హైదరాబాద్ : ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచడం, అపోహలను తొలగించడమే లక్ష్యంగా హైదరాబాద్‌లో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఐమాక్స్-హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ వద్ద బుధవారం తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి (TGSACS) ఆధ్వర్యంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణి, అధికారులు, కళాశాల విద్యార్థులు, ఎన్‌సీసీ కేడెట్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


