breaking news
heavy rain
-
తుఫాన్ ప్రభావంతో అతలాకుతలమైన వరంగల్
-
తెలంగాణకు భారీ వర్ష సూచన.. అధికారుల కీలక హెచ్చరిక
-
ఏపీని వీడని మొంథా తుఫాన్
-
తెలంగాణను కుదిపేసిన మోంథా.. రోడ్లన్నీ జలమయం
-
అన్నదాతకు గుండె కోత
-
#CycloneMontha : వరంగల్ ఉమ్మడి జిల్లాలో వర్షబీభత్సం (ఫొటోలు)
-
ముంచేసిన మోంథా
సాక్షి, నెట్వర్క్: మోంథా తుపాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బుధవారం అనేక జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. చాలాచోట్ల రహదారులు తెగిపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. చెరువులు, కుంటలు తెగిపోగా... కాల్వలు, వాగులు ఉప్పొంగాయి. వరదనీరు పొలాలను ముంచేసింది. పంటలు నేలకొరిగాయి. కాలనీలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరడంతో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. నాగర్‌కర్నూల్, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని చాలాచోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. 29 ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిశాయి. ఈ ప్రాంతాల్లో 12 గంటల్లోనే 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. 105 ప్రాంతాల్లో ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 10 సెంటీమీటర్లకు పైబడి వర్షపాతం నమోదైంది. గత ఐదేళ్లలో ఈ స్థాయిలో భారీ వర్షాలు నమోదు కావడం ఇదే ప్రథమం. మంగళవారం రాత్రి ఏపీలోని నర్సాపురం వద్ద తీరం దాటిన మోంథా తీవ్ర తుపాను ప్రభావం తెలంగాణపై తీవ్రంగా పడింది. బుధవారం సాయంత్రానికి మోంథా బలహీనపడి వాయుగుండంగా మారింది. గురువారం మధ్యాహ్నం కల్లా దీని ప్రభావం పూర్తిగా తగ్గనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండ్రోజులు మోస్తరు వర్షాలు... ⇒ ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ⇒ నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ⇒ ఈ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ 29 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 82.90 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 110.87 సెంటీమీటర్లు నమోదైంది. సాధారణం కంటే 34 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. 5 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 20 జిల్లాల్లో అధికం, 8 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఓరుగల్లు అతలాకుతలం ఉమ్మడి వరంగల్ జిల్లాను మోంథా తుపాను కుదిపేసింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు దంచికొట్టిన వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ప్రధానంగా వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపింది. కోతకొచ్చిన వరి పంట నేలరాలింది. ఇప్పటికే కోతలు పూర్తయి కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం కల్లాల్లోనే తడిసింది. మిర్చి, మొక్కజొన, పత్తి రైతుల పరిస్థితి ఆగమాగమైంది. 30 శాతమే వరికోతలు పూర్తి కాగా, సుమారు 4.50 లక్షల ఎకరాల్లో కోతలకు సిద్ధమయ్యాయి. పత్తి ఏరడానికి సిద్ధమైన తరుణంలోనే తుపాను రావడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని సుమారు 71 కాలనీల్లో వరద నీరు చేరినట్లు సమాచారం. గురువారం కూడా తుపాను కొనసాగుతుందన్న వాతావరణశాఖ హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా> ఆరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. జలదిగ్బంధంలో ‘గ్రేటర్ వరంగల్’... భారీ వర్షాలకు వరంగల్ నగరంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. హనుమకొండ బస్టాండ్‌లోకి భారీగా వరద చేరి చెరువును తలపించింది. ఎస్ఆర్ నగర్, వివేకానందనగర్, సాయిగణేశ్కాలనీ, లక్ష్మీ గణపతి కాలనీ, మధురానగర్, గిరిప్రసాద్‌నగర్, గాం«దీనగర్, మైసయ్యనగర్, భద్రకాళినగర్, పోతననగర్, రాజీవ్‌నగర్, సమ్మయ్యనగర్, వాజ్‌పేయి కాలనీ, విద్యానగర్, పోచమ్మకుంట, ఇంద్రానగర్, దీన్‌దయాళ్‌నగర్, కాజీపేట ప్రశాంత్‌నగర్, బ్యాంక్ కాలనీల్లోకి వరద నీరు చేరింది. ప్రధాన నాలాలు పొంగిపొర్లాయి. హనుమకొండ, నయీంనగర్, కేయూ క్రాస్‌రోడ్డు, ములుగు క్రాస్‌రోడ్డు, హంటర్‌రోడ్డు, ఎన్జీవోస్ కాలనీ, అంబేడ్కర్ స్టేడియం తదితర ప్రాంతాల్లో వరదనీరు రోడ్లపైకి రావటంతో గంటలపాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఏజేన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. రైల్వే స్టేషన్లు, రైలు పట్టాలపైకి వరద చేరడంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్ల రాకపోకలను నిలిపి వేసింది. వరంగల్‌లో ఇంటర్సిటీ, ఈస్ట్‌కోస్ట్, మహబూబాబాద్‌లో కృష్ణ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపి వేసినట్లు అధికారులు తెలిపారు. వరంగల్ మీదుగా వెళ్లే పలు రైళ్లు షాలిమార్, టాటా నగర్, షిరిడీ, కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ను వయా కాజీపేట మీదుగా దారి మళ్లించి భాగ్యనగర్, శాతవాహనను కూడా రద్దు చేశారు. అంతటా అప్రమత్తం... జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నంబర్ 7981975495, టోల్ ఫ్రీ నంబర్ 1800–425–1115 ఏర్పాటు చేశాం. అధికారులు ఎవరూ జిల్లా కేంద్రాన్ని వదిలి వెళ్లరాదని, సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయరాదని ఆదేశాలు జారీచేశాం. – స్నేహ శబరీష్, హనుమకొండ జిల్లా కలెక్టర్ రంగారెడ్డిలో పొంగుతున్న వాగులు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో బుధవారం కుండపోత వర్షం కురిసింది. తలకొండపల్లిలో అత్యధికంగా 11.72 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పంట పొలాలు నీట మునిగాయి. కల్లాలు, మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన ధాన్యం తడిపోయింది. పత్తి, వరి, కూరగాయలు, పూల తోటలకు తీరని నష్టం వాటిల్లింది. మూసీ, ఈసీ, కాగ్నా సహా పలు చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం వీర్‌శెట్టిపల్లి గ్రామానికి చెందిన యువకులు కాగ్నా వాగులో కొట్టుకుపోతున్న యాలాల మండలం అగ్గనూరుకు చెందిన పెద్దింటి నర్సింలు అనే వ్యక్తిని కాపాడారు. అతడు కొద్ది రోజులుగా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నట్లు సమాచారం. సిద్దిపేట జిల్లాలో వర్ష బీభత్సం సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం కుండపోత వర్షం కురిసింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో 21.28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొనుగోలు కేంద్రాల్లో, మార్కెట్ యార్డుల్లోని ధాన్యం కుప్పలు తడిసిముద్దయ్యాయి. హుస్నాబాద్ పట్టణంలోని దుకాణాల్లోకి వరద నీరు చేరింది. ఆర్టీసీ బస్టాండ్‌లోని ప్లాట్‌ఫాంల పైకి నీరు రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఖమ్మం జిల్లాను వణికించిన మోంథా మోంథా తుపాను ఉమ్మడి ఖమ్మం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపించింది. భారీ వర్షాలకు చేతికందే దశలో ఉన్న పంటలు నాశనమయ్యాయి. బోనకల్ మండలంలో 9.34 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పాలేరు, వైరా, లంకాసాగర్, కిన్నెరసాని రిజర్వాయర్లలో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. కొణిజర్ల మండలం అంజనాపురం సమీపంలో నిమ్మవాగు బ్రిడ్జి పైనుంచి వెళ్లటానికి ప్రయతి్నంచిన డీసీఎం వరద నీటిలో కొట్టుకుపోయింది. డీసీఎంను నడిపిన భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మోతీనగర్ కాలనీకి చెందిన ఆరేపల్లి మురళి (32) నీటిలో గల్లంతయ్యాడు. మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంతాల్లో రైల్వేట్రాక్‌పైకి వరద చేరడంతో ఖమ్మం మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దుచేసి, ఇంకొన్నింటిని దారి మళ్లించారు. ఖమ్మంలోని మున్నేటి వరద ఉధృతిని కలెక్టర్ అనుదీప్ పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. కలెక్టరేట్లు, పోలీసు కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం నిమ్మవాగులో కొట్టుకుపోతున్న డీసీఎం వాహనం నాగర్‌కర్నూల్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షం ఉమ్మడి పాలమూరు జిల్లాలో బుధవారం భారీ వర్షం కురిసింది. నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలో అత్యధికంగా 18.22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అచ్చంపేట, చారకొండ, ఊర్కొండ, తెలకపల్లి, బల్మూర్ మండలాల్లో 12 సెం.మీ. వర్షం కురిసింది. నల్లమలలోని ఉమామహేశ్వర దేవాలయం సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట వాగులో కారు కొట్టుకుపోయింది. నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లోకి వరద నీరు చేరింది. నారాయణపేట జిల్లా కేంద్రంలోని హజికన్పేటలో ఓ ఇళ్లు కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకున్న చింతామణి అనే మహిళలను పోలీసులు కాపాడారు. మహబూబ్‌నగర్‌లో ఎర్రకుంట, కొత్తచెరువు ఉధృతంగా ప్రవహించడంతో పలు కాలనీలు నీట మునిగాయి. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబోసిన మొక్కజొన్న కొట్టుకుపోయింది. హైదరాబాద్–శ్రీశైలం హైవేపై రాకపోకలు నిలిపివేత నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టుకు వరద భారీగా వచ్చి అలుగు ఉధృతంగా పారుతోంది. ప్రాజెక్టుకు కుడి భాగాన నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్ గ్రామ శివారులో ఉన్న రెండో అలుగు దిగువన హైదరాబాద్ – శ్రీశైలం రహదారి బ్రిడ్జి వరద ధాటికి దెబ్బతింది. దీంతో ఈ మార్గం గుండా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో హైదరాబాద్–శ్రీశైలం వైపు వెళ్లే వాహనాలను తెలకపల్లి– లింగాల– బల్మూర్– అచ్చంపేట మీదుగా దారి మళ్లించారు. చెట్టు కూలి వ్యక్తి మృతి సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రానికి చెందిన కోట లక్ష్మీనారాయణ (45) చెట్టు కూలిపడి మరణించాడు. నూతనకల్ మండల పరిధిలోని తానంచర్ల గ్రామంలో మెడికల్‌షాపు నిర్వహిస్తున్న అతడు.. సొంత గ్రామంలోని పామాయిల్ తోటను చూసేందుకు బుధవారం వెళ్తుండగా చందుపట్ల గ్రామ శివాలో భారీ వృక్షం మొంథా తుపాన్ ధాటికి కూలి ద్విచక్ర వాహనంపై పడింది. దీంతో లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతిచెందాడు. కామారెడ్డి, నిజామాబాద్‌లో అప్రమత్తం కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి. రైతులు కల్లాల్లోని ధాన్యం కుప్పలు తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడవకుండా కుప్పలు చేసి బుధవారం రోజంతా టార్పాలిన్లు కప్పి ఉంచారు. ఇటు కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోళ్లను నిలిపేశారు. వ్యవసాయ అధికారుల సూచనతో రైతులు పంట కోతలను కూడా ఆపేశారు. ఉమ్మడి కరీంనగర్లో పంటలకు తీవ్ర నష్టం ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలకు వరి పంట నేలవాలింది. పలు చోట్ల కొనుగోలు కేంద్రాల్లో, మార్కెట్ యార్డులలోని ధాన్యం తడిసిపోయింది. కరీంనగర్, సిరిసిల్ల, హుజూరాబాద్ పట్ణణాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రామగుండం రీజన్‌లోని సింగరేణి ఓసీపీలో 1.5 లక్షల ఓబీ తవ్వకాలు, 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. నక్కవాగు, బిక్కవాగు, గంజివాగు, మానేరు, గోదావరి నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 1.60 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండటంతో 11 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీరును దిగువకు వదులుతున్నారు. నల్లగొండ జిల్లా అతలాకుతలం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బుధవారం వర్షం బీభత్సం సృష్టించింది. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని కొమ్మేపల్లి వద్ద గిరిజన బాలుర గురుకుల ఆశ్రమ పాఠశాల వరద నీటిలో చిక్కుకుంది. దీంతో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్ ఇతర అధికారులు అక్కడికి చేరుకుని 500 మంది విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని వరదనీరు చుట్టముట్టింది. తుంగతుర్తి మండలంలో సంగెం– వెంకేపల్లి – కోడూరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట పట్టణంలోని 16వ వార్డులో వరద నీరు ఇళ్లలోకి చేరింది. పెన్‌పహాడ్ మండలం గాజులమల్కాపురం, ధర్మాపురం గ్రామాల్లో విద్యుత్ తీగలపై చెట్ల విరిగిపడి స్తంభాలు నేలకూలాయి. కోదాడ పట్టణంలో ఉలకవాగు అలుగుపోయడంతో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రామాపురం ఊర చెరువుకు గండి పడి వరిపొలాలు నీట మునిగాయి. వర్షానికి వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. గుండాల మండలం మాసాన్‌పల్లి, నారాయణపురంలో పలువురి ఇళ్లు కూలాయి. యాదాద్రి భువనగిరి జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. గురువారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విశాఖ పట్నం నుంచి తిరిగొచ్చిన విమానం హైదారాబాద్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం విశాఖపట్నం బయలుదేరి వాతావరణం అనుకూలించకపోవటంతో తిరిగి వచ్చింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రె 2885 విమానం బుధవారం ఉదయం 6.57 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. తుపాను కారణంగా విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో విమానం దిగేందుకు ప్రతికూల వాతావరణం ఉడడంతో దానిని తిరిగి హైదారాబాద్‌కు మళ్లించడంతో 9.57 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. విజయవాడకు బయలుదేరాల్సిన ఇండిగో 6ఈ 7201 విమానాన్ని కూడా ప్రతికూల వాతావరణం కారణంగా రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. -
తెలంగాణపై మోంథా పంజా.. కుండపోత వర్షాలు (ఫొటోలు)
-
భారీ గాలులతో వర్షాలు.. హైదరాబాద్ ప్రజలకు హెచ్చరిక
-
భయంకరంగా వైజాగ్ RK బీచ్..
-
ఈ రాత్రికే భారీ వర్షం.. తెలంగాణలో ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్
-
ఆ జిల్లాలకు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
-
తెలంగాణపై మోంథా.. స్కూల్స్ బంద్, రెడ్ అల్టర్
సాక్షి, హైదరాబాద్: మోంథా తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలంగాణ పైనా కూడా తుపాను ప్రభావం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.తుపాను ప్రభావం ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలపై అధికంగా ఉంటుందని హెచ్చరించింది. మూడు జిల్లాల్లో గంటకు 50-60 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్, నాగర్ కర్నూల్, వికారాబాద్, జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఈ జిల్లాల్లో గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేస్తూ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.VERY HEAVY RAINS ALERT - CYCLONE MONTHA PEAK IMPACT ⚠️ As Cyclone Montha moving inland, VERY HEAVY DOWNPOURS ahead in RED MARKED DISTRICTS with few places to get 80-180mm rains causing FLOODS in few places. STAY ALERT ⚠️🌧️BLUE MARKED districts will get MODERATE RAINS today… pic.twitter.com/vMGDKP2eqy— Telangana Weatherman (@balaji25_t) October 29, 2025హైదరాబాద్, మంచిర్యాల, సంగారెడ్డి, జనగాం, జోగులాంబ గద్వాల్, మేడ్చల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ విధించింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, వరంగల్, మహబూబాబాద్, నిజామాబాద్, హైదరాబాద్‌లో కూడా వర్షం కురుస్తోంది.మరోవైపు.. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో కూడా ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు యాజమాన్య విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. అలాగే, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు. సూర్యాపేట జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.DELUGE RAINS IN SOUTH TG ⚠️🌧️CYCLONE MONTHA CORE BANDS are just stuck and NON STOP HEAVY RAINS keep on pouring all over Nagarkurnool, Nalgonda, Suryapet, Khammam, Wanaparthy, Mahabubnagar, Rangareddy for NEXT SEVERAL HOURS ⚠️⚠️200mm event for Nagarkurnool ⚠️⚠️— Telangana Weatherman (@balaji25_t) October 29, 2025 #29OCT 7:30AM⚠️CYCLONE MONCHA is moving slower than expected and is currently around KHAMMAM DistrictVERY HEAVY to HEAVY RAINS will continue over Nagarkurnool, Nalgonda, Suryapet, Khammam, Mahabubabad, Ranga Reddy, Vikarabad, and Sangareddy districts for the next 3 hours.… pic.twitter.com/TBEhgamFJp— Hyderabad Rains (@Hyderabadrains) October 29, 2025 -
కూలిన భారీ వృక్షాలు.. మునిగిన రోడ్లు, పంట పొలాలు
-
ఒంగోలులో ఈదురుగాలులతో కూడిన వర్షం..రోడ్లు జలమయం (ఫొటోలు)
-
తీరం దాటిన తుఫాన్.. నేడు ఏపీలో భారీ వర్షాలు
-
భారీ గాలులతో అర్ధరాత్రి అల్లకల్లోలం
-
ఏపీలో తీరం దాటిన మోంథా తుఫాను
-
రాష్ట్రవ్యాప్తంగా భీకర ప్రళయాన్ని సృష్టిస్తున్న మోంథా
-
తీరాన్ని తాకిన తుఫాన్.. ఏపీ అల్లకల్లోలం !
-
శాంతించిన మోంథా!
సాక్షి, విశాఖపట్నం: మూడు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసింది.. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలతో జన జీవనాన్ని స్తంభింపజేసింది.. తుపాను సముద్రంలో ఉంటేనే ఇంత అలజడి సృష్టించిందే.. ఇక తీరం దాటే సమయంలో ఉప్పెనలా విరుచుకు పడుతుందంటూ వాతావరణ నివేదికలు హెచ్చరించాయి... తీరం సమీపిస్తున్న కొద్దీ అందర్లోనూ ఉత్కంఠ.. ఆందోళన.. రాకాసి మోంథా ఎలా ముంచేస్తుందో.. ఎక్కడ విరుచుకుపడుతుందోనని తీర ప్రాంత జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు.. పాములు పట్టేవాడు పాముకాటుకే బలయ్యారనే నానుడిలా... గాలులన్నింటినీ తనలో కలిపేసుకుంటూ బలంగా దూసుకొచ్చిన మోంథా.. చివరికి ఆ గాలుల కోత వల్లే బలహీన పడింది. తీరం దాటుతున్నా ప్రశాంత వాతావరణం.. కొద్దిపాటి బలమైన గాలులు.. మోస్తరు నుంచి భారీ వర్షాలతో సముద్రాన్ని వదిలి నేలమీదకి వచ్చింది. ముంచేస్తుందనుకున్న మోంథా.. మౌనంగా వెళ్లిపోవడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికార యంత్రాంగం ప్రభుత్వ హడావుడి నుంచి తేరుకున్నారు. అయితే వాయు, రైలు రవాణా స్తంభించిపోయింది. మొత్తంగా భయాందోళనలు సృష్టించిన తీవ్ర తుపాను మోంథా.. రాష్ట్రంపై మోస్తరు ప్రభావంతో వీడ్కోలు చెప్పేసింది. మోంథా ఎందుకు శాంతించిందంటే.. వాస్తవానికి మోంథా తుపాను వేగం, గమనం చూస్తే 2023లో బాపట్లలో తీరం తాకిన మిచాంగ్ తుపానును తలపించింది. సముద్రంలో తీవ్ర తుపానుగా బలపడటంతో గాలులన్నింటినీ తనలో చేర్చుకొని మరింత బలంగా మారింది. దీంతో మోంథా తుపాను.. రాష్ట్రంలోని అనేక తీర ప్రాంతాల్ని తుడిచి పెట్టుకుపోతుందని అంతా ఆందోళనకు గురయ్యారు. అయితే.. తీరానికి 70 నుంచి 100 కి.మీ. దూరంలో ఉన్న సమయంలో విండ్ షీర్ (గాలుల కోత) మొదలైంది. తుపాన్లో కీలకమైన సైక్లోన్ ఐ పై విండ్ షీర్ పంజా విసిరింది. దీంతో తుపాను గాలులు చీల్చుకుపోతూ కకావికలమైపోయాయి. దీంతో మోంథా తీరం దాటకముందే బలహీనపడిపోయింది. విండ్ షీర్ ప్రభావంతో తుపాను∙ప్రధాన కేంద్రం నుంచి చెల్లాచెదురైన గాలులు, మేఘాల ప్రభావం తీరం దాటే ప్రాంతంలో కాకుండా చుట్టుపక్కల జిల్లాలపై చూపించింది. దీంతో.. మోంథా తన శక్తిని కోల్పోయి.. తీరం దాటేందుకు సిద్ధమై.. కడలిని వదిలి భూమిని తాకింది. తీరం దాటే సమయంలో గరిష్టంగా 110 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నివేదికలు అంచనా వేసినా.. వాస్తవ స్థితిలో మాత్రం 70 నుంచి 80 కి.మీ. వేగంతో మోస్తరు వర్షాలకే పరిమితమవ్వడంతో తీర ప్రాంతమంతా ఊపిరి పీల్చుకుంది. కొన్ని ప్రాంతాల్లోనే ప్రభావం మోంథా తీవ్ర తుపాను తీరం తాకనంత వరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను వణికించింది. కానీ తీరానికి చేరుకోగానే పూర్తి నిశ్శబ్ధ వాతావరణాన్ని తలపించింది. ఉదయం 10 గంటల నుంచి మొదలైన గాలులు సాయంత్రం ఏడు గంటల వరకు జిల్లా వాసులను భయాందోళనలకు గురి చేశాయి. తీరానికి సమీపిస్తే తుపాను విరుచుకుపడుతుందనే ఆందోళన అందరి కంటి మీద కునుకులేకుండా చేసింది. భారీగా వీచిన ఈదురు గాలులకు పెద్ద సంఖ్యలో కొబ్బరి చెట్లు నేల కూలాయి. భారీ వృక్షాలు సైతం కూకటి వేళ్లతో సహా పడిపోయాయి. విద్యుత్ తీగలు తెగి పడడంతోపాటు పదుల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఉదయం 10 గంటల నుంచి జిల్లాలో పలు మండలాలకు విద్యుత్ లేకుండా పోయింది. సముద్ర అలలు మూడు మీటర్ల ఎత్తున ఎగిసిపడగా, 300 మీటర్లు ముందుకు చొచ్చుకు వచ్చాయి. తీరం భారీగా కోతకు గురైంది. తీరానికి చేరువయ్యే సమయంలో ప్రశాంతమే రాత్రి 8 గంటల తర్వాత మోంథా తుపాను ప్రభావం పూర్తిగా కనిపించలేదు. అసలు నిజంగా తుపాను∙ఇక్కడ తీరం దాటుతోందా.. లేదా దిశ మార్చుకుందా? అనే సందేహమే అందరిలోనూ మొదలైంది. అలజడి సృష్టించిన ఈదురు గాలులు నిలిచిపోయాయి. భారీ వర్షం సైతం తగ్గుముఖం పట్టింది. సముద్రంలో అలజడి కొనసాగుతున్నా భారీ వర్షం.. ఈదురు గాలులు లేకపోవడం జనాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. తుపాను అర్ధరాత్రి ఒంటి గంటకు నరసాపురం సమీపంలో తీరం దాటింది. ఈ సమయంలో 110 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ వర్షం కురుస్తుందని కోనసీమ వాసులు ఆందోళన చెందారు. కళ్ల ముందు 1996 పెను తుపాను విషాదం కదలాడింది. కాని అందుకు విరుద్ధంగా గాలులు నిలిచి పోవడంతో పాటు భారీ వర్షం తగ్గి కేవలం చినుకులు పడుతుండడంతో మోంథా తుపాను గమనం ఎవరికీ అంతుచిక్కలేదు. దీంతో తీర ప్రాంతవాసులు బతుకుజీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో... తొలుత కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసినా.. విండ్ షీర్ కారణంగా స్వల్పంగా దిశ మార్చుకొని అంతర్వేది పల్లిపాలెం వైపు వెళ్తుందన్న వాతావరణ శాఖ ప్రకటనతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం గంటకు 18 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన తుపాను వేగం మంగళవారం నాటికి 12 కిలోమీటర్లకు తగ్గిపోయింది. ఫలితంగా దీని దిశ మారిపోయి, జిల్లాకు ముప్పు తప్పింది. అయితే పెనుగాలులు, జోరు వానలతో ఈ తుపాను జిల్లాను అతలాకుతలం చేసింది. జిల్లావ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచీ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కాకినాడ తీరంలో బలమైన ఈదురు గాలులకు వర్షాలు కూడా తోడవ్వడంతో ప్రజలు భయకంపితులయ్యారు. పిఠాపురంలో 22.6 మిల్లీమీటర్లు, కాజులూరు మండలంలో అత్యల్పంగా 2.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అక్కడక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లోని కర్నూలు రోడ్డు, ఊరచెరువు రోడ్డులో నిలిచిపోయిన వర్షపునీరు ఉప్పాడ తీరానికి తప్పని ముప్పు తీరానికి మాత్రం ముప్పు తప్పలేదు. ఉప్పాడ, కోనపాపపేట గ్రామాల్లోని పలు ఇళ్లు సముద్ర కోతకు గురయ్యాయి. విద్యుత్ స్తంభాలు, వృక్షాలు సముద్రంలో కలసిపోయాయి. బీచ్ రోడ్డు ధ్వంసమైంది. సముద్రంపై వేటను నిషేధించడంతో మత్స్యకారులు ఇళ్ల వద్దనే ఉండిపోయారు. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న రాకాసి అలలు కాకినాడ – ఉప్పాడ బీచ్ రోడ్డును ముంచెత్తాయి. ముందు జాగ్రత్తగా బీచ్ రోడ్డుపై రాకపోకలను పోలీసులు నియంత్రించారు. సాధారణ ప్రయాణికులతో పాటు స్థానికులను సైతం ఆ రోడ్డు పైకి వెళ్లకుండా కట్టడి చేశారు. కోతకు గురి కాకుండా రక్షణగా వేసిన బండరాళ్లు సముద్ర అలల తాకిడికి రోడ్డు పైకి వచ్చిపడుతూ ప్రమాదకరంగా మారాయి. ముందుస్తు చర్యల్లో బాగంగా ఉప్పాడ, కోనపాపపేట, మూలపేట, ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలైన మాయాపట్నం, సూరాడపేట, జగ్గరాజుపేట, అమీనాబాద్, కొత్తపట్నం, గంగూలిపేట, పాత మార్కెట్ ప్రాంతాల్లోని సుమారు 8,200 మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు. కాకినాడ నగరంతో పాటు రూరల్, తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి, పిఠాపురం, గొల్లప్రోలు, తాళ్లరేవు తదితర మండలాల్లో మత్స్యకారులతో పాటు ఇతర నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. విశాఖపట్నంలో జలమయమైన వెలంపేటలోని రహదారి స్తంభించిన పోర్టు తుపాను ప్రభావంతో కాకినాడ డీప్ వాటర్, యాంకరేజ్ పోర్టుల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. బియ్యం, పంచదార, పామాయిల్, యూరియా తదితర ఎరువులు ఎగుమతి, దిగుమతులను నిలిపివేశారు. కాకినాడ పోర్టులో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక ప్రకటించారు. గడచిన రెండు దశాబ్దాల్లో కాకినాడ పోర్టులో ఈ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారి. జిల్లా వ్యాప్తంగా 12 మండలాల పరిధిలో దాని ప్రభావం ఉందని చెబుతున్నా వాస్తవానికి కాకినాడ తీరంలోని తొండంగి, యు.కొత్తపల్లి.. కాకినాడ రూరల్ కాకినాడ సిటీ తాళ్ళరేవు మండలాలపైనే ప్రభావం కనిపించింది. ముందు జాగ్రత్త చర్యగా కాకినాడ, పిఠాపురం, తాళ్లరేవు ప్రాంతాల్లో హెలిప్యాడ్లు కూడా సిద్ధం చేశారు కానీ ఇంత వరకు వాటి అవసరం రాలేదు పంటలకు నష్టం విస్తారంగా కురుస్తున్న వర్షాలు, పెను గాలులకు అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. కరప, కాకినాడ రూరల్, పెద్దాపురం, సామర్లకోట, యు.కొత్తపల్లి, పిఠాపురం, గొల్లప్రోలు, కాజులూరు తదితర మండలాల్లో వరి పంట నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గొల్లప్రోలు మండలం దుర్గాడ, చేబ్రోలు, వన్నెపూడి తదితర ప్రాంతాల్లో మిరప, అరటి వంటి వాణిజ్య పంటలు దెబ్బ తిన్నాయి. ఏలేరు, పిఠాపురం బ్రాంచి కెనాల్ (పీబీసీ), సుద్దగెడ్డ పొంగి ప్రవహిస్తున్నాయి. ఏలేరు జలాశయానికి ఎగువ నుండి వరద నీరు పోటెత్తడంతో దిగువ ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏలేరు, పంపా, తాండవ రిజర్వాయర్లు పొంగి ప్రవహిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో.. మోంథా తుపాను పెద్దగా ప్రభావం చూపకపోవడం పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు ఊరటనిచ్చింది. నరసాపురం, భీమవరం, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లో అక్కడక్కడ జల్లులు మాత్రమే పడగా గాలుల తీవ్రత లేకపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. తీవ్ర తుపానుగా బలపడిన తర్వాత ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల సమయానికి జిల్లాలో 154 మి.మీ వర్షం కురవగా, సగటు వర్షపాతం 7.7 మి.మీ మాత్రమే నమోదైంది. ఆచంటలో 24 మి.మీ అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 20 మండలాలకు గాను 15 మండలాల్లో 10 మి.మీ లోపు వర్షం మాత్రమే కురిసింది. జిల్లా వ్యాప్తంగా 3,581 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు. తుపాన్‌ను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ఆర్అండ్బీ పరిధిలో 29, ట్రాన్స్పోర్ట్ పరిధిలో 40, మొత్తంగా 69 జేసీబీలు, 79 పవర్ సాలను, 96 డీజిల్ జనరేటర్లను అందుబాటులో ఉంచారు. నరసాపురంలో 34 మంది సభ్యులతో ఒక ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌ను, ఏపీఎస్పీ ప్లటూన్ ఒకటి భీమవరంలో మరొకటి నరసాపురంలో సిద్దంగా ఉంచారు. 60 మంది గ్రేహౌండ్ సిబ్బందిని ఉండిలో మోహరించారు. 150 వరకు వైర్లెస్ సెట్లను ఒక శాటిలైట్ ఫోన్‌ను, ఒక డ్రోన్‌ను అందుబాటులో ఉంచారు. జిల్లాలోని 37 పునరావాస కేంద్రాలకు 4,150 మందిని తరలించారు. ఏలూరు జిల్లాలో.. ఏలూరు జిల్లాలో ఉదయం 9.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు 310 మి.మీ. వర్షపాతం నమోదైంది. ద్వారకా తిరుమలలో 29.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలోని మెజార్టీ మండలాల్లో 10 మి.మీ. లోపు వర్షపాతం మాత్రమే నమోదైంది. తుపాను తీరం దాటాకా జిల్లాలోని ఏలూరు, కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు తదితర నియోజకవర్గాల్లో చెదురు మదురు జల్లులు మినహా భారీ వర్షాలు లేకపోవడం ఊరటనిచ్చింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లావ్యాప్తంగా 2,239 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. వరి పంట కోత దశకు చేరుకోగా, గాలుల తీవ్రత లేకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి 45 పునరావాస కేంద్రాలకు 1,203 మందిని తరలించారు. 2,000 విద్యుత్ స్తంభాలను సిద్ధం చేశారు. 59 జేసీబీలు, 37 పవర్‌సా, 10 బ్లేడ్ ట్రాక్టర్లు, 100 పోలీస్ వైర్లెస్ సెట్లను సిద్ధం చేశారు. 105 మంది స్విమ్మర్స్‌ను గుర్తించారు. 295 మంది గర్భిణులను ఆస్పత్రులకు తరలించారు. కేకే లైన్లో జారిపడిన కొండచరియలు అల్లూరి జిల్లాలో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొత్తవలస–కిరండూల్ రైల్వే లైన్లో చిమిడిపల్లి సమీపంలోని టన్నెల్ వద్ద కొండచరియలు ట్రాక్‌పై జారి పడ్డాయి. వరదనీరు ట్రాక్‌పై పొంగి ప్రవహించింది. ట్రాక్‌పై బండరాళ్లు, మట్టి తొలగించే పనుల్లో రైల్వే వర్గాలు నిమగ్నమయ్యాయి. ఈ మార్గంలో సోమవారం రాత్రి నుంచి అన్ని రైళ్ల రాకపోకలను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. అరకులోయ–అనంతగిరి ఘాట్‌లో సుంకరమెట్ట, బీసుపురం సమీప ప్రాంతాల్లో రోడ్డుపై వరదనీరు పొంగి ప్రవహించింది. ఘాట్ మార్గాల్లో రాత్రి పూట ప్రయాణాలను నిలిపివేశారు. బలిమెల జలాశయ నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది.అల్లూరి సీతారామరాజు జిల్లా కొత్తవలస–కిరండూల్ మార్గంలో చిమిడిపల్లి సమీపంలోని టన్నెల్ వద్ద రైల్వే ట్రాక్‌పై కూలిన కొండచరియలు నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో బుధవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ సహా విశాఖపట్నం, గంగవరం, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో పదో నంబర్ భారీ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు వైఎస్సార్సీపీ శ్రేణులు తోడుగా నిలవాలి మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు సాక్షి, అమరావతి: మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమతంగా ఉండాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. తుపాను ముప్పు తగ్గే వరకు ప్రతి ఒక్కరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు. తుపాను సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తోడుగా నిలవాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లాలో కుంభవృష్టితుపాను ప్రభావం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాపై తీవ్రంగా పడింది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లా అంతటా కుండపోత వర్షం కురిసింది. కావలిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటీవల కాలంలో ఈ స్థాయి వర్షపాతం నమోదవ్వడం ఇదే ప్రథమం. దగదర్తి, ఉలవపాడు, కందుకూరు, జలదంకి, కొడవలూరు, కలిగిరి, లింగసముద్రం, అల్లూరు ప్రాంతాల్లో 15 నుంచి 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు తర్వాత ప్రకాశం జిల్లా సింగరాయకొండ, సంతనూతలపాడు, చీమకుర్తి, ఒంగోలు పట్టణంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. తుపాను తీరం దాటే అవకాశం ఉందనుకున్న కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ అంచిన వేసినా, అనూహ్యంగా తుపాను తీరం దాటే సమయంలో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురవడం గమనార్హం బాపట్ల, ఒంగోలు జిల్లాల్లో భారీ వర్షం బాపట్ల జిల్లా నగరం, చిన గంజాం మండలాల్లో భారీ వర్షం పడింది. తీర ప్రాంతంలో పలుచోట్ల చెట్లు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. బాపట్ల పట్టణంలో ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. తెనాలి రేపల్లె మార్గంలో చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. గుంటూరు నగరంలో రాత్రి 10 గంటల తర్వాత వీచిన గాలులకు పలుచోట్ల చెట్లు పడిపోయాయి. కార్పొరేషన్ సిబ్బంది వాటిని తొలగించే పనుల్లో నిమగ్నం అయ్యారు. ఒంగోలు, కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో కుండపోత వర్షం కురిసింది. ఒంగోలు నగరంతో పాటు కొండపి, టంగుటూరు, సింగరాయకొండ, కొత్తపట్నం, నాగులుప్పలపాడు, పొన్నలూరు, చీమకుర్తి మండలాల్లో పది సెంటీమీటర్లు కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. రాత్రి 10 గంటలకు అందిన వివరాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఒంగోలు నగరంలో 15.50 సెంటీమీటర్ల వర్షం కురిసింది. టంగుటూరులో 15.74, కొత్తపట్నంలో 14.36, నాగులుప్పలపాడులో 14.58, పొన్నలూరులో 14.68, చీమకుర్తిలో 13, పామూరులో 11.6 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అర్ధరాత్రి కూడా భారీ వర్షం కురుస్తూనే ఉంది. తుపాన్లు.. ప్రభావాలు ⇒ 2014 అక్టోబర్‌లో అత్యంత భారీ తీవ్ర తుపాను ‘హుద్ హుద్’ విశాఖలో తీరం దాటింది. ఈ సూపర్ సైక్లోన్ తీరం దాటే సమయంలో 185 నుంచి 260 కి.మీ. వేగంతో రికార్డు స్థాయిలో గాలులు వీచాయి. ⇒ 2018లో తిత్లీ అత్యంత తీవ్ర తుపానుగా బలడుతూ శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో తీరం దాటింది. ఈ సమయంలో గంటకు 140 నుంచి 150 కిలో మీటర్ల వరకు గాలులు బీభత్సం సృష్టించాయి. ⇒ 2021లో జవాద్ తుపానుగా మారి తీరం దాటకుండానే సముద్రంలోనే బలహీన పడిపోయింది. ఈ కారణంగా గంటకు 45 కి.మీ.. గరిష్టంగా 65 కి.మీ. వేగంతో గాలులు వీచాయి.⇒ 2022 మే నెలలో ఏర్పడిన అసని తీవ్ర తుపాను కూడా తీరం వైపు వచ్చినట్లే వచ్చి దిశ మార్చుకొని తిరిగి సముద్రంలోకి వెళ్లిపోయి బలహీనపడింది. గాలుల తీవ్రత 75 నుంచి 85 కి.మీ.గా నమోదైంది. ⇒ 2023లో ఏర్పడిన మిచాంగ్ తీవ్ర తుపాన్ బాపట్ల వద్ద తీరం దాటింది. మిచాంగ్ తీరం దాటే సమయంలో 90 నుంచి 100 కి.మీ. వేగంతో గాలులు వీచి విధ్వంసం సృష్టించింది. ⇒ తాజాగా మోంథా తీవ్ర తుపాను కూడా తీరం దాటే సమయంలో 90 నుంచి గరిష్టంగా 110 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేశారు. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ఈ గాలుల వేగం 75 నుంచి 80 కి.మీ.కు పరిమితమైపోయింది. -
Cyclone Montha: వణికిపోతున్న కాకినాడ ఉప్పాడ బీచ్ లో రాకాసి అలలు
-
‘మోంథా’ పెను ముప్పు!
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉగ్రరూపం దాల్చుతూ.. సాగరాన్ని చీల్చుకుంటూ.. రాష్ట్రంపై విరుచుకుపడేందుకు మోంథా తుపాను పెను ఉప్పెనలా దూసుకొస్తోంది. ఓవైపు బలమైన ఈదురు గాలులు కకావికలం చేస్తుండగా.. జడివానలు జడిపిస్తున్నాయి. రోడ్డు మార్గాలు జలమయమయ్యాయి.. రైలు మార్గాలను ముంపు ముప్పు భయపెడుతోంది. భీకర గాలులు వాయుమార్గాన్ని సైతం స్తంభింపజేస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతికి వచ్చే పలు విమానాలను పెను తుపాను కారణంగా రద్దు చేశారు. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే జోన్ల పరిధిలో 97 రైళ్లను రద్దు చేశారు. సముద్రం అల్ల కల్లోలం కావడంతో జల రవాణా స్తంభించిపోయింది. పోర్టుల్లో సరుకు రవాణా కార్గో షిప్పులకు లంగరు వేశారు. నౌకాదళానికి చెందిన నౌకలు ప్రధాన కేంద్రాలకు చేరుకున్నాయి. కాకినాడ తీరంలో రాకాసి అలల హోరు.. తీరం వైపు దూసుకొస్తున్న మోంథా తుపాను ధాటికి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ జిల్లా తడిసి ముద్దవగా కాకినాడ తీరంలో రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. తీవ్ర వాయుగుండం నుంచి సోమవారం ఉదయానికి తుపానుగా మారింది. ఆగ్నేయ, పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తుపాను గంటకు 13 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో ఉత్తర, వాయవ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి సమయానికి విశాఖకు 460 కిలోమీటర్లు, కాకినాడకు 410, చెన్నైకి 400 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర తుపానుగా మారి ముందుకు కదలనుంది. బుధవారం తెల్లవారు జామున కాకినాడ– అమలాపురం మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రచండ వేగంతో.. తుపాను తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ వేగం పెరుగుతోంది. తుపాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. విశాఖపట్నం జిల్లాలో ఎడతెగని వర్షం.. మోంథా తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర అంతటా ఎడతెగని వర్షాలు కురవగా మిగిలిన చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. విశాఖ నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో పలుచోట్ల చెట్లు విరిగి రోడ్డుపై కూలిపోయాయి. విశాఖ రూరల్ పరిధిలోని జాతర ప్రాంగణం వద్ద 9.2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. మధురవాడ, కాపులుప్పాడ, పెందుర్తి, సీతమ్మధార, ఎండాడ, సాగర్ నగర్, మహారాణిపేట, గోపాలపట్నం, గాజువాక, సబ్బవరం ప్రాంతాల్లో 6 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. అనకాపల్లి జిల్లా గంధవరంలో 5.8, శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం విజయరాంపురంలో 5.7 సెంటీమీటర్ల వర్షం పడింది. అంబేడ్కర్ కోనసీమ, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అన్నమయ్య జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కాకినాడ సముద్ర తీరంలో రెండు మీటర్లపైగా ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. విశాఖ బీచ్‌లో కోస్టల్ బ్యాటరీ వద్ద ఎగసిపడుతున్న అలలు నేడు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. తుపాను ప్రభావంతో మంగళవారం ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు (20 సెంటీ మీటర్లకుపైగా), కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు (15 నుంచి 20 సెంటీ మీటర్లు) కురిసే అవకాశం ఉంది. తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు, నంద్యాల, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు కూడా కుండపోతే..! ఈ నెల 29వ తేదీన బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నంద్యాల, ప్రకాశం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీనివల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు, కమ్యూనికేషన్ వ్యవస్థకు ఆటంకం, వరదలు, పిడుగులు, నేల కోతకు గురి కావడం, రోడ్లు దెబ్బతినడం, బలహీనమైన నిర్మాణాలు, గుడిసెలు నేలమట్టమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. భారీ వర్షాలకు పలుచోట్ల వాగులు ఉప్పొంగి ఆకస్మిక వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని అప్రమత్తం చేసింది. అందుకనుగుణంగా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ నెల 30వ తేదీ వరకు మత్స్యకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సరఫరాను పునరుద్ధరించేందుకు సంసిద్ధంగా ఉండాలని విద్యుత్ సంస్థలతో నిర్వహించిన సమీక్షలో సీఎస్ కె.విజయానంద్ ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలిలో కురుస్తున్న వర్షం ప్రాణనష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు సహాయక చర్యలపై ఉత్తరాంధ్ర జిల్లాల జోనల్ ఇన్చార్జి అజయ్‌జైన్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే 32,400 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని.. ఐదు ఎన్డీఆర్ఎఫ్, ఆరు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో 2,914 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 233 మండలాల్లోని 1,419 గ్రామాలు, 44 మున్సిపాలిటీల్లో తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్నదాతల్లో ఆందోళన.. అన్నదాత చివరి ఆశలపై మోంథా తుపాను నీళ్లు జల్లింది. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా 1.63 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌లో వరి సాగు చేపట్టగా ప్రస్తుతం గింజ గట్టి పడుతున్న దశలో ఉంది. గత వారం అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు వరి చేలల్లో ముంపు నీరు చేరింది. కొబ్బరి రైతుల్లోనూ తుపాను తీవ్ర కలవరం రేపుతోంది. 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని హెచ్చరిస్తుండటంతో 1996 తుపాను గుర్తు చేసుకుని ఆందోళన చెందుతున్నారు. నేడు, రేపు 17 జిల్లాల్లో రెడ్ అలెర్ట్..ముంచుకొస్తున్న తుపాను ముప్పుతో అంతటా అప్రమత్తత నెలకొంది. మంగళ, బుధవారం 17 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలుండటంతో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో ముందస్తు చర్యలు చేపట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో హై అలెర్ట్ ప్రకటించారు. పలు జిల్లాల్లో నాలుగు రోజులపాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగులకు మూడు రోజుల పాటు సెలవులు రద్దు చేసి సహాయక చర్యల్లో నిమగ్నం చేశారు. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలుతుపాను నేపథ్యంలో కాకినాడ పోర్టులో 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖ, గంగవరం పోర్టుల్లో 6వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేయగా మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో 5వ నంబర్ ప్రమాద హెచ్చరికలు వెలువడ్డాయి. కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు ఎగుర వేశారు. తీర ప్రాంతాలకు సందర్శకులు రాకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు. ప్రధాన బీచ్‌లలో పోలీసులు, మెరైన్ సిబ్బంది పహారా కాస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కాగా రెడ్ అలెర్ట్ జారీ చేసిన జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు... ఆరెంజ్ అలెర్ట్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.తుపాను కారణంగా అలల తాకిడి పెరగడంతో విశాఖ బీచ్ రోడ్డులో కృష్ణ మందిర్ వద్ద కోతకు గురైన తీరం కోనసీమకు పెను గండం..!సాక్షి, అమలాపురం: పెను తుపాను గండం కోనసీమను వణికిస్తోంది. సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో రాకాసి అలలు రెండు, మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. ఓడలరేవు వద్ద ఓఎన్జీసీ వశిష్ట టెర్మినల్ ప్రధాన గోడను అలలు తాకుతున్నాయి. సరుగుడు తోటలు సముద్రంలో కలసిపోతున్నాయి. కాట్రేనికోన మండలం నదీపాయల మధ్య ఉన్న మగసానితిప్ప గ్రామంలోని మత్స్యకారులను బలుసుతిప్పకు తరలించి పునరావాసం కల్పించారు. లంక గ్రామాల రైతులు పాడి పశువులను మైదాన ప్రాంతాలకు తరలించారు. జిల్లాలో 120 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. భయం గుప్పెట్లో కాకినాడసాక్షి ప్రతినిధి, కాకినాడ: మోంథా తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటనుందనే భారత వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లాలోని తీర ప్రాంత మండలాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. జిల్లాలోని 12 మండలాలపై ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ నేపథ్యంలో కాకినాడ డీప్ వాటర్ పోర్టు, యాంకరేజ్ పోర్టుల్లో కార్యకలాపాలను నిలిపివేశారు. కాకినాడ–ఉప్పాడ బీచ్ రోడ్డు, బీచ్ పార్కులలో రాకపోకలను ఆపేశారు. కాకినాడ జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 29వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. సోమవారం కాకినాడ రూరల్‌లోని పర్ర కాలువ వంతెనపై ప్రవహిస్తున్న నీటిలో పడి 12 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. రెడ్ అలెర్ట్ జిల్లాలివే..శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం.ఆరెంజ్ అలెర్ట్ జిల్లాలుశ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, నంద్యాలఎల్లో అలెర్ట్ జిల్లాలుచిత్తూరు, కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురంతెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు మొంథా తుఫాను ప్రభావం తెలంగాణపైనా ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని హెచ్చరించింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. తీవ్ర తుపాను కారణంగా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈమేరకు జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. 8 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, నిర్మల్, మహబూబాబాద్... భద్రాద్రి కొత్తగూడెం,ఈ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. విమానాల రద్దు మోంథా తుపాను ప్రభావంలో విజయవాడ, విశాఖపట్నం నుంచి హైదరాబాద్, తిరుపతితోపాటు దేశంలోని వివిధ గమ్యస్థానాలకు రాకపోకలు సాగించే విమానాలను కొన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు ఇప్పటికే రద్దు చేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 30కి పైగా విమానాల రాకపోకలపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉందని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. అలాగే, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మంగళవారం, బుధవారం ప్రయాణించాల్సిన 54 రైళ్లను రద్దు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో 43 రైళ్లను రద్దు చేశారు. మొత్తం 97 రైళ్లను రద్దు చేసినట్లు ఆయా డివిజన్ల అధికారులు ప్రకటించారు. విజయవాడ డివిజన్ పరిధిలోని విజయవాడ, భీమవరం, నిడదవోలు, గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నరసాపూర్, ఒంగోలు, రాజమహేంద్రవరం నుంచి బయలుదేరే రైళ్లను రద్దు చేసినట్లు డివిజనల్ అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులకు ఎంఎస్ఎస్ ద్వారా సమాచారం పంపామని, టికెట్ల డబ్బును వారి ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. కాగా, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో లోకల్ వార్నింగ్ సిగ్నల్–4 ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తమిళనాడు, ఒడిశాలో.. తమిళనాడు, ఒడిశాలోనూ మోంథా ప్రభావం చూపుతోంది. చెన్నైతోపాటు ఉత్తర తమిళనాడులోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసనట్లు ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. మోంథా నేపథ్యంలో ఒడిశా కూడా అప్రమత్తమైంది. దక్షిణ ఒడిశాలో 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీచేశారు. మూడువేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
Cyclone Montha: ఏపీకి భారీ హెచ్చరిక
-
బలపడిన వాయుగుండం.. జల ప్రళయంగా దూసుకొస్తున్న తుఫాన్!
-
కాకినాడ పోర్టులో 5వ ప్రమాద హెచ్చరిక
-
మోంథా తుపాన్ ధాటికి ఏపీ వణుకు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
-
తుఫాన్ వచ్చేస్తోంది.. తీర ప్రాంతం కొట్టుకుపోయేలా 3 రోజులు భారీ వర్షాలు
-
ఏపీకి హై అలర్ట్.. ఈదురు గాలులతో భారీ వర్షాలు
-
మెంథా తుఫాన్ ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
రేపు బంగాళాఖాతంలో తుపాను
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది క్రమంగా పశ్చిమ దిశలో కదిలి శుక్రవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో వాయుగుండంగా మారింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో విశాఖపట్నం నుంచి ఆగ్నేయంగా 970 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 970 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయంగా 990 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం మరింత బలపడి ఆదివారం ఉదయంకల్లా తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.తదుపరి 24 గంటల్లో ఈ తీవ్ర వాయుగుండం బలపడి సోమవారం నాటికి తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనంతరం తుపాను మరింత బలపడి ఈనెల 28వ తేదీనాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ తర్వాత తీవ్ర తుపాన్ ఉత్తర వాయవ్య దిశలో కదులుతూ కాకినాడకు సమీపంలో 28వ తేదీ సాయంత్రానికి తీవ్ర తుపానుగా తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.నాలుగు రోజులపాటు మోస్తరు వర్షాలు..బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, తదుపరి తుపాను ప్రభావం రాష్ట్రంపైన మధ్యస్తంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనావేసింది. రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచిస్తోంది. కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా నమోదు కావచ్చని చెబుతూ, రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. -
Heavy Rains: రేపటికి తుఫాన్‌గా మారనున్న అల్పపీనడనం
-
హైదరాబాద్‌లో కుండపోత.. భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజీగూడ, ఖైరతాబాద్, లక్డీకపూల్, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, సనత్‌నగర్, మోహిదీపట్నం, అత్తాపూర్, ఆరాంఘర్, కూకట్పల్లి, మూసాపేట్, బాలానగర్‌లో కుండపోతగా వర్షం పడుతోంది. భారీ వర్షం కారణంగా నగర జీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది.పలు ప్రధాన రహదారులన్నీ జలమయమై.. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వర్షపు నీరు భారీగా చేరడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.#HYDTPinfo🚧 Traffic Alert 🚗Due to waterlogging and ongoing road work near Mehdi Function Hall, Ayodhya Junction, the movement of vehicles is slow in the area.Commuters are advised to plan their travel accordingly and use alternate routes where possible.Drive cautiously and… pic.twitter.com/kAByg5kMpK— Hyderabad Traffic Police (@HYDTP) October 25, 2025 కాగా, ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలకు ఐఎండీ.. అత్యంత అప్రమత్తత ప్రకటించింది. 27, 28 తేదీల్లో రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నెల 27న భారీ వర్షాలు పడే అవకాశముందని.. బాపట్ల, ప్రకాశం, కడప, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. 20 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.నంద్యాల, చిత్తూరు, పల్నాడు, గుంటూరు, కృష్ణ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యింది. ఈ నెల 28న కాకినాడ సమీపంలో మెంథా తీవ్ర తుఫాన్. తీరం దాటనుంది. తీవ్ర తుఫాన్ తీరం దాటే సమయంలో కాకినాడ, ఉభయగోదావరి, ఏలూరు, గుంటూరు, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.#HYDTPinfo🌧️ Traffic Alert 🚗Due to waterlogging on Panjagutta Flyover towards NFCL, vehicle movement is slow in the area.Commuters are advised to plan their travel accordingly and drive with caution. 🚦#HyderabadTraffic #TrafficUpdate #RainAlert #DriveSafe pic.twitter.com/R7iceOFQbV— Hyderabad Traffic Police (@HYDTP) October 25, 2025 -
ఏపీపై వరుణుడి ఉగ్రరూపం.. దంచికొడుతున్న వానలు (ఫొటోలు)
-
హై అలర్ట్.. AP వైపు దూసుకొస్తున్న మొంథా తూఫాన్
-
ముంచుకొస్తున్న తూఫాన్.. ఏపీకి భారీ వర్ష సూచన
-
ఏపీకి తుపాను ముప్పు..!
విశాఖ: ఏపీకి తుపాన్ రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అతాలకుతాలమైన ఏపీలో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది.ఈనెల 27వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడబోయే తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం.. రేపటికి(శనివారం, అక్టోబర్ 25వ తేదీ నాటికి వాయుగుండంగా బలబడే అవకాశం ఉందని తెలిపిది. ఆపై తుపానుగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఏపీలో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈరోజు(శుక్రవారం), రాయలసీమ, దక్షిణ కోస్తాలో బారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్ల తెలిపింది. దాంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హచ్చరించింది. నిండా ముంచిన వాన.. -
నెల్లూరులో పెన్నమ్మ పరవళ్లు..పర్యాటకుల సందడి (ఫొటోలు)
-
నిండా ముంచిన వాన
సాక్షి నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. దీని ప్రభావంతో రెండు రోజులుగా రాష్ట్రమంతటా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. గురువారం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయి రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. వరి చిరుపొట్ట దశలో వర్షాలు పడటంతో పంట నష్టం తప్పేలా లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా దుగ్గిరాల మండలంలో 6.94 సెం.మీ. వర్షం కురిసింది. పల్నాడు జిల్లాలో గడచిన 24 గంటల్లో 330.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లాలో కురిసిన వర్షాలకు పెన్నానదికి భారీస్థాయిలో నీరు చేరుతోంది. వరి, వేరుశనగ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు ప్రకాశం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా రాచర్ల మండలంలో 8.5 సెం.మీ. కురిసింది. ఐదు మండలాల్లో పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. పెద్దదోర్నాల మండల పరిధిలోని తీగలేరు, ఇసుక చింతలవాగు, దొంగలవాగు, రాళ్లవాగులు పొంగటంతో వై.చర్లోపల్లి, గంటవానిపల్లె, మర్రిపాలెం తదితర గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు పంటల్ని దెబ్బతీస్తున్నాయి. రొంపిచెర్ల మండలంలో టమాట పంట పూర్తిగా దెబ్బతింది. తిరుపతి జిల్లాలో 33.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. వైఎస్సార్ కడప జిల్లాలో 2,711 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, కంది, మినుము, వేరుశనగ, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లా కేంద్రంతో పాటు పరిసర మండలాల్లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. బుక్కరాయసముద్రంలో 72 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏలూరు జిల్లాలో గురువారం కుండపోత వర్షం కురిసింది. కలిదిండిలో 7.82 సెం. మి. అత్యధిక వర్షపాతం నమోదైంది. చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట మండలాల్లో వాగులు పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. జిల్లా వ్యాప్తంగా గురువారం ఉదయానికి సగటు వర్షపాతం 13.5 మి.మీ.గా నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో గురువారం 23.9 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది.వాగులో పడి వ్యక్తి మృతి జలదంకి (కలిగిరి): జీవనోపాధి నిమిత్తం వాగు దాటి కావలి వెళ్లాలనుకున్న వ్యక్తి బైక్‌తో పాటు గల్లంతై మృతి చెందాడు. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో జరిగింది. చామదాలకు చెందిన దంపూరు మల్లికార్జున (45) తన గ్రామం నుంచి బైక్‌పై కావలికి గురువారం బయల్దేరాడు. నేరెళ్ల వాగు దాటుతుండగా బైక్‌తో పాటు ఆయన చప్టా పైనుంచి వాగులో పడిపోయాడు. సమాచారం అందుకున్న జలదంకి ఎస్ఐ సయ్యద్ లతీఫున్నీసా ఘటనాస్థలానికి చేరుకుని సిబ్బంది, స్థానికులతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని రప్పించి వారి సాయంతో 6 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా, మల్లికార్జున కావలిలోని పూల దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య గోవిందమ్మ, కుమార్తె (6) ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్మారా్టనికి తరలించారు. -
8 Districts: ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు
-
దూసుకొస్తున్న వాయుగుండం.. మరికొన్ని గంటల్లో..!
-
AP: ఐదు రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు
-
ఏపీకి వారం రోజులపాటు భారీ వర్ష సూచన
-
తమిళనాడులో కుండపోత వర్షం.. చెన్నై పరిస్థితి దారుణం..
చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నైలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నై విమానాశ్రయంలో రన్‌వేపైకి నీళ్లు చేరడంతో ఎక్కడికక్కడే విమానాలు నిలిచిపోయాయి. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఆదివారం రాత్రి నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో, నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. తూర్పు తీర రోడ్డు (ECR) వెంబడి ఉన్న వేలచేరి, మేదవాక్కం, పల్లికరణై, నీలంకరై ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ చెన్నైలోని అనేక ప్రాంతాల్లో ప్రయాణికులు మోకాలి లోతు నీటితో ఇబ్బంది పడ్డారు. వర్షాల నేపథ్యంలో జాగ్రత్త వహించాలని అధికారులు కోరారు.మరోవైపు.. భారీ వర్షం నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధికారులతో సమావేశం అయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను ఆరా తీశారు. ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు అందించాలని ఆదేశించారు. Heavy rain @aaichnairport. The runways are water-logged. @NewIndianXpress @ChennaiRains @praddy06 @IMDWeather #Chennaiairport #TamilNadu #ChennaiRains pic.twitter.com/lxlx6bdLYe— S V Krishna Chaitanya (@Krish_TNIE) October 20, 2025భారత వాతావరణ శాఖ (IMD) తాజా అంచనా ప్రకారం.. చెన్నై, చెంగల్పట్టు, కడలూరు, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, పుదుచ్చేరి, కారైకల్, పరిసర జిల్లాల్లో రాబోయే కొన్ని గంటల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 22 వరకు తమిళనాడు తీరప్రాంతంలో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.@ChennaiRains @RainStorm_TN Heavy rains with gusty wind at Thoraipakkam #wetdiwali pic.twitter.com/rMl98JVZwV— Lakshmanan S (@Laxman190566) October 20, 2025కొండ ప్రాంతాలైన నీలగిరి, కల్లార్, కూనూర్ మధ్య కొండచరియలు విరిగిపడటంతో నీలగిరి మౌంటైన్ రైల్వే (NMR)లో రైలు సర్వీసులు రద్దు చేసింది. చెట్లు కూలిపోవడం వల్ల ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగిందని దక్షిణ రైల్వే తెలిపింది. అక్టోబర్ 19న మెట్టుపాళయం–ఉదగమండలం (రైలు నం. 56136 మరియు 06171), ఉదగమండలం–మెట్టుపాళయం (రైలు నం. 56137) సహా మూడు రైళ్ల సర్వీసులను నిలిపివేశారు. Heavy rain on the bypass road in Chinnamanur, Theni districtand drizzling continues @ChennaiRains @MasRainman @RainStorm_TN @kalyanasundarsv @praddy06 pic.twitter.com/tudC0r5Gbn— Michael 🌿 (@michaelraj_GD) October 19, 2025 -
ఏపీలో నాలుగు రోజులు వర్షాలే వర్షాలు..
-
విజయవాడలో భారీ వర్షం.. వరదలో చిక్కుకున్న బస్సు
-
విజయవాడలో భారీ వర్షం.. ట్రావెల్స్ బస్సుకు తప్పిన ప్రమాదం
సాక్షి, విజయవాడ: ఏపీలో(Ap Rains) వర్షాలు దంచికొడుతున్నాయి. విజయవాడలో శనివారం అర్థరాత్రి ఎడతెరిపిలేని భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షానికి విజయవాడ బస్టాండ్ వద్ద రైల్వే ట్రాక్ క్రింద వరద నీరు చేరుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది బస్సులో ప్రయాణిస్తున్న వారిని సురక్షితంగా కాపాడారు.ఇదిలా ఉండగా.. ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో, తదుపరి 48 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఏపీ బుధవారం నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.Crazy Rain yesterday night in #Vijayawada.IGMS Stadium is completely inundated in water. pic.twitter.com/Rdr3xyr3PO— Raghu (@RaghuB_) October 19, 2025ఇక, ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు ప్రజలు చెట్ల కింద నిల్చోవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గురువారం నాటికి దక్షిణమధ్య,పశ్చిమమధ్య బంగాళాఖాతం ప్రాంంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు.బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. pic.twitter.com/F8MfeYLfvr— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 18, 2025 -
కొలను కాదు.. ప్రభుత్వ పాఠశాలే
మణుగూరు రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితిసింగారం గ్రామపంచాయతీ పరిధి అరుంధతినగర్‌లోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం ఈత కొలనును తలపిస్తోంది. మండల వ్యాప్తంగా మంగళవారం కురిసిన భారీ వర్షానికి పాఠశాల ఆవరణలోకి వరద చేరింది. దీంతో బుధవారం విద్యార్థులు లోపలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉపాధ్యాయులు పాఠశాల బయటే చెట్టు కింద తరగతులు బోధించారు. కాగా, ఈ పాఠశాల.. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నివాసానికి సమీపానే ఉండటం గమనార్హం. అయితే, విద్యార్థులకు ఆరు బయట బోధిస్తున్నారని తెలిసి తల్లిదండ్రులు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఎదురవుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అనంతరం మణుగూరు ఎంఈవో స్వర్ణజ్యోతి, పంచాయతీ కార్యదర్శి చేరుకుని తల్లిదండ్రులకు నచ్చజెప్పి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. -
భారీ వర్ష్పాలు, తుఫానులతో ఈశాన్య రుతుపవనాలు వచ్చేస్తున్నాయి..
-
ఏపీపై ఉపరితల ఆవర్తన ప్రభావం
-
నిండా ముంచిన వాన
సాక్షి, వరంగల్ నెట్వర్క్/యాదాద్రి/భద్రాద్రి కొత్తగూడెం/చౌటుప్పల్ రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు యాదాద్రి, భద్రాద్రి జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో పంటలు నీటమునిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, ఎనుమాముల మార్కెట్ యార్డుల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న వేలాది బస్తాల ధాన్యం తడిసిపోయింది. ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలంలో మిర్చితోటల్లోకి వర్షం నీరు చేరింది. నెక్కొండ మండలం చంద్రుగొండలో పిడుగుపాటుకు రెండు గేదెలు మృతిచెందాయి. మహబూబాబాద్, కేసముద్రం వ్యవసాయ మార్కెట్లలో ఆరబెట్టిన మక్కలు, బయ్యారం, గూడూరు మండలాల్లో రోడ్లవెంట, చెలకల వద్ద ఆరబోసిన మక్కలు తడిసిపోయాయి. మరిపెడ, కురవి, కేసముద్రం, గూడూరు, దంతాలపల్లి మండలాల్లో వరి, పత్తి పంటలు నీట మునిగాయి. మహబూబాబాద్ పట్టణ సమీపంతో పాటు డోర్నకల్‌లో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏజెన్సీలోని కొత్తగూడలో వాగులు ఉరకలేస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గార్ల సమీపంలో పాకాల యేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కురవి, సీరోలు మండలాల్లోనూ వాగులు, వంకల ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. హనుమకొండ జిల్లా కటాక్షపూర్ చెరువు మత్తడి జాతీయ రహదారి 163పైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. యాదాద్రి, భద్రాద్రి జిల్లాల్లోనూ బీభత్సం యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండలో అత్యధికంగా 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పత్తి, వరి పంటలకు తీరని నష్టం వాటిల్లింది. సుమారు 500 ఎకరాల్లో పత్తి చేలు దెబ్బతిన్నాయి. పలు మార్కెట్ యార్డుల్లోని ధాన్యం కొట్టుకుపోయింది. ఆయా మండలాల్లో వాగులు ఉధృతంగా పారుతున్నాయి. నక్కలగూడెంలో కోళ్ల ఫారంలోకి భారీగా వరద నీరు చేరి.. 6 వేల బ్రాయిలర్ కోళ్లు మృతి చెందాయి. అలాగే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో మొదలైన వాన సోమవారం ఉదయం వరకూ కొనసాగింది. ఈ వానతో వాగులు నిండి లోలెవల్ చప్టాలపైకి వరద చేరడంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. పాల్వంచ మండలం కిన్నెరసాని జలాశయానికి వరద పోటెత్తి గరిష్ట స్థాయికి చేరడంతో.. ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు కూడా భారీగా వరద రావడంతో 25 గేట్లకు 11 ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. పలుచోట్ల పత్తి చేన్లలో నీరు చేరగా, వరి పొలాలు కూడా దెబ్బ తిన్నాయి. ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వర్షం కురిసింది. -
దక్షిణకోస్తాకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
విశాఖ : ఏపీపై ఉపరితల ఆవర్తనాల ప్రభావ కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. దీనిలోభాగంగా ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఇక కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. రాగల 24 గంటలపాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తుఫాన్ హెచ్చరికల కేంద్ర ముఖ్య అధికారి శ్రీనివాస్ తెలిపారు. -
పాలమూరులో భారీ వర్షం
సాక్షి నెట్వర్క్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మహబూబ్‌నగర్, నవాబుపేట, దేవరకద్ర మండలాల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.నవాబుపేట మండలం రుద్రారంలో వాగు నిండి గ్రామంలోకి నీరు ప్రవహించడంతో ఇళ్లలోకి భారీగా వరద వచ్చి చేరింది. చెన్నారెడ్డిపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. వనపర్తి జిల్లాలో కాజ్వే ఉధృతంగా ప్రవహించడంతో మదనాపురం–ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నారాయణపేట జిల్లా పళ్ల ప్రాంతానికి చెందిన కందుకూరు పద్మ(35) పొలం పనులకు వెళ్లగా.. అక్కడ పిడుగు పడటంతో మృత్యువాతపడింది. -
Narsipatnam Tour: ఇది జగన్ మ్యాజిక్ జనంలో భారీ రెస్పాన్స్..
-
Narsipatnam Tour: వర్షం వచ్చినా డోంట్ కేర్ ప్రతి అడుగులో జగన్ వెంటే..
-
విజయవాడలో భారీ వర్షం (ఫొటోలు)
-
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం
-
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షం
చిత్తూరు రూరల్/తిరుపతి తుడా/చిత్తూరు రూరల్ (కాణిపాకం)/తిరుమల: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శుక్రవారం అర్ధరాత్రి వర్షం దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం 8గంటల వరకు వాన పడుతూనే ఉంది. దీంతో పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండిపోయాయి. పలు మండలాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు పంటలు సైతం దెబ్బతిన్నాయి.⇒ చిత్తూరు జిల్లా సోమల మండలం పెద్ద ఉప్పరపల్లి వద్ద సీతమ్మ చెరువు నుంచి గార్గేయ నదికి వెళ్లే మార్గంలో వర్షం నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పది గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. టమాటా, వరి, పూలతోటలు, కూరగాయల పంటలు అధిక విస్తీర్ణంలో దెబ్బతిన్నట్లు రైతులు వాపోతున్నారు.⇒ చిత్తూరు జిల్లా తవణంపల్లిలోని మాధవరం వంక పొంగిపొర్లుతోంది. తొడతర బ్రిడ్జిపై వర్షపునీరు ఉధృతంగా పారుతోంది. ఈకారణంగా రాకపోకలు నిలిచిపోయాయి.తిరుపతిలో భారీ వర్షం భారీ వర్షం తిరుపతి నగరాన్ని ముంచెత్తింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత రెండు గంటల సమయంలో మొదలైన వర్షం ఉదయం 8 గంటల వరకు పడుతూనే ఉంది. కుండపోత కారణంగా కాలువలు పొంగిపొర్లుతున్నాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు పెద్ద ఎత్తున చేరింది. లక్ష్మీపురం కూడలి, ఏఐఆర్ బైపాస్ రోడ్డు, లీలామహల్ కూడలి, కరకంబాడి రోడ్డు, కొర్లగుంట పెద్ద కాలువ ప్రాంతాల్లో వర్షం నీరు ఏరులై పారింది. ప్రమాదకరస్థాయిలో దాటడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అలానే రైల్వే అండర్ బ్రిడ్జ్‌ల వద్ద వరద నీరు ప్రమాదకర స్థాయికి చేరింది. తిరుమలలో కూడా..తిరుమలలో కూడా శనివారం భారీగా వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎడతెరపి లేని వర్షం కురవడంతో చలి తీవ్రత పెరిగింది. నాలుగు మాడవీధులు జలమయమయ్యాయి. రోడ్లన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి వెళ్లిన భక్తులు, దర్శనం అనంతరం ఆలయం బయటకు వచి్చనపుడు తడిసి ముద్దయ్యారు. వసతి గృహాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.వరి, టమాటా పంటలకు నష్టం అన్నమయ్య జిల్లాలో శనివారం పలుచోట్ల వర్షం కురిసింది. పీలేరులో భారీ వర్షం కురవడంతో రోడ్లపై నీరు నిలిచింది. ఆర్టీసీ బస్టాండ్ జలమయమైంది. పీలేరు–మదనపల్లె మార్గంలో నాలుగులేన్ల రహదారి విస్తరణలో భాగంగా నిర్మాణం కోసం కొత్తచెరువును తవ్వి వదిలేశారు. అయితే భారీ వర్షం కారణంగా చెరువు కట్ట తెగిపోయింది. దీంతో దిగువన ఉన్న పొలాల్లో వరి, టమాటా పంటలకు నష్టం వాటిల్లింది. భారీ వర్షానికి గార్గేయ ప్రాజెక్టు నిండి పింఛా నది పరవళ్లు తొక్కుతోంది. -
అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు.. వాగు మధ్యలో చిక్కుకున్న యువకుడు
-
ఉత్తరకోస్తా, దక్షిణకోస్తాకు భారీ వర్ష సూచన
-
ఏపీకి బిగ్ అలర్ట్.. ఉత్తర కోస్తాలో అతి భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర కోస్తాలో అతి భారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రైలు, రోడ్డు రవాణా మార్గాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వాయువ్య దిశగా పయనించి రాగల 12 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.3వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందని.. ఉత్తర కోస్తా-దక్షిణ ఒడిశా మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటనుంది. ఇవాళ విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, యానాం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అల్లూరి, మన్యం, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.రానున్న మూడు రోజులు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వానలు పడనున్నాయని.. నాలుగు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ఏపీలోని అన్ని పోర్టులకు మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయ్యింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రా గల 3 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. చెట్ల కింద నిలబడరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. -
మరో అల్పపీడనం.. భారీ వర్షాలు
-
30 ఏళ్ల తర్వాత.. మూసీ మహోగ్రరూపం (ఫొటోలు)
-
మూసీ ఉగ్రరూపం.. MGBSను ముంచెత్తిన వరద
-
Garam Garam Varthalu: శభాష్ అన్నలు
-
హైదరాబాద్‌ను ముంచెత్తిన మూసీ.. జల దిగ్బంధంలో మహా నగరం (ఫొటోలు)
-
ఏపీలో పలుచోట్ల అతిభారీ వర్షాలు పడే అవకాశం
-
మరో నాలుగు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు
-
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. ఫుల్ ట్రాఫిక్ జామ్
తెలంగాణ వర్షాలు అప్డేట్స్.. 👉హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని కుండపోత వర్షం కురుస్తోంది. రానున్న రెండు గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. HyderabadRains WARNING 2 ⚠️🌧️⚠️ Dear people of Hyderabad, a POWERFUL DOWNPOUR is coming from Dammaiguda, Medchal, Nagaram will cover ENTIRE HYDERABAD CITY in next 2hrs. STAY SAFE, PLAN ACCORDINGLY ⚠️🌧️— Telangana Weatherman (@balaji25_t) September 26, 2025 FLOODING RAINFALL WARNING DUE TO DEPRESSION - SEP 26-27 - UPDATE 3 ⚠️Dear people of Telangana, these 2days going to be PEAK DOWNPOURS due to DEPRESSION with FLOODING RAINS ahead in various parts of Telangana (RED MARKED AREAS) and MODERATE - HEAVY RAINS ahead in BLUE DISTRICTS… pic.twitter.com/xvfzxhljzD— Telangana Weatherman (@balaji25_t) September 26, 2025 👉పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Telangana Rains) ప్రకటించింది. అల్పపీడన ప్రభావంతో ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. 👉నేడు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు, ఎల్లుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో గురువారం రాత్రి నుంచే హైదరాబాద్(Hyderabad Rains) సహా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. ఇక, నేడు ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.HyderabadRains WARNING 1 ⚠️🌧️ Dear people of Hyderabad, next round of MODERATE - HEAVY RAINFALL ahead in entire Hyderabad City next 2hrs. Plan accordingly, today WHOLE DAY we have ON AND OFF RAINS ⚠️⚠️— Telangana Weatherman (@balaji25_t) September 26, 2025సీఎం రేవంత్ ఆదేశాలు.. 👉రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ట్రాఫిక్ నిలిపివేయాలని అన్నారు. వర్షం కురిసే సమయంలో ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావొద్దని సీఎం సూచించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు.DISTRICTS WARNING - Next 2hrs ⚠️🌧️ NON STOP MODERATE - HEAVY RAINS ahead in Medak, Sangareddy, Kamareddy, Siddipet, Jangaon, Hanmakonda, Warangal, Rangareddy, Vikarabad, Mahabubnagar, Narayanpet, Wanaparthy, Gadwal, Nagarkurnool, Suryapet, Nalgonda next 3hrs ⚠️⚠️🌧️ Hyderabad…— Telangana Weatherman (@balaji25_t) September 26, 2025వాన ముసురు..హైదరాబాద్‌లో రాత్రి నుంచి ముసురు వీడడం లేదు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, కిస్మత్పూర్, గండిపేట్, అత్తాపూర్, ఆరాంఘర్, శంషాబాద్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, గుండ్లపోచంపల్లి, బహుదూర్‌పల్లి, సూరారం, జీడిమెట్ల, చింతల్, షాపూర్‌నగర్, గాజులరామారం, జగద్గిరిగుట్ట, బాలానగర్, శంకర్పల్లి, మోకిలలో తెల్లవారుజాము 3 గంటల నుంచి వర్షం కురుస్తూనే ఉంది. రోడ్లపై వరదనీరు పారుతోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.ఇది కూడా చదవండి: ఇక తెలంగాణ సర్కార్ వారి మెట్రో..15 జిల్లాలకు అతి భారీ వర్ష సూచన..రాష్ట్రంలో 15 జిల్లాలకు వాతావరణశాఖ అతి భారీ వర్ష సూచన చేసింది. శుక్రవారం ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20 సెం.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.TELANGANA RAINFALL FORECAST | 25th SEPTEMBER (Next 24 Hours)DEPRESSION EFFECT – DAY 1Widespread rains ahead for the entire Telangana today.North & East Telangana: HEAVY RAINS with chances of localized VERY HEAVY RAINS ⚠️West, Central & South Telangana: MODERATE to HEAVY… pic.twitter.com/2BYkri1MQR— Hyderabad Rains (@Hyderabadrains) September 25, 2025 -
ఏపీలో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు
-
హైదరాబాద్ పై వరుణ ప్రతాపం
-
ఆకాశానికి చిల్లు పడిందా??.. హైదరాబాద్‌ను వణికిస్తున్న వరుస క్లౌడ్బరస్టులు (చిత్రాలు)
-
జల దిగ్బంధం... ట్రాఫిక్ చక్రబంధం
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: భాగ్యనగరాన్ని వరుణుడు బెంబేలెత్తించాడు. హోరు వానతో నగరాన్ని అతలాకుతలం చేశాడు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఉరుములు మెరుపులతో మొదలైన మేఘగర్జన రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో వరద ఉధృతికి రహదారుల పక్కన నిలిపిన వాహనాలు కొట్టుకుపోయాయి. ఓపెన్ నాలాలు, మ్యాన్‌హోల్స్ పొంగిపోర్లాయి. ఫలితంగా రోడ్లన్నీ చెరువులను తలపించడంతో ట్రాఫిక్ పూర్తిగా అస్తవ్యస్తమైంది.గంటలకొద్దీ, కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిపోయాయి. విజయవాడ, వరంగల్, ముంబై, బెంగళూరు, కరీంనగర్ వెళ్లే మార్గాల్లో ఇళ్లకు, ఆఫీసులకు బయలుదేరిన వాహనదారులు ముందుకు కదల్లేక నానా అవస్థలు పడ్డారు. ప్రధానంగా అసెంబ్లీ నుంచి ఖైరతాబాద్, మెహిదీపట్నం నుంచి మాసాబ్ ట్యాంక్, ఎల్బీ నగర్ నుంచి మలక్‌పేట వరకు కేవలం కిలోమీటర్ ప్రయాణానికి గంటలకొద్దీ సమయం పట్టింది. రాత్రి 10 గంటల వరకు అత్యధికంగా బంజారాహిల్స్‌లో సుమారు 10.5 సెం.మీ. వర్షం కురవగా శ్రీనగర్ కాలనీలో 9.9 సెం.మీ., ఖైరతాబాద్‌లో 8.9 సెం.మీ. వర్షం కురిసింది. శ్రీనగర్, ఖైరతాబాద్, మైత్రివనం, యూసుఫ్‌గూడ, వనస్థలిపురం, హయత్‌నగర్, బహదూర్‌పురా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇక నగరు శివారు ప్రాంతాల్లోనూ వర్షం దంచికొట్టింది. తుర్కయంజాల్ మున్సిపల్ పరిధి ఇంజాపూర్–తొర్రూర్ మార్గంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు వరదలో చిక్కుకున్నారు. మున్సిపల్ సిబ్బంది అతికష్టం మీద వారిని కాపాడారు. వరదలో కొట్టుకుపోయిన కారు కొద్ది దూరంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ దిమ్మెకు తగిలి ఆగిపోయింది. సీఎం కాన్వాయ్‌కూ తప్పని ట్రాఫిక్ తిప్పలు.. కుండపోత వర్షంతో రోడ్లన్నీ జలమయం కావడంతో సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్ సైతం ట్రాఫిక్‌లో చిక్కుకొని నత్తనడకన ముందుకు సాగింది. సాయంత్రం 6:30 గంటలకు సీఎం సచివాలయం నుంచి జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి బయల్దేరగా ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా వీవీ స్టాచ్యూ వద్దకు రాగానే ఖైరతాబాద్ కూడలిలో ట్రాఫిక్ స్తంభించింది. అక్కడి నుంచి ఖైరతాబాద్, కేసీపీ జంక్షన్, ఎర్రమంజిల్ తాజ్ కృష్ణా, వెంగళ్రావు పార్కు, ఎన్ఎఫ్సీఎల్ చౌరస్తా, పంజగుట్ట శ్మశానవాటిక, టీవీ 9 మీదుగా సాగర్ సొసైటీ, కేబీఆర్ పార్కు చౌరస్తా వరకు కాన్వాయ్ ముందుకు కదిలేందుకు చాలా సమయం పట్టింది.సరిగ్గా 7:25 గంటలకు సీఎం కాన్వాయ్ కేబీఆర్ పార్కు చౌరస్తాలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. కేబీఆర్ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చౌరస్తాకు వెళ్లేందుకు 20 నిమిషాలు పట్టింది. జూబ్లీహిల్స్ చౌరస్తా నుంచి సీఎం ఇంటికి వెళ్లకుండా కేబుల్ బ్రిడ్జి మీదుగా మెడికవర్ ఆస్పత్రికి వెళ్లారు. సరిగ్గా 8 గంటలకు ఆయన మెడికవర్ ఆస్పత్రికి చేరుకున్నారు. వాస్తవానికి సచివాలయం నుంచి సీఎం నేరుగా తన ఇంటికి వెళ్లేందుకు 13 నిమిషాల సమయం పడుతుంది.కేబీఆర్ పార్కు చౌరస్తాలో నిలిచిపోయిన సీఎం కాన్వాయ్ కానీ సోమవారం సాయంత్రం ఆయన జూబ్లీహిల్స్ దాటడానికే గంటంపావు సమయం పట్టింది. అయితే తన కోసం వాహనదారులను ఇబ్బంది పెట్టొద్దని.. తాను ట్రాఫిక్‌లో ఇరుక్కున్నా పరవాలేదని పోలీసులను ఆదేశించిన సీఎం రేవంత్.. గంటన్నరపాటు స్తంభించిన ట్రాఫిక్‌లోనే మెల్లగా ముందుకు కదిలారు.జిల్లాల్లోనూ జోరు వాన వరంగల్, ములుగు, సిద్దిపేట జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో సోమవారం పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చెల్పాక గ్రామంలో పొలం దున్నుతున్న రైతు ఊకే కృష్ణ (45) పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందగా మరో రైతు పూనెం చిట్టిబాబు గాయపడ్డాడు. అలాగే వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చంద్రయ్యపల్లి గ్రామంలో పొలంలో మిరప నారు వేస్తుండగా వర్షం కురుస్తోందని చెట్టు కింద నిలబడిన మొద్దు రాకేష్ (25)పై పిడుగుపడటంతో మృతిచెందాడు.వరంగల్ నగరంలోని వరంగల్ అండర్‌బ్రిడ్జి, భవాని నగర్–వికాస్‌నగర్ కూడలి, అంబేడ్కర్ భవన్, హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్ కూడలి, బస్‌స్టేషన్, కాకాజీ నగర్, హనుమకొండ, వరంగల్ చౌరస్తా ప్రాంతాల్లో వరదనీరు చేరడంతో వాహనదారులు అవస్థలుపడ్డారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో 8.5 సెం.మీ. వర్షం కురవగా కొమురవెల్లి మండల కేంద్రంలో 7.2, సిద్దిపేట పట్టణంలో 7.15 సెం.మీ. వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ శాఖ కార్యాలయంపై పిడుగు పడటం సుమారు రూ. 10 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. -
ఏపీకి మోస్తరు నుంచి భారీ వర్షాల హెచ్చరిక
విజయవాడ: ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఏపీలోని పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. రాగల కొన్ని గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం అల్యూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ మేరకు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం అల్యూరి, విశాఖ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అనకాపల్లి,కాకినాడ జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ.ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ జిల్లాలకు అరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.ఎన్టీఆర్, ఏలూరు, తిరుపతి, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఇక 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు దగ్గర నిలబడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్: నగరాన్ని వరుణుడు వీడటం లేదు. రోజూ ఏదొక సమయంలో వర్షం నగరాన్ని పలకరిస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్‌లో వర్షం కుమ్మేసింది.. సోమవారం(సెప్టెంబర్ 22వ తేదీ) సాయంత్రం సమయానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయి భారీ వర్షంగా మారిపోయింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్ఆర్నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఫిల్మ్‌నగర్, సనత్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది . నగరంలొని పలు చోల్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దాంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడే ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా సోమాజిగూడ నుంచి పంజాగుట్ట వైపు భారీగా ట్రాఫిక్ స్థంభించిపోయింది. నగరంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. లక్డీకాపూల్, నాంపల్లి, అసెంబ్లీ ప్రాంతాల్లో సైతం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నిమిషనిమిషానికి వర్ష తీవ్రత పెరుగుతోంది. నగరంలోని పలుచోట్ల కుండపోత వర్షం పడింది. మరో రెండు గంటల పాటు భారీగా వర్షం పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దాంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సహాయక చర్యల్లో నిమగ్నమైంది. డీఆర్ఎఫ్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఆఫీస్ లాగౌట్ కావడంతో ఎవరూ బయటకు రావొద్దని అధికారులు అదేశించారు. హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. #HYDTPInfo🚧 Traffic Alert – Water Logging 🚧Water logging reported from VV Statue towards Shadan College. Vehicle movement is slow in the area.Commuters are advised to take alternate routes and drive with caution.#HyderabadTraffic #TrafficUpdate #WaterLogging #DriveSafe pic.twitter.com/4R4PGhwIdA— Hyderabad Traffic Police (@HYDTP) September 22, 2025 Siever downpour at kamlapuri colony near Srinagar colony, requesting @gadwalvijayainc @CommissionrGHMC to please solve this issue,which is been facing from many years coz of heavy rainfall @balaji25_t pic.twitter.com/SqBba72A8W— piyush jain (@piyush_khater) September 22, 2025 హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు.. -
25న అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: తూర్పు మధ్య బంగాళాఖాతం..దాని సమీపంలోని ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఈ నెల 25న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది క్రమంగా బలపడి 24 గంటల తర్వాత పశ్చిమ వాయవ్య దిశలో కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం సమీపంలో వాయుగుండంగా మారొచ్చు. ఇది దక్షిణ ఒడిశా, ఉత్త రాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఈ నెల 27వ తేదీ ఉదయంకల్లా తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్ల డించింది.ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు కొనసా గుతుంది. ఈశాన్య ఉత్తరప్రదేశ్, సమీప బిహార్ ప్రాంతంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం పశ్చిమ విదర్భ వరకు కొనసా గుతుంది. వీటి ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.25 శాతం అధిక వర్షపాతం ప్రస్తుత నైరుతి రుతుపవనాల సీజన్ సంతృప్తికర వర్షాలనే నమోదు చేసింది. నైరుతి సీజన్లో ఈనెల 21వ తేదీ నాటికి 69.78 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 87.44 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 25% అధికంగా నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ⇒ నైరుతి సీజన్లో ఇప్పటివరకు మెదక్, నాగర్‌కర్నూల్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 18 జిల్లాల్లో అధిక వర్షపాతం, 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ⇒ మండలాల వారీగా పరిశీలిస్తే... 103 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 272 మండలాల్లో అధిక వర్షపాతం, 2,333 మండలాల్లో సాధారణ వర్షపాతం, 13 మండలాల్లో మాత్రం లోటు వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో రుతుపవనాల ఉపసంహరణ పూర్తయ్యింది. ఈ సమయంలో రుతుపవనాల కదలికలు చురుకుగా ఉండడంతో వానలు సైతం భారీగా నమోదయ్యే అవకాశముంది. ఈ నెల 25న తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో రాష్ట్రంలోనూ భారీ వర్షాల నమోదుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. -
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్: నగరాన్ని వరుణుడు వీడటం లేదు,. రోజూ ఏదో మూల వర్షం కురుస్తూనే ఉంది. పలు ప్రాంతాల్లో ఆదివారం (సెప్టెంబర్ 21) రాత్రి వర్షం పడుతోంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో వర్షం కురుస్తోంది. దిల్‌షుఖ్‌నగర్, కొత్తపేట, ఉప్పల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగట్టలో వర్షం పడుతోంది. -
రాయచోటిలో వర్ష బీభత్సం.. ముగ్గురి మృతి
-
కుంభవృష్టి.. నీళ్లలో కొట్టుకుపోయి ముగ్గురి మృతి
రాయచోటి: అన్నమయ్య జిల్లావ్యాప్తంగా శుక్రవారం రాత్రి కురిసిన కుంభవృష్టి రాయచోటిలో విషాదం నింపింది. పట్టణంలో వరదలా ప్రవహించిన వర్షపునీటిలో నలుగురు కొట్టుకుపోయారు. వీరిలో ముగ్గురు మృతిచెందారు. ఒక చిన్నారి ఆచూకీ లభించలేదు. వర్షపునీటితో రాయచోటిలోని మురుగు కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎస్ఎన్ కాలనీ వెనుక భాగాన ఉన్న కాలువలో వృద్ధురాలు(60), ఆమె కుటుంబానికి చెందిన చిన్నారి(5) నీళ్లల్లో కొట్టుకుపోసాగారు. వారిని కాపాడేందుకు స్థానికుడు గంగయ్య (30) ప్రయత్నించాడు. ప్రవాహ వేగానికి ముగ్గురూ కొట్టుకుపోయారు. స్థానికులు గాలించి అక్కడికి సమీపంలోని కల్వర్టు వద్ద ఆ ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. కె.రామాపురం సమీపంలో ఉన్న 4 కుళాయిల వద్ద నీటి ప్రవాహంలో యామిని (7) కొట్టుకుపోయింది. ఆమె ఆచూకీ లభించలేదు. -
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు చోట్ల భారీ వర్షం దంచికొడుతోంది. హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, దిల్సుఖ్నగర్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్‌మెట్, చైతన్యపురి, సరూర్‌నగర్, ఉప్పల్, బోడుప్పల్, చాంద్రాయణగుట్టలో కుండపోత వర్షం కురుస్తోంది.దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకుంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు. గంటసేపు కురిసిన భారీ వర్షానికి నాగోల్ సాయినగర్ వైపు భారీగా వచ్చిన వరద నీరు చేరుకుంది. వరద నీటిలో బైక్‌లు కొట్టుకుపోయాయి.ఎల్బీ నగర్లో గంట నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోంది నాగోల్, బండ్లగూడలో 8.78 సెం.మీ, ఎల్బీనగర్ 3.6 సెం.మీ, రామాంతాపూర్ 3 సెం.మీ వర్షపాతం నమోదైంది. -
హైదరాబాద్ : ఉదయం ఉక్కపోత..సాయంత్రం కుండపోత వర్షం (ఫొటోలు)
-
ఉక్కపోత.. కుండపోత
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో ఒకేరోజు మిశ్రమ వాతావరణం కనిపించింది. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు భానుడు ప్రతాపం చూపగా.... ఆ తర్వాత ఒకేసారి ఆకాశం మేఘావృతమై వరుణ దేవుడు విశ్వరూపం ప్రదర్శించాడు. భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. గురువారం గంటన్నర పాటు కురిసిన కుండపోత వర్షానికి నగర జీవనం కకావికలమైంది. ఆకాశానికి చిల్లు పడినట్లు వర్షం పడింది. అత్యధికంగా పాతబస్తీ బహదూర్‌పురాలోని జూపార్క్ వద్ద 8.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ప్రధాన రహదారులు చెరువులను తలపించగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బస్తీల్లోని నివాసాల్లో వరద నీరు వచ్చి చేరింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సాయంత్రం వేళ విద్యాసంస్థలు వదలడంతో విద్యార్ధులు, డ్యూటీలు ముగించుకొని ఇంటి దారి పట్టిన ఉద్యోగులు ట్రాఫిక్‌లో గంటల కొద్దీ నరక యాతన పడ్డారు. వరద ఉధృతికి రోడ్లపై అడుగు పెడితే కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్ల పక్కన నిలిపిన ఆటోలు, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకొని పోయాయి. జీహెచ్ఎంసీ, జలమండలి, పోలీసు, హైడ్రా బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. నాలుగు దిక్కులా చక్ర బంధం భారీ వర్షానికి హైదరాబాద్ నలుదిక్కులా చక్రబంధంగా ట్రాఫిక్ స్తంభించి పోయింది. నాంపల్లి నుంచి మాసాబ్‌ట్యాంక్, లక్డీకాపూల్ నుంచి ఖైరతాబాద్, సోమాజిగూడ నుంచి మియాపూర్, సచివాలయం నుంచి ట్యాంక్‌బండ్, బేగంపేట నుంచి సికింద్రాబాద్, మెహిదీపట్నం నుంచి రాయదుర్గం, చాంద్రాయణ గుట్ట నుంచి మలక్‌పేట, ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ తదితర మార్గాల్లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. గంటల కొద్దీ వాహనదారులు నరకయాతన పడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం మూడు రోజుల్లో పడాల్సిన వర్షం 30 నిమిషాల్లోనే కుంభవృష్టిగా కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరుతున్న ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. -
Heavy Rain: హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
-
ఆకాశానికి చిల్లుపడిందా? హైదరాబాద్ పై వరుణుడి ఉగ్రరూపం
-
క్లౌడ్‌బరస్ట్ దెబ్బకు పలు ఇళ్లు ధ్వంసం.. ఐదుగురు గల్లంతు
చమోలి: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో పెను విపత్తు సంభవించింది. ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న నందనగర్‌లో గురువారం తెల్లవారుజామున సంభవించిన క్లౌడ్ బరస్ట్ పలు ఇళ్లను ధ్వంసం చేసింది. ఐదుగురు అదృశ్యమయ్యారు. జిల్లా విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, నందనగర్‌లోని కుంత్రి వార్డులో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. చమోలి జిల్లా యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. VIDEO | Chamoli, Uttarakhand: Cloudburst in Nandanagar results in massive destruction. More details are awaited.(Source: Third Party)(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/LMiM4SuTPQ— Press Trust of India (@PTI_News) September 18, 2025క్లౌడ్ బరస్త్ దరిమిలా ఆ ప్రాంతంలో భయాందోళనలు అలుముకున్నాయి. ఇళ్ల శిథిలాలలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంఘటన జరిగిన సమయంలో ఏడుగురు ఇళ్లలో ఉండగా, వారిలో ఇద్దరిని రెస్క్యూ సిబ్బంది సజీవంగా బయటకు తీసుకువచ్చారు. గల్లంతైన మరో ఐదుగురు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఎస్డీఆర్ ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, వైద్య బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.చమోలి జిల్లా మేజిస్ట్రేట్ సందీప్ తివారీ వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ బుధవారం రాత్రి చమోలి జిల్లాలోని నందనగర్ ఘాట్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ సంభవించి, భారీ నష్టం జరిగిందన్నారు. నందనగర్‌లోని కుంత్రి లంగాఫలి వార్డులో ఆరు ఇళ్ల శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగామని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఇంతలో వాతావరణ శాఖ ఉత్తరాఖండ్‌లో 20 గంటల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. VIDEO | Chamoli, Uttarakhand: Cloudburst in Nandanagar results in massive destruction. More details are awaited.(Source: Third Party)(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/LMiM4SuTPQ— Press Trust of India (@PTI_News) September 18, 2025 -
వరుణుడి ఉగ్రరూపం.. హైదరాబాద్ ను ముంచెత్తిన వాన
-
హైదరాబాద్‌లో కుండపోత బీభత్సం.. నీటమునిగిన పలు ప్రాంతాలు (ఫొటోలు)
-
క్లౌడ్‌బరస్ట్‌తో హైదరాబాద్ కకావికలం
నగరం మరోసారి తడిసిముద్దయింది. బుధవారం రాత్రి కుంభవృష్టి బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి వరకు ఏకధాటిగా ఐదు గంటలపాటు కురిసిన భారీ వర్షంతో నగర జన జీవనం అతలాకుతలమైంది. ఆకాశానికి చిల్లుపడిందా? అన్నట్లుగా కురిసిన వర్ష ఉద్ధృతితో నగర వాసులు బెంబేలెత్తిపోయారు. వర్షం దాటికి నిమిషాల వ్యవధిలోనే రోడన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు అపార్ట్మెంట్లతోపాటు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు నీరు వచ్చి చేరగా, డైనేజీ, ఓపెన్ నాలాలు పొంగిపొర్లాయి. మెట్రో స్టేషన్లు, బ్రిడ్జిల కింద భారీగా నీరు చేరింది. పలు ప్రాంతాల్లో వరద నీటి ధాటికి వాహనాలు కొట్టుకుపోయాయి. భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్ది ట్రాíఫిక్ జామ్ అయింది. మాదాపూర్–హైటెక్ సిటీ చౌరస్తా, రాయదుర్గం, అమీర్‌పేట బంజారాహిల్స్ ఐకియా మార్గంలో, మియాపూర్– చందానగర్ నగర్ మార్గంలో రహదారిపై వాహనాలు ముందుకు కదల్లేదు. దీంతో ముంబై జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్లు మేర వాహనాలు నిలిచిపోయాయి. రాత్రి 12 గంటల వరకు అత్యధికంగా ముషీరాబాద్ తాళ్లబస్తీలో 18.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికం. ఒకరు మృతిహైదరాబాద్లో ఐదు గంటలపాటు కురిసిన భారీ వర్షంతో.. విషాదం నెలకొంది. బల్కంపేట రైల్వే బ్రిడ్జి కింద వరద నీటిలో పడి ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మృతుడిని ముషీరాబాద్ భోలక్‌పూర్‌కు చెందిన షర్పుద్దీన్గా గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. :::సాక్షి, సిటీబ్యూరో -
మూడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు
-
APలో కుండపోత వానలు.. మత్స్య కారులకు హెచ్చరిక జారీ
-
వర్షంలో కొట్టుకుపోయిన మామాఅల్లుళ్లు
-
భారీ వర్షానికి భాగ్యనగరం జలమయం
-
హైదరాబాద్ : రాత్రి అతలాకుతలం.. గంటపాటు కుండపోత వర్షం (ఫొటోలు)
-
భారీ వర్షానికి అతలాకుతలమైన హైదరాబాద్
-
ఒక్క గంటలో ఆగమాగం
సాక్షి, హైదరాబాద్/నాంపల్లి/ముషీరాబాద్: హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ఆదివారం రాత్రి అతలాకుతలం చేసింది. దాదాపు గంటపాటు వాన దంచికొట్టడంతో ప్రధాన రహదారులన్నీ నదుల్లా మారాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. దాదాపు నగరం మొత్తం ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద నీటిలో పడి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఆదివారం సాయంత్రం వరకు వాతావరణం సాధారణంగానే ఉన్నా.. రాత్రి ఎనిమిది గంటల తర్వాత మొదలైన వాన గంటపాటు కుండపోతగా కురిసింది. రాత్రి పది గంటల వరకు అత్యధికంగా నగర శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ తట్టి అన్నారం, ముషీరాబాద్ బౌద్ధనగర్‌లలో 12 సెంటిమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి ద్విచక్ర వాహనదారులు ఫ్లైఓవర్ల కింద తలదాచుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో కార్లు, ఆటోలు, బైక్‌లు నీటిలో కొట్టుకుపోయాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్,పంజాగుట్ట, అమీర్ పేట, ముషీరాబాద్, తార్నాక, లక్డీకాపూల్, కాచిగూడ, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ నిలిచిపోయింది. హైడ్రా, జీహెచ్ఎంసీ, జలమండలి, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రధాన రహదారులపై నిలిచిన వర్షపు నీరు నాలాల్లోకి వెళ్లేలా చర్యలు చేపట్టారు. కాగా, ఆదివారం రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో 24.3 సెంటీమీటర్లు నమోదైంది. అఫ్జల్‌సాగర్ నాలాలో మామా అల్లుళ్లు గల్లంతు భారీ వర్షానికి అఫ్జల్‌సాగర్ నాలా పొంగి ప్రవహించింది. ఈ నాలాలో మాన్గార్ బస్తీకి చెందిన అర్జున్ (26), రాము (25) అనే యువకులు కొట్టుకుపోయారు. వీరిద్దరూ మామా అల్లుళ్లుగా తెలిసింది. వీరికోసం రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. అర్జున్, రాము ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇల్లు అఫ్జల్‌సాగర్ నాలా ప్రక్కనే ఉండటంతో ఇంట్లోకి వర్షపు నీరు చేరింది. ఇంట్లోని సామాన్లు బయటకు తెచ్చే క్రమంలో రాము అదుపు తప్పి నాలాలో పడ్డాడు. అతడిని కాపాడే క్రమంలో అర్జున్ కూడా నాలాలో పడిపోయి వరద ఉధృతికి కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అక్కడికి చేరుకుని పరిస్థితిని ఆరా తీశారు. ముషీరాబాద్ డివిజన్ బాపూజీనగర్‌లో నాలాలో దినేశ్ (సన్నీ) అనే యువకుడు గల్లంతయ్యాడు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసే వినోబా నగర్‌కు చెందిన దినేశ్ (24) విధులు ముగించుకొని బైక్‌పై ఇంటికి వచ్చే క్రమంలో నాలాలో వరద ఉధృతి అధికంగా ఉండడంతో తన వాహనాన్ని ఆపి అక్కడ ఉన్న గోడ పక్కన నిలుచున్నాడు. ఇదే సమయంలో గోడ కూలడంతో దినేశ్ బైక్‌తోపాటు నాలాలో పడి కొట్టుకుపోయాడు. దినేశ్‌కు భార్య రాజశ్రీ, మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. దినేశ్ కోసం ముషీరాబాద్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. -
Heavy rain: ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన
-
తెలంగాణలో వానలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. రానున్న మూడు రోజుల పాటు ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు (Rain Update) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాలకి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన ప్రాంతాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. ఇక, హైదరాబాద్ నగరంలో మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.ఇక సోమవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా ఆదిలాబాద్, కుమ్రం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపెల్లి, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షం కురుస్తుందని వెల్లడించింది. ఇక, శనివారం రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. Overnight INTENSE THUNDERSTORMS lashed North TG districts, overall, 4th consecutive day of POWERFUL THUNDERSTORMS in many parts of TelanganaHyderabad too got decent rains yesterday. Will share today's forecast soon ⛈️👍 pic.twitter.com/tJeTJEy6rm— Telangana Weatherman (@balaji25_t) September 14, 2025 -
తెలంగాణలో ఐదు జిల్లాలకు హెచ్చరిక.. అతి భారీ వర్షసూచన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలు ప్రాంతాల్లో మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శనివారం ఐదు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మరో 19 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.ఇక, అంతకుముందు.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. ఆదివారం మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది. వర్షాల ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే వీలుందని తెలిపింది.LOCALISED HEAVY THUNDERSTORMS ALERT TODAY ⚠️⛈️ Today, the Upper air circulation (UAC) centre is falling right on Telangana Scattered SEVERE THUNDERSTORMS expected in North, West, Central TG districts like Adilabad, Asifabad, Nirmal, Nizamabad, Karimnagar, Jagitial,…— Telangana Weatherman (@balaji25_t) September 13, 2025 Today’s Forecast (Sept 13, 2025) ⛈️⛈️Heavy to Very Heavy Rains likely across North, West, Central TG at few places. Moderate Rains in South, East TG‼️Hyderabad : Intense Spell at few places— Weatherman Karthikk (@telangana_rains) September 13, 2025 -
దంచికొట్టిన వాన.. రోడ్లపై పొంగి పార్లుతున్న వరద
-
నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
-
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపటి వరకు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇవాళ, రేపు ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది. పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, అంబ్కేదర్ కోనసీమ, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ పేర్కొంది.తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట,రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, గద్వాల్ జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మరో 2 రోజులు కుండపోత..!
-
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం(సెప్టెంబర్ 11వ తేదీ) సాయంత్రం సమయంలో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్ పేట్, ఉప్పల్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, శామీర్‌పేట్, అంబర్పేట్, అబ్దుల్లాపూర్‌మెట్, మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. హయత్ నగర్-విజయవాడ రహదారిపై చేరిన వర్షపు నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హయత్‌నగర్ కోర్టు, ఆర్టీసీ డిపోలోకి వరద నీరు చేరింది. ప్రధానంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.ఇక మెదక్ జిల్లాలో ఈరోజు మూడు గంటల వ్యవధిలో భారీ నుంచి అతి భారీ వర్షంపడింది. మూడున్నర గంటల వ్యవధిలో 13 సెం.మీ అతి భారీ వర్షం పడింది. దీంతో రోడ్లు చెరువులను తలపించాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. రాజీపల్లి 9.2, పాతుర్ 8 సెం. మీ వర్షం కురిసింది. మెదక్ పట్టణంలో లోతట్టు ప్రాంతాలకు భారీగా నీరు చేరింది. గాంధీ నగర్ కాలనీని రోడ్డు ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రామ్ దాస్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డుపై వరద పోటెత్తింది. మెదక్-హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో జేసీబీతో మధ్యలో ఉన్న డివైడర్‌ను అధికారులు తొలగించారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో మొన్నటి పరిస్థితుల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
యూరియా కోసం జోరువానలో రైతుల క్యూ
-
గుంటూరు నగరంలో కుండపోత వర్షం
-
20 రాష్ట్రాలకు రెడ్ అలెర్ట్ అధికారిక ప్రకటన
-
విశాఖలో కుండపోత వర్షం.. ఏపీలో మూడు రోజులు గట్టి వానలు..
సాక్షి, విశాఖ: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి విశాఖలో కుండపోత వర్షం కురుస్తోంది. నగర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షం దంచికొడుతోంది. అర్థరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా రోడ్లపై భారీ వరద నీరు చేరుకుంది.ఇదిలా ఉండగా.. బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల్లో ఉపరితల ఆవర్తనం, కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో కోస్తా జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణం కేంద్రం హెచ్చరించింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు.. బుధ, గురువారాల్లో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, శుక్రవారం ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. గురువారం తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు వీయొచ్చని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. 🔸ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపిలో మూడు రోజులు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు🔸అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు🔸మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం pic.twitter.com/NCNsiHxmKQ— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) September 9, 2025 -
ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు పడే చాన్స్!
విజయవాడ: ఏపీలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో మూడు రోజులు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఎల్లుండి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదన్నారు. ప్రజలు చెట్ల క్రింద శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదన్నారు. తీరం వెంబడి 40 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. -
వరంగల్ లో కుండపోత వర్షం..వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు (ఫొటోలు)
-
వరంగల్ లో కుండపోత వర్షం
-
వరంగల్‌లో దంచికొట్టిన వర్షం.. ప్రాణ భయంతో ప్రయాణికుల కేకలు..
సాక్షి, వరంగల్: వరంగల్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కుండపోత వర్షం కురిసింది. ఎడతెరిపిలేని వర్షం కారణంగా పలు కాలనీలు జలమయం కాగా.. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి పూర్తిగా జలమయమైంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాలో శనివారం అర్థరాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. హనుమకొండలోని అంబేద్కర్ భవన్ రోడ్డు, తిరుమల జంక్షన్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అండర్ బ్రిడ్జి దగ్గర వరదలో చిక్కుకున్న రెండు ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. మోకాళ్ల లోతు మేరకు వరద నీరు నిలిచిపోవడంతో అతి కష్టం మీద ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. దీంతో, ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో కాలనీల్లోకి వరద నీరు చేరుకుంది. దీంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. #Warangalrains!!After a heavy rains in warangal city Railway under bridge under water logging situation stay safe 🚨🌧️⚠️ pic.twitter.com/G2yyU4ZWv2— Warangal Weatherman (@tharun25_t) September 7, 2025భారీ వర్షం కారణంగా వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి కిందికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అది గుర్తించకుండా వెళ్లిన రెండు ఆర్టీసీ బస్సులు వరద నీటిలో చిక్కుకున్నాయి. అందులో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో మిల్స్ కాలనీ పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తాడు సాయంతో బస్సుల్లో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీశారు. అన్నారం, మహబూబాబాద్ నుంచి వచ్చిన ఈ బస్సుల్లో సుమారు వంద మంది ప్రయాణికులు ఉన్నారు. #Warangalrains!!Now heavy downpour rains going in warangal tricity places Hnk Kazipet warangal city alert 🌧️🌧️🚨 pic.twitter.com/UBEfX6WgMn— Warangal Weatherman (@tharun25_t) September 7, 2025Today two RTC Buses were struck up at under bridge Warangal into 5 ft water and about 20 passengers were struck up in the buses. Immediately CI Inthezargunj along with his staff proceeded to the spot and rescued all the passengers in two buses.@cpwarangal @dcpczwrl @Acp_wrlc pic.twitter.com/9VAOBtSs3H— SHO INTHEZARGUNJ (@shointhezargunj) September 7, 2025 -
ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు
-
ఏపీకి మోస్తరు నుంచి భారీ వర్ష సూచన
విజయవాడ: మరో రెండు రోజుల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మంగళవారం(సెప్టెంబర్ 2వ తేదీ) నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు అనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి సగటును 1.5 మరియు 5.8 కి.మీ ఎత్తులో ఉపరిత ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 -60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ప్రఖర్ జైన్ వెల్లడించారు.ఈ నేపధ్యంలో ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు,హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం 48.1అడుగులు ఉందన్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 11.47 లక్షల క్యూసెక్కులు ఉందని మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందన్నారు. కృష్ణానది వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజి వద్ద సాయంత్రం 6 గంటలకు 2.25 లక్షల క్యూసెక్కులు ఉందన్నారు. వర్షాల ప్రభావంతో కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం హెచ్చుతగ్గులుగా మరో నాలుగు,ఐదు రోజులు ఉండొచ్చని పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు పొంగిపొర్లే నదులు, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. వినాయక నిమజ్జనాల్లో జాగ్రతలు తీసుకోవాలన్నారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు
-
వెంటాడుతున్న వరద కష్టాలు
సాక్షి, నెట్వర్క్: నిర్మల్ జిల్లాలోని భైంసా డివిజన్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. మరోవైపు మహారాష్ట్ర నుంచి భారీగా వస్తున్న వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పోటెత్తిన వరద బాసర కాటేజీల్లోకి ప్రవేశించింది. వెంటనే పోలీసులు, అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎస్పీ జానకీ షర్మిల స్వయంగా అక్కడికి చేరుకుని, పరిస్థితి సమీక్షించారు. విపత్తు నియంత్రణ సహాయక బృందాలతో కాటేజీల నిర్వాహకులు, సిబ్బందిని క్షేమంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.కాగా బాసర ఆలయ అర్చకులు గోదావరి శాంతించాలంటూ స్నానఘాట్ల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఇలావుండగా..భైంసా పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు ఐదుగేట్లు ఎత్తారు. సుద్ధవాగు వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఇళ్లలోకి వచ్చిన నీటిని తోడేందుకు ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. మెదక్ పట్టణంలో షాపుల్లో చేరిన నీటిని మోటార్లతో తోడుతున్నారు.హైదరాబాద్ నుంచి మెదక్ –ఎల్లారెడ్డి–బాన్సువాడ మీదుగా నిజామాబాద్ జిల్లా కోటగిరి వరకు వెళ్లే 765డీ జాతీయ రహదారి ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. హైదరాబాద్–నాగ్‌పూర్ హైవే (44) కోతకు గురైన చోట్ల మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి.హవేళీఘనపురం మండలం గంగమ్మవా గులో గల్లంతైన యాదగౌడ్ అనే మరో వ్యక్తి మృతదేహం శుక్రవారం లభించింది. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన పంపుకాడి నాగయ్య గల్లంతై మూడు రోజులైనా జాడ దొరకలేదు. రైలు పట్టాల ధ్వంసానికి కబ్జాలే కారణంభారీ వర్షాలతో రామేశ్వర్‌పల్లి–తలమడ్ల రైల్వేస్టేషన్ల మధ్య 528 మైలురాయి వద్ద 50 మీటర్ల పొడవున ట్రాక్ కింద మట్టి కొట్టుకపోయి పట్టాలు గాల్లో తేలడానికి చెరువు అలుగు కాలువ ఆక్రమణలే కారణమని తెలుస్తోంది.గణపతి విగ్రహం కోసం వచ్చి చిక్కుకుపోయిన చిన్నారులుకామారెడ్డి జిల్లా లింగంపల్లికలాన్ గ్రామానికి చెందిన సుమారు పది మంది చిన్నారులు బుధవారం గణపతి విగ్రహాన్ని కొనుగోలు చేసేందుకు మెదక్‌కు వచ్చారు. అయితే రెండు జిల్లాల మధ్య ప్రవహిస్తోన్న మంజీరా నది పోచారం డ్యామ్‌పై నుంచి ఉప్పొంగి ప్రవహించడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.దీంతో వారంతా రెండు రోజులుగా మెదక్‌లోనే ఉండిపోయారు. దీంతో శుక్రవారం ఉదయం ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌తో వారిని ఎల్లారెడ్డి వైపు తరలించేందుకు యత్నించారు. అయితే వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ప్రయత్నాన్ని విరమించుకున్నారు. చిన్నారులను మెదక్‌లోని పునరావాస శిబిరాలకు తరలించారు. -
హిమాలయాల పెను హెచ్చరిక
ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ జిల్లాలో ఆగస్టు 5న వరుణుడు విలయ తాండవం చేశాడు. ఈ తీవ్ర అవపాతం హార్షిల్ దగ్గరలోని ధరాలీ, హార్షిల్ లోని సైనిక స్థావరం వద్ద ఆకస్మిక వరదలను సృష్టించింది. భారీ వర్షంతోపాటు మేఘ విస్ఫోటనం చోటుచేసుకుందని చెబుతున్నారు. అతి స్వల్ప కాలంలో అపారమైన వృష్టిని మేఘ విస్ఫోటనం అంటున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో ఈ రకమైన పరి ణామం ఇదే మొదటిది కాదు. ‘హిందూ కుశ్ హిమాలయ’ (హెచ్‌కెహెచ్) ప్రాంతం ఇప్పటికే అనేక వైపరీత్యాలను చవిచూసింది. నేపాల్ లిమి కోనలోని టిల్ గ్రామంపై మే 15న వినాశకర మైన వరద విరుచుకుపడింది. తర్వాత, హిమానీ సరస్సు ఉన్న జలాశయ ఆనకట్ట తెగి రసువా–భోటేకోశీ నది ఆయకట్టును జూలై 8న వరద ముంచెత్తింది. జమ్ము–కశ్మీర్ లోని కిస్త్వార్ జిల్లాలో ఆగస్టు 14న తీవ్ర ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. చినాబ్ నది ఆరగాణి పొడవునా మొత్తం గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వంతెనలు, రోడ్లు, జల విద్యుదు త్పాదన కేంద్రాల విభాగాలు కొట్టుకుపోవడంతో అనేక మంది నిరా శ్రయులయ్యారు. వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళే దారిలో , ఆగస్టు 26న వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడటంతో ఐదుగురు చని పోయారు. అక్కడ కొండవాలు ప్రాంతాలు బలహీనంగా ఉన్నాయి. వాటికి తీవ్ర వృష్టి తోడవుతోంది. వరదలకు లోనుకాగల సానువుల్లో మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. జల బాంబులుఈ దుర్ఘటనలన్నీ, రకరకాల ఆపదల రాకను సమగ్రంగామదింపు చేసే (ఎంహెచ్ఆర్ఏ) వ్యవస్థ అవసరాన్ని మరోసారి చాటుతున్నాయి. అక్కడక్కడ విడి విడిగా ప్రమాదాలకు ఉన్న అవకాశాలనే కాకుండా , వాటి మధ్యన ఉండగల సంక్లిష్ట పరస్పర క్రియలను పరిశీలించేదిగా ఆ ప్రణాళిక ఉండాలి. అధిక వర్షపాతం కొండ చరియలు విరిగిపడటానికి, తదనంతరం, హిమానీ సరస్సు లకు గండిపడటానికీ దారితీస్తోంది. నీరు గడ్డకట్టిన ప్రాంతాలు, హిమం కరుగుతున్నాయి. ఈ జల ప్రవాహాలన్నీ కలసి లోయల్లో అస్థిరతను మరింత ఉద్ధృతం చేస్తున్నాయి. హిందూ కుశ్ హిమానీ నదాలు ఆందోళనకరమైన వేగాలతో తగ్గుతున్నాయి. ఇవి కరుగు తున్న వేగం, హిందూ కుశ్ నదుల ప్రవాహ వేగాల గతులను మార్చే స్తోంది. ఇవి ‘క్రయోస్పియర్ టైమ్ బాంబులు’గా తయారవు తున్నాయి.సిక్కింలో 2023 అక్టోబర్ 3న సంభవించిన విపత్తు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇది హిమానీ సరస్సుకు గండిపడటంతో వచ్చిన వరద బీభత్సమే కాదు. ఒక పరిణామం మరో పరిణామా నికి పురిగొల్పే సంక్లిష్టమైన ఉపద్రవం. ఒక పెద్ద హిమఖండం దక్షిణ లోనక్ సరస్సులోకి వచ్చిపడటంతో ఆ గొలుసు కట్టు ప్రక్రియ మొదలైంది. హిందూ కుశ్లో ఉపేక్షిస్తూ వచ్చిన జల ఘనీభవన స్థానాల కీలక పాత్రను అది తేటతెల్లం చేసింది. ఆర్కిటిక్ప్రాంతంలో శాశ్వత ఐసు గడ్డల గురించి విస్తృతమైన అధ్యయనాలు సాగాయి. హిందూ కుశ్ ప్రాంతంలో హిమ ఖండాలు కరగడంపై ఇటీవలి కాలంలో మాత్రమే దృష్టి సారించారు. హిమ ఖండాలు కరిగితే లోయలు అస్థిరమవుతాయి. అది కొండ చరియలు విరిగి పడటానికి కారణమవుతుంది. భూకంపాలకు హెచ్చరించినట్టుగానే...ఏయేటి కాయేడు, పర్వత ప్రాంతాల్లో పెరుగుతున్న సంక్లిష్ట ఉపద్రవాల ద్వారా ప్రకృతి మనకు తరచూ హెచ్చరికలు పంపుతోంది. ఈ పరిణామాలను ప్రభావితం చేయగలిగిన నమూనాలు లేకపోలేదు. కానీ, వాటి కచ్చితత్వం పూర్తిగా ‘ఇన్ పుట్ డేటా క్వాలిటీ’పై ఆధారపడి ఉంటుంది. ప్రమాదాలను ముందే పసిగట్టి హెచ్చరికలు జారీ చేసేందుకు, ఆపదలను తగ్గించుకునే వ్యూహాల రూపకల్పనకు మనం ఎత్తయిన ప్రదేశాలలో క్షేత్రస్థాయి డేటా సమీకరణ చేపట్టాలి. అందుకు అత్యవసరంగా మరిన్ని నిధులను వెచ్చించవలసిన అవసరం ఉంది. గ్లేసియర్ ద్రవ్య రాశి సమతౌల్య కొలతలను నమోదు చేసుకోవాలి. వాతావరణ పరిశోధన శాఖ రికార్డులను పదిలపరచుకుని పరిస్థితులను బేరీజు వేసుకోవాలి. సరస్సుల పరిమాణాలను కచ్చితత్వంతో అంచనా వేసేందుకు సమగ్ర బాతీమెట్రిక్ సర్వేలు నిర్వహించుకోవాలి.గ్లేసియర్ సంబంధిత వైపరీత్యాలు చెదురుమదురుగా ఉండటం అరుదు. అవి ఒకదానివెంట ఒకటి సంభవిస్తుంటాయి, సరిహద్దు లకు అతీతమైనవిగా తరచూ ఉంటాయి. ఎక్కడ వైపరీత్యం సంభ వించినా దాని చుట్టుపక్కల దేశాలన్నీ కష్టనష్టాలను అనుభవించక తప్పదు. కనుక, పటిష్టమైన ప్రాంతీయ సహకారం అనివార్యం. ప్రజలు లేదా మౌలిక వసతులపై ప్రభావం చూపినప్పుడు ప్రమాదం సైతం పెను ఉపద్రవంగా మారుతుంది. కనుక, జనావాస ప్రాంతాల ప్రణాళికలు, మౌలిక వసతుల అభివృద్ధి శాస్త్రీయ విజ్ఞానంతో కూడుకున్నవై ఉండాలి. ముఖ్యంగా, ఎప్పుడుఎలాంటి జలవాయు పరివర్తనాలు చోటుచేసుకుంటాయో తెలియని హిందూ కుశ్ పర్యావరణాలలో వాటి అవసరం మరింత ఉంది. వైజ్ఞానిక మదింపులను ఆధారం చేసుకున్న ఆచరణ యోగ్యమైన విధానాలను మనం తు.చ. తప్పకుండా అమలు చేయాలి. క్రయోస్పియర్ ప్రమాదకర మండలాల పటాన్ని తయారు చేయడం ఆ దిశగా వేసే ముఖ్యమైన అడుగు కావచ్చు. భూకంపాలు, కొండ చరియలు విరిగిపడటం సంభవించగల ప్రాంతాలను గుర్తించే పటం మాదిరిగానే దాన్నీ రూపొందించుకోవచ్చు. ఎత్తైన ప్రాంతాల్లోనూ, గడ్డ కట్టిన సరస్సులు ఉన్న చోట్ల ఎక్కడెక్కడ ఎలా అభివృద్ధి చేయవచ్చో ఆ మ్యాప్ మార్గం చూపుతుంది. ముఖ్యంగా ప్రవాహ దిగువ ప్రాంతాల్లో ప్రజలు ఉన్న చోట్ల, లేదా కీలకమైన మౌలిక వసతులు ఉన్నచోట ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. చివరగా, హై–రిస్క్ మండలాల్లో ఆదిలోనే హెచ్చరించగల వ్యవస్థలను నియోగించుకోవాలి. శిక్షణ ఇవ్వడం, మాక్ డ్రిల్స్ నిర్వహించడం ద్వారా ప్రజలను సన్నద్ధులను చేసే కార్యక్రమాన్ని పటిష్ఠపరచుకోవాలి. కొద్ది నిమిషాల ముందు హెచ్చరించినా ప్రాణాలను కాపాడుకునేందుకు ఎంతో అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.– మహమ్మద్ ఫారూక్ ఆజమ్ ‘ గ్లేసియాలజీ, హైడ్రాలజీ ప్రొఫెసర్, ఐఐటీ, ఇందౌర్– శాశ్వతా సన్యాల్ ‘ ఇంటర్వెన్షన్ మేనేజర్, ఐసీఐఎంఓడీ(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
బిగ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
-
కామారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం (ఫొటోలు)
-
ఏపీకి వాన గండం.. వారం రోజులు భారీ వర్షాలు
-
తెలంగాణలో జల విలయం... కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి... భారీ వర్షాలతో మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల తదితర జిల్లాలు అతలాకుతలం
-
రోడ్లను ముంచెత్తిన వరద.. వాహనదారులకు గండం
-
సముద్రం కాదహే! కుండపోతతో మునిగిన కామారెడ్డి రోడ్లను చూశారా? (చిత్రాలు)
-
భారీ వర్షాలకు కామారెడ్డి అతలాకుతలం
-
జేసీబీ, ట్రాక్టర్ సహాయంతో అంత్యక్రియలు
సాక్షి, మెదక్: కనీవినీ ఎరుగని రీతిలో మెతుకుసీమ చరిత్రలో లేనంతగా వరుణుడు వణికించేస్తున్నాడు. ఇప్పటికే పలు గ్రామాలు, తండాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఫ్లాష్‌ఫ్లడ్స్ హెచ్చరికల నేపథ్యంలో నీటి ఉపద్రవం తమను ముంచెత్తుతుందో అని జనాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. భారీ వర్షాలతో మెదక్ ప్రజల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రేగోడ్ (మం) మర్పల్లి గ్రామంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. అంత్యక్రియల కోసం ఓ కుటుంబం, గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. గొల్ల వాగు వరద నీటి ప్రవాహా ఉదృతితో జేసీబీ, ట్రాక్టర్ సహాయంతో అంత్యక్రియలు నిర్వహించారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.గత రెండు రోజులుగా మెదక్ జిల్లాలో తీవ్రమైన వర్షాలు నమోదయ్యాయి. గజ్వేల్, నారాయణఖేడ్, సిద్దిపేట ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రోడ్లు దెబ్బ తినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరి, మక్క, కందుల పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు.. రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటించి నష్టం అంచనా వేస్తున్నారు. రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని జాగ్రత్తలు చెబుతోంది. -
కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వరదలు
-
తెలంగాణపై వరుణుడి ఉగ్రరూపం
-
వరద ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఎరియల్ సర్వే
Heavy Rain Updates..వరద ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఎరియల్ సర్వేశ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన సీఎం రేవంత్ సీఎంతో పాటు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు గోదావరి జలాలు గుండె కాయఘోష్ నివేదికపై అసెంబ్లీ చర్చకు పెట్టాం మామ అల్లుడు ఎన్ని కుట్రలు చేసినా.. చేసిన పాపాలు పోవుకాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపుతే గ్రామాలు కొట్టుకపోతాయిమేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్ట్‌లో లోపాలు ఉన్నాయికాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో సాంకేతిక వైఫల్యం ఉంది.డిజైన్లు, నిర్మాణం, నిర్వహణ లోపం ఉందిఏరియల్ సర్వేకు బయల్దేరిన సీఎం రేవంత్రెడ్డికాసేపట్లో కామారెడ్డి,మెదక్ జిల్లా సీఎం రేవంత్‌రెడ్డి ఏరియల్ సర్వేసీఎం రేవంత్‌తో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి,మహేష్ గౌడ్ వరద ప్రభావిత పప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్న సీఎం రేవంత్ ముందుగా ఎల్లంపల్లి సీఎం రేవంత్ ఏరియల్ సర్వే ఆ తర్వాత మెదక్‌కు వెళ్లనున్న తెలంగాణ సీఎం అనంతరం కామారెడ్డిలో వరదలతపై అధికారులతో సమీక్ష చేయనున్న సీఎంవర్షాల ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు..భారీ వర్షాలు, వరదలతో పలు రైళ్లు రద్దుకామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో పలు రైళ్లు రద్దుకొన్ని దారి మళ్లింపు, మరికొన్ని పాక్షికంగా రద్దు36 రైళ్లు రద్దు, 25 రైళ్లు దారి మళ్లింపు, పాక్షికంగా 14 రైళ్లు రద్దు వివరాలు వెల్లడించిన దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ Helpline Numbers provided at Kacheguda, Nizamabad, Kamareddi, Secunderabad Railway Stations in view of heavy trains for information on train operationsKacheguda - 9063318082NZB - 9703296714KMC - 9281035664SC - 040 277 86170@drmsecunderabad @drmhyb #HeavyRains #Telangana— South Central Railway (@SCRailwayIndia) August 28, 2025రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం: ఐఎండీరేపటి వరకు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు..ఇవాళ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ.నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ.హైదరాబాద్ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. డీజీపీ జితేందర్ కామెంట్స్.వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు ఫోర్స్ అప్రమత్తంగా ఉంది.24 గంటలుగా పోలీసు ఫోర్స్ రెస్య్కూ ఆపరేషన్లు చేస్తూనే ఉంది.బోట్స్, లైఫ్ జాకెట్లతో చాలా మందిని రక్షించగలిగాం.ఇప్పటి వరకు 1200 మందిని కాపాడాం.కామారెడ్డి, నిర్మల్, మెదక్, రామాయంపేటలో వరద తగ్గిందికంట్రోల్ రూమ్ నుంచి వరదలపై 24 గంటలు మానిటరింగ్ చేస్తున్నాం.కామారెడ్డిలో చాలా మందిని కాపాడగలిగాం.సకాలంలో ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ స్పాట్‌కి చేరుకోవడంతో ముప్పు తప్పింది.ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, ైఫైర్ సిబ్బంది కలిసి ెరెస్య్కూ ఆపరేషన్ చేశాం.అన్ని ప్రాంతాల్లో పోలీసు ఫోర్స్ అప్రమత్తంగా ఉంది.జాతీయ రహదారి-44పై ట్రాఫిక్ మళ్లింపుట్రాఫిక్ జామ్ నేపథ్యంలో పోలీసుల సూచనలు.. తెలంగాణలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న NH-44 నాగ్‌పూర్ హైవే..ప్రజల భద్రత కోసం ట్రాఫిక్ డైవర్షన్ అమలు..హెవీ వెహికిల్స్ డైవర్షన్ ఇలా..హైదరాబాద్-ఆదిలాబాద్ వెళ్తున్న లారీలు మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద మళ్లింపు.మేడ్చల్-సిద్ధిపేట-కరీంనగర్-జగిత్యాల-కోరుట్ల-మెట్పల్లి-ఆర్మూర్-ఆదిలాబాద్ వెళ్ళాలిలైట్ వెహికిల్స్ డైవర్షన్ ఇలా..హైదరాబాద్-ఆదిలాబాద్ వెళ్తున్న కార్లు తూప్రాన్ వద్ద మళ్లింపు.మేడ్చల్-తూప్రాన్-సిద్ధిపేట-కరీంనగర్-జగిత్యాల-కోరుట్ల-మెట్పల్లి-ఆర్మూర్-ఆదిలాబాద్కామారెడ్డి-డిచ్పల్లి-ఆర్మూర్ మధ్య రహదారి వర్షంతో ప్రభావితం అయ్యింది..ఆదిలాబాద్ వెళ్లే ప్రయాణికులు ముందుగానే ప్రణాళిక చేసుకోవాలి: పోలీసులుహెవీ వెహికిల్స్ తప్పనిసరిగా డైవర్షన్ మార్గం పాటించాలి.ట్రాఫిక్ పోలీసులు, హైవే పెట్రోల్ సిబ్బంది డైవర్షన్స్ చూపుతారు. 🚦 TRAFFIC ADVISORY – NH44 (Nagpur Highway) 🚦Due to heavy rains and road damage on NH44, traffic diversions are in effect to ensure safety and smooth movement.📍 Diversion for Heavy VehiclesFrom Hyderabad → Adilabad (NH44), traffic will be diverted at Medchal Checkpost.… pic.twitter.com/KseVIcc9X6— Cyberabad Traffic Police (@CYBTRAFFIC) August 28, 2025రానున్న మూడు గంటల్లో భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక @balaji25_t Kamareddy present situation. At. Pedda cheruvu. Totally destroyed. #Kamareddy @Collector_KMR @revanth_anumula . Situation may. Get worse. Due. Upcoming. Rains and flooding.. so .. Take. Responsibility all Departments @TelanganaCMO @TelanganaCOPs pic.twitter.com/wJqtqLMOSF— KALKI .& SALAAR. ✨ (@MRSANJUYT1) August 28, 2025సిరిసిల్ల, కామారెడ్డిలో కేటీఆర్ పర్యటనబీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్భారీ వర్షాలు, వరదలపై కేటీఆర్ తీవ్ర ఆందోళనకార్యకర్త నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరూ సహాయ చర్యల్లో పాల్గొనాలివర్షాల వల్ల నష్టపోయిన వారికి తక్షణ సహాయం అందించాలితీవ్రమైన వరద ఉన్నచోట ఆహారం, తాగునీరు అందించాలిఅవసరమైతే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలిపారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి, వ్యాధులు ప్రబలకుండా చూడాలసిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్న కేటీఆర్వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో పర్యటనముందుగా సిరిసిల్ల జిల్లా నర్మలలో పర్యటించనున్న కేటీఆర్నర్మల పర్యటన తర్వాత కామారెడ్డికి రాక.Due to ongoing Massive rains, many parts of kamareddy district under flash floods, below 👇visuals of #Kamareddy to #Hyderabad route#KamareddyFloods #KamareddyRains pic.twitter.com/Uta0EdVzja— Eastcoast Weatherman (@eastcoastrains) August 28, 2025కామారెడ్డి పర్యటనకు బయల్దేరిన మంత్రి సీతక్క, షబ్బీర్ అలీభారీ వర్షాలు దృష్ట్యా కామారెడ్డిలో పరిస్థితిని పరిశీలించనున్న సీతక్కవరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించనున్న మంత్రి సీతక్కప్రజలకు అందుతున్న అత్యవసర సేవలపై సమీక్ష పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలుకొణిజర్లలో పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలుఖమ్మం జిల్లాలో పొంగుతున్న వాగులు..కొణిజర్ల మండలంలో నమోదై 120 మిల్లీమీటర్ల వర్షపాతంమండలంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పగిడేరు, నిమ్మ వాగు, జన్నారం ఏరు, రాళ్లవాగుపగిడేరు ఉద్ధృతితో నిలిచిన రాకపోకలుభువనగిరి భారీ వాహనాల రాకపోకలకు అనుమతిభువనగిరి చిట్యాల మార్గంలో నాగిరెడ్డిపల్లి వద్ద కల్వర్టుపై నుంచి ఉద్ధృతంగా సాగుతున్న వరద ప్రవాహంబుధవారం నిలిపివేసిన వాహనాల రాకపోకలుప్రవాహం తగ్గడంతో గురువారం ఉదయం నుంచి అనుమతించిన భారీ వాహనాల రాకపోకలు ఇళ్లు ఖాళీ చేస్తున్న ప్రజలుకామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో వచ్చిన వరదల వల్ల ఇళ్లు ఖాళీ చేస్తున్న ప్రజలుఇళ్లు ఖాళీ చేస్తున్న డోంగ్లి మండలంలోని సిర్పూర్, పెద్దటాక్లీ గ్రామాల ప్రజలుమద్నూర్ మండలం మీర్జాపూర్‌లోని ఆలయంలో తలదాచుకుంటున్న వృద్ధులు, చిన్నారులుపొరుగు గ్రామంలోని బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్న సిర్పూర్ గ్రామస్థులుడోంగ్లికి వెళ్లిపోయిన పెద్దటాక్లీలోని కొన్ని కుటుంబాలుజలదిగ్బంధంలో పిట్ల మండలం కుర్తి గ్రామంనిజాంసాగర్, కౌలాస్‌నాలా జలాశయం గేట్లు ఎత్తి నీటి విడుదలనీటి విడుదలతో ఆందోళనలో ముంపు గ్రామాల ప్రజలుమాజీ మంత్రి హరీష్ పర్యటన..మెదక్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో హరీష్‌రావు పర్యటనబూరుగుపల్లిలో తెగిపోయిన రహదారిని పరిశీలించిన హరీష్స్థానికులతో మాట్లాడిన మాజీ మంత్రిరాజాపేట, ధూప్సింగ్తండా వాసులను పరామర్శించిన హరీష్‌రావు బృందంనిన్నటి నుంచి జల దిగ్బంధంలో ఉన్న ధూప్సింగ్తండా సీఎం రేవంత్ ఏరియల్ సర్వే వాయిదా.. సీఎం ఏరియల్ సర్వేకు వర్షం అడ్డంకి.. వాతావరణం అనుకూలించకపోవడంతో ఏరియల్ సర్వే వాయిదావర్షాలపై సీఎం సమీక్ష..రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్కతో సమావేశమైన సీఎం.వరద ప్రభావిత జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేయటంతో పాటు తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలపై సమీక్షఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు20 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలుబిక్కనూర్ టోల్‌ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలుబిక్కనూర్ టోల్‌ప్లాజా నుంచి కామారెడ్డి వరకు భారీగా ట్రాఫిక్ జామ్సుమారు 20 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలువాహనాలు భారీగా నిలవడంతో వాహనదారుల ఆందోళనమంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు..భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.నేడు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో హెలికాప్టర్‌ను అందుబాటులో ఉంచాం..నిరాశ్రయులైన ప్రజల కోసం ఆహారం, ఇతర వస్తువులు అందుబాటులో ఉంచాం..ఏరియల్ సర్వే ద్వారా పరిస్థితిని సీఎం సమీక్షిస్తారు.కామారెడ్డి జిల్లా అధికారులతో సమీక్ష చేస్తా.సాయంత్రం వరకు పంట, ప్రాణ, ఆస్తి నష్టంపై నివేదిక వస్తుంది. భారీ వర్షాలపై కేసీఆర్ ఆందోళన..భారీ వర్షాలు, వరదలతో రాష్ట్ర ప్రజలకు ఇబ్బందుల పట్ల మాజీ సీఎం కేసీఆర్ ఆందోళనవరద ప్రభావిత ప్రాంతాల పార్టీ నేతలతో మాట్లాడిన కేసీఆర్తమ వంతుగా పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టేలా చూడాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆదేశంతెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్.. 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలుభద్రాద్రి, భూపాలపల్లి, ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్, నిర్మల్, కొమురంభీం,నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేశారు.ఈ ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలు, ఉరుములు, మెరుపులు వర్షాలు..తెలంగాణలో మొత్తం 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ11 జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం SEVERE RAINFALL WARNING ⚠️🌧️ NEXT 6HOURS FORECAST ⚠️ VERY HEAVY DOWNPOURS to continue in Kamareddy, Nizamabad, Nirmal, Jagitial. FLASH FLOOD WARNING for these districts ⚠️⚠️⚠️ HEAVY DOWNPOURS to continue in Karimnagar, Sircilla, Peddapalli, Adilabad, Asifabad Medak, Mulugu.…— Telangana Weatherman (@balaji25_t) August 28, 2025 వర్షాల ఎఫెక్ట్.. 11 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులుతాజాగా నల్లగొండ, యాదాద్రి, కరీంనగర్, సిద్దిపేట్ల, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో విద్యాసంస్థలు బంద్ఇప్పటికే కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ఇచ్చిన అధికారులు.కరీంనగర్, జగిత్యాల జిల్లాలోని అన్ని పాఠశాలకు సెలవుకరీంనగర్, జగిత్యాల జిల్లాలోని అన్ని పాఠశాలకు ఇవాళ సెలవుభారీ వర్షాల దృష్ట్యా సెలవు ప్రకటించిన జిల్లా విద్యాధికారులుNH-44 turns into a nightmare!20 KM traffic jam in #Kamareddy as heavy flooding brings vehicles to a standstill. #Telangana #NH44 pic.twitter.com/atBXc2bhuI— Mubashir.Khurram (@infomubashir) August 28, 2025 NH-44పై భారీగా ట్రాఫిక్ జామ్.. ఆదిలాబాద్ జిల్లా : భారీ వర్షాల దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవుఅత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దని కలెక్టర్ సూచనరాత్రి నుంచి ఏకధాటి వర్షానికి జలమయమైన లోతట్టు ప్రాంతాలుఆదిలాబాద్ జిల్లా: వర్ష బీభత్సానికి విరిగిపడిన చెట్లు, తెగిన విద్యుత్ తీగలుభీంపూర్, తాంసి మండల్లోని 50 గ్రామాలకు రాత్రి నుంచి నిలిచిన విద్యుత్ సరఫరాఎన్హెచ్-44పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లారీలు, వాహనాలు కిలోమీటర్ల మేర్ల బారులు తీరాయి. TELANGANA & HYDERABAD Update | 28 AUG 8AM ⚠️🔴 SEVERE DOWNPOURS Alert for Kamareddy, Medak, Sircilla, Karimnagar, Jagitial, Nizamabad, Nirmal, and Khammam districts.Peak LPA Effect is going on now in the above-mentioned districts. The LPA impact is likely to end tonight…— Hyderabad Rains (@Hyderabadrains) August 28, 2025 పెరుగుతున్న గోదావరి నీటిమట్టంభద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టంఉదయం 8 గంటలకు 34.9 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం #Kamareddy జిల్లాలోని సరంపల్లి గ్రామం దేవునిపల్లి పోలీస్ స్టేషన్ ఏరియాల లోని ST రెసిడెన్షియల్ విద్యార్థులు (300) జలదిగ్బంధంలో ఉన్న విషయం తెలుసుకొని వారిని కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. @TelanganaCOPs @TelanganaDGP @TelanganaCMO @Collector_KMR pic.twitter.com/hnAsa0E75Q— SP Kamareddy (@sp_kamareddy) August 27, 2025మానేరు ఉగ్రరూపం.. మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో మానేరు ఉగ్రరూపంఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలుతెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రజల అవస్థలుమెదక్, కామారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో మానేరు ఉగ్రరూపంపాల్వంచ వాగు, కూడవెల్లి వాగుల నుంచి మానేరులోకి భారీగా వరదరాజన్నసిరిసిల్ల జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మానేరువాగునిండుకుండను తలపిస్తున్న నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు జలాశయంఎగువ మానేరు జలాశయం నుంచి దిగువకు వరద విడుదలమానేరు ఉగ్రరూపంతో మిడ్ మానేరులోకి భారీగా వరద నీరువచ్చే 2 గంటల్లో కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం,మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్, పెద్దపల్లిలో భారీ వర్షాలువచ్చే 2 గంటల్లో సిద్దిపేట, మెదక్, జనగాం, యాదాద్రి, మంచిర్యాలలో మోస్తరు వర్షాలువరంగల్ అతలాకుతలం.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలుఉమ్మడి వరంగల్ జిల్లాలో పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలుములుగు జిల్లా తాడ్వాయిలో 15 సెం.మీ వర్షపాతంవెంకటాపూర్లో 12 సెం.మీ., గోవిందరావుపేటలో 11 సెం.మీ. వర్షపాతంములుగు జిల్లా: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న జంపన్నవాగుమేడారం వద్ద బ్రిడ్జి ఆనుకుని పారుతున్న జంపన్నవాగుపసర నుంచి తాడ్వాయి మధ్యలో ఉన్న జలగలంచ వాగు ఉద్ధృతిపసర నుంచి తాడ్వాయి మధ్య వాహనాల రాకపోకల నిషేధంజలగలంచ వాగు ఉద్ధృతితో ప్రజలను పునరావాస కేంద్రానికి తరలింపుహనుమకొండ జిల్లాలో అలుగుపారుతోన్న కటాక్షపూర్ చెరువు వర్షాల ఎఫెక్ట్.. రైళ్లు రద్దు..భారీ వర్షాల వల్ల పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వేరాష్ట్రంలో భారీ వర్షాల వల్ల పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వేభారీ వర్షాల కారణంగా పలు రైళ్ల మళ్లింపు, రద్దు, పాక్షిక రద్దుభారీ వర్షం కారణంగా పట్టాలపై నుంచి ప్రవహిస్తున్న వరదవరద దృష్ట్యా రైళ్ల దారి మళ్లింపు సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారంఇవాళ నడవాల్సిన అకోల- అకోట, కాచిగూడ- నాగర్సోల్ రైళ్లు రద్దుఇవాళ నడవాల్సిన కాచిగూడ - కరీంనగర్, హెచ్.ఎస్ నాందేడ్ - మేడ్చల్ రైళ్లు రద్దుహైదరాబాద్-కామారెడ్డి మధ్య నిలిచిన పలు రైళ్ల రాకపోకలుభిక్కనూరు-తలమడ్ల స్టేషన్ల మధ్య పట్టాలపై చేరిన వర్షపు నీరుఅక్కన్నపేట్-మెదక్ స్టేషన్ల మధ్య పట్టాలపై చేరిన వర్షపు నీరుకరీంనగర్- కాచిగూడ, మెదక్- కాచిగూడ, బోధన్- కాచిగూడ రైళ్లు రద్దుకాచిగూడ-మెదక్, నిజామాబాద్- తిరుపతి, ఆదిలాబాద్- తిరుపతి రైళ్లు రద్దురేపటి కాచిగూడ - నర్కేర్ సర్వీస్‌ను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వేగజ్వేల్ - లక్డారం రైలు పట్టాలపై భారీగా ప్రహిస్తున్న వరద నీరుఇవాళ, రేపు మల్కాజిగిరి- సిద్దిపేట సర్వీసు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వేప్రయాణికుల కోసం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వేకాచిగూడ స్టేషన్లో 9063318082 నంబర్ ఏర్పాటుసికింద్రాబాద్ స్టేషన్లో 040- 27786170 నంబర్ ఏర్పాటునిజామాబాద్ స్టేషన్లో 970329671 నంబర్ ఏర్పాటుకామారెడ్డి స్టేషన్లో 9281035664 నంబర్ ఏర్పాటుBulletin No.6 Cancellation/Diversions/Partial Cancellations of Trains due to heavy rains @drmhyb @drmsecunderabad @drmned pic.twitter.com/EIVsmpA2lU— South Central Railway (@SCRailwayIndia) August 27, 2025 వర్షాల రెడ్ అలర్ట్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలుఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అప్రమత్తమైన అధికారులుఆదిలాబాద్: ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షంఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం జిల్లాల్లో పాఠశాలలకు సెలవుకడెం ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలుకడెం ప్రాజెక్ట్ నాలుగు గేట్లు ఎత్తి 20వేల క్యూసెక్కుల నీరు విడుదల అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. ఎకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లోని పలు గ్రామాలు నీటి మునిగాయి. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో గురువారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. మరోవైపు భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణ వర్సిటీ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా పడ్డాయి. శుక్రవారం యథాతథంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వీసీ యాదగిరిరావు పేర్కొన్నారు.ఇక, కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా 43.1 సెం.మీ వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా అక్కాపూర్‌లో 32.3 సెం.మీ, మెదక్ జిల్లా సర్దానలో 30.2 సెం.మీ, కామారెడ్డి పట్టణంలో 28.9 సెం.మీ, కామారెడ్డి జిల్లా భిక్నూర్లో 27.9 సెం.మీ, నిర్మల్ జిల్లా వడ్యాల్లో 27.9 సెం.మీ, కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో 27.5 సెం.మీ, మెదక్‌జిల్లా నాగాపూర్ గ్రామంలో 26.6 సెం.మీ, కామారెడ్డి జిల్లా పాత రాజంపేటలో 24.6 సెం.మీ, లింగంపేటలో 22.5 సెం.మీ, దోమకొండలో 20.2 సెం.మీ, నిర్మల్ జిల్లా విశ్వనాథ్‌పేట్‌లో 24.1 సెం.మీ, ముజిగిలో 23.1 సెం.మీ, మెదక్ జిల్లా చేగుంటలో 20.2 సెం.మీల వర్షం పాతం నమోదైంది. -
నేడు వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వానలకు జన జీవనం అస్తవ్యస్తమైంది. ఇళ్లలోకి వరద నీరు చేరింది. పంటలకు తీవ్ర నష్టం కలిగింది. మరోవైపు.. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నేడు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు ఏరియల్ సర్వే ద్వారా మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ , నిర్మల్, సిరిసిల్ల జిల్లాలను సీఎం పరిశీలించనున్నారు. ఇక, కామారెడ్డిలో ముంపు ప్రాంతాల పరిశీలనకు ఇంఛార్జి మంత్రి సీతక్క, పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు. -
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు... 8 జిల్లాలకు ఆరెంజ్, 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్... కామారెడ్డి జిల్లాలో రైలు, రోడ్డు మార్గాలు మూసివేత
-
కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వరదలు
-
Andhra Pradesh: నేడు రాష్ట్రానికి భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. బుధవారం అర్థరాత్రి లేదా గురువారం తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. మరోవైపు..వాయువ్య బంగాళాఖాతంలో రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.అనకాపల్లి జిల్లా సాలపువానిపాలెంలో 6 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళంలో 5.8, విశాఖ జిల్లా నాతయ్యపాలెం, అనకాపల్లి జిల్లా గంధవరం, లంకెలపాలెంలో 5. 5, విజయనగరం అర్బన్‌లో 5.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారి జలదిగ్భంధమవ్వడంతో రాకపోకలు స్తంభించాయి. శ్రీకాకుళం, విశాఖ, మన్యం జిల్లాల్లో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేకచోట్ల 130–150 మి.మీ వర్షపాతం నమోదైంది.ఈ భారీ వర్షాలు బుధవారం ఉదయం వరకూ కొనసాగే అవకాశం ఉందనీ.. తర్వాత ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏలూరు,అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారి స్టెల్లా తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో సాయంత్రం వరకూ తేలికపాటి వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా మారి తీరం వెంబడి గంటకు 40–50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయనీ ,28వ తేదీ వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. మొద్దు నిద్రలో ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అల్పపీడనం ప్రభావంపై వాతావరణశాఖ వారం ముందుగానే హెచ్చరించినా.. ఏపీ విపత్తుల నిర్వహణ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. విశాఖలోని డాప్లర్ వెదర్ రాడార్ పనితీరు మందగించింది. గతంలో ప్రతి 10 నిమిషాలకోసారి అప్డేట్స్ అందించే రాడార్ ఇప్పుడు గంటకోసారి సమాచారం ఇస్తున్నా అధికారులు సరిచేయలేదు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీఎస్డీపీఎస్.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్ రెండు రోజులుగా మూగబోయింది. భారీ వర్షాలు, పిడుగులు పడిన తర్వాత మొబైల్స్‌కు ఎస్ఎంఎస్లు వస్తుండడం గమనార్హం. -
దేశ ఆర్థిక రాజధాని ముంచెత్తిన వర్షాలు
-
ముంబైలో భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం (ఫొటోలు)
-
AP Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక
-
తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షం
-
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
-
భారీ వర్షం విశాఖపట్నం విలవిల (ఫొటోలు)
-
ఏపీకి మరో మూడు రోజులు భారీ వర్ష సూచన
-
నేడు..రేపు భారీ వర్షాలు
-
ఒక్క వానకే మునిగిన బాబు విజన్ అమరావతి
-
హైదరాబాద్ లో హై అలర్ట్.. బయటకు రావద్దంటూ హెచ్చరిక
-
తెలుగు రాష్ట్రాలకు రైన్ అలర్ట్
-
ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరద ఉద్ధృతి (ఫొటోలు)
-
పూర్తిగా నీట మునిగిన అమరావతి
-
భారీ వర్షాలు ..వరద ముంపులో రాజధాని అమరావతి (ఫొటోలు)
-
Hyderabad: మరో 3 రోజులు భారీ వర్షాలు
-
ఏపీకి రాబోయే 4 రోజులు భారీ వర్ష సూచన
-
భారీ వర్షాలు.. తెలంగాణలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్
-
ఏపీలో 4 రోజులు భారీ వర్షాలు
-
వరంగల్- హన్మకొండను ముంచెత్తిన వరద (ఫొటోలు)


