కౌలాలంపూర్ నుండి సిడ్నీకి వెళ్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ Malaysia Airlinesవిమానంలో 58 ఏళ్ల భారతీయుడు మరణించారు. ఎనిమిది గంటల విమాన ప్రయాణంలో ఆయనకు అకస్మాత్తుగా వైద్యపరమైన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగానే ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది. ఆయన పేరు, ఇతర వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.
పీపుల్ మ్యాగజైన్ పోలీసులను ఉటంకిస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తుండగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిపింది. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం, విమాన ప్రయాణంలో అతనికి ఆస్తమా సోకడంతో మరణించారని సమాచారం. విమానంలో ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడని సమాచారం అందడంతో, సెప్టెంబర్ 16న సాయంత్రం 5:50 గంటలకు (స్థానిక సమయం) సిడ్నీ విమానాశ్రయం అంతర్జాతీయ టెర్మినల్‌కు అధికారులు చేరుకున్నారని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు ఒక ప్రకటనలో పీపుల్‌కు తెలిపారు. విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులు ప్రథమ చికిత్స అందించడానికి ప్రయత్నించారని, కానీ ఫలితం లేకపోయిందని విమానంలో ఉన్న వైద్యుడు కూడా దీనని ధృవీకరించారని అధికారులు తెలిపారు. తరువాత మరణించినట్లు ప్రకటించారు
ఇదీ చదవండి: పెళ్లైన 17 రోజులకే అమెరికాలో హైదరాబాదీ అనుమానాస్పద మృతి
అయితే దీన్ని అనుమానాస్పదంగా పరిగణించడం లేదని, తదుపరి పోలీసు చర్యలు ఉండవని కూడా పోలీసులు తెలిపారు. అటు మలేషియా ఎయిర్‌లైన్స్ మరియు సిడ్నీ విమానాశ్రయం ఇంకా ప్రకటన విడుదల చేయలేదు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: రూ. 500 కోట్ల నోటీసు : దిశా కేసులో ఆదిత్య ఠాకరేకు మరో షాక్


