నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి: శేఖర్‌ | Anbarasan Sekhar Sensational Comments On YouTuber Ramanandana | Sakshi
Sakshi News home page

నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి: శేఖర్‌

Sep 16 2026 10:25 AM | Updated on Sep 16 2026 4:35 PM

Anbarasan Sekhar Sensational Comments On YouTuber Ramanandana

సాక్షి, విజయవాడ:  నందూస్ స్కామ్ బాధితులు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. వీసా రెన్యువల్‌తో పాటు ఉద్యోగాల పేరుతోనూ రమానందన దంపతులు భారీ మోసాలకు పాల్పడ్డారు. యూకేలోని 'నందూస్ కిచెన్' స్పాన్సర్‌షిప్ స్కామ్‌ వల్ల తమిళనాడుకు చెందిన అన్బరాసన్ శేఖర్ ఉద్యోగం కోల్పోయారు. మూడేళ్లకు డబ్బులు చెల్లిస్తే ఏడాదిలోనే ఉద్యోగం నుంచి అన్బరాసన్ శేఖర్‌ను రమానందన తీసేసింది.

‘‘రమానందన దంపతులు చాలా స్కామ్‌లు చేశారు. నందూస్ కిచెన్‌లో నేను ఫ్లోర్ మేనేజర్‌గా చేశా.. వారి తప్పుల వల్ల నేను ఉద్యోగాన్ని కోల్పోయాను’’ అని అన్బరాసన్ శేఖర్ చెబుతున్నారు. ‘‘జీతం సరిగా ఇవ్వకపోవడం వల్ల నా ఉద్యోగం పోయింది. నేను పనిచేసిన సమయంలో నందూస్ కిచెన్‌కు చాలా మంది బాధితులు డబ్బుల కోసం వచ్చేవారు. ఎవరికంటా పడకుండా రమానందన తన భర్త మధుకర్‌ను 2-3 గంటలు టాయిలెట్‌లో దాచేసేది

..ఒక్కోసారి రోజంతా బాత్‌ రూమ్‌లోనే మధుకర్ దాక్కునేవారు. సరైన పత్రాలు, ఉద్యోగాలు లేక ఇప్పటికీ చాలా మంది యూకేలోనే చిక్కుకుపోయారు. వారంతా ఇండియా రాలేక ఇబ్బంది పడుతున్నారు. వారి స్కామ్‌ల వల్ల నాలాంటి వారు చాలా మంది తమ  జీవితాలను, కలలను, తమ పిల్లల భవిష్యత్తును కోల్పోయారు. నాకు  రావాల్సిన పెండింగ్ జీతం, పి 45 ఎక్స్పీరియన్స్ లెటర్, రిలీవింగ్ లెటర్ ఇవ్వాలని కోరుతున్నాను. కానీ రమానందన నాకు ఎలాంటి సమాధానం చెప్పడం లేదు

రమానందన దంపతులు తప్పులు చేసి తాము ఏ తప్పు చేయలేదని తప్పించుకుంటున్నారు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. కాంట్రాక్టు కోసం చేసిన సంతకాలు ఉన్నాయి. వాటిని చూపించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. రమానందన దంపతులు ఇతరుల డబ్బుతో జీవిస్తున్నారు. వారు తినే తిండి వేసుకునే బట్టలు అన్నీ ఇతరుల డబ్బుతో వచ్చినవే. ఇప్పటికైనా ఏపీ పోలీసులు మా బాధితుల బాధలను అర్థం చేసుకోవాలి. నా దగ్గరున్న ఆధారాలతో ఏపీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని అన్బరాసన్ శేఖర్ తెలిపారు.

ఇదీ చదవండి: గుట్టు చప్పుడు కాకుండా విచారణకు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement