మహిళలూ.. ఆ విషయాలకు క్షమాపణ చెప్పొద్దు..! | Stop saying sorry for who you are Indian-woman should never apologize | Sakshi
Sakshi News home page

మహిళలూ.. ఆ విషయాలకు క్షమాపణ చెప్పొద్దు..!

Aug 12 2026 11:33 AM | Updated on Aug 12 2026 11:58 AM

Stop saying sorry for who you are Indian-woman should never apologize

భారతీయ అమ్మాయిలకు చిన్నప్పటి నుంచి క్షమాపణలు చెప్పడం నేర్చుకుంటుంటారు. గదిలో గట్టిగా నవ్వినందుకు. ఎ‍క్కువుగా తిన్నందుకు, ఎవరికైనా నొప్పి కలిగినప్పుడు, వద్దని చెప్పాలనుకున్నప్పడు, భావోద్వేగాలను వ్యక్తపరిచనిందుకు ఇలా ప్రతిదాంట్లో క్షమాపణలు చెబుతుంటారు. నిజానికి సారీ వాళ్ల లైఫ్‌లో భాగమైపోతుంది.     అదొక నిశబ్ద శిక్షణగా మారిపోతుంది. ఇది ఒకరకంగా తమను తాము చిన్నవారిగా చేసుకునే అలవాటుగా మారిపోతుంటుంది. ముఖ్యంగా మహిళలు క్షమాపణలు చెప్పేలా చేస్తున్న మూడు విషయాలు ఏంటో తెలుసా అంటూ వాటి గురించి వివరించారు సైకాలజీ నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందామా..!.

మన భారతీయ సమాజంలో అమ్మాయిల కోసం చాలా ఎక్కువగా నియమాలు విధిస్తుంటారు. వాటిలో కొన్ని.. గట్టిగా నవ్వొద్దు, గట్టిగా మాట్లాడకు, ఎక్కువగా తినకు, అలా కూర్చోకు, ఇవి వేసుకోవద్దు, ఆత్మవిశ్వాసంతో ఉండకు ..అలా చేస్తే నిన్ను అహంకారిగా అనుకునే ప్రమాదం ఉందంటూ కట్టడి చేస్తుంటారు చాలామంది. ఆఖరికి సైలెంట్‌ ఉన్నా, తన అభిప్రాయాలకే కట్టుబడి ఉన్నా, అందరితో సరదాగా ఉన్న ఇలా ప్రతిదాంట్లో ఆంక్షలు ఉంటాయి. నిజానికి ఇవి మనల్ని అలసిపోయేలా చేసేవి, ఒత్తిడికి గురిచేసేవి. 

వాటన్నింటి వెనుక ఉన్న ఉద్దేశ్యం.. ఒక్కటే నువ్వు సహజంగా ఉన్న తీరు అంత సరైనది కాదు అని చెప్పడమే అని అంటున్నారు సైకాలజీ నిపుణులు. ఈ ప్రపంచంలో ఇమడటానికి ఇవే అర్హతలంటే వాటిని తప్పక వ్యతిరేకించాలని అంటున్నారు. ఇతరుల కోసం నిన్ను నువ్వు మార్చుకోవాల్సి అవసరం లేదని చెబుతున్నారు. నీ చుట్టూ ఉన్నవారి సౌకర్యం కోసం  నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన పనిలేదు. నువ్వు ఎలా ఉన్నావో అలా ఉన్నందుకు అస్సలు సారీ చెప్పాల్సిన పనిలేదంటున్నారు. 

తమను తాము విజయవంతంగా అణచివేసుకుని ఇతరుల ఆమోదాన్ని పొందిన మహిళలు ఈ ప్రపంచానికి అవసరం లేదని, తమను తాము ఉన్నది ఉన్నట్లుగా, సంపూర్ణంగా, ఎలాంటి సంకోచం లేకుండా వ్యక్తపరిచే ధైర్యం ఉన్న మహిళలే కావాలని చెబుతున్నారు మానసిక నిపుణులు. అలాగే భావోద్వేగపూరితంగా ఉన్నందుకు క్షమాపణలు చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే అమ్మాయిలు స్వభావరీత్యా భావోద్వేగపూరితంగా ఉంటారు. 

మన భారతీయ సమాజం తరతరాలుగా అలాంటి భావోద్వేగాన్ని వ్యక్తపరచడాన్ని  సిగ్గుపడే అంశంగా చెబుతుంటారు. ఉదాహరణకు సినిమా చూసి ఏడవడం బలహీనత, అతిగా ఆలోచించడాన్ని వ్యక్తిత్వ లోపంగానూ, విషయాలను లోతుగా అనుభూతి చెందడాన్ని డ్రామాగా, ప్రతిదానికి బాధపడటాన్ని సున్నితత్వంగా చూస్తుంటారు. ఈ భావాలను వ్యక్తపరచడం అనేది సిగ్గుపడే విషయం కాదని నొక్కి చెబుతున్నారు. అవేమి లోపాలు కాదని స్త్రీలను లోతైన సానుభూతిపరులుగా, లోతైన అనుబంధం ఉన్నవారుగా, లోతైన మానవత్వం ఉన్నవారుగా చూసే గుణాలని అన్నారు. 

అలాగే "కాదు" అని చెప్పేందుకు కూడా క్షమాపణ వద్దనే చెబుతున్నారు. సహజంగా "కాదు" అని చెప్పే అమ్మాయిని సంస్కారహీనురాలుగా, మొండిది, నిర్దయురాలు, స్వార్థపరురాలుగా ముద్రవేసేస్తుంటారు. కానీ ఇక్కడ కాదు అనేది మిమ్మల్ని గౌరవించుకుంటున్నారని అర్థమట. మీకు సరిగా అనిపించని విషయాలకు నిర్మొహమాటంగా కాదు అని చెప్పడమే సరి అని అంటున్నారు. అంటే ఒక పరిస్థితికి, ఒక అ‍భ్యర్థన, ఒక సంబంధానికి ఆత్మగౌరవాన్ని, భద్రతను లేదా శాంతిని పణంగా పెట్టమని కోరే దేనికైనా కాదు అని చెప్పడం అంటే.. ఆమె తాను ముఖ్యమైనదాన్ని అని చెప్పే గీతను నిర్మిస్తున్నట్లు భావం అని అంటున్నారు. అంతేగాదు ఆమె సౌకర్యం, హద్దులు ముఖ్యమైనవని చెప్పడమే అని అంటున్నారు. 

అందుకే కాదు అని చెప్పడంలో తప్పు లేదు కాబట్టి అందుకోసం క్షమాపణ చెప్పొద్దు. అలాగే నిజాయితీగా ఉన్నందుకు క్షమాపణ చెప్పకండి.  అందువల్ల మీరు మీలా ఉండటం, మీ భావాలను అనుభూతి చెందడం, కాదు అని చెప్పడం అనేవి మానవ విలువలు. ఇవి మన ఆత్మగౌరవం, హుందాతనం, అవగాహనతో పాతుకుపోయిన విలువలు అని నొక్కి చెబుతున్నారు మానిసిక నిపుణులు. సో "సారీ" చెప్పేటప్పుడూ ఆలోచించండి..వనితలు..!.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement