీస్సులతో వేడుకలు నిర్వహించారు. చిన్నారులు కృష్ణుడి వేషధారణలో కనువిందు చేశారు. శా్రస్తోక్తంగా గోపూజ శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఆలయ ప్రాంగణంలోని శ్రీగోకులంలో గోపూజ నిర్వహించారు. ప్రతినిత్యం ఆలయంలో ప్రాతఃకాల సమయంలో నిత్యసేవగా గోపూజ నిర్వహించబడుతున్నప్పటికీ, కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం నిత్యసేవతో పాటు విశేషంగా గోపూజ జరిపించారు. నేడు సింహగిరిపై కృష్ణాష్టమి సింహాచలం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో మంగళవారం శ్రీకృష్ణాష్టమిని వైభవంగా నిర్వహించనున్నట్లు సింహాచలం దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ సంద«ర్భంగా సాయంత్రం 6 గంటల వరకే స్వామివారి దర్శనాలు భక్తులకు లభిస్తాయని పేర్కొన్నారు. నేడు అష్టదళ పద్మారాధన డాబాగార్డెన్స్ : ఉత్తరాంధ్ర కల్పవల్లి, విశాఖ వాసుల ఆరాధ్యదైవం కనక మహాలక్ష్మికి 108 స్వర్ణ పుష్పాలతో మంగళవారం అష్టదళ పద్మారాధన నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు నిర్వహించనున్న ప్రత్యేక పూజలో పాల్గొనదలచే భక్తులు రూ.1,116 చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలి. వివరాలకు 0891 2711725, 2566514లో సంప్రదించాలి. నేడు ద్వారకా తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు ద్వారకాతిరుమల: శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మంగళవారం నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు ఆలయ ఈఓ తెలిపారు. బుధవారం క్షేత్రంలో ఉట్ల పండుగను, స్వామివారి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. పంచారామ క్షేత్రంలో భక్తుల కిటకిట సామర్లకోట: శ్రావణ మాసం సోమవారం పురస్కరించుకుని కాకినాడ జిల్లాలోని పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరి సమేత చాళుక్య కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు కిటకిటలాడారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న శివలింగానికి నీటితోను, పాలతోను స్వయంగా అభిషికాలు చేశారు. ధ్వజ స్తంభం, పెద్ద నంది, ఉప ఆలయాలు, మూల విరాట్లతో పాటు స్వామివారిని, అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. -
హరిత భవనాలే రక్ష!
జనాభాతో పాటుగా ఇంటి నిర్మాణాలు పెరిగి పర్యావరణ సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యలను నివారించడానికి ఆహ్లాదకరమైన, ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూల జీవన శైలిని కొనసాగించడానికి హరిత భవనాలు ఎంతో ఉపయోగపడతాయి. పర్యావరణ అనుకూల మెటీరియల్, డిజైన్‌తో భవనాన్ని నిర్మించి, పర్యావరణ అనుకూలంగా ఏ భవనాలనైతే నిర్వహిస్తారో వాటిని ‘హరిత భవనాలు’ అంటారు.ఈ భవన నిర్మాణంలో స్థలం ఎంపికకూ ప్రాధాన్యం ఉంది. అంటే పర్యావరణ సున్నితమైన ప్రదేశాలలో హరిత భవనాలను నిర్మించరాదు. ఉదాహరణకు అధిక మొత్తంలో వ్యవసాయ దిగుబడిని ఇచ్చే సారవంతమైన వ్యవసాయ భూములను హరిత భవనాల నిర్మాణాల కోసం వాడరాదు. దీని వలన మనం ప్రకృతి సిద్ధంగా లభించిన విలువైన వ్యవసాయ భూమిని కోల్పోతాము. ఇది ఆహార ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది.సహజసిద్ధంగా గాలి, వెలుతురు వచ్చే విధంగా వీటి నిర్మాణాన్ని చేపడతారు. వెలుతురు బాగా ఉండే గదులలో చదివే విద్యార్థులు నేర్చుకునే సామర్థ్యం, వెలుతురు సరిగ్గా లేని గదిలో చదివే విద్యార్థుల కన్నా 20 నుండి 26 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలలో తేలింది. హానికర రసాయన పదార్థాలు కలిగిన లెడ్ పెయింట్లు భవనాల లోపల గాలి నాణ్యతను హానికరంగా మారుస్తాయి కావున వాటి స్థానంలో సహజ సిద్ధమైన రంగులను వాడతారు. ఇండోర్ ప్లాంట్స్ ఏర్పాటు కూడా ఈ భవనాలలో ఉంటుంది. దీనివలన భవనాల లోపల గాలి నాణ్యత పెరుగుతుంది.తక్కువ విద్యుత్‌ను వినియోగించే ఎల్ఈడీ బల్బ్‌లను, ఇతరత్రా తక్కువ విద్యుత్‌ను వినియోగించుకొనే ఎలక్ట్రానిక్ పరికరాలను వాడటం వలన ఈ భవనాలలో తక్కువగా విద్యుత్ ఖర్చవుతుంది. అదేవిధంగా సోలార్, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక విద్యుత్‌ను వాడటం వలన గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడంలో హరిత భవనాలు కీలక పాత్ర వహిస్తాయి. హరిత భవన పైకప్పులో కాంతిని రిఫ్లెక్ట్ చేసే పదార్థాలను వాడటం వల్ల ఇంటి పైకప్పు వేడి తగ్గుతుంది. పైకప్పు భాగంలో చిన్న, చిన్న మొక్కలను పెంచడం వలన వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ వాయువులను ఇవి గ్రహిస్తాయి. అదేవిధంగా ఇంటి పై కప్పు భాగంలో జీవ వైవిధ్యం పెరిగి సీతాకోకచిలుకలు, పక్షులు వంటి వాటిని ఆకర్షించడం వలన భవనం ఆకర్షణీయంగా మారుతుంది.ఈ భవనాలలో సేంద్రియ వ్యర్థ పదార్థాలను బయో గ్యాస్‌గా మార్చడం లేదా సేంద్రియ ఎరువుగా మార్చి ఉపయోగించే ఏర్పాట్లు ఉంటాయి. వాడిన నీటిని శుద్ధిచేసి తిరిగి గార్డెనింగ్, ఇతరత్రా పనులకు వినియోగించడం వలన నీరు వృథా కాదు. ఈ నిర్మాణాలలో వర్షపు నీరును పట్టి భూమిలోకి ఇంకిపోయేలా చేసే ఏర్పాట్లు ఉండడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న హరిత భవనాలు వాతావరణ మార్పుల నుండి మానవాళిని రక్షించగలుగుతాయి అనడం అతిశయోక్తి కాదు. – డా. శ్రీధరాల రాము, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, హైదరాబాద్ -
జూన్ 1 నుంచి సెబీ కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: మార్కెట్ వదంతుల ప్రభావంతో షేర్ల ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటాన్ని కట్టడి చేసే దిశగా సెబీ కొత్త నిబంధనలు ప్రకటించింది. జూన్ 1 నుంచి ఇవి టాప్ 100 లిస్టెడ్ కంపెనీలకు వర్తిస్తాయి. డిసెంబర్ 1 నుంచి తదుపరి 150 కంపెనీలకు వర్తిస్తాయి. వీటి ప్రకారం తమ షేర్ల ధరలను ప్రభావితం చేసే వదంతులేవైనా వస్తే లిస్టెడ్ కంపెనీలు 24 గంటల్లోగా ధృవీకరించడమో లేదా ఖండించడమో లేదా స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, కంపెనీల విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్‌ఈ) డీల్స్ విషయంలో ’అప్రభావిత ధర’ కాన్సెప్టును కూడా సెబీ ప్రతిపాదించింది. దీని ప్రకారం వదంతుల ప్రభావమేమీ లేనప్పుడు షేరు సగటు ధర ఎంత ఉందో దాన్ని ఎంఅండ్‌ఈ డీల్స్ కోసం పరిగణనలోకి తీసుకోవచ్చు. దీన్ని లెక్కించేందుకు సెబీ నిర్దిష్ట విధానాన్ని సూచించింది. -
'ఉత్తర కాశీలో మా కళ్ల ఎదుటే భవనాలన్నీ కూలిపోయాయి'
-
పపువా న్యూగినియాలో భూకంపం.. 6.9 తీవ్రత నమోదు!
పపువా న్యూ గినియాలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దేశంలోని తూర్పు సెపిక్ ప్రావిన్స్‌లో 6.9 తీవ్రతతో భారీ భూకంపం చోటుచేసుకుందని, కొంతమేరకు ప్రాణ నష్టం జరిగివుండవచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) తెలిపింది. ఇక్కడ మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉందని యూఎస్జీఎస్ హెచ్చరించింది. ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం అంబుంటి ప్రాంతంలో భూకంప ప్రకంపనలు సంభవించాయి. దీని కేంద్రం భూమి కింద 35 కిలోమీటర్ల లోతున ఉంది. దీనికి ముందు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జీఎఫ్జెడ్) తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర పపువా న్యూ గినియాలోని మారుమూల ప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 65 కిలోమీటర్ల లోతున ఉంది. ప్రస్తుతానికి సునామీ ముప్పు లేదని అధికారులు తెలిపారు. ఈ విపత్తులో ఎంత ప్రాణనష్టం జరిగిందనే సమాచారం ఇంకా అందలేదు. ఈ భూకంపం కారణంగా ఆస్ట్రేలియాలో సునామీ ప్రమాదం లేదని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ తెలిపింది. కాగా 6.9 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం పెను విపత్తుకు దారితీసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పపువా న్యూ గినియా ప్రాంతం ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో ఉంది. ఇక్కడ భూకంపాలు సర్వసాధారణం. గత ఏడాది ఏప్రిల్‌లో ఇదే ప్రాంతంలో 7.0 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. అప్పుడు ఏడుగురు మృతి చెందారు. -
నాన్న..! 'నాకు మాట్లాడాలని ఉంది'..
కరీంనగర్: ఆ కుటుంబంలో మొదటి సంతానంగా పాప జన్మించింది. ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందని సంబరపడ్డారు. ఆ సంబరం ఏడాది తిరగకముందే ఆవిరైంది. పాపకు మాటలు రాకపోవడంతో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఆస్తులు అమ్ముకొని కొంత, దాతల సహకారంతో కొంత సొమ్ము సేకరించి కేంద్ర ప్రభుత్వ పథకంతో ఆపరేషన్ చేయించినా, లక్షల్లో ఖరీదు చేసే హియరింగ్ మిషన్ల కొనుగోలుకు డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాపకు మాటలు రావాలంటే మిషన్లకు, హియరింగ్ థెరపీకి రూ.11 లక్షలు అవసరముండడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కూతురు తపన.. తండ్రి ఆవేదన! కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లె గ్రామానికి చెందిన పోతు రాజశేఖర్, కావ్యశ్రీ దంపతులకు 2016లో రిషిత జన్మించింది. ఆరోగ్యంగానే ఉన్న పాప ఏడాది వయస్సు వచ్చినా మాట్లాడకపోవడంతో అనుమానం వచ్చి ఆసుపత్రిలో చూపించారు. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాపకు పుట్టుకతోనే మూగ, చెవుడు సమస్య ఉన్నట్లు గుర్తించారు. స్పీచ్ థెరపీతో మాటలు వస్తాయని చెప్పడంతో 2017లో తిరుపతిలోని శ్రవణం స్వీచ్ థెరపీ ఆస్పత్రిలో ఏడాది పాటు ఉండి చికిత్స అందించారు. అయినా ఫలితం లేకపోవడంతో 2018లో దాతల సాయంతో రూ.1.5 లక్షలతో వినికిడి యంత్రం కొనుగోలు చేసినా పాపకు ఉపయోగపడలేదు. మళ్లీ 2019లో హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి వెళ్లగా ఆపరేషన్ చేస్తే నయం అవుతుందని తెలిపారు. ఆపరేషన్‌కు రూ.15 లక్షలు ఖర్చవుతాయని చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. కేంద్ర పథకం అడిప్ స్కీం కింద అవకాశం ఉండడంతో దరఖాస్తు చేసుకున్నారు. అడిప్ స్కీం కింద తల లోపల కాక్లర్ ఇంప్లాట్ మిషన్ వేశారు. ఆపరేషన్ చేయడం ఒక ఎత్తయితే, తర్వాత హియరింగ్ మిషన్ కొనుగోలు చేయడం తలకుమించిన భారంగా మారింది. ఆపరేషన్ తర్వాత ప్రతీ రెండు నెలలకోసారి ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించాలి. ఈ క్రమంలో చెవిలో ఇన్ఫెక్షన్ సోకడంతో 2022లో మరోసారి ఆపరేషన్ చేయించారు. ఓ బిల్డర్ వద్ద సూపర్వైజర్గా పనిచేసుకునే రాజశేఖర్ తరచూ బిడ్డను ఆసుపత్రులకు తీసుకెళ్తున్న క్రమంలో ఉద్యోగం కూడా పోయింది. దీంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఊళ్లో ఉన్న ఇల్లు అమ్మినా అప్పులు తీరలేదు. ప్రస్తుతం రేకుర్తిలో ఉంటున్నారు. రిషిత మాట్లాడాలంటే కుడి చెవికి రూ.7.5 లక్షల విలువైన న్యూక్లియర్–8 మిషన్, ఎడమ చెవికి రూ.1.5 లక్షల మరో మిషన్ అవసరముంది. వీటిని కొనుగోలు చేసినా ప్రతినెలా రూ.13 వేలు వెచ్చించి రెండేళ్లపాటు స్పీచ్ థెరపీ అందించాల్సి ఉంటుంది. సుమారు రూ.11 లక్షలు ఖర్చు చేస్తే తప్ప పాప మూగ గొంతుకు మాటలు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన రాజశేఖర్ కూతురు కోసం రోదిస్తున్నాడు. పాపపై కరుణతో హృదయమున్న దాతలు సహకరించాలని వేడుకుంటున్నాడు. రాజశేఖర్‌కు సహాయం చేయాలనుకునేవారు: అకౌంట్ నంబర్ : 20343433912 ఎస్బీఐ బ్యాంకు, ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్బీఐఎన్0014237, ఫోన్‌పే/గూగుల్‌పే నంబర్ : 77024 88503. ఇవి చదవండి: డూప్లెక్స్ ‘ఇందిరమ్మ’! -
చర్చకు తేవాల్సిన అంశాలెన్నో..
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి జిల్లాకు సంబంధించి చాలా అంశాలు అసెంబ్లీలో చర్చకు రావాలని జిల్లావాసులు కోరుతున్నారు. గ్రేటర్ వరంగల్ చుట్టుపక్కల ఔటర్ రింగు రోడ్డు పనులకు 2017 అక్టోబర్‌లో అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రూరల్ జిల్లాలోని టెక్స్టైల్ పార్కు స్థలంలోనే శిలాఫలకం వేశారు. నగరం చుట్టూ 69 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్డును ప్రతిపాదించారు. 29 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ రాంపూర్ నుంచి దామెర వరకు నిర్మించింది. మరో 40 కిలోమీటర్ల మేర పెండింగ్ పడింది. వరంగల్ మహా నగరాన్ని అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ముంపు బెడద 15 ఏళ్లుగా ఉంది. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మంత్రిగా ఉండగా.. ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి చెందినవారే. వరంగల్ నగరాభివృద్ధితో పాటు వరంగల్, వరంగల్ పశ్చిమతో పాటు వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల శివారు గ్రామాల్లో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. మడికొండలో మూడు నక్షత్రాల హోటల్‌తో స హా, హైదరాబాద్‌లోని హైటెక్స్ తరహాలో అంతర్జాతీయ సమావేశ, వాణిజ్య ప్రదర్శనల కేంద్రం (వైటెక్స్) నిర్మించేందుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. దీన్ని పీపీపీ మోడ్‌లో నిర్మించి నిర్వహించేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర పారి శ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ భూసేకరణ చేసి ఇవ్వాల్సి ఉంది. నిధులిస్తేనే ఇవన్నీ జరిగేది. జయశంకర్ భూపాలపల్లి నుంచి ములుగు కొత్త జిల్లాగా ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా పాలనపరంగా ఇంకా కుదుటపడేందుకు వసతులు కల్పించాలి. ఉమ్మడి వరంగల్‌లో పలు ప్రాజెక్టులు, పథకాలపై స్పష్టత ఇచ్చేలా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు. వరంగల్‌లోని మామునూరులో విమానాశ్రయం రావాలన్న ఎన్నో ఏళ్ల కల నెరవేరడం లేదు. ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు 700 ఎకరాలకుపైగా స్థలం అందుబాటులో ఉంది. మరో 200 నుంచి 400 ఎకరాల భూసేకరణ అవసరమని, గత ప్ర భుత్వం సేకరించి ఇస్తామన్నా సాధ్యం కాలేదు. ఇదివరకే మట్టి నమూనా పరీక్షలు కూడా నిర్వహించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్లు రెండేళ్లుగా భూకేటాయింపుల కోసం ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్నట్లు వరంగల్లోనూ మెట్రో రైలును తీసుకొచ్చేందుకు చేసిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. మెట్రో నియో రైలు ప్రాజెక్టుకు కాకతీయ పట్ట ణాభివృద్ధి సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించి మూడేళ్ల కిందట ప్రభుత్వానికి సమర్పించింది. రూ.1100 కోట్ల అంచనా వ్యయంతో కాజీపేట నుంచి వరంగల్ వరకు 15 కిలోమీటర్ల మేర నిర్మించే ఇందులో సగం నేలపై సగం ఆకాశ మార్గంలో నడిచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈసారైన నిధులు కేటాయిస్తే ఈ ప్రాజెక్టు ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉంది. కాకతీయ మెగా జౌళి పార్కులో పరిశ్రమల ఏర్పాటు, సౌకర్యాల కల్పనకు గత ప్రభుత్వం రూ.574 కోట్లను మంజూరు చేసి రూ.174 కోట్లు విడుదల చేసింది. ఆమేరకు పలు మౌలిక వసతులు కల్పించగా.. మరో రూ.400 కోట్లు రావాల్సి ఉంది. పార్కులో కొన్ని ప్రాంతాల్లో రహదారులను నిర్మించి, విద్యుత్ సరఫరా కోసం ఉపకేంద్రాన్ని నిర్మించారు. మిషన్ భగీరథ ద్వారా 12 ఎంఎల్డీ సామర్థ్యం గల వ్యవస్థను ఇంకా నిర్మించుకోవాల్సి ఉంది. మొత్తం 1200 ఎకరాల్లో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన నిధులు, అన్ని రకాల వసతులు తీర్చుదిద్దుకుంటే మరికొన్ని వస్త్ర పరిశ్రమలు వచ్చే వీలుంది. భూపాలపల్లికి ఎస్సారెస్పీ, దేవాదుల నుంచి సాగునీటి పంపిణీని మెరుగుపర్చాలి. చిన్నకాళేశ్వరం పూర్తి చేయాలి. ములుగు జిల్లాలో ములు గు, ఏటూరునాగారంలో బస్సు డిపోల ఏర్పా టు, గోదావరి తీర ప్రాంతాల్లో ముంపు నివారణ చర్యల కోసం కరకట్టల నిర్మాణం చేపట్టాలంటే పెద్దమొత్తంలో బడ్జెట్లో నిధులు రాబట్టాలి. ఇవి చదవండి: ‘కుప్టి’కి నిధులు కేటాయించేలా చూస్తా.. -
ఛత్తీస్‌గఢ్: 13 ఏళ్లలో 11 నక్సల్ ఘాతుకాలు!
ఛత్తీస్‌గఢ్‌లో సాధారణ జనజీవనానికి నక్సలైట్లు విఘాతం కలిగిస్తుంటారు. ఆ రాష్ట్రంలో నక్సలైట్ల దాడులకు సంబంధించిన వార్తలు తరచూ వినిపిస్తుంటాయి. ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నక్సలైట్లు దాడులకు పాల్పడ్డారు. తాజాగా నిన్న (జనవరి 30)న ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్ల సమస్య ఈనాటిది కాదు. 2023 ఏప్రిల్ 26న నక్సలైట్ల దాడిలో 10 మంది డీఆర్జీ సైనికులు వీరమరణం పొందారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్ల భారీ దాడి 2010 ఏప్రిల్ 6న జరిగింది. ఈ ఘటనలో 76 మంది సైనికులు వీరమరణం పొందారు. ఈ దాడితో దేశం మొత్తం ఉలిక్కిపడింది. నక్సలైట్ల దాడిలో సామాన్యులు, ఆర్మీ సిబ్బంది మాత్రమే కాదు, ఒకప్పుడు నక్సలైట్ల దాడిలో పలువురు రాజకీయ నేతలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన 2023, మే 25న జరిగింది. ఆ రోజున జీరం వ్యాలీలో నక్సలైట్లు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో పలువురు కాంగ్రెస్ నేతలతో సహా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 2014, ఏప్రిల్ 12న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో నక్సలైట్లు జరిపిన దాడిలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. 2015 ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో జరిగిన నక్సలైట్ల దాడిలో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి, సామాన్యులకు నక్సలైట్లు ఎప్పుడూ ఇబ్బందులు సృష్టిస్తూనే ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తుంటాయి. 2010 నుంచి నక్సల్స్ భారీ ఘాతుకాలు 2023, ఏప్రిల్ 26 దంతెవాడలో జరిగిన దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. 2021, ఏప్రిల్ బీజాపూర్, సుక్మా సరిహద్దుల్లో 22 మంది సైనికులు వీరమరణం పొందారు. 2020, మార్చి సుక్మాలో జరిగిన దాడిలో 17 మంది సైనికులు అమరులయ్యారు. 2017, ఏప్రిల్ 24 సుక్మాలో జరిగిన దాడిలో 25 మంది సైనికులు వీరమరణం పొందారు. 2017, మార్చి 11 సుక్మాలో జరిగిన దాడిలో 12 మంది జవాన్లు వీరమరణం పొందారు. 2017, మార్చి దంతెవాడలో జరిగిన దాడిలో ఏడుగురు జవాన్లు వీరమరణం పొందారు. 2015, ఏప్రిల్ దంతెవాడలో జరిగిన దాడిలో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. 2014, ఏప్రిల్ 12 జీరం వ్యాలీలో జరిగిన దాడిలో 14 మంది సైనికులు వీరమరణం పొందారు. 2013, మే 25 జీరం వ్యాలీలో జరిగిన దాడిలో కాంగ్రెస్ నేతలు సహా 30 మందికిపైగా మృతి. 2010, ఏప్రిల్ 6 దంతెవాడలో జరిగిన దాడిలో 76 మంది సైనికులు వీరమరణం పొందారు. -
అద్దె బ్యాచ్ దిగింది !
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/తిరుపతి: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలకు తెరతీస్తోంది. ఎన్నడూ లేని విధంగా నలుగురైదుగురు ఉన్న చోటకెళ్లి టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతూ ఆ పార్టీ గెలుస్తోందని అసత్య ప్రచారాలు కల్పిస్తూ ‘చీప్ పాలిట్రిక్స్‌కు’ దిగజారిపోయింది. రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల్లో విజయం కోసం వ్యూహాలు రచించడం సహజం. ప్రజలకు చేసిన మంచి పనులను ఎన్నికల సమయంలో చెప్పుకోవడం, మరోసారి అధికారంలోకి వస్తే మరింత మంచి చేస్తామని ప్రకటించడం పరిపాటి. అయితే ఇందుకు భిన్నంగా ప్రస్తుతం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఏవగింపుగా మారింది. ప్రజాభిమానం కోల్పోయి రోజురోజుకూ పాతాళంలోకి దిగజారిపోయిన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మౌత్ పబ్లిíసిటీ పేరుతో అడ్డదారులు తొక్కుతోంది. ప్రతి నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఎల్లో కిరాయి మూకలను అద్దెకు ఏర్పాటు చేసుకుని టీ దుకాణాలు, సెలూన్ల వద్ద తిష్టవేసి అధికార పక్షంపై అసత్య ప్రచారం చేయించుకునే దుస్థితికి వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా సీఎం జగన్ మోహన్‌రెడ్డిని దూషించడమే పనిగా పెట్టుకుని అద్దెబ్యాచ్ పట్టణాల్లో తిరుగుతోంది. టీడీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యం సహకారంతో విద్యార్థులను రంగంలోకి దింపినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి కళాశాల నుంచి కొంత మంది విద్యార్థులను ఎంపిక చేసుకుని వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించినట్లు తెలిసింది. అద్దె బ్యాచ్‌కు శిక్షణ ఇచ్చి.. క్షేత్రస్థాయిలోకి వెళ్లి వైఎస్సార్సీపీ అభ్యర్థులను టార్గెట్ చేయటంతో పాటు ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్‌పై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయాలని ఆదేశాలిచ్చారు. శిక్షణా తరగతులను మొదటి, రెండు, మూడు బ్యాచ్‌లుగా విభజించి ఖమ్మం జిల్లాలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మొదటి విడతగా నియోజక వర్గానికి ఇద్దరు విద్యార్థుల చొప్పున రంగంలోకి దింపారు. వీరిపైన జిల్లాకు ఒక కో ఆర్డినేటర్‌ని నియమించారు. ఈ ఇద్దరు రోజూ ఎక్కడెక్కడ తిరిగారు, ఏం చేశారు? అక్కడ పరిస్థితులు ఏంటి అనేది జిల్లా కో ఆర్డినేటర్‌కి నివేదిక రూపంలో అందిస్తారు. దానిని అమరావతిలో ఉండే టీం లీడర్‌కి పంపుతారు. దాదాపు 5 వేల మందికి శిక్షణ ఇచ్చి నగర, పట్టణ ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. లోకల్‌గా కొంతమందిని రిక్రూట్ చేసుకుని వారితో సమన్వయం చేసుకుంటూ అద్దె బ్యా చ్ మౌత్ పబ్లిíసిటీ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల నెల్లూరు రూరల్ ప్రాంతంలో అద్దె బ్యాచ్ టీ దుకాణాల వద్ద చేస్తున్న అసత్య ప్రచారాన్ని కొందరు స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఆ బ్యాచ్ ఆ ప్రాంతాన్ని వదిలి పరారైన ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు, మూడు విడతల్లో మండల, సచివాలయాలు.. మొదటి విడత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు పూర్తయ్యాక మరొక బ్యాచ్ రంగంలోకి దిగుతుంది. సంక్రాంతి తరువాత మండల, సచివాలయ కేంద్రాలను ఎంపిక చేసుకోనున్నట్లు తెలిసింది. పట్టణాలు, నగరాలు అయితే అద్దె బ్యాచ్ ఎవరనేది ఎవ్వరూ ప్రశ్నించరు. కాబట్టి వారికి ఆ బాధ లేదు. మండల, సచివాలయ కేంద్రాలకు వెళ్లే సమయంలో స్థానిక నాయకుల సహకారంతో రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే స్థానిక నాయకులకు అధిష్టానం నుంచి ఆదేశాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. స్థానిక నాయకులతో కలిసి పర్యటిస్తారు. ఒక అద్దె వ్యక్తి స్థానికుడు ఒకరు ఉంటారు. అలా ఇద్దరికి ఇద్దరు పర్యటిస్తారు. టీ కొట్లు, చిన్న బంకుల వద్ద కూర్చొని అబద్దపు ప్రచారాలకు పదును పెడుతారు. స్థానిక టీడీపీ కార్యకర్త ప్రభుత్వం గురించో, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ గురించో ప్రస్తావన చేస్తారు. అద్దె వ్యక్తి ‘అవునంటన్నా. మా బంధువుకి అలా జరిగిందంట, వైఎస్సార్సీపీ వాళ్లు ఇలా చేశారంట’ అని శృతి కలుపుతాడు. నలుగురు కలిసి ఒక అబద్దాన్ని నిజం చేసేందుకు తీవ్రంగానే కృషి చేయటానికి పక్కా ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లు సమాచారం. మూడో బ్యాచ్‌లో బరి తెగింపుడే ఇక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక మూడవ బ్యాచ్ రంగంలోకి దిగే పనిలో ఉంది. ఈ బ్యాచ్ అన్నింటికీ తెగించిన వారికి ప్రస్తుతం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. షెడ్యూల్ వచ్చాక అబద్దాలు ప్రచారం చేయటం కంటే.. స్థానికంగా గొడవలు సృష్టించేందుకే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. మద్యం దుకాణాల వద్ద, లేదా మద్యం సేవించే ప్రాంతాలను ఎంపిక చేసుకుని స్థానికుల మధ్య గొడవలు పెట్టటం లేదా వీరే స్థానికులను రెచ్చగొట్టి విధ్వంసాలకు లాగటమే వీరి స్కెచ్‌గా తెలుస్తోంది. మద్యంపై విషప్రచారం చేయటం, స్థానికులను కొట్టడం, లేదా వారి వద్ద వీరు దెబ్బలు తినటమే ప్రధాన లక్ష్యంగా రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. ఘోర పరాభవాన్ని గుర్తెరిగే.. గత ఎన్నికల్లో మాదిరిగా ఘోర పరాభవాన్ని గుర్తెరిగే టీడీపీ ఇలాంటి నీతిమాలిన చర్యలకు పూనుకొంటోంది. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాభివృద్ధితో ఆ ప్రభుత్వానికి ప్రజల్లో పరపతి పెరిగింది. మరోసారి కూడా వైఎస్సార్సీపీ వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఒంటరిగా ఎదుర్కొనే సత్తా లేక అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఎన్నికల బరిలోకి దిగే ప్రయతాన్ని టీడీపీ చేస్తోంది.అయినా ప్రజల్లో టీడీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో మౌత్ పబ్లిíసిటీని నమ్ముకొని దానినే కార్యరూపంలోకి తీసుకొచ్చారు. టీ స్టాళ్లు, సెలూన్లే వేదికలు టీడీపీ కిరాయి మూకలు నగరాలు, పట్టణా ల్లోని టీ దుకాణాలు, సెలూన్లను వేదికగా చేసుకుంటున్నాయి. సాధారణ వ్యక్తుల్లా వెళ్లి అక్కడే తిష్ట వేస్తారు. వారి చేతిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉంటుంది. ఆ పత్రికలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వార్త లను చదువుతున్నట్లు నటిస్తారు. వార్త ల సారాంశంపై పక్కనున్న వారితో చర్చ పెడతారు. ఆపై ఇదేం ప్రభుత్వం, ఎక్కడ చూసినా ప్రజలు ఛీదరించుకుంటున్నారు. ఎక్కడా రోడ్లు వేయలేదు, అభివృద్ధి జరగలేదు, రాష్ట్రం అప్పులు చూస్తే కొండలా పెరిగిపోతున్నాయి, సంక్షేమం అంటూ బటన్లు నొక్కి తిరిగి ధరలు పెంచి మన నుంచి డబ్బులు లాగేసుకుంటున్నారంటూ పెదవి విరుస్తారు. ఇలా ఎల్లో కిరాయి మూ కలు తమ నటనను ప్రదర్శిస్తారు. అంతే కాకుండా లోకల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకు టికెట్ రాదని, ఆయన అవినీతి చేశాడని.. టీడీపీలోకి వలసలు జోరుగా జరుగుతున్నాయంటూ భజన ప్రారంభిస్తారు. టీడీపీ, జనసేన జోడీ బాగుంది.. ఉత్తరాంధ్రలో అంతా టీడీపీ, జనసేన కూటమికే ఎక్కువ సీట్లు వస్తాయని, ఈ దఫా ఈ కూటమికే అధికారం వస్తుందని పదేపదే చెబుతారు. ఆ షాపుల వద్ద జనం ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే అక్కడ తిష్ట వేసి ఇలా తమ నటనను ప్రదర్శిస్తారు. దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా నేర్పరితనంతో వ్యవహరిస్తారు. -
ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన నిర్మల్ వాసి
ఉపాధి నిమిత్తం ముంబైలో.. జిల్లాకేంద్రంలోని బంగల్పేట్ వాస్తవ్యుడైన బిట్లింగు రాజేంద్ర ఉపాధి నిమిత్తం ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నాడు. ఆరుపదుల వయసులో విభిన్న కళల్లో ఆరితేరి ఔరా..అనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఓ ప్రముఖ యాడ్ ఏజెన్సీలో పనిచేస్తుండగా, మరోవైపు బియ్యపు గింజలపై విభిన్న చిత్రాలు గీస్తున్నాడు. కళలపై అభిరుచి.. రాజేంద్ర పదేళ్ల వయసులో చిత్రకళపై మక్కువ పెంచుకున్నాడు. టెన్త్ పూర్తయిన తర్వాత ఉన్నత చదువుల కంటే కళలపై ఉన్న అభిరుచిని వృత్తిగా మలుచుకున్నాడు. కాలిగ్రఫీలో ముద్రణలాగా ఉండే వీరి చేతిరాత (దస్తూరి) చూపరులను ఇట్టే ఆకట్టుకుంటోంది. శిల్పకళలో జీవకళ ఉట్టిపడేలా దేవతామూర్తులు, దేశనాయకుల విగ్రహాలను తీర్చిదిద్దుతున్నారు. దుర్గాదేవి అమ్మవారు, బతుకమ్మ పండుగ చిత్రాలు, రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు, ప్రకృతి రమణీయతను ప్రదర్శించే చిత్రాలు, దేశప్రముఖుల చిత్రపటాలు గీయడంలో ఈయనకు సాటి ఎవరూ లేరు. భగవద్గీతతో అరుదైన గుర్తింపు! భగవద్గీతను దాదాపు 8 మిల్లీమీటర్లు, 15 మిల్లీమీటర్ల పరిమాణంలో 4 సూక్ష్మ గ్రంథాల్లో భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలను సూక్ష్మీకరిస్తూ తీర్చిదిద్దాడు. సూక్ష్మగ్రంథాల్లో 18 అధ్యాయాలతోపాటు 701 శ్లోకాలు చేతిరాతతోనే గ్రంథస్తం చేశాడు. పది రోజుల్లోనే పూర్తిచేసి వారం క్రితమే హార్వర్డ్ వరల్డ్ రికార్డులో నమోదు కావడంతో అరుదైన గుర్తింపు పొందాడు. భగవద్గీత గ్రంథంలో ఒక్కొక్క చిత్రం ఒక్క మిల్లీమీటర్ పరిమాణంలో ఉండడం విశేషం. ఇంత సూక్ష్మంగా అబ్బురపర్చే చిత్రాలు గీయడం, గ్రంథాలు, శిల్పాలు, ప్రతిమలను తీర్చిదిద్దడం, కాన్వాస్ పెయింటింగ్ చేయడం ఈయన ప్రత్యేకత. బియ్యపు గింజలపై లతామంగేష్కర్, కార్గిల్ విజయం, అబ్దుల్ కలాం, తిరుమల శ్రీవేంకటేశ్వరుడు వంటి ప్రతిమలను రూపొందించారు. దేవతామూర్తుల శిల్పాలు రూపుదిద్దడం, కాన్వాస్‌లపై అందమైన వేసిన ప్రకృతి చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ప్రముఖుల నుంచి ప్రశంసలు, పురస్కారాలు సైతం అందుకున్నారు. -
రాహుల్‌గాంధీ ఇచ్చిన భరోసా హామీ కోసం చూస్తున్నా..
ఆదిలాబాద్: ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు మూడ లక్ష్మి. నిర్మల్‌రూరల్ మండలంలోని కౌట్ల–కే గ్రామం. గల్ఫ్ కార్మికుడైన భర్తను పోగొట్టుకుంది. శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు అందించింది. గతేడాది నవంబర్ 6న కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా హైదరాబాద్ సమీపంలోని బాచుపల్లిలో తన పదినెలల పసిపాప సాత్వికతో కలిసి తన గోడును విన్నవించుకుంది. ఆ పసిపాపది మాట్లాడే వయసు కూడా కాదు. గల్ఫ్ మృతుడి భార్య దీనస్థితిని చూసి చలించిన రాహుల్‌గాంధీ తనతో పాటు యాత్రలోని కాంగ్రెస్ నాయకులు ప్రస్తుత రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆ కుటుంబానికి సాయం అందేలా చూడాలని సూచించారు. నిర్మల్ జిల్లాలోని కౌట్ల–కే గ్రామానికి చెందిన మూడ అశోక్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశమైన అబుదాబి వెళ్లాడు. అక్కడ అనుకొని ఘటనలో మృతి చెందాడు. అయితే అతడికి అప్పటికే భార్య మూడ లక్ష్మితో పాటు ఆరేళ్లలోపు ఇద్దరు పిల్లలు, పది నెలల పసిపాప సాత్విక ఉంది. ఈ చిన్నారికి పుట్టుకతోనే అనారోగ్య సమస్య ఉండడంతో రాహుల్‌గాంధీని కలిసిన అనంతరం నాలుగు నెలలకే మృత్యుఒడికి చేరుకుంది. సంవత్సరం దాటిపోతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొలువుతీరింది. అనంతరం ఆరు గ్యారెంటీల అమలు నిమిత్తం ప్రస్తుతం ప్రజాపాలన కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారం గల్ఫ్ మృతుల కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని వేడుకుంటోంది. తన భర్త అశోక్ గతేడాది జూలై 24న అబుదాబి దేశంలో మరణించడంతో తన కుటుంబ జీవనం కష్టతరంగా మారిందని వాపోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, తదితర నాయకుల హామీ మేరకు తమ కుటుంబాన్ని ఆదుకోవాలని విన్నవిస్తోంది. ఇదే అంశంపై శుక్రవారం నిర్మల్ రూరల్ మండలంలోని కౌట్ల(కె) గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలనలో దరఖాస్తు సమర్పించింది. -
ప్రభుత్వాల మార్పుతో 'సెర్ప్' పే స్కేల్ అమలుపై అతలాకుతలం!
నిజామాబాద్: న్యాయబద్ధమైన తమ హక్కులను సాధించుకోవడానికి ముడుపులు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడిందని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఉద్యోగులు వాపోతున్నారు. గత ప్రభుత్వ పెద్దలు, కొందరు ఉన్నతాధికారులు అడిగినంత ఇచ్చినా పే స్కేల్ అమలులో సరైన న్యాయం జరుగలేదని ఉద్యోగులు సామాజిక మాధ్యమాలల్ల చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో సెర్ప్ ఉద్యోగులు ఇప్పుడు గత ప్రభుత్వ పనితీరును తప్పుపడుతూ గత పది రోజుల నుంచి పే స్కేల్ అమలులో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలపై చర్చించుకోవడం గమనార్హం. సెర్ప్ సంస్థలో కమ్యునిటీ కో–ఆర్డినేటర్లు, ఏపీఎం, డీపీఎం, ఏపీడీలు అందరూ గతంలో కాంట్రాక్టు పద్ధతిన నియమించిన వారే. రాష్ట్ర వ్యాప్తంగా 3వేల వరకు ఉండగా మన జిల్లాలో 216 మంది ఉన్నారు. పే స్కేల్ అమలు చేసినా ఉద్యోగుల క్యాడర్‌ను తగ్గించడంతో తాము ఆశించిన వేతనం లభించడం లేదన్నారు. సీసీలను జూనియర్ అసిస్టెంట్, ఏపీఎంలను సీనియర్ అసిస్టెంట్, డీపీఎంలను సూపరింటెండెంట్, ఏపీడీలను ఎంపీడీవో స్థాయి అధికారులుగా గుర్తించారు. క్యాడర్ గుర్తింపులో తేడా స్పష్టంగా ఉండటంతో పే స్కేల్ వర్తించినా ఆశించిన వేతనం దక్కడం లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దమొత్తంలో వసూలు చేసిన ఉద్యోగ సంఘం ప్రతినిధులు క్యాడర్ గుర్తించడంలో న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంపై వత్తిడి తీసుకురాలేదని ఉద్యోగులు అంటున్నారు. ఏది ఏమైనా గత ప్రభుత్వ హాయంలో చోటు చేసుకున్న పరిణామాలు కొత్త ప్రభుత్వంలో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో వేచి చూడాలి. ఇవి కూడా చదవండి: సీఎం రేవంత్‌రెడ్డి రెడ్‌డైరీలో బోధన్ ఏసీపీ పేరు..! -
'ఆర్టీసీ ఫుల్.. ఆటో నిల్' ఇదేమి ఖర్మరా మాకు! : ఆటో డ్రైవర్లు
కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తుండటంతో ఆటోవాలాలు ఉపాధి కోల్పోయారు. ప్రధానంగా రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామాల్లోని ఆటో డ్రైవర్లకు ప్రయాణికుల్లేకపోవడంతో ఖాళీగానే కాలం గడుపుతున్నారు. మహిళలంతా బస్సుల్లోనే ప్రయాణించడానికి మొగ్గు చూపుతుండటంతో.. కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి తదితర ప్రాంతాలకు గిరాకీలు దొరకక పూట గడవని పరిస్థితి నెలకొందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాజీవ్ రహదారిలోని మొగ్ధుంపూర్ స్టేజీ వద్ద ఆటోలున్నా.. మహిళలు ఆర్టీసీ బస్సులో ఎక్కారు. బస్సు ఎక్కుతున్న మహిళలను చూస్తున్న ఆటో డ్రైవర్లు ఇదేమి ఖర్మరా మాకు అంటూ బిక్కమొహం వేసుకొని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
Fact Check: ‘సోలార్’పై వక్రించిన ఈనాడు కథ
సాక్షి, అమరావతి: కడప అల్ట్రా మెగా సోలార్ పార్క్ వద్ద సోలార్ పవర్ ప్రాజెక్టులకు టెండర్లు పిలిచి, వాటిని కంపెనీలకు అప్పజెప్పింది కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ). అదీ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలోనే జరిగింది. ఒప్పందాలూ అప్పుడే జరిగాయి. ఆ ప్రాజెక్టులు పొందిన సంస్థల్లో అదానీ లేదు. 250 మెగావాట్ల ప్రాజెక్టు పొందిన ఓ సంస్థను అదానీ సంస్థ గతంలో ఎప్పుడో టేకోవర్ చేసింది. అయినా రామోజీరావు వక్రబుద్ధితో సీఎం జగన్ ప్రభుత్వంపై బురద చల్లుతూ ‘అదానీ అయితే ఓకే‘ శీర్షికన శనివారం ఈనాడులో తప్పుడు కథనం అచ్చేశారు. నాలుగేళ్లుగా ప్రాజెక్టులు అమలు కాకపోవడానికి కోర్టుల్లో వ్యాజ్యాలు వేసిన కంపెనీలే కారణమైనా సీఎం జగన్ సర్కారే కారణమంటూ మరో బండ వేసే ప్రయత్నం చేశారు. నిజానికి డిస్కంలు కోరిన వెంటనే ప్రాజెక్టులు త్వరగా ప్రారంభించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కోర్టు వ్యాజ్యాల నుంచి అందరూ తప్పుకునేలా కృషి చేసి, ప్రాజెక్టులను శంకుస్థాపన వరకు తెచ్చింది. వీటన్నింటినీ విస్మరించి.. కనీస ఆలోచన, జ్ఞానం లేకుండా అసత్యాలతో, ప్రజలను పూర్తిగా తప్పుదారి పట్టించేలా కథనాన్ని అచ్చేసింది ఈనాడు. ఈ ప్రాజెక్టులు, వాటి వ్యవహారాలపై అసలు వాస్తవాలను ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏపీఎస్పీసీఎల్) ఎండీ, సీఈవో డాక్టర్ ఎం.కమలాకర్‌బాబు వెల్లడించారు. ఇది ఏ ఒక్కరి లబ్ధి కోసమో చేసింది కాదని స్పష్టం చేశారు. సోలార్ ప్రాజెక్టుల కోసం మైలవరం వద్ద 3 వేల ఎకరాలకు పైగా భూమిని సిద్ధంగా ఉంచినప్పటికీ, సోలార్ పవర్ డెవలపర్ (ఎస్పీడీ)లు కాలయాపన చేశారని, ఈ వాస్తవాలను దాచి ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఈనాడు కట్టుకథలు అల్లడంలో అర్ధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన తెలిపిన వాస్తవాలివీ.. ఈ ప్రాజెక్టుల ‘కథ’ ఇదీ.. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో కడప అల్ట్రా మెగా సోలార్ పార్క్ వద్ద ఒక్కోటీ 250 మెగావాట్ల సామర్ధ్యం గల మూడు సోలార్ ప్రాజెక్టులకు టెండర్లను సెకీ 2018 జూలై 6నే పూర్తి చేసింది. వీటిలో ఎస్బీ ఎనర్జీ సెవెన్ లిమిటెడ్ 250 మెగావాట్ల ప్రాజెక్టు ఒక దానిని దక్కించుకుంది. ప్రాజెక్టు విలువ దాదాపు రూ. 1,250 కోట్లు. మిగతా రెండు ప్రాజెక్టులను మరో రెండు కంపెనీలు పొందాయి. ఆ తరువాత ఎస్బీ ఎనర్జీ సెవెన్ సంస్థను అదానీ సంస్థ టేకోవర్ చేసింది. డిస్కంలతో ఒప్పందాలు కూడా 2018 జూలై 27నే పూర్తి చేశారు. టారిఫ్‌ను అనుమతించాలని 2019 ఫిబ్రవరిలో విద్యుత్ నియంత్రణ మండలిని డిస్కంలు కోరాయి. సెకీ, ఎస్పీడీలు, ఎస్‌పీడీలకు ఏపీఎస్పీసీఎల్కు మధ్య ఒప్పందాలు 2019 మార్చికి పూర్తయ్యాయి. అంటే ఇదంతా చంద్రబాబు సీఎంగా ఉండగానే జరిగాయి. ఆ తర్వాత చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసేలోగానే ఎస్పీడీలు వివిధ రకాల కారణాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అంటే ఈ నాలుగేళ్ల కాలయాపన ఎస్‌పీడీలదే గానీ ప్రభుత్వంది కాదన్నది సుస్పష్టం. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నింటినీ పరిష్కరించి, ప్రాజెక్టులు అమలయ్యేందుకు చర్యలు చేపట్టింది. బాబు తప్పిదాన్ని మోయక తప్పదు చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ఈ టెండర్లు, ఒప్పందాలను ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అనుసరించక తప్పదు. లేదంటే రాష్ట్ర ఖజానా నుంచి పెద్ద మొత్తంలో ఆ సంస్థలకు డబ్బు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 750 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులకు వన్ టైమ్ డెవలప్మెంట్ చార్జీలు, లాండ్ లీజు చార్జీల కింద 2018–19 ఆర్థిక సంవత్సరంలోనే టెండర్ దక్కించుకున్న సంస్థలు రూ.309.39 కట్టేశాయి. ఈ మొత్తంలో డెవలప్మెంట్ చార్జీల కింద మెగావాట్‌కు రూ.41.2 లక్షలను ఒక్కో సంస్థ చెల్లించింది. లాండ్ లీజ్ చార్జీలుగా మెగావాట్‌కు మరో రూ.5 వేలు చెల్లించాయి. ఇవిగాక యాన్యువల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చార్జీల కింద మెగావాట్‌కు రూ.3.2 లక్షలు కట్టాయి. లోకల్ ఏరియా డెవలప్మెంట్ చార్జీగా మెగావాట్‌కు రూ.1 లక్ష ఇచ్చేందుకు ఒప్పుకున్నాయి. వాటితో సబ్ స్టేషన్లు, లైన్ల నిర్మాణం, స్థానిక ప్రాంతాల అభివృద్ధి జరిగింది. పైగా, కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టులకు గ్రాంట్ కింద రూ. 54 కోట్లను ఏపీఎస్పీసీఎల్కు ఇచ్చింది. ఇప్పుడు ప్రాజెక్టులను కంపెనీలకు అప్పగించి ప్రారంభించకపోతే ఈ మొత్తం డబ్బును వడ్డీతో సహా తిరిగివ్వాలి. అదీగాక ఏపీఈఆర్సీ ఆమోదంతో కుదుర్చుకున్న పీపీఏలన్నింటినీ ప్రభుత్వం కొనసాగించాలి్సందే. అందువల్ల ఇప్పుడు వీటిని కాదనడానికి లేదు. పైగా, మొత్తం 750 మెగావాట్లలో ఎస్బీ ఎనర్జీ సెవెన్ లిమిటెడ్‌కు వచ్చింది 250 మెగావాట్ల ప్రాజెక్టు. అంటే ఆ సంస్థను టేకోవర్ చేసిన అదానీ సంస్థకు ఈ ప్రాజెక్టులో ఉన్నది మూడో వంతు మాత్రమే. ఇందులో అదానీకి కొత్తగా జరిగే లబ్ధి ఏమీ లేదు. నష్టం జరిగిందనడంలో అర్థం లేదు గత నాలుగేళ్లలో సోలార్ ధరలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. ప్రతి ప్రాజెక్టుకి నిర్దిష్ట పరిస్థితులు ఉంటాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని మాత్రమే ధరను నిర్ణయించాలి. నష్టం జరిగిందని చెప్పడంలో అర్ధం లేదు. సోలార్ ప్రాజెక్టుల వల్ల మైలవరం ప్రాంతం అభివృద్ధితో పాటు సంప్రదాయేతర విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. బహిరంగ మార్కెట్లో యూనిట్ రూ.6 నుంచి రూ.12కు కొనే బదులు గ్రీన్ పవర్‌ను యూనిట్ రూ.2.70కి కొనడం వల్ల డిస్కంలకు ఆర్ధిక ప్రయోజనం కలుగుతుంది. జగన్ ప్రభుత్వంలో అంతా పారదర్శకంగానే.. వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే ప్రతి పనినీ, ప్రతి ప్రాజెక్టునూ పారదర్శకంగా, అవినీతి రహతంగా, ప్రజలకు మేలు చేకూరే విధంగానే చేపడుతోంది. అందుకోసం న్యాయ సమీక్ష, రివర్స్ టెండరింగ్ పద్ధతులు ప్రవేశపెట్టింది. ఇవి దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. ఏ ప్రాజెక్టు కోసమైనా అర్హత ఉన్న ఎవరైనా టెండర్ ద్వారా పోటీ పడవచ్చు. ఆ టెండర్లను న్యాయ సమీక్షకు పంపి, క్లియరెన్స్ వస్తేనే కేటాయిస్తున్నారు. అంత పారదర్శకంగా టెండర్ ప్రక్రియ నిర్వహిస్తుంటే, ఒక కంపెనీకి లబ్ధి చేకూరుస్తున్నారంటూ ఈనాడు చేస్తున్న ఆరోపణలు సత్యదూరమే. ఎక్కువ ధరకు కొన్నదే బాబు ప్రభుత్వం.. ఆదా చేస్తున్నది జగన్ సర్కారు వాస్తవానికి ప్రైవేటు విద్యుత్ కంపెనీలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చేందుకు ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకున్నదే చంద్రబాబు ప్రభుత్వం. ఈ విషయంలో చంద్రబాబుకు పెద్ద చరిత్రే ఉంది. బాబు ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏల ధరలకు, ఇప్పుడు ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్న ఒప్పందంలోని ధరలకు పొంతన లేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సగటు ధరకన్నా ఎక్కువకు కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. అప్పట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.3.54 ఉంటే రూ.8.90 వెచ్చించారు. దాదాపు 7 వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల విద్యుత్ సంస్థలపై ఏటా అదనంగా రూ.3,500 కోట్లు భారం పడుతోంది. వచ్చే 25 ఏళ్ళ వరకు ఈ భారాన్ని విద్యుత్ సంస్థలు భరించాలి. దీనినే అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో తప్పుపట్టారు. అలాంటి తప్పు మళ్లీ జరగకుండా సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను ప్రస్తుతం సగటు ధర యూనిట్‌కు రూ.5.10గా ఉన్నప్పటికీ, యూనిట్ రూ.2.49కే ప్రభుత్వం సేకరిస్తోంది. దీంతో ఏటా దాదాపు రూ. 3,750 కోట్లను ఆదా చేయనుంది. చంద్రబాబు హయాంలో ఎంత ఎక్కువ ధరకు ఒప్పందాలు చేసుకున్నా పట్టని రామోజీ, ఇప్పుడు అతి తక్కువకు విద్యుత్ కొంటుంటే నేరమన్నట్లుగా రాస్తున్నారు. పైగా, ఈ విద్యుత్‌ను పూర్తిగా వ్యవసాయం కోసం రైతులకు ఉచితంగా అందించనుంది. అలా ఇవ్వాలనుకోవడం తప్పంటారా? అన్నదాతలకు సాగు కోసం నీరు ఇవ్వద్దంటారా? మీ తప్పుడు రాతల పరమార్ధం అదేగా రామోజీ.! -
కిక్కెక్కింది.. నిద్ర ముంచుకొచ్చింది.. అట్లుంటది మనతోని!
పెద్దపల్లి: మందు బాబులూ.. ఒక్కక్షణం ఆలోచించండి.. మనం బయటకు వెళ్తే మళ్లీ ఇంటికొచ్చే దాకా మన కుటుంబం కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తూ ఉంటుంది. ఏదైనా జరగరానిది జరిగి ప్రాణాలు పోతే వాళ్లకు దిక్కెవరు? ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. జిల్లా కేంద్రంలోని అయ్యప్పగుడి చౌరస్తావద్ద రోడ్డుపై ఓ వ్యక్తి ఇలా గాఢనిద్రలో పడుకున్నాడు. చిత్తుగా మద్యం తాగడంతో మత్తు ఆవరించింది. ఆ కిక్కుతో ఒళ్లు మరిచి ఇలా నడిరోడ్డుపై నిద్రలోకి జారుకున్నాడు. ఎన్నికల వేళ.. ఎవరు పిలిచి మద్యం తాగించారో లేక.. సొంతంగా కొనుగోలు చేసి తాగాడో తెలియదు కానీ.. రాజీవ్‌రహదారి సిగ్నల్స్ పక్కనే రోడ్డుపై నిద్రపోతున్నాడు.. వాహనాల రద్దీ అధికంగా ఉంది. వాహనదారులు ఏమరుపాటుగా ఉంటే.. ప్రాణాలే పోవచ్చు. కానీ ‘సాక్షి’ చొరవ చూపింది. రోడ్డు నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
20 తులాల బంగారం, కేజీన్నర వెండి అపహరణ
చీపురుపల్లి: చాలాకాలం తరువాత పట్టణంలో దొంగల అలజడితో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. ఒకే రాత్రి సమీప ప్రాంతాల్లోని రెండు నివాసాల్లోకి చొరబడిన దుండగులు స్థానికులను భయాందోళనకు గురిచేశారు. ఒక ఇంటిలో ఎలాంటి సొత్తు లభించకపోవడంతో వెళ్లిపోయిన దుండగులు మరో ఇంట్లో 20 తులాల బంగారం, కేజీన్నర వెండి చోరీకి పాల్పడ్డారు. ఇదిలా ఉండగా చోరీకి పాల్పడిన దుండగులు ఒక ఇంటిలో డైనింగ్ టేబుల్‌పై ఉన్న జీడిపప్పు, మరో ఇంట్లో ఫ్రిజ్‌లో ఉన్న పాయసం తీసుకుని తిన్నారు. ఇదే తరహాలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల చోరీలు జరుగుతున్న నేపథ్యంలో తర రాష్ట్రాల నుంచి వచ్చిన ఓ ముఠా వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. చోరీలకు గురైన ఇళ్లను డీఎస్పీ ఏఎస్.చక్రవర్తి, సర్కిల్ ఇన్స్పెక్టర్ హెచ్.ఉపేంద్ర, ఎస్సై ఎ.సన్యాశినాయుడు సోమవారం పరిశీలించారు. అంతేకాకుండా క్లూస్ టీమ్‌లను రప్పించి చోరీ జరిగిన ఇళ్లలో దుండగుల వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. చోరీకి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 20 తులాల బంగారం, కేజీన్నర వెండి అపహరణ పట్టణంలోని ఆంజనేయపురంలో గల విజయకృష్ణ అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఆప్టికల్స్ వ్యాపారి తమినాన గంగాధర్ కుటుంబంతో కలిసి ఆదివారం మధ్యాహ్నం శ్రీకాకుళంలోని అత్తవారి ఇంటికి వెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దుండగులు ఆదివారం రాత్రి ఇంటికి వెనుక వైపు ఉన్న కిటికీ గ్రిల్ డోర్‌ను తొలగించి ఇంటిలోకి చొరబడ్డారు. మాస్టర్ బెడ్రూంలో ఉన్న బీరువా తాళాలు విరగ్గొట్టి వస్తువులన్నీ చిందరవందరగా పడేశారు. అనంతరం బీరువాలో ఉన్న 20 తులాల బంగారం, కేజీన్నర వెండి అపహరించుకుపోయారు. అంతేకాకుండా ఫ్రిజ్‌లో ఉన్న పాయసం తీసుకుని చక్కగా తిన్నారు. సోమవారం ఉదయం అపార్ట్మెంట్లో ఉన్న నివాసితులు కిటికీ తొలగించి ఉండడాన్ని గమనించి బాధితుడు గంగాధర్‌తో బాటు పోలీసులకు సమాచారం అందజేశారు. ఎంతో కాలంగా కష్టపడి సంపాదించుకున్న బంగారం ఒకేసారి చోరీకి గురవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు వెంకటేశ్వరనగర్‌లో నివాసం ఉంటున్న ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగి దేముడు నివాసం వెనుక ద్వారం తాళాలు పగలగొట్టి చొరబడిన దుండగులు చిల్డ్రన్స్ బెడ్రూంలోకి ప్రవేశించి కబ్బోర్డుల్లో ఉన్న బట్టలు, వస్తువులు చిందరవందరగా పడేశారు. దేవుడి గదిలోకి వెళ్లి వస్తువులను చెల్లాచెదురు చేశారు. తరువాత హాలులో డైనింగ్ టేబుల్‌పై ఉన్న జీడిపప్పు తిన్నారు. అంతలో మాస్టర్ బెడ్రూంలో పడుకున్న దేముడు భార్య లేచిన శబ్దం రావడంతో దొంగలు అక్కడి నుంచి జారుకున్నారు. ఈ చోరీకి సంబంధించి బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. మీ సర్టిఫికెట్లు అన్నీ ఇకపై,, 'అపార్' కార్డులోనే..
సాక్షి, నిర్మల్: ‘ఆధార్’ తరహాలో విద్యార్థుల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అపార్(ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) పేరుతో ’వన్ నేషన్–వన్ ఐడీ’ కార్డును అందుబాటులోకి తేనున్నారు. వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర విద్యావనరులశాఖ తాజాగా ఆదేశించింది. అపార్ ఐడీ కార్డును దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్నారు. ఈ అపార్ సంఖ్యనే విద్యార్థి జీవితకాల ఐడీగా పరిగణిస్తారు. ఇందులో విద్యార్థి అకడమిక్ జర్నీ, విద్యా ప్రయాణం, విజయాలు నిక్షిప్తమై ఉంటాయి. అవసరమైన సమయంలో ట్రాక్ చేయొచ్చని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి సమ్మతి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలను కోరింది. ఈ అపార్ ఐడీ ప్రాముఖ్యతను వివరించాలని చెప్పింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించాలని సూచించింది. ఇందుకు ఓకే చెప్పిన తల్లిదండ్రులు ఆతర్వాత ఎప్పుడైనా దాన్ని ఉపసంహరించుకోవచ్చని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ప్రయోజనం ఏమిటి? విద్యార్థి కేజీ నుంచి పీజీ వరకు చదివిన, చదువుతున్న సమగ్ర వివరాలు ఒకే గొడుగు కిందకు వస్తాయి. ఎల్కేజీలో చేరినప్పట్నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా ఈ కార్డు ఉపయోగపడనుంది. ఈ కొత్త కార్డును ఆధార్ సంఖ్యతో పాటు ‘అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ)’ అనే ఎడ్యులాకర్‌కు అనుసంధానించబడి ఉంటుంది. పాఠశాల విద్యలోని పిల్లలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చే విధానాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ‘చైల్డ్ ఇన్ఫో’ పేరిట ఒక్కో విద్యార్థికి, ఒక్కో సంఖ్య విధానాన్ని కొన్నేళ్లుగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ అమలు చేయబోతున్న ఈ విధానం ద్వారా దేశవ్యాప్తంగా 1 నుంచి 12వ తరగతి వరకు దాదాపు 26 కోట్ల మంది విద్యార్థులకు 12 అంకెలున్న సంఖ్యను కేటాయిస్తారు. ‘అపార్’ నిర్వహణ ఇలా.. కేంద్ర విద్యాశాఖ పరిధిలోని నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరంకు ఈ బాధ్యతను అప్పగించింది. దీనికి చైర్మన్‌గా ఏఐసీటీఈ మాజీ చైర్మన్ ఆచార్య సహస్రబుద్దే వ్యవహరిస్తున్నారు. ఆధార్‌తో అనుసంధానం చేసిన ప్రత్యేక సంఖ్యను నమోదుచేస్తే విద్యార్థి కుటుంబ వివరాలు, మార్కుల సర్టిఫికెట్లు, నైపుణ్యాలు, పొందిన స్కాలర్షిప్స్, తదితర వివరాలన్నీ తెలుసుకునే వీలుంటుంది. వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందే సమయంలోనూ ధ్రువీకరణ పత్రాలను భౌతికంగా కాకుండా డిజిటల్లో పరిశీలించి సీటు ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రవేశ పరీక్షల దరఖాస్తుల్లోనూ ఈ సంఖ్యను నమోదుచేస్తే సరిపోతుందని ఏఐసీటీఈ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నమోదు ప్రక్రియ.. తల్లిదండ్రుల సమ్మతితో పాఠశాలలో నమోదు ప్రక్రియ నిర్వహించబడుతుంది, వారు ఏ సమయంలోనైనా వారి సమ్మతిని ఉపసంహరించుకోవచ్చు. అవసరమైతే సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలతో మాత్రమే డేటాను పంచుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పాఠశాలల ద్వారా ప్రతీ విద్యార్థిపై సేకరించిన డేటా జిల్లా సమాచార పోర్టల్‌లో నిల్వ చేయబడుతుంది. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 వేలకుపైగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, దాదాపు 200కు పైగా ఇంటర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 4 లక్షలకు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ స్థాయిలో చైల్డ్ ఇన్ఫో ద్వారా ఇప్పటికే రాష్ట్రస్థాయిలో ఐడీ నంబరు కేటాయించబడింది. కళాశాల స్థాయిలో మరో గుర్తింపు సంఖ్య ఉంటుంది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న అపార్ ఐడీ కార్డు ద్వారా మొత్తం ఒకే కార్డులో పూర్తి విద్య ప్రగతి, సమాచారం నిక్షిప్తమై అందుబాటులోకి రానుంది. విద్యార్థులకు సౌలభ్యం! విద్యార్థి తన విద్యాభ్యా స దశలో వివిధ రకాల ప్రాంతాల్లో అభ్యసిస్తా డు. వీటన్నింటిని ఒకే గొడుగు కిందికి తేవడం అనేది శుభ పరిణామం. ఈ అపార్ ఐడీ విధానం విద్యార్థులకు సౌలభ్యంగా ఉంటుంది. పదేపదే టీసీలు, బోనఫైడ్, పత్రాలు సేకరించడం వంటి సమస్యలు తీరుతాయి. విద్యార్థి ప్రగతి నైపుణ్యాలు ఒకేచోట నిక్షిప్తం చేయబడతాయి. – జిలకరి రాజేశ్వర్, తపస్ జిల్లా గౌరవ అధ్యక్షుడు, నిర్మల్ ప్రయోజనకరంగా ఉంటుంది విద్యార్థులకు సంబంధించిన పూర్తి సమాచారం ఏకీకృతంగా అపార్ కార్డు ద్వారా అందుబాటులోకి రావడం ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థికి సంబంధించిన సమాచారం ఒకే ఐడీ నంబర్ ద్వారా నిక్షిప్తమై ఉంటుంది. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించిన తర్వాత వారి అనుమతితేనే విద్యాశాఖ ముందుకెళ్తుంది. – డాక్టర్ రవీందర్‌రెడ్డి, డీఈవో, నిర్మల్ -
సాధారణంగా వర్ధమాన నటీమణు గ్లామరస్ పాత్రలను
తమిళసినిమా: సాధారణంగా వర్ధమాన నటీమణు గ్లామరస్ పాత్రలను కోరుకుంటారు. అలాంటి పాత్రలతోనే దర్శక నిర్మాతల దృష్టిలో పడవచ్చునని, ప్రేక్షకుల ఆదరణను పొందవచ్చు అనేది వారి అలోచనగా ఉంలుటుంది. అలాంటిది నటి అనుకీర్తీవాస్ మాత్రం ఛాలెంజింగ్ పాత్రలను కోరుకుంటున్నారు. ఈమె గురించి చెప్పాలంటే కళాశాల రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. అందాల పోటీల్లో పాల్గొని కిరీటాన్నీ గెలుచుకున్నారు. తర్వాత సినిమా వాళ్ల దృష్టిలో పడ్డారు. ఇంకేముందు విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటించిన డీఎస్పీ చిత్రం ద్వారా కథానాయకిగా తెరంగేట్రం చేశారు. అలా తొలి చిత్రంతోనే తమిళ ప్రేక్షకుల మనసును దోచుకున్న ఈ బ్యూటీకి ఆ వెనువెంటనే టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. రవితేజ సరసన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశం వరించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. దీని గురించి నటి అనుకీర్తీవాస్ మాట్లాడుతూ తన తొలి చిత్రం డీఎస్పీలో కంటే మంచి పాత్రను తెలుగు చిత్రం టైగర్ నాగేశ్వరరావులో నటించినట్లు చెప్పారు. ఈ చిత్రంలో తన పాత్రకు ప్రశంసలు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కాగా ఇంకా ఛాలెంజింగ్‌తో కూడిన పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నట్లు ఈ బ్యూటీ పేర్కొన్నారు. ఆదిలోనే తమిళం, తెలుగు భాషల్లో నటించే అవకాశాలను అందుకుంటున్న ఈ భామ అందంతో పాటు అభినయంతోనూ సత్తా చాటుకోవడం విశేషం. -
వర్షాల సీజన్ నేపథ్యంలో ఇక ప్రతివారం చివర్లో
సాక్షి, చైన్నె : వర్షాల సీజన్ నేపథ్యంలో ఇక ప్రతివారం చివర్లో రాష్ట్ర వ్యాప్తంగా 1000 వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నామని ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ తెలిపారు. చైన్నె బీసెంట్ నగర్లో వాకింగ్ కోసం కేటాయించిన మార్గాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం ఎం. సుబ్రమణియన్ మీడియాతో మాట్లాడుతూ, వర్షాల సీజన్ నేపథ్యంలో వచ్చే జ్వరాలను కట్టడి చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. రానున్న 10 వారాల పాటు వారాంతంలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అన్ని రకాల పరీక్షలూ ఈ శిబిరాల్లో నిర్వహించి రోగులకు మందులను పంపిణీ చేస్తామన్నారు. ప్రజా ఆరోగ్య సంరక్షణలో భాగంగా చైన్నెతో పాటు 38 జిల్లాల్లో వాకింగ్ కోసం ప్రత్యేక మార్గం ఏర్పాటు పనులను వేగవంతం చేస్తున్నామని, చైన్నెలో బీసెంట్ నగర్ బీచ్ మార్గాన్ని తాజాగా పరిశీలించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శి గగన్ దీప్‌సింగ్ బేడీ, చైన్నె కార్పొరేషన్ కమిషనర్ రాధాకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. -
బలపడుతున్న ఈశాన్యం
సాక్షి, చైన్నె: ఈశాన్య రుతు పవనాలు రాష్ట్రంలో క్రమంగా విస్తరిస్తున్నట్లు చైన్నె వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈనెల 29వ తేదీ నుంచి డెల్టా జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. వివరాలు.. ఈ ఏడాది నైరుతి రుతు పవనాల ప్రభావం రాష్ట్రంలో మరీ తక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఇక సాధారణ వర్ష పాతం కన్నా 39 శాతం వర్షం తక్కువగా పడ్డట్లు వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటించింది. చైన్నెలో 18 సెంటీ మీటర్ల వర్షం పడాల్సి ఉండగా, ఐదు సెంటీ మీటర్లు వర్షం మాత్రమే పడిందని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో నైరుతి కారణంగా అత్యధిక వర్షం కన్యాకుమారిలో పడింది. ఇక్కడ సగటున 19 సెంటీ మీటర్ల వర్షం పడాల్సి ఉండగా.. ఏకంగా 49 సెంటీ మీటర్ల వర్షం పడడం విశేషం. ఒక్క కన్యాకుమారి మినహా తక్కిన అన్ని జిల్లాలో సాధారణం కంటే తక్కువగానే వర్షపాతం నమోదవడం గమనార్హం. బలపడుతున్న ఈశాన్యం అదే సమయంలో నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసి ప్రస్తుతం ఈశాన్య రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ పవనాలు క్రమంగా విస్తరిస్తున్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో నెలకొన్న తుపాన్లు తీరం దాటిన నేపథ్యంలో ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా ఈ పవనాలు విస్తరిస్తున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ప్రధానంగా డెల్టాలోని తిరువారూర్, నాగపట్నం, కడలూరు, తంజావూరు, తిరుచ్చి, అరియలూరు, పుదుకోట్టై, పెరంబలూరు జిల్లాలతోపాటు శివగంగై, విల్లుపురం, కళ్లకురిచ్చి తదితర 16 జిల్లాల్లో ఈనెల 29వ తేదీ నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రకటనతో ఆ జిల్లాల అధికార యంత్రాంగం మరింత అప్రమత్తం అయ్యింది. ఈ మేరకు ముందు జాగ్రత్త చర్యలను ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. క్రమంగా విస్తరిస్తున్న ఈశాన్య రుతుపవనాలు నైరుతిలో సాధారణ వర్షపాతం కంటే 39 శాతం తక్కువగా వానలు -
దుర్గామాత శోభాయాత్రలో.. విగ్రహాన్ని ఢీకొన్న వ్యాన్! ఒక్కసారిగా చెలరేగిన గొడవ..
సాక్షి, నిజామాబాద్: మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన దుర్గామాత శోభాయాత్ర గొడవకు దారి తీసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలో మంగళవారం దుర్గామాత శోభాయాత్ర ప్రారంభమైంది. ముదిరాజ్ సంఘానికి సంబంధించిన దుర్గామాత విగ్రహాన్ని శోభాయాత్రకు తరలిస్తుండగా అదే సమయంలో రెడ్డి యూత్‌కు సంబంధించిన డీసీఎం డీజే వ్యాన్‌ను తీసుకెళ్తున్నారు. డీసీఎం వ్యాన్ డ్రైవర్ రెడ్డి వర్గానికి చెందినవాడు కావడంతో కావాలనే తమ దుర్గామాత విగ్రహాన్ని ఢీకొన్నాడని దీంతో దుర్గామాత చేతులు విరిగి పోయాయని, వెనుక ఉన్న ఇనుప స్టాండ్ ట్రాక్టర్‌పై ఉన్న ఇద్దరి వ్యక్తులపై పడి ప్రమాదం సంభవించేదని వారు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో సంఘ సభ్యులు డీసీఎం వ్యాన్ అద్దాలను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని గొడవ పడొద్దని సూచించినా వారు వినలేదు. బుధవారం ఉదయం విగ్రహం ధ్వంసమైన చోటే టెంట్ వేసుకుని 8 గంటల పాటు ఆందోళన చేపట్టారు. సీఐ రామన్ పోలీస్ బందోబస్తు మధ్య ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాల సభ్యులతో మాట్లాడారు. విగ్రహం ధ్వంసం కావడానికి కారకులైన రెడ్డి సంఘం నుంచి రూ. 5లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా పెద్ద మనుషుల ఒప్పందంతో రెండు తులాల బంగారం కొనుగోలు చేసి ఇస్తామని రెడ్డి సంఘం వారు చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. విరిగిన దుర్గామాత చేతులను ప్లాస్టర్‌తో అతుకబెట్టి పూజలు చేసి నిమజ్జనానికి తరలించారు. కార్యక్రమంలో సర్పంచ్ బద్దం శ్రీనివాస్‌రెడ్డి, ఉప సర్పంచ్ వంకాయల రవి, వైస్ ఎంపీపీ గాదారి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ బీరయ్య, బీసీ ఐక్యవేదిక ప్రతినిధులు బొంబాయి మల్లయ్య, బంజ శివకుమార్, పున్నం రాజయ్య, మర్కంటి దాకయ్య, జగ్గ బాల్‌రాజు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
దేవరగట్టు బన్నీ ఉత్సవం.. ఈసారైనా ప్రశాంతంగా జరుగుతుందా..!?
సాక్షి, కర్నూలు: దేవరగట్టులో ప్రతీ ఏడాది దసరా పండుగ రోజున బన్నీ ఉత్సవం కర్రల యుద్ధంగా జరుగుతుంది. అర్ధరాత్రి వేళ మాలమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడంలో అక్కడి స్థానిక ప్రజలు బన్నీ ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సాంప్రదాయం, ఆచారం పేరిట ఈ భక్తి పోరాటం కొనసాగుతుంది. ఈ ఉత్సవంతో అక్కడి వాతావరణం ప్రతీసారి ఓ వైపు కోలాహలంగానూ, మరోవైపు నెత్తురుమయంగానూ వేడుక జరుగుతుంది. ఈ వేడుక ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. అక్కడి ఆచార సాంప్రదాయం ఇలా.. ఈ బన్నీ ఉత్సవ యుద్దానికి పూర్వ చరిత్ర ఉంది. మాలమల్లేశ్వర విగ్రహం కోసం దేవరగట్టుతో పాటు చుట్టుపక్కల గ్రామాలవారు కర్రలతో కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దసరా రోజున అర్ధరాత్రి వేళా స్వామి విగ్రహాన్ని తీసుకెళ్తే అంతా మంచి జరుగుతుందని అక్కడి ప్రజల నమ్మకంతో.. ఉత్సవం యుద్ధానికి సిద్ధమవుతున్నారు అక్కడి ప్రజలు. ప్రతీ ఏడాది జరుగుతున్న ఈ సమరంలో అనేక మందికి గాయాలయ్యి, తలలు పగిలి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఇదివరకూ అనేకసార్లు జరుగుతూ వస్తుంది. అయినా ఈ ఉత్సవం ఇలా జరగడంలోనే బాగుందంటున్నారు అక్కడి స్థానికలు. మా ఆచార సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తాం.. మాళమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడంలో వెనుకడుగు వేసేది లేదంటున్నారు స్థానిక భక్తులు. పూర్తి బందోబస్తు.. ప్రతి ఏటా ఇలాగే జరుగుతున్న బన్నీ ఉత్సవాలలో ప్రశాంతత నెలకొల్పడానికి పోలీసు, పై అధికారశాఖ సిద్ధంగా ఉందా? అనే విషయాలపై పోలీసుశాఖ అవుననే అంటుంది. దేవరగట్టులో రక్తపాతం జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈసారి బందోబస్తు ముమ్మరం చేశామన్నారు. ఆచారం పేరిట కొనసాగుతూ వస్తున్న ఈ అపశ్రుతి పోరాటాన్ని నిలపనున్నారు. భక్తులు నాటుసారా సేవించకుండా కట్టడి చేయనున్నారు. ఇనుప చువ్వల కట్టెలు వాడకుండా చర్యలు తీసుకుంటూ అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రశాంతమైన వేడుక జరిగేలా ఉత్సవ కమిటీతో మాట్లాడారు. ఈ ఏడాది కఠినమైన రక్షణ చర్యలు తప్పవంటున్నారు. ఈ ఉత్సవంలో వేల సంఖ్యల్లో భక్తులు పాల్గొననున్నారు. ప్రమాదమైన ఈ సంప్రదదాయ ఆచారాన్ని ఎలాగైనా ఆపాలని తీవ్ర ప్రయత్నానికి పూనుకుంటున్నారు అక్కడి పొలిసు అధికారులు. -
గజపతి జిల్లా రాయగడ బ్లాక్ సంతోష్‌పూర్ గ్రామంలో
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయగడ బ్లాక్ సంతోష్‌పూర్ గ్రామంలో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. గ్రామంలోని పింటూ నాయక్ అనే రైతు గ్రామ శివారులోని కొండమీద ఆవు కళేబరం కనిపించినట్లు తెలియజేశాడు. ఆవు కళేబరం పక్కనే పులి అడుగు జాడలు కనిపించడంతో అటవీ అధికారులకు సమాచారం అందజేశారు. నారాయణపూర్ అటవీ రేంజ్ అధికారులు సంతోష్‌పూర్ గ్రామానికి వెళ్లి పులి అడుగులను పరిశీలించారు. సంఘటన స్థలంలో కనిపించిన పాద ముద్రలను భువనేశ్వర్‌లోని పోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించనున్నామని, అయితే అవి పులి అడుగు జాడలని నిర్ధారించుకోలేదని ఏసీఎఫ్వో అశోక్ కుమార్ బెహరా తెలియజేశారు. రాత్రి సమయంలో గ్రామస్తులు బయట తిరగరాదని, వారి ఆవులు, మేకలు, కోళ్లను కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు. రెండు డ్రోన్ల సాయంతో ఆ జంతువు అచూకీ కోసం గాలిస్తున్నామని అటవీ అధికారులు తెలియజేశారు. ఉదయం ఇంటి వద్ద కనబడిన ఆవు, సాయంత్రం ఆరు గంటల తర్వాత కళేబరమై కొండమీద కనబడిందని పేర్కొన్నాడు. -
ఇద్దరి అరెస్టు
880 లీటర్ల సారా, కారు సీజ్ పార్వతీపురం టౌన్: సారా రవాణాను అరికట్టేందుకు పార్వతీపురం మండలంలోని రంగాలగూడ గ్రామ సమీపంలో ఎస్ఈబీ సీఐ ఉపేంద్ర ఆధ్వర్యంలో గురువారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 880 లీటర్ల సారాతో ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ ఉపేంద్ర మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రంలోని అలమండ నుంచి పార్వతీపురం మైదాన ప్రాంతానికి సారా రవాణా అవుతోందన్న ముందస్తు సమాచారంతో దాడులు నిర్వహించామని తెలిపారు. కొమరాడ మండలం పూడేసు గ్రామానికి చెందిన ఆరిక నరేష్, పార్వతీపురం పట్టణానికి చెందిన సిరిపురపు నారాయణ ఒడిశా రాష్ట్రం నుంచి అక్రమంగా సారా రవాణా చేస్తుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. వారికి సారా సరఫరా చేసిన ఒడిశా రాష్ట్రంలోని అలమండకు చెందిన బెవర శరత్‌పై కూడా కేసు నమోదు చేశామని, నరేష్, నారాయణలను రిమాండ్ నిమిత్తం పార్వతీపురం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచామని చెప్పారు. దాడుల్లో ఎస్సై వీవీ రమణ, సిబ్బంది పాల్గొన్నారు. 100 మద్యం సీసాలతో ఇద్దరి అరెస్టు గంట్యాడ: మండలంలోని బుడతనాపల్లి గ్రామం వైపు అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు కొఠారుబిల్లి జంక్షన్ సమీపంలో పోలీసులు ఇద్దరు వ్యక్తులను మద్యం సీసాలతో పట్టుకున్నారు. మండలంలోని లక్కిడాం గ్రామానికి చెందిన బండ రామకృష్ణ, బాడంగి మండలానికి చెందిన తోట దుర్గారావు కొఠారుబిల్లి జంక్షన్ నుంచి బైక్‌పై అక్రమంగా 100 మద్యం సీసాలు తరలిస్తుండగా గోకులం లేవుట్ సమీపంలో బంగారమ్మ గుడి దగ్గర పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ రిమాండ్‌కు తరలించినట్లు హెచ్‌సీ జె. శ్రీనివాసరావు తెలిపారు. -
పాక్‌లో బరేల్వీ వర్గంపై దాడులు ఎందుకు పెరిగాయి?
సున్నీ దేశమైన పాకిస్తాన్లో అదే ముస్లిం మతానికి చెందిన అహ్మదీయ, షియాల తర్వాత తాజాగా బరేల్వీ ముస్లిం వర్గంపై దాడులు పెరిగిపోయాయి. పాకిస్తానీ వార్తాపత్రిక ‘డాన్’లోని ఒక నివేదిక ప్రకారం గత నెలలో బలూచిస్తాన్‌లోని మస్తుంగ్ జిల్లాలో జరిగిన ఆత్మాహుతి దాడి తర్వాత బరేల్వి కమ్యూనిటీపై తరచూ దాడులు చోటుచేసుకుంటున్నాయి. పాకిస్తాన్లో అహ్మదీయ ముస్లింలను హింసించడం అనేది ఎప్పటి నుంచో జరుగుతోంది. పలుమార్లు వారి మసీదులు, ఆస్తులపై దాడులు జరిగాయి. అహ్మదీయ ముస్లింల సంఖ్య పాకిస్తాన్లో దాదాపు 40 లక్షలు. గత నెలలో బలూచిస్థాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 55 మంది చనిపోయారు. బలూచిస్థాన్‌లోని మిలిటెంట్ గ్రూపులు షియా కమ్యూనిటీని, వారి ముహర్రం ఊరేగింపులను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడి వెనుక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐ) హస్తం ఉందని భద్రతా అధికారులు భావిస్తున్నారు. తాలిబాన్ చేతిలో ఓడిపోయిన ఐఎస్ఐ ఇప్పుడు బలూచిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. ఇస్లామాబాద్‌కు చెందిన భద్రతా విశ్లేషకుడు ముహమ్మద్ అమీర్ రానా తెలిపిన వివరాల ప్రకారం ఐఎస్‌కు చెందిన స్థానిక అనుబంధ సంస్థల ఉగ్రవాదులు షియా వర్గాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఆమధ్య ఐఎస్ఐ అనుబంధ సంస్థ ఐఎస్కేపీ అధిపతి షహబ్ అల్-ముహాజిర్ బరేల్వి కమ్యూనిటీపై పలు విమర్శలు గుప్పించాడు. అందుకే ఇప్పడు బరేల్వీ కమ్యూనిటీ అనేది ఉగ్రవాదుల టార్గెట్‌గా మారింది. బరేల్వీతో పాటు ముస్లిమేతర మైనారిటీలు, ఇతర మైనారిటీ ముస్లిం వర్గాలు, క్రైస్తవులు, సిక్కులపై దాడి చేయడం ద్వారా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాలని ఐఎస్ఐ ప్రయత్నిస్తోందని ముహమ్మద్ అమీర్ రానా తెలిపారు. పాకిస్తాన్లో ముఖ్యంగా బలూచిస్థాన్‌లో ఐఎస్ఐ దాడులు పెరగడానికి, పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో ఐఎస్ఐపై ఆఫ్ఘన్ తాలిబాన్ల దాడులకు ప్రత్యక్ష సంబంధం ఉందని నిపుణులు అంటున్నారు. రెండేళ్లలో తాలిబాన్.. ఐఎస్ఐపై పలుమార్లు దాడిచేసి వారి వెన్ను విరిచింది. ఇది పాకిస్తాన్‌కు చేటు తెస్తుందనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో ఇక్కడ మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఈ నేతల స్నేహం ఎందుకు గట్టిపడింది? -
వామ్మో..! క్షుద్ర పూజల కోసం 'కస్తూరి పిల్లి' అవయవాలు.. అంతలోనే..
హైదరాబాద్: క్షుద్రపూజల కోసం కస్తూరి పిల్లికి సంబంధించిన అవయువాలను తరలిస్తున్న వ్యక్తిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం తెల్లవారు జామున సయ్యద్ అక్బర్ పాషా అనే వ్యక్తి ముంబై వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. లగేజీ స్క్రీనింగ్‌లో అనుమానిత వస్తువులు కనిపించడంతో సీఐఎస్ఎఫ్ అధికారులు వాటిని విప్పి చూడగా, కస్తూరి పిల్లికి సంబంధించిన అవయవాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా క్షుద్ర పూజల కోసం వాటిని తీసుకెళుతున్నట్లు తెలిపారు. కస్టమ్స్ అధికారులు అతడిని అటవీ శాఖ అధికారులకు అప్పగించడంతో వారు అతడిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతడు వీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడనే దానిపై దర్యాప్తు చేపట్టారు. కస్తూరి పిల్లి శేషాచలం అటవీ ప్రాంతంతో పాటు హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, టిబెట్ ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. కస్తూరి పిల్లి అవయవాలను సుగంధ పరిమళాల ఉత్పత్తుల తయారీలో.. కొన్ని రకాల ఔషధాల్లో వినియోగిస్తున్నట్లు తెలిసింది. -
ఎవరు ఎంత కమీషన్ ఇచ్చారో.. లెక్కరాసుకుంటున్న సీక్రెట్ ఏజెంట్లు!
నిజామాబాద్: నగరంలో రాములు (పేరుమార్చాం)అనే వ్యక్తి తనకు సంబంధించిన డివిజన్ కార్పొరేటర్ వద్దకు వెళ్లి దళిత బంధు విషయంపై విన్నవించుకున్నారు. సదరు కార్పొరేటర్ నాకు రూ. 7 లక్షలు, నీకు రూ. 3 లక్షలు అయితేనే నీ పేరు జాబితాలో పెట్టిస్తానన్నాడు. ఇదేం బాగోలేదని మరో కీలక నాయకుడిని సంప్రదిస్తే నీకు రూ. 5 లక్షలు, నాకు రూ. 5 లక్షలు అని ఒప్పందం చేసుకున్నాడు. నీవు ఎక్కడికి వెళ్లినా ఇదే పరిస్థితి అని దబాయించాడు సదరు నాయకుడు. దీంతో ఏమీ చేయలేని స్థితిలో రాములు సరేనన్నాడు. ఇలా దళితబంధు విషయంలో నగరంలో కమీషన్ దందా నడుస్తోంది. నిజామాబాద్ నగరంలో ప్రజాప్రతినిధి ఏదైనా అభివృద్ధి కార్యక్రమానికి అంగీకారం తెలిపినప్పటికీ షాడోబాస్ కూడా ఓకే చెప్పాల్సిందే.. లేకపోతే ఆ పని అక్కడే ఆగిపోతుంది. ప్రస్తుతం ఈ సంఘటనలు నగరంలో చర్చనీ యాంశంగా మారాయి. ముఖ్యంగా దళిత బంధు రెండో విడత అర్హుల జాబితా అంతా ప్రజాప్రతినిధి వెనక షాడో వ్యక్తి కనుసన్నల్లోనే జరిగింది. తన సీక్రెట్ ఏజెంట్ల ద్వారా ముందస్తుగానే పెద్ద ఎత్తున లక్షల్లో ముడుపుల బాగోతాన్ని నడిపించాడని చర్చించుకుంటున్నారు. ఎవరు ఎంత మొత్తంలో కమీషన్ ఇచ్చారో లెక్కరాసుకుని మరీ జాబితాను సిద్ధం చేశారని వినికిడి. 1100 మందితో కూడిన దళితబంధు రెండో జాబితాలో సుమారు 1000 మందికి పైగా లబ్ధిదారుల నుంచి ముందస్తుగా కమీషన్లు తీసుకున్నాకే పేర్లు నమోదు చేశారని సమాచారం. రూ. 30 కోట్లకు పైనే.. దళితబంధు రెండో విడత డబ్బులు రిలీజ్ కాకముందే సదరు ప్రజాప్రతినిధి వద్ద ఉండే షాడో వ్యక్తి తన సీక్రెట్ ఏజెంట్లతో కమీషన్లు వసూళ్లు చేసేశారు. దళితబంధు కింద లబ్ధిదారుడికి రూ.10లక్షలు వ స్తుండగా ముందుగానే ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ. 3 లక్షలు, మరీ అమాయకులైతే రూ. 5 లక్షలు వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో మాజీ డివిజన్ ప్రజాప్రతినిధులకే కాకుండా, ప్ర స్తుత డివిజన్ ప్రజాప్రతినిధులు కూడా తమవారి పేర్లు దళితబంధు లిస్ట్‌లో చేర్చేందుకు షాడోకు ముందుగానే కమీషన్లు ఇచ్చేశారు. మొదటి విడతలో 100 మంది లబ్ధిదారుల్లో రూ. 3 కోట్ల వరకు వసూలు చేస్తే, రెండో విడత 1100 మంది లబ్ధిదారుల వద్ద సుమారు రూ. 30 కోట్లకు పైనే వసూళ్లు చేశారని అధికార పార్టీ నాయకులే చర్చించుకోవడం గమనార్హం. ప్రజాప్రతినిధికి షాడోనే పక్కనుంచి మచ్చతెస్తున్నా గుర్తించలేకపోతున్నాడని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ముందుగానే డబ్బులు.. సదరు ప్రజాప్రతినిధికి మచ్చ తెస్తున్న షాడో వ్యక్తి ఈసారి నేరుగా కాకుండా సీక్రెట్ ఏజెంట్ల వ్యవస్థను తయారు చేసుకున్నా డు. తనకు అత్యంత నమ్మకంగా ఉండే వ్యక్తుల ను తయారు చేసుకున్నారు. వారితోనే నగరంలోని ఆయా డివిజన్లలో దళిత బంధు రెండో వి డత జాబితాను రూపొందించారు. సీక్రెట్ ఏజెంట్లు కూడా షాడో పేరు బయటకు రాకుండా క్షేత్రస్థాయిలో దళితబంధు బాగోతాన్ని చక్కబెడుతున్నారు. దళితబంధు కా వాలంటే లబ్ధిదారుడితో కమీషన్‌ను ముందే మాట్లాడుకుని వసూళ్లు చేశారు. రెండు నెలలుగా ఈ సీక్రెట్ ఏజెంట్లు, షాడో వ్యక్తికి మధ్య దళితబంధు విషయంలో రూ. కోట్లల్లో వ్యవహారం నడిచిందని వినికిడి. సీక్రెట్ ఏజెంట్లతో పాటు ఇద్దరు, ముగ్గురు నాయకులు, సదరు పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జీలు సైతం షాడో గ్రూప్‌లో ఉన్నట్లు ఆరోపణలున్నాయి. -
విద్యార్థిని చితకబాదిన ఇతర విద్యార్థులు! అసలు కారణమేంటి..?
వరంగల్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్‌సైన్స్ కళాశాలలో శనివారం సాయంత్రం విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. బీఏ మొదటి సంవత్సరం విద్యార్థులకు.. బీఏ ద్వితీయ ,ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఆ కళాశాలలో ఆడిటోరియంలో వెల్కమ్ పార్టీ నిర్వహించారు. మధ్యాహ్నం 3గంటల వరకు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ తరువాత చాలా మంది విద్యార్థులు కళాశాల ఆవరణకు చేరుకున్నారు. కొందరు ఫొటోలు దిగుతున్నారు. ఈ సమయంలో ఏమైందో తెలియదుగాని ఓ ఫస్టియర్ విద్యార్థిని ద్వితీయ సంవత్సరం విద్యార్థులుగా భావిస్తున్న కొందరు చితకబాదారని సమాచారం. ఆ విద్యార్థిని వెంబడించి మరి చితకబాదారని తెలుస్తోంది. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం తెలుసుకున్న పలువురు అధ్యాపకులు ఘటనాస్థలికి చేరుకుని ఈ గొడవను నిలువరించారని సమాచారం. అనంతరం విద్యార్థులను కళాశాల నుంచి బయటికి పంపారు. కాగా, విద్యార్థిని ఎందుకు చితకబాదారనే విషయం తెలియరాలేదు. ఈ గొడవ విషయంపై ఆ కళాశాల ప్రిన్సిపాల్ బన్న ఐలయ్య దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం. గొడవ పడిన విద్యార్థులను ఈనెల 8న లేదా 9న పిలిపించి మాట్లాడాలని యోచిస్తున్నారని సమాచారం. దీనిపై ప్రిన్సిపాల్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. -
సర్వం కోల్పోయి.. 17 ఏళ్ల తర్వాత ఇంటికి చేరిన లక్ష్మణ్.. ఇన్నాళ్లు..
రాజన్న సిరిసిల్ల: పుట్టిన ఊరిలో ఉపాధి లేక గల్ఫ్‌బాట పట్టిన యువకుడు అక్కడ జరిగిన ఓ సంఘటనతో జైలుపాలై.. పదిహేడేళ్లకు స్వగ్రామానికి తిరిగొచ్చాడు. యుక్త వయసులో వెళ్లిన వ్యక్తి మానసికస్థితి సరిగ్గా లేని పరిస్థితిలో స్వగ్రామంలో అడుగుపెట్టాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన దండుగుల లక్ష్మణ్ 17 ఏళ్లకు శుక్రవారం ఇంటికి చేరాడు. దుబాయిలో ఘటన... ఇక్కడ విషాదం! కోనరావుపేటకు చెందిన దండుగుల లస్మవ్వ–నర్సయ్య దంపతుల కుమారుడు లక్ష్మణ్ 2005లో దుబాయ్ వెళ్లాడు. అదే సంవత్సరం డిసెంబర్ 29న అక్కడి జబల్అలీ ప్రాంతంలోని డాల్ఫిన్ మెకానికల్ సైట్లో కొందరు కేబుల్ వైరు దొంగతనానికి ప్రయత్నించారు. ఆ సైట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన వీరబహుదూర్ చూడడంతో దొంగతనానికి వచ్చిన దుండగులు అతన్ని హత్య చేసి పరారయ్యారు. ఈ కేసులో నిందితులుగా భావిస్తూ అక్కడి పోలీసులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో కోనరావుపేటకు చెందిన దండుగుల లక్ష్మణ్‌తోపాటు సిరిసిల్ల మండలం పెద్దూరుకు చెందిన సోదరులు శివరాత్రి రవి, మల్లేశం, చందుర్తికి చెందిన బొల్లి వెంకటి ఉరఫ్ నాంపెల్లి, మల్యాల మండలం మానాలకు చెందిన శివరాత్రి హన్మంతు, కొడిమ్యాల మండలం నమిలికొండకు చెందిన సయ్యద్ ఖరీం ఉన్నారు. వీరిలో సయ్యద్ ఖరీం 2014లో విడుదల అయ్యాడు. 24 ఏళ్ల జైలు శిక్ష! హత్య కేసులో నిందితులుగా భావించిన అక్కడి కోర్టు వీరికి 24 ఏళ్ల జైలుశిక్ష విధించింది. జైలు జీవితం గడుపుతున్న తమ వారిని రప్పించేందుకు వారి కుటుంబ సభ్యులు చాలా ప్రయత్నాలు చేశారు. మంత్రి కేటీఆర్ నేపాల్‌కు వెళ్లి సెక్యూరిటీగార్డు కుటుంబాన్ని కలిసి రూ.15లక్షల పరిహారం అందించారు. వారితో క్షమాభిక్షపత్రాలపై సంతకాలు తీసుకుని.. దుబాయ్ కోర్టుకు పంపగా.. ఆ కోర్టు అంగీకరించలేదు. దీంతో వారు జైలు నుంచి విడుదల కాలేదు. ప్రస్తుతం లక్ష్మణ్ మానసికస్థితి సరిగ్గా లేదని విడుదల చేసినట్లు తెలిసింది. విడాకులు ఇచ్చిన భార్య లక్ష్మణ్ దుబాయి వెళ్తున్నప్పుడు భార్య పద్మ గర్భిణి. అతడు వెళ్లిన కొద్ది నెలలకు మగబిడ్డ జన్మించాడు. లక్ష్మణ్ దుబాయిలో జైలుపాలు కావడంతో భార్య పద్మ కొన్ని రోజులు అత్తవారింట్లోనే ఉంది. వీరి కుమారుడు ఏడాదికే మృతిచెందాడు. భర్త రాక కోసం ఎదురుచూసిన పద్మకు ఆశలు సన్నగిల్లడంతో పుట్టింటికి వెళ్లి విడాకుల కోసం నోటీసులను దుబాయి జైలులో ఉన్న లక్ష్మణ్‌కు పంపింది. లక్ష్మణ్ సంతకాలు చేయడంతో విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. లక్ష్మణ్ తండ్రి నర్సయ్య కొన్నాళ్ల క్రితం మృతిచెందాడు. తల్లి నర్సవ్వ ఇన్నాళ్లు చేసిన పోరాట ఫలితంగా కుమారుడు లక్ష్మణ్ ఇంటికి చేరాడు. -
చైనా గుప్పిట్లో పాక్ మీడియా? అమెరికా రిపోర్టులో ఏముంది?
అమెరికా నుంచి వెలువడిన ఒక రిపోర్టులో చైనాకు సంబంధించిన మరో వ్యూహం వెలుగుచూసింది. పాకిస్తాన్ మీడియాను చైనా తన నియంత్రణలోకి తెచ్చుకోవాలనుకుంటోందని ఈ రిపోర్టులో పేర్కొన్నారు. ఇందుకోసం చైనా తన ఇతర మిత్ర దేశాల సహకారం తీసుకుంటున్నదని సమాచారం. పాక్‌లో చైనా తన అంతర్జాతీయ ప్రచారాల నెట్‌వర్క్‌ను సిద్ధం చేస్తోందని నిపుణులు అంచనావేస్తున్నారు. ప్రపంచంలో తనకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకునేందుకు, పలు విమర్శలను తిప్పికొట్టేందుకు చైనా సమాచార రంగంలో రష్యాతో కలిసి పని చేస్తోంది. కాగా పాకిస్తాన్లో చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీపీఈసీ ప్రాజెక్టుపై అంతర్జాతీయ మీడియాలో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో సీపీఈసీ మీడియా ఫోరమ్ ద్వారా ఈ ఆరోపణలు ఎదుర్కోవాలని చైనా నిర్ణయించుకుంది. ఇందుకోసం చైనా, పాకిస్తాన్ సంయుక్తంగా సీపీఈసీ ర్యాపిడ్ రెస్పాన్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ప్రచారాన్ని ప్రారంభించాయి. దీనిలో భాగంగా చైనా-పాకిస్తాన్ మీడియా కారిడార్ త్వరలోనే ప్రారంభం కానుంది. 2021లో చైనా పాకిస్తాన్ల మధ్య ఈ అంశంపై చర్చలు కూడా జరిగాయి. చైనాపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు రెండు దేశాలు సంయుక్తంగా ఒక వేదికను రూపొందించడంపై కూడా చర్చిస్తున్నట్లు యుఎస్ నివేదిక పేర్కొంది. చైనా రాయబార కార్యాలయానికి సంబంధించిన వార్తలకు పాక్ మీడియాలో అత్యధికప్రాధాన్యత కల్పించనున్నారు. చైనా ప్రభుత్వం తనకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల డాలర్లను ఖర్చు చేస్తోందని నివేదిక పేర్కొంది. తైవాన్, మానవ హక్కులు, దక్షిణ చైనా సముద్రం, దేశీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రతికూల వార్తలకు అడ్డుకట్టవేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: అడవిలో వీడియో తీస్తున్న వ్యక్తిపై పిడుగు పడితే? -
‘కాశిబుగ్గ’లో కలెక్షన్ కింగ్..! పైసలిస్తేనే ఫైళ్లు క్లియర్..!!
వరంగల్: ‘మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. మీ వసూళ్ల విషయం నాకు తెలియంది కాదు. అన్నీ నాకు తెలుసు. కొత్త ఇంటి నంబర్‌కు రూ.2వేలు, నూతన భవన నిర్మాణ ధ్రువీకరణ పత్రానికి మినిమమ్ రూ.3వేల చొప్పున ముట్టజెప్పాల్సిందే. లేదంటే ఫైల్ విచారణ పేరిట పెండింగ్‌లో ఉంటుంది. క్షేత్రస్థాయిలో మీరు ఎంత తీసుకుంటున్నారో నా వద్ద ఆధారాలున్నాయి. నేను ఫైల్ పెడితే సస్పెండ్ అవుతారు.. జాగ్రత్త’ అంటూ గ్రేటర్ వరంగల్ కాశిబుగ్గ సర్కిల్ కార్యాలయంలో ఇటీవల వచ్చిన ఓ అధికారి.. టౌన్ ప్లానింగ్, పన్నుల విభాగం ఉద్యోగులపై కర్ర పెత్తనం చేస్తున్న వైనం కలకలం రేపుతోంది. పేరుకు సిన్సియర్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తూ.. అడ్డదారిలో అందినకాడికి దోచుకునేందుకు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు చేస్తుండడంతో ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. రూ.లక్షల్లో జీతం తీసుకుంటూ ఆదర్శంగా నిలవాల్సిన ఆ అధికారి క్షేత్రస్థాయి సిబ్బందిని అక్రమ వసూళ్లకు ప్రోత్సహిస్తుండడం కార్యాలయంలో చర్చనీయాంశంగా మారింది. ఎంతైనా ఫర్వాలేదు. ప్రతీ ఫైల్‌కు పైసలు తీసుకోండి.. తన వాటా తనకు సమర్పించుకోండంటూ నేరుగా చెప్పడం చూస్తుంటే ఇదేం చోద్యం అని ఉద్యోగులు ముక్కున వేలేసుకుంటున్నారు. సిన్సియర్ అధికారిగా.. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఓ మున్సిపాలిటీనుంచి మూడు నెలల కిందట బదిలీపై కాశిబుగ్గ సర్కిల్‌కు వచ్చారు. కాశిబుగ్గ కార్యాలయంలో విధులు నిర్వరిస్తున్నారు. విధుల్లో చేరిన కొత్తలో ప్రతీ విషయం రూల్ అంటే రూల్ అని, నిర్లక్ష్యం చేసినా, అవినీతికి పాల్పడినా.. శాఖాపరమైన చర్యలు తప్పవని ఉద్యోగులకు, అధికారులను ఘాటుగా హెచ్చరించాడు. అంతేకాకుండా ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఓ ఈఈ, టౌన్ ప్లానింగ్‌కు చెందిన ఏసీపీకి విధుల నిర్లక్ష్యంపై మెమోలు కూడా జారీ చేశాడు. దీంతో ఆఫీస్ సబార్డినేటర్ నుంచి ఈఈ, ఏసీపీ స్థాయి అధికారి వరకు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఆ తర్వాత వసూళ్లకు తెగబడడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పైసలిస్తేనే పైళ్లు క్లియర్.. ‘కొత్త ఇంటినంబర్ కేటాయిస్తే రూ. 2వేలు ఇవ్వాలి. పేరు మార్పిడికి కనీసం రూ.1,000 చెల్లించాలి’.. ఇదీ పన్నుల విభాగం సిబ్బందికి విధించిన కండీషన్. ఇటీవల టౌన్ ప్లానింగ్‌కు సంబంధించిన బిల్డింగ్ ఇన్స్పెక్టర్లను సమావేశ పర్చి, తాను క్లియరెన్స్ ఇవ్వాలంటే ప్రతీ ఫైల్‌కు రూ.3వేల చొప్పున చెల్లించాల్సిందేనని నిబంధన పెట్టినట్లు తెలుస్తోంది. ఆమాట విన్న బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు అవాక్కయ్యారని సమాచారం. సర్వేయర్లు, మధ్యవర్తులు తనకు అవసరం లేదని బాహాటంగా హెచ్చరించడంతో ఉద్యోగులు హైరానా పడుతున్నారు. ఈ అధికారి వసూళ్లపై తాజాగా ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్.. బల్దియా ద్వితీయ శ్రేణి అధికారికి సమాచారం ఇచ్చారు. ‘నా మాటే ఖాతరు చేయడం లేదు. నీ మాట ఎంత ’అని ఆయన వదిలేసినట్లు కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. సదరు అధికారి అక్రమ వసూళ్ల వ్యవహారం శృతి మించడంతో క్షేత్రస్థాయి సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలకవర్గ పెద్దలు, ఉన్నతాధికారుల అండ ఉందని బహిరంగంగా చెబుతున్న ఆయన వసూళ్ల వ్యవహరంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై ఓ ద్వితీయ శ్రేణి అధికారిని వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని, కమిషనర్‌కు సమాచారం ఇస్తానని తెలిపారు. -
యాప్ తప్పుడు సమాచారంతో.. ఆగని రైలు..! ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు..!!
మహబూబాబాద్: ‘షిర్డీ’ ఎక్స్‌ప్రెస్‌కు కేసముద్రం రైల్వేస్టేషన్లో హాల్టింగ్ లేదు. అయినా ఓ యాప్‌లో హాల్టింగ్ చూపడంతో ప్రయాణికులు సోమవారం ఆ రైలు ఎక్కారు. తీరా ఆగకుండా వెళ్లడంతో గందరగోళానికి గురయ్యారు. ‘షిర్డీ’ ఎక్స్‌ప్రెస్‌కు కేసముద్రం రైల్వేస్టేషన్లో హాల్టింగ్ ఉండగా, ఇటీవల రద్దు చేశారు. అయితే ఓ యాప్‌లో హాల్టింగ్ ఉన్నట్లు చూపడంతో కేసముద్రంలో దిగాల్సిన ప్రయాణికులు పలు రైల్వే స్టేషన్లలో ఆ రైలు ఎక్కారు. తీరా చూస్తే డౌన్‌లైన్‌లో కేసముద్రంలో ఆగకుండా వెళ్లడంతో మహబూబాబాద్‌లో దిగారు. అలాగే, అప్‌లో లూప్‌లైన్ మీదుగా ఆగకుండా వెళ్తుండడంతో రైలులో ప్రయాణిస్తున్నవారితోపాటు, ప్లాట్‌ఫాంపై ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు పెట్టారు. దీంతో స్టేషన్లో రైలును నిలిపారు. అనంతరం యథావిధిగా ముందుకు కదిలింది. మొత్తానికి ఓ యాప్ తప్పుడు సమాచారం చూపడంతో గందరగోళానికి గురైనట్లు పలువురు ప్రయాణికులు తెలిపారు. -
‘పరిపాలన’కు విశాఖ ముస్తాబు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దసరా వచ్చిందయ్యా.. పరిపాలన రాజధాని తెచ్చిందయ్యా అంటూ విశాఖ నగరం అందంగా ముస్తాబవుతోంది! వివిధ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అధికారులకు నివాస భవనాలను సిద్ధం చేసే ప్రక్రియ వేగవంతమైంది. హిల్–3లో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనాలు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అనువుగా ఉన్నాయని గుర్తించినట్లు తెలుస్తోంది. హిల్ 1, 2ల్లో నివాసయోగ్యమైన భవనాలను అధికారులకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. అక్టోబరు చివరినాటికి నిర్మాణం పూర్తయ్యే పలు భవనాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. తుది దశ భవనాల వివరాల సేకరణ విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధానిని ఏర్పాటు చేస్తామని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలో అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. హిల్ 1, 2ల్లో నివాసయోగ్యమైన భవనాల విస్తీర్ణం సుమారు 40 వేల చదరపు అడుగుల మేర ఉంటుందని లెక్కగట్టారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వివిధ ప్రైవేట్ భవనాలను కూడా గుర్తించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ప్రధానంగా రానున్న రెండు నెలల్లోగా పూర్తయ్యే భవనాలపై దృష్టి సారించారు. జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగంతో పాటు స్థానిక సచివాలయాల ద్వారా ఈ వివరాలను సేకరిస్తున్నారు. వీటి విస్తీర్ణం ఎంత మేర ఉంటుందనే వివరాలు ఈ నెలాఖరు నాటికి సిద్ధమవుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వివరాలు అందుబాటులోకి వచి్చన తర్వాత వాటిని లీజుకు తీసుకుని ఏయే విభాగాలను ఏర్పాటు చేయవచ్చనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఇప్పటికే ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న అదనపు విస్తీర్ణం ఎంత? అక్కడ ఏ విభాగాలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది? అనే వివరాలను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. -
పదవి నుంచి తప్పుకొన్న మీడియా మొఘల్ ముర్డోచ్.. ఏడు దశాబ్దాల తర్వాత..
మీడియా మొఘల్‌గా పేరొందిన రూపర్ట్ ముర్డోచ్ (Rupert Murdoch) ఏడు దశాబ్దాల తర్వాత పదవి నుంచి దిగిపోయారు. ఫాక్స్, న్యూస్ కార్ప్ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన కుమారుడు లాచ్లాన్ ముర్డోచ్ రెండు కంపెనీలకు తదుపరి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు అమెరికన్ న్యూస్ ఏజెన్సీ ‘ఏపీ’ నివేదించింది. 92 ఏళ్ల రూపర్ట్ ముర్డోచ్ రెండు కంపెనీలకు ఎమిరిటస్ చైర్మన్ అవుతారని, లాచ్లాన్ న్యూస్ కార్ప్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని, ఫాక్స్ కార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గానూ కొనసాగుతారని ‘ఫాక్స్’ సంస్థ పేర్కొంది. రూపర్ట్ ముర్డోచ్ ఎమెరిటస్ ఛైర్మన్‌గా కొనసాగనుండటం సంతోషంగా ఉందని, ఆయన విలువైన సలహాలు రెండు కంపెనీలకు కొనసాగుతాయని లాచ్లాన్ ముర్డోచ్ పేర్కొన్నారు. తనలాగే కంపెనీలు కూడా దృఢమైన ఆరోగ్యంతో ఉన్నాయని ‘ఫాక్స్’ ఉద్యోగులను ఉద్దేశిస్తూ రూపెర్ట్ మర్డోచ్ పేర్కొన్నట్లు తమకు లభించిన లేఖను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది. ఫాక్స్, న్యూస్ కార్ప్‌లను విలీనం చేయడం ద్వారా తన మీడియా సామ్రాజ్యాన్ని మళ్లీ ఏకం చేసే ప్రణాళికను విరమించుకున్న కొన్ని నెలల్లోనే ముర్డోచ్ పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం. ఫాక్స్ న్యూస్‌తో పాటు ABC, CBS, NBC వార్తా సంస్థలకు పోటీగా మొదటి ప్రసార నెట్‌వర్క్‌ను ముర్డోచ్ ప్రారంభించారు. అంతేకాదు రూపర్ట్ ముర్డోచ్.. వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ పోస్ట్ వార్తా సంస్థలకు కూడా యజమానే. -
అర్జీలు ఫుల్.. పరిష్కారం నిల్!
వరంగల్: అర్జీలకు పరిష్కారం చూపాలని ప్రతీవారం ఉన్నతాధికారులు ఆయా విభాగాల అధికారుల్ని ఆదేశిస్తున్నారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోవట్లేదు. దీంతో ప్రజలు గ్రీవెన్స్ చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. అర్జీలు వెల్లువెత్తుతున్నా.. ఆచరణలో మాత్రం చిత్తశుద్ధి లోపిస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. గ్రీవెన్స్‌పై ‘సాక్షి’ పరిశీలన – కరీమాబాద్ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రతీ సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ప్రతీ వారం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ నగరంతోపాటు జిల్లాలోని 13 మండలాలకు చెందిన ప్రజలు కలెక్టరేట్‌కు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వివిధ కారణాలతో స్థానికంగా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో ప్రజలు గ్రీవెన్స్ చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కొందరైతే.. పలుమార్లు గ్రీవెన్స్‌లో అర్జీలు పెట్టుకున్నారు. వాటిని ఆయా శాఖల అధికారులకు బదలాయిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిష్కారం దొరకట్లేదు. గ్రీవెన్స్‌లో ఎక్కువగా భూములకు సంబంఽధించిన అర్జీలు వస్తున్నాయి. తర్వాత పింఛన్ల కోసం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. సదరం క్యాంపు స్లాట్ బుక్ చేసుకునే క్రమంలో సైట్ ఓపెన్ కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సోమవారం అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. అర్జీలు ఇలా.. వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో మొత్తం 97 ఆర్జీలు వచ్చాయి. వాటిలో జీడబ్ల్యూఎంసీ 4, బీసీ డెవలప్మెంట్ 3, వ్యవసాయశాఖ 9, రెవెన్యూ 36, మైనార్టీ వెల్ఫేర్ 3, ఏసీపీ ఖిలా వరంగల్ 1, వెటర్నరీ 1, లీడ్ బ్యాంక్ 5, పంచాయతీ అధికారి 6, డీఆర్డీఓ 11, ఉపాధి శాఖ 1, ఎస్సీ డెవలప్మెంట్ 1, జిల్లా సంక్షేమ శాఖ 5, సివిల్ సప్లయ్ 1, ఎస్సీ కార్పొరేషన్ 2, యుజవన క్రీడలు 1, ‘కుడా’ 2, పంచాయతీ రాజ్ శాఖ ఈఈ 1, ఎంజీఎం 1, ఎన్పీడీసీఎల్ 1, ఈఈ ఇరిగేషన్ 1, విద్యాశాఖ అధికారికి సంబంఽధించిన అర్జీ 1 వచ్చాయి. కాగా.. ప్రజావాణి కార్యక్రమానికి 35 శాఖలకు చెందిన అధికారులు హాజరవ్వాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో జిల్లా స్థాయి అధికారులు రాలేని పరిస్థితిలో ఆయా శాఖలకు చెందిన అధికారులు వస్తుంటారు. ఈక్రమంలో సోమవారం పలువురు హాజరు కాలేదు. కలెక్టర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్లు శ్రీవత్స, అశ్విని తానాజీ వాకడే, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ ఫోటోలో ఉన్న బాలుడు దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బూరుగు మణిదీప్. ఇతడికి మానసిక దివ్యాంగుల పెన్షన్ కోసం మూడేళ్లుగా దరఖాస్తు చేస్తున్నా.. ఇప్పటికీ మంజూరు కాలేదు. సదరం క్యాంపులో 75 శాతం చూపుతున్నా.. రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికి ఐదు సార్లు వచ్చామని బాలుడి తండ్రి చెబుతున్నాడు. ఇప్పటికై నా పెన్షన్ మంజూరు చేయాలని ఆయన వేడుకుంటున్నాడు. -
శోభ.. 'నిజాయితీ' కి మారుపేరు..!
మహబూబ్‌నగర్: ఆర్టీసీ బస్సులో దొరికిన బంగారు ఆభరణాల పర్సును బాధిత మహిళకు అందజేసి నిజాయితీ చాటుకుంది ఓ ప్రయాణికురాలు. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పునుంతల మండలం కాంసానిపల్లికి చెందిన నెల్లోజు ప్రసన్న ఆదివారం ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి కల్వకుర్తి నుంచి ఉప్పునుంతల వరకు అచ్చంపేట ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో ఎక్కింది. ఉప్పునుంతలలో దిగి గ్రామానికి వెళ్లి హ్యాండ్‌బ్యాగ్‌లో చూడగా బంగారు ఆభరణాలు (సుమారు రూ.3 లక్షల విలువ)న్న పర్సు కనిపించలేదు. అదే బస్సులో ప్రయాణించిన సదగోడుకు చెందిన శోభకు బస్సులోనే ఆభరణాల పర్సు దొరకగా కండక్టర్ నారాయణమ్మకు అందజేసింది. సోమవారం అచ్చంపేట డిపో ఆవరణలో బాధితురాలు ప్రసన్నకు పర్సును అందజేసి నిజాయితీని చాటుకుంది. -
రోడ్లు ఛిద్రం..! దుమ్ముతో నిత్యం నరకం అనుభవిస్తున్నాం..!!
కుమరం భీం: ప్రకృతి వనరులు కొల్లకొడుతూ క్వారీల నుంచి యాజమాన్యాలు భారీగా ఆదాయం అర్జిస్తున్నాయి. అయితే క్రషర్ల నుంచి కంకర తరలించే వాహనాలతో స్థానిక రహదారులన్నీ ధ్వంసమవుతున్నా మరమ్మతులకు కనీస మొత్తంలో నిధులు కేటాయించడం లేదు. గనులశాఖకు ఏటా సీనరేజీ నిధులు వస్తున్నా ప్రభావిత పల్లెల అభివృద్ధికి పైసా ఖర్చు చేయడం లేదు. పరిశ్రమల శాఖ, మైనింగ్, విద్యుత్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి వంటి శాఖల అధికారులు నిబంధనల అమలులో చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గుంతలతో తిప్పలు.. కౌటాల మండలం ముత్తంపేట నుంచి పార్డీ గ్రామానికి వెళ్లే మార్గంలో ఐదు కంకర క్వారీలు, క్రషర్లు ఉన్నాయి. జిల్లాలో కొనసాగుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులకు నిత్యం వందలాది భారీ వాహనాల్లో ఇక్కడి నుంచే కంకర తరలిస్తున్నారు. ఫలితంగా వాహనాలు వెళ్లే కాగజ్‌నగర్, కౌటాల, ముత్తంపేట, తలోడి, సిర్పూర్(టి), టోంకిని గ్రామాల వద్ద ప్రధాన రహదారి అనేకచోట్ల గుంతలతో అధ్వానంగా మారింది. పరిమితికి మించిన లోడ్‌తో డ్రైవర్లు అతివేగంగా లారీలను నడుపుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం నరకం.. దుమ్ముతో నిత్యం నరకం అనుభవిస్తున్నాం. వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుండడంతో కంకర దుమ్ము పంటలపై పడుతుంది. దిగుబడి తగ్గుతోంది. క్రషర్లతో మా గ్రామానికి వెళ్లే రోడ్డు ఎప్పుడూ గుంతలతోనే ఉంటుంది. రోడ్డుకు మరమ్మతులు చేపట్టి బీటీ రోడ్డు వేయాలి. – డి.సంజీవ్, పార్డి, మం.కౌటాల ► ఐదేళ్ల క్రితం కౌటాల – కాగజ్‌నగర్ మార్గంలో డబుల్ రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు పైనుంచి అధిక లోడుతో వాహనాలు వెళ్తుండడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ముత్తంపేట సమీపంలో గుంతల్లో వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ► కౌటాల మండలం పార్డీ, సాండ్‌గాం, వీరవెల్లి పంచాయతీలతోపాటు కౌఠి గ్రామానికి 20 ఏళ్ల కిందట ప్రపంచ బ్యాంకు నిధులతో మొరం రోడ్డు వేశారు. మ్తుతంపేట ప్రధాన ఆర్అండ్బీ రోడ్డు నుంచి పార్డీ మీదుగా సాండ్‌గాం వరకు దాదాపు ఏడు కిలోమీటర్ల మేర ఈ రోడ్డు ఉంది. రోడ్డును ఆనుకుని ఉన్న స్టోన్ క్రషర్ల నుంచి లారీలు వెళ్తుండడంతో గుంతలు పడుతున్నాయి. ఇటీవల భారీ వర్షాలకు రోడ్డు బురదమయంగా మారింది. మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామాలకు ఇప్పటికీ తారురోడ్డు సౌకర్యం లేకపోవడం గమనార్హం. మరమ్మతులు చేయిస్తాం.. అధిక లోడు వాహనాలతో బీటీ రోడ్లపై గుంతలు పడుతున్నాయి. గతేడాది రోడ్లకు మరమ్మతులు చేపట్టాం. మూడు నెలల క్రితం వేసిన బీటీ రోడ్డుపై కూడా పగుళ్లు వచ్చాయి. గుంతలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నిధుల మంజూరు కాగానే గుంతలు పడిన చోట మరమ్మతులు చేయిస్తాం. – లక్ష్మీనారాయణ, ఆర్అండ్బీ డీఈ, కాగజ్‌నగర్ పంటలకు తీవ్ర నష్టం.. కంకర లారీలతో రోడ్లు ఛిద్రం కావడంతోపా టు రహదారుల వెంబడి సాగు చేస్తున్న పంట పై దుమ్ము ప్రభావం పడుతోంది. పార్డీ– సాండ్‌గాం గ్రామాల సమీపంలో సాగు చేస్తున్న పంటలపై విపరీతమైన దుమ్ము పడుతోంది. దీంతో పంట దిగుబడి సగానికి పడిపోతుంద ని రైతులు వాపోతున్నారు. పంటలకు పరిహా రం చెల్లించాలని కొంతమంది అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా లారీ ల నుంచి పడుతున్న కంకరతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. అదుపు తప్పి బైక్‌లు కిందపడిపోతున్నాయి. ఇప్పటికైనా స్పందించి ఓవర్‌లోడ్‌తో కంకర తరలిస్తున్న క్రషర్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
నచ్చితే తీస్కో..! లేదంటే మూస్కో..!! గొర్రెల పంపిణీలో ‘గోల్మాల్’..
ఆదిలాబాద్: గొల్ల, కుర్మలు, యాదవుల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం జిల్లాలో క్షేత్ర స్థాయిలో ఆశించిన ఫలితాలు అందించడంలో విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కొక్క యూనిట్ ధర రూ.1.75లక్షలు ధర నిర్ణయించిన ప్రభుత్వం తన వాట కింద రూ.1,31,250 చెల్లించగా, లబ్ధిదారుడు రూ.43,750 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 20 గొర్రెలు, ఒక పొటెలు కొనుగోలుకు రూ.1.50 లక్షలు పోగా, మిగిలిన రూ. 25వేలతో గొర్రెల తరలింపు మందులు కొనుగోలు, ఇన్సురెన్స్ కోసం నిధులు కేటాయించడం జరిగింది. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రభుత్వం రెండో విడత పంపిణీకి శ్రీకారం చుట్టింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 3597 మంది లబ్ధిదారులు డీడీలు కట్టారు. ఒక్కొక్క లబ్ధిదారుడు రూ.43,750 చొప్పున మొత్తం రూ.15.73 కోట్ల డీడీలు చెల్లించారు. దాదాపు సంవత్సర కాలంగా ఎదురుచూడగా ఈ ఏడాది జూలైలో యూనిట్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవీ విధివిధానాలు... మొదటి విడత గొర్రెల పంపిణీలో రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల అక్రమాలు జరిగినట్లు తేలడంతో ప్రభుత్వం పంపిణీ విధివిధానాలను మరింత కఠినతరం చేసింది. గొర్రెల ఎంపికలో మండల పశువైద్యాధికారుల పాత్రను తగ్గించి జిల్లా , రాష్ట్ర స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. దీనికోసం జిల్లా పశువైద్యాధికారి పర్యవేక్షణలో జిల్లా అధికారి, రాష్ట్ర స్థాయి అధికారితో కూడిన టీంను సిద్ధం చేశారు. లబ్ధిదారులు అధికారులతో కలిసి స్వయంగా గొర్రెల విక్రయించే వారి వద్దకు వెళ్లి కొనుగోలు చేసేలా, కొనుగోలు సమయంలో ప్రత్యేకమైన ట్యాబ్‌ల్లో ఆన్లైన్లో తమ ఇష్టపూర్వకంగా గొర్రెలను ఎంపిక చేసుకున్నట్లు వాయిస్ మెసెజ్ అప్లోడ్ చేసేలా నిబంధనలు చేర్చారు. 447 యూనిట్ల పంపిణీ... ఈ ఏడాది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో జిల్లా వ్యాప్తంగా రూ.7.80 కోట్లతో మొత్తం 447 యూనిట్లు (9387 గొర్లు) పంపిణీ చేశారు. మొత్తం 3597 మంది డీడీ కట్టగా, ఇప్పటి వరకు కేవలం 447 మందికే గొర్లు పంపిణీ చేశారు. ఇంకా 3150మందికి గొర్లు రావాల్సి ఉంది. వీరంత సంవత్సర కాలంగా ఒక్కొక్కరు రూ. 43,750 చొప్పున డీడీలు చెల్లించారు. ఎన్నికల కోడ్ వస్తుందని సర్వత్రా చర్చలు నడుస్తుండటంతో తాము కట్టిన డబ్బులు అయిన తిరిగి వస్తే చాలు అన్న పంథాలో లబ్ధిదారులు ఉన్నారు. దీంతో కొంత మంది అధికారులు, నాయకులు వీరి నిస్సహాయతను సొమ్ము చేసుకుంటున్నారు. నచ్చితే తీస్కో.. లేదంటే మూస్కో.. గొర్రెల పంపిణీలో అక్రమాలను నివారించడానికి ప్రభుత్వం కఠినమైన విధివిధానాలను రూపొందించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆగడం లేదు. పక్క రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కోదాడ మండలం నుంచి మాత్రమే గొర్రెలు కొనుగోలు చేస్తున్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. కోదాడ మండలంలోని నాలుగు గ్రామాల్లో గొర్రెల లభ్యత ఉండగా లబ్ధిదారులను అక్కడికే పంపించి గొర్రెలను తీసుకునేలా బలవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ అప్పటికే అనారోగ్యంతో ఉన్నవి, చెవికి ట్యాగ్ గాయాలతో ఉన్న (పలుమార్లు ఏమార్చి ఇన్ష్యూరెన్స్ చేయబడినవి) గొర్లను కట్టబెడుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. మా దృష్టికి రాలేదు.. జిల్లాలో గొర్రెల పంపిణీలో ఎలాంటి అక్రమాలు మా దృష్టికి రాలేదు. నిబంధనల ప్రకారం, లబ్ధిదారులు స్వయంగా వెళ్లి గొర్రెలు తెచ్చుకుంటున్నారు. గొర్రెల రవాణా కోసం వినియోగించే వాహనాలకు సైతం జీపీఎస్ ట్రాకింగ్ అమర్చడం జరిగింది. లబ్ధిదారుల గ్రామాలకు గొర్రెలు చేరిన తరువాత కూడా ఫొటోలు ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైన అక్రమాలు జరిగినట్లు మా దృష్టికి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. –కిషన్, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి కట్టింది రూ.43వేలు.. ఇచ్చేది రూ.90వేలే... లబ్ధిదారులు గొర్రెలను ఎంపిక చేసుకున్న తరువాత అధికారులు జీపీఎస్ ట్యాగ్ ఉన్న ఐచర్ వాహనాల్లో, ఒక్కొక్క వాహనంలో ఆరు యూనిట్ల చొప్పున గొర్రెలను లబ్ధిదారుల గ్రామాలకు తరలిస్తున్నారు. అక్కడ సర్పంచ్, గొల్లకుర్మ కమిటీ అధ్యక్షుడు, లబ్ధిదారుడు, స్థానిక పశువైద్యాధికారి సమక్షంలో ఐచర్ ఫొటోలు, గొర్రెల ఫొటోలు తీసీ ఆన్లైన్లో పెడుతున్నారు. అనంతరం రెండు, మూడు రోజుల్లో గొర్రెలు అమ్మిన వ్యక్తి బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం ఒక్కొక్క యూనిట్‌కు రూ.1.50లక్షలు జమ చేయడం జరుగుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ అసలు కథ ఇక్కడే ప్రారంభం అవుతుంది. ముందుగానే కుదుర్చుకున్న డీల్ ప్రకారం తన ఖాతాల్లో డబ్బులు పడగానే సదరు గొర్రెలు అమ్మిన వ్యక్తి ఒక లారీతో ఆయా గ్రామాలకు వచ్చి లబ్ధిదారులకు యూనిట్‌కు రూ.90వేలు చెల్లించి తాను ఇచ్చిన గొర్రెలను మరల లారీలో ఎక్కించుకొని వెళ్లిపోతాడు. లబ్ధిదారులే అమ్ముకుంటున్నారని వారిని బద్నాం చేసే పనులు అధికారులు చేస్తున్నప్పటికీ అధికారులు, నాయకుల అండదండలతోనే ఇదంతా జరుగుతుందని లబ్ధిదారుల వాదన. -
'ప్రతిభ ప్రతిబింబించేలా'.. సైన్స్ ప్రయోగాలకు బీజం!
జగిత్యాల: విద్యార్థి దశ నుంచి సైన్స్‌పై ఆసక్తి కలిగించడం, శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో భారతీయుల కృషి తెలియజేసే ఉద్దేశమే విద్యార్థి విజ్ఞాన్ మంథన్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ), విజ్ఞాన భారతి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం సంయుక్తంగా విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పేరుతో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి ఏటా ఆన్లైన్ వేదికగా ప్రతిభ పరీక్ష నిర్వహిస్తోంది. పరిశోధన సంస్థల సందర్శన.. ► పలు జాతీయ ప్రయోగశాలల సందర్శనతో పాటు నగదు ప్రోత్సాహకాలు అందుకునే అరుదైన అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తోంది. ► ఇందులో డీఆర్డీవో, బార్క్, సీఎస్ఐఆర్ వంటి ప్రఖ్యాత పరిశోధన సంస్థలున్నాయి. వాటిని సందర్శించే అవకాశంతో పాటు మూడు వారాలు ఇంటర్న్‌షిప్ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పరీక్ష నిర్వహిస్తోంది. ► ఇందులో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆ ప్రయోగశాలల సందర్శనతో కొత్త స్ఫూర్తి పొందే అవకాశముంది. 2024 సంవత్సరానికి సంబంధించి జాతీయస్థాయి పరీక్ష మే 18, 19న నిర్వహించనున్నారు. ► నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ), విజ్ఞాన భారతి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 6 నుంచి 11వ తరగతి (ఇంటర్ ప్రథమ సంవత్సరం) విద్యార్థులకు ఆన్లైన్ వేదికగా ఈ పరీక్ష నిర్వహిస్తారు. ► 6 నుంచి 8వ తరగతి వరకు జూనియర్లుగా, 9 నుంచి 11 వరకు సీనియర్లుగా పరిగణిస్తారు. ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, రాష్ట్ర బోర్డు విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులు. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష.. అక్టోబరు 1న నమూనా పరీక్ష ఉంటుంది. అదే నెల 29 లేదా 30న జిల్లాస్థాయిలో పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. సీనియర్, జూనియర్ విభాగంలో 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. గణితం, సామాన్య శాస్త్ర పాఠ్య పుస్తకాల నుంచి 50 శాతం, విజ్ఞానశాస్త్రం రంగంలో దేశ కృషిపై 20 శాతం, లాజిక్ రీజనింగ్‌కు 10 శాతం, శాస్త్రవేత్త బీర్బల్ సహానీ జీవిత చరిత్రకు 20 శాతం బహుళైచ్చిక ప్రశ్నలు ఉంటాయి. జిల్లాస్థాయిలో ఇలా.. జిల్లాలో ఆరో తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం వరకు ప్రతి తరగతిలో ప్రతిభచూపిన మొ దటి ముగ్గురు చొప్పున మొత్తం 18 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలను ఆన్లైన్లో అందిస్తారు. రాష్ట్రస్థాయిలో.. పాఠశాల స్థాయి ప్రాథమిక పరీక్ష రాసిన విద్యార్థుల్లో తరగతుల వారీగా ప్రతిభచూపిన మొదటి 20 మంది విద్యార్థులను ఎంపిక చేసి మొత్తం 120 మందిని రాష్ట్రస్థాయికి పంపుతారు. అత్యంత ప్రతిభకనభర్చిన 18 మందిని రాష్ట్రస్థాయి విజేతగా ప్రకటిస్తారు. వారిలో మొదటి ముగ్గురికి రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేల చొప్పున నగదు ప్రోత్సహకాలిస్తారు. జాతీయ స్థాయిలో.. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనభర్చినవారి నుంచి 18 మందిని జాతీయ స్థాయి ప్రతిభావంతులుగా గుర్తిస్తారు. వీరిని హిమాలయన్స్ అంటారు. వారికి రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు నగదు ప్రోత్సాహకాలు ఇస్తారు. వీటితో పాటు నెలకు రూ.2 వేల చొప్పున ఏడాది పాటు ఉపకారవేతనం అందిస్తారు. దరఖాస్తు ఇలా.. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్ ద్వారా విద్యార్ధి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పరీక్ష నిర్వహించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోటీలు పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో నిర్వహిస్తారు. www. vvm. org. in వెబ్సైట్లో రూ.200 ఫీజు ఆన్లైన్లో చెల్లించి ఈనెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబరు 1న నమూనా పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు, హిందీ, ఆంగ్లం విభాగాల్లో పరీక్ష ఉంటుంది. విద్యార్థులకు మంచి అవకాశం.. విద్యార్థుల విజ్ఞానానికి మంచి అవకాశం. పరీక్షను విద్యార్థులు వ్యక్తిగతంగా, పాఠశాల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సైన్స్ ప్రయోగాలకు బీజం పాఠశాల స్థాయి నుంచే కలగాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏటా దీన్ని నిర్వహిస్తోంది. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి, అభిరుచి కలిగించడం, వారిలోని నైపుణ్యాలు, సృజనాత్మకతను వెలికితీయడం ఈ పరీక్ష ఉద్దేశం. వీవీఎం పరీక్షలో విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. – బి.రవినందన్‌రావు, జిల్లా సైన్స్ అధికారి, పెద్దపల్లి -
ఆన్లైన్ గేమ్‌లకు అలవాటు పడి.. చివరకు ఇలా..!
రంగారెడ్డి: ఆన్లైన్ గేమ్‌లు, దురలవాట్లకు బానిసై సులువుగా డబ్బులు సంపాదించేందుకు చోరీల బాటపట్టిన నలుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను కీసర పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, ల్యాప్‌టాప్, కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లా, నంగునేరికి చెందిన రామకృష్ణన్(35) పాత నేరస్తుడు. కొంత కాలం క్రితం హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌కు వలస వచ్చి చిరుధాన్యాల వ్యాపారం ప్రారంభించాడు. అదే ప్రాంతంలోని దేవేంద్రనగర్ కాలనీ చెందిన కాగ్ గోవింద్(36) స్థానికంగా బఠాణీలు, మరమరాలు వంటివి విక్రయించే షాపు నిర్వహిస్తున్నాడు. ► రామకృష్ణన్ తరుచూ గోవింద్ షాపు వద్దకు వచ్చేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆన్లైన్ గేమ్‌లు ఆడేవారు. ఇద్దరూ పలు దురలవాట్లకు బానిసయ్యారు. అవసరమైన డబ్బులను సులువుగా సంపాదించేందుకు దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ► రామకృష్ణన్ తాను చోరీలు చేస్తానని, చోరీ సొత్తును ఇతర ప్రాంతాల్లో విక్రయించాలని గోవింద్‌కు పురమాయించాడు. రామకృష్ణకు కీసర, కుషాయిగూడ, జవహర్‌నగర్ పరిధిలోని ప్రాంతాలపై అవగాహన ఉండటంతో అక్కడ చోరీలు మొదలెట్టాడు. ► వీరికి అదే ప్రాంతానికి చెందిన బైక్ మెకానిక్ మహేందర్ పవార్(36), బాలాజీనగర్‌లో జ్యువెలరీ వర్క్ షాపు నిర్వహిస్తున్న బచ్చు సంతోష్(40) జత కలిశారు. రామకృష్ణన్ చోరీ చేసిన బంగారాన్ని గోవింద్‌కు ఇస్తే.. దానిని అతను మహేందర్ పవార్, సంతోష్‌లకు ఇచ్చి ఇతర ప్రాంతాల్లో అమ్మించేవాడు. వచ్చిన డబ్బును నలుగురూ పంచుకొనేవారు. ► రామకృష్ణన్ మంకీ క్యాప్, మాస్కు ధరించి తెల్లవారు జామున 3 నుంచి 4 గంటల సమయంలో బైక్‌పై కాలనీలో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇంటిని గుర్తించి దొంగతనం చేసేవాడు. బంధువుల ఇంట్లోనే దొంగతనం.. మహేందర్ పవార్ తన బంధువుల ఫంక్షన్‌కు వెళ్లాడు. ఈ విషయంపై రామకృష్ణన్‌కు సమాచారం ఇచ్చిన అతను బంధువుల ఇంట్లో ఎవ్వరూ లేరని, తాళం వేసి ఉందని చోరీ చేయమని చెప్పాడు. దీంతో రామకృష్ణన్ ఆ ఇంటి తాళం పగులగొట్టి లాకర్లో ఉన్న బంగారం, వెండి అభరణాలను చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కీసర పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టి నిందితులను సోమవారం తెల్లవారుజామున అరెస్టుచేశారు. వారి వద్ద నుంచి రూ. 50 లక్షల విలువైన బంగారం, వెండితో పాటు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. రామకృష్ణన్‌పై 22 చోరీ కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు. సమావేశంలో మల్కాజిగిరి ఎస్ఓటీ డీసీపీ గిరిధర్, కుషాయిగూడ ఏసీపీడీసీపీ వెంకట్‌రెడ్డి, కీసర సీఐ వెంకటయ్య ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
భవనం పై నుంచి కిందపడ్డ యువకుడు.. 10 గంటలు చీకట్లో నరకయాతన..
రాజన్న: ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడ్డ యువకుడు చీకట్లో ఎవరూ చూడకపోవడంతో దాదాపు 10 గంటలు నరకయాతన పడ్డాడు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లికి చెందిన శాతాని లింగారెడ్డి కుమారుడు శాతాని చిన్ను(26) గురువారం రాత్రి భోజనం అనంతరం భవనంపైకి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారీ కిందపడ్డాడు. చీకటి కావడంతో ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లలేదు. శుక్రవారం ఉదయం పొలాలకు వెళ్లే రైతులు గమనించి చిన్ను కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
'తగ్గేదే లే' ! అంతా బూడిద మయం..!! ఇదేం దోపిడీ..?
భద్రాద్రి: ఏదైనా మంచి విషయం సత్ఫలితాలు ఇవ్వడంలో విఫలమైతే బూడిదలో పోసిన పన్నీరు అనే సామెతను ఉపయోగిస్తాం. కానీ అలాంటి బూడిద నుంచి సైతం కాసులు దండుకునే విద్య తెలిసిన వాళ్లు జిల్లాలో ఉన్నారు. వాళ్ల జాడ తెలియాలంటే భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు వెళ్లాల్సిందే.. భారీగా బూడిద.. దేశమంతటా థర్మల్ పవర్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అయితే టీఎస్ జెన్కో మాత్రం నడుస్తున్న ట్రెండ్‌కు విరుద్ధంగా పాత కాలం నాటి సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగిస్తూ భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ టెక్నాలజీ వాడటం వెనుక కారణాలు ఏమైనా.. దీంతో ప్లాంట్ నుంచి బూడిద అధికంగా విడుదలవుతోంది. ఇలా వచ్చిన బూడిదకు నీటిని కలిపి కొంత భాగం యాష్ పాండ్‌కు తరలిస్తే మరికొంత బూడిదను సిమెంట్, ఇతర పారిశ్రామిక అవసరాలకు తరలిస్తున్నారు. నిత్యం టన్నుల కొద్దీ వెలువడుతున్న బూడిదను వదిలించుకోవడం బీటీపీఎస్‌కు అనివార్యం. అయితే ఉచితంగా బూడిదను పరిశ్రమలకు ఇవ్వకుండా నామమాత్రపు ధరకే థర్మల్ పవర్ ప్లాంట్లు అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ విధానం అమల్లో ఉంది. లారీకి రూ.400 అదనం.. ఎలాంటి లెక్కాపత్రం లేకుండా యాష్ కోసం వచ్చిన లారీల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. బూడిద కొనుగోలుకు సంబంఽధించిన రసీదు ఇవ్వడం, లోడ్ చేసిన బూడిదకు తగ్గ వే బిల్లులు ఇవ్వడం వంటి పనుల్లో కాంట్రాక్టర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రాసెసింగ్ ఫీజు పేరుతో రూ. 200 వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత వే బిల్లులు జారీ చేసే దగ్గర రూ.100, ప్లాంటు గేటు దగ్గర ఇన్, ఔట్లకు కలిపి రూ.100 వంతున లారీల దగ్గర నుంచి డబ్బులు లాగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్లాంట్ నుంచి నిత్యం 100కు పైగా లారీల్లో యాష్ బయటకు వెళ్తుంది. అంటే ఒక్కో లారీ నుంచి రూ.400 చొప్పున రోజుకు రూ. 40,000 ఎలాంటి లెక్కా పత్రం లేకుండా జేబులో వేసుకుంటున్నారు. ఇలా నెలకు రూ.12 లక్షల వరకు యాష్ నుంచే కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఈ దందా నిత్యం జరుగుతున్నా అధికారులెవరూ ఇదేంటని ప్రశ్నించరు. అధికారుల అండదండలను ఆసరాగా చేసుకుని కాంట్రాక్టర్లు మరింతగా రెచ్చిపోతున్నారు. టన్ను బూడిద ధర రూ.109 ఉండగా వీళ్లు రూ.150 వరకు కూడా అమ్ముతున్నారు. ఇదేం దోపిడీ..? గతంలో పాల్వంచలోని కేటీసీఎస్ కేంద్రంగా బూడిద దందాలో ఖజానా నింపుకున్న కాంట్రాక్టర్లలో కొందరు ఇప్పుడు బీటీపీఎస్‌పై కన్నేశారు. బీటీపీఎస్‌లో అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ప్లాంట్ ప్రతిష్టకు మచ్చ కలుగుతోంది. దశాబ్దాల తరబడి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లలో సైతం లేని అవినీతి ఇటీవలే ప్రారంభమైన ప్లాంట్‌లో ఉండడం ఏంటని పారిశ్రామిక వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇంత అవినీతి జరుగుతున్నా ఇక్కడి అధికారులు, జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బూడిద దందాపై వివరణ కోరేందుకు బీటీపీఎస్ డీఈకి ఫోన్ చేయగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. చెప్పిందే ధర.. బీటీపీఎస్ ఆరంభంలో టన్ను బూడిద రూ.69 చొప్పున సిమెంట్, ఇటుక పరిశ్రమలకు అమ్మేవారు. ఇటీవల ఈ ధరను రూ.109కి పెంచారు. ప్రత్యేకమైన కంటైనర్లు కలిగిన లారీల్లో బూడిదను తరలిస్తారు. సగటున ఈ ట్యాంకర్ల కెపాసిటీ 25 టన్నుల వరకు ఉంటుంది. అంటే ఒక్కో యాష్ కంటైనర్ లారీలో బూడిదను నింపుకునేందుకు రూ.2,725 నామమాత్రపు ఫీజు చెల్లిస్తే 25 టన్నుల బూడిద తీసుకెళ్లొచ్చు. అయితే సిమెంట్ కంపెనీలు లేదా లారీ కంటైనర్ల ఓనర్లు బూడిద కోసం ప్లాంట్‌కు చెల్లిస్తున్న ధర పెద్దగా లెక్కలోకి తీసుకోరు. అంతకంటే వాళ్లకు ప్రధానమైనది లోడింగ్, అన్ లోడింగ్. ఈ పనిలో ఆలస్యం జరిగితే విలువైన సమయం వృథా అవుతుంది. కంటైనర్లకు వచ్చే కిరాయి, డ్రైవర్ ఖర్చులు, క్లీనర్ బేటాలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. దీన్ని ఆసరాగా తీసుకుని బూడిద అమ్మకాల్లో కొత్త దందాకు తెరలేపారు. -
రిజర్వుడ్ వైన్‌షాపుల గుర్తింపు..! నేడు నోటిఫికేషన్ జారీ..
ఆదిలాబాద్: జిల్లాలోని రిజర్వుడ్ వైన్‌షాపులను లాటరీ విధానంలో ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ అధికారులు అధికారికంగా ప్రకటన జారీ చేయాల్సి ఉంది. కలెక్టర్ రాహుల్‌రాజ్ గురువారం రిజర్వేషన్ షాపుల గుర్తింపునకు లాటరీ తీసి ఆయా షాప్ నంబర్లను ఖరారు చేశారు. జిల్లాలో మొత్తం 40 వైన్‌షాపులుండగా ఇందులో 15 రిజర్వ్ కాగా, 25 జనరల్ కేటగిరీలో ఉన్నాయి. రిజర్వ్ చేసిన 15 షాపుల్లో గౌడ్స్‌కు జిల్లా కేంద్రంలోని తిర్పెల్లి షాపు–1 వచ్చింది. ఎస్సీలకు 5 షాపులు కేటాయించగా, ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్‌లోని షాపు నంబర్ 9, రైల్వేగేటు సమీపంలోని షాపు నంబర్ 10, బేలలోని షాపు నంబర్ 11, భీంపూర్ మండల కేంద్రంలోని షాపు నంబర్ 18, బజార్హత్నూర్ మండలం గిర్నూర్లోని షాపు నంబర్ 29 కేటాయించారు. ఎస్టీలకు తొమ్మిది షాపులు రిజర్వ్ కాగా, ఇవన్నీ ఉట్నూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వచ్చాయి. నేడు నోటిఫికేషన్ జారీ.. నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం శుక్రవారం జారీ చేయనుంది. వెంటనే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించనుంది. ఈనెల 18న సాయంత్రం 6గంటల వరకు దరఖాస్తుకు గడువు ఉంది. 21న లాటరీ పద్ధతిలో వైన్‌షాపులను కేటాయిస్తారు. దరఖాస్తు వివరాలు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాతే వెల్లడించనున్నట్లు డీపీఈవో హిమశ్రీ ‘సాక్షి’కి తెలిపారు. -
రివర్స్ గేర్‌లో 2 కి.మీ.లు
మైసూరు: అటవీ ప్రాంతంలో ప్రసవం కోసం గర్భిణిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా అడవి ఏనుగు అడ్డువచ్చి దాడికి యతి్నంచింది. అంబులెన్స్ డ్రైవర్ చాకచక్యంతో సుమారు రెండు కిలోమీటర్ల దూరం వెనక్కు తీసుకెళ్లి గర్భిణిని కాపాడాడు. ఈ సంఘటన మైసూరు జిల్లాలోని హెచ్.డి.కోటెలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. జీఎం హళ్ళి గ్రామానికి చెందిన లంబాడి మహిళ సుచిత్ర నిండు గర్భిణి. పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా అంబులెన్స్ వచ్చి హెచ్డికోటె ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో ఒక అడవి ఏనుగు రోడ్డుకు అడ్డంగా నిలబడింది. సుమారు 15 నిమిషాల పాటు గజరాజు కదలకుండా అలాగే ఉంది. డ్రైవర్ శరత్ అంబులెన్స్‌ను ముందుకు పోనివ్వగా ఏనుగు అంబులెన్స్ మీదకు దూసుకొచ్చింది. దీంతో డ్రైవర్ రివర్స్ గేర్ వేసి సుమారు 2 కిలోమీటర్ల దూరం వెనక్కు ప్రయాణించాడు. ఏనుగు కొంతదూరం వెంబడించి నిలిచిపోయింది. అంబులెన్స్‌లో ఉన్న ఆశా కార్యకర్త సావిత్రిబాయి గర్భిణికి కాన్పు చేసింది. తరువాత మరో మార్గంలో తల్లీబిడ్డను ఆస్పత్రికి తరలించారు. -
చరిత్ర సృష్టించిన TCS ప్రపంచంలోనే నెంబర్ 1
-
ట్రూజెట్ ని కొనుగోలు చేసి భారత విమానయాన రంగంలోకి అమెరికా దిగ్గజం
-
ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ హైదరాబాద్ లో 1000 ఉద్యోగాలు
-
సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ @ జగనన్న ఆణిముత్యాలు
-
టాప్ 30 హెడ్‌లైన్స్
-
కిట్లపై ఈనాడు పిట్టకథలు
-
టాప్ ౩౦ హెడ్‌లైన్స్
-
వెళ్లి ఆస్పత్రిలో చూపించుకో
-
ఎక్కడికక్కడ నిలిచిపోయిన పంటలు నిజామాబాద్ లో రైతులు ఆవేదన
-
సాక్షి నేషనల్ న్యూస్
-
టాప్ 30 హెడ్ లైన్స్..!
-
మాజీ సెలెక్టర్ MSK ప్రసాద్‌తో విభేదాలపై స్పందించిన రాయుడు
-
నానికి నేను హామీ ఇచ్చాను
-
గుడివాడ గడపై చంద్రబాబుకు సవాల్
-
బ్రతికున్నంత కాలం రుణపడి ఉంటా.. కొడాలి నాని ఎమోషనల్..
-
వాహనంలో వద్దు.. నడిచే వెళ్దాం..
-
విశాఖ కిడ్నాప్ కేసు.. ఎంపీ ఎంవివి దగ్గర డబ్బు గుంజడానికి ప్లాన్ చేశారా?
-
కొడుకు కిడ్నాప్‌పై స్పందించిన ఎంపీ
-
ఆ దరిద్రం.. కాంగ్రెస్‌కు పోయి బీజేపీకి అంటుకుందా?
-
కాపుల గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్‌కి లేదు
-
ఎస్సీల గురించి మాట్లాడే అర్హతే మీకు లేదు..
-
రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నావు కాబట్టి.. రేషన్ కార్డులు ఇస్తానంటున్నావా?
-
పొరపాటున చెప్పావో కావాలని చెప్పావో.. చంద్రబాబు గురించి భలే చెప్పావు పవన్
-
పెద్ద మొగోడివి అనుకుంటున్నావా.. చెప్పు చూపిస్తున్నావు.. మక్కెలు ఇరగ్గొడతా: పెర్నినాని
-
కోహ్లీ నిర్ణయంతో షాక్ అయ్యాం
-
అమిత్ షాకు సజ్జల కౌంటర్
-
తెలుగు రాష్ట్రాల్లో బీసీలంటే గుర్తొచ్చేది ఆర్ కృష్ణయ్య పేరే
-
బీఆర్ఎస్ నేతలపై ఐటీ దాడుల కలకలం
-
కడుపు మంట..!
-
ఉత్తర భారతాన్ని వణికించిన భారీ భూకంపం..!
-
దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రిలలో ఒకటిగా నిమ్స్
-
ఐటి రైడ్స్ కలకలం
-
ఏపీ, ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
-
టాప్ 30 హెడ్ లైన్స్@1PM 14 June 2023
-
పాన్ఇండియా ని షాక్ చేస్తున్న కాంబినేషన్..!
-
అశ్వద్వామా తో త్రివిక్రమ్ కి అల్లు అర్జున్ షాక్
-
యుద్దానికి విరమణ ప్రకటించిన సూడాన్
సూడాన్‌లో గత కొన్ని రోజులు జరుగుతున్న అంతర్యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు వర్గాల సైన్యం మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఇది చర్చల ద్వారా ఏర్పడిన మొదటి సంధి. అయితే సుడాన్ సైన్యం సోమవారం రాజధాని ఖార్టూమ్‌లో వైమానిక దాడులు నిర్వహించింది. సహాయక చర్యలను అనుమతించే క్రమంలో వారం రోజుల కాల్పుల విరమణ అమలులోకి రావడానికి కొన్ని గంటల ముందు పారామిలిటరీ ప్రత్యర్థులపైచేయి సాధించేందుకు సూడాన్ సైన్యం ఈ చర్యకు పాల్పడింది. ఇరు సైనిక వర్గాల మధ్య వివాదం చెలరేగినప్పటి నుంచి రాజధానిలోని నివాస ప్రాంతాలలో పనిచేస్తున్న పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మొబైల్ యూనిట్ల వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఆదివారం సాయంత్రం వరకు వైమానిక దాడులు నిర్వహించినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. అయితే సోమవారం సాయంత్రం 7: 45 గంటల నుంచి కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలు తెలిపాయి. కాల్పుల విరమణ ఒప్పందంలో సైన్యం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్, సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్ నుంచి ప్రతినిధులు ఉన్నారు. జెడ్డాలో చర్చల తర్వాత ఒప్పందానికి ఈ బృందం మధ్యవర్తిత్వం వహించింది. ఈ ఒప్పందం పొరుగు దేశాలకు పారిపోయిన 2,50,000 మందితో సహా దాదాపు 1.1 మిలియన్ల మందికి ఊరట కల్పించింది.సెంట్రల్ ఖార్టూమ్‌లోని వ్యూహాత్మక స్థానాల నుంచి పౌర భవనాలను ఆక్రమించిన పొరుగు ప్రాంతాల నుంచి RSFని తొలగించడానికి అక్కడి సైన్యం చాలా కష్టపడింది. -
న్యూస్ కోసం పేపర్ చదవటం లేదు! ఎక్కువ అందులోనే చూస్తున్నారు..
న్యూఢిల్లీ: దేశీయంగా సగానికిపైగా ఇంటర్నెట్ యూజర్లు ప్రాంతీయ భాషల్లో న్యూస్ కోసం ఆన్లైన్ మాధ్యమం వైపు మొగ్గు చూపుతున్నారు. పైగా పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో వార్తల వినియోగం అత్యధికంగా (63 శాతం - 23.8 కోట్ల మంది) ఉంటోంది. పట్టణ ప్రాంత యూజర్లలో ఇది 37 శాతంగా ఉంది. టెక్నాలజీ దిగ్గజం గూగుల్, కన్సల్టెన్సీ సంస్థ కాంటార్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం .. దేశీయంగా 72.9 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ఇందులో 52 శాతం మంది (37.9 కోట్లు) వివిధ న్యూస్ యాప్‌లు, వెబ్సైట్లు, సోషల్ మీడియా పోస్టులు, మెసేజ్ ఫార్వర్డ్లు, యూట్యూబ్ మొదలైన వాటి ద్వారా ప్రాంతీయ భాషల్లో వార్తలను ఆన్లైన్లో చూడటం, చదవడం, వినడం చేస్తున్నారు. తమ తోటివాళ్లలో కూడా టీవీ చానళ్లతో పోలిస్తే ఆన్లైన్ మాధ్యమమే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంటోందని 48 శాతం మంది పేర్కొన్నారు. 14 రాష్ట్రాల్లో, 8 ప్రాంతీయ భాషల్లో, 15 ఏళ్లు పైబడిన వారిలో డిజిటల్ న్యూస్ వినియోగ ధోరణులను తెలుసుకునేందుకు కాంటార్–గూగుల్ దీనికి సంబంధించిన సర్వే నిర్వహించాయి. ఇందుకోసం 16 నగరాలకు చెందిన 4,600 మందిని వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేసింది. 64 పైచిలుకు చర్చా కార్యక్రమాలు నిర్వహించింది. దీని నివేదిక ప్రకారం.. వార్తల వినియోగానికి వీడియోలు అత్యధికంగా ఇష్టపడే ఫార్మాట్‌గా ఉంటున్నాయి. టెక్ట్స్, ఆడియో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. బెంగాలీ వీడియో కంటెంట్‌కు అత్యధిక డిమాండ్ (81 శాతం) ఉంది. తమిళం (81%), తెలుగు (79%), హిందీ (75%), గుజరాతీ (72%), మలయాళం (70%), మరాఠీ.. కన్నడ (చెరి 66%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. టెక్ట్స్ వినియోగం ఎక్కువగా గుజరాతీ, కన్నడ కంటెంట్‌కు చెరి 20 శాతం చొప్పున ఉంది. మరాఠీలో 18 శాతంగా ఉంది. ఆడియో న్యూస్ కంటెంట్‌కు మరాఠీ, మలయాళంలో అత్యధికంగా (16 శాతం) డిమాండ్ ఉంది. ఆన్లైన్ న్యూస్ చూసేందుకు ఎక్కువ శాతం మంది (93 శాతం) యూట్యూబ్ వైపు మొగ్గు చూపుతున్నారు. సోషల్ మీడియా (88 శాతం), చాట్ యాప్స్ (22 శాతం), సెర్చి ఇంజిన్లూ (61 శాతం), పబ్లిషర్ న్యూస్ యాప్స్ లేదా వెబ్సైట్లు (45 శాతం), ఆడియో న్యూస్ (39 శాతం), ఓటీటీ లేదా కనెక్టెడ్ టీవీ (21 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 80 శాతం మంది ఆన్లైన్ న్యూస్ వినియోగదారులకు పలు సందర్భాల్లో అనుమానాస్పద కంటెంట్ ఎదురైంది. అది వాస్తవమైనదా లేక తప్పుడు వార్తా అన్నది తెలుసుకోవడం కష్టతరంగా మారింది. ఏ న్యూస్ వెబ్సైట్లోను కనిపించకుండా కేవలం వాట్సాప్ లేదా నోటిమాటగానో వస్తే అలాంటి వాటిని తాము తప్పుడు సమాచారంగా పరిగణిస్తున్నామని 43 శాతం మంది తెలిపారు. 60 పదాలకన్నా తక్కువగా సంక్షిప్త రూపంలో ఉండే న్యూస్‌ను 70 శాతం మంది చదువుతుండగా, 67 శాతం మంది టాప్ స్టోరీ హెడ్‌లైన్స్‌ను, 48 శాతం మంది సుదీర్ఘ కంటెంట్‌ను చదువుతున్నారు. 25 శాతం మంది ఆన్లైన్ న్యూస్ వినియోగదారులు 60 సెకన్ల లోపు క్లిప్‌లను ఇష్టపడుతుండగా, 19 శాతం మంది మరింత ఎక్కువ నిడివి కలిగి ఉండే వాటిపై ఆసక్తి చూపుతున్నారు. 73 శాతం మంది ఆన్లైన్ రీడర్లు.. ఎక్కువగా హైపర్‌లోకల్ కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. వార్తల్లో కూడా వివిధ సెగ్మెంట్లకు వివిధ రకాలుగా ప్రాధాన్యం ఉంటోంది. ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ న్యూస్‌ను (76 శాతం మంది – 37.9 కోట్లు) యాక్సెస్ చేస్తున్నారు. క్రైమ్ రెండో స్థానంలో ఉండగా.. దేశ, రాష్ట్ర, నగర వార్తలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
ధోని అభిమానులకు మరో షాకింగ్ న్యూస్
-
ఓలా స్కూటర్ పోయింది... ఈ టెక్నాలజీతో దొరికింది
-
మన ఊరు మన వార్తలు
-
మహిళల పట్ల సున్నితత్వంతో మెలగాలి: రాష్ట్రపతి ముర్ము
న్యూఢిల్లీ: మహిళల ప ట్ల సున్నితత్వాన్ని అలవర్చుకోవాలని రాష్ట్రప తి ద్రౌపదీ ముర్ము మీడియాను కోరారు. వార్తలు, కార్యక్రమాలు, వాణిజ్య ప్రకటనలు ప్రసా రం చేసేటప్పుడు మహిళల గౌరవాన్ని, భద్రతను దృష్టిలో పెట్టుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రతి భారతీయ పౌరుడు మహిళ గౌరవానికి భంగం కలిగించే చర్యలను విడనాడాలని మన రాజ్యాంగం చెబుతోందని గుర్తు చేశారు. నవభారత్ టైమ్స్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఆల్ వుమెన్ బైక్ ర్యాలీను జెండా ఊపి ప్రారంభించిన సందర్భంగా ఆమె ఈ మేరకు ఒక వీడియో సందేశం పంపారు. ‘మహిళలను గురించి ప్రతి పౌరుడు గౌరవప్రదంగా ఆలోచించాలి. మహిళల పట్ల మర్యాద పూర్వకమైన ప్రవర్తనకు పునాది కుటుంబమే. తల్లులు, సోదరీమణులు తమ కొడుకులు, సోదరుల్లో మహిళలకు గౌరవం ఇచ్చే విలువలను పెంపొందించాలి. విద్యార్థుల్లో మహిళల పట్ల గౌరవాన్ని, సున్నితత్వంగా మెలిగే సంస్కృతిని ఉపాధ్యాయులు పెంపొందించాలి’అని ద్రౌపదీ ముర్ము కోరారు. ‘మహిళల్లో మాతృత్వ సామర్ధ్యం, నాయకత్వ సామర్ధ్యం సహజంగానే ఉంటాయి. అనేక పరిమితులు, సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ మహిళలు తమ అసమానమైన ధైర్యం, నైపుణ్యాలతో కొత్త విజయ రికార్డులను నెలకొల్పారు’అని ఆమె పేర్కొన్నారని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. -
మృత్యుంజయులుగా బయటపడుతున్న చిన్నారులు
-
న్యూస్ ఎక్స్ ప్రెస్ @ 4:30 Pm 27 జనవరి 2023
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ రేపటికి వాయిదా
-
న్యూస్ దిస్ వీక్ @ 08 January 2023
-
న్యూస్ దిస్ వీక్ @ 25 December 2022
-
ఇందు మృతి కేసులో కొనసాగుతున్న పోలిసుల దర్యాప్తు
-
న్యూస్ దిస్ వీక్ @ 11 December 2022
-
న్యూస్ దిస్ వీక్ @ 04 December 2022
-
గన్ షాట్ : ఏపీ కంపెనీలపై ఎల్లో మీడియా విషం కక్కుతుందా ..!
-
న్యూస్ దిస్ వీక్ @ 06 November 2022
-
న్యూస్ దిస్ వీక్ @ 30 October 2022
-
ఏపీ తెలంగాణ స్పీడ్ న్యూస్ @ 8PM 25 May 2022
-
ఏపీ,తెలంగాణ స్పీడ్ న్యూస్ @05 PM 21st మే 2022
-
ఏపీ తెలంగాణ స్పీడ్ న్యూస్ @ 11AM 20 April 2022
-
ఏపీ,తెలంగాణ స్పీడ్ న్యూస్@04:00 PM 7th ఏప్రిల్ 2022
-
ఏపీ తెలంగాణ స్పీడ్ న్యూస్ @ 10AM 05 April 2022
-
ఏపీ,తెలంగాణ స్పీడ్ న్యూస్@03:30 PM 3rd ఏప్రిల్ 2022
-
ఏపీ తెలంగాణ స్పీడ్ న్యూస్ @ 11AM 03 April 2022
-
ఏపీ,తెలంగాణ స్పీడ్ న్యూస్@10:00AM 13th ఏప్రిల్ 2022
-
టాప్ 25 న్యూస్ @ 7AM 02 April 2022
-
ఏపీ,తెలంగాణ స్పీడ్ న్యూస్@03:00PM 27th మార్చి 2022
-
ఏపీ,తెలంగాణ స్పీడ్ న్యూస్@08:00PM 25th మార్చి 2022
-
ఏపీ,తెలంగాణ స్పీడ్ న్యూస్@06:00PM 25th మార్చి 2022
-
ఏపీ,తెలంగాణ స్పీడ్ న్యూస్@07:30PM 13th మార్చి 2022
-
ఏపీ,తెలంగాణ స్పీడ్ న్యూస్@03:30PM 13th మార్చి 2022
-
సాక్షి జాతీయ వార్తలు @03:30PM 13th మార్చి 2022
-
ఏపీ స్పీడ్ న్యూస్ @ 1PM 06 March 2022
-
ఏపీ,తెలంగాణ స్పీడ్ న్యూస్@6:00 PM - 3rd మార్చి 2022
-
సాక్షి టీవీ 13 వార్షికోత్సవ శుభాకాంక్షలు
-
ఏపీ తెలంగాణ స్పీడ్ న్యూస్ @ 10AM 25 February 2022
-
తెలంగాణ స్పీడ్ న్యూస్@03:30 PM - 24 ఫిబ్రవరి 2022
-
ఏపీ,తెలంగాణ స్పీడ్ న్యూస్@7:00 PM - 23 ఫిబ్రవరి 2022
-
ఏపీ,టీఎస్ స్పీడ్ న్యూస్@6:00 PM - 20 ఫిబ్రవరి 2022
-
ఏపీ,టీఎస్ స్పీడ్ న్యూస్@5:30 PM - 20 ఫిబ్రవరి 2022
-
ఏపీ స్పీడ్ న్యూస్ @ 11AM 20 February 2022
-
AP TS స్పీడ్ న్యూస్@@05:30PM - 16 ఫిబ్రవరి 2022
-
సాక్షి జాతీయ వార్తలు@3:00PM - 16 ఫిబ్రవరి 2022
-
నేషనల్ స్పీడ్ న్యూస్ @ 2PM 14 February 2021
-
తెలంగాణ స్పీడ్ న్యూస్ @ 1PM 10 February 2022
-
ఏపీ తెలంగాణ స్పీడ్ న్యూస్ @ 10AM 09 February 2022
-
తెలంగాణ స్పీడ్ న్యూస్ @ 12PM January 2022
-
ఏపీ తెలంగాణ స్పీడ్ న్యూస్ @ 1PM 19 January 2022
-
ఏపీ తెలంగాణ స్పీడ్ న్యూస్ @ 11AM 17 January 2022
-
ఏపీ స్పీడ్ న్యూస్ @ 12PM 15 January 2022
-
తెలంగాణ స్పీడ్ న్యూస్ @ 11AM 15 January 2022
-
ఏపీ స్పీడ్ న్యూస్ @ 10AM 13 January 2022
-
ఏపీ తెలంగాణ స్పీడ్ న్యూస్ @ 10AM 12 January 2022
-
తెలంగాణ స్పీడ్ న్యూస్ @ 10AM 09 january 2022
-
ఏపీ స్పీడ్ న్యూస్ @ 12PM 06 January 2022
-
స్పీడ్ న్యూస్ @ 10AM 05 January 2022
-
స్పీడ్ న్యూస్ @ 12PM 03 January 2022
Urgent News Article Page Title Test
Apr 9 2024 6:24 PM | Updated on Apr 12 2024 2:37 PM