breaking news
Trailer Launch
-
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘తెల్లకాగితం’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నాపై ఇంతటి ప్రేమని ఊహించలేదు: ఫాహద్ ఫాజిల్
‘‘తెలుగు వారి నుంచి నాకు ఇంత ప్రేమ వస్తుందని, ప్రత్యేకించి హైదరాబాద్‌లో నాపై ఇంతటి ప్రేమ దొరకుతుందనుకోలేదు. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. కార్తికేయ, శోభుగారు గొప్ప నిర్మాతలు. ఈ చిత్రం నాకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయింది. ఈ సినిమాని కుటుంబంతో కలిసి చూడండి.. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’’ అని ఫాహద్ ఫాజిల్ చెప్పారు.శశాంక్ యేలేటి దర్శకత్వంలో ఫాహద్ ఫాజిల్ హీరోగా, బేబి సారా, సౌరభ్ సచ్దేవ్ ఇతర పాత్రలుపోషించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మించిన ఈ సినిమాని అక్టోబరు 2న రిలీజ్ అవుతోంది. మంగళవారం నిర్వహించిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు శశాంక్ యేలేటి మాట్లాడుతూ– ‘‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ట్రైలర్ అందరికీ నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. మా మూవీ చాలా కొత్తగా ఉంటుంది’’ అని తెలిపారు. శోభు యార్లగడ్డ మాట్లాడుతూ– ‘‘ఫాహద్‌ని తెలుగులో హీరోగా పరిచయం చేస్తుండటం హ్యాపీ. అలాగే శశాంక్ని ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం.సారాని చూసి అందరూ సర్ప్రైజ్ అవుతారు’’ అని పేర్కొన్నారు. ‘‘శోభుగారితో ప్రయాణం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. మా సినిమాని చూసి అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అని ఎస్ఎస్ కార్తికేయ తెలిపారు. ‘‘ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో వచ్చి మా మూవీ చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు బేబి సారా. -
‘హ్యాపీ జర్నీ’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
భావోద్వేగాల కళ్యాణం కమనీయం
ఖాన్ దురాని, సాహితి ఆవంచ జంటగా రవి లోకిరెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘కళ్యాణం కమనీయం జీవితం’. పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి డైరెక్టర్ వీవీ వినాయక్, నిర్మాతలు కేఎల్ దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ అతిథులుగా హాజరయ్యారు. వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘కళ్యాణం కమనీయం జీవితం’ సినిమా చిన్నదే గానీ తీసిన వాళ్లు చిన్నవాళ్లు కాదు. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలి’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలో లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి’’ అన్నారు పైలా ప్రసాద్ రావు. ‘‘ఫ్యామిలీ అంతా చూసేలా రూపొందించిన క్లీన్ మూవీ ఇది’’ అని కిషోర్ గుండాల పేర్కొన్నారు. ‘‘యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చూసి ఎంజాయ్ చేసే చిత్రమిది’’ అని రవి లోకిరెడ్డి తెలిపారు. -
‘కాగితం పడవలు’ సినిమా టీజర్ విడుదల (ఫొటోలు)
-
'ఎపిక్' లాంటి సినిమాలు చేయడం చాలా కష్టం: రష్మిక
‘‘ఎపిక్’ ట్రైలర్ చాలా నచ్చింది. మంచి రొమాంటిక్, కామెడీ వైబ్‌లో ఉంది. ఇలాంటి సినిమాలు చేయడం చాలా కష్టం. ఈ నెల 11న మీతో (ప్రేక్షకులతో), యూనిట్‌తో కలిసి ఈ సినిమాను థియేటర్లో చూసేందుకు ఎదురు చూస్తున్నాను. ఈ నెల 10న ప్రీమియర్స్ వేస్తున్నారు... చూసి ఎంజాయ్ చేయండి’’ అని రష్మిక మందన్నా పేర్కొన్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జోడీగా నటించిన చిత్రం ‘ఎపిక్–ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. శుక్రవారం నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన హీరోయిన్ రష్మిక మందన్నా మాట్లాడుతూ– ‘‘ఎపిక్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి వస్తారా? అని ఆనంద్ మెసేజ్ చేశాడు. ‘రణబాలి’ షూట్లో హైదరాబాద్‌లో ఉన్నాను. తప్పకుండా వస్తానని, వచ్చేశాను. ఆనంద్ చాలా కష్టపడతాడు. తన సినిమాలు బాగా ఆడాలి, మంచి వసూళ్లు రావాలి. వైష్ణవి కోసం అద్భుతమైన పాత్రలు రాస్తుండటం గొప్ప విషయం. ఆదిత్య హాసన్ ఈ మూవీని అద్భుతంగా తీశారనిపిస్తోంది’’ అని తెలిపారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘వదినమ్మతో (రష్మిక) ఇంట్లో ఎక్కువగా మాట్లాడను. కానీ, ‘ఎపిక్’ ప్రమోషన్స్ గురించి నన్ను అడిగి మరీ తెలుసుకుని సపోర్ట్ చేశారు. విజయ్‌లాంటి అన్నయ్య, రష్మికలాంటి వదినమ్మ ఉన్నందుకు అదృష్టవంతుణ్ణి. ‘ఎపిక్’ భావోద్వేగమైన, అందమైన సినిమా’’ అని చెప్పారు. -
హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
క్రైమ్ థ్రిల్లర్
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్, మలయాళ నటుడు, దర్శక–నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘దయారా’. నిజ జీవిత ఘటనల ఆధారంగా దర్శకురాలు మేఘనా గుల్జార్ తెరకెక్కించారు. జంగ్లీ పిక్చర్స్, డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పణలో వినీత్ జైన్ , ధవల్ గడా నిర్మించిన ఈ మూవీ హిందీ, మలయాళ భాషల్లో ఈ నెల 18న రిలీజ్ కానుంది. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ఈ చిత్రంలో నేను పోషించిన డీసీపీ అజూనీ కోహ్లి రోల్ నా మనసులో చాలా కాలం నిలిచి΄ోతుంది’’ అని చెప్పారు కరీనా కపూర్. ‘‘మనుషుల భావోద్వేగాలకు దగ్గరగా ఉండే కథ ఇది’’ అని తెలిపారు పృథ్వీరాజ్ సుకుమారన్ . ‘‘గ్రే షేడ్స్‌తో కూడిన పాత్రలు ఉన్న ‘దయారా’ ప్రపంచంలోకి ప్రేక్షకులను ఆహ్వానించేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను’’ అని తెలిపారు మేఘనా గుల్జార్. ఈ చిత్రంలో జితేంద్ర జోషి, క్షితీ జోగ్, కన్వల్జీత్ సింగ్, సందీప్ కులకర్ణి ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
నటనకు అవకాశం ఉన్నపాత్ర చేశాను
సుమన్, సాయికుమార్, వరుణ్ సందేశ్, వితికా షేరు, నటరాజ్, రాయంచ కొక్కుర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞానప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మించారు. ఈ మూవీ పీవీఆర్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా సెప్టెంబరు 4న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో జై జ్ఞానప్రభ మాట్లాడుతూ– ‘‘పొలిటికల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ఇది. మహావీర్ మ్యూజిక్, చంద్రబోస్‌గారి సాహిత్యం మా సినిమాకు ఆకర్షణగా నిలుస్తాయి. మా సినిమా ప్రేక్షకుల్ని ఏమాత్రం నిరాశపరచదు’’ అని చెప్పారు. ‘‘మా మూవీ ఔట్పుట్ అందరికీ నచ్చేలా వచ్చింది... ప్రేక్షకాదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం’’ అని మేరుం భాస్కర్ తెలిపారు. ‘‘ఇటీవల నటనకు విరామం ఇచ్చాను. అయితే ‘ధర్మస్థల నియోజకవర్గం’లో డిఫరెంట్ క్యారెక్టర్ రావడంతో ఒప్పుకున్నాను. నటనకు మంచి స్కోప్ దక్కింది’’ అని వితికా షేరు పేర్కొన్నారు. రచయిత చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ ఏలేందర్, ఆర్ట్ డైరెక్టర్ భార్గవాచారి నౌండ్ల, నటులు శివకుమార్, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
బలమైన భావోద్వేగాల సహా...
శివ కుమార్ కాసారం హీరోగా నిషాంత్ దోటి దర్శకత్వం వహించిన చిత్రం ‘సహ’ (లైఫ్ ఆఫ్ సంజు). శ్వేతా లక్ష్మణ్, వ్రజన పాండ్య హీరోయిన్లుగా నటించారు. తేజేశ్వర్ వేల్పుచర్ల నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 4న విడుదల కానుంది. గురువారం జరిగిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ–‘‘ఈ సినిమా చూశాను... చాలా బాగుంది. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాని ప్రేక్షకులందరూ చూడాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ–‘‘సహా–ది బిగ్గెస్ట్ స్మాల్ ఫిల్మ్ ఆఫ్ ది డికేడ్’ అని పోస్టర్ పెట్టారు. ఇలా పెట్టాలంటే ధైర్యం కావాలి. సినిమా ఆ అంచనాలను అందుకుంటుంది’’ అని చెప్పారు. ‘‘చిన్న సినిమా బ్లాక్‌బస్టర్ కొడితే ఎలా ఉంటుందో మా చిత్రంతో చూపిస్తాం’’ అన్నారు శివకుమార్. ‘‘మా సినిమా చూసిన ప్రేక్షకులు నిరుత్సాహపడితే అమీర్‌పేట్ సెంటర్లో నిలబడి గుండు గీయించుకుంటాను’’ అని శ్వేతా లక్ష్మణ్ పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలో బలమైన భావోద్వేగాలున్నాయి’’ అన్నారు నిశాంత్. ‘‘సహ’ గురించి ప్రేక్షకులు గొప్పగా మాట్లాడుకుంటారు’’ అన్నారు వ్రజన పాండ్య. -
'అంబ’స్ రివెంజ్'మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
'సహ' సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
రోమాంచకం చూస్తున్నప్పుడు నవ్వుకున్నాను – సందీప్ రెడ్డి వంగా
‘‘రోమాంచకం’ కథ విన్నాను, ఫస్ట్ కట్ చూశాను. సినిమా కూడా చూశాను.. చాలా బాగుంది. ఈ కథ విన్నప్పుడు నేను ఎంతగా నవ్వుకున్నానో, సినిమా చూశాక అంతకంటే ఎక్కువ నవ్వాను. ఇది సూపర్ హిలేరియస్ మూవీ’’ అని సందీప్ రెడ్డి వంగా తెలిపారు. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జోడీగా నటించిన చిత్రం ‘రోమాంచకం’. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 3న విడుదల కానుంది. ఏషియన్ సినిమాస్ ద్వారా సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో రిలీజ్ చేస్తున్నారు. ‘రోమాంచకం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ– ‘‘మా భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్లో నిర్మించిన చిత్రాలన్నిటికీ ‘ఎ’ సర్టిఫికెట్స్ వచ్చేవి. రాబోయో ‘స్పిరిట్’ మూవీకి కూడా ‘ఎ’ సర్టిఫికెట్ వస్తుంది. అయితే తొలిసారి మా బ్యానర్లో రూపొందిన ‘రోమాంచకం’ మూవీకి క్లీన్ ‘యు/ఏ’ సెన్సార్ సర్టిఫికెట్ వస్తోంది. ఈ సినిమాకు కుటుంబంతో పాటు రండి’’ అని కోరారు. సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్.. ఇలా ఎవరితో చూసినా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. అంతేకానీ నిరుత్సాహపడరు’’ అని చెప్పారు. ‘‘మా సినిమా చూసి ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ ఏంటో తెలియాలంటే మా మూవీ చూసేందుకు థియేటర్స్‌కు రండి’’ అని అనంతిక సనిల్ కుమార్ పేర్కొన్నారు. ‘‘మా మూవీకి వర్క్ చేసిన యంగ్ టీమ్ కోసం ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు ప్రణయ్ రెడ్డి వంగా. ఈ వేడుకలో డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ వాసుకి వైభవ్, కెమెరామేన్ పవన్ పప్పుల, కాస్ట్యూమ్ డిజైనర్ కీర్తన, నటుడు వెంకటేష్ కాకుమాను మాట్లాడారు. -
'రోమాంచకం' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
తథాస్తు అంటూ ఉండండి!
‘అసలు ఈ నీచ మానవులు మిమ్మల్ని ఎలా చూస్తారో తెలుసా? చీర్ గాళ్స్గా చూస్తారే!’ అంటూ నటుడు ‘వెన్నెల’ కిశోర్ చెప్పే డైలాగ్‌తో ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్ ఆరంభం అయింది. ‘అల్లరి’ నరేష్ హీరోగా నటించిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సురభి హీరోయిన్గా నటించారు. నరేష్ వీకే, ‘వెన్నెల’ కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్, రాశీ సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్, రచ్చ రవి ఇతర పాత్రలు పోషించారు.అన్నపూర్ణ స్టూడియోస్–హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించిన ‘రంభ ఊర్వశి మేనక’ మూవీ సెప్టెంబరు 4న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ని హీరో అక్కినేని నాగార్జున లాంచ్ చేసి, చిత్రయూనిట్‌కి అభినందనలు తెలిపారు. ‘ముందు నేను ఈ లిస్ట్ చదువుతుంటాను మీరు తథాస్తు తథాస్తు అంటూ ఉండండి’, ‘అంటే మీకు ఇప్పుడు పవర్స్ లేవా?’, ‘నాకు నెలరోజులు కాదు.. జస్ట్ ఫైవ్ డేస్ ఇవ్వు చాలు’ అంటూ ‘అల్లరి’ నరేష్ చెప్పే డైలాగులు ట్రైలర్లో నవ్వులు పంచుతున్నాయి. అదేవిధంగా ‘యమధర్మ రాజులవారికి ప్రణామములు’, ‘మానవా.. ఇది మా తప్పిదం కాదు’(రాశీ సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్), ‘ఈ అమ్మాయిలు ఏంటి? అసలు ఏం చేస్తున్నావురా నీవు’(సురభి), ‘మీరు మా ఇంద్రలోకం ప్రాపర్టీ.. ఇంత బోల్డ్ అండ్ బ్యూటిఫుల్‌గా ఉన్న మిమ్మల్ని భూలోకంలో బాయ్స్ వదులుతారా? అసలే వారు కరువు్రపాంత జీవులే’(‘వెన్నెల’ కిశోర్) అంటూ పలికే పలు డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: చైతన్ భరద్వాజ్, కెమెరా: రాంరెడ్డి. -
'ఇరుముడి' సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు)
-
సమయానికి విలువ ఇస్తుంది: డి.సురేష్ బాబు
‘‘నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ద్వారా ‘హుషార్ పిట్టలు’ సినిమా గురించి తెలిసింది. మా సురేష్ ప్రోడక్షన్స్ ప్రతినిధులు ఈ మూవీ చూసి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంతో సురేష్ ఏషియన్ ఫిలింస్ ద్వారా విడుదల చేస్తున్నాం. ప్రేక్షకుల డబ్బు, సమయానికి విలువ ఇచ్చే చిత్రం ఇది’’ అని నిర్మాత డి.సురేష్‌బాబు తెలిపారు. అన్షు, వాసవి గణేషన్ జంటగా నటీంచిన చిత్రం ‘హుషార్ పిట్టలు’.బిక్షు దర్శకత్వంలో పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు ఈ నెల 15న విడుదల చేస్తున్నాయి. సోమవారం నిర్వహించిన ‘హుషార్ పిట్టలు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి డి.సురేష్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై, ట్రైలర్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా డైరెక్టర్ బిక్షు మాట్లాడుతూ–‘‘ఈ చిత్రంలో వాణిజ్య అంశాలతో పాటు ఓ సందేశం కూడా ఉంది’’ అని చెప్పారు. ‘‘ఇలాంటి మంచి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని వాసవీ గణేషన్ , అన్షు, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కెం వేణుగోపాల్, కెమెరామెన్ రుద్రసాయి, నటులు గోవర్థన్ , భాను, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
'హుషారు పిట్టలు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'టాక్సిక్' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'అగధ' సినిమా ట్రైలర్ ఆవిష్కరణ ఈవెంట్ (ఫొటోలు)
-
ఎక్కడికి వెళ్లి వెతకాలి!
ముగెన్ రావ్, ప్రీతి అస్రాని, తాన్యా హోప్ ముఖ్య తారాగణంగా నటించిన తమిళ చిత్రం ‘నిరమ్’. కె. స్క్వేర్ సినిమాస్ సమర్పణలో కె. బిందుమాధవి ఈ సినిమాను నిర్మించారు. పి. రాజేష్ సహ నిర్మాతగా, బలరామ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. బుధవారం జరిగిన ‘నిరమ్’ సినిమా తెలుగు ట్రైలర్, ఆడియో లాంచ్ ఈవెంట్లో హీరో ముగెన్ రావ్ మాట్లాడుతూ– ‘‘డిఫరెంట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మా ‘నిరమ్’ తెలుగు ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. ‘‘నాకు దర్శకుడిగా ఇది తొలి చిత్రం. మా సినిమా నచ్చితే, మమ్మల్ని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలని తెలుగు ప్రేక్షకులను కోరుకుంటున్నాను’’ అని తెలిపారు బలరామ్ కృష్ణ. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు డి. ఇమ్మాన్, సింగర్ ప్రవస్తి, డీవోపీ సంటానియో టెర్జియో, లిరిసిస్ట్ భారతీబాబు మాట్లాడారు. ‘నీ అమ్మాయితో కలిసి ఆరు మిస్సింగ్ కేసులు... ఈ నెలలో..’, ‘ఇప్పుడు లవ్ అనే పేరుతో వీళ్లు చేసే క్రైమ్ అన్నీ చాలా వెరైటీగా ఉన్నాయి అయ్యా’, ‘ఇప్పుడు నా కీర్తన ఎక్కడ?... ఎక్కడికి వెళ్లి వెతకాలి’ అన్న డైలాగ్స్ ఈ ట్రైలర్లో ఉన్నాయి. -
రొమాంటిక్ థ్రిల్లర్
‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల హీరోలుగా, ‘సిద్ధార్థ్ రాయ్’ ఫేమ్ తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అదే నీవు అదే నేను’. కొండల్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ పై గోవిందు కాండ్రేగుల నిర్మించిన ఈ మూవీ ఈ నెల 31న విడుదల కానుంది.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను హీరో సునీల్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ–‘‘అదే నీవు అదే నేను’ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. షాకింగ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి. ఈ మూవీని థియేటర్స్‌లో చూసి, కొత్త ప్రతిభని ప్రోత్సహించాలి’’ అని తెలిపారు. ‘‘రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రమిది’’ అన్నారు కొండల్. -
మధ్యతరగతి నేపథ్యంలో...
విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అనకాపల్లి’. ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో భవ్యశ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్పై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మించారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రోడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ మూవీకి త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా ఓ ముఖ్య పాత్ర పోషించారు.ఆగస్టు 7న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను విశాఖపట్నంలో జరిగిన ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2లో టాలీవుడ్ థండర్స్ టీమ్ విడుదల చేసింది. హీరోలు శ్రీకాంత్, సుధీర్ బాబు, తరుణ్, అశ్విన్ బాబు, సంగీత దర్శకుడు తమన్ ట్రైలర్‌ను విడుదల చేసి, ‘అనకాపల్లి’ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘‘మధ్యతరగతి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో త్రినాథరావు, ఇంద్రజ మిడిల్ క్లాస్ పేరెంట్స్‌గా కనిపిస్తారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
చిన్న సినిమాలను సక్సెస్ చేయాలి: విజయశాంతి
‘‘మంచి సబ్జెక్ట్ ఉన్న చిన్న సినిమాలను విజయవంతం చేయాలని ప్రేక్షకులను కోరుతున్నాను. నిజానికి చిన్న సినిమాల్లో దమ్ముంటుంది. మేమందరం చిన్న సినిమాలు చేస్తూ ఈ స్థాయికి వచ్చాం’’ అన్నారు విజయశాంతి. సమైరా, సముద్ర ఖని, అభిరామి, ఆనంద్, శరణ్య ప్రదీప్ నటించిన సినిమా ‘కర్మాఖ్య’. అభినయ కృష్ణ దర్శకత్వంలో వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది.తొలుత ‘కామాఖ్య’ టైటిల్‌ని ఖరారు చేసిన యూనిట్ తాజాగా ‘కర్మాఖ్య’గా మార్చింది. ఈ టైటిల్ మార్పును తెలియజేస్తూ, ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌ను గురవారం నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన విజయశాంతి మాట్లాడుతూ– ‘‘కామాఖ్య అమ్మవారు పవర్ఫుల్. కచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుందనుకున్నా. అయితే ఇప్పుడు ‘కర్మాఖ్య’ అని పెట్టారు.అందులోనూ అమ్మవారి పేరు ఉంది. ఈ సినిమా విజయం సాధిస్తుంది. నాకు ట్రైలర్ నచ్చింది. ఈ ట్రైలర్‌లోని మ్యూజిక్‌లో ఒక వైబ్రేషన్ వినిపించింది. ఈ సినిమాకు నిర్మాతలు చాలా ఖర్చుపెట్టారు’’ అన్నారు. ‘‘ట్రైలర్ ఆసక్తిగా ఉంది’’ అన్నారు మధు యాష్కీ. ‘‘ఇది అమ్మవారి ఎలిమెంట్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్. ఈ చిత్రానికి హిట్ టాక్ రాకపోతే నేను గుండు కొట్టించుకుంటాను’’ అని తెలిపారు అభినయ కృష్ణ. ‘‘మా సినిమాపై నమ్మకంతో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సునీల్ నారంగ్, నవీన్‌గార్లకు థ్యాంక్స్’’ అని అన్నారు వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్. నటి శరణ్య ప్రదీప్, నిర్మాత రవికుమార్ పనస మాట్లాడారు. -
‘కర్మాఖ్య’ ట్రైలర్ లాంచ్...ముఖ్య అతిథిగా విజయశాంతి (ఫొటోలు)
-
శ్రీరాముడు పాత్ర చేయడం నా అదృష్టం: రణ్‌బీర్ కపూర్
రామాయణం ఆధారంగా రూపొందిన తాజా హిందీ సినిమా ‘రామాయణ’. దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ ఏడాది దీపావళికి ‘రామాయణ: పార్ట్ 1’, వచ్చే ఏడాది దీపావళికి ‘రామాయణ: పార్ట్ 2’ విడుదల కానున్నాయి. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటించారు. నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మిస్తున్నారు. తొలి భాగం ట్రైలర్ ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. కాగా, ఢిల్లీలో ‘ప్రథమ్ సంకల్ప్’ పేరిట వేడుక నిర్వహంచి, ఈ సినిమా హిందీ 3డీ ట్రైలర్‌ను ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి యోగా గురువు రామ్‌దేవ్ బాబా అతిథిగా హాజరై, ట్రైలర్ నచ్చిందని చెప్పి, ఈ సినిమాకు ప్రేక్షకాదరణ లభించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో రణ్‌బీర్ మాట్లాడుతూ– ‘‘రామానంద్ సాగర్‌గారు తీసిన ‘రామాయణం’ (సీరియల్)లో శ్రీరాముడిగా అరుణ్ గోవిల్గారు అత్యద్భుతంగా నటించారు. తరాలుగా శ్రీరాముడి పాత్రలో అరుణ్గారిని చూసి, ప్రేక్షకులు స్ఫూర్తి పొందారు. నేను చిన్నప్పట్నుంచి శ్రీ రాముడి కథలు వింటూ, ఆయన నామస్మరణ, ఆశీస్సులతో పెరిగాను. అలాంటి శ్రీరాములవారి పాత్రను పోషించే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు.సాయిపల్లవి మాట్లాడుతూ– ‘‘సీతమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం. ఆ సీతమ్మే నాతో ఆమె పాత్ర చేయిస్తుందని, సీతమ్మకు కావాల్సినట్లుగా నా చేత నటింపజేసుకుంటుందని నమ్మి నేను ఈ రోల్ చేశాను. ఈ పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి ప్రయత్నించాను’’ అన్నారు. యశ్ మాట్లాడుతూ– ‘‘మన శ్రీరాముడి కథను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చూపించాలనే ఉద్దేశంతో ఈ ‘రామాయణ’ చేశాం’’ అని అన్నారు.‘‘మన గొప్ప ఇతిహాసాల్లో ఒకటైన ‘రామాయణం’ని ప్రపంచంతో పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం’’ అని తెలిపారు నమిత్ మల్హోత్రా. ‘‘ఈ చిత్రంలో ప్రేక్షకులు రామాయణంలోని భావోద్వేగం, మానవత్వం, వేల సంవత్సరాలుగా దాన్ని చిరస్థాయిగా నిలబెట్టిన ఆత్మను కూడా అనుభూతి చెందుతారని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు నితీష్ తివారి. ఈ చిత్రంలో నటించిన సన్నీ డియోల్, రవి దూబే, అరుణ్ గోవిల్, శోభన, అజింక్య, కునాల్ కపూర్, రకుల్ ప్రీత్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రైలర్ చూస్తుంటే సినిమా హిట్ అనిపిస్తోంది: నిర్మాత అల్లు అరవింద్
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ జంటగా నటించిన సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వంలో ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరై, ట్రైలర్‌ను రిలీజ్ చేసిన అనంతరం నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఈ ట్రైలర్‌లోని భావోద్వేగాలను గమనిస్తే ఇది కచ్చితంగా హిట్ అయ్యే సినిమా అనే భావన కలుగుతోంది.కిరణ్ ఎంతో సహజంగా నటిస్తారు. మైత్రీ రవిగారు ఈ సినిమాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ నెల 24న ‘చెన్నై లవ్‌స్టోరీ’ టీమ్ అందరికీ మంచి విజయం లభించబోతోంది’’ అన్నారు. ‘‘నానీని నేచురల్ స్టార్ అని పిలుస్తాం. అలాగే కిరణ్‌ను ఒరిజినల్ స్టార్ అని పిలవాలని ఉంది. మా బ్యానర్లో నెక్ట్స్ కిరణ్ చేయబోయే సినిమాలో ఒరిజినల్ స్టార్ అని వేస్తాం’’ అన్నారు వై. రవిశంకర్. ఈ కార్యక్రమంలో రవి నంబూరి, ఎస్కేఎన్, సాయి రాజేష్, సహ–నిర్మాత ధీరజ్ మొగిలినేని తదితరులు పాల్గొన్నారు. -
‘చెన్నై లవ్‌స్టోరీ’ మూవీ ట్రైలర్ రిలీజ్ (ఫోటోలు)
-
‘హ్యాంగ్‌మ్యాన్’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'వసుదేవసుతం' మూవీ ట్రైలర్ రిలీజ్ (ఫొటోలు)
-
‘హను మాన్ 3డీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
త్రీడీ హనుమాన్ రెడీ
తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కె. నిరంజన్‌రెడ్డి నిర్మించిన సినిమా ‘హను మాన్’. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించారు. 2024 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా రూ. 300 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టి, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా త్రీడీ వెర్షన్లో ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ‘హను మాన్ 3డీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు సాయి దుర్గాతేజ్ అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో తేజ సజ్జా మాట్లాడుతూ– ‘‘ఏదో పుణ్యం చేసుకుంటే కానీ ‘హను మాన్’ లాంటి సినిమా దొరకదు. ఈ సినిమాలో నటించే చాన్స్ రావడం, ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందడం నా అదృష్టం. మీతో (ఆడియన్స్‌ను ఉద్దేశించి..)పాటే నేనూ ఇప్పుడే ఈ 3డీ ట్రైలర్‌ను చూశాను. నిరంజన్, చైతన్యగార్లు పడిన కష్టం అర్థం అవుతోంది. ‘హను మాన్’ సినిమాను త్రీడీలో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మీరూ త్రీడీ సినిమాను థియేటర్స్‌లో చూసి, ఎంజాయ్ చేయండి’’ అన్నారు. ‘‘అత్యాధునిక టెక్నాలజీతో ఈ 3డీ వెర్షన్‌ను మీ ముందుకు తీసుకువస్తున్నాం.ఈ వెర్షన్ కూడా మీకు గొప్ప అనుభూతినిచ్చేలా ఉంటుంది. ‘హను మాన్’కి జాతీయ అవార్డు వచ్చిన రోజు నా బర్త్ డే కావడం ఎంతో ప్రత్యేకం. అలాంటి బహుమతిని నేనెప్పుడూ ఊహించలేదు’’ అని చెప్పారు చైతన్యరెడ్డి. ‘‘హను మాన్’ 2డీ వెర్షన్‌ను ఎంతగా ఆస్వాదించారో అంతే అద్భుతంగా 3డీ వెర్షన్నూ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు నిరంజన్ రెడ్డి. ‘‘దాదాపు 600మంది టెక్నీషియన్లు మూడునెలలపాటు శ్రమించి, 3డీ వెర్షన్‌ను అద్భుతంగా సిద్ధం చేశారు’’ అని చెప్పారు కిరణ్. -
‘నాగబంధం’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘ఇసాకపట్నం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)
-
‘దీవానా’ మూవీ ట్రైలర్ ఈవెంట్ (ఫొటోలు)
-
'కాక్టెయిల్ 2' మూవీ ట్రైలర్ లాంచ్...రష్మిక సందడి (ఫొటోలు)
-
కొత్త మలుపు
ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటించిన చిత్రం ‘కొత్త మలుపు’. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించిన ఈ మూవీలో భైరవి ఆర్థ్యా కథానాయిక. తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ నెల 12న విడుదల చేయనుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి నటుడు భానుచందర్, గాయని సునీత, నిర్మాత సి. కల్యాణ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ప్రేమకథా చిత్రమిది’’ అని తాటి బాలకృష్ణ తెలి పారు. ‘‘లవ్, సస్పెన్స్ జానర్లో ఈ సినిమాను రూపొందించాం’’ అని శివ వరప్రసాద్ పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాతో ఆకాష్ మంచి స్థాయికి చేరుకోవాలి’’ అన్నారు సునీత. -
‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం (ఫొటోలు)
-
సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ ట్రైలర్ ఈవెంట్ (ఫొటోలు)
-
చెప్పని కథ
సురేష్, రూప హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆత్మకథ’. ‘యాన్ అన్‌టోల్డ్ స్టోరీ’ (ఓ చెప్పని కథ) అనేది ఉపశీర్షిక. శ్రీనివాస్ బండ్రెడ్డి దర్శకత్వంలో వారాహి ఎంటర్ టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సోమేష్ నిర్మించారు. ఈ సినిమా టైటిల్, ట్రైలర్‌ను లాంచ్ చేసిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ– ‘‘ఈ రోజుల్లో చాలా ధైర్యంగా శ్రీనివాస్‌గారు ఓ మంచి కథ చెబుతున్నారు. సురేష్ మంచి నటుడు.ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఆత్మకథ’ చిత్రంతో మెయిన్ హీరోగా మారాను. ఒక ఇంట్లో జరిగే కథగా రూపొందిన సినిమా ఇది. కామన్ మ్యాన్ భావోద్వేగాలు, భయం, వినోదంతో కూడిన కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చె΄్పారు. ‘‘మా సినిమాను ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు శ్రీనివాస్ గుండ్రెడ్డి. ‘‘దర్శకుడు ఈ కథ చెప్పి, ఇందులో ఆత్మ మీరే అన్నారు. దీంతో సినిమాలో నేను కనిపిస్తానా? అనుకున్నాను. కానీ ఈ సినిమా కథ అంతా నా చుట్టూ తిరుగుతుంది’’ అని తెలిపారు సమ్మెట గాంధీ. -
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘అగ్లీ స్టోరీ’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
చరణ్ అతిథిగా మెగా కోడలి సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
ట్రైలర్ కొత్తగా అనిపించింది
‘‘ఫస్ట్ టైమ్’ ట్రైలర్ కొత్తగా అనిపించింది. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ షాకింగ్‌గా ఉన్నాయి. ప్రతిభని ప్రోత్సహించడంలో, మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు విజయం అందించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఈ నేపథ్యంలో ‘ఫస్ట్ టైమ్’ సినిమాకు కూడా మంచి విజయాన్ని అందించా లని కోరుకుంటున్నాను’’ అని హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తెలిపారు. హేమంత్ ఇప్పలపల్లి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఫస్ట్ టైమ్’. సౌరభ్ ధింగ్ర హీరోగా, అనిక్క విక్రమన్ హీరోయిన్గా నటించారు. ‘బిగ్ బాస్’ ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్‌లో నటించారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పాయల్ రాజ్‌పుత్ ట్రైలర్‌ని విడుదల చేశారు. హేమంత్ ఇప్పలపల్లి మాట్లాడుతూ– ‘‘మన దేశానికి సంబంధించిన ఎన్నో మూలాలు ఈ చిత్రంలో చూపించాం. ప్రేక్షకులు మా సినిమాని ఆదరించాలి’’ అని కోరారు. ‘‘నాకోసం ఈ కార్యక్రమానికి వచ్చిన పాయల్గారికి ధన్యవాదాలు’’ అన్నారు సౌరభ్ ధింగ్ర. -
'గాయపడ్డ సింహం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
‘జెట్లీ’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
యాక్షన్... థ్రిల్
‘‘పరమపద సోపానం’ ట్రైలర్ గ్రిప్పింగ్‌గా ఉంది. మంచి థ్రిల్లర్ సినిమా చూడబోతున్నాం అనిపించింది. దర్శకుడు నాగ శివ ప్రతిభ ఉన్న డైరెక్టర్. ఈ సినిమాతో ఆయన మంచి సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నాను’’ అని హీరో శ్రీవిష్ణు తెలిపారు. అర్జున్ అంబటి, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ జోడీగా నటించిన చిత్రం ‘పరమపద సోపానం’. నాగ శివ ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. గణపర్తి శ్వేత సమర్పణలో గణపర్తి నారాయణరావు నిర్మించిన ఈ మూవీ ఈ నెల 24న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ని శ్రీవిష్ణు విడుదల చేశారు. ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
‘పాపం ప్రతాప్’ సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
యాక్షన్ హీరోలా చూపించారు: వెంకట్
‘‘హరుడు’ సినిమాను పూర్తి చేయడానికి యాక్టింగ్‌తో పాటు నిర్మాతగా కూడా బాధ్యతలు తీసుకో వాల్సి వచ్చింది. నన్ను యాక్షన్ హీరోలా చూపించారు. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన మా సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని హీరో వెంకట్ చెప్పారు. ‘శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి, శివ రామరాజు’ వంటి చిత్రాల్లో నటించిన వెంకట్ హీరోగా నటించిన తాజా సినిమా ‘హరుడు’.హెబ్బాపటేల్, సలోని హీరోయిన్లుగా నటించారు. రాజ్ తాళ్లూరి దర్శకత్వంలో వీఆర్ ఎంటర్టైన్మెంట్స్పై నిర్మించిన ఈ సినిమా మే 8న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాజ్ తాళ్లూరి మాట్లాడుతూ–‘‘మంచి సినిమాలను మన ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. మా ‘హరుడు’ మూవీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
తిమ్మరాజుపల్లి టీవీ.. వెరైటీగా ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
ఈ ఊరికి టీవీ తీసుకొని వస్తాడు!
‘ఊరోళ్లంతా చందాలు ఏసుకొని ఈ శివరాత్రికి సతీష్‌కి కాసులు ఈయండి. ఈ ఊరికి టీవీ తీసుకొని వస్తాడు’ అనే డైలాగ్‌తో ‘తిమ్మరాజుపల్లి టీవీ’ ట్రైలర్ ఆరంభమైంది. సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా వి. మునిరాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సుమైర స్టూడియోస్‌తో కలిసి కేఏ ప్రోడక్షన్స్ పై కిరణ్ అబ్బవరం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ని హీరో వెంకటేశ్ విడుదల చేశారు.ఈ ట్రైలర్ లాంచ్ ప్రెస్మీట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘తిమ్మరాజుపల్లి టీవీ’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన వెంకటేశ్‌గారికి థ్యాంక్స్. మా మూవీ ట్రైలర్, సాంగ్స్, కంటెంట్ చూడండి... మీకు నచ్చితేనే థియేటర్స్‌కు వెళ్లి మా టీమ్‌ని సపోర్ట్ చేయండి. ‘తిమ్మరాజు పల్లి’కి వస్తే మీ ఊరు, అప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని గ్యారెంటీ ఇస్తున్నాను’’ అని తెలిపారు. వి. మునిరాజు మాట్లాడుతూ– ‘‘మా సినిమా ఒక మ్యూజియంలా ఉంటుంది. ఇందులో అంతరించిపోతున్న మన సంస్కృతి, జ్ఞాపకాలు, టీవీ గురించి ఉండే భావోద్వేగాలను చూస్తారు’’ అని పేర్కొన్నారు. ‘‘ట్రైలర్లో మీరు చూసిన కంటెంట్‌కి మించి సినిమాలో చూస్తారు. ఈ నెల 17న మీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్‌తో మా సినిమా చూసేందుకు వెళ్లండి’’ అని వేద చెప్పారు. ‘‘మన లైఫ్‌లో చూసే స్వీట్ మెమొరీస్ ఈ చిత్రంలో ఉంటాయి’’ అన్నారు సాయి తేజ్. -
శేష్-మృణాల్ ‘డెకాయిట్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
'ఆయనను గురువులా భావిస్తా'.. సైన్ లాంగ్వేజ్‌లో అభినయ స్పీచ్ వైరల్
టాలీవుడ్ నటి అభినయ ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్మేని సెల్వం అనే మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు అభినయ కూడా హాజరయ్యారు. ఈ చిత్రంలో తమిళ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన అభినయ తన సైన్ లాంగ్వేజ్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. చిన్నప్పటి నుంచే అభినయకు మాటలు రావన్న సంగతి తెలిసిందే. అందుకే ప్రత్యేక స్పీచ్‌తో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సముద్రఖనిపై అభినయ ప్రశంసలు కురిపించింది. నాకు తమిళంలో ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది సముద్రఖని అని తెలిపింది. ఆయనను ఒక గురువులా భావిస్తానని అభినయ వెల్లడించారు. ఆయన దర్శకుడు మాత్రమే కాదని.. అంతకు మించిన నటుడని కొనియాడారు. ఇప్పటివరకు అన్ని భాషల్లోనూ కలుపుకుని 64 సినిమాలు మాత్రమే చేశానని అభినయ తెలిపారు. సముద్రఖని చెప్పినట్లు వెయ్యి సినిమాలు చేస్తానో లేదో వేచి చూడాల్సిందేనని అన్నారు.ఈ మూవీకి రామ్ చక్రి దర్శకత్వం వహించారు. పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. ఈ చిత్రంలో లక్ష్మీ ప్రియ, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.కాగా.. టాలీవుడ్లో 'నేనింతే' సినిమాతో పరిచయం అయిన నటి అభినయ తనకు కాబోయే భర్తను సోషల్‌మీడియా ద్వారా పరిచయం చేసింది. తెలుగులో కింగ్, శంభో శివ శంభో వంటి సినిమాల్లో ఆమె నటించినప్పటికీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీలో చిన్ని పాత్రలో బాగా ఆకట్టుకుంది. అలా టాలీవుడ్లో చాలా సినిమాల్లో అభినయ తన నటనతో ఆకట్టుకుంది. సైన్ లాంగ్వేజ్ లో నటి అభినయ స్పీచ్...నాకు తమిళంలో ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది సముద్రఖని గారుసముద్రఖని గారు మంచి దర్శకులు అలాగే అంతకు మించి మంచి నటుడు: అభినయ#Abhinaya #CarmeniSelvam #Samuthirakani pic.twitter.com/lukFHtLVFJ— Filmy Focus (@FilmyFocus) March 26, 2026 -
ప్రభాస్ అన్న చెప్పాడు సీనియర్స్ తరవాతే మేం సార్
-
శర్వానంద్ 'బైకర్' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
సరస్వతి మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'ది రైజ్ ఆఫ్ అశోక' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ట్రావెల్ అడ్వెంచర్ టాక్ షో 'సోల్ ట్రిప్' (ఫోటోలు)
-
‘సన్ ఆఫ్’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
విశ్వక్ సేన్ ‘ఫంకీ’ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'సాంప్రదాయనీ సుప్పినీ సుద్ధపూసనీ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ ట్రైలర్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఇది మన కథే అనిపిస్తోంది: రానా దగ్గుబాటి
‘‘విత్ లవ్’ మూవీ ట్రైలర్ బాగుంది. ఇది మన కథే అనిపిస్తోంది. ట్రైలర్ చూసిన వారందరూ చాలా కనెక్ట్ అయ్యారు. అందరూ కనెక్ట్ అయ్యే ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ఇది. సౌందర్యగారు తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. యూనిట్‌కి ఆల్ ది బెస్ట్’’ అని హీరో రానా దగ్గుబాటి చెప్పారు. అభిషన్ జీవింత్, అనస్వరా రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘విత్ లవ్’. మదన్ రచన, దర్శకత్వం వహించారు.ఈ చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్‌తో కలిసి ఎంఆర్పీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నజరత్ పసిలియన్, మహేశ్ రాజ్ పసిలియన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ విడుదల చేస్తోంది. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సౌందర్య రజనీకాంత్ మాట్లాడుతూ– ‘‘నా చిన్నప్పటి ఫ్రెండ్ రానా. తనతో నాకు ఎన్నో బాల్య జ్ఞాపకాలున్నాయి. ‘విత్ లవ్’ని తను రిలీజ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.ఈ సినిమాని అందరూ థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. ‘‘మా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’కి మీరందరూ గొప్ప ఆదరణ ఇచ్చారు. ‘విత్ లవ్’ కూడా అద్భుతమైన భావోద్వేగాలున్న సినిమా. మన జ్ఞాపకాలని నెమరువేసుకునేలా ఉంటుంది’’ అన్నారు అభిషన్ జీవింత్. ‘‘విత్ లవ్’ క్యూట్ సినిమా. చాలా ప్రేమతో ఈ చిత్రం చేశాం. తప్పకుండా అందర్నీ అలరిస్తుంది’’ అని పేర్కొన్నారు అనస్వరా రాజన్. మహేశ్ రాజ్ మాట్లాడుతూ– ‘‘టూరిస్ట్ ఫ్యామిలీ’లానే ఈ సినిమాని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
అనస్వర రాజన్ మూవీ విత్ లవ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'యుఫోరియా' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)
-
భూమిక కనువిప్పు కలిగించింది: గుణశేఖర్
‘‘చిత్ర పరిశ్రమలో 2026 నవ్వులతోప్రారంభమైంది. అందుకే ఫిబ్రవరి 6న ఒక స్పెషల్ మూమెంట్ కోసం మా ‘యుఫోరియా’ సినిమాను తీసుకొస్తున్నాం. కుటుంబమంతా కలిసి చూడాల్సిన చిత్రం ఇది’’ అని డైరెక్టర్ గుణశేఖర్ తెలిపారు. భూమిక చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి తదితరులు కీలక పాత్రలుపోషించిన చిత్రం ‘యుఫోరియా’. గుణశేఖర్ దర్శకత్వంలో రాగిణి గుణ సమర్పణలో గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో గుణశేఖర్ మాట్లాడుతూ– ‘‘మా అమ్మాయి నీలిమ ఎప్పుడూ ఇంత ఎమోషన్ అవదు. కానీ, ఈ ట్రైలర్ చూసి ఎమోషనల్ కావడానికి కారణం ‘యుఫోరియా’ కథ అంతగా ప్రభావితం చేయడమే. మా కుటుంబం మొత్తం ఈ స్టోరీకి కనెక్ట్ అయింది. కేవలం గ్లామర్ పాత్రలే చేస్తామని చెప్పే హీరోయిన్లకు తల్లి పాత్రలో నటించిన భూమిక కనువిప్పు కలిగించింది. గౌతమ్ మీనన్‌గారి పాత్ర సహజంగా ఉంటుంది. మా మూవీకి చక్కని సంగీతం అందించిన కాలభైరవ... తండ్రి (కీరవాణి)ని మించిన తనయుడు అనిపించుకున్నాడు’’ అని చెప్పారు.నీలిమ గుణ మాట్లాడుతూ– ‘‘మా మూవీ ట్రైలర్ చూశాక చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఇంత ఇంపాక్ట్ ఉన్న సినిమా తీసినందుకు ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు. భూమిక మాట్లాడుతూ– ‘‘యుఫోరియా’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. పిల్లలను ఎలా పెంచాలి అనేది అందరూ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది’’ అని చెప్పారు. ‘‘గుణశేఖర్‌గారితో పని చేయడం గౌరవంగా ఉంది. ‘యుఫోరియా’ తప్పకుండా అందరూ మెచ్చే సినిమా అవుతుంది’’ అని సారా అర్జున్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నటులు అడ్డాల పృథ్వీరాజ్, విఘ్నేష్ గవిరెడ్డి మాట్లాడారు. -
'అనగనగా ఒక రాజు'లో మీనాక్షి చౌదరి.. ట్రెండింగ్‌లో ఫోటోలు
-
'అనగనగా ఒక రాజు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సెలబ్రిటీలు (ఫోటోలు)
-
రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
‘ఛాంపియన్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘పతంగ్’ సినిమా ట్రైలర్ విడుదల (ఫొటోలు)
-
‘నయనం’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
నేనంటే చిన్నచూపు.. స్టేజీపై ఏడ్చేసిన నందు
యాంకర్‌గా, హీరోగా నందు అందరికీ సుపరిచితుడు. ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా అతడు అన్నుకుంత సక్సెస్ చూడలేకపోయాడు. అది తల్చుకుని తాజా ఈవెంట్లో ఎమోషనలయ్యాడు. నందు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సైక్ సిద్దార్థ. యామిని భాస్కర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీకి వరుణ్‌రెడ్డి దర్శకత్వం వహించగా రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. నిర్మాత శ్యామ్ సుందర్‌రెడ్డితో పాటు నందు కూడా సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు.నేనంటే చిన్న చూపు: నందు ఎమోషనల్ఇటీవల రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో మంగళవారం (డిసెంబర్ 2న) సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నందు భావోద్వేగానికి లోనయ్యాడు. అతడు మాట్లాడుతూ.. ట్రైలర్ ఈవెంట్‌కు ఇంత ఎమోషనల్ అవడం మీకు ఓవర్‌గా అనిపించొచ్చు. కానీ ఇదంతా నాకు ఒక జర్నీ. (కన్నీళ్లు తుడుచుకుంటూ) ఇది పీఆర్ స్టంట్ అయితే కాదు. నేను ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు అవుతోందని ఓ పాడ్‌కాస్ట్ వాళ్లు చెప్పారు. నేనంటే అందరికీ చాలా చిన్నచూపు.సక్సెస్ రాలే..పెళ్లిచూపులు సినిమాలో నేను సెకండ్ హీరోగా చేశాను. అందులో చేసిన హీరో పెద్ద హీరో అయ్యాడు. అందులో మంచి రోల్ చేసిన ప్రియదర్శి మంచి హీరో అయిపోయాడు. నాకు పేరొచ్చింది, కానీ సక్సెస్ రాలేదు. నా ప్యాషన్ సినిమా. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో నా నటనకు నెగెటివ్ కామెంట్స్ రాలేదు. నేను నా బెస్ట్ ఇస్తూ వచ్చాను.సినిమా నచ్చకపోతే..ఆర్సీబీలో విరాట్ కోహ్లి వంటి ప్లేయర్ ఉన్నాసరే ఐపీఎల్ కప్పు గెలవడానికి 18 ఏళ్లు పట్టింది. వాళ్లు ఈసారి కప్ నమ్దే అన్నారు. నేను కూడా ఈసారి హిట్టు నమ్దే అంటున్నా.. సినిమా చూడండి. మీకు నచ్చకపోతే ప్రెస్‌మీట్ పెట్టి మీ అందరికీ క్షమాపణలు చెప్తాను. కానీ ఫెయిలైనా ఇక్కడే ఉంటా.. చచ్చేవరకు సినిమాలే చేస్తా అని నందు (Actor Nandu) చెప్పుకొచ్చాడు. సైక్ సిద్దార్థ మూవీ (Psych Siddhartha Movie) డిసెంబర్ 12న విడుదల కానుంది.చదవండి: బిగ్‌బాస్ 9: దుమ్ము దులిపిన ఇమ్మూ, తనూజ.. రేసులో ఆమె అవుట్ -
'సైక్ సిద్దార్థ్' సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
'సకుటుంబానాం' మూవీ ట్రైలర్ ఈవెంట్ (ఫొటోలు)
-
బాలయ్య ‘అఖండ-2 ’ మూవీ ట్రైలర్ ఈవెంట్ (ఫొటోలు)
-
కర్నూలు : ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
మాస్టర్ సంకల్ప్ సందేశం
‘‘ఈ రోజుల్లో పిల్లల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. కుటుంబ వాతావరణం, పరీక్షలు, మొబైల్ వాడకం, పెరిగిన సామాజిక నేపథ్యం ఇవన్నీ పిల్లలు ఒత్తిడికి గురి కావడానికి కారణాలుగా మారుతున్నాయి. పిల్లల్లో మానసిక రుగ్మతలు తొలగించేందుకు యోగ, ధ్యానం చక్కటి పరిష్కార మార్గాలను మన పూర్వీకులు సూచించారు. పిల్లలు యోగ, ధ్యానం చేసేలా పేరెంట్స్ప్రోత్సహించాలి’’ అన్నారు భీమగాని సుధాకర్ గౌడ్.శ్రీ లక్ష్మి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలింస్‌పై ‘ఆదిత్య, క్రియేటివ్ జీనియస్, విక్కీస్ డ్రీమ్, డాక్టర్ గౌతమ్’ వంటి బాలల చిత్రాలను రూపొందించారు భీమగాని సుధాకర్ గౌడ్. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తాజా బాలల చిత్రం ‘మాస్టర్ సంకల్ప్’. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన శివాజీ రాజా మాట్లాడుతూ–‘‘ట్రైలర్ చాలా బాగుంది’’ అని అన్నారు. -
అల్లరి నరేశ్ 12ఏ రైల్వే కాలనీ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఇక దుల్కర్‌ని నట చక్రవర్తి అని పిలుస్తారు: రానా
‘‘కాంత’ చిత్రం ట్రైలర్ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని థియేటర్స్‌లో చూస్తే గొప్ప అనుభూతినిస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఇచ్చే ఎనర్జీ ఓ రేంజ్లో ఉంటుంది. నా బెస్ట్ ఫ్రెండ్ రానాతో కలిసి ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని దుల్కర్ సల్మాన్ చెప్పారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జోడీగా నటించిన చిత్రం ‘కాంత’. రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ని హీరో ప్రభాస్ లాంచ్ చేశారు.అనంతరం జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రానా మాట్లాడుతూ– ‘‘కాలాన్ని సినిమా మాత్రమే రీ క్రియేట్ చేయగలదు. అలాంటి నేపథ్యంలో సెల్వ చెప్పిన ‘కాంత’ కథ విన్న వెంటనే కచ్చితంగా సినిమా చేయాలనిపించింది. ఈ నెల 14 తర్వాత దుల్కర్‌ని అందరూ నట చక్రవర్తి అని పిలుస్తారు’’ అని చెప్పారు. భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ–‘‘ఇప్పటి వరకు నా సినిమాలు చూశారు. ఈ చిత్రంలో నా నటన చూస్తారు’’ అన్నారు.‘‘కాంత’లో నటించడం గర్వంగా ఉంది’’ అన్నారు సముద్ర ఖని. ‘‘ఈ సినిమా విడుదలైన రోజునే మీ అందరితో కలిసి సినిమా చూడాలని ఉంది’’ అని సెల్వమణి సెల్వరాజ్ తెలిపారు. ‘‘ఈ చిత్రానికి ప్రాణంపోసి మీ ముందుకు తీసుకొస్తున్నాం’’ అని ప్రశాంత్ పొట్లూరి పేర్కొన్నారు. -
శివతో పెద్ద స్టార్‌ని చేశారు: నాగార్జున
‘‘శివ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి ప్రేమతో వచ్చిన మీ అందరికీ (ఫ్యాన్స్) ధన్యవాదాలు. ఈ సినిమాని మీ తల్లిదండ్రులు థియేటర్స్‌లో చూసుంటారు. ఇప్పుడు అదే ప్రేమతో మీరూ వచ్చారు. 36 ఏళ్ల క్రితం నాతో ‘శివ’ సినిమా తీసి, నన్ను పెద్ద స్టార్‌ని చేసిన నా మిత్రుడు రామ్‌గోపాల్ వర్మకి థ్యాంక్స్. మంగళవారం ఉదయం ‘శివ’ చూశాను. అద్భుతంగా అనిపించింది’’ అన్నారు నాగార్జున. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున, అమల జోడీగా నటించిన చిత్రం ‘శివ’. అన్నపూర్ణ స్టూడియోస్‌పై అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న విడుదలైంది.అన్నపూర్ణ స్టూడి యోస్ 50 ఏళ్ల సందర్భంగా సరికొత్త 4కె డాల్బీ అట్మాస్‌లో ఈ నెల 14న ‘శివ’ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కినేని అభిమానుల సమక్షంలో రీ రిలీజ్ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘దాదాపు 6 నెలల పాటు రాము చాలా ప్రేమతో ఇష్టపడి ప్రతి సౌండ్ ట్రాక్‌ని మళ్లీ ఒరిజినల్ సినిమా చేసినట్టుగా అద్భుతంగా డిజైన్ చేశాడు. శివ ఈజ్ ఫరెవర్.మరో 36 ఏళ్ల తర్వాత కూడా ‘శివ’ని మళ్లీ మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ‘శివ’కి ముందు ‘శివ’కి తర్వాత అని రాజమౌళిగారు అన్నట్టు ‘శివ’ ఎప్పటికీ నిలిచిపోతుంది’’ అని చెప్పారు. 36 ఏళ్ల తర్వాత మేమిద్దరం (నాగార్జున, వర్మ) ఒకే వేదికపై ఇలా మీ ముందు రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ చేస్తూ మాట్లాడతామని ఎప్పుడూ ఊహించలేదు. ఇది చాలా గొప్ప అనుభూతి. రీ రిలీజ్ కోసం కొత్త టెక్నాలజీని ఉపయోగించాం. మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. చిరంజీవిగారు చెప్పినట్టు సినిమా ఉన్నంత వరకు ‘శివ’ చిరంజీవిలా చిరస్మరణీయం’’ అని రామ్‌గోపాల్ వర్మ పేర్కొన్నారు. -
ఆది సాయికుమార్ 'శంబాల' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘కృష్ణ లీల’ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
రష్మిక 'ది గర్ల్‌ఫ్రెండ్' ట్రైలర్ ఈవెంట్ (ఫొటోలు)
-
’లవ్ OTP‘ సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
సుధీర్ బాబు 'జటాధర' సినిమా ట్రైలర్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘గోపి గాళ్ళ గోవా ట్రిప్’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆలోచింపజేసేలా...
రోహిణి హట్టంగడి, రోహిణి ముల్లేటి, సముద్ర ఖని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఒక మంచి ప్రేమకథ’(Oka Manchi Prema Katha) . ఈ సినిమాకు కథ, మాటలు, పాటలను ఓల్గా అందించగా, అక్కినేని కుటుంబరావు దర్శకత్వం వహించారు. హిమాంశు పోపూరి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రోహిణి ముల్లేటి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నా పాత్రను చూస్తే, ఆడియన్స్ కోప్పడతారు’’ అని అన్నారు.‘‘ఇరవైఏళ్ల క్రితం కుటుంబరావు, ఓల్గాగార్లు ఓ సినిమా కోసం నన్ను అ్రపోచ్ అయ్యారు. అప్పుడు అది కుదర్లేదు. ఇప్పుడు ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా నా మనసుని హత్తుకుంది’’ అని పేర్కొన్నారు రోహిణి హట్టంగడి. ‘‘అందరిలోనూ ఓ ఆలోచనను రేకెత్తించేలా ఈ సినిమాను తెరకెక్కించాను. ఎక్కడా బోర్ కొట్టించకుండా ఆడియన్స్‌ను నవ్విస్తూ, ఏడిపించేలా ఈ సినిమా కథనం ఉంటుంది’’ అని తెలిపారు అక్కినేని కుటుంబరావు.‘‘ఈ సినిమాలో నేను కూడా ఓ రోల్ చేశాను. అందరికీ నచ్చే చిత్రం ఇది’’ అని పేర్కొన్నారు హిమాంశు. ‘‘మంచి సినిమా రావాలని కోరుకునే ఆర్టిస్టులు మాకు దొరకడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు ఓల్గా. సంగీత దర్శకుడు కేఎం రాధాకృష్ణన్, ఈటీవీ విన్ ప్రతినిధులు సంధ్య, నితిన్ మాట్లాడారు. -
థియేటర్స్‌లో గట్టిగా నవ్వుకుంటారు: కిరణ్ అబ్బవరం
‘‘కొత్త స్క్రిప్ట్‌తో సినిమా చేద్దామని ‘క’ చిత్రం చేశాను. కానీ ‘కె–ర్యాంప్’ మాత్రం నా అభిమానుల కోసం చేశాను. ఈ చిత్రంలో నా క్యారెక్టరైజేషన్ ఇప్పటి యువ తారానికి దగ్గరగా ఉంటుంది. ప్రేక్షకులు థియేటర్స్‌లో గట్టిగా నవ్వుకుంటారు. ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ ఈ చిత్రదర్శకుడు నానియే’’ అని కిరణ్ అబ్బవరం అన్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం ‘కె–ర్యాంప్’.యుక్తీ తరేజా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో వీకే నరేశ్, సాయికుమార్, ‘వెన్నెల’ కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండా, శివ బొమ్మకు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో జైన్స్ నాని మాట్లాడుతూ – ‘‘ట్రైలర్‌లోని ఎనర్జీకి సినిమా ఏ మాత్రం తగ్గదు’’ అని చె ప్పారు. ‘‘మా సినిమా విడుదల తేదీని చాలా రోజుల క్రితమే ప్రకటించాం.ఈ దీపావళికి పెద్ద బ్యానర్స్ నుంచి సినిమాలు వస్తున్నాయి. అయినా మా సినిమాకు థియేటర్స్ దొరుకుతాయి’’ అని పేర్కొన్నారు రాజేశ్ దండా. ‘‘ఈ చిత్రంలో ఓ వైవిధ్యమైన పాత్ర చేశాను’’ అని తెలి పారు వీకే నరేశ్. సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి, రైటర్ రవి మాట్లాడారు. -
హీరో ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్' సినిమా ట్రైలర్ ఈవెంట్ (ఫొటోలు)
-
'మిత్రమండలి' సినిమా ట్రైలర్ విడుదల (ఫొటోలు)
-
‘శశివదనే’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
మనం కలిసి బతుకుదామా...
‘‘నేను ఏ సినిమా చేసినా అందులో ఒక కొత్త కాన్సెప్ట్ ఉండేలా చూసుకుంటాను. ‘థామా’ సినిమా కాన్సెప్ట్ ఆడియన్స్‌ని అలరిస్తుంది. ఈ సినిమాలోని అలోక్ క్యారెక్టర్ చేయడం కొత్తగా అనిపించింది. ‘థామా’ చిత్రం కోసం యాక్షన్ సీక్వెన్స్ చాలా చేశాను’’ అని ఆయుష్మాన్ ఖురానా అన్నారు. ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా నటించిన హిందీ చిత్రం ‘థామా’. మాడాక్ హారర్ ఫిల్మ్స్ యూనివర్స్ (ఎమ్హెచ్సీయు) లో భాగంగా ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 21న విడుదల కానుంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘థామా’ సినిమా తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో ఆయుష్మాన్ ఖురానా మాట్లాడుతూ– ‘‘నా సినిమా ప్రమోషన్స్ కోసం తొలిసారిగా హైదరాబాద్ వచ్చాను. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ‘థామా’ ఫుల్ పాన్ ఇండియా మూవీ. రష్మికగారితో తొలిసారి కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఆమె బ్రిలియంట్ పెర్ఫార్మర్. ‘థామా’ సినిమాను థియేటర్స్‌లో చూసి, ఎంజాయ్ చేయండి’’ అని అన్నారు. ‘‘మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ నుంచి వచ్చే సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది.‘థామా’ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాలో ఆడియన్స్‌ని సర్ప్రైజ్ చేసే క్యారెక్టర్ చేశాను’’ అని తెలిపారు రష్మికా మందన్నా. ‘పోలీసుల కోసం నేను ఏమైనా చేస్తాను’, ‘ఏం చేశారో చెప్పండి’, ‘విక్రమార్కుడు సినిమా ఎనిమిది సార్లు చూశాను సార్’, ‘నేను వెళ్లక తప్పదు అలోక్... నా కారణంగా నువ్వు కూడా ప్రమాదంలో పడతావ్..’, ‘నాకేం కలిసి చనిపోయే ఉద్దేశం లేదు... మనం కలిసి బతుకుదామా!’, ‘నేను నీతో పాటు ఉండలేను... మన ప్రపంచాలు ఒకటి కావు’ అనే డైలాగ్స్ ‘థామా’ తెలుగు ట్రైలర్లో ఉన్నాయి. -
రష్మిక మందన్నా సినిమా ప్రమోషన్స్‌లో బాలీవుడ్ స్టార్స్ (ఫోటోలు)
-
మా ప్రపంచం వేరు
ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా ప్రధానపాత్రల్లో నటించిన హారర్ మిస్టరీ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘థామా’. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ చిత్రానికి ‘ముంజ్య’ ఫేమ్ ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వం వహించారు. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఈ చిత్రంలో అలోక్పాత్రలో ఆయుష్మాన్ ఖురానా, తడ్కాపాత్రలో రష్మికా మందన్నా నటించారు.ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం ముంబైలో జరిగింది. శ్రద్ధా కపూర్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ‘‘ఏ... నాటకాలు ఆపు... నీకేం కాలేదు, నా కొడుకు సైతాన్... సైతాన్, నేను నీతో ఉండలేను... మా ప్రపంచం వేరు’’ అని అర్థం వచ్చే డైలాగ్స్ ఈ హిందీ ట్రైలర్లో ఉన్నాయి. దీపావళి పండగ సందర్భంగా ‘థామా’ సినిమాను అక్టోబరు 21న రిలీజ్ చేయనున్నట్లుగా అధికారికంగా వెల్లడించారు. -
కాంతారా 2 ప్రమోషన్స్ షురూ..! రిషబ్ కోసం రంగంలోకి ప్రభాస్
-
'సన్నీ సంస్కారి కి తులసి కుమారి' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
సస్పెన్స్... థ్రిల్
సన్నీ కునాల్ హీరోగా, దేవిక సాహూ, ఆశ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రోహిణి’. సంగ కుమార్ దర్శకత్వంలో కేవీ నరసింహ రాజు సమర్పణలో కుశాల్ రాజు నిర్మించారు. ఆనంద్ సంగీతం అందించిన ఈ మూవీ ఆడియో లాంచ్, ట్రైలర్ విడుదల వేడుకని హైదరాబాద్‌లో నిర్వహించారు. సంగ కుమార్ మాట్లాడుతూ–‘‘యూనిట్‌లోని ప్రతి ఒక్కరి కృషి వల్లే మా సినిమా త్వరగా పూర్తయింది.రాజేంద్ర రాజు కాంచనపల్లి అందించిన సహకారం మా సినిమాకు బలం’’ అని తెలి పారు. ‘‘త్వరలోనే విడుదల కానున్న మా సినిమాని ఆదరించాలి’’ అన్నారు కుశాల్ రాజు. ‘‘ప్రేక్షకులకు నచ్చే సస్పెన్స్, థ్రిల్, రొమాన్స్ వంటి అంశాలు మా చిత్రంలో చాలా ఉన్నాయి’’ అన్నారు సన్నీ కునాల్. ‘‘దాసరి వెంకటరమణగారి పాటలు వినసొంపుగా, కనువిందుగా ఉంటాయి’’ అని సమర్పకుడు కేవీ నరసింహ రాజు తెలి పారు. -
కానిస్టేబుల్ సందేశం
‘‘కానిస్టేబుల్’ సినిమా కంటెంట్ నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉంది. వరుణ్ సందేశ్ తన పాత్రలో ఒదిగిపోయి ఉంటాడని భావిస్తున్నాను’’ అని అన్నారు రాజేంద్రప్రసాద్. వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో ‘బలగం’ జగదీష్ నిర్మించిన థ్రిల్లర్ చిత్రం ‘కానిస్టేబుల్’. ఆదివారం హైదరాబాద్‌లో చిత్రయూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది.ఈ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని, ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేసి, మాట్లాడారు. వరుణ్ సందేశ్ మాట్లాడుతూ– ‘‘దర్శకుడు ఆర్యన్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు కానిస్టేబుల్ క్యారెక్టర్‌ను ఊహించుకుని, చేయగలననే నమ్మకం ఏర్పడిన తర్వాతే ఈ సినిమా చేశాను’’ అని చెప్పారు. ‘‘ఒక వ్యక్తికి అవమానం జరిగినప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుందనే అంశానికి సందేశాన్ని మిళితం చేసి, ఈ చిత్రం చేశాం’’ అని పేర్కొన్నారు ‘బలగం’ జగదీష్.‘‘ఈ చిత్రంలో నాలుగు పాటలు ఉండగా, ఒక పాటను చంద్రబోస్‌గారు, మరో పాటను గద్దర్ నర్సన్న పాడారు. ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే సినిమా ఇది’’ అని చెప్పారు ఆర్యన్ సుభాన్. ‘‘మన భద్రత కోసంపోలీస్వారు అహర్నిశలూ ఎంతో శ్రమ పడుతున్నారు. ఇలాంటి అంశాలతో తీసిన ఈ సినిమా విజయం సాధించాలి’’ అని అన్నారు తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నటుడు శివారెడ్డి. ఈ కార్యక్రమంలో ముగ్గురు కానిస్టేబుల్స్‌ను యూనిట్ సత్కరించింది. -
అది బోనస్: తేజ సజ్జా
‘‘మన తెలుగు ప్రేక్షకుల స పోర్ట్ వల్లే ఈరోజు ఇక్కడ ఉన్నాను. నా సినిమా ఇతర భాషల వారికి నచ్చితే అది బోనస్’’ అని తేజ సజ్జా చెప్పారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, రితికా నాయక్ జంటగా నటించిన చిత్రం ‘మిరాయ్’. మనోజ్ మంచు, జగపతిబాబు, శ్రియా శరణ్ ఇతరపాత్రలు పోషించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 12న విడుదల కానుంది.ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తేజ సజ్జా మాట్లాడుతూ– ‘‘మిరాయ్’ కోసం వంద శాతం ఎఫర్ట్ పెట్టాను. చాలా క్లీన్ ఫిలిం. పిల్లలు, కుటుంబమంతా కలిసి చూడొచ్చు’’ అని తెలి పారు. మనోజ్ మంచు మాట్లాడుతూ– ‘‘మిరాయ్’లో నాది బలమైనపాత్ర.ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి’’ అని చె ప్పారు. ‘‘మా సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు కృతీ ప్రసాద్. ‘‘చాలా సిన్సియర్‌గా తీసిన సినిమా ఇది’’ అని కార్తీక్ ఘట్టమనేని పేర్కొన్నారు. ‘‘తెలుగు సినిమా పరిశ్రమ గర్వపడేలా చేస్తుంది ‘మిరాయ్’’ అని టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. -
తేజ సజ్జా 'మిరాయ్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)
-
1990s సినిమా ట్రైలర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు)
-
‘కన్యాకుమారి’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నారా రోహిత్ ‘సుందరకాండ’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
ఓ మంచి జ్ఞాపకంలాంటి సినిమా
‘‘సుందరకాండ’ చిత్రం ట్రైలర్‌ను లాంచ్ చేసిన ప్రభాస్‌గారికి థ్యాంక్స్. మా మూవీ ట్రైలర్, పాటలకి చాలా మంచి స్పందన వచ్చింది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాని కుటుంబమంతా చూడొచ్చు. వినాయక చవితికి మా చిత్రం విడుదలవుతుండటం సంతోషంగా ఉంది. నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ ఈ సినిమా మంచి జ్ఞాపకంలా ఉంటుంది’’ అని నారా రోహిత్ చెప్పారు. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో నారా రోహిత్, వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ లీడ్ రోల్స్‌లో నరేశ్ విజయకృష్ణ, వాసుకి ఆనంద్ ఇతర పాత్రలుపోషించిన చిత్రం ‘సుందరకాండ’. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో శ్రీదేవి విజయ్‌కుమార్ మాట్లాడుతూ–‘‘చాలా కాలం తర్వాత ‘సుందరకాండ’ లాంటి సినిమా చేయడం చాలా ఆనందాన్నిచ్చింది.మంచి వినోదాత్మక చిత్రమిది... అందరూ సంతోషంగా చూడొచ్చు’’ అన్నారు. ‘‘నా తొలి సినిమా వినాయక చవితి పండగ రోజు రిలీజ్ అవడం సంతోషంగా ఉంది. మా చిత్రం అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను’’ అన్నారు వెంకటేశ్ నిమ్మలపూడి. ‘‘మా సినిమాని చూసి, మా యూనిట్‌ని ఆశీర్వదించాలి’’ అని సంతోష్ చిన్నపొల్ల పేర్కొన్నారు. ‘‘సుందరకాండ’ లాంటి రొమాంటిక్ కామెడీ మూవీ ఇప్పటివరకు రాలేదు.. ఈ సినిమా అందర్నీ అలరిస్తుంది’’ అన్నారు నరేశ్ విజయకృష్ణ. నటి వాసుకి మట్లాడారు. -
అనుపమ పరమేశ్వరన్ ‘పరదా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
పరదా కథ అద్భుతం: హీరో రామ్
‘‘హిందీలో ‘లాపతా లేడీస్’లాంటి సినిమాలు చూసి, మనమెందుకు అలాంటి సినిమాలు చేయలేమని ఆలోచిస్తుంటాం. ఆ కోవలో ఉండే ‘పరదా’ లాంటి సినిమాలు వచ్చినప్పుడు ప్రోత్సహించాలి. ఇలాంటి సినిమాలు విజయం సాధిస్తే, నిర్మాతలకు ధైర్యం వస్తుంది’’ అని హీరో రామ్ అన్నారు. అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా, దర్శనా రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘పరదా’. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ మేకర్స్ రాజ్, డీకేల స పోర్ట్‌తో ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది.శనివారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్ మాట్లాడుతూ– ‘‘పరదా’ స్టోరీ లైన్ నాకు తెలుసు. చాలా అద్భుతమైన కథ. అనుపమ నాకు మంచి ఫ్రెండ్. ఏ క్యారెక్టర్ చేసినా వంద శాతం ఎఫర్ట్ పెడుతుంది. ఈ సినిమాలో కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది’’ అన్నారు. ‘‘రామ్‌లాంటి ఫ్రెండ్ ఉండటం నా అదృష్టం. నేను కూడా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ (రామ్ హీరోగా చేస్తున్న సినిమా) కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్. ‘‘ఈ చిత్రంలో నటిగా అనుపమ కొత్త వెర్షన్‌ను చూస్తారు’’ అని పేర్కొన్నారు దర్శక–నిర్మాతలు ప్రవీణ్, విజయ్, శ్రీధర్. -
అమ్మాయి గౌరవం పెంచేలా...
హీరోయిన్ వర్ష బొల్లమ్మ టైటిల్ రోల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మించిన ఈ సిరీస్ ఈ నెల 14 నుంచి ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ‘కానిస్టేబుల్ కనకం’ ట్రైలర్‌ను చిరంజీవి విడుదల చేశారు.ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ– ‘‘ఒక అమ్మాయి గౌరవం పెంచేలా ఈ సిరీస్ ఉంటుంది. నాకు కానిస్టేబుల్ కనకం రోల్ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఈ కథను నాకంటే ఎక్కువగా నమ్మిన సాయికృష్ణ, నితిన్‌గార్లకు ధన్యవాదాలు’’ అని తెలిపారు ప్రశాంత్. ‘‘ఈ సిరీస్‌ను వీక్షకులు తప్పక చూడండి’’ అని పేర్కొన్నారు సత్య సాయిబాబా. -
'కింగ్డమ్' ట్రైలర్ ఈవెంట్లో విజయ్, భాగ్యశ్రీ.. భారీగా ఫ్యాన్స్ (ఫోటోలు)
-
ట్రైలర్ లాంచ్ ఈవెంటో మెరిసిన నటి డింపుల్ హయాతీ (ఫొటోలు)
-
'రాజుగాని సవాల్' మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
నాలో ఏదైనా లోపం ఉందా..? మిత్రా శర్మ ఎమోషనల్
-
'హరి హర వీరమల్లు' మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
కోర్ట్ హీరో కొత్త మూవీ.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)
-
హీరో సిద్దార్థ్ ‘3BHK’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
నవీన్ చంద్ర ‘షో టైమ్’ మూవీ ట్రైలర్ ఈవెంట్ (ఫొటోలు)
-
'విరాటపాలెం' ట్రైలర్ విడుదల వేడుక (ఫొటోలు)
-
నితిన్ ‘తమ్ముడు’ మూవీ ట్రైలర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు)
-
మేఘాలు చెప్పిన ప్రేమ కథ
నరేష్ అగస్త్య, రబియా ఖాతూన్ జోడీగా నటించిన చిత్రం ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’(Meghalu Chappina Prema Katha). విపిన్ దర్శకత్వంలో ఉమాదేవి కోట నిర్మించారు. ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో విపిన్ మాట్లాడుతూ– ‘‘క్లీన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. మా సినిమాలో సంగీత విద్వాంసులు ప్రిన్స్ రామవర్మ, ట్రావెల్ కోర్ వారసులు అతిథి పాత్రలు చేశారు’’ అన్నారు. ఉమాదేవి కోట మాట్లాడుతూ– ‘‘నాకు కథలు రాయడం ఇష్టం.నా జీవితంలో కె. విశ్వనాథ్, సిరివెన్నెల సీతారామ శాస్త్రిగార్లను కలవడం ఓ భాగ్యం. ఇంట్లో వాళ్ల సపోర్ట్‌తో ఈ బ్యానర్‌ని స్థాపించా. ప్రతి సినిమాలో కళని కనెక్ట్ చేయాలనేది నా ఆశ. అందుకే ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ని సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చేలా తీశాం. ఈ సినిమాను సిరివెన్నెలగారికి అంకితం ఇస్తున్నాం’’ అన్నారు. ‘‘పాటలు చక్కగా వచ్చాయి’’ అన్నారు సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకర్. కెమేరామేన్ మోహన్ కృష్ణ మాట్లాడారు. -
కామెడీ... మిస్టరీ
‘మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్’ చిత్రాల ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా, ప్రశాంతి చారులింగా హీరోయిన్గా నటించిన చిత్రం ‘గ్యాంబ్లర్స్’. కేఎస్కే చైతన్య దర్శకత్వం వహించారు. సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కేఎస్కే చైతన్య మాట్లాడుతూ– ‘‘కామెడీ, మిస్టరీ, ఎమోషన్... ఇలా అన్ని వాణిజ్య అంశాలతో రూపొందిన చిత్రం ‘గ్యాంబ్లర్స్’.సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు ఓ కొత్త లోకంలో ఉంటారు. వారికి సరికొత్త అనుభూతినిస్తుంది’’ అన్నారు. ‘‘వైవిధ్యమైన కథతో ‘గ్యాంబ్లర్స్’ తీశాం’’ అని రాజ్‌కుమార్ బృందావనం తెలిపారు. సునీత మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. సంగీత్ శోభన్ నటన చాలా కొత్తగా ఉంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మా చిత్రాన్ని నైజాంలో విడుదల చేస్తోంది’’ అని చెప్పారు. -
సక్సెస్ అంటే...
నార్నే నితిన్ హీరోగా సతీష్ వేగేశ్న తెరకెక్కించిన చిత్రం ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’. ఈ సినిమాలో సంపద హీరోయిన్. చింతపల్లి రామారావు, ఎం. సుబ్బారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది.హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సతీష్ వేగేశ్న మాట్లాడుతూ– ‘‘మనల్ని మనం జయించుకోవడమే సక్సెస్ అంటే అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించాం. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపర్చదు’’ అన్నారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే వైవిధ్యమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఎన్టీఆర్‌గారు ఎంతో మెచ్చి, ఈ కథను ఎంపిక చేశారు’’ అన్నారు చింతపల్లి రామారావు. -
విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
‘బద్మాషులు’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. స్టేజీపై డ్యాన్స్‌తో అదరగొట్టిన హీరోయిన్!
హీరోయిన్ ఆదితి శంకర్ తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరైన ముద్దుగుమ్మ.. వేదికపై స్టెప్పులతో అభిమానులను అలరించింది. ఓ వెన్నెల అంటూ సాగే పాటకు తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసి అక్కడున్న వారిని మెప్పించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా.. కోలీవుడ్ హీరోయిన్ ఆదితి శంకర్ భైరవం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందు వస్తోంది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ హీరోలుగా నటించారు. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆనంది, దివ్య పిళ్లై కూడా హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న భైరవం మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. #AditiShankar Live Dance Performance for #OVennela Song at #Bhairavam Event#BellamkondaSaiSreenivas #ManchuManoj #NaraRohith pic.twitter.com/ehgv08ARi5— The Cult Cinema (@cultcinemafeed) May 18, 2025 View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
'బకాసుర రెస్టారెంట్' మూవీ ట్రైలర్ విడుదల వేడుక (ఫొటోలు)
-
శత్రువులు ఎక్కడో ఉండరు
మాస్టర్ మహేంద్రన్, బ్రహ్మాజీ, శత్రు, చైత్ర ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ థ్రిల్లర్ సినిమా ఫిల్మ్ ‘కర్మణ్యే వాధికారస్తే’. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వంలో డీఎస్ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో మాస్టర్ మహేంద్ర మాట్లాడుతూ– ‘‘నాకు సినిమా తప్ప ఏమీ తెలియదు. కథపై ఉన్న నమ్మకంతో నిర్మాతగారు ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నారు.బ్రహ్మాజీగారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. ‘‘శత్రువులు ఎక్కడో ఉండరు. మన చుట్టూనే మన ఇంట్లోనే ఉంటారనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు. సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. క్లైమాక్స్‌ను కొత్తగా డిజైన్ చేశారు’’ అని తెలిపారు బ్రహ్మాజీ. ‘‘ఈ సినిమా చేయడం కోసం చాలా కష్టపడ్డాం’’ అన్నారు అమర్దీప్. ‘‘చిన్న సినిమా అని కాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అని పేర్కొన్నారు నిర్మాత దుర్గా ప్రసాద్. ఈ చిత్రంలో నటించిన బెనర్జీ, అతిథిగా పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, నిర్మాత ‘మధుర’ శ్రీధర్ మాట్లాడారు. -
23 మూవీ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
ఏడాదిలో ఎనిమిది!
నవీన్ చంద్ర హీరోగా నటించిన తెలుగు, తమిళ చిత్రం ‘లెవెన్’. లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించారు. రేయా హరి కథానాయికగా నటించిన ఈ మూవీలో అభిరామి, రవి వర్మ కీలక పాత్రలు చేశారు. ఏఆర్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించిన ఈ సినిమా మే 16న విడుదల కానుంది.ఈ చిత్రం ట్రైలర్‌ని నటుడు కమల్‌హాసన్ విడుదల చేశారు. ‘వైజాగ్‌లో లాస్ట్ వన్ ఇయర్లో ఎనిమిది హత్యలు జరిగాయి.. సీరియల్ కిల్లింగ్స్’ అంటూ పోలీస్ ఆఫీసర్‌గా నవీన్ చంద్ర చెప్పే డైలాగుతో ట్రైలర్ ఆరంభమైంది. రుచిర ఎంటర్ౖటెన్మెంట్స్ అధినేత ఎన్. సుధాకర్ రెడ్డి ఈ సినిమా థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రానికి సంగీతం: డి. ఇమ్మాన్, కెమేరా: కార్తీక్ అశోకన్. -
కథ నచ్చితే ఆ తేడా చూడను: హరీష్ శంకర్
‘‘నాకు సినిమా కథ నచ్చితే భాష, చిన్న సినిమా.. పెద్ద సినిమా అనే తేడా చూడకుండా ప్రమోట్ చేయడానికి ముందుంటాను. ‘జింఖానా’ చిత్రం ట్రైలర్ నాకు చాలా నచ్చింది. ఈ సినిమాని అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పారు. నస్లెన్, లుక్మాన్ అవరన్, గణపతి, సందీప్ ప్రదీప్ ముఖ్య తారలుగా ఖలీద్ రెహమాన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘అలప్పుజ జింఖానా’. ఖలీద్ రెహమాన్, జోబిన్ జార్జ్, సమీర్ కారత్, సుబీష్ కన్నంచెరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న మలయాళంలో విడుదలై, హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్‌పై సుబ్బారెడ్డి తెలుగులో ‘జింఖానా’ పేరుతో ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ శంకర్ మాట్లాడుతూ–‘‘జింఖానా’ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న సుబ్బారెడ్డిగారికి అభినందనలు. నైజాంలో మైత్రీ మూవీస్ శశిగారు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి తిరుగుండదు’’ అన్నారు. డైరెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమా నేను చూశాను.. చాలా బాగుంది. స్పోర్ట్స్ కామెడీ నేపథ్యంలో చాలా బాగా తీశారు’’ అని చెప్పారు. ‘‘స్పోర్ట్స్ కామెడీ ఫిల్మ్ ‘జింఖానా’. చాలా మంచి యాక్షన్ సీక్వెన్ ్సలు, పాటలుంటాయి’’ అని ఖలీద్ రెహమాన్ తెలిపారు. హీరో నస్లెన్ మాట్లాడుతూ–‘‘నేను నటించిన ‘ప్రేమలు’ సినిమాకి తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన స΄ోర్ట్ మర్చి΄ోలేను. ‘జింఖానా’ని కూడా ఆదరించాలి’’ అన్నారు. ఈ వేడుకలో మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి, డైరెక్టర్స్ సాగర్ కె. చంద్ర, సుజీత్, సందీప్, నటీనటులు బేబీ జీన్, లుక్మాన్ అవరన్, సందీప్ ప్రదీప్ మాట్లాడారు. -
‘సారంగపాణి జాతకం’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నేచురల్ స్టార్ నాని ‘హిట్-3’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
చివరి ఇరవై నిమిషాలు కన్నీళ్లు ఆపుకోలేకపోయా: హీరో ఎన్టీఆర్
‘‘ఈ వేదికపైన ఎన్నోసార్లు నేను, అన్న (కల్యాణ్ రామ్) నిల్చొని ఉన్నప్పుడు మా నాన్నగారు (హరికృష్ణ) రావడం, మాట్లాడటం జరిగింది. ఈరోజు విజయశాంతిగారు మాట్లాడుతుంటే మొదటిసారి వేదికపైన మా నాన్నగారు లేరనే లోటు తీరినట్టయింది. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో నాన్నగారు ఉండుంటే ఎలా ఉంటుందో విజయశాంతిగారు మాట్లాడినప్పుడు నాకు ఆ లోటు భర్తీ అయిపోయింది’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. కల్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ జంటగా విజయశాంతి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘భారతదేశ చిత్ర పటంలో హీరోలతో సమానంగా నిల్చున్న ఏకైక మహిళ ఎవరన్నా ఉన్నారంటే అది విజయశాంతిగారు ఒక్కరే. ‘కర్తవ్యం, ప్రతిఘటన, మగరాయుడు’... ఇలా ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేశారామె. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ని చూశాను.విజయశాంతిగారు లేకపోతే ఈ చిత్రం లేదు. పృథ్వీ, సోహైల్ ఖాన్, ప్రదీప్ చిలుకూరి, సునీల్, అశోక్గార్లు... ఇలా ఎవరు లేకున్నా ఈ సినిమా లేదు. 18న ఈ మూవీ మీ ముందుకొస్తోంది. రాసిపెట్టుకోండి... ఆఖరుగా వచ్చే ఇరవై నిమిషాలు ప్రేక్షకుల కళ్లల్లో నీళ్లు తిరక్కపోతే... అంత అద్భుతంగా తీశారు ప్రదీప్‌గారు. సినిమా చూస్తున్న నాకు కూడా కన్నీళ్లు ఆపుకోవడం కుదరలేదు. ఆ ఆఖరి ఇరవై నిమిషాలు అలా రావడానికి ఒకే ఒక్క కారణం కల్యాణ్ అన్న మాత్రమే. దర్శకుడి ఐడియాని ఆయన నమ్మారు. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అన్న కెరీర్లో ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుందని నా నమ్మకం. మనసు పెట్టి, ప్రాణం పెట్టి నటించారు. బహుశా అది విజయశాంతిగారు కాకుండా వేరే వారు అయ్యుంటే ఆయన అంత అద్భుతంగా చేసేవారో కాదో నాకు తెలీదు. ఆమెను ఓ తల్లిగా నమ్మారు కాబట్టి అంత అద్భతంగా నటించారు. ప్రేక్షకులు, మా ఫ్యాన్స్ అందరూ ముందుగా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ని ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న ‘వార్ 2’ (హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించారు) కూడా మిమ్మల్ని అలరిస్తుంది. పక్కాగా ప్లాన్ చేసి ఈ ఏడాది మిమ్మల్ని అందర్నీ తప్పకుండా కలుస్తాను’’ అని చెప్పారు. కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘మీరు చాలా సినిమాలు చూస్తారు. మేం కూడా చేస్తాం. సినిమా అయ్యాక పార్కింగ్‌కి వెళ్లి బైక్, కార్ స్టార్ట్ చేసుకోగానే సినిమాని మర్చిపోతాం. కానీ, చాలా అరుదుగా నటులుగా మాకు గానీ, ప్రేక్షకులుగా మీకు గానీ కొన్ని సినిమాలు ఇంటికెళ్లేదాకా మనసుని హత్తుకుంటాయి. అలాంటి సినిమా మా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’’ అన్నారు. విజయశాంతి మాట్లాడుతూ– ‘‘ఎన్టీ రామారావుగారు ఓ డిక్షనరీ. ఆయనలో కొంత వచ్చినా ఎవరైనా గొప్ప నటీనటులు అయిపోతారు. ఆయన వద్ద నుంచి ఆశీర్వాదాలు తీసుకోవడం నా అదృష్టం. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సెట్స్‌లో నేను అనుకున్నదానికంటే అద్భుతంగా, చాలా సౌకర్యంగా చూసుకున్నాడు కల్యాణ్ బాబు. ఈ సినిమాని అందరూ థియేటర్లో చూసి, సూపర్ హిట్ అని చెప్పాలి’’ అని అన్నారు. ఈ వేడుకలో కెమేరామేన్ రాంప్రసాద్, నటులు జోగినాయుడు, సందీప్, రచయిత శ్రీకాంత్ విస్సా, ్ర΄÷డక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి, రచయిత రఘురామ్ పాల్గొన్నారు. -
సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
హీరో సిద్ధూ జొన్నలగడ్డ 'జాక్' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
రెట్టింపు వినోదంతో...
‘‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు. థియేటర్స్‌కి వచ్చిన ప్రతి ఒక్కరూ తాము టిక్కెట్ కోసం పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరిగిందని భావిస్తారు’’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ పేర్కొన్నారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది. బుధవారం నిర్వహించిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హారిక సూర్యదేవర మాట్లాడుతూ– ‘‘కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రమిది’’ అన్నారు. నార్నే నితిన్ మాట్లాడుతూ– ‘‘మ్యాడ్’ సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు రుణపడి ఉంటాం. ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’లో వినోదం రెట్టింపు ఉంటుంది. చూసి ఆనందించండి’’ అని తెలిపారు. ‘‘మా ట్రైలర్ అందరికీ నచ్చిందనుకుంటున్నాం. సినిమా కూడా కచ్చితంగా నచ్చుతుంది’’ అన్నారు సంగీత్ శోభన్, రామ్ నితిన్. -
రామ్ గోపాల్ వర్మ 'శారీ' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘కిస్ కిస్ కిస్సిక్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సస్పెన్స్... థ్రిల్
రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏకెఎన్ ప్రసాద్, మృణాల్ ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ది సస్పెక్ట్’. రాధాకృష్ణ దర్శకత్వంలో కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఎస్కేఎమ్ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర, తెలంగాణ ఏరియాల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ– ‘‘పెద్ద సినిమాలు జీరో కలెక్షన్స్ చేసినవీ ఉన్నాయి. అద్భుతంగా ఆదరణ పొందిన చిన్న చిత్రాలూ ఉన్నాయి. ‘ది సస్పెక్ట్’ చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించాలి. కిరణ్‌గారు ఈ సినిమాను నిర్మించడంతో పాటు ఓ మంచి పాత్ర కూడా చేశారు’’ అన్నారు. ‘‘ఒక అమ్మాయి హత్యకు కారకులైన వారిని పట్టుకునే క్రమంలో జరిగే వివిధ సంఘటనల సమాహారమే ఈ చిత్రం’’ అని తెలిపారు రాధాకృష్ణ. ‘‘సినిమా ఇండస్ట్రీలోకి రావాలన్న నా కల ‘ది సస్పెక్ట్’తో నెరవేరింది’’ అన్నారు కిరణ్ కుమార్. -
ఆది సాయికుమార్ ‘షణ్ముఖ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సరికొత్త సైకో థ్రిల్లర్ గా ‘ఆర్టిస్ట్’
సంతోష్ కల్వచెర్ల, క్రిషేకా పటేల్ జంటగా రతన్ రిషి(Ratan Rishi) దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్టిస్ట్’(Artiste Movie). జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించిన ఈ మూవీ ఈ నెల 21న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో రతన్ రిషి మాట్లాడుతూ– ‘‘సైకో థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘ఆర్టిస్ట్’. ఇందులో సస్పెన్స్, భయం, కామెడీ, రొమాన్స్... వంటి అన్ని అంశాలు ఉన్నాయి’’ అన్నారు. జేమ్స్ వాట్ కొమ్ము మాట్లాడుతూ– ‘‘కొత్తవాళ్లకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలనే మా సంస్థలో న్యూ కమర్స్తో మూవీస్ చేస్తున్నాం. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మా సినిమా రిలీజ్ అవుతోంది’’ అని తెలిపారు. ‘‘నేటి సమాజంలోని ఒక సమస్యను రతన్ రిషి చక్కగా చూపించారు. ఆ సమస్య పాతదే అయినా కథ, కథనాలు కొత్తగా ఉంటాయి’’ అని పేర్కొన్నారు సంతోష్ కల్వచెర్ల. ‘‘ఇలాంటి మంచి సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు క్రిషేకా పటేల్. ఈ వేడుకలో ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్ సురేష్ బసంత్, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, లిరిసిస్ట్ రాంబాబు గోసాల, నటీనటులు స్నేహ మాధురీ శర్మ, వెంకీ, తాగుబోతు రమేశ్ మాట్లాడారు. -
నవ్వులు గట్టిగా వినిపిస్తాయి: సందీప్ కిషన్
సందీప్ కిషన్(Sundeep Kishan), రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘మజాకా’(Mazaka). రావు రమేశ్, అన్షు ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ పతాకాలపై నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రాజేశ్ దండా, ఉమేష్ కేఆర్ బన్సల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఆదివారం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ– ‘‘మజాకా’ సినిమాకు థియేటర్స్‌లో నవ్వులు గట్టిగా వినిపిస్తాయి.నా కెరీర్లో హయ్యెస్ట్ నంబర్స్ ఈ సినిమా ఇస్తుందనే నమ్మకం ఉంది. ఫ్యామిలీతో థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా ఇది. నాకు, రావు రమేశ్‌గారికి ఈక్వెల్ స్క్రీన్ స్పేస్ ఉంది. ఆయన వల్ల కథ మరింతగా పండింది’’ అన్నారు సందీప్ కిషన్. ‘‘ఇద్దరు మగవాళ్లు మాత్రమే ఉన్న ఒక ఇంట్లో ఏ రోజుకైనా ఒక ఫ్యామిలీ ఫొటో రావాలని పడే తపనే ఈ సినిమా కథ. నా ప్రతి సినిమాలో ఉండే మ్యాజిక్ ఈ సినిమా లోనూ ఉంటుంది. ఈ సినిమా డబుల్ బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అన్నారు నక్కిన త్రినాథరావు.‘‘ఈ చిత్రంలో రొమాంటిక్‌గా నటించడం చాలా సవాల్‌గా అనిపించింది. కొత్తగా నవ్వించే చాన్స్ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు రావు రమేశ్. ‘‘కెప్టెన్ మిల్లర్, భైరవకోన, రాయన్’ ఇప్పుడు ‘మజాకా’... ఇలా డిఫరెంట్ సినిమాలతో అలరిస్తున్న సందీప్ కిషన్‌కు పీపుల్స్ స్టార్ అనే ట్యాగ్ యాప్ట్ అనిపించింది’’ అన్నారు అనిల్ సుంకర. ‘‘సందీప్, రావు రమేశ్గార్లు పొటీపడి నటించారు. ‘మజాకా’ అందరికీ నచ్చుతుంది. ‘సామజ వరగమన, భైరవ కోన’ చిత్రాల తర్వాత అనిల్‌గారు, నేను హ్యాట్రిక్ సినిమాతో వస్తున్నాం’’ అన్నారు రాజేశ్ దండా. హీరోయిన్ రీతూ వర్మ, అన్షు మాట్లాడారు.


