సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్న సురేష్ సిట్ ఎదుట లొంగిపోయాడు. సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో సురేష్ కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సురేష్ లొంగుబాటుతో ఈ కేసులో తదుపరి విచారణ కీలకంగా మారింది.
కాగా, సాయికృష్ణ మృతి అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో సెటిల్‌మెంట్ చేసేందుకు సురేష్ ప్రయత్నించినట్లు సమాచారం. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుకు సురేష్ అత్యంత సన్నిహితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, సాయికృష్ణ లాకప్ డెత్ అనంతరం ఈ వ్యవహారంలో సురేష్ పాత్ర ఉన్నట్లు గుర్తించిన సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. సిట్ విచారణ తర్వాత ఆయన పరారీలో ఉన్నాడు.
తాజాగా సిట్ కార్యాలయానికి చేరుకుని అధికారుల ఎదుట లొంగిపోయాడు. సురేష్ లొంగుబాటుతో ఈ కేసులో తదుపరి విచారణ కీలకంగా మారింది. మృతదేహం మాయం, కుటుంబ సభ్యులతో సెటిల్‌మెంట్ ప్రయత్నాలపై సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: బాబు సర్కార్ మరో 2000 కోట్ల అప్పు..


