
గతేడాది రిలీజైన 'క' సినిమాతో కిరణ్ అబ్బవరం.. చాన్నాళ్ల తర్వాత ఓ హిట్ అందుకున్నాడు. కానీ ఈ ఏడాది 'దిల్ రుబా'తో ఫ్లాప్ చవిచూశాడు. ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు. వీటిలో ఒకటి 'కె ర్యాంప్'. జైన్స్ నాని అనే దర్శకుడు ఈ మూవీ తీస్తున్నాడు. దీపావళికి సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఒకటి రెండు బూతులు, లిప్ కిస్‌లతో యూత్‌ని ఆకట్టుకునేలానే ఉంది.
(ఇదీ చదవండి: తమన్నా మరో ఐటమ్ సాంగ్.. వీడియో రిలీజ్)
ఈ సినిమా షూటింగ్ అంతా కేరళలోనే తీసినట్లు టీజర్ బట్టి అర్థమైంది. టీజర్ బట్టి చూస్తే రొటీన్ స్టోరీలానే అనిపిస్తుంది కానీ కామెడీ కాస్త ఎక్కువగానే ఉండనుందని అనిపిస్తుంది. ఇందులో కిరణ్ సరసన యుక్తి తరేజా హీరోయిన్‌గా చేసింది. అక్టోబరు 18న మూవీ థియేటర్లలోకి రానుంది. మరి ఈసారి కిరణ్ ఏం చేస్తాడో చూడాలి?
(ఇదీ చదవండి: 'మిరాయ్' విలనిజం తెచ్చిన మెగా అవకాశం?)