విద్యార్థిని చితకబాదిన ఇతర విద్యార్థులు! అసలు కారణమేంటి..? | - | Sakshi
Sakshi News home page

విద్యార్థిని చితకబాదిన ఇతర విద్యార్థులు! అసలు కారణమేంటి..?

Oct 8 2023 1:28 AM | Updated on Oct 8 2023 9:34 AM

- - Sakshi

వరంగల్‌: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌సైన్స్‌ కళాశాలలో శనివారం సాయంత్రం విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. బీఏ మొదటి సంవత్సరం విద్యార్థులకు.. బీఏ ద్వితీయ ,ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు ఆ కళాశాలలో ఆడిటోరియంలో వెల్‌కమ్‌ పార్టీ నిర్వహించారు. మధ్యాహ్నం 3గంటల వరకు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ తరువాత చాలా మంది విద్యార్థులు కళాశాల ఆవరణకు చేరుకున్నారు. కొందరు ఫొటోలు దిగుతున్నారు.

ఈ సమయంలో ఏమైందో తెలియదుగాని ఓ ఫస్టియర్‌ విద్యార్థిని ద్వితీయ సంవత్సరం విద్యార్థులుగా భావిస్తున్న కొందరు చితకబాదారని సమాచారం. ఆ విద్యార్థిని వెంబడించి మరి చితకబాదారని తెలుస్తోంది. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం తెలుసుకున్న పలువురు అధ్యాపకులు ఘటనాస్థలికి చేరుకుని ఈ గొడవను నిలువరించారని సమాచారం.

అనంతరం విద్యార్థులను కళాశాల నుంచి బయటికి పంపారు. కాగా, విద్యార్థిని ఎందుకు చితకబాదారనే విషయం తెలియరాలేదు. ఈ గొడవ విషయంపై ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ బన్న ఐలయ్య దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం. గొడవ పడిన విద్యార్థులను ఈనెల 8న లేదా 9న పిలిపించి మాట్లాడాలని యోచిస్తున్నారని సమాచారం. దీనిపై ప్రిన్సిపాల్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement