కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు | KTR Slams State Government Over Alleged Attack on Staff Inside Police Station | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

Sep 15 2026 7:54 AM | Updated on Sep 15 2026 7:54 AM

KTR Slams State Government Over Alleged Attack on Staff Inside Police Station

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వ్యవస్థల తీరుపై మండిపడుతూ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

ఆ ట్వీట్‌లో ‘కొన్నిసార్లు దాడులు, హత్యలు నేరుగా ప్రాణం తీయడంతో మొదలవవుని, పూర్తి భద్రత ఉండాల్సిన పోలీస్ స్టేషన్‌లోనే, యూనిఫామ్‌ ధరించిన అధికారుల కళ్ల ముందే, అత్యంత పక్కాగా ప్లాన్ చేసిన దాడితో మొదలవుతాయని అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలే ఈ గూండాగిరిని ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తున్నాయని, ఇదే తీరు కొనసాగితే త్వరలోనే రోడ్లపై దాడులు, మూకదాడులు, హింస మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

పోలీస్ స్టేషన్‌ లోపల తన పీఆర్ మహేష్ మాణిక్య, పీఏ మహేందర్ రెడ్డిలపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అణచివేతకు తలవంచని తెలంగాణలోని ఏ సామాన్య పౌరుడికైనా రేపు ఈ పరిస్థితి రావచ్చని హెచ్చరించారు. ప్రస్తుతం తెలంగాణ పూర్తి అరాచకత్వం అంచున నిలిచిందని విమర్శిస్తూ..‘వెల్ డన్ కాంగ్రెస్.. వెల్ డన్ రాహుల్ గాంధీ’ అంటూ వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement