నేచురల్ స్టార్ నాని హీరోగా, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్‌డేట్ ఒక రికార్డు సృష్టించింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాంన్నటాయి.
వినాయక చవితి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వాడవాడలా గణేషుడి మండపాలు వెలిశాయి. అయితే ఈ ది ప్యారడైజ్ మూవీ విడుదల కాకముందే అభిమానులు తమదైన స్టైల్‌లో సంబరాలు నిర్వహించుకుంటున్నారు. విశాఖపట్నంలో ‘ది ప్యారడైజ్’ థీమ్‌ను తలపించేలా ఏకంగా వినాయకుడి విగ్రహాన్ని రూపొందించి పూజలు నిర్వహించారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. ( సమంత సీమంతం వేడుక.. అసలెందుకు ఇంత స్పెషల్?)
ట్రైలర్ లేకుండానే ది ప్యారడైజ్
కాగా ఇటీవల‘ది ప్యారడైజ్’ సినిమాకు ట్రైలర్ ఉండదని నాని స్పష్టం చేశారు. ‘ది ప్యారడైజ్‌కి ట్రైలర్ ఉండదు. బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసం టీమ్ మొత్తం కలిసి పనిచేయాలి. ప్రేక్షకులను గ్రాంటెడ్‌గా తీసుకోవడం లేదు. మీకు ఇస్తే అదిరిపోయే ట్రైలర్ ఇవ్వాలి. దీనికోసం నాలుగైదు రోజులు శ్రీకాంత్, అనిరుధ్ అందరూ దానిపై పనిచేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని నాని చెప్పుకొచ్చారు. దీంతో ట్రైలర్ లేకుండా సినిమా ప్రేక్షకుల ముందుకు ఎలా రాబోతోందనే ఆసక్తి నెలకొంది.
ఇదీ చదవండి: ’మండాడి‘పై రజినీకాంత్ రివ్యూ.. నటుడు ఎమోషనల్
#TheParadise గణేష్ ….. pic.twitter.com/qGruzAux4L
— Rajesh Manne (@rajeshmanne1) September 14, 2026


