అందాల పోటీల్లో పాల్గొనడం మిస్ యూనివర్స్ ఇండియా వేదికపై నడవడం తదితరాలన్నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటుంది. కానీ ఈ అందాల భామ ఉమంగా కుమావత్‌కు ల్యాప్‌టాప్, మీటింగ్‌లు వంటి కార్పొరేట్ జీవితంలోకి తిరిగి వచ్చేసింది. జైపూర్‌లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2026 జాతీయ ఫినాలేలో పోటీపడిన కొద్ది వారాలకే, ఈ ఇంజనీర్ బెంగళూరు గూగుల్ కార్యాలయంలో యథావిధిగా తన డ్యూటీలోకి వచ్చేసింది.
ఉమంగా ఆ పోటీల్లో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహించగా, 52 మంది ఫైనలిస్టులలో టాప్ 20 లోకి ప్రవేశించారు. ఆగస్టు 23న జరిగిన ఫినాలేలో కేరళకు చెందిన కజియా లిజ్ మెజియా టైటిల్‌ని గెలుచుకుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న, ఉమంగా బెంగళూరులోని గూగుల్ క్యాంపస్ నుంచి ఒక నిమిషం నిడివి గల వీడియోకి "నా జీవితంలో ఒక రోజు" అని క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. ఈ వీడియోలో జిమ్ సెషన్, ఈమెయిల్స్, భోజనం, కాఫీ విరామాలు, పనితో కూడిన ఒక సాధారణ పనిదినం కనిపిస్తుంది. తన రోజు ఉదయం 9.30కి ఎలా మొదలవుతుందో కనిపిస్తుంది.
తాను కూడా అందిరిలా ఆఫీస్‌కి బయలు దేరే ముందు ఏం ధరించాలో అని నిర్ణయించుకోవడంతోనే పని ప్రారంభమవుతుందని అంటోంది. ఇక్కడ ఉమంగా బ్లాక్‌కలర్ జత ధరించి ఉదయం 10.30 గంటకలకి కంపెనీ వెల్నెస్ సెంటర్‌కి వెళ్లడం వీడియోలో చూడొచ్చు. ట్రెడ్‌మిల్‌తో మొదలుపెట్టి, ఆ తర్వాత స్ట్రెచింగ్‌లు, కాళ్ళ వ్యాయామాలు చేస్తుంది.
ఆ తర్వాత దుస్తులు సరిచేసుకుని పనిలో నిమగ్నమవ్వడం, మధ్యాహ్నం 12:30 గంటల కల్లా, ల్యాప్‌టాప్ తెరిచి, నోట్‌బుక్, పత్రాలు పరచుకుని తిరిగి కార్పొరేట్ జీవితంలోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత 2.10 కల్లా ఒక గిన్నెడు నూడుల్ సూప్, ఆకుకూరలతో సింపుల్‌గా కానిస్తుంది. అక్కడ గూగుల్ క్యాంటిన్‌లో బిర్యానీ, పండ్లు, డెజర్ట్ ఉన్నా.. వాటి జోలికిపోదామె. ఇక మళ్లీ 3 గంటల కల్లా డెస్క్ వద్దకు వచ్చేస్తుంది సాయంత్రం 4:30 గంటల ప్రాంతం కల్లా నిశబ్దంగా ఉండే లాంజ్‌లోకి వెళ్తుంది. ఇక సాయంత్రం 5.30 గంటలకు కాఫీ బ్రేక్ తీసుకుంటుంది.
ఇక పనిగంటలు ముగియగానే ఎలివేటర్‌వైపు వెళ్లిపోతుంది. చాలామంది అందాల పోటీల్లో పాల్గొనేవారు గ్లామర్ ప్రపంచం వైపుకే వెళ్లిపోతారు. ముఖ్యంగా మోడలింగ్, సినిమాలు లేదా ప్రజలతో మమేకమయ్యే వృత్తులను ఎంచుకుంటే ఉమంగా మాత్రం తన కార్పొరేట్ ఉద్యోగం తోపాటు తనకు నచ్చిన అభిరుచులతో మమేకమవుతుందామె.
ఇదీ చదవండి: 'ఆటో డ్రైవర్ కూతురు బంగారం'..! ఒకటి, రెండు కాదు ఏకంగా..)


