ఫ్యాషన్‌ ర్యాంప్‌పై తల్లులూ..ఏకంగా పాలధారలతో..! | Leigh-Anne Pinnock wore top spurted milk-like liquid onto the runway | Sakshi
Sakshi News home page

ఫ్యాషన్‌ ర్యాంప్‌పై తల్లులూ..ఏకంగా పాలధారలతో..!

Sep 27 2026 5:38 PM | Updated on Sep 27 2026 5:47 PM

Leigh-Anne Pinnock wore top spurted milk-like liquid onto the runway

లండన్‌ ఫ్యాషన్‌ వీక్‌ డి పెట్సా ఈవెంట్‌ మాతృత్వాన్నే ఇది వృత్తంగా తీసుకుని తల్లులు చేత ఎంత అందంగా ప్రదర్శన ఇచ్చిందంటే ఇది ఫ్యాషన్‌ ప్రపంచంలోనే అద్భుతమైన క్షణంగా మారింది. ఈ ఫ్యాషన్‌ వీక్‌లో ఫుట్‌బాల్‌ ఆటగాడైన ఆండ్రీ గే భార్య గాయని, నటి లీ ఆన్‌ పిన్నాక్‌ అనే 34 ఏళ్ల తల్లి బేబీబంప్‌తో నడుస్తూ అందర్నీ ఆశ్చర్యపర్చింది. అంతేగాదు పైన ధరించిన టాప్‌ నుంచి పాలధారలు కురిపించే స్పెషల్‌ ఎఫెక్ట్స్‌తో ప్రదర్శించిన తీరు..అందర్నీ మాతృత్వానికి మించిన అందం లేదు అనిపించేలా చేసింది. 

తను ధరించిన దుస్తులు, మాతృత్వం గొప్పదనం, శరీర సంరక్షణ గురించి ఈ ప్రదర్శనతో చాటిచెప్పినట్లు పేర్కొంది గాయని లీ ఆన్‌. అలాగే ఆమె తోపాటు మరికొంతమంది మోడళ్లు ఎరుపు, తెలుపు, గోధుమ రంగుల దుస్తులతో సంతానోత్పత్తి చక్రంని ప్రదర్శించగా, మిడ్‌నైట్‌ బ్లూ రంగు దుస్తులతో మరో మోడల్‌ ఒక బిడ్డను చేత పట్టుకుని ర్యాంప్‌పై నడిచింది. ఆ వేదిక అమ్మతనంలోని అందాన్ని అద్భుతంగా కళ్లకు కట్టినట్లు చూపించింది. 

కాగా, డి పెట్సా షో ఆ డిజైనర్‌వేర్‌లను బిడ్డకు జన్మనివ్వడం అనేది నిరంతరం సాగే ప్రక్రియని..అందంగా చూపిచాయని  పేర్కొంది. అంతేగాదు గాయని ధరించిన జాకెట్‌ పాలివ్వడంలోని మాతృశక్తిని చాటేందుకు ఇలా డిజైన్‌ సదరు బ్రాండ్‌ తెలిపింది. మొదటిసారి ఫ్యాషన్‌ షో అత్యంత సహజంగా, హంగు ఆర్భాటం లేకుండా ప్రకృతి ధర్మాన్ని అందంగా, వాస్తవికంగా చూపించి..విప్లవాత్మకంగా మార్చిందని ఫ్యాషన్‌ ప్రియులు ప్రశంసిస్తున్నారు.

 

ఇదీ చదవండి: రాయల్‌ టిష్యూ చీరలో సాయిపల్లవి స్టన్నింగ్‌ లుక్‌..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement