అర్నబ్ అతి తీవ్ర తుపాను కోస్తా తీరాన్ని కకావికలం చేసింది. కుండపోత వర్షాలు, ప్రచండ గాలులతో భీభత్సం సృష్టించింది.
ఆరు గంటలపాటు తీరం దాటుతూ ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా డెల్టాలను అతలాకుతలం చేసింది. గోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం వరకు విలయం సృష్టించింది.
వేలాది వృక్షాలు, కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. 15 వేలకుపైగా విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయి. కోతకొచ్చిన వరి చేలు చెరువులను తలపిస్తున్నాయి. వందలాది గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి.
ఆకాశానికి చిల్లు పడినట్టు ఉత్తరాంధ్రలో కుండపోత కురిసింది.
గంటకు 125 నుంచి 135 కిలోమీటర్లు, గరిష్టంగా 150 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు తీరాన్ని అతలాకుతలం చేశాయి.


