ఫ్రిజ్‌ పేలి ఒకే కుటుంబంలో నలుగురు సజీవ దహనం | 4 Of Family Killed After Refrigerator Explodes At House In Karnataka | Sakshi
Sakshi News home page

ఫ్రిజ్‌ పేలి ఒకే కుటుంబంలో నలుగురు సజీవ దహనం

Sep 15 2026 4:21 PM | Updated on Sep 15 2026 5:05 PM

4 Of Family Killed After Refrigerator Explodes At House In Karnataka

బెంగళూరు: కర్ణాటకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.  నగరమంతా  గణేష్ చతుర్థి వేడుకలను జరుపు కుంటున్న వేళ బెళగావిలోని చవట్ గల్లీలోని ఒక ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలడంతో సంభవించిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.  మంగళవారం పోలీసులు ఈ వివరాలను వెల్లడించారు.

సోమవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ పేలుడు శబ్దాన్ని తొలుత అంతా దాన్ని  బాణాసంచా పేలుడు అని భావించారు.  రిఫ్రిజిరేటర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలుడు సంభవించిందని భావిస్తున్నారు. పోలీసుల  సమాచారం ప్రకారం చావట్ గల్లీలోని ఒక నివాసంలో మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్ ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగాయని ప్రాథమిక విచారణలో తేలింది. మంటలు వేగంగా ఇళ్లంతా వ్యాపించడంతో, అందులో ఉన్నవారు బయటకు రాలేక ఊపిరాడక,  నలుగురు  సజీవదహనమైపోయారు. 

ఇదీ చదవండి: ముగ్గురు బిడ్డల హత్య : ఆ తల్లిని బహిరంగ ఉరితీయాలంటూ సంచలన వ్యాఖ్యలు

 

మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇల్లు తీవ్రంగా దెబ్బతిన్నది. చనిపోయిన వారిని గజానన్ ధమోనే (65), రోషన్ ధమోనే (21), శారద ధమోనే (45), భారతి ధమోనే (50) లుగా గుర్తించారు.  తీవ్ర గాయాలపాలైన ప్రియ ధమోనే (28), గంగ ధమోనే (25) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

షార్ట్ సర్క్యూట్ లేదా మరేదైనా అగ్ని ప్రమాదం వల్ల పేలుడు సంభవించిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నమని. క పోలీసు అధికారి తెలిపారు.
గణేష్ విగ్రహానికి విద్యుత్ దీపాలను కూడా అమర్చారు, కాబట్టి షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నాన్నారు. తాము కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందన్నారు.  ఇంటి యజమాని గజానన్ వడ్రంగిగా పనిచేసేవారు, మిగిలిన వారు ఇంటి పనులు లేదా వాణిజ్య సంస్థలలో పనిచేసేవారు.

ఇదీ చదవండి: బిర్యానీ గణేశుడు : షాపు యజమానికి భారీ షాక్‌

ఇదీ చదవండి: రూ. 12,300 కోట్ల సీఎం విజయ్‌ డీల్‌ : 9 వేల ఉద్యోగాలు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement