హీరో సంతోష్ శోభన్ నటించిన తాజా చిత్రం'కపుల్ ఫ్రెండ్లీ'.
వాలంటైన్స్ డే కానుకగా ఈనెల 14న థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా ఇప్పుడు ట్రైలర్‌ని విడుదల చేశారు. లివింగ్ రిలేషన్ కాన్సెప్ట్‌తో చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
అశ్విన్ చంద్రశేఖర్ దర్శకుడు కాగా సంతోష్ శోభన్ సరసన మానస వారణాసి హీరోయిన్‌గా నటించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ దీన్ని రిలీజ్ చేయనున్నారు.


