పవిత్ర కన్వార్ యాత్ర ముగిసిన తర్వాత ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో భారీగా చెత్త పేరుకుపోవడంపై తీవ్ర ఆందోళన నెలకొంది. వార్షిక కన్వర్ యాత్ర తర్వాత దేవభూమిగా పిలువబడేహరిద్వార్‌లో పేరుకుపోయిన చెత్తను, భారీగా పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం పెద్దగా భారంగా మారింది. అంతేకాదు పవిత్ర గంగోత్రి పర్యావరణానికి ముప్పు అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్రావణ మాసంలో సుమారు 5 కోట్ల మంది భక్తులు గంగాజలం కోసం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ను సందర్శించారు. యాత్ర ముగిశాక ఘాట్లు, రోడ్లు, పార్కింగ్ స్థలాల్లో విసిరేసిన బట్టలు, ప్లాస్టిక్ సీసాలు, కావడి నిర్మాణాలు టన్నుల కొద్దీ దర్శనమిస్తుండటంతోపాటు, అత్యంత పవిత్రమైన హరి కీ పౌరీ ఘాట్‌తో పాటు మారు దుస్తుల గదులలో యూరిన్ నింపిన ప్లాస్టిక్ సీసాలను వదిలివెళ్లడం కలకల రేపింది. పారిశుధ్య కార్మికులు మాస్కులు, గ్లౌజులు కూడా లేకుండా పారలతో ఆ వ్యర్థాలను ఎత్తివేయాల్సి వచ్చింది.
ఇదీ చదవండి: రూ. 50 లక్షలు, 15 ఏళ్ల కష్టం, కెనడాలో మాస్టర్స్ : చివరకు మిగిలింది!
7,000 టన్నుల చెత్త
హరిద్వార్ మున్సిపల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం డంపింగ్ యార్డులకు ఇప్పటి వరకు కనీసం 7,000 టన్నుల చెత్తను తొలగించారు. పారిశుధ్య సిబ్బంది రాత్రంతా శ్రమించి ఘాట్లను శుభ్రం చేస్తున్నారు. అలాగే ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా ప్రకటించిన గంగోత్రిని కూడా దాదాపు 57,000 మంది భక్తులు సందర్శించి టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలను వదిలేశారు. ఇది సున్నితమైన హిమాలయ పర్యావరణ వ్యవస్థకు, అటవీ జీవులకు తీవ్ర ముప్పుగా మారింది. అటవీ శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 57 సంచుల చెత్తను సేకరించింది.
Right after the Kanwar Yatra ended, sanitation workers cleaning Har Ki Pauri (Haridwar) found multiple water bottles filled with URINE hidden in the changing rooms. Workers accuse Kanwariyas of leaving this mess behind.
How can anyone do this at a holy place? pic.twitter.com/gRKxnk68Ux— Himalayan Hindu (@himalayanhindu) August 12, 2026
> సుదూర ప్రాంతాల నుండి నడుచుకుంటూ గంగాజలం కోసం వచ్చే భక్తులే, అదే గంగానదిని, పరిసరాలను ఈ స్థాయిలో కలుషితం చేయడంపై స్థానికులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


