హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. నగరంలో ఆదివారం సాయంత్రం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మియాపూర్, చందానగర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, జవహార్ నగర్ ప్రాంతాల్లో వర్షం ముమ్మరంగా కురవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.


