థియేటర్స్‌లో గట్టిగా నవ్వుకుంటారు: కిరణ్‌ అబ్బవరం | Kiran Abbavaram Speech at K RAMP Trailer Launch Event | Sakshi
Sakshi News home page

థియేటర్స్‌లో గట్టిగా నవ్వుకుంటారు: కిరణ్‌ అబ్బవరం

Oct 12 2025 1:54 AM | Updated on Oct 12 2025 1:54 AM

Kiran Abbavaram Speech at K RAMP Trailer Launch Event

‘‘కొత్త స్క్రిప్ట్‌తో సినిమా చేద్దామని ‘క’ చిత్రం చేశాను. కానీ ‘కె–ర్యాంప్‌’ మాత్రం నా అభిమానుల కోసం చేశాను. ఈ చిత్రంలో నా క్యారెక్టరైజేషన్‌ ఇప్పటి యువ తారానికి దగ్గరగా ఉంటుంది. ప్రేక్షకులు థియేటర్స్‌లో గట్టిగా నవ్వుకుంటారు. ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ ఈ చిత్రదర్శకుడు నానియే’’ అని కిరణ్‌ అబ్బవరం అన్నారు. కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం ‘కె–ర్యాంప్‌’.

యుక్తీ తరేజా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో వీకే నరేశ్, సాయికుమార్, ‘వెన్నెల’ కిశోర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. జైన్స్‌ నాని దర్శకత్వంలో రాజేశ్‌ దండా, శివ బొమ్మకు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో జైన్స్‌ నాని మాట్లాడుతూ – ‘‘ట్రైలర్‌లోని ఎనర్జీకి సినిమా ఏ మాత్రం తగ్గదు’’ అని చె ప్పారు. ‘‘మా సినిమా విడుదల తేదీని చాలా రోజుల క్రితమే ప్రకటించాం.

ఈ దీపావళికి పెద్ద బ్యానర్స్‌ నుంచి సినిమాలు వస్తున్నాయి. అయినా మా సినిమాకు థియేటర్స్‌ దొరుకుతాయి’’ అని పేర్కొన్నారు రాజేశ్‌ దండా. ‘‘ఈ చిత్రంలో ఓ వైవిధ్యమైన పాత్ర చేశాను’’ అని తెలి పారు వీకే నరేశ్‌. సినిమాటోగ్రాఫర్‌ సతీష్‌ రెడ్డి, రైటర్‌ రవి మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement