కాటేసిన పాముతో ఆసుపత్రికి : పాము హల్‌చల్‌, వణికిన రోగులు | Snakebite Victim Brings Snake To UP Hospital, But It Escapes And Sparks Panic Among Patients, Watch Video Inside | Sakshi
Sakshi News home page

కాటేసిన పాముతో ఆసుపత్రికి : పాము హల్‌చల్‌, వణికిన రోగులు

Sep 19 2026 3:29 PM | Updated on Sep 19 2026 4:27 PM

UP man gets runs to hospital bitten by snake Panic Among Patients

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా ఆసుపత్రిలో ఒక పాము హంగామా రేపింది. తన ఉనికితో ఆసుపత్రి రోగులు, వైద్యులను ఉలికి పడేలా  చేసింది. ఈ ఘటన బరేలీ జిల్లా ఆసుపత్రిలో జరిగింది. అసలు స్టోరీ ఏంటంటే.. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, బరేలీ జిల్లా బిథ్రి చైన్‌పూర్ పరిధిలోని రామ్‌నగర్ గోటియా గ్రామానికి చెందిన అతుల్ (36)ను  పాము కాటేసింది.  నీటి మోటారు కింద ఉన్న పామును తొలగించడానికి ప్రయత్నిస్తుండగా పాము కాటేసింది.‌ దీంతో ఆ పామును ఒక సంచిలో వేసుకుని  నేరుగా ఆసుపత్రికి వచ్చాడు.  ఇంతవరకు బాగానే ఉంది.

కాటు తర్వాత అతని పరిస్థితి విషమించడంతో, కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన బరేలీ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పామును గుర్తించి, దానికి తగిన చికిత్సను (పాము విషానికి విరుగుడు మందు అవసరమా లేదా అనేది సహా) నిర్ణయించడానికి వీలుగా అతుల్ ఆ పామును సంచిలో వేసుకుని వెంట తెచ్చుకున్నాడు.  తీరా   ఆ పాము సంచిలో తప్పించుకుని వార్డు వైపు పరుగుదీసింది. దీంతో  వైద్యులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రోగలు ఒక్కసారిగా వణికిపోయారు.  తమ సీట్లనుంచి లేచి  పరుగులు తీశారు. దీంతో  ఆసుపత్రిలో కాసేపు కలకలం రేగింది.

 > మొత్తానికి దాన్ని పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అతుల్ ఆరోగ్యం మెరుగుపడినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అతడి పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించాయి.

 ఇదీ చదవండి : గంటలో 106 పుల్-అప్స్‌ : చీరకట్టుతో నటి ఫిట్‌నెస్‌ ఫీట్‌

 బరేలీలో 24 గంటల్లో నాలుగు పాము కాటు కేసులు
మరోవైపు బరేలీలోని వివిధ ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలో పాము కాటుకు సంబంధించిన నాలుగు వేర్వేరు సంఘటనలు నమోదైన తరుణంలో ఈ ఘటన జరిగింది. 60 ఏళ్ల భగవాన్ దేయి తన ఇంటి సమీపంలోని పిడకలు తీస్తుండగా పాము కాటుకు గురైంది. మూడో సంఘటనలో, సాహుకారా ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల సత్యవతి తన ఇంటిని శుభ్రం చేస్తుండగా పాము కాటుకు గురైంది.పో నాగ్లా గ్రామానికి చెందిన 20 ఏళ్ల సోను కూడా పాము కాటుకు గురయ్యాడు. ప్రస్తుతం ఆ నలుగురు రోగులూ బరేలీ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
 

ఇదీ చదవండి: పాత చేనేతలకు కొత్త కళ..ఇలా ట్రై చేశారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement