దళపతి విజయ్, తలా అజిత్.. తమిళనాట భారీ ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్ హీరోలు. ఫ్యాన్స్ మధ్య పోటీ, సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎప్పటి నుంచో ఉన్నా.. వీళ్ల స్నేహం మాత్రం ప్రత్యేకమే. తాజాగా లండన్‌లో కారు రేసింగ్ సందర్భంగా ఇద్దరూ కలిసి సందడి చేశారు.
మేం బాగానే ఉన్నాం.. మీరూ బాగుండండి అన్నట్టుగా సాగిన ఈ మూమెంట్స్ వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు.. “కొట్టుకోకండ్రా బాబు.. మీ హీరోలే కలిసి మెలిసి ఉంటున్నారు!” అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.


