కంపెనీలు ఉద్యోగులు పట్ల ఎలా వ్యవహరిస్తాయో చెప్పే సందేశాత్మక స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల కాలంలో చాలా కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. అచ్చం అలానే ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి కంపెనీ ఫార్మాల్టీలు పూర్తిచేయడానికి వెళ్తే తనకు ఎదురైన అనుభవం రెడ్డిట్‌లో షేర్ చేసుకున్నాడు. తన కంపెనీలో చివరి వర్కింగ్ డే రోజు తనకు తగిన పాఠం నేర్పిందంటూ తను ఎదుర్కొన్న అనుభవాన్ని పంచుకున్నారు. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందంటూ మాట్లాడిన మాటలు అందరి మనసులను తాకాయి.
అసలేం జరిగిందంటే..బెంగళూరు టెకీ రెడిట్ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చాడు. తను ఉద్యోగం పోవడంతో కంపెనీకి తిరిగి ల్యాప్‌టాప్ ఇచ్చేసి చివరి రోజు కంపెనీ ఫార్మాల్టీలు పూర్తి చేసేందుకు తన రెండేళ్ల కుమారుడితో ఆఫీస్‌కి వెళ్లినట్లు పేర్కొన్నాడు. ఎందుకంటే తన భార్య కూడా ఉద్యోగం చేయడంతో వేరే గత్యంతరం లేక తన కుమారుడిని తీసుకుని ఆఫీసుకు వచ్చానని చెప్పాడు. అలాగే కార్యాలయం నిబంధనలను బ్రేక్ చేసే ఉద్దేశ్యం తనకు లేదని, అలాగే ఇలా పిల్లలతో రావడాన్ని కంపెనీ అనుమతించదని తెలుసని కూడా రాశారు.
చివరి రోజు కంపెనీ ఇచ్చిన ల్యాప్‌టాప్ వంటి కార్యాలయ సామాగ్రిని ఇచ్చేసి..ఫార్మాల్టీస్ పూర్తి చేయడానికే కదా అని తప్పనిపరిస్థితుల్లో ఇలా కుమారుడితో వచ్చినట్లు వెల్లడించారు. తను కూడా తన పరిస్థితి వివరించినా..సెక్యూరిటీ గార్డు అందుకు నిరాకరించాడు. రిక్వస్ట్ చేసినా..కంపెనీ నుంచి నో అనే సమాధానమే వచ్చింది. చివరికి చేసేది లేక తన సహోద్యోగికి ఫోన్ చేసి, తన పిల్లాడిని ఓ ఐదు నిమిషాలు చూసుకోమని చెప్పి..కంపెనీ ఫార్మాల్టీస్ పూర్తి చేసేందుకు వెళ్లానని చెప్పారు.
కానీ ఆ పని ఐదు నిమిషాల్లో పూర్తవుతుంది అనుకుంటే..అది కాస్తా 15 నిమిషాలు పైనే పట్టిందని నిజాయితీగా వివరించారు. కానీ చివరి రోజు తనకు ఎదురైన మొత్త అనుభవం తనకు చాలా బాధనే మిగిల్చిందన్నారు. అలాగే కనువిప్పు కలిగించే గొప్ప పాఠం కూడా నేర్పిందని చెప్పారు. తాను కంపెనీపై ఎలాంటి ఆరోపణలు చేయడం లేదని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ సంఘటనతో పనితో ఉన్న సంబంధం గురించి పునరాలోచించేలా చేసింది. కంపెనీ అనేది కంపెనీ మాత్రమే. దానికి నీ వ్యక్తిగత పరిస్థితులతో సంబంధం ఉండదు.
ఏళ్ల తరబడి పనిచేసినా..కంపెనీకి మన జీవితంలో ఎంత వరకు ప్రాముఖ్యత ఇవ్వాలో అంతే ఇవ్వాలి, ఎందుకంటే అది చివరికి ఒక వ్యాపార సంబంధంగానే మిగిలిపోతుందనేది గుర్తురెగాలి. అందుకే కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి, పనికి అతీతమైన జీవితాన్ని నిర్మించుకోవడం అనేది చాలా ముఖ్యం అని రాసుకొచ్చాడు పోస్ట్‌లో. అయితే ఇక్కడ వర్క్ కూడా ముఖ్యమే కానీ కుటుంబ జీవితం కూడా అంతే ముఖ్యం అంటూ తన పోస్ట్‌ని ముగించాడు.
నెటిజన్లు కూడా కంపెనీ మీరు వెళ్లిపోగానే మరో ఉద్యోగిని తక్షణమే నియమిస్తుంది అదే మీ కుటుంబానికి మీ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. అందుకే ఏ కంపెనీ కూడా మన ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, ప్రేమించే వ్యక్తులతో గడిపే సమయాన్ని త్యాగం చేసేంత విలువైనది కాదు అంటూ పోస్టులు పెట్టారు.
(చదవండి: తండ్రి చెంత జైలులోనే ఆ చిన్నారి..!ఆ ఐఏఎస్ అధికారి అడిగిన ప్రశ్న..)


