విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

Aug 13 2026 1:03 AM | Updated on Aug 13 2026 1:03 AM

మహబూబాబాద్‌: విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని యూఎస్‌పీసీ జిల్లా కన్వీనర్‌ రమేశ్‌ డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. రమేశ్‌ మాట్లాడుతూ.. పీఆర్‌సీ వెంటనే ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలు విడుదల చేయాలన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కేజీబీవీ కాంట్రాక్ట్‌ టీచర్లను రెగ్యులరైజ్‌ చేయాలని, మోడల్‌, ఎయిడెడ్‌, గురుకులాల సిబ్బందికి 010 ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు. అన్ని ఆస్పత్రుల్లో హెల్త్‌ కార్డుల ద్వారా వైద్య సౌకర్యం కల్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, జీఓ నంబర్‌ 25ను సవరించాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్‌ కార్యాలయంలో అందజేశారు. నాయకులు దేవేందర్‌, ఉపేందర్‌, రామ లింగారెడ్డి, హరి, సైదులు, అనిత, భిక్షపతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement