రూ. 2 వేలు దాటితే వడ్డింపు, కస్టమర్లపైనే భారం : రాహుల్‌ | Quietly Opened The Door To Imposing Fees On UPI Rahul Gandhi Attacks Centre | Sakshi
Sakshi News home page

రూ. 2 వేలు దాటితే వడ్డింపు, కస్టమర్లపైనే భారం : రాహుల్‌

Sep 15 2026 3:53 PM | Updated on Sep 15 2026 4:40 PM

Quietly Opened The Door To Imposing Fees On UPI  Rahul Gandhi Attacks Centre

ప్రధాని మోదీ అమెరికా ఒత్తిడికి తలొగ్గి, దేశ ప్రయోజనాలను తాకట్టు  పెట్టారు:  రాహుల్ 

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం యూపీఐ (UPI) విధానాలపై తీసుకున్న తాజా నిర్ణయంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.  ప్రధాని మోదీ అమెరికన్ ఒత్తిడికి తలొగ్గి, దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని రాహుల్ ఆరోపించారు. రూ. 2,000 కంటే ఎక్కువ విలువైనమర్చంట్ యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ చార్జ్‌ ఉండవచ్చు అంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాత్రికి రాత్రి జారీ చేసిన జారీ చేసిన సరికొత్త గెజిట్ నోటిఫికేషన్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది.

రాహుల్ గాంధీ మండిపాటు
యూపీఐపై ఛార్జీలు విధించేందుకు మోదీ ప్రభుత్వం రహస్యంగా గేట్లు తెరిచిందని మండిపడ్డారు. ఇప్పుడు రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన మర్చంట్ యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ (Merchant Discount Rate - MDR)  విధింపుపై ఆయన విమర్శలు గుప్పించారు. ఇవి కేవలం 5శాతం వాల్యూమ్ మాత్రమే అయినప్పటికీ, మొత్తం యూపీఐ లావాదేవీల విలువలో దాదాపు 65శాతంగా ఉంటాయని రాహుల్ ఎక్స్ (X) వేదికగా పేర్కొన్నారు. అంతిమంది   కస్టమర్లపై భారం పడుతుందని ఆయన  విమర్శించారు.

కస్టమర్లకు ఎలాంటి ఫీజులు ఉండవని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ దుకాణదారులపై విధించే ఫీజులు చివరకు ఎక్కడి నుంచి వస్తాయి? నేరుగా సామాన్యుడి జేబు నుంచే వస్తువుల ధరల రూపంలో వసూలు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియా  జీరో-ఎండీఆర్ (Zero-MDR) విధానాన్ని అమెరికా పేమెంట్ కంపెనీలు ఎప్పట్నుంచో వ్యతిరేకిస్తున్నాయని, ఇప్పుడు మోదీ ప్రభుత్వం అదే దిశగా విధానాన్ని మార్చేందుకు మార్గం సుగమం చేసిందని రాహుల్ ఆరోపించారు.

కాగా రూ. 2,000 వరకు చేసే యూపీఐ లావాదేవీలు లేదా రుపే డెబిట్ కార్డ్ (RuPay) చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు విధించ కూడదని బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లను ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. అయితే, రూ. 2,000 కంటే ఎక్కువ లావాదేవీలపై వర్తకులకు ఛార్జీలు వర్తిస్తాయా లేదా అనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటివరకు మొత్తంతో సంబంధం లేకుండా యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో ఆమోదం పొందిన పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007 సవరణ ప్రకారం ఈ మార్పులు వచ్చాయి.

ఇదీ చదవండి: ముగ్గురు బిడ్డల హత్య : ఆ తల్లిని బహిరంగ ఉరితీయాలంటూ సంచలన వ్యాఖ్యలు

మల్లికార్జున ఖర్గే స్పందన
ఈ నిర్ణయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ,  ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించాల్సిందిపోయి, వారి జేబులు గుల్ల చేసేందుకు ప్రభుత్వం రోజూ కొత్త మార్గాలను వెతుకుతోందని విమర్శించారు. "యూపీఐపై ఎలాంటి ఫీజులు లేవు" అన్న నిబంధనను "రూ. 2,000 వరకు మాత్రమే"  అని మార్చేశారని ఎద్దేవా చేశారు. విపరీతమైన ద్రవ్యోల్బణం, టోకు ద్రవ్యోల్బణం దాదాపు 10% వద్ద ఉన్న తరుణంలో, బీజేపీ ప్రభుత్వం ప్రజలపై 'డిజిటల్ పేమెంట్స్ ట్యాక్స్' భారం మోపేందుకు ప్లాన్ చేసిందని ఖర్గే ఆరోపించారు.

ఇదీ చదవండి: రూ. 12,300 కోట్ల సీఎం విజయ్‌ డీల్‌ : 9 వేల ఉద్యోగాలు

ప్రభుత్వం వాదన ఇలా ఉంది
లావాదేవీల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ, మోసాల నిరోధక చర్యలు, మౌలిక వసతుల నిరంతర అభివృద్ధి కోసం సిస్టమ్‌కు నిధులు అవసరమని ప్రభుత్వం సమర్థించుకుంది. మార్కెట్ విస్తరణ, స్వయం సమృద్ధి, మెరుగైన పోటీతత్వం కోసం ఒక సమతుల్య విధానం అవసరమని, కేవలం సబ్సిడీలపై ఆధారపడటం సాధ్యం కాదని పేర్కొంది.
ఇదీ చదవండి: బిర్యానీ గణేశుడు : షాపు యజమానికి భారీ షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement